sarpanch elections
-
TS: ముగిసిన సర్పంచ్ల పదవీకాలం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగునుంది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. సర్పంచ్ల పదవీకాలంలో ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు! ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో,… pic.twitter.com/UnepmmXIp3 — KTR (@KTRBRS) February 1, 2024 -
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ.. మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీతో ఇప్పుడున్న సర్పంచ్ల పదవీకాలం పూర్తి కానుంది. ఈ క్రమంలో.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై గ్రామ కార్యదర్శుల్ని వివరాలు అడిగి తీసుకున్నారు అధికారులు. రాబోయే వారం పదిరోజుల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్..
చండీగఢ్: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఎలాంటి హామీలనైనా ప్రకటించేందుకు వెనుకాడరు. వాటి సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వాగ్దానాలు చేస్తుంటారు. హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్‌సాఢ్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెబుతూ అతను ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్గా మారింది. ఆ హమీలను చూసి కొందరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రులకు కూడా సాధ్యం కాని ఈ హామీలను చూసి కొందరు నోరెళ్లబెడుతున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్ పోర్టులు, మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. అబ్బో ఇలా చాలా హామీలనే ఇస్తున్నాడు. జయకరణ్ ఇచ్చిన మరో హామీ చూసి కొందరికి గుండె ఆగినంత పని అయింది. తాను సర్పంచ్‌గా గెలిస్తే సిర్‌సాఢ్ గ్రామం నుంచి గోహాన్ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు. కొందరేమో అది బస్సు అయి ఉంటుందని, పొరపాటున హెలికాప్టర్ అని రాసి ఉంటారని చలోక్తులు విసిరారు. ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వాలనిపిస్తోందని నవ్వులు పూయించారు. Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc — Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022 చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులకే పట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన సర్పంచ్, వార్డుల స్థానాలు, గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు -
Andhra Pradesh: ఆ ఊళ్లన్నీ ఏకతాటిపై..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఎవరెన్ని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ఊళ్లో వారి పప్పులు ఉడకలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వివిధ రూపాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లో తేటతెల్లమైంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొ త్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో అత్యధికం రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్ధం చేసింది. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. -
ఆమె ఎంట్రీతో పంచాయతీ ఎన్నికలకు మరింత అందం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు కాస్త ఆసక్తిగా మారాయి. ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా డెవలప్మెంట్ బ్లాక్ పంచాయతీ పోరులో భాగంగా ఆ గ్రామ 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు అందం తోడైంది. తన తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి రానుంది. ఈ ఎన్నికల్లో బ్లాక్‌లో 26 వార్డు స్థానాన్ని మహిళకు కేటాయించగా, తండ్రి జితేంద్ర సింగ్ తన కుతూరును ఎన్నికల బరిలోకి దించాడు. ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి భాజపా అభ్యర్థి షాలినీ సింగ్‌తో పోటీ పడనున్నారు. కాగా, బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామానికి చెందిన దీక్ష సింగ్ 2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అంతేకాకుంగా పలు ప్రైవేటు ఆల్బమ్స్‌తో పాటు పలు ప్రకటనల్లో కూడా కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ‘రబ్బా మెహర్ కారి’ పాటలో తలుక్కున మెరిసింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జాన్‌పూర్‌లో ఏప్రిల్ 15న పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికల రిజర్వేషన్ మహిళకు రావడంతో... పెళ్లి! -
ఎన్నికల రిజర్వేషన్ మహిళకు రావడంతో... పెళ్లి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మహిళకు రావడంతో కచ్చితంగా గ్రామంలో గెలవాలనే కోరికతో 45 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. దీంతో అతని భార్యను పోటీలోనికి దింపుతున్నాడు. ఈ సమయంలో పెళ్లిలకు మంచి ముహుర్తాలు లేనప్పటికీ మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే... బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) గత కొన్ని సంవత్సరాలుగా వారి గ్రామంలో సామాజిక సేవను చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు. గ్రామ అభివృద్ధికి ఎంతగానో పాటు పడుతున్న హథీ సింగ్ ఈ ఏడాది జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే సరికి రిజర్వేషన్ రూపంలో అతనికి ఆటంకం ఎదురైంది. ఆ గ్రామానికి సర్పంచ్‌గా మహిళను రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా హథీ సింగ్ మాట్లాడుతూ.. తన గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: 'పవన్‌కల్యాణ్ బాటలో'.. రెండో పెళ్లిపై నాగబాబు రియాక్షన్ -
హెలికాప్టర్లో వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సర్పంచ్
మహారాష్ట్ర: ఎన్నికల నామినేషన్ ల మొదలు గెలిచే వరకు ప్రతి ఒక్కరు ప్రజలను ఆకర్షించడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. ఇక గెలిచాక వారి హంగామా ఒక రేంజిలో ఉంటుంది. టపాసులు పేల్చడం, డీజే పాటలకు నృత్యాలు చేయడం వంటివి మనం గమనిస్తుంటాం. అయితే మహారాష్ట్రలో మాత్రం అందరికి విభిన్నంగా గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేపట్టాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ తాలూకాలో ఉన్న అంబి-డుమాలా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తన ప్రమాణస్వీకారం చేపట్టడానికి ఏకంగా హెలికాప్టర్ లో వచ్చాడు. గత నెలలో జరిగిన ఎన్నికలలో పూణేలో ఉంటున్న పారిశ్రామికవేత్త జలీందర్ గగారే(50) అంబి-డుమాలా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతనితో పాటు తన 9 మంది సభ్యుల ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇటు వ్యాపార పనులు చూసుకుంటున్న జలీందర్ గగారే ప్రమాణ స్వీకారం దగ్గర పడటంతో పూణేలో ఉంటున్న తన ఇంటి నుంచి నేరుగా తన స్వగ్రామానికి ఏకంగా హెలికాప్టర్లోనే వచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. హెలికాప్టర్ నుంచి దిగాక గ్రామ ప్రజలు పూల మాలలతో స్వాగతం పలికారు. అతనికి స్థానికులు విజయ 'తిలకం' దిద్ది హెలిప్యాడ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి 12 ఎద్దుల బండ్ల మీద ఉరేగింపులో తీసుకువెళ్లారు. వ్యాపారం రీత్యా పూణేలో నివసిస్తున్న తన స్వగ్రామం, సన్నిహితులతో సంబంధాన్ని తెంచుకోలేదు అని పేర్కొన్నాడు. సొంత గ్రామం అభివృద్ధి కోసమే సర్పంచ్‌గా పోటీ చేశానని జలిందర్ తెలిపారు. -
రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు. -
నేడే తొలి సం'గ్రామం'
సాక్షి, అమరావతి: పార్టీ రహిత పంచాయతీ సమరంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికలలోనూ ‘నోటా’గుర్తు ప్రవేశపెట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో నోటా గుర్తుకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు గ్రామాల్లో చివరి నిమిషంలో వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పగించారని, అందుకనుగుణంగా అంతా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఆయా చోట్ల మొత్తం 7,506 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతుండగా 12,185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 160 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ద్వివేదీ తెలిపారు. వార్డు పదవులకు 43,601 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 3,594.. తొలివిడతలో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా 3,594 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, మరో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48,449 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తుండగా 18,608 పెద్దవి , 8,503 మధ్య రకం, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. పోలింగ్ విధులకు 83,736 మందిని, జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా 4,681 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంట సేపు అవకాశం.. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులను కేంద్రాల వారీగా సిద్ధం చేసినట్లు ద్వివేది తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కోసం పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ చివరిలో గంట (2.30 నుంచి 3.30 గంటల మధ్య) పాటు వారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా వసతుల కల్పనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపుపై 52,285 మందికి శిక్షణ.. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు 14,535 మంది సూపర్వైజర్లు, 37,750 ఇతర సిబ్బందికి కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాకొకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఓటర్లంతా హక్కు వినియోగించుకోవాలి.. ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టినట్లు ద్వివేదీ విలేకరులకు తెలిపారు. రెండు గ్రామాల్లో వార్డు ఎన్నికలు నిలిపివేత: గిరిజా శంకర్ బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డేగూడెంలో వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్లో ఉండే ఓటర్లను ధర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. టీడీపీ బరితెగింపుపై కమిషన్‌కు ఫిర్యాదు – ఎస్ఈసీ తక్షణమే స్పందించాలి: లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తక్షణమే స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కుంభా రవి, అంకమరెడ్డి నారాయణమూర్తి, మనోహర్‌రెడ్డి, ఎన్.పద్మజ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల సందర్భంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, డబ్బులను గ్రామాల్లో పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు మద్యం, డబ్బులను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉరవకొండ, పొన్నూరు, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం, గుంటూరు జిల్లా పొన్నూరు, చిత్తూరు జిల్లా కుప్పంలోని గ్రామాలలో టీడీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి దౌర్జన్యం చేసి గాయపరిచారన్నారు. 45 ఏళ్లుగా వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరులో పంచాయతీ ఎన్నికలలో పోటీ లేకుండా వారి బంధువులు, అనుచరులు బెదిరించి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం కామనూరు పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్సీపీ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరులు రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత బాలవరదరాజులరెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని చెప్పారు. తక్షణమే ఎస్ఈసీ జోక్యం చేసుకొని షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డితో పాటు ఆయన సోదరులను తక్షణమే ఆరెస్ట్ చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో అప్రజాస్వామికంగా ఏకగ్రీవం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొండాపూరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవిని టీడీపీ నాయకులు చౌలం మల్లిఖార్జున, డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి, ముత్యాలరెడ్డిలు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. దీంతో టీడీపీ బలపరిచిన త్రివేణి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికను రద్దు చేసి లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పాడేరు ఏజన్సీలో పోలింగ్ సమయం మార్చాలి.. విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్లో ఈనెల 17న తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరపాలని తొలుత ఎస్ఈసీ నిర్ణయించారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ప్రకటించారని, ఇది పర్వత ప్రాంతం కావడంతో ఓటర్లు కాలి నడకన కి.మీ దూరం ప్రయాణం చేసి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తొలుత ప్రకటించిన ప్రకారం పాత సమయాన్నే కొనసాగించాలని కోరారు. తొలి దశకు పటిష్ట బందోబస్తు తొలి విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పోలీస్ విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అలాగే సోమవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన పోలీసు బలగాలు గ్రామాల్లో తిరిగి.. ఓటు వేసేందుకు రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి తొలిదశ పోలింగ్ ముందు రోజు వరకు 87 కేసులు నమోదైతే.. ఈసారి 44 కేసులే నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి.. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది సరిహద్దుల్లో చెక్ పెడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. -
సర్పంచ్‌గా గెలిచి.. ఎమ్మెల్యేగా ఎదిగి
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ముగ్గురు నేతలు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. అందులో ఒకరు టీఎస్ శ్రీనివాసులురెడ్డి. ఆయన 1963కు ముందు సర్పంచ్‌గా పనిచేశారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనీ్టఆర్ ప్రభంజనంలో తంబళ్లపల్లె నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి 24,179 ఓట్లు సాధించారు. అలాగే బి.కొత్తకోట మండలం గట్టుకు చెందిన ఎ.నరసింగరావు 1950వ దశాబ్దంలో రెండుసార్లు సర్పంచుగా పనిచేశారు. తర్వాత 1962, 1967లో రెండుసార్లు మదనపల్లె ఎమ్మెల్యేగా గెలుపొందారు. తంబళ్లపల్లె మండలం రేణిమాకులపల్లెకు చెందిన ఆవుల మోహన్‌రెడ్డి 1972లో సర్పంచుగా విశేష సేవలందించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇందిరా కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత 1989లో మదనపల్లె కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
నేడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ సర్పంచి ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ జారీ కానుంది. మొత్తం 13,207 గ్రామ పంచాయతీల్లో 6,286 చోట్ల మొదటి విడతలో, 6,921 చోట్ల రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 17–19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో 6,921 గ్రామాలలో 17వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. 19–21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. -
ఓట్లు వేయలేదని.. ప్రతీకారం
సాక్షి, మరిపెడ రూరల్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఆరోపిస్తూ ఓ రైతు వ్యవసాయ పొలాలకు వెళ్లే డొంకదారిని జేసీబీతో తవ్వేసి దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేసిన ఘటన మండలంలోని ఎడ్జెర్ల శివారు గుర్పప్పలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..తండా నుంచి సుమారు 100 మంది రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో 12 సంవంత్సరాల క్రితం తండాలో పెద్దమనుషులు అందరూ మాట్లాడుకుని తల కొంత భూమి ఇస్తామని ముందుకు వచ్చి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడెం గ్రామం వరకు వెళ్లే విధంగా డొంకదారిని ఏర్పాటు చేసుకున్నారు. జేసీబీతో చదును చేసిన డొంకదారి ఈ రహదారిపై ఉన్న గుంతలను సైతం గ్రామ పంచాయతీ నిధులతో మట్టి పోయించి చదును చేసుకున్నారు. మరో సారి ఉపాధి హామీ పథకం ద్వారా మరోమారు గుంతలను పూడ్చుకున్నారు. పస్తుతం పీఆర్‌డబ్ల్యూ కింద తారురోడ్డు కూడా మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన బానోతు రామన్న ఓటమి పాలయ్యాడు. ఇది దృష్టిలో పెట్టుకొని డొంక దారి మధ్యలో రామన్న భూమిలో నుంచి ఉన్న దారిని జేసీబీ ద్వారా తవ్వి చదును చేయించాడు. దారికి అడ్డంగా కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఈ రహదారి గుండా పొలాలు వెళ్లే రైతులు బతిలాడినప్పటికీ దారి ఇవ్వనని తెగేసి చెప్పడంతో తండాలో గొడవ తారస్థాయికి చేరింది. దీనిపై రామన్నను వివరణ కోరగా ఈ భూమి తమ సొంతమని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాని తెలిపారు. అందుకు అనుగుణంగా చదును చేసుకున్నట్లు తెలిపారు. కోర్డు ద్వారా తెచ్చుకున్న స్టేను విలేకరులకు చూపించాడు. -
నాకు ఓటేయలేదు.. డబ్బులు తిరిగివ్వండి..!
సాక్షి, తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘‘నాకు ఓటేయలేదు.. డబ్బులు వెనక్కిఇవ్వండి’అంటూ ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో సదరు అభ్యర్థి పెద్ద మొత్తం ఖర్చు పెట్టాడు. తీరా పదవి చేజారిపోయేసరికి బేజారయ్యాడు. కొంత మంది గ్రామస్తులు మాత్రం అయ్యో పాపం అంటూ తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. పదవీ కాంక్షతో స్థాయికి మించి అప్పులు చేసి ఎందరో తమ కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని తెలిపేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది. -
చందాలు వేసుకుని సర్పంచ్‌గా గెలిపించి..
నాంపల్లి (మునుగోడు) : 29సంవత్సరాలుగా బోధనావృత్తిలో కొనసాగి రిటైర్డ్ అయిన ఆ ఉపాధ్యాయుడిని ఆ ఊరి ప్రజలు చందాలు వేసుకుని సర్పంచ్‌గా గెలించారు. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఈ సారి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందుకు తీర్మానాలు సైతం చేశారు. దీంతో 95శాతం మంది గ్రామస్తులు మునగాల సుధాకర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. కానీ కొందరు నామినేషన్ వేసిన కారణంగా గ్రామస్తులంతా ముందుకొచ్చి ఎలాగైనా సుధాకర్‌రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించుకోవాలని ఇంటికి తమకు తోసినంతా చందాలు వేశారు. మొత్తంగా రూ.లక్ష 7వేలు జమ చేశారు. వీటిలోనుంచే రూ.2వేలు నామినేషన్, రూ.3,700 పేపర్లు, వాల్ పోస్టర్లకు ఖర్చు చేశారు. గ్రామంలో 1,118 ఓట్లు ఉంటే అందులో 970 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుధాకర్‌రెడ్డి 880ఓట్లు సాధించారు. దాదాపు 800 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే ఈ గ్రామస్తులు మాత్రం ఓ మంచి వ్యక్తిని సర్పంచ్‌గా నిలబెట్టి తమ సొంతఖర్చుతో గెలి పించుకోవడం గొప్ప విశేషం. సుధాకర్‌రెడ్డి తండ్రి మునగాల రాంరెడ్డి ఉమ్మడి ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో 1956లో మొట్ట మొదటిగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యి 1978 వరకు సేవలందించారు. ఇప్పుడు ఆయన కొడుకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన గ్రామప్రజల రుణం తీర్చుకుంటా. గ్రామాభివృద్ధికి పాటుపడాను. గ్రామానికి బస్సు వచ్చేలా కృషి చేస్తా. గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. -
ఆ గ్రామానికి మెదటి సర్పంచ్‌గా..
కట్టంగూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలంలో 22 జీపీలకు నూతనంగా ఏర్పడిన రామచంద్రాపురం గ్రామం ఏకగ్రీవం అయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి మెదటి సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి సూరారపు ప్రియాంకగణేశ్ ఎన్నికకావడం పట్ల ఆ గ్రామ ప్రజలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈనెల 30న 22 జీపీలకు గాను 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 22 జీపీలకు 121 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేయగా 57 మంది ఉపసంహరించుకోవడంతో 64 మంది బరిలో ఉన్నారు. 206 వార్డులకు గాను 631 నామినేషన్లు వేయగా 158 మంది ఉపసంహరించుకోగా 473 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. రామచంద్రాపురం గ్రామంలో 8 వార్డులు సభ్యులు నందికొండ పార్వతమ్మ, రేకల చందన, సూరారపు మహేందర్, మహేశ్వరం మహేందర్, బొడ్డుపల్లి రేణుక, నీలం గణేశ్, అనంతుల సురేశ్, బోయపల్లి పద్మ, మల్లారం గ్రామంలో 5 వార్డులు, కట్టంగూర్ గ్రామంలో 13వ వార్డు సభ్యులు నిమ్మల యాదయ్య, గార్లబాయిగూడెం గ్రామంలో 6వ వార్డు, నల్లగుంటబోలు గ్రామంలో 6 వార్డులు చొప్పున మొత్తం 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బరిలో ఉన్న సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. -
ఇటు గెలిచిన ఆనందం.. అటు ఇంట్లో విషాదం
సాక్షి, ఏటూరునాగారం: ఓ వైపు గెలిచిన ఆనందం.. మరో వైపు కూతురి ఆత్మహత్య.. ఓ మాతృమూర్తికి ఎదురైన ఈ పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూర్జహాన్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఛార్మిల (చేను)ను అదే గ్రామానికి చెందిన షేక్ నయీమ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. పెద్దవెంకటాపురంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న నయీమ్‌కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ పడటంతో భూపాలపల్లికి వెళ్లాడు. సోమవారం ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా నూర్జాన్తోపాటు కుటుంబ సభ్యులంతా చిన్నబోయినపల్లి పాఠశాల వద్దే ఉన్నారు. ఇంటి వద్దే ఉన్న ఛార్మిల ఎవరూ లేనిది చూసి దూలానికి ఉరివేసుకుంది. వార్డు సభ్యురాలిగా గెలుపొందిన నూర్జాన్ కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించింది. మృతురాలి ఎడమ చేతిపై తన చావుకు ఎవరూ కారకులు కాదని రాసి ఉంది. ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మృతిచెందిన వార్డు అభ్యర్థి గెలుపు గార్ల: జ్వరంతో ఆదివారం మృతి చెందిన వార్డు అభ్యర్థి గెలుపొందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాజుతండాలో సోమవారం చోటుచేసుకుంది. 3వ వార్డు సభ్యుడు బానోత్ భాస్కర్ సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు గెలిపించి తమ సానుభూతిని చాటారు. ఎంటెక్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా కారేపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా భాస్కర్ పనిచేస్తున్నాడు. -
ఒక్క ఓటుతో విజయం
పోటీ ఏదైనా విజయం సాధించాలనుకోవడం మానవ నైజం. అయితే, ఊహించినట్టుగా పోరు ఏకపక్షంగా సాగి ఓ వ్యక్తిని విజయం వరించిందంటే పెద్దగా విశేషమేముంటుంది. కానీ, చివరివరకు పోరాడి ఒక్క మార్కు/పరుగు/ఓటుతో గెలుపు బావుటా ఎగురవేస్తే ఆ కిక్కే వేరు. ఉత్కంఠ రేపే ఇలాంటి ఫలితాలు అటు జనాలకు, ఇటు పోటీలో ఉన్నవారికి చిరకాలం గుర్తుండిపోతాయి. ఇక ఓడిన వారికి అతి స్వల్ప తేడాతో పరాజయం పాలవడం జీవితకాలం గుర్తుండిపోతుంది. తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల అలాంటి ఫలితాలే వచ్చాయి. సిద్దిపేట జిల్లా అల్మాజీపూర్, నర్మేట గ్రామాల్లో ఒక్క ఓటు తేడాతో వంగ మంజుల, అజీద్ సర్పంచ్‌లుగా గెలుపొందారు. సాక్షి, మిరుదొడ్డి /నంగునూరు (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్మాజీపూర్‌లో సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో వంగ మంజుల తన ప్రత్యర్థి బండారి పద్మపై ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్మాజీపూర్ కొత్తగా పంచాయతీ హోదా పొందిన గ్రామం కావడం విశేషం. అలాగే నంగునూరు మండలం నర్మేట గ్రామంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి అజీద్ ఒక్క ఓటు తేడాతో సమీప ప్రత్యర్థి శనిగరం బాబుపై గెలుపొందారు. తొలిసారి వెలువడిన ఫలితంలో 3 ఓట్ల తేడా రాగా.. రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్‌లో అజీద్ ఒక్క ఓటుతో విజయం సాధించారు. -
సర్పంచ్‌గా పోటీ చేయాలని వేధింపులు.. వివాహిత సూసైడ్..!
సాక్షి, దిండి : సర్పంచ్ ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చు రేపాయి. భార్యను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఓ భర్త వేధింపులకు గురిచేశాడు. దాంతోపాటు పుట్టింటి నుంచి రూ.5 లక్షల తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని దిండి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్య, రాధ (22) దంపతులు. వీరికి 8 నెలల కిందట వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న బైక్ కోసం లింగమయ్య రాధను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో ఎర్రగుంటపల్లి సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తన భార్యను పోటీచేయించడానికి లింగమయ్య ఆసక్తి చూపించాడు. సర్పంచ్‌గా పోటీ చేయాలని రాధను ఒత్తిడి చేశాడు. పుట్టింటికి వెళ్లి 5 లక్షల రూపాయలు తేవాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు భైరాపురం మీనయ్య, శారదలకు తన గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకపోయింది. బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు పంతం.. వ్యక్తి మృతి
సాక్షి, తుర్కపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల పోటీ విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధి పెద్ద తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్ద తండా కింద రెండు వార్డులు ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా రవినాయక్ (28) ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే వార్డుపై రవినాయక్ దాయాదులైన శ్రీనివాస్ నాయక్, నరేశ్‌లు ఆసక్తి కనబరిచారు. దీంతో నరేశ్ తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో వార్డు సభ్యుడిగా పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండు కుటుంబాల ఆసక్తి ఒకే వార్డుపై పడటంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మణ్ నాయక్, నరేశ్‌లు వారి కుటుంబ సభ్యులతో కలసి రవినాయక్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రవినాయక్ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్ తలపై గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాడు. కాసేపటికి నరేశ్ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో అతడు కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని కుటుంబ సభ్యులు, బంధువులు కలసి మాదాపూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
కసరత్తు పూర్తి
పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లు శనివారం ప్రకటించనున్నారు. రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్ ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం డీపీఓ, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ, వార్డు రిజర్వేషన్ల కోటాను ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన మండల యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలవారీగా ఖరారు చేసిన రిజర్వేషన్ల కోటాను మండలాలవారీగా కలెక్టర్ ముగ్గురు ఆర్డీఓలకు అందజేశారు. సాక్షి, మెదక్ : మండల కోటాను అందుకున్న ఆర్డీఓలు శుక్రవారం మధ్యాహ్నం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీల్లో 4086 వార్డులు ఉన్నాయి. మెదక్ ఆర్డీఓ వీరబ్రహ్మచారి డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలతో సమావేశమై వార్డుల రిజర్వేషన్లను చేపట్టారు. రిజర్వేషన్ కోటాను అనుసరించి వార్డు రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే 2011 జనాభా ఆధారంగా మెదక్ డివిజన్ పరి«ధిలోని పది మండలాల్లో ఉన్న 231 పంచాయతీల సర్పంచ్ల రిజర్వేషన్లను పూర్తి చేశారు. రాత్రి 9 గంటల వరకు సర్పంచ్ల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగింది. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని 140 పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓ వెంకటేశ్వర్లు చేపట్టారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు రిజర్వేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. తూప్రాన్‌డివిజన్ పరిధిలోని 98 పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ఆర్డీఓ శ్యాం ప్రకాశ్ పర్యవేక్షణలో అధికారులు చేపట్టారు. వార్డు, పంచాయతీ రిజర్వేషన్లు పూర్తి చేసిన వెంటనే మండలాల వారిగా వివరాలను ఆర్డీఓలు కలెక్టర్‌కు అందజేశారు. అలాగే ఎంపీడీఓలు రిజర్వేషన్ జాబితాలను డీపీఓలకు పంపారు. ఆర్డీఓల నుంచి వచ్చిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్ ధర్మారెడ్డి శనివారం పరిశీలించనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్డీఓలు రిజర్వేషన్లు చేపట్టింది, లేనిదీ పరిశీలించి ఆ తర్వాత రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించనున్నారు. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆసక్తి ఉన్న నాయకులు రిజర్వేషన్ల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై కొంత మందినాయకులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
పంచాయతీ పోలింగ్
జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచా యతీ ఎన్నికలు జరపాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఎన్నికల్లోనూ నోటా ఏర్పాటు చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచాయతీ పోలింగ్ జరపాలని భావిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఒక్కో రోజు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఈ నోటా అమలులో లేదు. ఈసారి కొత్త నిబంధనను ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బదిలీలతో... ఈ ఏడాది మే, జూన్ మాసంలోనే జిల్లా అధికార యంత్రాంగం ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే రెండు పర్యాయాలు శిక్షణ కూడా ఇచ్చారు. ఈలోగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చాలా మంది అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. స్థాయిని బట్టి ఇతర జిల్లాలకు, మండలాలకు బదిలీపై వెళ్లిపోయారు. వారి స్థానంలో ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర మండలాలకు చెందిన అధికారులు బదిలీపై జిల్లాకు వచ్చారు. దీంతో బదిలీపై వచ్చిన అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఈసీ ఆరా.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల తరలింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి ఏర్పాట్లు గతంలోనే పూర్తి చేశారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. తాజాగా ఈ ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయా అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి డీపీఓ కృష్ణమూరి ద్వారా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. రెండు స్థాయిల్లో రిటర్నింగ్ అధికారులు.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్–1లో ఒకరు, స్టేజ్–2లో మరొకరు రిటర్నింగ్ అధికారులను నియమిస్తున్నారు. నాలుగు, ఐదు గ్రామ పంచాయతీలకు కలిపి స్టేజ్–1 రిటర్నింగ్ అధికారి ఉంటారు. ఆయా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం.. నామినేషన్లు స్వీకరణ.. పరిశీలన.. ఉపసంహరణ.. బరిలోఉండే అభ్యర్థుల తుది జాబితా.. గుర్తుల కేటాయింపు.. వంటి బాధ్యతలు స్టేజ్–1 అధికారులు నిర్వర్తిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫలితాల ప్రకటన వంటి అంశాలు స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పరిధిలో ఉంటాయి. ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నాము. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సుల రవాణ, పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది గుర్తింపు.. పోలింగ్ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. - అశోక్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి -
పంచాయితీ షురూ!
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల జాతర ముగియడంతో ఇక పంచాయతీ జాతరకు అధికార యంత్రాంగం సమయత్తం అవుతోంది. డిసెంబర్ చివరి వారం వరకు పంచాయతీ ఎన్నికలు జరుపేందుకు ప్రభుత్వం నుంచి స్థానిక పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ పాలకవర్గం గడువు గత జులైలో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల కనుసన్ననల్లో పాలన కొనసాగుతుంది. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించి గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపించాల్సిందిగా కోరారు. దీనికి అనుగుణంగా న్యాయస్థానం సైతం ఎన్నికలు జరిపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లెక్కింపులో అధికారులు బిజీగా ఉండగా ఎన్నికల కమిషన్ గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరిపించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. జిల్లాలో గతంలో 208 గ్రామపంచాయతీలు ఉండగా పెరిగిన లెక్కల ప్రకారం 263 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కొత్త గ్రామపంచాయతీలో పోటీ చేసేందుకు ఆయా గ్రామాలకు చెందిన కొత్త తరం నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందుకున్న జిల్లా పంచాయతీ అధికారులు బీసీ ఓటర్ల గుర్తింపులో లెక్కలు తేల్చేందుకు సిద్ధమయ్యాయి. గ్రామాల వారీగా బీసీ, ఎస్సీ ఓటర్లను తేల్చి ఆ తరువాత రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించనున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలోనే ఈ వ్యవహరాలు కొలిక్కి రానున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు పెద్దసంఖ్యలో పెరిగారు. గ్రామపంచాయతీ ప్రకారం తిరిగి ఓటర్లను విభజించి వార్డుల వారీగా గుర్తించే పనిలో ఉన్నారు. రిజర్వేషన్ లెక్కలు తేల్చిన తర్వాతే వార్డుల వారీగా రిజర్వేషన్లు, గ్రామాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ముసాయిదా జాబితా, 15న పంచాయతీల్లో ఓటర్ల తుదిజాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యంతరాలు గ్రామస్థాయిలో స్వీకరించనున్నారు. పట్టణాల్లో నివాసం.. పల్లెల్లో పెద్దరికం.. గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్న ఉన్నత వర్గాలకు చెందినవారు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ పల్లెల్లో అధికారం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం జరుగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్న వారిలో అగ్రవర్ణాలకు చెందిన వారు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ సర్పంచ్గిరీపై కన్నెశారు. అలాంటివారు తిరిగి గ్రామాల్లోనే ఓటరు జాబితాలో పేరు మార్పిడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక గ్రామాల్లో తమకు ప్రతికూలమైన వారిపేరు ఓటరు జాబితా నుంచి గతంలో తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా ఆన్లైన్లో భద్రపర్చడం ద్వారా ఎవ్వరికి వారు సొంతగా తమ పేరును ఓటరు లిస్టులో చూసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఓటర్లను తొలగించే కుట్రలకు అధికారులు తెరదింపినట్లు అయింది. ఇప్పటికే విందులు.. గత జూన్‌లో సర్పంచుల పదవీకాలం ముగిసిన వెంటనే సర్పంచు ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించడంతో సర్పంచ్ ఎన్నికల్లో పోలీచేసేందుకు సిద్ధపడిన పలువురు గ్రామస్తులను, చోటామోటా నాయకులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రూ.