polling municipal election
-
హరియాణాలో 61% పైగా పోలింగ్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి శనివారం జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 61%పైగా ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలు కనిపిస్తున్నాయని, ఓటింగ్ శాతం పెరగనుందని పేర్కొంది. అత్యధికంగా నుహ్‌లో 68.28%, యమునానగర్‌లో 67.93% పల్వాల్లో 67.69%, జింద్‌లో 66.02%, సిర్సాలో 65.37% నమోదు కాగా, గురుగ్రామ్‌లో 49.92% మాత్రమే నమోదైనట్లు తెలిపింది.పోలింగ్ సమయంలో నుహ్, హిసార్, పానిపట్ జిల్లాల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగినట్లు ఈసీ తెలిపింది. కేంద్ర మంత్రి, మాజీ సీఎం ఖట్టర్ కర్నాల్‌లో ఓటేశారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్ ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి వచ్చి మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై వచ్చి ఓటేశారు. జులానా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న వినేశ్ ఫొగాట్ చర్ఖి దాద్రి జిల్లా బలాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయని గ్రామస్తులు చర్ఖి దాద్రి జిల్లాలో రామల్వాస్ గ్రామస్తులు శనివారం పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ పరిసరాల్లో కొనసాగే గనుల అక్రమ తవ్వకాలతో తమ జల వనరులు అడుగంటాయని, పర్యావరణానికి హాని కలుగుతోందని ఆరోపిస్తున్నా రు. తవ్వకాలను అడ్డుకోవాలనే డిమాండ్‌తో వీరు ఓటేసేందుకు వెళ్లలేదు. ఓటర్లు ఎవరూ రాకపోయేసరికి గ్రామ పోలింగ్ బూత్‌లో సిబ్బంది అంతా సాయంత్రం వరకు ఖాళీగానే కూర్చున్నారు. అదే సమయంలో గ్రామస్తులు హుక్కా పీలుస్తూ, పేకాట ఆడుతూ సరదాగా కాలక్షేపం చేశారు. -
ఏపీ మున్సిపల్ ఎన్నికలు; 59.63% పోలింగ్
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డుల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. 325 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 8,62,066 మంది ఓటర్లకు గాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59.63% పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో 82.63%, అత్యల్పంగా నెల్లూరు కార్పొరేషన్లో 52.25% పోలింగ్ నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్లో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 52.25 శాతం మంది ఓటు వేశారు. కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక్కడ 37,664 మంది ఓటర్లు ఉండగా 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడిగా పోలింగ్ ఎన్నికల సరళి మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకూ కేవలం 10.12% పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 24.96%, మ.ఒంటి గంటకు 41.02%.. 3 గంటల సమయానికి 50 శాతానికి పోలింగ్ జరిగింది. ఇలా మొత్తంగా 59.63% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం కార్పొరేషన్లో 65.04%, అత్యల్పంగా అనంతపురం కార్పొరేషన్లో 37.58% పోలింగ్ నమోదైంది. నగర పంచాయతీలు, పట్టణాలే మిన్న ఓటు హక్కు వినియోగించుకోవడంలో నగరాలతో పోలిస్తే పట్టణాలు, నగర పంచాయతీ ప్రజలే చైతన్యం కనబర్చారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని 46 డివిజన్లతో పాటు, వివిధ కార్పొరేషన్లలోని 10 డివిజన్లు కలిపి 56 డివిజన్లలో కేవలం 49.89% మంది మాత్రమే ఓటు వేశారు. అదే పట్టణాలు, నగర పంచాయతీల్లో 72.19% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కుప్పంలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం
-
kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు
సాక్షి, చిత్తూరు: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. ఓటర్లను నేరుగా చంద్రబాబు ప్రలోభపెడుతున్నారు. ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. చాలామందికి చంద్రబాబు మాట్లాడిన ఆడియోను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. టీడీపీ నాయకులంతా ఆందోళనకు దిగాలంటూ పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. టీడీపీ నేతలు కుప్పం పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఆదివారం నుంచి కుప్పం ఓటర్లను టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను టీడీపీ గూండాలు చెక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఓటు వేస్తారంటూ అడుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ అరాచకాలతో కుప్పం ఓటర్లు భయపడిపోతున్నారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నేతలు దొంగ ఓటర్లంటూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. -
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్
-
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతోంది
-
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులకే పట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన సర్పంచ్, వార్డుల స్థానాలు, గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు -
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
Live Updates Time: 5.15 PM నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల వరుకూ క్యూలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 50.1 శాతం, బుచ్చిరెడ్డిపాలెం 61.6 శాతం, కుప్పం-76.49 శాతం, జగ్గయ్యపేట 78.45 శాతం, దాచేపల్లి-71.88 శాతం, గురజాల-71.8 శాతం, పెనుకొండ-82.63 శాతం, కమలాపురం-76.16 శాతం, కొండపల్లి-66.79 శాతం, రాజంపేటలో 67.27 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ ప్రకాశం జిల్లా దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చిన స్థానికులపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఓడిపోతామనే భయంతో అలజడి సృష్టించారు. రాజంపేటలో ఉద్రిక్తత వైఎస్సార్ జిల్లా: రాజంపేట 15వ వార్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అల్లరి మూకలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులపై రౌడీమూకలు రాళ్ల దాడి చేశారు. Time: 4.45 PM సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 42.71 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 58.66 శాతం, ఆకివీడులో 72.03 శాతం, కమలాపురంలో 74.81 శాతం, రాజంపేటలో 64.83 శాతం పోలింగ్ నమోదైంది. Time: 3.30 PM మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 38.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 55.48 శాతం, బేతంచర్లలో 67.99 శాతం, దాచేపల్లిలో 67.97. శాతం, కమలాపురంలో 71.84 శాతం, రాజంపేటలో 60.47 శాతం, పెనుకొండలో 75.99 శాతం పోలింగ్ నమోదైంది. Time: 2.30 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు నెల్లూరు కార్పొరేషన్లో 30.13 శాతం పోలింగ్ నమోదైంది. బుచ్చిపాలెంలో 50.9 శాతం, కుప్పంలో 68 శాతం, రాజంపేటలో 50.35 శాతం, గురజాలలో 53.72, జగ్గయ్యపేటలో 57 శాతం, పెనుకొండలో 55.91 శాతం పోలింగ్ నమోదైంది. Time: 1.30 PM పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షం లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఆకివీడులో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆకివీడులో 55.18 శాతం, బేతంచర్లలో 61.91 శాతం, దాచేపల్లిలో 59.01 శాతం, దర్శిలో 57 శాతం, కమలాపురంలో 64.57 శాతం, రాజంపేటలో 50.35 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.05 PM ►అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు 36.5 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో 20 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 15.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 37.31 శాతం, కుప్పంలో 37.75 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు బెతంచర్లలో 43.56 శాతం, ఆకివీడులో 37.52 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు దర్శిలో 35.16 శాతం, జగ్గయ్యపేటలో 27 శాతం, కమలాపురంలో 42.45 శాతం, రాజంపేటలో 34.38 శాతం, దాచేపల్లిలో 39.39 శాతం, గురజాలలో 35.55 శాతం పోలింగ్ నమోదైంది. ►కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 11.20 AM ►నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.68 శాతం పోలింగ్ నమోదైంది. ఆకివీడు నగర పంచాయితీ పోలింగ్ ప్రక్రియని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మస్వయంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై స్ధాయి అధికారులని బందోబస్తుకి వినియోగించామని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. Time: 10.20 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు 16వ డివిజన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపుం: పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్ నారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► దర్శి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ►గురుజాల నగర పంచాయతీలో 14 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ►దాచేపల్లి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 9.20 AM ► బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 18.73 శాతం పోలింగ్ నమోదైంది. ►ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్‌లో 6 వార్డులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 7.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కోనసాగుతోంది. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 31 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కొండపల్లి మున్పిపాలిటీలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెనుకొండలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► రాజంపేటలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. Time: 7.15 AM నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1206 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. Time: 7.00 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రారంభమైంది. ► నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు గానూ వైఎస్సార్సీపీ 8 డివిజన్లలో ఏకగ్రీవం అయింది. 45 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. బరిలో 206 మంది అభ్యర్థులు ఉన్నారు. 4.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 384 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 79 మంది అభ్యర్థులు ఉన్నారు. 38 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 45,463 మంది ఓట హక్కు వినియోగించుకోనున్నారు. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 39, 261 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లలో సోమవారం నిర్వహించే పురపోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. 325 డివిజన్లు/వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్/వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. ఆయా స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు. 908 పోలింగ్ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 4 వేల మందికి పైగా సిబ్బంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్ ఆఫీసర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను చూసేలా వీడియో లింకులివ్వండి కుప్పం నగర పంచాయతీ పరిధిలో సోమవారం జరిగే ఎన్నికల్లో అన్ని బూత్‌లలో పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా తమకు లేదా తమ పార్టీ ప్రతినిధులకు వీడియా లింకు సౌకర్యం కల్పించాలంటూ అక్కడ 24 వార్డుల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వేర్వేరుగా వినతిపత్రాలిచ్చారు. ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన ఈ వినతుల్ని చూసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు మన ఎన్నికల వ్యవస్థలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డు చేయడం వంటిది సాధారణమే అయినప్పటికీ.. గోప్యంగా పోలింగ్ బూత్‌లో జరిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరడంపై అధికారులు విస్తుపోతున్నారు. ఈ తరహా వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ నిర్ణీత కీలక ఎన్నికల అధికారుల పర్యవేక్షణకు, లేదంటే ఎన్నికల అనంతరం వివాద సమయంలో అవసరమైతే సాక్ష్యాల కోసం ఉపయోగపడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పంలోని అన్ని పోలింగ్ బూత్‌ల ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా వీడియో లింకులు కోరడంతోపాటు అనేక అంశాలపై టీడీపీ అభ్యర్థుల వినతులను జతచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తదుపరి చర్యల కోసం చిత్తూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలకు లేఖ రాశారు. ఆయా వినతులలో పేర్కొన్న అంశాలపై అవసరమైనమేర చర్యలు తీసుకుని, ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు. -
గుంటూరు: సత్తెనపల్లి 7వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ
-
టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్
-
ఏపీ: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫోటోలు
-
అనంతపురం జిల్లా: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం
-
ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Time: 5:00 PM ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. Time: 4:45 PM ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. Time: 4:30 PM ప్రకాశం: అద్దంకి 20వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి బూత్ వద్దకు వచ్చాడు. దీంతో వైఎస్ఆర్సీపీ ఇంఛార్జ్ కృష్ణ చైతన్య కూడా అక్కడ చేరుకున్నారు. రెండు వర్గాల అనుచరులతో నేతలు బూత్ బయట కూర్చొన్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాల కార్యకర్తలను దూరంగా పంపుతున్నారు. Time: 4:20 PM మచిలీపట్నం: మచిలీపట్నం 25వ డివిజన్లో పోలీసులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణకు వెళ్లకూడదని,144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నా పోలీసులపై చేయి చేసుకుని ఎస్ఐని నెట్టివేశాడు. Time: 4:00 PM మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో గంటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. Time: 3:00 PM రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ►శ్రీకాకుళం- 59.9శాతం ►విజయనగరం- 53.31శాతం ► కృష్ణా- 52.87 శాతం ► తూర్పుగోదావరి- 53.08 శాతం ► కర్నూలు- 48.87 శాతం ► అనంతపురం- 56.93 శాతం ►చిత్తూరు- 54.12 శాతం ►ప్రకాశం- 64.31 శాతం ► కడప- 56.63 శాతం ► నెల్లూరు- 61.03 శాతం ►విశాఖపట్నం- 47.86 శాతం ►గుంటూరు- 54.42 శాతం ► పశ్చిమ గోదావరి- 53.68 శాతం Time: 2:30 PM అనంతపురం: జిల్లాలోని కదిరి 3వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 2:00 PM టీడీపీ దుశ్చర్య చిత్తూరు: తిరుపతి 43వ డివిజన్లో టీడీపీ దుశ్చర్యకు పాల్పడింది. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేసింది. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.84% పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం శ్రీకాకుళం: 44.38% విజయనగరం: 45.10% విశాఖ: 36.75% తూర్పు గోదావరి: 53.08% పశ్చిమ గోదావరి: 45.51% కృష్ణా: 41.51% గుంటూరు: 44.69% ప్రకాశం: 53.19% నెల్లూరు: 48.89% అనంతపురం: 45.42% కర్నూలు: 40.99% కడప: 46.02% చిత్తూరు: 41.28% పోలింగ్ Time: 1:28 PM ఏయూ హైస్కూల్ బూత్ వద్ద ఎమ్మెల్యే వెలగపూడి హల్చల్ విశాఖపట్నం: ఏయూ హైస్కూల్ బూత్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హల్చల్ సృష్టించారు. అనుచరులతో బూత్‌కు వచ్చిన వెలగపూడిని పోలీసులు అడ్డుకున్నారు. గొడవలు సృష్టించడానికే వెలగపూడి వచ్చారంటూ వైఎస్సార్సీపీ ఆందోళన చేసింది. టీడీపీ కార్యకర్తలు.. బూత్ వద్ద నినాదాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెలగపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Time: 1:17 PM పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు.. గుంటూరు: నగరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు తిష్ట వేశారు. స్టాల్ గర్ల్స్ హైస్కూల్ బూత్ లోపలే టీడీపీ నేతలు ఉండిపోయారు. టీడీపీ నేతలు బూత్‌లో ఉన్నారంటూ పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. Time: 12:45 PM ఓటు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం: మంత్రి బొత్స సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాజా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్లో విజయం సాధించిన అభ్యర్థులు మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పట్టణాభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 12:37 PM సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలు: ఎస్ఈసీ విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓట్లర్ల వద్ద సెల్ఫోన్లు ఉన్నప్పటికీ.. ఎటువంటి అభ్యంతరం వద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలని ఎస్ఈసీ తెలిపారు. Time: 12:06 PM విశాఖలో టీడీపీ దౌర్జన్యం విశాఖపట్నం: ఆంధ్రా వర్సిటీ హైస్కూల్ బూత్‌లో టీడీపీ దౌర్జన్యానికి దిగింది. ఓటింగ్ అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు గొడవ సృష్టించారు. పోలింగ్ అధికారులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. మహిళలను భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ నేత శ్రీ భరత్.. అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లారు. Time: 11:55 AM రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా.. కృష్ణా జిల్లా- 32.64 శాతం చిత్తూరు జిల్లా-30.12 శాతం ప్రకాశం జిల్లా-36.12 శాతం వైఎస్సార్ జిల్లా -32.82 శాతం నెల్లూరు జిల్లా-32.67 శాతం విశాఖ జిల్లా-28.50 శాతం కర్నూలు జిల్లా -34.12 శాతం గుంటూరు-33.62 శాతం శ్రీకాకుళం-24.58 శాతం తూర్పుగోదావరి-36.31శాతం అనంతపురం-31.36 శాతం విజయనగరం-31.97 శాతం పశ్చిమ గోదావరి-34.14 Time: 11:33 AM ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Time: 11:25 AM టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యం అనంతపురం: టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యానికి తెరలేపారు. 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులపై కందికుంట దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూధన్‌ను కందికుంట ప్రసాద్ దుర్భాషలాడారు. Time: 11:18 AM ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్... ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ ఎటువంటి సంఘటనలు లేవన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. Time: 11:08 AM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్, వైఎస్సార్ జిల్లా కడప 29వ డివిజన్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. Time: 11:02 AM రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా... కృష్ణా జిల్లా- 13 శాతం చిత్తూరు-9 శాతం ప్రకాశం-14 శాతం, వైఎస్సార్ జిల్లా- 8 శాతం నెల్లూరు జిల్లా 12 శాతం విశాఖ జిల్లా- 14 శాతం కర్నూలు జిల్లా- 11 శాతం గుంటూరు జిల్లా 16 శాతం శ్రీకాకుళం 10 శాతం తూర్పుగోదావరి- 16 శాతం పశ్చిమగోదావరి-16 శాతం అనంతపురం-12 శాతం విజయనగరం-14 శాతం Time: 10:51 AM జనసేన, టీడీపీ ఘర్షణ గుంటూరు: సత్తెనపల్లి 7వ బూత్ వద్ద జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ మద్దతు అభ్యర్ధి భర్తపై జనసేన కార్యకర్తల దాడి చేశారు. అయితే ఎల్లో మీడియా మాత్రం.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడికి దిగారు అంటూ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల దౌర్జన్యం చిత్తూరు: తిరుపతి 15వ డివిజన్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ అభ్యర్ధి భర్తను దుర్భాషలాడారు. ఓటు హక్కు లేని టీడీపీ నేతలు కూడా పోలింగ్ కేంద్రానికి రావడాన్ని ప్రశ్నించడంతో ఈ విధంగా వైఎస్సార్ సీపీ నేతలపై అక్కసు వెళ్లగక్కారు. బీజేపీ నగదు పంపిణీ! తూర్పు గోదావరి: రామచంద్రపురంలో బీజేపీ అభ్యర్ధి తరఫున నగదు పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓటర్ లిస్ట్‌తో పాటు రూ.37వేలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంపిణీ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. Time: 9:57 AM రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం.. శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం-7.59 శాతం, పలాస - కాశీబుగ్గ- 10.81 శాతం, పాలకొండ- 6.74 శాతం పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం- 15.51 శాతం, కొవ్వూరు-17.48 శాతం, నరసాపురం- 5.51 శాతం, నిడదవోలు-13.52 శాతం కృష్ణా జిల్లా: మచిలీపట్నం- 12 శాతం, నూజివీడు-10 శాతం, పెడన- 16 శాతం, కృష్ణా: తిరువూరు-17 శాతం ప్రకాశం జిల్లా: ఒంగోలు- 14 శాతం, కనిగిరి- 16 శాతం, గిద్దలూరు-14 శాతం, చీరాల- 11 శాతం, అద్దంకి- 20.26 శాతం వైఎస్సార్ జిల్లా: కడప-4 శాతం, రాయచోటి-14 శాతం, మైదుకూరు- 15 శాతం, బద్వేల్ 12 శాతం, ప్రొద్దుటూరు- 9 శాతం కర్నూలు జిల్లా: నంద్యాల 9.8 శాతం, ఆదోని- 8.86 శాతం, ఎమ్మిగనూరు- 16.45 శాతం, డోన్-11.96 శాతం, ఆత్మకూరులో 17.51 శాతం, ఆళ్లగడ్డ- 21.28 శాతం, నందికొట్కూరు 13.39 శాతం Time: 9:21 AM ఎల్లో మీడియా దుష్ప్రచారం విజయవాడ: 8వ డివిజన్లో టీడీపీ కార్యకర్తపై దాడి అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి భర్త దాడి చేశాడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త అడ్డుకున్నారు. Time: 9:21 AM సంతృప్తికరంగా భద్రతా ఏర్పాట్లు: ఎస్ఈసీ విజయవాడ: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ పిలుపునిచ్చారు. Time: 9:12 AM ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్ విజయవాడ: తూర్పు నియోజకవర్గం పటమట లంక కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి దంపతులు, గుంటూరు హిందూ కాలేజీలో ఎమ్మెల్యే మద్దాల గిరి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: 8:40 AM పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్ఈసీ విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎస్ఈసీ పరిశీలించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ విజ్ణప్తి చేశారు. ఓటు వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మను ఆయన అభినందించారు. మీ లాంటి వారే సమాజానికి స్ఫూర్తి అని ఎస్ఈసీ అన్నారు. Time: 8:08 AM ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం: మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు.. Time: 7:55 AM తిరుపతిలో టీడీపీ ఏజెంట్ ఓవరాక్షన్ తిరుపతి: తిరుపతి 50వ డివిజన్లో సైకిల్ గుర్తులు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చిన టీడీపీ ఏజెంట్ ధనరాజ్ ఓవరాక్షన్ చేశారు. ధనరాజ్‌ను గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకిల్ గుర్తుల షర్టు వేసుకొచ్చిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. Time: 7:34 AM ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం: అనంతపురం: మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం: కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్ బూత్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Time: 7:23 AM ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Time: 7:05 AM 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వైఎస్సార్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాకో నోడల్ అధికారి పర్యవేక్షణ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఓ నోడల్ అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించింది. ఓటర్ల ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. సకాలంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాల జారీని పూర్తి చేసింది. పోలింగ్ నిర్వహణకు అవసమైన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి మంగళవారం పంపిణీ చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంది. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో 4,788 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిలో 12 నరగపాలక సంస్థల పరిధిలో 2,468 (1,235 సున్నితమైనవి, 1,233 అత్యంత సున్నితమైనవి) ఉన్నాయి. 71 పురపాలక సంఘాలు /నగరపాలక సంస్థల పరిధిలో 2,320 (సున్నితమైనవి 1,151, అత్యంత సున్నితమైనవి 1,169) ఉన్నట్టు గుర్తించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు. సునిశిత పరిశీలనలకు మైక్రో అబ్జర్వర్లను నియమించడంతోపాటు పోలింగ్ ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయనున్నారు. పట్టణ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ కోరింది. పోలింగ్ నిర్వహణకు రూ.30 కోట్లు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 48,723 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. వారికి పారితోషికం, ఇతర వ్యయం కోసం రూ.30 కోట్లు విడుదల చేసింది. జోనల్ అధికారులు, రూట్ అధికారులు, సెక్టోరల్ అధికారులు ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,500, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లకు రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తారు. పోలింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లకు రోజుకు రూ.250, ఆఫీసు సబార్డినేట్లకు రోజుకు రూ.150, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం, అల్పాహారం నిమిత్తం ఒక్కొక్కరికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్ధానిక ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట
-
తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్
-
ముగిసిన మున్సిపల్ పోలింగ్
సాక్షి, తెలంగాణ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. 5 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. అత్యధికంగా ఆదిభట్లలో అత్యల్పంగా నిజాంపేటలో పోలింగ్ నమోదు. ఈనెల 25న ఎన్నికల లెక్కింపుజరగనుంది.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీ సమేతంగా వచ్చి 22 వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు నుండి ఎంపీడీఓ కార్యాలయ పోలింగ్ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద చనిపోయిన వ్యక్తి ఓటు వేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ. చోటుచేసుకుంది. ఇల్లందులోనిమెయిన్ రోడ్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతులో డబ్బులు పంపిణీ చేస్తున్న 9వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్ధిని స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు అప్పగించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస పార్టీ 5వ డివిజన్ అభ్యర్థి మురుగేష్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయించాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒకటవ వార్డు లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లో 7వ డివిజన్ 24 25 26 27 భూతులలో రెండో ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మున్సిపాలిటీ ఎన్నికలలో దొంగ ఓట్లకు పాల్పడుతున్న ముఠాను నార్సింగి పోలీసులు. అరెస్ట్ చేశారు. డబ్బులు తీసుకొని దొంగ ఓట్ల పాల్పడుతున్న పురుషులతో పాటు మహిళలు ఉండడం గమనార్హం. 12 మహిళలు.8.పురుషులను అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట- 73.7 శాతం ఓట్లు నమోదు, హుజూర్ నగర్ - 73.97 శాతం నమోదు, దుండిగల్ మున్సిపాలిటీ- 60.74 శాతం పోలింగ్ నమోదు, కొంపల్లి మున్సిపాలిటీ - 59.09 శాతం పోలింగ్ నమోదు.డోర్నకల్ మున్సిపాలిటీ - 72.6 శాతం పోలింగ్ నమోదు, వర్ధన్నపేట మున్సిపాలిటీ- 80.04పోలింగ్ శాతం నమోదు, హుజురాబాద్ -75.02 శాతం నమోదు, నర్సంపేట -75.28 శాతం నమోదు, హుస్నాబాద్ - 77.86 శాతం నమోదు, కొత్తపల్లి -71.68 శాతం నమోదు,మెట్పల్లి -63.43 శాతం నమోదు,భీంగల్ - 67.24 శాతం నమోదు, తిరుమలగిరి -82.45 శాతం నమోదు, కోరుట్ల - 64.49 శాతం నమోదు, చౌటుప్పల్-85శాతం నమోదు, అమరచింత- 74.47, పరిగి- 64.83 శాతం నమోదు,, చొప్పదండి- 71.37 శాతం నమోదు, మెదక్ - 74.16,శాతం నమోదు, ధర్మపురి- 71.70 శాతం నమోదు, మోత్కూరు -81.19 శాతం నమోదు, జమ్మికుంట- 71.98శాతం నమోదు, మధిర - 72.14 శాతం నమోదు, తుక్కుగూడ మున్సిపాలిటీ- 74.21 పోలింగ్ నమోదు, ఆదిబట్ల మున్సిపాలిటీ- 85.5 శాతం పోలింగ్ నమోదు, కామారెడ్డి - 61.30 శాతం నమోదు, బాన్సువాడ - 71.65 శాతం నమోదు, ఎల్లారెడ్డి - 74.02 శాతం నమోదు. ఇల్లందులో పోలింగ్ బూత్ లో డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థిని పట్టించుకోకపోవడం పట్ల ఎన్డీ నేతల ఆందోళన తుంకుంట- 61.89 శాతం ఓటింగ్ నమోదు, సుల్తానాబాద్- 77.1శాతం పోలింగ్, తొర్రూరు మున్సిపాలిటీ- 65.54 శాతం