సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగునుంది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. సర్పంచ్‌ల పదవీకాలంలో ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు!
— KTR (@KTRBRS) February 1, 2024
ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో,… pic.twitter.com/UnepmmXIp3
Comments
Please login to add a commentAdd a comment