ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ టీఆర్ఎస్ బుధవారం మూడు జాబితాలు విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్కు 50 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటించింది. అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్కు టీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసింది. 28 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి.
కాగా, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఫిబ్రవరి 22న మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. మార్చి 6వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. మార్చి 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఖమ్మం ఎన్నిక: టీఆర్ఎస్ మూడు జాబితాలు
Published Wed, Feb 24 2016 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement