
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హన్మకొండలో గురువారం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఆశావహులు ఆయనను చుట్టుముట్టిన దృశ్యమే ఇది.
- స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్