లక్ష నుంచి రూ2 లక్షల వరకు విందులకు ఖర్చు చేశారు. చివరికి రిజర్వేషన్ల ప్రక్రియ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో పెద్దఎత్తున నష్టపోయామంటూ పలువురు ఆశావాహులు ఆందోళన చెందారు. అయితే వాయిదాపడ్డ ఎన్నికలు తిరిగి జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల జోరు తుదివరకు చేరుకోకుండానే సర్పంచ్ ఎన్నికలు తెరపైకి రావడం మరోసారి గ్రామాల్లో జాతర వాతావరణం చోటుచేసుకుంటుంది. -
సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు షురూ
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది. సర్పంచ్ల ఎన్నికలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితాలను సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఆదేశాల జారీ చేసింది. మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా ఎన్నికల అధికారులకు పంపించింది. కామారెడ్డి కలెక్టర్ నుంచి ఈ మార్గదర్శకాలు జిల్లాలోని ఆయా మండýలాల ఎంపీడీవోలకు చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాను సెప్టెంబర్ 25న విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా గ్రామపంచాయతీల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. దీంతో పంచాయితీరాజ్‌శాఖ అధికారులు ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, సిబ్బందికి విధుల కేటాయింపు, పోలింగ్ అధికారుల ఎంపిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఇవీ మార్గదర్శకాలు... యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 25న విడుదలైన అసెంబ్లీ ఎన్ని కల ఓటరు జాబితాను అనుసరించి జీపీ ఓ టర్ల జాబితాను సిద్ధం చేయాలి. నవంబర్ మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ చివరికల్లా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఎంపిక చేయాలి. డిసెంబర్ మొదటి వారంలో వారికి శిక్షణ ఇవ్వాలి. ఎంపికలో గెజిటెడ్ స్థాయి అధికారులను గుర్తించాలి. ఎన్నికల వి«ధుల్లో భాగంగా పోలింగ్‌లో పాల్గొనే సిబ్బందిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలి. డిసెంబర్ రెండో వారానికల్లా వారికి ఆర్డర్లు అందజేయాలి. మూడు నెలల్లోగా ఎన్నికలు.. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఇప్పటికే మూడు నెలలు గడుస్తోంది. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే 60 శాతం రిజర్వేషన్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కొందరు కోర్టుకు వెళ్లారు. 60 శాతం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం జరుగుతుందనేది వారి వాదన. అంతేకాకుండా కులాలా వారీగా ఓటర్ల గణన పూర్తి చేయకుండానే ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం వీలు కాలేదు. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. అయితే, ప్రత్యేకాధికారుల పాలన సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు.. మూడు నెలల్లోగా గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 11న ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఎన్నికల కమిషన్ జీపీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. దీంతో సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఆశావహులు అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణ కష్టమే! జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతన జీపీల ఏర్పాటుకు ముందు 323 పంచాయతీలు ఉండగా, 214 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానీపేట్ జీపీ కలిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 12 వరకు పంచాయతీ ఎన్నికలకు సమయం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం సరిపోదు. కులాల వారీగా ఓటర్ల జాబితాలు ఇప్పటికి సిద్ధంగా లేవు. ప్రభుత్వం ఆదేశిస్తే కులాల వారీగా ఓటరు గణాంకాలను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. బీసీ ఓటర్ల గణన చేపట్టాలంటే చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థతో ముందుకు వెళ్లాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఓటర్ల లెక్కింపు చేయవచ్చు. కులాల వారీగా ఓటర్ల వివరాలు అందుబాటులోకి వచ్చాకే రిజర్వేషన్లను కేటాయించడానికి వీలవుతుంది. ఆయా కారణాలతో హైకోర్టు సూచించిన ప్రకారం జీపీ ఎన్నికలు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రణాళిక ప్రకారం పనులు.. అసెంబ్లీ ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని జీపీ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. జీపీ ఎన్నికలకు సంబంధించిన పనులపై కార్యాచరణ ప్రణాళిక విడుదలైంది. ఆయా మండలాల అధికారులకు యాక్షన్ ప్లాన్‌ను పంపించాం. ఉన్నతాధికారుల సూచన మేరకు పనులు చేపడుతున్నాం. – రాములు, డీపీవో, కామారెడ్డి -
ఇక ప్రత్యేక పాలనే?
నెల్లూరు(అర్బన్): గ్రామాల్లో ప్రజాప్రతినిధిలుగా ఓ వెలుగు వెలిగిన పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవుతుందని భయపడింది. ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐదేళ్లు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హోదా ఉన్నవారంతా మాజీలు కానున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రత్యేక అధికారుల పాలన ఉండటంతో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్లో సైతం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగిస్తారని కొంతమంది ఆశావహులైన సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. ఇతర జిల్లాలో ఓ సర్పంచ్ మరొక ముందడుగు వేసి ఏకంగా కోర్టుకెళ్లాడు. ఎన్నికలు జరిగే వరకు తమను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని కోరాడు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలన వైపే మొగ్గు చూపింది. విధివిధానాలు సిద్ధం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు సిద్ధం చేసింది. ఉన్న నిధుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాలకు 30శాతం, నీటిసరఫరా కోసం 15 శాతం, పారిశుద్ధ్య నిర్వహణకు 15 శాతం, వీధి దీపాల నిర్వహణకు 15శాతం, అంతర్గత రోడ్లు, మరమ్మతుల కోసం 20 శాతం, సమావేశాలు, మిసిలేనియస్ ఖర్చుల కోసం ఐదు శాతం నిధులు వినియోగించుకోవాలి. ప్రత్యేక అధికారులు నిర్వర్తించాల్సిన విధులు తాగునీటి సరఫరాలో పరిశుభ్రత, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయింపు, ట్రేడ్ లైసెన్స్‌లు, దుకాణాలు, వాణిజ్య–వ్యాపార అనుమతులు జారీ చేయడం, గ్రామ రికార్డులు అప్‌గ్రేడ్ చేయడం, తాగునీటి పైపుల లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలకు పన్నులు వసూళ్లు చేయడం, ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం తదితర విధులను అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే తాగునీటిలో క్లోరినేషన్, తడిచెత్త–పొడిచెత్తను నిర్వహించడం, ప్రభుత్వ స్థలాలు, బడుల్లో మొక్కలు నాటడం, రోడ్లును ఊడ్చడం, కాల్వలను క్లీన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. నిధులు వాడు కోవచ్చు పంచాయతీకి సంబంధించిన వేతనాలు, ఖర్చుల కోసం ని«ధులు విడుదల చేసే అ««ధికారాన్ని ప్రత్యేక అధికారులకు కల్పించారు. ఏదైనా సంస్థలకు అప్పు ఉంటే చెల్లించవచ్చు. ఉత్సవాల నిర్వహణకు, ప్రజల వినోదం, గ్రామంలోని పేదలను ఆదుకునేందుకు వీలు కల్పించారు. ∙జరిమానా విధించవచ్చు ∙గ్రామాల్లో ఖాళీ, పబ్లిక్ స్థలాలను రోడ్లను ఆక్రమిస్తే జరిమానా విధించవచ్చు. ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ 90శాతం గ్రామాలు కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడి అభివృద్ధి పనులు సాగిస్తున్నాయి. ఎన్నికలు జరపనందున న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం 14తో పాటు రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా ఆపేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనందున కేంద్రం ఇలాగే నిధులు ఆపేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయిన సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ దఫా టీడీపీ ప్రభుత్వంలో అవే ఇబ్బందులు తలెత్తనున్నాయి. పల్లె ప్రగతికి ఆటంకం ప్రత్యేక అధికారుల (స్పెషల్‌ఆఫీసర్లు) పాలన రానుండటంతో పల్లె ప్రగతికి ఆటంకం ఏర్పడనుంది. నెల్లూరు జిల్లాలో 940 పంచాయతీల్లో 22 లక్షల మంది నివసిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిదీపాలు వెలగకపోయినా, ఇతరత్రా గ్రామ తక్షణ అవసరాలకు సర్పంచ్‌లు మొదట తమ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టేవారు. తరువాత నిదానంగా బిల్లులు పెట్టుకుని డ్రా చేసేవారు. ప్రత్యేక పాలనలో ఆస్వేచ్ఛ ఉండదు. నిబంధనల ప్రకారం జరగాల్సిందే. కార్యదర్శి, ప్రత్యేకాధికారి సంయుక్త సంతకాలతో ఫైళ్లు నడవాలి. ఈ తంతు జరగాలంటే కొంత అలస్యం తప్పదు. ప్రజలు ఇబ్బందులు పాలు కాక తప్పదు. -
