నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్‌ | AP Municipal And Nagar Panchayat Elections 2021 Live Updates | Sakshi
Sakshi News home page

AP Municipal And Nagar Panchayat Elections 2021: నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్‌

Published Mon, Nov 15 2021 2:33 AM | Last Updated on Mon, Nov 15 2021 7:46 PM

AP Municipal And Nagar Panchayat Elections 2021 Live Updates - Sakshi

Live Updates
Time: 5.15 PM
నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 5 గంటల వరుకూ క్యూలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 50.1 శాతం, బుచ్చిరెడ్డిపాలెం 61.6 శాతం, కుప్పం-76.49 శాతం, జగ్గయ్యపేట 78.45 శాతం, దాచేపల్లి-71.88 శాతం, గురజాల-71.8 శాతం, పెనుకొండ-82.63 శాతం, కమలాపురం-76.16 శాతం, కొండపల్లి-66.79 శాతం, రాజంపేటలో 67.27 శాతం పోలింగ్‌ నమోదైంది.

దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్‌
ప్రకాశం జిల్లా దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్‌ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చిన స్థానికులపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఓడిపోతామనే భయంతో అలజడి సృష్టించారు.

రాజంపేటలో ఉద్రిక్తత
వైఎస్సార్‌ జిల్లా: రాజంపేట 15వ వార్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద అల్లరి మూకలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.  పోలీసులపై రౌడీమూకలు రాళ్ల దాడి చేశారు.

Time: 4.45 PM
సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 42.71 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 58.66 శాతం, ఆకివీడులో 72.03 శాతం, కమలాపురంలో 74.81 శాతం, రాజంపేటలో 64.83 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 3.30 PM
మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 38.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 55.48 శాతం, బేతంచర్లలో 67.99 శాతం, దాచేపల్లిలో 67.97. శాతం, కమలాపురంలో 71.84 శాతం, రాజంపేటలో 60.47 శాతం, పెనుకొండలో 75.99 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 2.30 PM
మధ్యాహ్నం ఒంటి గంట వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో 30.13 శాతం పోలింగ్‌ నమోదైంది. బుచ్చిపాలెంలో 50.9 శాతం, కుప్పంలో 68 శాతం, రాజంపేటలో 50.35 శాతం, గురజాలలో 53.72, జగ్గయ్యపేటలో 57 శాతం, పెనుకొండలో 55.91 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 1.30 PM
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షం లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఆకివీడులో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్‌ అన్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆకివీడులో  55.18 శాతం, బేతంచర్లలో 61.91 శాతం, దాచేపల్లిలో 59.01 శాతం, దర్శిలో 57 శాతం, కమలాపురంలో 64.57 శాతం, రాజంపేటలో 50.35 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 12.05 PM
అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు 36.5 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్‌లో 20 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్‌లో  15.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో  37.31 శాతం, కుప్పంలో 37.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు బెతంచర్లలో 43.56 శాతం, ఆకివీడులో 37.52 శాతం పోలింగ్  నమోదైంది.

ఉదయం 11 గంటల వరకు దర్శిలో 35.16 శాతం, జగ్గయ్యపేటలో 27 శాతం, కమలాపురంలో 42.45 శాతం, రాజంపేటలో 34.38 శాతం, దాచేపల్లిలో 39.39 శాతం, గురజాలలో 35.55 శాతం పోలింగ్‌ నమోదైంది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో  ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Time: 11.20 AM
నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు  37.68 శాతం  పోలింగ్‌ నమోదైంది. ఆకివీడు నగర పంచాయితీ పోలింగ్ ప్రక్రియని  జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మస్వయంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై స్ధాయి అధికారులని బందోబస్తుకి వినియోగించామని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు.

Time: 10.20 AM
► నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. నెల్లూరు 16వ డివిజన్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


► అనంతపుం: పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్‌ నారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
► దర్శి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది. 
గురుజాల నగర పంచాయతీలో 14 వార్డులకు పోలింగ్‌  జరుగుతోంది. 
దాచేపల్లి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 

Time: 9.20 AM
► బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 18.73 శాతం పోలింగ్ నమోదైంది.
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 8.30 AM
► నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్‌లో 6 వార్డులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: 7.30 AM
► నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.
► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్‌ కోనసాగుతోంది.
► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది.
► జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 31 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది.


► కొండపల్లి మున్పిపాలిటీలో 29 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది. 
► పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పెనుకొండలో 20 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది.
► రాజంపేటలో 29 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది.
► కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది.
► ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్‌ కొనసాగుతోంది. 

Time: 7.15 AM 
నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1206 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్‌ సమయంలో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. 

Time: 7.00 AM
► నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్‌ ప్రారంభమైంది.


► నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు గానూ వైఎస్సార్‌సీపీ 8 డివిజన్లలో ఏకగ్రీవం అయింది. 45 డివిజన్లకు పోలింగ్‌ జరుగుతోంది. బరిలో 206 మంది అభ్యర్థులు ఉన్నారు. 4.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 384 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 


► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల బరిలో 79 మంది అభ్యర్థులు ఉన్నారు. 38 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది సిబ్బంది  విధుల్లో ఉన్నారు.  45,463 మంది ఓట హక్కు వినియోగించుకోనున్నారు. 
కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. 39, 261 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సాక్షి, అమరావతి: నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లలో సోమవారం నిర్వహించే పురపోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగుతుంది. 


325 డివిజన్లు/వార్డులు
రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్‌/వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరుగనుంది. ఆయా స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు. 908 పోలింగ్‌ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్‌ కాస్టింగ్‌ చేపట్టనున్నారు.

4 వేల మందికి పైగా సిబ్బంది
ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ ఆఫీసర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్‌ ఆఫీసర్‌లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. 

పోలింగ్‌ను చూసేలా వీడియో లింకులివ్వండి
కుప్పం నగర పంచాయతీ పరిధిలో సోమవారం జరిగే ఎన్నికల్లో అన్ని బూత్‌లలో పోలింగ్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా తమకు లేదా తమ పార్టీ ప్రతినిధులకు వీడియా లింకు సౌకర్యం కల్పించాలంటూ అక్కడ 24 వార్డుల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వేర్వేరుగా వినతిపత్రాలిచ్చారు. ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన ఈ వినతుల్ని చూసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు మన ఎన్నికల వ్యవస్థలో వెబ్‌ కాస్టింగ్, వీడియో రికార్డు చేయడం వంటిది సాధారణమే అయినప్పటికీ.. గోప్యంగా పోలింగ్‌ బూత్‌లో జరిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరడంపై అధికారులు విస్తుపోతున్నారు.

ఈ తరహా వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌ నిర్ణీత కీలక ఎన్నికల అధికారుల పర్యవేక్షణకు, లేదంటే ఎన్నికల అనంతరం వివాద సమయంలో అవసరమైతే సాక్ష్యాల కోసం ఉపయోగపడుతుందని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా వీడియో లింకులు కోరడంతోపాటు అనేక అంశాలపై టీడీపీ అభ్యర్థుల వినతులను జతచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు తదుపరి చర్యల కోసం చిత్తూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలకు లేఖ రాశారు. ఆయా వినతులలో పేర్కొన్న అంశాలపై అవసరమైనమేర చర్యలు తీసుకుని, ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement