Municipal Corporation elections
-
‘ఆప్’ అభ్యర్థే చండీగఢ్ మేయర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్‌ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్‌గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని ప్రశ్నించింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు తేల్చింది. పిటిషనర్‌కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అసలేం జరిగింది? చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్‌కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు. నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు. -
ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
-
ఆప్ స్వీప్‌కి భయపడే బీజేపీ ఈసీకి లేఖ రాసింది
న్యూఢిల్లీ: ఆప్ స్వీప్‌కు భయపడి కేంద్రం ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల తేదీలను వాయిదా వేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీల ప్రకటనను వాయిదా వేయడం దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఇదే తొలిసారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ( నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను) కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పారు. గత ఏడెనిమదేళ్లుగా కేంద్రంలోనే ఉన్న బీజేపీ ఎన్నడూ ఈ మూడు కార్పొరేషన్లను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు. కేవలం ఒక గంట ముందు ఈ మూడు కార్పోరేషన్లు కలపాలంటూ లేఖ రాయడం ఏమిటి అని ఆక్రోశించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని హితవు పలికారు. అయినా అలాంటి ఒత్తిడికి ఈసీ తలవంచకూడదని అన్నారు. "ఎన్నికలను రద్దు చేయవద్దని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపర్చడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుంది" అని కేజ్రీవాల్ అన్నారు. (చదవండి: ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. సాహెబ్ జీ అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్) -
చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు
చండీగఢ్: ప్రతిష్టాత్మకమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35 స్థానాలకు గాను 14 చోట్ల నెగ్గింది. పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలితప్రాంతమైన చండీగఢ్‌లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగిన మొదటిసారే తమ సత్తా చాటుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 వార్డుల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు నెగ్గగా... శిరోమణి అకాలీదళ్ ఒకచోట గెలుపొందింది. చిత్రమేమింటే... 8 సీట్లు నెగ్గి మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని పార్టీలకంటే ఎక్కువగా 29.79 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో 26 వార్డులుండగా (బీజేపీ 20, కాంగ్రెస్ 4, శిరోమణి అకాలీదళ్ 1) ప్రస్తుతం వాటి సంఖ్య 35కు పెరిగింది. శుక్రవారం ఎన్నికలు జరగగా... సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుత చండీగఢ్ మేయర్ రవికాంత్ శర్మ 17వ వార్డులో ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ చేతిలో 828 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మేయర్ పదవిని చేపట్టాలంటే సాధారణ మెజారిటీ.. 18 స్థానాలు కావాలి. పంజాబ్‌లో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల కాంగ్రెస్, అకాలీదళ్‌లు ఆప్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు స్వల్పం. 12 స్థానాలు నెగ్గిన బీజేపీ ఓటమిని అంగీకరించి... మేయర్ పదవికి పోటీకి దూరంగా ఉంటుందా? లేక ఇతర పార్టీల కార్పొరేటర్లకు వలవేసి మళ్లీ అధికారపీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి. పంజాబ్‌లో మార్పుకు సంకేతం: కేజ్రీవాల్ చండీగఢ్ కార్పొరేషన్ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్‌లో రాబోయే మార్పుకు సంకేతమని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ వాసులు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని, ప్రత్యర్థి పార్టీల అవినీతిమయమైన రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్ కార్యకర్తలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఆప్ పంజాబ్ వ్యవహారాల ఉపబాధ్యుడు రాఘవ్ చద్దా (ఢిల్లీ ఎమ్మెల్యే) స్పందిస్తూ.. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని వ్యాఖ్యానించారు. -
Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’
కోల్‌కతా: కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వరసగా మూడోసారీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుబావుటా ఎగరేసి టీఎంసీ హ్యాట్రిక్ కొట్టింది. 144 వార్డులున్న కార్పొరేషన్లో ఏకంగా 134 వార్డులను టీఎంసీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 72 శాతం ఓట్లు టీఎంసీకే పడటం విశేషం. టీఎంసీకి ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. రెండు వార్డుల్లో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ 11.13 శాతం ఓట్లను మూటగట్టుకుంది. బీజేపీ సాధించిన ఓట్ల(8.94శాతం ఓట్లు)తో పోలిస్తే సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సాధించిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో సాధించిన ఓట్ల పట్టికలో లెఫ్ట్ ఫ్రంట్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మూడు, కాంగ్రెస్ రెండు వార్డులను గెల్చుకున్నాయి. గత కేఎంసీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీ ఈసారి 22 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది. బీజేపీకి గతంతో పోలిస్తే ఆరు శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. చదవండి: (S-400 Air Defence System: బోర్డర్లో ‘బాహుబలి’) ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఎంసీ ప్రాంతంలో సాధించిన ఓట్ల కంటే ఈసారి బీజేపీ ఏకంగా 20 శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. విపక్షాల ఓటు బ్యాంక్‌ను బద్దలుకొట్టాలని టీఎంసీ కుట్ర పన్నిందని, ఆ క్రమంలోనే లెఫ్ట్ ఫ్రంట్ పుంజుకుందని బీజేపీ ఆరోపించింది. 145 ఏళ్ల చరిత్ర ఉన్న కేఎంసీ ఎన్నికల్లో ఈసారి 40.5 లక్షల మంది ఓట్లేశారు. టీఎంసీ సాధించిన విజయంపై ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ మాట్లాడారు. ‘ఈ విజయం రాష్ట్ర ప్రజలకు అంకితం. టీఎంసీ భవిష్యత్ జాతీయ రాజకీయ ప్రస్థానానికి ఈ విజయం మేలిమి బాటలు పరుస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: (మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది) -
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్‌ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్‌పూర్‌నగర్ తదితర పంచాయత్‌లలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కుప్పంలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం
-
kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు
సాక్షి, చిత్తూరు: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. ఓటర్లను నేరుగా చంద్రబాబు ప్రలోభపెడుతున్నారు. ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. చాలామందికి చంద్రబాబు మాట్లాడిన ఆడియోను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. టీడీపీ నాయకులంతా ఆందోళనకు దిగాలంటూ పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. టీడీపీ నేతలు కుప్పం పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఆదివారం నుంచి కుప్పం ఓటర్లను టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను టీడీపీ గూండాలు చెక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఓటు వేస్తారంటూ అడుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ అరాచకాలతో కుప్పం ఓటర్లు భయపడిపోతున్నారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నేతలు దొంగ ఓటర్లంటూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. -
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్
-
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతోంది
-
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
Live Updates Time: 5.15 PM నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల వరుకూ క్యూలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 50.1 శాతం, బుచ్చిరెడ్డిపాలెం 61.6 శాతం, కుప్పం-76.49 శాతం, జగ్గయ్యపేట 78.45 శాతం, దాచేపల్లి-71.88 శాతం, గురజాల-71.8 శాతం, పెనుకొండ-82.63 శాతం, కమలాపురం-76.16 శాతం, కొండపల్లి-66.79 శాతం, రాజంపేటలో 67.27 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ ప్రకాశం జిల్లా దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చిన స్థానికులపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఓడిపోతామనే భయంతో అలజడి సృష్టించారు. రాజంపేటలో ఉద్రిక్తత వైఎస్సార్ జిల్లా: రాజంపేట 15వ వార్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అల్లరి మూకలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులపై రౌడీమూకలు రాళ్ల దాడి చేశారు. Time: 4.45 PM సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 42.71 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 58.66 శాతం, ఆకివీడులో 72.03 శాతం, కమలాపురంలో 74.81 శాతం, రాజంపేటలో 64.83 శాతం పోలింగ్ నమోదైంది. Time: 3.30 PM మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 38.