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం వెనుకంజ
బ్రహ్మంగారిమఠం(వైఎస్సార్ కడప): సర్పంచ్ల పదవీకాలం రేపటితో ముగియనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ముందుకు పోలేక టీడీపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం బి. మఠం మండలంలోని 11 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు ఐదేళ్లపాటు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు అందుతాయన్నారు. ఓటమి భయంతో సీఎం ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. అలాంటప్పుడు ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని లేఖ కూడా రాసినట్లు చెప్పారు. సర్పంచ్ల విధానాలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సోమిరెడ్డిపల్లె సర్పంచ్ శ్రీదేవమ్మ, ముడమాల సర్పంచ్ పెంచలమ్మ, పలుగురాళ్లపల్లె సర్పంచ్ పుట్టా పోలమ్మ, చౌదరివారిపల్లె సర్పంచ్ చెవుల వెంకటమ్మ, తోట్లపల్లె సర్పంచ్ వాణి, రేకలకుంట సర్పంచి జోత్స్న, మల్లేపల్లె సర్పంచ్ నాగిపోగు పెంచలయ్య, నాగిశెట్టిపల్లె సర్పంచ్ నాగిపోగు ఏసురత్నం, దిరశవంచ సర్పంచ్ సుబ్బారెడ్డి, గోడ్లవీడు సర్పంచ్ జయరామిరెడ్డిల ఘనంగా ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, ఎంపీపీ డి.చక్రవర్తి, బి.మఠం సింగిల్ విండో అధ్యక్షులు సి.వీరనారా యణరెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ రామచంద్రారెడ్డి, పీఆర్ఏఈ సుబ్రమణ్యం, ఎంపీటీసీలు పసుపులేటి రామయ్య, బాలయ్య, గురువయ్య, బిజివేముల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
పదేళ్లకోసారి రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుందనే ఊగిసలాటకు, చర్చోపచర్చలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీలతో ప్రమేయం లేకుండా, అంటే పార్టీ గుర్తులరహితంగా జరగనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన పంచాయతీరాజ్ బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పంచాయతీలుగా తండాలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ బిల్లు ద్వారా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య నినాదం కొత్త చట్టంతో ఆచరణ రూపు దాలుస్తుందని భావిస్తున్నామన్నారు. బిల్లులో పేర్కొన్న కీలకాంశాలు... పాలనలో సర్పంచే కీలకం గ్రామ పాలనలో సర్పంచ్ కీలకం కానున్నారు. రిజర్వేషన్ల విధానంలో మార్పులు తెచ్చారు. ప్రస్తుతం ఐదేళ్లకోసారి మారుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పరిమితిని పదేళ్లకు పెంచారు. గ్రామంలో వంద శాతం ఎస్టీలుంటే సర్పంచ్ పదవిని ఆ వర్గానికే రిజర్వు చేయనున్నారు. పంచాయతీలో ఓటరుగా ఉన్నవారికే సర్పంచ్‌గా, వార్డు సభ్యులుగా పోటీకి అవకాశముంటుంది. పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు పరోక్ష పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్‌గా పోటీకి 21 ఏళ్లు దాటిన వారు అర్హులు. వారికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. పదవీకాలం ఐదేళ్లు. జాయింట్ చెక్ పవర్ పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన నిధుల ఖర్చు విషయంలో చెక్‌పవర్ విధానంలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం సర్పంచ్, గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ అధికారాలున్నాయి. బిల్లులో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఈ పవర్ ఇచ్చారు. సర్పంచ్ విధి నిర్వహణలో విఫలమైనట్లు నిరూపితమైనా, నిధుల దుర్వినియోగం చేసినా తొలగించే విషయాన్ని బిల్లులో పేర్కొన్నారు. తొలగింపు అధికారం ఇప్పట్లాగే కలెక్టర్లకే ఉంటుంది. తొలగింపుపై సర్పంచ్‌లు అప్పీలు చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. గ్రామసభలో అంశాలు... - పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్వహణ, విద్య, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, కొత్త పన్నుల పెంపు తదితరాలపై చర్చి స్తారు. పంచాయతీలో అమలు చేసే అభి వృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి. - పథకాల లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. కొత్తగా ఎన్నిక య్యే సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ప్రభు త్వం అవగాహన కల్పిస్తుంది. పాలనాంశాల్లోనూ మార్పులు జరిగాయి. గ్రామంలో ఇంటి నిర్మాణానకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు అనుమతులివ్వాలి. లే ఔట్ పర్మిషన్లలో నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకునే నిబంధన ఉంది. గ్రాస సభ కోరం గ్రామ సభ నిర్వహణకు కనీసం ఎంతమంది హాజరవాలనే (కోరం) విషయంపైనా బిల్లులో స్పష్టత ఇచ్చారు. 300 నుంచి 500 ఓటర్లుండే గ్రామంలో 50 మంది హాజరైతేనే కోరమున్న ట్టు భావించి సభ నిర్వహించాలి. 500– 1,000 ఓటర్లుంటే 75 మంది, 1,000– 3,000 ఉంటే 150 మంది, 3,000–5,000 వరకైతే 200 మంది, 5,000–10,000 వరకు 300 మంది, ఆపైన ఓటర్లుంటే 400 మంది హాజరు తప్పనిసరి. 300 జనాభా ఉన్నా.. కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,326. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కు పెరగనుంది. వార్డు సభ్యుల సంఖ్య గ్రామ జనాభా ఆధారంగా ఉంటుంది. ఇప్పటిదాకా కనీసం 500 జనాభా ఉంటేనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే అవకాశముండేది. ఇకపై 300 జనాభా ఉన్నా అవకాశ మిస్తారు. గురువారం చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించనుంది. రెండు నెలలకోసారి గ్రామసభ - ప్రస్తుతం మూడు నెలలకోసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ సమావేశాన్ని ప్రతి నెలా నిర్వహించాలి. పాలకవర్గంలోని ఎన్నికైన సభ్యులు ఇందులో పాల్గొంటారు. - ఎంపీటీసీ సభ్యుడు గ్రామసభకు ఆహ్వానితుడు. ఎంపీటీసీ పరిధిలోని జరిగే అన్ని కార్యక్రమాలకు ఆయన ఆహ్వానితుడే. అయితే పంచాయతీ వ్యవహారాలు వేటిలోనూ ఎంపీటీసీకి ఓటు హక్కుండదు. - ప్రతి పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులుంటారు. గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారు, గ్రామాభివృద్ధి కోసం ఆర్థికంగా చేయూత అందించిన వారిని సభ్యులుగా నియమిస్తారు. వీరు గ్రామసభల్లో పాల్గొంటారు, వీరు అన్ని అంశాలపై చర్చించవచ్చు గానీ ఓటు హక్కుండదు. - మూణ్నెల్లకోసారి జరుగుతున్న గ్రామ సభ ఇకపై రెండు నెలలకోసారి జరగాలి. ప్రత్యేక సందర్భాల్లో పది రోజుల తర్వాత భేటీ కావచ్చు. సర్పంచ్ లేని సందర్భాల్లో ఉప సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరగుతుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, అసెంబ్లీ సభ్యులను సభకు ఆహ్వానించవచ్చు. ఏడాదిలో ఆరుసార్లు కచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి. మహిళలు, వృద్ధులు, వికలాంగుల అంశంపై కనీసం రెండు గ్రామసభల్లో చర్చించాలి. పంచాయతీ నిర్ణయం ప్రకారం గ్రామసభ ఎజెండాలోని అంశాలపై సభ్యులకు గ్రామ కార్యదర్శి సమాచారమివ్వాలి. -
సర్పంచ్ ఎన్నిక.. ప్రత్యక్షంగానే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను ఇప్పుడున్నట్లుగానే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయతీ చట్టం రూపకల్పన సందర్భంగా సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు వివిధ మార్గాలను పరిశీలించింది. అదే సమయంలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పుచేర్పులు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వివిధ సంస్థలు, నిపుణులతో చర్చించిన తర్వాత తుది నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. ఈ నివేదిక ప్రకారం పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనకు ప్రభుత్వం స్వస్తిపలికినట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకోవడం, ఎన్నికైన వార్డు సభ్యులతో సర్పంచ్‌ను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోవాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.అయితే పరోక్ష ఎన్నికపై పలు విమర్శలు రావడం, పంచాయతీరాజ్‌రంగ నిపుణులు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించడం వంటి కారణాలతో దీన్ని విరమించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరోక్ష పద్ధతిలో అయితే వార్డు సభ్యులను కాపాడుకోవడంతోనే పదవీకాలం గడిచిపోతుందని, అభివృద్ధి పనులపై దృష్టిపెట్టే అవకాశం కూడా సర్పంచ్‌లకు లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ విధానంలో మార్పులు... సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రొటేషన్ పద్ధతిపై ఐదేళ్లకోసారి రిజర్వేషన్‌ను మార్చేలా ప్రస్తుతమున్న విధానంలో మార్పులకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు ఖరారు చేసే రిజర్వేషన్‌నే రెండో విడతకు..అంటే పదేళ్లపాటు పొడిగించాలనే ప్రతిపాదనకు మొగ్గు చూపింది. కొత్తగా పంచాయతీలు ఏర్పడటం, తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయనున్నారు. నియోజకవర్గాలవారీగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన గ్రామ పంచాయతీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ఇటీవలే సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలను జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ముఖ్యమంత్రికి అందించారు. దీనికి అనుగుణంగానే పంచాయతీరాజ్ బిల్లులో మార్పుచేర్పులు చేశారు. అయితే కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి వచ్చిన రిజర్వేషన్‌ను పదేళ్లపాటు అంటే రెండు పదవీకాలాలపాటు వరుసగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతోపాటు పంచాయతీకి ఇద్దరు నిపుణులను సభ్యులుగా నామినేట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ... ప్రస్తుతమున్న మున్సిపల్ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కోర్టు కేసులతో మున్సిపాలిటీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపు కేబినేట్ భేటీ... కొత్త పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీరెండు గంటల వ్యవధిలో అసెంబ్లీలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. -
విలీనం లేనట్లే !
