
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా.. ఇప్పుడు నిలిపి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment