
సాక్షి, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు,కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..