మున్సిపాలిటీల్లో విలీనం చేద్దామనుకున్న గ్రామాలపై వెనక్కు తగ్గినట్లు సమాచారం. విలీనం చేస్తే ఉపాధిహామీ పథకం వర్తించకపోవడం, సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవడం.. తదితర కారణాలతో ఈ గ్రామాలను యథాస్థితిలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నేతలు మున్సిపాలిటీల్లో కలపొద్దని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : సమీపాన ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు పంపాలని ఇటీవల ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు సూచించింది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం చేయాలనుకునే గ్రామాల జాబితాను పంపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీలుగా ఉండే వాటిలో 5 కిలోమీటర్లు, గ్రేడ్ 2 పరిధిలోకి 3 , గ్రేడ్ 3 పరిధి లోకి వచ్చే వాటికి కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రా మాలను విలీనం చేసే ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ గ్రేడ్ 1, నగర పంచాయతీగా ఉన్న దేవరకొండ గ్రేడ్ 3 కేటగిరిలో వస్తుంది. అయితే నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితా ప్రతిపాదనలు అధి కారులు పంపారు. నల్లగొండ మున్సిపాలిటీలోనే ఎక్కువ గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలు వెళ్లాయి. ఏ మున్సిపాలిటీలోకి ఏ గ్రామాలు .. నల్లగొండ మున్సిపాలిటీలోకి 14 గ్రామాలను విలీనం చేయవచ్చని ప్రతిపాదించారు. వీటిలో బుద్ధారం, అన్నెపర్తి, కంచనపల్లి, గుండ్లపల్లి, కొత్తపల్లి, జీకె. అన్నారం, చందనపల్లి, దండెంపల్లి, అమ్మగూడెం, మేళ్లదుప్పలపల్లి, పిట్టంపల్లి, తేందార్పల్లి, అనిశెట్టిదుప్పలపల్లి, ఖాజీ రామారం గ్రామాలున్నాయి. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీలో యాద్గార్పల్లి, వెంకటాద్రిపాలెం, వాటర్‌ట్యాంక్ తండా, గూడూరు, బాధలపురం, చింతపల్లి, శెట్టిపాలెం గ్రామాలను విలీనం చేయవచ్చని పంపారు. ఇక దేవరకొండ నగర పంచాయతీ కేటగిరి ప్రకారం దీని పరిధిలోకి వచ్చే గ్రామాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. వీటిని విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం వర్తించదని, సర్పంచ్ ఎన్నికలు ఉండవని.. తమ స్థానిక రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనా..? అని స్థానిక సర్పంచ్‌లు, నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల్లోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో.. ఇప్పుడు ఈ గ్రామాలను కలిపితే ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్యెల్యేల దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ఉపాధిహామీ పథకం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి విలీన ప్రక్రియను దూరం పెట్టినట్లు సమాచారం. కొత్త పంచాయతీలు చేయొచ్చా.. విలీన గ్రామాల ప్రక్రియ వెనక్కు వెళ్లడంతో.. ఈ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేయవచ్చా..? అనే విషయమై పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. మైదాన ప్రాంతంలో 500 జనాభా ఉన్న, దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే అధికారులు పంపారు. వీటిల్లో కూడా ఇలా ఈ జనాభా పరిధిలో ఉన్న గ్రామాల ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇవి కొత్త పంచాయతీలు అయితే మరికొంత మంది రాజకీయ ఉపాధి దొరికినట్లే. నగర పంచాయతీలకు ప్రతిపాదనలు.. కొత్తగా నగర పంచాయతీల ప్రతిపాదనల జాబితాలో అనుముల, చిట్యాలను చేర్చనున్నుట్లు తెలిసింది. అలాగే నకిరేకల్‌ను కూడా మున్సిపాలిటీగా చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొస్తుండడంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. పనిలో పనిగా కొత్త నగర పంచాయతీల ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చిట్యాలకు వట్టిమర్తిని కలిపి, అనుములకు ఇబ్రహింపేటను కలిపి నగర పంచాయతీలుగా చేయవచ్చని.. వాటి జనాభాను అధికారులు ప్రభుత్వానికి పంపారు. -
‘పంచాయతీ’ పైనే చర్చ
ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచే ఎన్నికలపై చర్చ మొదలైంది. పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో చర్చ జోరుగా సాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై రకరకాల చర్చ నడుస్తోంది. పరోక్ష ఎన్నికలతో పైసలున్నోళ్లే పోటీకి దిగుతారని కొందరు, సామాన్యులకు పంచాయతీ పదవుల కల అందని ద్రాక్షేనని మరికొందరు అనుకుంటున్నారు. మరోవైపు ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుంది? ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని రంగంలోకి దింపాలంటూ రాజకీయ పార్టీలు సైతం లెక్కలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ప్రజలకు దగ్గరవుతూ అంతర్గతంగా చర్చిస్తున్నారు. పార్టీలు మారడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆరా తీస్తున్నారు. గ్రామ కూడళ్లలో, టీ కొట్ల వద్ద.. ఏ ఇద్దరు కలిసినా పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు అనుకూలమా, పరోక్ష ఎన్నికలు అనుకూలమా అనే దానిపై కూడా ఆశావహులు ఆరా తీస్తున్నారు. అంచనాల్లో రాజకీయ పార్టీలు వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, వామపక్షాలు సైతం బిజీబిజీ అయ్యాయి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ప్రీఫైనల్‌గా అందరూ భావిస్తుండడంతో, ఇవి ఎవరికి లాభిస్తాయోనని లోతుగా ఆరా తీస్తున్నారు. పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించేలా చట్టంలో మార్పులు చేస్తున్నామన్న ప్రభుత్వ కసరత్తుతో పార్టీలు సైతం అంచనాల్లో తలమునకలవుతున్నాయి. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు పాక్షికంగా ఉన్న ఇల్లందు, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లోనూ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో, పంచాయతీ ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీలు సైతం పంచాయతీ ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలని సీఎం ప్రకటించడం, ప్రగతి భవన్లో జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం సమీక్ష సమావేశమైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 231 గ్రామపంచాయతీలు ఉండగా, 500 జనాభా దాటిన మరో 216 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం రేపో, మాపో ఆమోదముద్ర వేస్తే కొత్త పంచాయతీలు ఆవిర్భవించనున్నాయి. పాత, కొత్త పంచాయతీలకు కలుపుకొని ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, అధికారులు ఇందుకు సమాయత్తమవుతున్నారు. కాగా, ఇంకా గ్రామపంచాయతీల రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే, రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పరిసర 5 గ్రామపంచాయతీలను విలీనం చేసేందుకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడంతో వీటిపై కూడా సందిగ్ధం నెలకొంది. దీనికితోడు తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లను కూడా నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, వీటిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఇంకా మరికొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘పంచాయతీ’ పరోక్షమే!
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపింది. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ పరిధిలో కార్యనిర్వాహక అధికారాలన్నీ సర్పంచులకే అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది. పంచాయతీకి ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నివేదికను శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేసింది. తుది మెరుగులు దిద్ది.. పంచాయతీరాజ్ చట్టంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రులు కె.తారక రామారావు, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ఉప సంఘం శనివారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్ చట్టంలో చేర్చాల్సిన, తొలగించాల్సిన అంశాలపై మరోసారి చర్చించి నివేదికకు తుదిరూపు ఇచ్చింది. అనంతరం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి నివేదికను అందజేసింది. దీనిపై ఈ నెల 22న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించే అవకాశముంది. అనంతరం ఒకటి రెండు రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ‘పంచాయతీ’సమస్యలపై ట్రిబ్యునల్ ప్రస్తుతం సర్పంచులపై అనర్హత వేటు వేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంది. సర్పంచులు కలెక్టర్ నిర్ణయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రికి అప్పీలు చేసుకునేందుకు అవకాశముంది. పంచాయతీరాజ్ మంత్రిదే తుది నిర్ణయంగా అమలవుతోంది. అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉన్న జ్యుడీషియల్ అధికారాలను తొలగించి.. సర్పంచుల అప్పీలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో సూచించింది. ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు గ్రామ పంచాయతీల్లో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ఇందులో... గ్రామ స్వయం సహాయక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు ఒక కో–ఆప్షన్ సభ్యురాలిగా ఉంటారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లేదా ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసిన వారిలో ఒకరు రెండో కో–ఆప్షన్ సభ్యులుగా... గ్రామ పరిపాలన, అభివృద్ధి, చట్టాల్లో నైపుణ్యం, సేవాభావం కలిగిన సీనియర్ పౌరులెవరినైనా మూడో కో–ఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలని సూచించింది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో వీరికి ఓటు వేసే అధికారం ఇవ్వాలా, వద్దా అన్న దానిపై ఉప సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లా, మండల పరిషత్‌లలో కో–ఆప్షన్ సభ్యులకు ఓటు అధికారం లేదని, ఇక్కడా అదే విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. వీటితోపాటు మరిన్ని సూచనలను నివేదికలో పొందుపరిచింది. అయితే ఉప సంఘం ఏ సూచన చేసినా.. చివరికి ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని, సర్పంచ్ ఎన్నిక అంశం కూడా సీఎం అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని మంత్రివర్గ సభ్యుడొకరు పేర్కొన్నారు. వార్డు సభ్యుల నుంచే సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపించింది. ప్రస్తుతం గ్రామ ఓటర్లంతా నేరుగా సర్పంచ్‌ను ఎన్నుకునే పద్ధతి అమల్లో ఉంది. ఒకసారి ఎన్నికైతే నాలుగేళ్ల దాకా సర్పంచ్‌ను దింపేయడానికి అవకాశం లేదు. దాంతో సర్పంచుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అందువల్ల వార్డు సభ్యుల నుంచే సర్పంచును ఎన్నుకునేలా చట్ట సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఇక పంచాయ తీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకే కార్యనిర్వహణ అధికారాలు ఉండగా.. వాటిని సర్పంచులకే అప్పగించాలని సూచించింది. సర్పంచులకు ప్రస్తుతం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని గ్రామ కార్యదర్శి ద్వారా అమలు చేయించే అధికారం మాత్రమే ఉంది. దీనివల్ల గ్రామ కార్యదర్శికి, సర్పంచుకు మధ్య సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నట్టు ఉప సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలోని నిర్ణయాలను తీసుకునే అధికారం, జరిమానాలను విధించే అధికారం వంటివాటిని సర్పంచులకే అప్పగించాలని నివేదికలో పేర్కొంది. ‘పెట్టుబడి సాయం’పై సీఎంకు నివేదిక రైతులకు పంట పెట్టుబడి సాయం పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం సీఎం కేసీఆర్‌కు తమ నివేదికను అందజేసింది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప సంఘం సభ్యులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు తమ సిఫార్సులను అందజేశారు. -
పంచాయతీ పెట్టేద్దాం!
-
పంచాయతీ పెట్టేద్దాం!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మే నెల చివరినాటికి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. ముందుగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది (2018) ఆగస్టు ఒకటో తేదీతో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జూన్, జూలైలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో రైతులు ఖరీఫ్ పనులో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ తర్వాత మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అప్పటికల్లా విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల పదవీకాలం ముగియక ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు మేరకు గడువు కన్నా ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవడం కోసం ఈసీ షెడ్యూల్ కూడా రూపొందించింది. యంత్రాంగాన్ని సిద్ధం చేయండి వచ్చే ఏడాది మే చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి గ్రామ పంచాయతీల జాబితా ఖరారు చేసి, డిసెంబర్ నాటికి వార్డుల పునర్విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ 16లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరింది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, ముద్రణ పనులను మార్చి 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 17లోగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మే 31లోగా ఎన్నికల నిర్వహణను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అవసరమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్ సామగ్రి, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఎన్నికల సంఘం సూచించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్యకు సమానంగా పోలింగ్ స్టేషన్లు ఉండాలని, ప్రతి వార్డులో పోలింగ్ స్టేషన్ తప్పనిసరని పేర్కొంది. 200 మంది ఓటర్లున్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఒక పోలింగ్ అధికారి, 400 లోపు ఓటర్లు ఉంటే ఇద్దరు, ఆపైన ఉంటే ముగ్గురు పోలింగ్ అధికారులు తప్పనిసరని స్పష్టంచేసింది. ఈ మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో ఏర్పాట్లు చేసి తమకు నివేదిక పంపాలని సూచించింది. సర్కారు ముందుకొస్తుందా? రాష్ట్రంలో దాదాపు 8,691 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఎన్నికలు పార్టీరహితంగా జరగనున్నాయి. కానీ గ్రామాల్లో పూర్తిగా రాజకీయపరంగానే జరుగుతాయి. గ్రామస్థాయిలో పట్టుంటే తప్ప ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం. 2013లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో టీఆర్ఎస్ ఉద్యమంలో బిజీగా ఉంది. రాష్ట్రం వచ్చే దశలో ఉన్నందున ఆ పార్టీకి దాదాపు 3 వేలకుపైగా సర్పంచి స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా అదే స్థాయిలో స్థానాలు వచ్చాయి. టీడీపీకి దాదాపు 1,500 వరకు వచ్చాయి. మిగిలిన వాటిలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిగ్గా ఏడాది ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్నది ప్రశ్న. వాస్తవంగా ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పెట్టుకోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉండే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. అంతేగాక తండాలను పంచాయతీలుగా మార్చుతానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరికొన్ని పంచాయతీలను విడదీసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఈ అంశాలను సాకుగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో వెయ్యి నుంచి 1,500 వరకు తండాలను పంచాయతీలుగా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రక్రియకు సమయం తీసుకొని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే వీలుందని అంటున్నారు. గ్రామ పంచాయతీల స్వరూపం ఇలా... 200 జనాభా కలిగిన పంచాయతీలు–346 500లోపు జనాభా ఉన్నవి–870 1000లోపు జనాభా ఉన్నవి–1,733 2000లోపు జనాభా ఉన్నవి–3,029 5000లోపు జనాభా ఉన్నవి–3,104 10,000లోపు జనాభా ఉన్నవి–630 10,000కంటే ఎక్కువ జనాభా ఉన్నవి– 122 -
నిధులు గల్లంతు..!