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 55.48 శాతం, బేతంచర్లలో 67.99 శాతం, దాచేపల్లిలో 67.97. శాతం, కమలాపురంలో 71.84 శాతం, రాజంపేటలో 60.47 శాతం, పెనుకొండలో 75.99 శాతం పోలింగ్ నమోదైంది. Time: 2.30 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు నెల్లూరు కార్పొరేషన్లో 30.13 శాతం పోలింగ్ నమోదైంది. బుచ్చిపాలెంలో 50.9 శాతం, కుప్పంలో 68 శాతం, రాజంపేటలో 50.35 శాతం, గురజాలలో 53.72, జగ్గయ్యపేటలో 57 శాతం, పెనుకొండలో 55.91 శాతం పోలింగ్ నమోదైంది. Time: 1.30 PM పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షం లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఆకివీడులో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆకివీడులో 55.18 శాతం, బేతంచర్లలో 61.91 శాతం, దాచేపల్లిలో 59.01 శాతం, దర్శిలో 57 శాతం, కమలాపురంలో 64.57 శాతం, రాజంపేటలో 50.35 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.05 PM ►అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు 36.5 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో 20 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 15.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 37.31 శాతం, కుప్పంలో 37.75 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు బెతంచర్లలో 43.56 శాతం, ఆకివీడులో 37.52 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు దర్శిలో 35.16 శాతం, జగ్గయ్యపేటలో 27 శాతం, కమలాపురంలో 42.45 శాతం, రాజంపేటలో 34.38 శాతం, దాచేపల్లిలో 39.39 శాతం, గురజాలలో 35.55 శాతం పోలింగ్ నమోదైంది. ►కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 11.20 AM ►నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.68 శాతం పోలింగ్ నమోదైంది. ఆకివీడు నగర పంచాయితీ పోలింగ్ ప్రక్రియని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మస్వయంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై స్ధాయి అధికారులని బందోబస్తుకి వినియోగించామని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. Time: 10.20 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు 16వ డివిజన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపుం: పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్ నారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► దర్శి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ►గురుజాల నగర పంచాయతీలో 14 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ►దాచేపల్లి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 9.20 AM ► బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 18.73 శాతం పోలింగ్ నమోదైంది. ►ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్‌లో 6 వార్డులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 7.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కోనసాగుతోంది. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 31 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కొండపల్లి మున్పిపాలిటీలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెనుకొండలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► రాజంపేటలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. Time: 7.15 AM నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1206 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. Time: 7.00 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రారంభమైంది. ► నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు గానూ వైఎస్సార్సీపీ 8 డివిజన్లలో ఏకగ్రీవం అయింది. 45 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. బరిలో 206 మంది అభ్యర్థులు ఉన్నారు. 4.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 384 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 79 మంది అభ్యర్థులు ఉన్నారు. 38 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 45,463 మంది ఓట హక్కు వినియోగించుకోనున్నారు. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 39, 261 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లలో సోమవారం నిర్వహించే పురపోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. 325 డివిజన్లు/వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్/వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. ఆయా స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు. 908 పోలింగ్ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 4 వేల మందికి పైగా సిబ్బంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్ ఆఫీసర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను చూసేలా వీడియో లింకులివ్వండి కుప్పం నగర పంచాయతీ పరిధిలో సోమవారం జరిగే ఎన్నికల్లో అన్ని బూత్‌లలో పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా తమకు లేదా తమ పార్టీ ప్రతినిధులకు వీడియా లింకు సౌకర్యం కల్పించాలంటూ అక్కడ 24 వార్డుల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వేర్వేరుగా వినతిపత్రాలిచ్చారు. ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన ఈ వినతుల్ని చూసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు మన ఎన్నికల వ్యవస్థలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డు చేయడం వంటిది సాధారణమే అయినప్పటికీ.. గోప్యంగా పోలింగ్ బూత్‌లో జరిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరడంపై అధికారులు విస్తుపోతున్నారు. ఈ తరహా వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ నిర్ణీత కీలక ఎన్నికల అధికారుల పర్యవేక్షణకు, లేదంటే ఎన్నికల అనంతరం వివాద సమయంలో అవసరమైతే సాక్ష్యాల కోసం ఉపయోగపడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పంలోని అన్ని పోలింగ్ బూత్‌ల ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా వీడియో లింకులు కోరడంతోపాటు అనేక అంశాలపై టీడీపీ అభ్యర్థుల వినతులను జతచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తదుపరి చర్యల కోసం చిత్తూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలకు లేఖ రాశారు. ఆయా వినతులలో పేర్కొన్న అంశాలపై అవసరమైనమేర చర్యలు తీసుకుని, ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు. -
సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం
పుర సమరానికి సింహపురి సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు తెరపైకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తున్న అధికార పార్టీ వైఎస్సార్సీపీ పుర ఎన్నికల్లోనూ సత్తా చాటి క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ కనీసం పరువు దక్కించుకునే రీతిలోనైనా పోరాటం చేయాలని చర్చలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, గ్రేడ్–1 మున్సిపాలిటీలు గూడూరు, కావలిల్లో పుర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు ఎస్ఈసీ ఆదివారం రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పుర పోరు షురూ అయింది. జిల్లాలో నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి నెల్లూరు, గూడూరు, కావలి పుర ఎన్నికలపై కోర్టుల్లో వ్యాజ్యాలు ఉండడంతో వాయిదా వేశారు. మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడంతో అధికార వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరులను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టడంతో అడ్డంకులు తొలగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పురాల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు చేస్తుండడంతో నెల్లూరు పాటు కావలి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పురాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు తెరపైకి వచ్చాయి. చదవండి: (టీడీపీ నేతతో బీజేపీ మంతనాలు) వైఎస్సార్సీపీ సమరోత్సాహం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, పుర ఎన్నికల్లోనూ అప్రతిహతంగా విజయాలను దక్కించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని అధిపత్యాన్ని సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో పదవులన్నీ ఆ పార్టీ వశమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను మెచ్చిన ప్రజానీకం ఏ ఎన్నికలైనా ఏకపక్ష తీర్పు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 937 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 846 స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిపి 91 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. పరిషత్‌లో 524 ఎంపీటీసీ స్థానాల్లో 472 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 46 మండల పరిషత్‌లు, 46 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్‌లో ప్రతిపక్ష పార్టీ కండువా కనిపించకుండా పోయింది. తాజాగా నెల్లూరు కార్పొరేషన్, గ్రేడ్–1 మున్సిపాలిటీలు గూడూరు, కావలి, అల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో ఘన విజయం దక్కించుకోవాలనే దిశగా ఆ పార్టీ సమరోత్సాహంతో పావులు కదుపుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు నెల్లూరు నగర పాలక సంస్థలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించేందుకు మంత్రి పి అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా నగర ప్రజలకు చేరువయ్యే చర్యలు చేపట్టారు. ప్రజాహక్కు కార్యక్రమంతో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేదల ప్రజల ముంగిటకు వెళ్లగా, నేను–నాకార్యకర్త కార్యక్రమంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కేడర్‌ను ఉత్తేజ పరుస్తున్నారు. ఈలోపు ఎన్నికల సంఘం నిలిచిపోయిన పురపాలక ఎన్నికలకు కసరత్తు చేస్తుండడంతో అభ్యర్థుల ఎంపిక చర్యలకు అధికార పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. విజయఢంకా మోగించే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణాన వచ్చినా వెంటనే రంగంలోకి దిగాలనే దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకున్న విశ్వాసంతో సునాయసంగా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తామనే «ధీమాను వైఎస్సార్సీపీ వ్యక్తం చేస్తోంది. టీడీపీలో ఎన్నికల భయం జిల్లాకే ప్రతిష్టాత్మకమైన నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అడుగు ముందుకు, రెండుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తుండడంతో పోటీ చేయడానికి టీడీపీ మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆదివారం ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారుల నియామకంతో మంత్రి, ఎమ్మెల్యే కార్యాలయాల్లో రాజకీయ సందడి నెలకొనగా, టీడీపీ కార్యాలయంలో ఆ సందడి కనిపించలేదు. -
అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో చాప కిందినీరులా సాగుతున్న అసంతృప్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తారాస్థాయికి చేరింది. బీ ఫాంల కేటాయింపులో సమన్యాయం జరగలేదంటూ కొందరు సీనియర్ నాయకులు మనస్తాపానికి గురవుతున్నారు. కొంతకాలంగా తమను పార్టీకి దూరం చేసేందుకు సాగుతున్న కుట్రలను వివరించినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కలత చెందిన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు దంపతులు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా తాము సూచించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మనస్థాపం చెందిన వారు ‘పార్టీలో ఉందామా? రాజీనామా చేద్దామా?’ అని గురువారం ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తమను బయటకు పంపే కుట్ర సాగుతుందన్న వ్యాఖ్యలతో.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలు సూచించినట్లు తెలిసింది. ఇంకెంతో కాలం భరించలేం... గత నలభై ఏళ్లుగా వరద రాజేశ్వర్‌రావు, స్వర్ణ దంపతులు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో స్వర్ణ నగర మేయర్‌గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా తమను పట్టించుకోకుండా అవమానించారని వారు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నగర మేయర్‌గా ఐదేళ్లు పనిచేసిన స్వర్ణ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, పార్టీ సభ్యత్య నమోదు కూడా ఇక్కడి నుంచే చేయించుకున్నారు. అయినా వర్ధన్నపేట నుంచి పీసీసీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో వర్ధన్నపేట నుంచి మార్చి సంబంధం లేని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సభ్యురాలిగా నియమించినట్లు వెల్ల డించారు. అయితే దీనివెనుక జిల్లా, రాష్ట్ర నేతల కుట్ర దాగి ఉందని వరద రాజేశ్వర్ దంపతుల అనుచరులు అప్పట్లో విమర్శలు చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి వచ్చే ఎన్నికల్లో తమ నేతలకు అవకాశం ఇవ్వకుండా చేసే ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ కుట్ర చేశారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరిచారని, ఇంకా ఎంతోకాలం ఈ అవమానాలను భరించలేమని ముఖ్య కార్యకర్తలతో స్వర్ణ – వరదరాజేశ్వర్‌రావు దంపతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేయడమా, లేక పార్టీ నుంచి తప్పుకోవడమా అన్న కోణంలో వారు ముఖ్య అనుచరులతో చర్చలు చేస్తున్నారు. హన్మకొండలోని స్వగహంలో గురువారం కార్యకర్తలతో సమావేశమైన వారు రాత్రి పొద్దుపోయే వరకు సమాలోచనలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే -
నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనగా, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో గురువారం మధ్యాహ్నమే అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి క్ష్రేతస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్లో నేతలు, అభ్యర్థులను కలిసేందుకు ఓటర్లు విముఖత చూపుతుండటంతో ప్రతీ ఓటరును చేరుకునేందుకు కార్యకర్తల యంత్రాంగంపైనే ఆధారపడి ప్రచారం చేయాలని యోచిస్తోంది. చివరి నిమిషంలో వచ్చిన వారికి కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. సుదర్శన్‌గౌడ్‌తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ టికెట్ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్‌నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్ఎస్ బీ ఫారం దక్కగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్‌లకు మళ్లీ టీఆర్ఎస్ తరపున అవకాశం దక్కింది. అసంతృప్తులకు బుజ్జగింపులు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నామినేషన్ దాఖ లు చేసినా అవకాశం దక్కని క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ టికెట్ ఆశిస్తూ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేసిన అభ్యర్థులను డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ గుర్తించింది. పార్టీ తరపున గెలుపు గుర్రాలు మాత్రమే బరిలో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం దక్కని ఆశావహులు, బలమైన స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. దీనికోసం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన వారిని గుర్తించి అవకాశమిచ్చింది. అక్కడక్కడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, ఉద్యమకారులు, సీనియారిటీ తదితరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. -