పోలింగ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ -71.79 శాతం నమోదు, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్- 55.26 శాతం నమోదు, జలపల్లి - 42 శాతం నమోదు, శంషాబాద్- 61 శాతం నమోదు, కోదాడ -72.41 శాతం నమోదు, జనగామ -69.57 శాతం నమోదు,అమీన్ పూర్ -56.89 శాతం నమోదు, శంకర్ పల్లి -73.17 శాతం నమోదు, జగిత్యాల -58.43 శాతం నమోదు, లక్సెట్టిపేట -72.47 శాతం నమోదు, చెన్నూరు- 69.35 శాతం నమోదు, క్యాతనపల్లి -68.15 శాతం నమోదు, మక్తల్- 65.74 శాతం నమోదు, యాదగిరిగుట్ట- 83.19 శాతం నమోదు,పరకాల మున్సిపాలిటీ-74.97 శాతం నమోదు, జమ్మికుంట మున్సిపాలిటీ - 71.98 శాతం నమోదు, సిరిసిల్ల మున్సిపాలిటీ-68.69 శాతం నమోదు, వేములవాడ మున్సిపాలిటీ - 74.65 శాతం నమోదు, రామగుండం కార్పొరేషన్ - 57.63 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ -68.54 శాతం నమోదు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ- 77.21 శాతం, మంథని మున్సిపాలిటీ - 74.86 శాతం నమోదు, కోరుట్ల మున్సిపాలిటీ- 64.49 శాతం నమోదు, రాయికల్ మున్సిపాలిటీ- 60.47 శాతం నమోదు,సత్తుపల్లి మున్సిపాలిటీ- 71.82 శాతం, మెదక్ , 74 ,16 తూప్రాన్ -75 ,64 శాతం నమోదు, రామయంపేట్- 80.5 శాతం నమోదు, నర్సాపూర్ -61.63 శాతం నమోదు,సంగారెడ్డి -67.02 శాతం నమోదు, ఆందోలు -76 .7 శాతం నమోదు, నారాయణ్ ఖేడ్ - 68 .8 శాతం నమోదు, సదాశివపేట - 75 -58 శాతం నమోదు, ఐడిఏ బొల్లారం- 60.,4 శాతం నమోదు, తెల్లపూర్ -74 .02 శాతం నమోదు, అమీన్ పూర్ -56.9 శాతం నమోదు, హుస్నాబాద్ -77.86 శాతం నమోదు, గజ్వెల్ 74.21 శాతం నమోదు, దుబ్బాక -76.3 శాతం నమోదు, చేర్యాల -74.04 శాతం నమోదు. పెద్దపల్లిలోని.రామగుండం కార్పొరేషన్ హనుమాన్ నగర్ లో రూ. 76,000 ల విలువచేసే 245 మద్యం బాటిల్ లు, 36,300 ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. పోలింగ్ అప్డేట్స్ ► పెద్దపల్లి బండారీ కుంటలో పోలీసుల తీరుపై రోడ్ పై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. ► సిరిసిల్ల 18వ వార్డులో స్వతంత్య్ర అభ్యర్థికి, టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య గొడవలు రావడంతో పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ►మంచిర్యాల 14వ వార్టులో ఇద్దరు నకిలీ ఓటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ 5000 స్వాధీనం చేసుకున్నారు. గంటల వరకు తెలంగాణ లోని 120 మున్సిపాలిటీ లు, 9 కార్పొరేషన్ల లో 67.46 శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ జిల్లాలో 3 గంటల వరకు 51.86 పోలింగ్ నమోదు ► రంగారెడ్డి జిల్లాలో 3 గంటల వరకు 55.1 శాతం పోలింగ్ ► కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 26 వార్డ్ లోని 63 64 పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత ► బోధన్ 32వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి మీర్ ఇల్యాజ్ అలీల మధ్య ఘర్షణ, టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ కు గాయాలు. చికిత్స కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలింపు.. మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే షకీల్. కేస్ నమోదు చేసిన పోలీసులు ► నిజామాబాద్‌లో పోలింగ్ సందర్భంగా పలు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్తం నెలకొనడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ► నిజామాబాద్ 41 వ డివిజన్ లో ఉద్రిక్తత. నెలకొంది. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని ఎంపీ ఆరవింద్ ఆరోపణలు చేశారు. ► పెద్ద అంబర్ పెట్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దొంగ ఓటర్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ది చేశారుతొర్రూరు ► మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శివలింగయ్య సందర్శించారు ► గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 58 వ పోలింగ్ బూత్ లో మాజీ మంత్రి డీకే అరుణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కొడంగల్ మున్సిపాలిటీ లోని మొదటి వార్డు లో మాజీ ఎమ్మెల్యే ఆర్.గుర్నాథ్ రెడ్డి. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మంచిర్యాల జిల్లాలో 1 గంట వరకు 53.18 శాతం పోలింగ్ నమోదు ► మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 5వ డివిజన్ అబ్యర్తి మురుగేష్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడని అడిగినందుకు మురుగేష్ కాంగ్రెస్ కార్యకర్తను చితక బాదాడు ►నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ►ఐటీ కంపెనీలు ఏవైతే సెలవు ప్రకటించని కంపెనీల పై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ►నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్‌ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం వీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు సరిగా లేవంటూ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఓటర్లను గుర్తించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ► పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 3వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల కార్యకర్తల్ని పోలీసులు తరిమికొట్టారు ►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 49.10 శాతం పోలింగ్ నమోదు ►ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 45.91 శాతం పోలింగ్ నమోదు ►నిజాంపేట్ 1 గంట వరకు 26.08 శాతం పోలింగ్ నమోదు ► హుజురాబాద్ 1 గంట వరకు 61. 