పెబ్బేరు మండలం గుమ్మడం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఐదుగురు.. 12వార్డుల స్థానాలకు 60మంది పోటీచేశారు. వీరిని 120మంది బలిపరిచారు. నామినేషన్ సమయంలో వీరంతా బకాయి ఉన్న పన్నులను గ్రామ పంచాయతీలో చెల్లించారు. ఒక్కొక్కరు రూ.1300 నుంచి రూ.1500వరకు చెల్లించడంతో గ్రామంలో రెండులక్షల 10వేల రూపాయలు వసూలయ్యాయి. ఈ డబ్బులు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఖజానాలో జమచేయాల్సి ఉంది. కానీ, ఆ డబ్బు ఖజానాలో జమ కాలేదు. అసలు అవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. ఈ పరిస్థితి కేవలం గుమ్మడం పంచాయతీదే కాదు.. పెబ్బేరు : పెబ్బేరు మండలంలో 25 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి 2013లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో పోటీ చేయాలంటే ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదన్న నిబంధన ఉంది. బకాయి ఉన్న అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తారు. దీనికి తోడు వారిని బలపరిచేవారు కూడా బకాయి ఉండకూడదన్న నిబంధన ఉంది. దీంతో పోటీకి దిగిన అభ్యర్థులతో పాటు వారిని బలపరిచేవారు కూడా తమ బకాయిలను గ్రామ పంచాయతీకి చెల్లించారు. ఇలా చెల్లించిన డబ్బు సుమారుగా 20లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఆ డబ్బులో చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరలేదు. దీనిపై అధికారులు కూడా కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. అప్పటి రికార్డులు అందుబాటులో లేవు 2013 స్థానిక ఎన్నికల సమయంలో అభ్యర్థుల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలు అందుబాటులో లేవు. ఆ సమయంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శికే తెలియాలి. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం ద్వారా ఇదే వివరాలు అడగడంతో సమాచారం లేదని సమాధానం ఇచ్చాం. -బాలరాజు, పంచాయతీ కార్యదర్శి, గుమ్మడం. కొన్ని గ్రామపంచాయతీల్లో జమ చేయలేదు స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థుల నుంచి పన్నులు వసూలు చేసిన విషయం వాస్తవమే. వాటిని వెంటనే ఎస్టీఓలో జమ చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. కొన్ని గ్రామ పంచాయతీల్లో జమ చేయలేదు. వాటిని పరిశీలించి వెంటనే జమ చేసేలా చూస్తాం. -జ్యోతి, ఎంపీడీఓ, పెబ్బేరు. విచారణ చేస్తాం గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఎస్టీలో జమ చేయాల్సి ఉంది. ఎక్కడైనా పంచాయతీ కార్యదర్శులు ఆ నిధులను ట్రెజరీలో జమచేయకుంటే వాటిపై విచారణ జరుపుతాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. -వెంకటేశ్వర్లు, డీపీఓ, మహబూబ్‌నగర్ -
పోరు ప్రశాంతం
- 4 సర్పంచ్...27 వార్డు స్థానాలకు ఎన్నికలు - 2 ఎంపీటీసీ స్థానాలకు కూడా.. - రెండు వార్డుల ఎన్నిక వాయిదా - సైనాల, డీసీ తండా పంచాయతీ ఎన్నికలు సైతం.. వరంగల్ అర్బన్ : జిల్లాలో 4 సర్పంచ్, 27 వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం విజేతలకు అధికారులు గెలుపుపత్రాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 7 పంచాయతీలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చినా.. నెల్లికుదురు మండలం సైనాల, వర్ధన్నపేట మండలం డీసీ తండాకు నామినేషన్లు రాని కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ములుగు మండలం పోట్లాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదేవిధంగా 29 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. గీసుకొండ మండలంలోని రెండు వార్డులకు గుర్తుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల వల్ల అక్కడ కూడా ఎన్నికలు ఈనెల 9కి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటింది. తొలి ారిగా జిల్లాలో మూడు పంచాయతీలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. విజేతలు వీరే... వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి సర్పంచ్‌గా ఆదెపు దయాకర్,స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్ సర్పంచ్‌గా నంగునూరి రాధిక, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్‌గా నర్రపద్మ, నర్సంపేట మండలం కమ్మపల్లి సర్పంచ్‌గా అజ్మీర విజయ ఎన్నికయ్యారు. వార్డుల విజేతలు గొడవటూరు పంచాయతీ(10వ వార్డు) బుర్రలక్ష్మి, బాన్జీపేట(9)చెట్ల బాబు, నిడిగొండ(6) మైలారపు స్వరూప, చౌటపల్లి(11)దామెర లచ్చమ్మ, విసునూరు(7)లకావత్ బిక్షం, తోరనాల(6)రచ్చ బాలలక్ష్మి,కొత్తూరు(10)గాదె కౌసల్య, వడ్డేకొత్తపల్లి(4)సాయిబాబు, పంతిని(7)శాన రాజమణి,ఒంటిమామిడిపల్లి(1)గాజు కొమురమల్లు,(2)మజ్జిగ శారద,(3)అప్సర భేగం,(4)ఎండీ.రఫీ,(6)మజ్జిగ రాములు,(7) అద్దెంకి సంధ్య,(8)ఏసీరెడ్డి ర జిత, (10)కె.రాజు, నైనాల(5)కొండపల్లి స్మిత, దాట్ల(7)బాషపంగు మహేందర్, పెరుమాండ్ల సంకీస(5)కిన్నెర బాబు, బుధరావుపేట(13)గుగులోత్ నీలమ్మ,తండా ధర్మారం(5)గుగులోత్ ధాని, సాదిరెడ్డిపల్లి(10) వాసం పావని, మాధవపురం(9)గుగులోత్ భద్రు, జంగాలపల్లి(3) సానబోయిన స్వాతి, బుద్దారం(4)గడ్డం మహేందర్, సుబ్బక్కపల్లి(2) సముద్రాల రాజయ్యఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. కేశిరెడ్డిపల్లి, ఊరట్టంలోఎంపీటీసీ.. బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. 76.7 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమాదేవి తెలిపారు. 1846 ఓట్లకు గాను, సాయంత్రం 5 గంటల వరకు 1417 ఓట్లు పోలైనాయన్నారు. ఈ నెల6న స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎస్ఎసై తాడ్వారుు మండలంలోని ఊరట్టం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2315 ఓట్లకు 1770 ఓట్లు పోలయ్యూరు. -
విలీన పంచాయతీలకు ఎన్నికలెప్పుడో?
నకిరేకల్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చి ఏడాది గడిచింది. తదనంతరం విలీన గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వానికి నేటికీ ఆ ఆలోచనే రావడం లేదు. ప్రత్యేక పాలనలో అభివృద్ధి పనులు ముందుకు సాగక, సమస్యలు తీర్చేవారు లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను.. పట్టించుకునే నాథుడే లేడు. ప్రజాప్రతినిధుల పాలనలో తప్ప.. ‘ప్రత్యేక’ పాలనలో సమస్యలకు మోక్షం లభించదని, తక్షణమే విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నకిరేకల్ మండలంలో ఏడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మండలంలో అంతటా ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతుండగా ఈ ఏడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. వెరసి ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు నేపథ్యంలో తిరిగి విలీన గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆయా గ్రామాల మదిని తొలుస్తున్న ప్రశ్న. మున్సిపాలిటీ ఏర్పాటు, రద్దు ఇలా.. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో మున్సిపాలిటీగా మార్చింది. మండలంలోని చందుపట్ల, నోముల, కడపర్తి, చందంపల్లి, నెల్లిబండ, తాటికల్ గ్రామాలను నకిరేకల్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ నాడు నిర్ణయం తీసుకున్నారు. కాగా గ్రామాల విలీనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని గ్రామ పంచాయతీల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా 2013 సెప్టెంబర్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. నకిరేకల్‌తో పాటు విలీన గ్రామాలను యధావిథిగా పంచాయతీలుగానే కొనసాగించాలని ఆదేశించింది. ప్రత్యేక పాలన నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు కావడంతో హైకో ర్టు ఆదేశాల మేరకు నకిరేకల్‌తో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీలను యధావిధిగా తిరిగి పునరుద్ధరించారు. 2014 ఫిబ్రవరి 4వ తేదీనుంచి ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లాయి. ఈ ఏడు పంచాయతీలకు ఈఓఆర్డీ కమలాకర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిలిచిన అభివృద్ధి నకిరేకల్ పట్టణంతో పాటు వీలీనమైన ఆరు గ్రామాల్లో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.1 కోటి నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ. 70 లక్షలు నకిరేకల్ పట్టణానికి, మిగతా రూ. 30 లక్షలు విలీనమైన గ్రామాలకు కేటాయించారు. ఇట్టి నిధులుతో డ్రెయినేజీలు, సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సింది ఉంది. ఇందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, నిర్మాణం పనులు మాత్రం ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. మరో వైపు 13వ ఆర్థిక సంఘం, ఇతర పథకాల నుంచి అభివృద్ధి పనుల కోసం నిధులు వచ్చి చేరుతున్నాయి. అయితే పంచాయతీలకు సర్పం చులు లేకపోవడం, అధికారులు కూడా ప్రభుత్వ పథకాల అమలులో తీరిక లేకుండా ఉండటంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఏడు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. వేధిస్తున్న సమస్యలు నకిరేకల్‌తో పాటు ఆరు విలీన గ్రామాల్లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయి. నకిరేకల్‌లో ప్రధానంగా డ్రెయినేజీ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యతో పాటు పలు కాలనీల్లో వీధి వీధి దీ పాలు సరిగా వెలగడం లేదు. సీసీ రోడ్లు కూడా సరిగా లేవు. ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నకిరేకల్‌లో డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి రూ.5కోట్లు నిధు లు మంజూరు చేస్తానని ప్రకటించినప్పటికీ ఇంకా ఆచరణలో ఆమోదం లభించలేదు. కడపర్తికి 20 రోజులుగా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు ప డుతున్నారు.చందుపట్లలో మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. తాగునీటి ట్యాంకును సైతం శుభ్రం చేసేవారు లేక గ్రామస్తులు అందులోని నీటిని సేవించడమే మానేశారు. ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేస్తూ దా హం తీర్చుకుంటున్నారు. తాటికల్లోనూ ఇదే పరిస్థితి. కృష్ణా జలాలు అందక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి.నోముల, చందంపల్లి, నెల్లిబండ గ్రామాల్లో పారిశుధ్యం తాండవిస్తోంది. అంతేకాకుండా సర్పంచ్‌లు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని అయోమయంలో ప్రజలు ఉన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి నకిరేకల్ పట్టణంతో పాటు మిగితా ఆరు గ్రామాల్లోనూ తక్షణమే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేక పాలనలో అధికారి అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు తీరడం లేదు. -గాదగోని కొండయ్య, తాటికల్ ప్రభుత్వం చొరవ చూపాలి మా గ్రామాన్ని గతంలో మున్సిపాలిటీలో కలిపారు. ఆ తరువాత మున్సిపాలిటీ రద్దు కావడంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. సర్పంచ్ల పాలన జరిగేలా చూడాలి. -నక్క రాంబనేష్ ముదిరాజ్, కడపర్తి -
ప్రాదేశిక పోరులో గెలుపు మాదే
క్సీసర,న్యూస్‌లైన్: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ,సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కోరారు. ఆదివారం మండలంలోని నాగారం , దమ్మాయిగూడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం నాగారంలో గల ముప్పుఎల్లారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జరుగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. నగరానికి చేరువలోఉన్న నాగారం,దమ్మాయిగూడ గ్రామాలకు రూ.3 కోట్లతో కృష్ణానీటిని అందిస్తామన్నారు. కుషాయిగూడ-నాగారం రోడ్డువిస్తరణ , లోఓల్టేజీ నివారణకు నాగారంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జవహర్‌నగర్ చెత్త డంపింగ్‌ను ఇక్కడి నుంచి తరలించే విధంగా రానున్న రోజుల్లో పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ప్రభుత్వమేనన్నారు. నాగారం, చీర్యాల, ఆర్జికే తదితర గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నమరాజు ప్రభాకర్‌గౌడ్, నేతలు ముప్పురాంరెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, తటాకం నారాయణశర్మ, జెడ్పీటీసీ అభ్యర్థి తటాకం పద్మ,మాజీ సర్పంచ్ అశోక్‌గౌడ్, నేతలు తటాకం వెంకటేష్,కందాడిస్కైలాబ్‌రెడ్డి, గూడూరు మహే ష్, ఆంజనేయులు తదితరులున్నారు. -
నేడే పంచాయతీ సమరం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వాయిదా పడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థ్థానాలకు శనివారం మలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఏడు సర్పంచ్, 151 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 7వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. పదో తేదీన ఉపసంహరణ నిర్వహించారు. దండేపల్లి మండలం తాళ్లపేటలోని 2వ వార్డుకు, రెబ్బెన మండలం కొండపల్లిలోని 7వ వార్డుకు, తాండూర్ మండలం అచ్చలాపూర్‌లోని 2వ వార్డు కు, బెజ్జూర్ మండలం సోమినిలోని 9వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, ఆరు సర్పంచ్ స్థానాలైన తాం సి మండలంలోని వడ్డాడి, బండల్‌నాగాపూర్, కాగజ్‌నగర్ మండలం చింతగూ డ, తలమడుగు మండలం రుయ్యాడి, దండేపల్లి మండలం గూడేం, బేల మం డలం కొబ్బాయి గ్రామ సర్పంచ్ స్థానంతోపాటు 56 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు రాక ఎన్నికలు నిర్వహించ డం లేదు. సోమినిలో ముగ్గురు, అచ్చలాపూర్‌లో నలుగురు, తాళ్లపేటలో ము గ్గురు, కొండపల్లిలో ముగ్గురు చొప్పున 13 మంది బరిలో ఉన్నారు. కాగా, కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున 46మంది సిబ్బందిని నియమించారు. కాగా, నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో వార్డుకు ఇద్దరు అధికారుల చొప్పున ఎనిమిది మందిని నియమించారు. దీంతోపాటు సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి నలుగురు పోలీస్ అధికారులను నియమించారు. ఎన్నికలకు మొత్తం 60 మంది సిబ్బందిని నియమించారు. -
పల్లెల్లో పంచాయతీ పోరు
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని పది పల్లెల్లో ‘పంచాయతీ’ సమరం మొదలు కానుంది. గతేడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థులు లేకపోవడంతో ఆరు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. అంతేగాక మరో ముగ్గురు సర్పంచ్‌లు అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరో సర్పంచ్ రాజీనామా చేశారు. ఇలా ఖాళీలు ఏర్పడిన 8 మండలాల పరిధిలో పది పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు 13వార్డు సభ్యుల కోసం ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఎన్నికల సమయంలో కేటాయించిన రిజర్వేషన్లే వీటికి వర్తిస్తాయి. షెడ్యూల్ ఇలా... శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 8వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రా చేసుకునేందుకు గడువు. 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియ ముగియగానే అదేరోజు లెక్కింపు మొదలవుతుంది. తదుపరి ఫలితాన్ని వెల్లడిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. ఎన్నికల నియమావళి అమలులోకి... గ్రామపంచాయతీలు, ఆయా వార్డుల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది వర్తిస్తుంది. కుల,మత ప్రచారాలు నిషేధం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేయకూడదు. హామీలు ఇవ్వకూడదు. దేవాలయాలు, పాఠ శాలల వద్ద సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదు. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఎన్నికలు ఇక్కడే... గతంలో సర్పంచ్లగా ఎన్నికైన వారు మరణించడం వల్ల మర్రిగూడ మండలంలోని మేటిచందాపురం(జనరల్ మహిళ), నూతన్‌కల్ మండలంలోని లింగంపల్లి (బీసీ-మహిళ), తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లి (ఎస్సీ-మహిళ) పంచాయతీకి తిరిగి ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్ రాజీనామా చేయడం వల్ల త్రిపురారం మండలం గజలాపురం (ఎస్టీ -జనరల్) స్థానానికి, రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నిక ఆగిన బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ (ఎస్టీ-జనరల్), కాంచల్తండా (బీసీ - జనరల్), తుర్కపల్లి మండలం మోతిరాం తండా (బీసీ- జనరల్), మేళ్లచెరువు మండలం వజినేపల్లి (ఎస్టీ - మహిళ), పెద్దవూర మండలం పోతనూరు (ఎస్టీ - మహిళ), తెప్పలమడుగు (ఎస్టీ-మహిళ) పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం రిటర్నింగ్ అధికారులను ఆయా ఆర్డీఓలు నియమిస్తారు. వీళ్లు అర్హులే... రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు లేని గ్రామపంచాయతీల్లో చాలామంది ఇటీవల ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు నెలరోజులపాటు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తాజా (ఈ నెల ఒకటి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వీరు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది. ఉప సర్పంచ్ ఎన్నిక లేనట్టే.. ప్రస్తుతం జిల్లాలో 8 పంచాయతీలకు ఉప సర్పంచ్‌లు లేరు. 7 పంచాయతీల్లో కోరం ఏర్పడక ఉప సర్పంచ్ ఎన్నిక జరగలేదు. ఎన్నికకు మూడు దఫాలు సమయమిచ్చినా అది సాధ్య పడలేదు. మరో ఉప సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఎనిమిది ఉప సర్పంచ్ స్థానాల ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే, వీరి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు. -
పల్లెల్లో ప్రాదేశిక సందడి
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల సం దండి అప్పుడే మొదలైంది. ఆశావహులు సమీకరణాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన పంచాయ తీ ఎన్నికల్లో పోటీచేయాలని భావించి న వారు ఒకేపార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు ముందుకు రావడంతో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ఆశపెట్టి తప్పించారు. దీంతో ఆ హామీని నెరవేర్చుతూ పోటీచేసే అవకాశం తప్పకుండా ఇవ్వాలని నియోజకవర్గం ఇన్‌చార్జీలపై అప్పుడు ఒత్తిడి మొదలైంది. ఇదిలాఉండగా తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడ ంతో తెలంగాణ వచ్చినట్లేనని ఈ ప్రాంత ప్రజలు భావిస్తుండగా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉం చాలంటూ సీమాంధ్రలో మాత్రం ఉద్యమాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మా రింది. ఒక వేళ అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఆలోపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం ఖాయమని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నాలుగైదేళ్లుగా గ్రామస్థాయిలో ఉద్యమం నడుపుతూ టీఆర్ఎస్ లో కొనసాగిన మండల, గ్రామస్థాయి నాయకుల పరిస్థితి ఏమిటనేది ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. మరోవైపు తమ పార్టీ బలపడిందని బీజేపీ నాయకులు భావిస్తున్నా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రభావాన్ని చూపలేకపోయారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ నేతలు ఆశించిన ఫలితాలు రాలే దు. ఇటీవల జరిగిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించినా బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని సైతం కాంగ్రెస్ పార్టీగానే పరిగణించి లెక్కలు వేసుకున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన పార్టీ గుర్తులతోనే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్, టీడీపీ నేతల్లో గుబులు రేగుతోందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు వరం గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కూడా రాజకీయ నాయకులకు వరంగా మా రిందని చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా గతంలో 870 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పునర్విభజన వల్ల మరో 111 ఎంపీటీసీ స్థా నాలు పెరగనున్నాయి. దీంతో జిల్లాలో ఎం పీటీసీల సంఖ్య 981 చేరనుంది. పెరిగిన స్థానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జెడ్పీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అభ్యంతరాలను పరిశీలించి 27న తుదిజాబితా వెలువరిస్తారు. అనంతరం ఎంపీటీసీ స్థానాల జాబి తాను 28న జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తారు. మూడువేల నుంచి నాలుగు వేల జనాభాకు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.