మున్సిపల్ ఎన్నికలు యథాతధం: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని సూచిందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ‘‘ఈనెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని ... ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. చదవండి: మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది. వలసలు నివారించేందుకే.. నామినేషన్ల దాఖలు గడువుకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అవకాశం దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థులుగా నిలిచే అవకాశముందని టీఆర్ఎస్ భావించింది. కొందరు రెబల్స్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాత్రమే బలమైన అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వలసలకు, రెబల్స్‌కు తావులేకుండా అన్ని అస్త్రాలు ప్రయోగించడం ద్వారా ఏకాభిప్రాయ సాధన కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో ఉంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించింది. సిద్దిపేటలో కొందరు అభ్యర్థులు ఖరారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిçస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్‌లు జారీ చేస్తామని ప్రకటించారు. ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి పువ్వాడ అజయ్. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్‌రావు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్ కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులో మాత్రం సంబంధిత జిల్లా మంత్రుల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాను వడపోస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి సగటున ముగ్గురు చొప్పున టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సమయం పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
-
మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా.. ఇప్పుడు నిలిపి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది. చదవండి: వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే.. -
వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే..
వరంగల్: వరంగల్ బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు టీఆర్ఎస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, చివరిరోజు పలు వార్డుల్లో తల్లీకూతుళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఎదురుకావద్దనే భావనతోనే ముందస్తుగా ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్టు వారు చెప్పుకొచ్చారు. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నేత యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి పోటీలో ఉన్నారు. 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్జీ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి నామినేషన్లు సమర్పించారు. 19వ డివిజన్ నుంచి నామినేషన్లు వేసిన తల్లి ఝాన్సీ, కుమార్తె మౌనిక గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా? -
గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?
వరంగల్ : గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు అదివారం మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి 29వ డివిజన్ కార్పొరేటర్‌గా నామినేషన్ అందజేశారు. అలాగే, దివంగత మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్ కుమారుడు అభినవ్‌భాస్కర్ 60 డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోదరి నల్లా స్వరూపరాణి 57వ డివిజన్ నుంచి, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ 10వ డివిజన్ నుంచి, మాజీ స్టాండింగ్ కమిటి చైర్మన్ గుండేటి నరేందర్ 20వ డివిజన్ నుంచి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి 34వ డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బంక సరళాయాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కేడల పద్మ, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ ఒకరు కాకపోతే ఇంకొకరు... నగరంలోని పలు డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరేసి కార్పొరేటర్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి, బీజేపీ నాయకులు, సోదరులైన చాచర్ల చిన్నారావు 41 డివిజన్, దీనదయాళ్ 40వ డివిజన్ నుంచి, 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి, అదే డివిజన్ నుంచి ఆరేళ్లి రవితో పాటు ఆయన సతీమణి కూడా నామినేషన్లను దాఖలు చేశారు. స్రూ్కటినీలో ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైనా మరొకరు పోటీలో ఉండొచ్చనే భావనతో ఇద్దరేసి నామినేషన్లు సమర్పించినట్లు తెలిపారు. నేడు నామినేషన్ల పరిశీలన వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో భాగంగా అదివారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ము గిసింది. ఇక సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేష న్లు స్వీకరించిన వరంగల్‌లోని ఎల్బీ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో పరిశీలనకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమర్పించిన అభ్యర్థుల్లోఉత్కంఠ నెలకొంది. పరిశీలన విధివిధానాలు నామినేషన్ల పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధి కారి(ఆర్ఓ)కి నిబంధనలకు లోబడి సర్వ అధికా రాలు ఉంటాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థితోపాటు ప్రతి పాదించి వ్యక్తి,ఏజెంట్,సమీప బంధువు హాజ రుకావొచ్చు. లేదంటే న్యాయ సలహాదారుడి పరి శీ నలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌లోని ఫారం – 8లో పొందుపరిచిన వివరాలను పరిశీలించి అభ్య ర్థి, ప్రతిపాదిత వ్యక్తుల పేర్లు, వివరాలు, సంతకాలను సరిచూస్తారు. అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, ఓటరు జాబి తాలో ఉన్నాయో, లేదో పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల్లో జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీ చేసే వ్యక్తి బీ – ఫారం సమర్పించారా, లేదా అని చూస్తారు. (నావిునేషన్ ఉపసంహరణ గడువు వరకు బీ – ఫారం సమర్పించే వెసులుబాటు ఉంది.) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి చివరి వరకు కూడా బీ – ఫారం సమర్పించకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారనే వివరణ పత్రాన్ని పరిశీలిస్తారు. స్వతంత్య్ర అభ్యర్థిగానై బరిలో ఉంటారా, లేదా అని తెలుసుకుంటారు. గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినప్పటికీ అధికారులు ఇచ్చిన గుర్తుల్లో తాను కోరుకునే గుర్తు ముందుగానే నమోదు చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన డివిజన్లకు సంబంధించి అభ్యర్థి ఆన్లైన్ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు. ఎన్నికల నియమావళి ఆధారంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థి నిబంధనలకు లోబడి ఉంటానని, ప్రచారం ఖర్చుల వివరాలు తప్పక అందజేస్తానని జత చేసిన ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ధృవీకరణ పత్రాల్లో అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు తప్పక నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా నమోదైన కేసులు ఉన్నాయో, లేదో కూడా వెల్లడించి ఉండాలి. డిపాజిట్ జమ చేసిన బిల్లును కూడా పరిశీలించాక అన్నీ సక్రమంగా ఉంటే నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఏ అభ్యర్థి నామినేషన్ విషయంలోనైనా ప్రత్యర్థులు కానీ, ఇతర వ్యక్తులు కానీ గడువులోగా అభ్యంతరాలు, అభియోగాలు చేసే అవకాశం కల్పిస్తారు. అయితే, తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అభియోగాలను పరిశీలించి నిజమేనని తేలితే నామినేషన్‌ను తిరస్కరించడంతో పాటు ఇరువర్గాల నుంచి సంతకాలు తీసుకుంటారు. -
జనసేనకు షాక్: ‘గాజుగ్లాసు’ పోయింది
సాక్షి, హైదరాబాద్: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్ గుర్తులను కోల్పోయాయి. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని నేపథ్యంలో ఈ పార్టీలు కామన్ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇప్పుడు జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో తాము పోటీచేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్ సింబల్‌ను కొనసాగించాలని ఎస్ఈసీని కోరారు. అయితే ఆయా అంశాలను తాము పరిశీలించామని, జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. దీంతో 2025 నవంబర్ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని స్పష్టం చేశారు. -
Warangal Municipal Corporation Election 2021: సార్.. టికెట్ ప్లీజ్..!
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి టీఆర్ఎస్ నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హన్మకొండలో గురువారం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఆశావహులు ఆయనను చుట్టుముట్టిన దృశ్యమే ఇది. - స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ -
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయను న్నారు. ఫలితాలు వెలువడిన తరువాత మేయర్/ చైర్పర్సన్ల ఎన్నిక కోసం విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈనెల 29 లేదా 30న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. ఈ మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓట్లగణన పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. తుది ఓటర్ల జాబితా రాగానే కార్పొరేషన్లలో డివిజన్లకు, మునిసి పాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించనున్నట్లు మునిసిపల్ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘా నికి సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కరోనా నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
కరీంనగర్లో అన్ని పట్టణాల్లో టీఆర్ఎస్సే
-
‘పుర’పోరుపై నేడు స్పష్టత!