12 శాతం పోలింగ్ ►రంగారెడ్డి జిల్లా లో ఒంటి గంట వరకు 52.13 పోలింగ్ శాతం ►పరకాల మున్సిపాలిటీలో మధ్యాహ్నం1గంట వరకు 60.64 పోలింగ్ శాతం నమోదు ►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికలలో మధ్యాహ్నం 1గంట వరకు 62.6 శాతం పోలింగ్ నమోదు ►తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 52.63శాతం పోలింగ్ నమోదు ►వర్ధన్నపేట మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 69.12శాతం పోలింగ్ నమోదు ►తుంకుంట మున్సిపాలిటీ లో మధ్యాహ్నం 1గంట వరకు 51.01శాతం పోలింగ్ నమోదు ►జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 60.65శాతం ఓట్లు పోలు అయ్యాయి మెట్‌పల్లిలోని రేగుంట గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ ►కోరుట్ల మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 52.55శాతం పోలింగ్ నమోదు ►సుల్తానాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్నం 1 గంట వరకు 63.03శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ జిల్లా ఫిర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 33 శాతం పోలింగ్ నమోదు ►జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 25 శాతం పోలింగ్ ►రంగారెడ్డి జిల్లా ఆది బట్ల మున్సిపాలిటీ లో 11గంటల వరకు 51.86శాతం పొలింగ్ నమోదు ►తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 38.53% పోలింగ్ నమోదు. ►రాజేంద్రనగర్: మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 10శాతం, బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో 14శాతం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 15శాతం 11గంటల వరకు పోలింగ్ జరిగింది. ►చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 11 గంటల వరకు 47.06శాతం ఓటింగ్ జరిగింది ►సూర్యాపేట జిల్లాలో 11 గంటల వరకు 37.09శాతం పోలింగ్ నమోదు ►జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీ 28.89శాతం, మెట్ పల్లి మున్సిపాలిటీ 32.05శాతం, కోరుట్ల మున్సిపాలిటీ 33.43శాతం, రాయికల్ మున్సిపాలిటీ 32.64శాతం, ధర్మపురి మున్సిపాలిటీ 36.93శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ 26 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ 38శాతం, సుల్తానాబాద్ మున్సిపాలిటీ 44శాతం, మంథని మున్సిపాలిటీ 47శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 40.60శాతం, హుజురాబాద్ మున్సిపాలిటీ 39.65శాతం, కొత్తపల్లి మున్సిపాలిటీ 40శాతం, చొప్పదండి మున్సిపాలిటీ 36.98శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.9 శాతం పోలింగ్ నమోదయింది ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 11 గంటల వరకు 39.86 శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఉదయం 11 గంటల వరకు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 28.36శాతం, నాగారం మున్సిపాలిటీలో 30.75శాతం పోలింగ్ నమోదు. ►రంగారెడ్డి జిల్లా భడాంగ్ పేట్ కార్పొరేషన్లో ఉదయం 11.30.గంటల వరకు 16.2శాతం పోలింగ్ నమోదు ►నిజాంపేట్‌లో 11 గంటల వరకు 17.69శాతం పోలింగ్.. ఉదయం నుండి మందకొడిగా సాగుతున్న పోలింగ్ ►తుక్కుగూడ మున్సిపాలిటీ 15 వార్డులో 11 గంటల వరకు 41.38 శాతం పోలింగ్ ►కామూరెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33.35శాతం, ఎల్లారెడ్డి 43.17శాతం, బాన్సువాడ 41.75శాతం పోలింగ్ నమోదు ►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదు ►రాజన్న సిరిసిల్లలో 11 గంటల వరకు 33.48 శాతం, వేములవాడలో 42 శాతం పోలింగ్ నమోదు ►జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.05శాతం పోలింగ్ నమోదు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 11 గంటల వరకు 42 శాతంగా పోలింగ్ నమోదు సిరిసిల్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్ ►మెట్పల్లిలో ఓటు వేసిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ►వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి… మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా 29 వ వార్డు లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ►నిజామాబాద్ కాకతీయ కళాశాలలోని గోదావరి క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ తన సతీమణి ప్రియాంకాతో కలిసి ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ►ఖమ్మం జిల్లా మధిరలోని 9వ వార్డులో తెలంగాణ సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. తన సతీమణి నందినితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేందుకు అధికార పార్టీ పోలీస్ వ్యవస్థను వాడుకుంటోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని.. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ►సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్‌లో మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ►మిర్యాలగూడలోని పోలింగ్ సెంటర్ 59 నందు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►నల్లగొండ పట్టణంలోని 33వ వార్డులో గల నల్లగొండ పబ్లిక్ స్కూల్లో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►సూర్యాపేట జిల్లా కోదాడలోని 14వ వార్డ్‌లో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉదయం 8 గంటల సమయంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ►వనపర్తి 23వ వార్డులోని బాయ్స్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్యా ప్రక్రియను బలోపేతం చేయాలని అన్నారు. కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. పోలింగ్‌కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. (మేమంటే మేమే) రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరుగుతు నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారింది. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ నెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది. (పుర పోరుకు పటిష్ట బందోబస్తు: డీజీపీ) -
ఎన్నికల బరిలో వైఎస్సార్ టీయూసీ
జీవీఎంసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర సంఘంగా బరిలోకి దిగిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌పై ఏఐటీయూసీ అనుబంధ సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించి గుర్తింపు యూనియన్‌గా అవతరించింది. దీని కాలపరిమితి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలంటూ వివిధ సంఘాలు కోరుతున్నాయి. తొలిసారిగా బరిలో వైఎస్సార్ టీయూసీ ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బరిలోకి దిగుతోంది. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థగా పోటీలో నిలుస్తోంది. వైఎస్సార్టీయూసీతో పాటు జీవీఎంసీ పరిధిలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ఉన్నాయి. ఏఐటీయూసీతో విబేధాలు రావడంతో ప్రస్తుత గుర్తింపు యూనియన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఓటు హక్కు కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పర్మినెంట్, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జీవీఎంసీకి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. జీవీఎంసీలోని శానిటరీ వర్కర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ వరకూ వివిధ కేడర్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 3,238 మంది ఓటర్లుండగా ఈసారి ఎన్నికలు నెలాఖరులోగా జరిగితే 3,400 మంది ఓటర్లుంటారు. ఒక నెల ఆలస్యమైతే ఓటర్ల సంఖ్య తగ్గనుంది. జూన్ నెలలో 120 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఏ కార్పొరేషన్లో లేని విధంగా.. రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోనూ గుర్తింపు యూనియన్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. కేవలం జీవీఎంసీలో మాత్రమే ఈ తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 2002లో తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 2004లో టీఎన్టీయూసీ, 2007లో ఏఐటీయూసీ, 2010లో స్వతంత్ర యూనియన్ వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2012లో ఏఐటీయూసీ, 2014లో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2017లో ఏఐటీయూసీ గెలుపొందాయి. ఈ ఏడాది వైఎస్సార్టీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమా యూనియన్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది బూత్‌లు ఏర్పాటు మొత్తంగా ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ జరగనున్న ఈ ఎన్నికల కోసం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరు బూత్‌లు, గాజువాక, మధురవాడ, అనకాపల్లిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కమిషనర్ సైతం కార్మిక శాఖతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతాయని ప్రకటించడంతో ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు తొలిసారిగా కార్పొరేషన్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోటీ చేస్తోంది. అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా అవతరించి కార్పొరేషన్ పై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరగా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ బలోపేతానికి ఇప్పటికే పావులు కదుపుతున్నాం. – వీవీ వామనరావు, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బారులు దీరిన ఓటర్లు
సాక్షి, కర్నూలు/సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాలుగు పురపాలక సంఘాలు, మరో నాలుగు నగర పంచాయతీలో ఉదయం నుంచే ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ప్రభావంతో పోలింగ్ మందకొడిగా సాగింది. అయితే సాయంత్రానికి వేగం పుంజుకొని జిల్లా వ్యాప్తంగా 71.09 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 219 వార్డులకు ఎన్నికలు జరగగా.. మహిళలు, యువత అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొరాయించిన ఈవీఎంలు.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఒక గంట ఆలస్యమైంది. ఉదయం 10 గంటల వరకు 25 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. క్రమంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచి విపరీతంగా ఎండవేడిమి ఉన్నా ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డుస్థాయిలో గూడూరు నగర పంచాయతీలో 61.20 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య ఓటర్లు భారీగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 60 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఊపిరిపీల్చుకున్న జిల్లా యంత్రాంగం.. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గత వారం రోజులుగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి మునిసిపల్ ఎన్నికలపై ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సజావుగా నిర్వహించేందుకు కృషి చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అందుబాటులో ఉన్న సిబ్బందితో పాటు పారమిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. -
పోలింగ్ ప్రశాంతం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్ సమస్య ఎక్కడా తలెత్తలేదన్నారు. అయితే పోలింగ్ 80 శాతం ఆశించగా.. 71.09 శాతానికే పరిమితమైందన్నారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈ శాతం కాస్త మెరుగేనన్నారు. ఇటీవల నగర పంచాయతీలుగా మారిన గూడూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరులో పోలింగ్ సంతృప్తికరంగా ఉందన్నారు. పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం తదితర సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించామన్నారు. 225 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటరుగా నమోదు కావడమే కాదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైనత్యం తీసుకొస్తామని తెలిపారు. ఈ విషయమై కళాజాతలతో అవగాహన కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు