న్యూఢిల్లీ: ఆప్ స్వీప్‌కు భయపడి కేంద్రం ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల తేదీలను వాయిదా వేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీల ప్రకటనను వాయిదా వేయడం దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని కేజ్రీవాల్ అన్నారు.
కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఇదే తొలిసారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ( నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను) కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పారు. గత ఏడెనిమదేళ్లుగా కేంద్రంలోనే ఉన్న బీజేపీ ఎన్నడూ ఈ మూడు కార్పొరేషన్లను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు.
కేవలం ఒక గంట ముందు ఈ మూడు కార్పోరేషన్లు కలపాలంటూ లేఖ రాయడం ఏమిటి అని ఆక్రోశించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని హితవు పలికారు. అయినా అలాంటి ఒత్తిడికి ఈసీ తలవంచకూడదని అన్నారు. "ఎన్నికలను రద్దు చేయవద్దని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపర్చడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుంది" అని కేజ్రీవాల్ అన్నారు.
(చదవండి: ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. సాహెబ్ జీ అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్)
Comments
Please login to add a commentAdd a comment