మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల సం దండి అప్పుడే మొదలైంది. ఆశావహులు సమీకరణాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన పంచాయ తీ ఎన్నికల్లో పోటీచేయాలని భావించి న వారు ఒకేపార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు ముందుకు రావడంతో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ఆశపెట్టి తప్పించారు. దీంతో ఆ హామీని నెరవేర్చుతూ పోటీచేసే అవకాశం తప్పకుండా ఇవ్వాలని నియోజకవర్గం ఇన్‌చార్జీలపై అప్పుడు ఒత్తిడి మొదలైంది.
ఇదిలాఉండగా తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడ ంతో తెలంగాణ వచ్చినట్లేనని ఈ ప్రాంత ప్రజలు భావిస్తుండగా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉం చాలంటూ సీమాంధ్రలో మాత్రం ఉద్యమాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మా రింది. ఒక వేళ అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఆలోపు టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం ఖాయమని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నాలుగైదేళ్లుగా గ్రామస్థాయిలో ఉద్యమం నడుపుతూ టీఆర్‌ఎస్ లో కొనసాగిన మండల, గ్రామస్థాయి నాయకుల పరిస్థితి ఏమిటనేది ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు.
మరోవైపు తమ పార్టీ బలపడిందని బీజేపీ నాయకులు భావిస్తున్నా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రభావాన్ని చూపలేకపోయారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ నేతలు ఆశించిన ఫలితాలు రాలే దు. ఇటీవల జరిగిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించినా బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని సైతం కాంగ్రెస్ పార్టీగానే పరిగణించి లెక్కలు వేసుకున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన పార్టీ గుర్తులతోనే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్, టీడీపీ నేతల్లో గుబులు రేగుతోందని చెప్పొచ్చు.
రాజకీయ నాయకులకు వరం
గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కూడా రాజకీయ నాయకులకు వరంగా మా రిందని చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా గతంలో 870 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పునర్విభజన వల్ల మరో 111 ఎంపీటీసీ స్థా నాలు పెరగనున్నాయి.
దీంతో జిల్లాలో ఎం పీటీసీల సంఖ్య 981 చేరనుంది. పెరిగిన స్థానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జెడ్పీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అభ్యంతరాలను పరిశీలించి 27న తుదిజాబితా వెలువరిస్తారు. అనంతరం ఎంపీటీసీ స్థానాల జాబి తాను 28న జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తారు. మూడువేల నుంచి నాలుగు వేల జనాభాకు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.
పల్లెల్లో ప్రాదేశిక సందడి
Published Thu, Aug 15 2013 3:51 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement