సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు.
జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన సర్పంచ్, వార్డుల స్థానాలు, గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు
పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే పట్టం
Published Mon, Nov 15 2021 4:10 AM | Last Updated on Mon, Nov 15 2021 7:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment