telangana people
-
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
-
Operation Kaveri: సూడాన్ నుంచి మరో 754 మంది రాక
న్యూఢిల్లీ/కైరో: సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు. వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలిపింది. మరోవైపు సూడాన్‌లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది. -
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందన్నారు. దాదాపు రూ.350 కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. చదవండి: (మీకో దండం ఠాగూర్ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!) -
ఐదుగురు తెలంగాణవాసులకు శ్రమ్‌శ్రీ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను 2018 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. డిపార్ట్మెంటల్ అండర్ టేకింగ్స్–పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు వారి విశిష్ట పనితీరు, వినూత్న సామర్థ్యాలు, ఉత్పాదకత రంగంలో అత్యుత్తమ సహకారం, అసాధారణమైన ధైర్యానికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. శ్రమ్ భూషణ్ అవార్డ్, శ్రమ్వీర్ అవార్డ్, శ్రమ్‌శ్రీ అవార్డులుగా ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను మూడు కేటగిరీల్లో అందించనున్నారు. ఈ సంవత్సరానికి ప్రకటించిన మొత్తం శ్రమ్ అవార్డుల సంఖ్య 33 ఉండగా, అవార్డులను 69 మంది కార్మికులు అందుకుంటున్నారు. శ్రమ్‌శ్రీ అవార్డును అందుకునే వారిలో తెలంగాణ నుంచి కొరివి రమేశ్, పట్లూరి రాజశేఖర్, కొట్టె రాజు (హైదరాబాద్– బీహెచ్ఈఎల్), చాడ సురేందర్‌రెడ్డి, పూస రాము (బ్రహ్మోస్ ఏరో స్పేస్ ప్రై.లి.) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2017–18, 2018–19 సంవత్సరాలకు జాతీయ యువ పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ప్రదానం చేశారు. వ్యక్తిగత కేటగిరీలో 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన మహ్మద్ ఆజంకు జాతీయ యువ పురస్కారాన్ని అందించారు. -
టీకా కోసం 1.94 కోట్ల మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో.. థర్డ్‌వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. దీం తో అందరూ టీకాల కోసం పరుగులు తీ స్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసా గుతోంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు 93.25 లక్షల డోస్‌లు వేశారు. రాష్ట్రంలో ఇంకా 1,94,85,855 మందికి టీకా వే యాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలి పింది. అందులో 18-44 ఏళ్ల వయసున్న 1,53,90,824 మందికి, 45 ఏళ్లు పైబడిన 40,95,031 మందికి టీకా వేయాల్సి ఉంది. ప్రస్తుతం లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రోజూ టీకా వేస్తున్నారు. అయితే, ఎదురుచూస్తున్న 1.94 కోట్ల మందికి టీకా వేయాలంటే దాదాపు 4 నెలల సమయం పడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. రెండు డోస్‌లు పూర్తి చేయాలంటే 6 నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా. ఆసుపత్రుల బాధితులకు పరిహారం.. అత్యధికంగా బిల్లులు వసూలు చేస్తున్నా రంటూ రాష్ట్రంలో 170 ప్రైవేట్ కార్పొరేట్ తదితర ఆసుపత్రులపై కరోనా బాధితు ల నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు 350 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటివరకు 30 ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు రూ.72,20,277 ఇప్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ నెల 1 నుంచి 21 వరకు రాష్ట్రంలో 24,69,017 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో ర్యా పిడ్ యాంటీజెన్ పరీక్షలు 22,45,418 చే యగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలు 2,23,599 మాత్రమే చేశారు. ఇదే కాలంలో రాష్ట్రం లో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతం గా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 2.38శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శా తం, రంగారెడ్డి జిల్లాలో 2 శాతం పాజిటి విటీ నమోదైంది. థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖ వైరాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ తదిత ర విభాగాలకు చెందిన 12 మంది నిపు ణులతో అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 21 వరకు మొదటి, రెండు డోస్‌లు కలిపి 93,25,254 వ్యాక్సిన్లు వేశారు. -
విమానాలు లేక.. ఇంటికి రాలేక!
సాక్షి,బాల్కొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ అమలు వల్ల విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను రప్పించడానికి చేపట్టిన వందే భారత్ మిషన్ మందకొడిగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఖతర్ నుంచి తెలంగాణకు చేరుకోవడానికి దాదాపు 3 వేల మంది అక్కడి ఎంబసీలో దరఖాస్తు చేసుకున్నారు. వందే భారత్ మిషన్ మొదటి విడతలో ఖతర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మే 20న ఒకే ఒక విమానంలో వలస కార్మికులను రప్పించారు. ఇలా వచ్చిన 200 మందిని మాత్రమే ఇళ్లకు చేర్చారు.(మేము క్వారంటైన్‌కు వెళ్లాలా?) ఇంకా వేల మంది తెలంగాణ వాసులు ఖతర్‌లోనే ఉండిపోయారు. లాక్డౌన్ వల్ల ఎన్నో కంపెనీలు మూతపడటంతో అనేకమంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. చేతిలో డబ్బులు లేక, ఇంటి అద్దె చెల్లించలేక పార్కులలో కొందరు, తెలిసిన వారి గదుల్లో మరి కొందరు తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న భోజనంతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు గతంలో కుటుంబ సభ్యులను ఖతర్‌కు రప్పించుకున్నారు. ఇప్పుడు వారిలో చాలామందికి వీసా గడువు ముగిసినా లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకు పోయారు. (సుశాంత్ ఇంట మరో విషాదం) ఖతర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వైరస్ బారిన పడకుండా ఉండటానికి తమ కుటుంబ సభ్యులను ఇళ్లకు పంపించడానికి తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. అలాగే, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఇంటికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.వందే భారత్ మిషన్ కింద ఖతర్‌లోని భారతీయులను రప్పించడానికి అవసరమైనన్ని విమానాలను కేంద్రం పంపించడం లేదు. ప్రధానంగా తెలంగాణ కార్మికులను ఖతర్ నుంచి హైదరాబాద్‌కు చేర్చడానికి ప్రత్యేక విమానాలు అవసరం ఉన్నాయి. వాటి చార్జీలు ఎంతగా ఉన్నా భరించి స్వస్థలాలకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖతర్–హైదరాబాద్ మధ్య ఎక్కువ విమానాలు నడిపేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు. -
నెలకు 12.6 కిలోలు
సాక్షి, హైదరాబాద్: బతకాలంటే తినాల్సిందే.. అలా అని ఏదిపడితే అది తినలేం. జిహ్వకో రుచి అన్నట్టు అందరూ అన్నీ ఇష్టపడరు. ప్రీతికరమైన పదార్థాలను ఇష్టంగా తినేస్తుంటాం. కానీ ఎంత తింటున్నామో లెక్కించం. రాష్ట్ర ప్రజ లు ఆహారంగా ఎక్కువ ఏం తింటున్నారు, ఆహా ర పదార్థాల కోసం నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఆర్ఏఐ)తో కలసి ఇటీవల సర్వే నిర్వహించింది. 31 జిల్లా ల్లో 6,200 కుటుంబాలను పలకరించి ఆహార అలవాట్లను అడిగి తెలుసుకుంది. సర్వే లోని ముఖ్యాంశాలు ఇలా.. పప్పులు సమానంగా పప్పుల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో సమానంగానే ఉందని సర్వేలో తేలింది. నెలకు సగటున ప్రతి వ్యక్తి కనీసం 1.74 కిలోల పప్పులు తింటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2.69, సూర్యాపేటలో 1.3 కిలోల చొప్పున పప్పుల వినియోగం జరుగుతోంది. పప్పుల్లో 41% కందిపప్పు తింటుండగా 18 % చొప్పున పెసరపప్పు, మినపపప్పు వినియోగిస్తున్నారు. భద్రాద్రిలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ సుగంధ ద్రవ్యాల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు సగటున ప్రతి వ్యక్తి 636 గ్రాముల సుగంధ ద్రవ్యాలు తీసుకుంటుండగా భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా 920 గ్రాములు, మెదక్‌లో అత్యల్పంగా 440 గ్రాములు తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా అల్లం 146, చింతపండు 141, ఎండుమిరప 98 గ్రాముల చొప్పున వినియోగిస్తున్నారు. 94.5% కుటుంబాలు మాంస ప్రియులే మాంసం తింటున్న వారు రాష్ట్రంలో ఎక్కువేనని తేలింది. సర్వే జరిగిన కుటుంబాల్లో 94% మంది తాము మాంసాహారులమేనని చెప్పారు. నెలకు సగటున ప్రతి వ్యక్తి 1.38 కిలోలు (మాంసం, చేపలు, గుడ్లు కలిపి) తింటున్నారు. ఇందులో చికెన్ 550 గ్రాములు ఉంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రతి వ్యక్తి 1.91 కిలోల మాంసం తింటుండగా వికారాబాద్‌లో 1.06 కిలోలు తింటున్నారని వెల్లడైంది. పాల ఖిల్లా... సిరిసిల్ల పాల వినియోగానికి వస్తే నెలకు సగటున 4.58 లీటర్ల తలసరి వినియోగం జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎక్కువగా పాలు తాగుతున్నారని తేలింది. సిరిసిల్ల జిల్లాలో సగటున 6.27 లీటర్లు తాగుతుండగా అతితక్కువగా ఆదిలాబాద్‌లో 2.34 లీటర్లే తాగుతున్నారు. పాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందున్నాయని తేలింది. పట్టణ ప్రాంత ప్రజలు నెల కు 5.09 లీటర్ల పాలను తాగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో 3.86 లీటర్లు తాగుతున్నారు. ప్రతి వ్యక్తి సగటున నెలకు 920 గ్రా ముల పెరుగు తింటున్నాడని సర్వేలో తేలింది. నూనె విషయానికి వస్తే వంటకు వినియోగించే నూనెలను సగటున ప్రతి వ్యక్తి 1.22 లీటర్లు వినియోగిస్తున్నాడు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా (1.4 లీటర్లు), వికారాబాద్ ప్రజలు తక్కువగా (0.99 లీటర్లు) వినియోగిస్తున్నారు. కూరగాయల విషయానికి వస్తే ఎక్కువగా టమాటా (నెలకు కిలో) తింటుండగా ఆ తర్వాత ఆలుగడ్డలు (510 గ్రాములు) తింటున్నారు. ఉల్లిగడ్డ కూడా నెలకు కిలో చొప్పున వినియోగిస్తుండగా అరటిపండ్లు నెలకు కనీసం 5 తింటున్నారు. ఇక ఆహార పదార్థాల కోసం నెలకు సగటున రూ. 2,156 ఖర్చవుతుండగా అందులో ధాన్యం కోసం 19% ఖర్చు పెడుతున్నారని, పాల ఉత్పత్తుల కోసం 15 % ఖర్చవుతోందని సర్వేలో వెల్లడైంది. యాదాద్రిలో అత్యధికంగా... ఆహారం కింద రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నెలకు సగటున 12.6 కిలోలు ధాన్యం తింటున్నారని సర్వేలో తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 17.5 కిలోలు తింటుంటే మంచిర్యాల జిల్లాలో 10.5 కిలోల ధాన్యం వినియోగిస్తున్నారని వెల్లడైంది. ప్రాంతాలవారీగా పరిశీలిస్తే గ్రామీ ణ ప్రాంతాల్లో నెలకు 14.1 కిలోలు, పట్టణ ప్రాంతాల్లో 11.46 కిలోలు తీసుకుంటున్నరు. సర్వే నిర్వహించిన కుటుంబాల్లో 77 శాతం మంది ధాన్యాల్లో ఎక్కువగా బియ్యా న్నే ఆహారంగా తీసుకుంటున్నారు. -
భివండీలో తెలంగాణ ప్రజల వెతలు
భివండీ: వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు పెళ్లిళ్లకి వచ్చిన తెలంగాణ ప్రజలు భివండీలో ఇరుక్కుపోయారు. భివండీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు వారుండే ప్రాంతాల్లో ఇంకా కరోనా వ్యాపించనప్పటికీ భివండీలో 13 మందికిపైగా కరోనా బారిన పడినవారున్నారు. ఇలాంటి నేపథ్యంలో పెళ్లిళ్లకు వచ్చి లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక, భివండీలో ఉండలేక తెలంగాణప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందిన వివరాల మేరకు సుమారు 100 మందికిపైగా భివండీలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు అనేక మంది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి తమ వినతిని తెలపాలని కోరుతున్నారు. ముఖ్యంగా వీరిలో కొందరు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు ఉండడంతో పంటలకు నష్టం వాటిల్లే ముప్పు ఉందని వాపోతున్నారు. పద్మనగర్‌లో ... మార్చి 19వ తేదీ పవర్లూమ్ కార్మికుడు నవజీవన్ కాలనీలో నివసించే అకెన్ కనుకయ్య కుమారుడు శ్రీనివాస్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 35 మంది ఇరుక్కుపోయారు. అలాగే ఆదర్శనగర్‌లో టీ స్టాల్ నడిపే కూరపాటి వీరయ్య కుమార్తె స్రవంతి వివాహ వేడుకల కోసం వరంగల్ అర్బన్, జిల్లాలోని గట్ల నర్సింగపరం నుంచి వచ్చిన 11 మంది లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. వ్యవసాయ కూలీలైన వీరు ఇరుకైన గదులలో ఉండలేక, సరైన భోజన వసతిలేక, పడుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంటున్నారు. గాయత్రీనగర్ కి చెందిన జెల్ల రమేశ్ కూతురు రుషిక వివాహం కోసం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంకు చెందిన ఆరుగురు భివండీ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు. కామత్‌ఘర్‌లో... కామత్‌ఘర్‌లో కూడా కరీంనగర్, జనగాం జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 22 మందికిపైగా ఇరుక్కుపోయారు. మార్చి 19వ తేదీన మామిడాల ఈశ్వర్ కుమారుడు రాజేష్ వివాహం జరిగింది. ఈ వేడుకల కోసం వచ్చిన వీరందరూ లాక్ డౌన్ కారణంగా గత నెలరోజుల నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ధామన్‌కర్ నాకాలో.. ధామన్‌కర్ నాకా ప్రాంతంలో మార్చి 19వ తేదీన జరిగిన సైరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి వివాహ వేడుకల్లో సుమారు 80 మంది బంధువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రాగా వీరిలో తొమ్మిది మంది మాత్రం భివండీలోనే ఇరుక్కుపోయారు. భివండీ తాలూకా కరివళి గ్రామంలో.. భివండీ తాలూకాలోని కరివళి గ్రామంలో సిరిసిల్లా నుంచి వచ్చిన తొమ్మిది మంది ఇరుక్కుపోయారు. వీరందరు కరివళి గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాస్ కుమారుడు శైలేష్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోతకు వచ్చిన పంట ఏమవుతుందో... ఇంట్లో చిన్న పిల్లలను విడిచి వచ్చాం. వరి, మొక్కజొన్న కోతకు వచ్చింది. ఊర్లో గాలి దుమారం, వాన వచ్చిందంట. చేతికొచ్చిన పంట మట్టి పాలవుతుందోమోనని భయంగా ఉంది. మమ్మల్ని ఊరికి పంపించండి. –కొచెర్ల యాదగిరి (వరంగల్ జిల్లా కుమ్మరి గూడెం గ్రామం) వాతావరణం పడక ఇబ్బంది.. సిరిసిల్లలో మాకు పవర్లూమ్ పరిశ్రమలు ఉన్నాయి. మావద్ద 8 మంది ఉత్తర భారతీయులు పనిచేస్తున్నారు. మేము ఇక్కడ, వారు అక్కడా చిక్కుకుపోయాం. ఇక్కడ భోజనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం, నాకు ముందు నుంచే ఆరోగ్యం బాగా లేదు. ఇక్కడ వాతావరణం పడక మరింత ఇబ్బందులు పడుతున్నా. –ఆకెన్ రాజేశం (సిరిసిల్ల) కుమారుని ఆరోగ్యం క్షీణిస్తోంది... దగ్గరి బంధువులు కావడంతో పెండ్లికి మా ఇద్దరి పిల్లలను తీసుకొచ్చాను. నా భర్త సిరిసిల్లలోనే ఉన్నాడు, మా అబ్బాయి అభినవ్‌కి ఫిట్స్ వ్యాధి ఉంది. నెల రోజులుగా ఇక్కడ ఒకే గదిలో ఉండటం వలన ఆరోగ్యం క్షీణించిపోతోంది. మమ్మల్ని ఎలాగైనా మా ఊరికి తీసుకెళ్లండి. –క్యాతం రూప (సిరిసిల్ల) ఆసుపత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి... ప్రభుత్వ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాను. తిరిగి రమ్మని డాక్టర్లు ఫోన్లు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నేను భివండీలో ఇరుక్కుపోయాను. మా ఇంట్లో వృద్ధులున్నారు. –కొండ సంతోశ్ (సిరిసిల్ల) -
కార్మికుల క్యాంపులో కరోనా సెగ!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలుగు కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న తమ ఆరోగ్యం గురించి కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికు లు వాపోతున్నారు. యూఏఈలోని దుబాయ్‌లోని అజ్మాన్ క్యాంపులో 40 మంది తెలుగు కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా నిజామాబాద్, జగిత్యా ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారే. దుబాయ్‌లో ని బెల్ హాసా కంపెనీ వలస కార్మికులను నియమించుకుని ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి తరలిస్తుంది. రోగులకు సేవలు అందించే కార్మికులను అక్కడ మెసెంజర్లుగా పిలుస్తారు. రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు తీసుకెళ్లడం.. మృతదేహాలను మార్చురీకి తరలించడం ఈ మెసెంజర్ల బాధ్యత. దుబాయ్‌లోని అల్ ఖస్సిమి ఆస్పత్రిలో కరోనా బారినపడిన వారి సంఖ్య ఎక్కు వే ఉంది. అయితే.. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న కార్మికులకు కేవలం మాస్కులు మాత్రమే అందించారు. దీంతో కొందరి ఆరోగ్యం దెబ్బతినడం.. 10 మంది కార్మికులకు కరోనా లక్షణాలు ఉ న్నట్లు తేలడంతో వారికి మెరుగైన వైద్యం అందించకుండా, క్యాంపులోని ఒక గదిలో సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఒకే కాంపౌండ్‌లో క్వారంటైన్లో ఉన్న వీరి తో పాటు ఇతర కార్మికులను ఉంచడంతో అక్కడి తెలుగు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కం పెనీ యాజమాన్యం తీరును ఆక్షేపిస్తూ కార్మికులు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి యూఏఈలోని మన విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడాలని వారు కోరుతున్నారు. -
కరోనా వేదన.. అరణ్య రోదన
మోర్తాడ్ (బాల్కొండ) : ఇరాక్‌లో తెలంగాణకు చెందిన వలస కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే అఖామా రెన్యువల్ కాక అవస్థలు పడుతున్న కార్మికులకు లాక్డౌన్ శరాఘాతంగా మారింది. ఉపాధి కోల్పోయి నివాస స్థలాలకే పరిమితమైన కార్మికులకు చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజులుగా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో మనోళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏం చేయాలో అర్థంకాక భయాందోళనతో జీవితం గడుపుతున్నారు. ఇరాక్‌లో తెలంగాణ జిల్లాల నుంచి వలస వెళ్లినవారు దాదాపు 13 వేల మంది కార్మికులు ఉంటారని అంచనా. గతంలో లక్ష మంది వరకు ఉండగా.. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఈ మధ్యనే ఎంతో మంది ఇంటిబాట పట్టారు. ఎలాగైనా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే ఆశతో కొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇరాక్‌కు మొదట విజిట్ వీసాపై వెళ్లిన వారంతా అక్కడ అఖామాలను పొందారు. కాలపరిమితి ముగిసేలోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ విషయంలో కొన్ని ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినట్లు వెలుగు చూడటంతో ఇరాక్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఫలితంగా విదేశీ కార్మికుల అఖామాల రెన్యువల్‌ను డిసెంబర్లో నిలిపివేసింది. గడువు ముగిసినా అఖామా లేనివారు మాత్రం రోజువారీ కూలీగా పనిచేస్తూ రహస్యంగానే జీవితం గడుపుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నాం అఖామాలు లేని కార్మికులకు అతీగతీ లేకుండా పోయింది. నెల రోజుల నుంచి లాక్డౌన్ అమలు వల్ల వీరి అవస్థలు వర్ణనాతీతం. గతంలో తీసుకున్న సరుకులతో కొన్ని రోజులు వెళ్లదీసిన కార్మికులు.. డబ్బులు లేక మళ్లీ సరుకులు కొనుగోలు చేయలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజుకు ఒకపూట తింటూ అర్ధాకలితో అలమటిస్తున్నామని పలువురు కార్మికులు ‘సాక్షి’తో ఫోన్లో వాపోయారు. ఎలాగైనా స్వదేశానికి వద్దామన్నా రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేదన అరణ్య రోదనగా మారిందన్నారు. చొరవ చూపండి ప్రస్తుతం ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే అఖామా లేని కార్మికులు ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తమకు పెద్ద దిక్కులేకుండా పోయిందని కా ర్మికులు వాపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కనీస సౌకర్యాలు కల్పిం చేలా చొరవ చూపాలని కోరుతున్నారు. వీరంతా సేఫ్ అయితే అఖామాను పొందిన కార్మికులకు ఆయా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు నివాసం, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాయి. ఇరాక్‌లోని నిన్వేహ్, సలావుద్దీన్, దియాల, అంబర్, కిర్కుక్ ప్రాంతాలను మినహాయించి బాగ్దాద్, ఖుర్దిస్తాన్, ఎర్బిల్ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వీరికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వారిని స్వదేశానికి రప్పించాలి ఇరాక్‌లోని తెలంగాణ గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంత మంది కార్మికులకు నిత్యావసర సరుకులను అందించాం. అఖామా రెన్యువల్ కాని కార్మికులను గుర్తించి వారికి తిండి కోసం అవసరమైన సామగ్రిని చేరవేశాం. ఖుర్దిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు ష్వాన్ జరారీ మా విన్నపానికి స్పందించి కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకులను మానవతా దృక్పథంతో అందించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వలస కార్మికులను స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. – రాయల్వార్ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ -
ప్రతిచోటా ‘ఏపీ’ చర్చ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన పరిణామాలపై తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక ఆసక్తిని కనబర్చింది. ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై రోజంతా జరిగిన చర్చను తెలంగాణలోనూ ఆసక్తిగా ఫాలో అయ్యారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజానీకం కూడా రోజంతా టీవీలకు అతుక్కుపోయారు. పొరుగు రాష్ట్రం కావడం, ఒకప్పుడు కలిసి ఉన్న ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలతో పాటు రాజధానుల గురించి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కనిపించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రవాసులు, తెలంగాణవాసులు కూడా టీవీలను చూస్తూ ఉండిపోయారు. అధికార వికేంద్రీకరణ ఆవశ్యకతను అక్కడి ప్రభుత్వ వర్గాలు వివరించిన తీరు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, విభజన ఉద్యమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలపై జరిగిన చర్చ అందరిలోనూ చర్చనీయాంశమయింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, పార్టీల నాయకుల ఇళ్లలో చాలా వరకు టీవీలు చూస్తూనే గడిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న చోట్ల టీవీలకు అతుక్కుపోయారు. ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా ఏపీలో ఏం జరుగుతుందనే అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. అధికార వికేంద్రీకరణతో పాటు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ టీడీపీ ప్రభుత్వ హయాంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించీ తెలంగాణలో చర్చించుకోవడం కనిపించింది. టీడీపీ నేతలు వేల ఎకరాల భూములను కొనుగోలు చేయడం, పరిహారం పంపిణీ, రాజధాని నిర్మాణంలో జరిగిన అవకతవకలు తదితర విషయాల గురించి మాట్లాడుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఉన్న అననుకూలతలనూ ఏపీ ప్రభుత్వ వర్గాలు అసెంబ్లీలో కూలంకషంగా వివరించడంతో తెలంగాణలో నివసిస్తోన్న మెజార్టీ ఆంధ్ర వాసుల్లోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం కావడం గమనార్హం. -
మనసుకు సుస్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అనేకమంది కుంగుబాటు (డిప్రెషన్), ఆత్రుత (యాంగ్జయిటీ) వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడుల్లోనూ ఈ రకమైన మానసిక రుగ్మతలు 1.4 రెట్లు పెరగడం గమనార్హం. 1990 నుంచి 2017 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో మానసిక రుగ్మతలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. ‘భారతదేశంలో మానసిక రుగ్మతల భారం’అనే పేరుతో ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2017లో దేశంలో 19.73 కోట్ల మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం జనాభాలో 14.3 శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. బాల్యం, టీనేజీల్లో మానసిక రుగ్మతల ప్రాబల్యం 1990–2017 మధ్య తగ్గినప్పటికీ, యుక్తవయసులో మానసిక రుగ్మతల ప్రాబల్యం పెరిగింది. ప్రతీ ఏడుగురు భారతీయులలో ఒకరు వివిధ రకాల తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. 1990–2017 మధ్య మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక తెలిపింది. ఆత్మహత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు తెలంగాణలో మానసిక రుగ్మతల జాబితాలో ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు అధికంగా కుంగుబాటు, ఆత్రుతలకు గురవుతున్నారు. దీనికి ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత, కుటుంబ ఒత్తిడి తదితర కారణాలున్నాయి. అకాల మరణాలు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు అకాలంగా మరణిస్తారు. లేకుంటే మానసిక సమస్యల కారణంగా వైకల్యానికి గురవుతున్నారని నివేదిక తెలిపింది. మానసిక రోగాలతో బాధపడే వారిలో చాలామంది ఆస్పత్రుల్లో చేరడంలేదు. మన దేశంలో 1982లో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను ప్రారంభించారు. దీన్ని 1996లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంగా మార్పులు చేసి తిరిగి ప్రారంభించారు. జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014లో అందుబాటులోకి వచ్చింది. 2017లో మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం వచ్చింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మానసిక ఆరోగ్య సేవలను సరిగా అమలు చేయడంలేదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన రోగుల అవసరాలను గుర్తించడం, చికిత్స చేయడం తక్షణ కార్యక్రమంగా చేపట్టాలి. మహిళలు ఆత్మహత్యలవైపు పోకుండా చూడాలి. ఎందుకంటే భారతీయ మహిళలు ప్రపంచ మహిళా ఆత్మహత్య మరణాల రేటులో రెండింతలు కలిగి ఉన్నారు. యోగా కూడా మానసిక రుగ్మతల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, ఎక్కడెక్కడో ఒంటరి బతుకు పోరాటం చేయడం.. చాలీచాలని జీతాలతో బతకడం.. పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం.. ఇలా పలు కారణాలతో అనేకమంది మానసికంగా బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పటిష్టంగా ఉండటమే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితమైంది. మానసిక సమస్యలతో బాధపడే వారిలో గ్రామాల కంటే పట్టణాల్లోనే రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. అందువల్ల పట్టణాల్లో ప్రత్యేకంగా మానసిక చికిత్సాలయాలు మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పీహెచ్సీ స్థాయి నుంచి మానసిక వైద్యం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మానసిక రుగ్మతలపై రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయి నుంచి కూడా మానసిక రోగులకు వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న మానసిక చికిత్సాలయంలో మానసిక రోగులకు చికిత్స చేస్తున్నారు. అది కూడా అత్యంత తీవ్రమైన స్థాయికి వచ్చాకే జరుగుతోంది. కానీ మానసికంగా వివిధ స్థాయిల్లో ఉన్న రోగులకు వారివారి స్థితిని బట్టి చికిత్స చేసే పరిస్థితి లేనేలేదు. కాబట్టి పీహెచ్‌సీల్లోనూ మానసిక రోగులకు చికిత్స అందించేలా ప్రణాళిక రచించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం కొందరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ►తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో.. 3,750 మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు ►3,600 మంది ఆతృతతో బాధపడుతున్నారు ►4,000 మంది వరకు మేధో వైకల్యం (ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్)తో బాధపడుతున్నారు. ►742 మంది ప్రవర్తన రుగ్మత (కాండక్ట్ డిజార్డర్స్)తో బాధపడుతున్నారు. -
ఇరాక్‌లో ఇరుక్కుపోయారు!
జన్నారం: ఉపాధి కరువై.. బతుకు బరువై డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో విదేశాలకు వెళ్లిన తెలంగాణవాసులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. జన్నారం మండలం సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది వరకు పనులు లేక పస్తులుంటున్నారు. తమను స్వదేశానికి రప్పించాలని వారు వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన జాడి చంద్ర య్య గతేడాది వెళ్లి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల నర్సయ్య, సేర్ల లచ్చన్న రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లారు. ఏదో కారణంగా 3 నెలలుగా వారు జైలు పాల య్యారు. వీరంతా ఏజెంట్ల మోసాలకు గురై ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ‘‘ఇరాక్‌లో ఇబ్బంది పడుతున్న తెలంగాణవాసుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఎన్ఆర్ఐ బిభాగం కార్యదర్శి చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లాం. వారిని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ’’ మాటేటి కొమురయ్య, గల్ఫ్ వెల్ఫేర్,అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!
సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్నవారంతా ఎక్కువమంది తెలంగాణకు చెందినవారిగా సమాచారం. హైదరాబాద్ నుంచి 22మంది, వరంగల్ నుంచి 14మంది పాపికొండలు విహార యాత్రకు బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం నుంచి వరంగల్ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ట్రాక్టర్లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. ఇక గల్లంతు అయినవారిలో 27మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై లాంచీ యజమాని వెంకట రమణ మాట్లాడుతూ... కచులూరు వద్ద పెద్ద సుడిగుండం ఉందని , దాన్ని దాటే సమయంలో డ్రైవర్లు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో రాయల్ వశిష్ఠ పర్యాటక బోటు ఆదివారం ఉదయం మునిగిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్ వాసులు గాంధీ, విశాల్, లక్ష్మణ్, జానకిరామ్, రాజేష్, రఘురామ్, అబ్దుల్ సలీమ్, సాయికుమార్, రఘురామ్, విష్ణుకుమార్, మహేశ్వరరెడ్డి కుటుంబం, ధశరథన్-వరంగల్, రమణ-విశాఖ, జగన్-రాజోలు చదవండి: రాయల్ వశిష్టకు అనుమతి లేదు... పాపికొండలు విహార యాత్రలో విషాదం! -
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు
-
10 స్థానాల్లో విజయం మాదే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందన్నారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా వ్యవహరించిందని, ప్రగతిభవన్‌ను పార్టీ కార్యకలాపాలకు వినియోగించినా, ఎన్నికల సమయంలో కేసీఆర్ బయోపిక్ రిలీజ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నా, 12 ఈవీఎం యూనిట్లు పెట్టడంతో ఓటు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం ఎన్నికల కమిషన్ వైఫల్యమేనని చెప్పిన కుంతియా.. కచ్చితంగా తమ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపారు. -
తెలంగాణ రాష్ట్రం నచ్చింది
మహబూబాబాద్ రూరల్ : ‘తెలంగాణ ప్రజలు బాగుండాలి.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ సుభిక్షంగా ఉండేందుకు లోక రక్షకుడైన ఏసుక్రీస్తును ప్రార్థిస్తున్నా’అని అమెరికా మిసిసిపీ రాష్ట్రం జాక్సన్ ప్రాంతానికి చెందిన రెవరెండ్ బిషప్ జోసెఫ్ కోపాజ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఫాతిమామాత దేవాలయ 45వ వార్షికోత్సవానికి వరంగల్ క్యాథలిక్ పీఠాధిపతులు, మేత్రాసనం బిషప్ డాక్టర్ ఉడుముల బాలతో కలసి జోసెఫ్ కోపాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌కు తాను తొలిసారి వచ్చానని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చాలా బాగున్నాయన్నారు. తెలంగాణ నచ్చిందని, ఇక్కడి ప్రజల ఆప్యాయత మర్చిపోలేనిదన్నారు. గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వేషధారణ ఆకట్టుకున్నాయని చెప్పారు. -
తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ రైతులు, ఇతర వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకున్నం దున వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలని బీజేపీనేత కిషన్‌రెడ్డి కోరారు. కేంద్ర బడ్జెట్లో వివిధ పథకాల కింద తీసు కున్న చర్యలతో రాష్ట్రంలోని 90% రైతులకు ప్రయో జనం చేకూరుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, డా.ప్రకాశ్‌రెడ్డి, సుధాకరశర్మలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివిధ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు, పావు, అర ఎకరం ఉన్న రైతులకు కూడా రూ.6 వేలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ కిట్‌లో, కిలో బియ్యం సబ్సిడీ, తదితర పథకాల్లో కేంద్ర వాటా గణనీయంగా ఉంటోందన్నారు. అయితే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కనీసం కేంద్రప్రభుత్వ ప్రస్తావన కూడా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్, కేసీఆర్‌ల చుట్టూ తిరిగాయని, లోక్‌సభ ఎన్నికలు మోదీ, బీజేపీ, భారత్‌ల చుట్టూ తిరుగుతాయన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందన్నారు. కొన్ని పార్టీలు ఈ బడ్జెట్‌ను తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు కలసిరావట్లేదు ఆయుష్మాన్ భారత్ పథకాన్నిరాష్ట్రాలతో కలసి అమలు చేద్దామంటే తెలంగాణ, పశ్చిమ బెంగాల్ కలసి రావడంలేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలం గాణలో పంటల బీమా పథకం సరిగా అమలు చేయడం లేదని అందుకే వివిధ పథకాల కింద కేంద్రమే లబ్ధిదారులకే నేరుగా ఇవ్వాలని నిర్ణయిం చిందని వివరించారు. తెలంగాణకు సంబంధించి ఐఐటీకి నిధులు, పంజగుట్టలో ట్రామా సెంటర్ ఏర్పాటు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, 11 నీటిపారుదల ప్రాజెక్టులకు, చర్లపల్లి రైల్వేషెడ్‌కు నిధులు వంటివి బడ్జెట్లో కేటాయించా రన్నారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీకి వ్యవసాయ మంటేనే తెలియదని, పాలు గేదె నుండి వస్తాయా లేక దున్నపోతు నుండి వస్తాయా అన్నది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
సినీ రంగంలో ఇది విప్లవం
‘విక్రమ్’ సినిమాతో పరిచయమై దాదాపు అందరి టాప్ యాక్టర్స్‌తో నటించిన నాయిక శోభన. యాక్టర్ నుంచి ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. జాదూజ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలంగాణ పభుత్వ ‘టి.ఫైబర్’తో కలసి రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో జాదూజ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ‘‘సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం హ్యాపీ. ఇదొక విప్లవం కానుంది’’ అన్నారు శోభన. ‘‘జాదూజ్ ద్వారా గ్రామీణులకు విజ్ఞానంతోపాటు వినోదం అందించనున్నాం’’ లోహిత్ అన్నారు. ‘‘తొలి విడతగా 8వేల గ్రామాల్లో 500 జాదూజ్ సెంటర్లు నెలకొల్పుతాం. సినిమాలు ప్రదర్శిస్తాం. ఈ సెంటర్స్‌లో ‘చాయ్ నాస్తా కేఫ్‌లు’ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వంద మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్లు) ఆదాయంతో పాటు 5 వేల మందికి ఉపాధి దొరుకు తుంది’’ అన్నారు రాహుల్ నెహ్రా. ‘‘సామాన్యులకు దూరమైన సినిమాను దగ్గర చేయడానికి కృషి చేస్తున్న ‘జాదూజ్’ని అభినందిస్తు న్నా’’ అని తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ‘‘ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం’’ అని శ్రీధర్‌రావు అన్నారు. -
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి వర్షాలు సంతృప్తికర స్థాయిలో కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలన్నారు. పాడిపంటలతో రాష్ట్రం తులతూగేలా దీవించాలని భగవంతుడిని ఆయన ప్రార్థించారు. -
సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం
టీపీసీసీ నేత కె.కె.మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని టీపీసీసీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిరిసిల్లను జిల్లాగా చేయాలని శాంతియుతంగా అడుగుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు చేయడం, అరెస్టులు కావడం తెలంగాణ ప్రజలకు కొత్తకాదన్నారు. -
అబద్ధాల కేసీఆర్‌ను జైల్లో పెట్టాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టి, మహారాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఒప్పందం చేసుకున్న సీఎం కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మా ట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని సీఎంని చేసిన తెలంగాణ ప్రజలను వంచించేలా ఒప్పందం చేసుకుని, కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడుతున్న కేసీఆర్‌ను జైల్లో పెట్టాలన్నారు. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడేనన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కుటుంబ సభ్యుల భూములను కాపాడటం కోసమే తెలంగాణ ప్రయోజనాలనుకేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. పోలవరంలో 2లక్షల ఎకరాల ముంపు జరుగుతున్నా పట్టించుకోని ఆయన, మహారాష్ట్రలో కేవలం 3వేల ఎకరాల ముంపును కూడా ఒప్పించలేకపోయారన్నారు. బస్తీమే సవాల్ అనడం కేసీఆర్ హోదాకు తగిందికాదన్నారు. -
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2న సంబురాలు జరుపుకోనున్న తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనతికాలంలోనే దేశంలో అన్నిరాష్ట్రాలతో పాటు అభివృద్ధి పథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రజల ఆశయాలు, అభిలాష నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు బుధవారం సందేశాన్ని పంపారు. భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజలు ప్రతిఒక్కరూ భాగస్వాములై నిరంతరం శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలుపుతారని ఆశిస్తూన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రజలే మనకు బాసులు
ఖమ్మం: టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే బాసులని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. అధికారం వచ్చిందని ఏనాడు గర్వపడలేదని చెప్పారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక త్యాగాల ఫలితం తెలంగాణ అని అన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్పై నమ్మకంతో అద్భుత విజయాలు అందించారని చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయం అందించారని గుర్తు చేశారు. మే చివరికల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇస్తామని చెప్పారు. విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్నవారికి ఎవరూ ఊహించనివిధంగా అవకాశాలు ఇచ్చామని చెప్పారు. బాల్కా సుమన్ ఎంపీ, బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్ అయ్యారని పేర్కొన్నారు. అధికారం వచ్చిందని అహం ప్రదర్శించవద్దని, ప్రజలు బండకేసికొడతారని పార్టీ నాయకులను హెచ్చరించారు. కేసీఆర్ ఇంకా మాట్లాడారంటే.. మేనిఫెస్టోను వందశాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పేదల సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఎన్నికల్లో చెప్పకున్నా ఎన్నో మంచి పనులు చేశాం బీడీ కార్మికులకు భృతి, విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం 2017నాటికి మిషన్ భగీరథ పూర్తి పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నాం బీసీల సంక్షేమంపై మరింత దృష్టిపెడతాం -
ప్రయుత చండీయాగం చేస్తా
యాగస్థలిలో సీఎం కేసీఆర్ వెల్లడి ♦ తెలంగాణ సస్యశ్యామలం కావాలి ♦ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి ♦ తెలంగాణ సిద్ధించినందుకే ఈ యాగం చేశా ♦ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.. అధర్మం నశిస్తుందని వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతితో ప్రయుత చండీయాగం (సప్తశతీ పారాయణాలు పది లక్షలసార్లు చేయడాన్ని ప్రయుత చండీయాగం అంటారు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే శృంగేరి పీఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అనుమతి కోరతానని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పరిపూర్ణం కావాలని, నీటిపారుదల కోసం ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేలా దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘‘2011లో శృంగేరి స్వామి వారి 60వ పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం చేసినప్పుడు మేం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం. ఆరాట పడుతున్నాం. ఆ సమయంలో నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్రావు శృంగేరి పీఠం నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆయన తెచ్చిన అక్షింతలు మీద చల్లుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 100 శాతం అయుత చండీయాగం చేస్తానని దీక్ష తీసుకున్నా. అందుకే ఈ యాగం చేశాను’’ అని ముఖ్యమంత్రి వివరించారు. మనం నిమిత్త మాత్రులమని చెప్పా.. ‘‘గడా ఓఎస్డీ హన్మంతరావు ధర్మపత్ని, నా బిడ్డ ఎదురుగా నిల్చొని ఉన్నారు. నిప్పు రగిలి మంటలు లేస్తుంటే ఆ అమ్మాయి విషణ్ణ వదనంతో నిలబడింది. అప్పుడు నేను.. ఎందుకు తల్లీ.. బాధపడుతున్నావు.. మనం కేవలం నిమిత్త మాత్రులం అన్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మళ్లీ అందరం వెళ్లి శాంతి మంత్రాలు జపించి, పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు చూసిన. నిన్నటికే సుసంపన్నంగా కోటి జపాలు, 10 వేల పారాయణాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మహారుద్రయాగం నుంచి చతుర్వేద యాగాల వరకు కూడా పూర్ణాహుతి చేసుకున్నాం. అమ్మవారి 100 హోమగుండాల్లో పూర్ణాహుతి ఇవ్వడం జరిగిపోయింది. చివరి ఘట్టం మాత్రమే ఉంది.. మీరు ఆవాసానికి వెళ్లి రావచ్చని రుత్విక్కులకు చెప్పిన. ఆ సందర్భంగా చిన్న మంటలు చెలరేగితే.. నరహరి భట్టు గారు వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని ఒంటికాలుపై నిలబడి పరిసమాప్తి చేశారు. తెలియని వాళ్లు కొందరు గాబరా పడ్డా.. నేను గాబరా పడలేదు. యాగాలు చేయడం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తున్నా. కొందరు అవాకులు, చవాకులు పేలారు. నేను పట్టించుకోలేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధర్మం జయిస్తుంది.. తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నా. ధర్మం తప్పక జయిస్తుంది. అధర్మం నశిస్తుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధాంతి శర్మకు రవీంధ్రభారతిలో సన్మానం చేయాలని నిర్ణయించామని, వారు శతాధిక యజ్ఞాలు చేశారని చెప్పారు. ‘‘కొందరు మిత్రులు మన సంప్రదాయంపై దాడి జరుగుతోందని నాతో అన్నారు. మన సంప్రదాయం గురించి బాధపడాల్సిన పనిలేదని వారికి చెప్పాను. తల్లి పిల్లవాడికి చనుబాలు ఇస్తూ జోలపాట పాడుతున్నప్పుడే పిల్లవాడికి మన సంస్కృతిని ఎక్కిస్తుంది. జో అచ్చుతానందా... జోజో ముకుంద... రామ పరమానంద లాలి గోవిందా... అంటదే తప్ప జో కంస... జో దుర్యోధన... జో కుంభకర్ణ... జో రావణా అని ఏ తల్లీ అనదు. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైన విశిష్టత ఉంది. నా బోటి చిన్నవాళ్లు భవిష్యత్‌లో ఇంకా ఎంతో మంది పుడుతారు. బ్రాహ్మణోత్తములు, రుత్వికోత్తములు కార్య నిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటది. ధర్మం ఎల్లవేళలా విస్తరిస్తూనే ఉంటది. నా మనుమడు ఉన్నడు.. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ అబ్బాయి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నిన్న నాకు అయ్యవార్లు చెప్పారు. నీ మనమవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారు.. శుభం అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా
-
కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్ : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. బుధవారం దీపావళి పండగ పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. వెలుగులు విరజిమ్మే ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను ఆరోగ్య సౌభాగ్యాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. అయితే కేసీఆర్ దీపావళి వేడుకులు జరుపుకునేందుకు మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్ కి మంగళవారం రాత్రే చేరుకున్న సంగతి తెలిసిందే. -
విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో కేటీఆర్ భేటీ
న్యూఢిల్లీ: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ .. విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం కేటీఆర్.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కలిశారు. గల్ఫ్ లో తెలంగాణ వాసుల కష్టాల గురించి చర్చించారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నవారికి క్షమాభిక్ష ప్రసాదించి, వారు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి వివరాలతో ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. -
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవో ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కేసీఆర్ ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లనున్నారు. సూర్యాపేట నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
విలీన ప్రాంత ప్రజలకు 'చేదు అనుభవం'
రాజమండ్రి (నెల్లిపాక) : విలీన మండలాల ప్రజలు కనీస వైద్య సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇటు ఆంధ్రా అధికారులు పట్టించుకోకపోవడం , అటు తెలంగాణ ప్రాంతం వారు కనికరించకపోవడంతో విలీన ప్రాంత ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. పాముకాటుకు గురైన ఓ బాలిక చావుబతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. మండల పరిధిలోని కుసుమనపల్లి గ్రామానికి చెందిన పూసం శ్రీను సీతమ్మ దంపతుల కుమారై రోనామేరీ స్థానికంగా ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండంగా పాము కాటేసింది. కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి తెలంగాణ ప్రాంత వాహనమే వచ్చే అవకాశం ఉందని, వారు అక్కడికి రావడానికి నిరాకరిస్తున్నారని సమాధానం చెప్పారు. దీంతో బాలికను ద్విచక్ర వాహనంపై భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆంధ్ర ప్రజలకు ఇకడ వైద్యం చేయమని వైద్య సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో వారు చేసేదేమీలేక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని తండ్రి శ్రీనివాస్ వివరించాడు. -
జైపూర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితమిస్తాం
2016 మార్చికల్లా అందుబాటులోకి ప్లాంటు - రెండో యూనిట్ బాయిలర్ లైటప్కు శ్రీకారం - కార్మికుల లాభాల వాటాపై త్వరలో కేసీఆర్ ప్రకటన - సింగరేణి సీఎండీ శ్రీధర్ జైపూర్ : 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని 2016 మార్చికల్లా తెలంగాణ ప్రజానీకానికి అంకితమిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన రెండో యూనిట్ లైటప్కు ఆయన గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యూనిట్-2 బాయిలర్ లైటప్ను కంప్యూటర్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీటీజీ, బాయిలర్ టర్బైన్ జనరేషన్, బాయిలర్ ఎరాక్షన్, స్విచ్ యార్డు, బీవోపీ(బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) చిమ్నీ, నీటి రిజర్వాయర్, కూలింగ్ టవర్స్, యాష్ యార్డు, కోల్-హ్యాడ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), డీ-మినరలైజేషన్(డీఎం) ప్లాంట్, సర్క్యులేటింగ్ వాటర్(సీడబ్ల్యూ) సిస్టమ్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, కంప్రెషర్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎండీ శ్రీధర్ మాట్లాడారు. సింగరేణి డెరైక్టర్లు, జీఎంలు, అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల సహకారంతో 30 రోజుల వ్యవధిలో యూనిట్-1,యూనిట్-2 బాయిలర్ లైటప్ విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 6 నెలల క్రితం సీఎం కేసీఆర్ పవర్ ప్లాంటును సందర్శించడంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 కొత్త గనుల్లో ఈ ఏడాది 3 గనులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్మికులకు అత్యవసర సేవలు అందించడానికి 12 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ జైపూర్ ప్రాజెక్టులో కార్మికుల లాభాల వాటాను ప్రకటిస్తారని చెప్పారు. మూడో యూనిట్‌కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. 30 రోజులకోసారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని..బీటీజీతో పాటు పాటు బీవోపీ పనులు ఏకకాలంలో పూర్తరుుతేనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని సీఎండీ శ్రీధర్ వివరించారు. బీటీజీ పనులు 95 శాతం పూర్తవగా ప్రధానంగా బీవోపీ పనులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. నవంబర్‌లో మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేసి 2016 జనవరి నాటికి మొదటి యూనిట్, డిసెంబర్‌కల్లా రెండో యూనిట్ సింక్రనైజేషన్ చేసి వచ్చే మార్చిలోగా విద్యుత్‌ను అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్తు ప్లాంటు నిర్మిస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందన్నారు. ఈ ఏడాది అదనంగా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన 4 నెలల్లో 35 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలిగామన్నారు.అనంతరం నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ డెరైక్టర్లు రమేశ్‌కుమార్(ఆపరేషన్స్), రమేశ్‌బాబు(ఈఅండ్ఎం), పవిత్రన్ కుమార్(ఫైనాన్స్), మనోహర్ రావు(పీపీ), పవర్ ప్లాంటు ఈడీ సంజయ్‌కుమార్ సూర్, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, పాల్గొన్నారు. -
హైకోర్టు విభజనతోనే తెలంగాణకు న్యాయం
- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ కాజీపేట: ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనతోనే తెలంగాణ ప్రజలు సార్వభౌమత్వాన్ని అనుభవించగలుగుతారని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. కాజీపేట తారాగార్డెన్ కాళోజీ ప్రాంగాణంలోని ఆచార్య బియాల జనార్ధన్ హాల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేదికపై ఆదివారం తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షికోత్సం జరగింది. సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దక్కిన రాష్ట్ర ఆవిర్భా ఉత్సవం కొంతమంది కారణంగా తెలంగాణ వాసులకు దక్కకుండా పోతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని సీమాంధ్ర పాలకులు చేసిన వ్యాఖ్యలు తప్పని ఏడాది టీఆర్ఎస్ పాలన నిరూపించిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా చూడడం తెలంగాణ వాదులకు నైతికవిజమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన హైకోర్టు విభజన జరుపకపోవడంతో రెండు రాష్ట్రాల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని.. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. హైకోర్టులు స్థానికంగా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఒక హక్కు అని అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసిఆర్ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జిల్లా పరిషత్ చెర్మైన్ గద్దెల పద్మ మాట్లాడుతు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందన్నారు. సభ అధ్యక్షుడు, వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయాయే తప్ప మనుసులు ఎప్పటికి కలిసి ఉంటాయని అన్నారు. కవి, రచయిత నందిని సీదారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి, ఒంగోలు జిల్లా వాసి డాక్టర్ కోయి కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ ఎ.శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ బ్రహ్మం, ప్రొఫెసర్ వినయ్‌బాబు, పరాంకుషం, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ కవులు, కళాకారులు వేదికపై చేసిన ఆట, పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. -
'కాంగ్రెస్ పవర్ పోయింది.. ప్రజలకు పవర్ వచ్చింది'
హైదరాబాద్: కాంగ్రెస్ పవర్పోవడంతో తెలంగాణ ప్రజలకు పవర్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఆయన బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు కన్వీనర్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నేతలు అభివృద్ధి నిరోధుకలని ఆయన విమర్శించారు. గతంలో తెలంగాణ రాకుండ అడ్డుకున్న వారే నేడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ సంకల్పంతో రానున్న 20ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎర్రబెల్లీ... నీది ఏ ప్రాంతం..?: కడియం
దేవరుప్పుల(వరంగల్): తెలంగాణ ప్రజలు చీకట్లో మగ్గేలా ఇప్పటికీ కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వంచన ఉన్న టీడీప శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ ప్రాంత బిడ్డో తేల్చుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కడియం సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వపరిపాలన కోసం టీఆర్ఎస్ వైపు ప్రజలు ఆకర్షితులపుతున్నారన్నారు. క్షేత్రస్థాయి శ్రేణులను చూసైనా ఎర్రబెల్లిలో మార్పు రాలేదని మండిపడ్డారు. బాబు మోచేతి నీళ్ల కోసం తహతహలాడే ఎర్రబెల్లి పునర్విభజన కింద రాష్ట్రానికి రావాల్సిన 1133 మెగావాట్ల విద్యుత్ సంగతి తేల్సుకుని... తెలంగాణ బిడ్డవో...చంద్రబాబు చెంచావో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. -
ప్రత్యేకత ఉండేనా ‘ప్రభూ’..!
* రైల్వే బడ్జెట్‌పై తెలంగాణ ప్రజల ఆశలు * ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమేనని ఆవేదన * ప్రత్యేక రాష్ర్టంలో పెండింగ్‌లకు మోక్షం లభించేనా..? రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గురువారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రత్యేక ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో నిధులు కేటాయించి... పనులు ప్రారంభానికి నోచుకోక.. ప్రారంభమైనా పూర్తి కాకుండా ఉన్నవాటికి ఈసారైనా మోక్షం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. రైల్వేలైన్లు, కొత్త రైళ్లు, స్టేషన్లలో ఆధునిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వేకోచ్ కర్మాగారం దక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లోని పరిస్థితులు. - సాక్షి, నెట్వర్క్ ఆదిలాబాద్ * మంచిర్యాల -జద్గల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ టు బాసర డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలి. * గత బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా నేటికీ సర్వే కూడా ప్రారంభం కాలేదు. * 2010-11 బడ్జెట్లో మంజూరైన ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, హైదరాబాద్ రైల్వేలైను సర్వే పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. * ఆదిలాబాద్‌లో రూ.17 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం అంచనాల దశలోనే ఆగిపోయింది. వరంగల్ * కాజీపేటకు డివిజన్ హోదా కల్పించాలనే డిమాండ్ కార్యరూపం దాల్చడం లేదు. * 2012-13 బడ్జెట్లో ప్రకటించిన కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. * కాజీపేట మీదుగా సికింద్రాబాద్- నాగ్‌పూర్, సికింద్రాబాద్-విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామంటూ 2014-15 రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అదే బడ్జెట్లో ప్రకటించిన కాజీపేట నుంచి ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రారంభం కాలేదు. * జిల్లా మీదుగా వెళ్లే డోర్నకల్- మిర్యాలగూడ, మణుగూరు-రామగుండం కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి సర్వేలు చేపట్టినా నిధులు కేటాయించలేదు. * రైల్వేబడ్జెట్ 2012-13లో డోర్నకల్ - భద్రాచలం రోడ్డు-మణుగూరు డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజామాబాద్ * మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు రైలు మార్గం ఏర్పాటు, వివిధ నిర్మాణాలు, స్టేషన్లు తదితర సౌకర్యాల కల్పనకు రూ. 220 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా గత బడ్జెట్లో రూ 35 కోట్లు మాత్రమే కేటాయించారు. * నిజామాబాద్‌తో పాటు డిచ్పల్లి, కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను మాడల్ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేసిన నేటి వరకు ఎలాంటి పనులకు నోచుకోవడం లేదు. ఖమ్మం * భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణం పూర్తవడం ద్వారానే డోర్నకల్ జంక్షన్‌కు పునర్వైభవం సాధ్యం. ఈ లైను నిర్మాణ వ్యయం భరించేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చినా పనులు మొదలుకాలేదు. * కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న లైన్‌కు సింగరేణి సంస్థ తనవాటా నిధులు విడుదలకు ముందుకు వచ్చినా పనులు రైల్వే శాఖ నుంచి స్పందన లేదు. నల్లగొండ * సికింద్రాబాద్ - భువనగిరి మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడోలైన్ నిర్మాణం చేపట్టాలని 15 సంవత్సరాల క్రితం చేసిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. * బీబీనగర్ - నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు, మంజూరుకు నోచుకోవడంలేదు. * ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలన్న డిమాండ్ ఎండమావిగానే మిగిలింది. * నల్లగొండ- మాచర్ల రైల్వే లైన్ నిర్మాణం కోసం గత దశాబ్దం క్రితం రూపొందించిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. * గద్వాల-దేవరకొండ-నాగార్జునసాగర్-మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు అతీగతీ లేదు. మహబూబ్‌నగర్ * ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ లైన్ పనులను సర్వే వరకే పరిమితం. * ఒక్క ఆర్ఓబీ మాత్రమే పూర్తయింది. కరీంనగర్ * కొత్తపల్లి-మనోహరాబాద్ (వయా కరీంనగర్) రైల్వే ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించాలి. సత్వరమే భూసేకరణ పనులు చేపట్టాల్సి ఉంది. * ఎరువులు ఇతర వస్తువులను నిల్వ చేసేందుకు కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో షెడ్ నిర్మాణం చేపట్టాలి. * పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల్లో భాగంగా మిగిలిపోయిన 28 కి.మీల పనులను పూర్తి చేయాలి. ఇందుకోసం అవసరమైన రూ.200 కోట్ల మొత్తాన్ని 2015-16 రైల్వే బడ్జెట్లోనే మంజూరు చేయాలి. రంగారెడ్డి * కృష్ణా-వికారాబాద్ మధ్య 121.70 కిలోమీటర్ల బ్రాడ్ రైల్వేలైను కలగానే మిగిలింది. సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపాదించినా.. రైల్వే శాఖ నుంచి స్పందన లేదు. * ప్రతిపాదిత రైల్వే లైను మక్తల్, లింగంపల్లి, ఉట్కూరు, నారాయణ్‌పేట్, శాసన్‌పల్లి, అబాహంగపూర్, మద్దూర్, నందిపాడ్, కొస్గి, దాదాపూర్, దోమ, పరిగి, నస్కల్, వికారాబాద్ కాగితాలకే పరిమితమైంది. కాజీపేట వ్యాగన్‌కు లైన్ క్లియర్! 2011-12 బడ్జెట్లో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం దేవాదాయశాఖకు చెందిన కావడంతో భూసేకరణలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు 2015 ఫిబ్రవరి 15న దేవాదాయశాఖకు చెందిన 54.15 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించారు. దీంతో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. దీనికోసం రైల్వేశాఖ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధుల్లేక నత్తనడక మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర-మునీరాబాద్ పనులు పదేళ్లుగా ముందు కు సాగడం లేదు. దేవరకద్ర నుంచి జక్లేర్ వరకు దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఏర్పాటుచేశారు. భూసేకరణ ముందుకు సాగకపోవడం, నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.245 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడం లేదు. భూసేకరణా లేదు.. నల్లగొండ జిల్లా మేళ్లచెరువు నుంచి మఠంపల్లి మీదుగా నేరేడుచర్ల మండ లం జాన్‌పహాడ్ వరకు 100 కోట్లతో నిర్మించేందుకు రైల్వేలైన్ నిర్మాణ పను లు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పేరెన్నిక గల సిమెంట్ ఫ్యాక్టరీలను కలుపుతూ నిర్మించనున్న ఈ లైన్‌కు ఇప్పటికీ నిధుల మం జూరు లేదు. భూసేకరణ కూడా జరపాల్సి ఉంది. మెదక్ 2012-13 బడ్జెట్లో 129.32 కోట్లు అం చనా వ్యయంతో అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలోమీటర్ల మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం సగం ధర భరించడానికి సిద్ధం. భూ సేకరణకు, రైల్వే లైను నిర్మాణానికి నిధులు విడుదలైనా... పనులు ముందుకు సాగలేదు. -
తెలంగాణలో ఫిబ్రవరి 21నుంచి కరెంట్ కోతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలుకానున్నాయి. ఈ నెల 21నుంచి కరెంట్ కోతలు విధిస్తున్నట్టుగా టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. రోజుకు 4గంటలు చొప్పున కరెంట్ కోత విధించనున్నట్టు తెలంగాణ అధికారులు తెలిపారు. అయితే ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఈ కరెంట్ కోతలు ఉంటాయని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. -
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తీరిన సంవత్సరం ఇది
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీరిన సంవత్సరం, ఇది చరిత్రలో నిలిచిపోయే ఏడాది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి ఆయన బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వాళ్లెందరో ఉన్నారని, చివరకు ఉద్యమ పార్టీకే రాష్ట్ర ప్రజలు పట్టం గట్టారని కర్నె ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి అనేక పథకాలు చేపడతున్నారని, వాటర్ గ్రిడ్, చెరువుల అభివృద్ధి, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన ఆడపిల్లల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు తెచ్చారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని టీడీపీ ఓర్వలేక పోతోందని విమర్శించారు. -
తెలంగాణ రౌండప్..
►2014 మిగిల్చిన జ్ఞాపకాలెన్నో.. ► మన రాష్ట్రం.. మన పాలన ► పద్నాలుగేళ్ల ఉద్యమంతో తొలి అధికార పీఠానికి టీఆర్ఎస్ ► తొలి సీఎంగా కె.చంద్రశేఖర్‌రావు.. రూ. లక్ష కోట్లతో తొలి బడ్జెట్ ► రాష్ట్ర పండుగగా బతుకమ్మ.. గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు ► రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరెంటు కష్టాలు, జల వివాదాలు ► బియాస్ నదిలో కొట్టుకుపోయిన రాష్ట్ర విద్యార్థులు ► మాసాయిపేట ప్రమాదంలో చిన్నారుల దుర్మరణం ► రాష్ట్రంలో మారిపోయిన రాజకీయ సమీకరణాలు ► పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం ► కొన్ని జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం ► ఉనికి చాటిన వైఎస్ఆర్సీపీ.. వామపక్షం దయనీయం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, అరవై ఏళ్ల కల నెరవేరిన సంవత్సరమిది. కోట్లాది తెలంగాణ ప్రజల మదిలో నిలిచిపోయిన ఏడాది ఇది. ఉద్యమపార్టీగా రాష్ట్ర సాధనకు తోడ్పడిన టీఆర్ఎస్... తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించింది.. తెలంగాణకు చెందిన 13 ఏళ్ల గిరిజన విద్యార్థిని మాలావత్ పూర్ణ అతిచిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించింది.. ఇలాంటి తీపిగుర్తుల మధ్య ఎన్నో సమస్యలూ ఈ ఏడాదికి సాక్షీభూతంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌తో జల జగడాలు, విద్యుత్ వివాదాలు తప్పలేదు.. ఉద్యోగుల విభజన, ఇంటర్‌బోర్డు, పరీక్షల వ్యవహారాల్లో తగాదాలూ తప్పలేదు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన రాష్ట్ర విద్యార్థులు, మెదక్‌జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో బలైన చిన్నారులు ఇంకా కళ్లముందే మెదులుతున్నారు. - సాక్షి, హైదరాబాద్ 60 ఏళ్ల కల సాకారం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఇన్నాళ్లకు నెరవేరింది.. 2013 జూన్ 30వ తేదీ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన తర్వాత నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న లోక్‌భలో, 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస్ అయ్యింది. మార్చి 1వ తేదీన గె జిట్ విడుదలైంది. ఇక జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దేశంలో 29వ రాష్ట్రంగా, 12వ అతి పెద్ద రాష్ట్రంగా నిలిచింది. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాలతో ఏర్పాటైన తెలంగాణలో... ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అత్యధిక స్థానాలు సాధించి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం అమల్లోకి వచ్చిన జూలై 2వ తేదీనే ప్రమాణ స్వీకారం చే శారు. కొత్త రాష్ట్రం.. తొలి ఎన్నికలు కొత్త రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది జరిగిన తొలి ఎన్నికల్లో.. అంతకు ముందు పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. పద్నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ టీఆర్ఎస్.. 63 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, టీడీపీ 15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైఎస్సార్సీపీ 3, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకోగా... సీపీఎం, సీపీఐ ఒక్కో సీటును, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక 17 లోక్‌సభ స్థానాల్లో... టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, ఎంఐఎం ఒక్కో సీటు దక్కించుకున్నాయి. కొలువు తీరిన తొలి శాసనసభ.. రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన రోజే తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేయగా... తొలుత ఆయన 11 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జూలై 9వ తేదీన తొలిసారిగా సమావేశమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. కొంతకాలం తర్వాత శాసనమండలి చైర్మన్‌గా టీఎన్జీవోల సంఘం మాజీ నేత స్వామిగౌడ్‌ను ఎన్నుకున్నారు. శాసనసభ తొలి సమావేశాలు జూన్ 9 నుంచి 14 వరకు ఆరు రోజుల పాటు జరిగాయి. తొలి బడ్జెట్ సమావేశాలు నవంబర్ 5వ తేదీ నుంచి 29 వరకు 19 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రూ. 1,00,637 కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక పల్లెపల్లెకూ తాగునీటిని అందించేందుకు వాటర్‌గ్రిడ్, గ్రామీణ చెరువులకు నీటి కళను తెచ్చిపెట్టేలా చెరువుల పునరుద్ధరణ కోసం ‘మిషన్ కాకతీయ’, ఫార్మా సిటీ, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్‌సిటీ, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి వంటి వాటికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్ష వరకు పంట రుణాలను, బంగారంపై తీసుకున్న అప్పులను మాఫీ చేస్తూ సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. 36 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం రూ. 17 వేల కోట్ల రుణాలకు గాను మొదటి విడతగా రూ. 4,250 కోట్లు (25 శాతం) బ్యాంకులకు అందజేసింది. మిగతా సొమ్మును దశల వారీగా ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీయిచ్చింది. ‘సర్వే’త్రా ఉత్కంఠ.. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే నిమిత్తం ప్రభుత్వం విస్తృత స్థాయిలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిర్వహించింది. ఆగస్టు 19న ఒకే రోజు రాష్ట్రంలోని దాదాపు 90 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 3.6 కోట్ల మంది సమాచారాన్ని విజయవంతంగా సేకరించగలగడాన్ని ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సుమారు 1.20 లక్షల మంది ‘సర్వే’లో పాల్గొనడం విశేషం. సర్వే రోజున నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలన్నిటిని వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేసింది. బతుకమ్మకు కొత్త శోభ ఇంతకాలం గ్రామాలకే పరిమితమైన బతుకమ్మ పండుగకు 2014 సంవత్సరం కొత్త శోభను తెచ్చింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర వేడుకగా ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించింది. నగరంలోని ప్రధాన కూడళ్లను బతుకమ్మ సంప్రదాయం ప్రతిబింబించేలా అలంకరించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇక నుంచి ఏటా ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జల వివాదాలు.. లేఖాస్త్రాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఏడాది నీటి వివాదాలు చుట్టుముట్టాయి. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై జగడాలు తప్పలేదు. జల వివాదాలు చివరికి రాజకీయ వివాదాలుగా కూడా మారాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై రేగిన వివాదం డిసెంబర్ చివరిదాకా కొనసాగింది. సాగర్‌లో వాడకానికి అందుబాటులో ఉన్న 93 టీఎంసీల నీటిని ప్రస్తుత రబీ అవసరాలకు వాడుకుంటామని తెలంగాణ చెబుతుంటే... అసలు ఆ నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు లేదని ఏపీ వాదిస్తోంది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వాటా మేరకు అక్టోబర్‌లో శ్రీశైలం జలాశయం నీటిని వాడుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ అడ్డుపడి.. దుమారానికి తెరలేపింది. ఎడమ గట్టున విద్యుదుత్పత్తికి వీలుగా కనీస నీటి మట్టం 834 అడుగుల వరకు వాడుకొని తీరుతామని తెలంగాణ, 854 అడుగులకు దిగువన వాడుకునే వీలు లేదని ఏపీ పట్టుపట్టాయి. ఇందులో పైచేయి సాధించిన మన రాష్ట్రం... అవసరాల నిమిత్తం 854 అడుగుల దిగువన సైతం విద్యుదుత్పత్తి చేసింది. 277 గ్రామాలు ఏపీలోకి.. రాష్ట్ర విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 277 రెవెన్యూ గ్రామాలను తెలంగాణ కోల్పోయింది. పోలవరం ముంపు ప్రాంతాల కింద భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ఈ గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వీటిలోని భద్రాచలం రెవెన్యూ గ్రామంతో పాటు బూర్గంపాడు మండలంలోని 13 గ్రామాలను మినహా యించారు. అయితే.. ఈ గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డిమాండ్ మొదలుపెట్టింది. బూర్గంపాడు మండలాన్ని పూర్తిగా ఏపీలో కలిపితే కిన్నెరసాని జలాలపై ఆ రాష్ట్రం చేతిలోకి వెళ్లిపోయే అవకాశముంది. కరెంటుకు తప్పని కట కట.. విద్యుత్ అంశంలో ముందుగా ఊహించినట్లుగానే తెలంగాణకు కష్టాలు ఎదురయ్యాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చేష్టల కారణంగా విద్యుత్ వాటాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తప్పలేదు. ఖరీఫ్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి.. తెలంగాణలో రోజుకు దాదాపు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, సీలేరు కాంప్లెక్స్ నుంచి తెలంగాణకు వాటా మేరకు విద్యుత్ రావాల్సి ఉన్నా... ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో తెలంగాణలో విద్యుత్ లోటు మరింత పెరిగిపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసుకుంది. రాష్ట్ర, కేంద్ర ఈఆర్సీలతో పాటు కేంద్ర ఇంధన శాఖ సైతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కొనసాగించాలని సూచించినా.. ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తెలంగాణ శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేసింది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి ఒప్పందం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, కొత్తగూడెం ప్లాంట్‌లో అదనంగా 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో కృష్ణా తీరం వెంబడి.. ఎన్టీపీసీ, టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో భారీ ఎత్తున 7,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇవేగాక సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులకు నేరుగా సోలార్ పంపుసెట్లను అందించేందుకు చర్యలు చేపడుతోంది. వెంటాడుతున్న బియాస్ దుర్ఘటన.. జూన్ 7న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటన రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. స్టడీటూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు నదిలో దిగి ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి నెలరోజుల పాటు ఆధునిక పరికరాలతో గాలించి 23 మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష ఆచూకీ నేటికీ లభించలేదు. రాచఠీవితో సంబరాలు.. గతానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ స్వాతంత్య్ర దినోత్సవాలను తొలిసారిగా గోల్కొండ కోటలో నిర్వహించింది. దీంతో గోల్కొండ కోటపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. వినూత్నంగా నిర్వహించే ఆలోచనతో పరేడ్ గ్రౌండ్ నుంచి ఈ ఉత్సవాలను గోల్కొండ కోటకు మార్చినప్పుడు విమర్శలు వచ్చినా.. సీఎం కేసీఆర్ అక్కడే పతాకావిష్కరణ చేశారు. మారిన రాజకీయ ముఖ చిత్రం.. రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సుదీర్ఘకాలం అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, టీడీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు తమను నెత్తికెత్తుకుంటారనుకున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. బలమైన నాయకత్వం లేకపోవడం, తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్.. సహజంగానే అధికారానికి దూరమైంది. ఇక రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేసిన టీడీపీకి రంగారెడ్డి, హైదరాబాద్ మాత్రమే కొంత అండగా నిలిచాయి. పలు జిల్లాల్లోనైతే టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక రాష్ట్రంలో వామపక్షాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తెలంగాణవాదాన్ని భుజాన వేసుకున్న సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీకి వెళ్లినా... కేవ లం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమైక్యవాదానికి చివరివరకూ కట్టుబడి ఉన్న సీపీఎం ఒక సీటుతో సంతృప్తి పడింది. తెలంగాణలో తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో విజయం సాధించింది. ఇక నాయకుల వ్యక్తిగత ఇమేజ్‌తోనే అయినా బీఎస్పీ ఆదిలాబాద్ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకుంది. గులాబీ నేతల ఆపరేషన్ ఆకర్ష్ తమ పోరాటం ద్వారా తెలంగాణ కల సాకారమైందని చెప్పడంలో టీఆర్ఎస్ విజయవంతమైనా... రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథమేమీ పట్టలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు అవసరంకాగా... టీఆర్ఎస్ తెచ్చుకున్నది 63 స్థానాలు మాత్రమే. దీంతో తమ బలాన్ని పెంచుకునేందుకు టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ చేపట్టి వలసలను ప్రోత్సహించింది. జూన్ 25వ తేదీన ఒకే రోజు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు, ఇద్దరు పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కలిపి 11 మంది టీఆర్ఎస్లో చేరారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి (ఆగస్టు 7న), కనకయ్య (సెప్టెంబర్ 1న), రెడ్యానాయక్ (నవంబర్ 4న), కాలె యాదయ్య (నవంబర్ 16న), వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (సెప్టెంబర్ 1న) టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సరికొత్త చిహ్నాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రత్యేకంగా రాష్ట్రానికి కొత్త చిహ్నాలను ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, చెట్టుగా జమ్మిచెట్టు, పువ్వుగా తంగేడు పువ్వు, రాష్ట్ర జంతువుగా జింకను ఎంపిక చేయగా... కాకతీయ తోరణం, మధ్యలో చార్మినార్‌తో రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా రూపొందించారు. ‘మాసాయిపేట’ మహా విషాదం జూలై 24... పద్దెనిమిది మంది చిన్నారులను చిదిమేసిన ‘మాసాయిపేట’ విషాదం యావత్తు దేశాన్ని కదిలించింది. అమ్మానాన్నలకు టాటా చెప్పి ఆడుతూపాడుతూ ఉన్న చిన్నారులను తీసుకెళుతున్న పాఠశాల బస్సును మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద కాపలాలేని లెవెల్‌క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టిన ఈ ఘటనలో.. 12 మంది చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు చికిత్సపొందుతూ మరణించారు. ఈ ఘటన పార్లమెంటులో దుమారం లేపి... యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేలా చేసింది. దశాబ్దాల రైల్వే శాఖను మొద్దు నిద్ర నుంచి లేపింది. ఎవరెస్ట్ ఎక్కిన ప్రతిష్ఠ.. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అతిచిన్న వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. -
కేసీఆర్ సర్కార్‌ను నిలదీయాలి: పరకాల
తెలంగాణలో విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమనడం దారుణమని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏపీకి రావాల్సిన 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం అదనంగా వాడుకుందని పరకాల చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతులకు విద్యుత్ ఇవ్వలేకపోవడానికి చంద్రబాబే కారణమనడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం పరకాల విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 1300 మెగావాట్ల విద్యుత్‌ను అక్రమంగా ఉత్పత్తి చేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విద్యుత్‌ను ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో రోజుకు రెండున్నర గంటలు విద్యుత్ కోత విధిస్తే.. తెలంగాణలో రైతులందరికీ విద్యుత్ అందేదని ఎద్దేవా చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. తాము 900 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా కొనుగోలు చేశామని, రోజుకు రూ. 11.5 కోట్లు విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క యూనిట్‌ను కూడా అదనంగా కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయలేదో తెలంగాణ ప్రజలే నిలదీయాలన్నారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పీపీఏ వ్యవహారం కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్ధ(సీఈఆర్సీ) పరిధిలో ఉందని పరకాల గుర్తు చేశారు. -
నకిరేకల్ బతుకమ్మ సంబురాల్లో అపశ్రుతి
నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మను బంగారు బతుకమ్మగా తెలంగాణ ప్రజలు వాడవాడలా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో ప్రముఖుల సమక్షంలో బతుకమ్మ సంబురాలు జరుపుకుంటుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కూలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. స్టేజి కూలిపోవడంతో స్టేజిపై ఉన్నవారంతా కిందపడ్డారు. వారిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది. -
సర్వేలో అందరూ పాల్గొనాలి : సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించ తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను ప్రజలంతా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రజలంతా తమ ఇళ్ల వద్దకు వచ్చే అధికారులకు సరైన సమాచారం ఇవ్వాలని ఆయున విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి, ఏ కుటుంబంలోని ఏ వ్యక్తి ఏమి కోరుకుంటున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలియడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.ఈ మేరకు సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నార్సింగి ఫాంహౌస్‌లో కేసీఆర్: కేసీఆర్ సోవువారం వుధ్యాహ్నం కొందరు సన్నిహితులైన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో ఉన్న ఒక ఫాంహౌస్‌కు వెళ్లారు. వుంగళవారం జరగనున్న సమగ్ర ఇంటింటి సర్వే, సింగపూర్ పర్యటన నేపథ్యంలో వారు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. వుుఖ్యంగా కేబినెట్ విస్తరణ, మెదక్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఎంపిక, రాష్ట్ర కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం వంటివాటిపై చర్చలు జరిపినట్టు సమాచారం. -
సొంత ఊళ్లకు తెలంగాణ ప్రజలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న జనం అదనంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని టీ సర్కారుకు విజ్ఞప్తులు ముంబై: తెలంగాణలో 19వ తేదీన చేపట్టనున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ‘సర్వే రోజున లేకపోతే లెక్కల్లో లేనట్లే..’ అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. వారంతా సొంత ప్రాంతాలకు బయలుదేరారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబైలోనే దాదాపు ఎనిమిది లక్షల మంది వరకూ తెలంగాణవారు ఉన్నట్లు అంచనా. వీరితోపాటు మహారాష్ట్రలోని పుణే, గుజరాత్లో సూరత్ సహా పలు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ జిల్లాల వారు పనిచేస్తున్నారు. సర్వే నేపథ్యంలో వీరంతా సొంత ఊళ్లకు బయలుదేరుతుండడంతో... ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు చేరుకునే రైళ్లు, బస్సులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. 18వ తేదీ వరకూ సీట్లన్నీ ముందే రిజర్వు అయిపోయాయి. దీంతో అక్కడి ప్రైవేటు ఆపరేటర్లు అదనపు బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయినా అవేమీ సరిపోయే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ముంబై నుంచి అదనపు బస్సులు నడపాలని తెలంగాణ సర్కారుకు అక్కడ నివసిస్తున్న తెలంగాణవారు విజ్ఞ ప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని తాము తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ముంబై నుంచి అదనపు రైళ్లు, బస్సులు నడిపించాలని కోరామని టీఆర్ఎస్ ముంబై శాఖ అధ్యక్షుడు హేమంత్ కుమార్ చెప్పారు. కాగా.. తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్నారని, అందువల్ల అదనపు బస్సులు నడిపించాలని చూస్తున్నామని వర్లిలోని ఒక ప్రైవేటు బస్సు ట్రావెల్ సంస్థ యజమాని పేర్కొన్నారు. 19న సెలవు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 19వ తేదీన ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వే సందర్భంగా అందరూ ఇళ్లల్లో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఆరోజును సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులకు ఆ రోజు సెలవు దినంగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్‌తో అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. -
ఇసీవక్త్ ఘర్ చలో..
సాక్షి, ముంబై : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందున మహారాష్ట్రకు వలస వచ్చి స్థిరపడిన వేలాది మంది స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ వైపు వెళ్లే బస్సులు, రైళ్లు దాదాపు అన్నింటిలోనూ రిజర్వేషన్లు అయిపోయాయి. మరోవైపు అనేక మంది వెళ్లలేని పరిస్థితి.. పొట్టచేతబట్టుకుని ముంబైకి వచ్చిన కూలీలు ఒక్కసారిగా సొంత గ్రామాలకు వెళ్లాలంటే అన్నీ ఇన్నీ ఇబ్బందులు కావు.. సెలవులు దొరకవు.. సమయానికి చేతిలో డబ్బులుండవు.. ఇలా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందినవారైనప్పటికీ సొంత గ్రామాలకు వెళ్లలేకపోతున్నారు. ముంబై ప్రజలకు హామీ టీ సర్కార్ హామీ ముంబైలో నివసించే లక్షలాది మంది ప్రజలు ఈ నెల 19న జరగనున్న సమగ్ర కుటుంబ సర్వే విషయంపై తీవ్ర అయోమయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబై టీఆర్ఎస్ నాయకులతోపాటు నగరంలోని అనేక సంఘాల ప్రతినిధులు ఫోన్లు, ఇతర సమాచార సాధనాల ద్వారా టీ మంత్రులకు ఇక్కడి వారి సమస్యను తెలియపరిచారు. టీ మంత్రులు కూడా ముంబై ప్రజలకు సమగ్ర కుటుంబ సర్వే విషయంపై ఆందోళన వద్దని హామీ ఇచ్చారని వీరు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరాలంటే సమగ్ర సర్వే అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు సర్వే చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ నె ల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో సర్వే పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ రోజు తెలంగాణవాసులంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన సమాచారం మేరకు రూపొందించిన సర్వేనే అన్ని సంక్షేమ పథకాలకు ఆధారంగా మారుతుందని తెలిపారు. దీంతో తెలంగాణ జిల్లాల నుంచి మహారాష్ట్రకు వలసపోయిన కుటుంబాల్లో కలవరం మొదలైంది. 19వ తేదీనాటికి ఇళ్లకు రావాలని వారివారి బంధువులు ఎక్కడోఉన్న వారికి సమాచారాలిస్తున్నారు. దీంతో పరాయి రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం తరలివెళ్లిన వారంతా కుటుంబాలతో ఆ రోజునాటికి ఇళ్లకు చేరుకోవాలని ఆతృత పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా అందరు ఊరిబాట పట్టడంతో రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లభించడంలేదు. కొందరు ప్రైవేట్ వాహనాల ద్వారా తమ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. అనేక మంది పొట్టచేతబట్టుకుని వచ్చిన కూలీలున్నారు. చిరు ఉద్యోగాలు చేసేవారున్నారు. ఇలా వీరందరికి ఒక్కసారిగా కుటుంబసమేతంగా వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంలేదు. ముంబై, భివండీ చుట్టుపక్కల పరిసరాల్లోనే లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ తెలంగాణ వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైలు లేదా కనీసం తెలంగాణ వైపు వెళ్లే రైళ్లకు అదనంగా బోగీలను అమర్చాలని వీరు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా నడపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ విషయంపై ముంబైలోని వివిధ సంఘాల ప్రతినిధులతోపాటు ముంబై టీఆర్ఎస్ నాయకులు ఇక్కడి పరిస్థితులు, ప్రజల సమస్యలను టీ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో కుటుంబం మొత్తం తరలిరావాల్సిన అవసరం లేదని, కుటుంబ వివరాలు మొత్తం చెప్పగలిగే ఒకరుంటే చాలని తెలంగాణ మంత్రులు, నాయకులు సూచించినట్టు ముంబై టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్ తెలిపారు. -
సర్వే సందడి 19న ఊరికి పోవాలె!
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై అటు స్వరాష్ట్రంలోనే కాకుండా ఇటు ముంబైలోనూ సందడి మొదలైంది. సర్వేరోజున కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ముంబైలోని తెలంగాణ ప్రజలకు స్వగ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 19వ తేదీ రోజున ఇంట్లో ఉండేలా బయలుదేరి రావాలని సదరు ఫోన్ల సారాంశం. నాలుగు రాళ్ల కోసం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన తెలంగాణ ప్రజలు ముంబై, ఠాణే, పుణే నగరాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు తెలంగాణకు పయనమయ్యే యోచనలో ఉన్నారు. అయితే సర్వే అధికారులకు వివరాలు చెప్పేందుకు కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా? లేక సభ్యులంతా ఆరోజు ఇంట్లో ఉండాల్సిందేనా? ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చినవారి పరిస్థితి ఏంటి? ఏవైనా కారణాలవల్ల ఆ రోజు సొంత ఊరికి వెళ్లలేకపోతే కుటుంబంలో వారి పేరు గల్లంతవుతుందా? ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి సెలవు దొరకకపోతే ఎలా వెళ్లేది? ఇలా సవాలక్ష సమస్యలు ప్రవాస తెలంగాణ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాయి. న్యూస్ చానళ్లు, దినపత్రికల్లో వస్తున్న కథనాలను చదివి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు బయలుదేరాలంటే వేల రూపాయల ఖర్చు ఓ వైపు, మరోవైపు వెళ్లలేని పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంకటంగా మారింది. సర్వే గురించి స్థానిక తెలంగాణ ప్రజలు ‘సాక్షి’ కార్యాలయానికి, ప్రతినిధులకు ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఊరిబాట పట్టిన జనం... ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారన్న ప్రకటనతో అనేక మంది ఊరిబాట పట్టారు. దీంతో తెలంగాణవైపు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ తేదీల మధ్య టికెట్లు కావాలన్నా దొరకడంలేదు. దీంతో అనేక మంది ఇప్పటి నుంచే ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. పరిణామంగా రైళ్లు, బస్సులలో పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు కనిపిస్తున్నారు. ఆధార్ తర్వాత మళ్లీ ఇప్పుడు....! ఆధార్ కార్డుల కోసం స్వగ్రామాల బాటపట్టిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కారణంగా సొంత ఊరికి వెళ్తున్నారని భారత్ ట్రావెల్స్ యజమాని కె. జనార్ధన్, కుమార్ ట్రావెల్స్ యజమాని గుర్రపు నర్సింహస్వామి, ఆరెంజె ట్రావెల్స్ యజమాని మర్రి జనార్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. సర్వే ప్రకటన తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దీంతో 15వ తేదీ నుంచి దాదాపు తెలంగాణకు వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయ్యాయని చెప్పారు. చాలా మంది టిక్కెట్లు కావాలంటు ఫోన్లు చేస్తున్నారని, గతంలో ఆధార్‌కార్డు సమయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. వలస బిడ్డలను మరిచారా...? ఎన్నికలకు ముందు వలస బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్, నేడు ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం వలసబిడ్డలను మరిచిపోయిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి వలస బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన పోరాటాం గుర్తు లేదా? అని నిలదీస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే వలస బిడ్డలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పరాయి రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ వలస బిడ్డల కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్నఫలంగా బయల్దేరి రావడం కష్టమనే ఆవేధన ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలే అత్యధికం.... ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే స్థిరపడిన వారున్నారు. దీంతో ఇలా స్థిరపడినవారిలో సమగ్ర కుటుంబ సర్వే విషయంపై పెద్దగా ఎలాంటి కనిపించడంలేదు. అయితే స్వగ్రామాలతో సంబందాలు కలిగి, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటున్నవారు, తాత్కాలికం గా కూలి, ఇతర పనులపై కొన్ని మాసాలపాటు వచ్చిపోయే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వలస కూలీల సంఖ్య లక్షల్లో ఉంటుందని, ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది కూలీ పనులకోసం వచ్చి, మళ్లీ స్వగ్రామాలకు వెళ్తుంటారు. -
మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వంలోకి మార్చండి
హైదరాబాద్: తమను సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన సచివాలయ నాలుగోవ తరగతి ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలకు తమను వెంటనే తెలంగాణ ప్రభుత్వంలోకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన విజాపన పత్రాన్ని వారికి అందజేశారు. -
కేన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కేన్సర్‌తో బాధపడుతుండగా, ప్రతి వంద మందిలో ఒకరు ఇదే జబ్బుతో మృతి చెందుతున్నారని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. యశోద కేన్సర్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఏర్పాటు చేసిన‘ట్రిపుల్ ఎఫ్’ రేడియో సర్జరీ యంత్రాన్ని ఆదివారమిక్కడ హోటల్ పార్క్‌హయత్‌లో సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేన్సర్ చికిత్సలో ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ సాంకేతిక పరిజ్ఞానం ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. రోజుకు మూడు నిమిషాల చొప్పున కేవలం మూడు రోజుల్లోనే కేన్సర్‌ను నయం చేసే ఈ అత్యాధునిక పరిజ్ఞానాన్ని యశోద ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఆహారంలో చింతపండు ఎక్కువ వాడతారని, దీంతో ఇక్కడ కేన్సర్ కేసులు తక్కువ నమోద వుతున్నట్లు చిన్నప్పుడు ఓ పత్రికలో చదివానని, అయితే ఇందులో వాస్తవాలు వైద్యులే తేల్చాలన్నారు. ప్రతి జిల్లాకు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. క్లీన్ తెలంగాణను భవిష్యత్తులో గ్రీన్ తెలంగాణగా మారుస్తామని, ఇందుకోసం 25 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 35 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, యశోద గ్రూప్ చైర్మన్ రవీందర్రావు, మైహోమ్ గ్రూప్స్ అధినేత రామేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో తెలంగాణపై వివక్ష
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ఈ బడ్టెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఆదుకుంటుందేమోన్న ఆశలు నీరుగారిపోయాయన్నారు. గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ, ఉపాధి హామీ పథకాలకు నిధుల కేటాయింపును కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గింగచలేదన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. -
ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ కార్యదర్శికి సీఎస్ రాజీవ్‌శర్మ లేఖ సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో జరుగుతున్న అతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 1,038 మంది తెలంగాణ ప్రజలను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారు 850 మంది కాగా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వెళ్లిన తెలంగాణ వారిని కూడా కలుపుకొంటే ఆ సంఖ్య 1,038కి చేరిందని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని, అందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని రాజీవ్‌శర్మ కోరారు. -
'ఇరాక్ లో తెలంగాణవాసుల క్షేమ సమాచారం తెలపండి'
ఇరాక్‌లో అంతరుద్ధ్యం నేపథ్యంలో స్వదేశం వచ్చేందుకు సుముఖంగా ఉన్న రాష్ట్ర వాసులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తెలంగాణ వాసుల యోగక్షేమాలను తమకు తెలపాల్సిందిగా కేంద్రానికి రాసిన లేఖలో ఆయన కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1038 మంది ఇరాక్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారిలో 858 మంది ముంబై ట్రావెల్స్ ఏజెన్సీ, మరో 180 మంది జైపూర్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ప్రొటెక్టర్ అధికారికంగా వెళ్లారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. -
ఇరాక్‌లో బిక్కుబిక్కు
రాయికల్ : ఇరాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా యి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతోంది. దీంతో అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమాను లు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు. నాలుగు రోజులుగా వీరికి బయటిప్రపంచం తో సంబంధాలు తెగిపోయాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరిమితం అయ్యారు. ఏం జరుగుతోంది? ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీయాలని సూచించినట్లు సమాచారం. ఈమేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఇరాక్ నుంచి ఫోన్ చేస్తేనే... మా నాన్న పనికోసం ఆరు నెలల క్రితం ఇరాక్ వెళ్లాడు. మొన్నటివరకు ఆయన మంచిగనే పనిచేసుకుంటూ ఉన్నాడు. వారం రోజులుగా ఇరాక్‌లో యుద్ధం జరుగుతందని టీవీల్లో చూసి భయమైతంది. ఫోన్ చేస్తే కలవకపోతే బాగా భయపడ్డాం. నాన్నే ఇరాక్ నుంచి ఫోన్ చేసి నేను మంచిగనే ఉన్నానని, భయపడవద్దని చెప్పిండు. - శేఖర్, కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం నాలుగు రోజులుగా క్యాంపుల్లోనే.. ఇరాక్‌లో యుద్ధం జరగడంతో మా యజమాన్యం కంపెనీల్లో పని చూపించకుండా క్యాంపుల్లోనే ఉంచుతోంది. మా యోగక్షేమాలు కూడా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. - వడ్లూరి భూమయ్య, ఇరాక్ నుంచి.. ఆదుకోవాలి.. ఇరాక్‌లో యుద్ధ వాతావరణంలో తెలంగాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించాలి. విదేశాంగ మంత్రితో మాట్లాడి మనవారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. - కోటపాటి నర్సింహనాయుడు, గల్ఫ్ బాధితుల పోరాట హక్కుల సమితి అధ్యక్షుడు -
కన్నీరొలికిన కాలం సాక్షిగా
తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. రణరంగాలైన విశ్వవిద్యాలయాలు ఆనంద తాండవమాడుతున్నాయి. నోళ్లు తెరిచిన జైళ్లు నవ్వులు చిందిస్తున్నాయి. లాఠీలకు, తూ టాలకు, రైళ్లకు ఎదురొడ్డి నిలిచి, చెట్లకు వేలాడి, భగ్గున మండిన బిడ్డల త్యాగాల పంటను చూసి తల్లుల కళ్లు చెమరుస్తున్నాయి. కన్నీరొలికించిన కాలం సాక్షిగా, నెత్తురు చిందించిన చరిత్ర సాక్షిగా తెలంగాణ కన్ను తెరిచింది. రగిలిన విద్యార్థి హృదయాల నుంచి, అవి ఒలికించిన నెత్తుటి మడుగుల నుంచి మొలిచిన 1953 ముల్కీ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరి పోసింది. 370కి పైగా విద్యార్థి. యువత గుండె నెత్తురులతో ప్రజ్వరిల్లిన ‘1969’ ఆ ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటింది. వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకత్వం తెలంగాణ ఆకాంక్షను పదవులుగా సొమ్ము చేసుకుంది. దగాపడ్డ తెలంగాణ కోస్త్రాంధ్ర భూస్వామ్య శక్తుల అణచివేతకు గురైంది. దాదాపు రెండు దశాబ్దాల ఆ చీకటి కాలం మరో ఉద్యమ వెల్లువను కడుపున మోసింది. 1990లలో ఆవిర్భవించిన తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి సంస్థలు నివురుగప్పిన నిప్పును ఊది ఊది మండించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మలి దశకు నాంది పలికాయి. ఈ దశలోనే చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణను రక్తసిక్తం చేసింది. తెలంగాణ కోసం గళమెత్తిన బెల్లి లలిత, ఐలన్న వంటి కళాకారులను పాశవికంగా బలిగొంది. 2001లో టీఆర్ఎస్ పుట్టడానికి ముందటి ఈ రక్తసిక్త చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అయినా కొందరు 2001లో లేదా జేఏసీ ఏర్పడ్డ 2009లో ఈ మలి దశ ప్రారంభమైందంటూ కొందరు కట్టుకథలను చరిత్రగా అమ్మే ప్రయత్నం చేస్తుండటం నీతి బాహ్యం. నాటి బలిదానాల కొనసాగింపుగా జరిగినవే 2009 నాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, మిలిటెంట్ విద్యార్థి పోరాటాలు, వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, వెయ్యి మంది ఆత్మ త్యాగాలు. నెత్తుటి పొద్దయి మొలిచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఖ్యాతి ఏ ఒక్కరిదో కానే కాదు. ఇది ప్రజలందరి పోరాటాల విజయం. ముంచు ‘వరం’ ముప్పు: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినందుకు సంబురాలు జరుపుకుందాం. కానీ మన మూలాలను ముంచెత్తే పోలవరం ప్రాజెక్టు మీదుగా తెలంగాణ వచ్చిందనే విషాదకర వాస్తవాన్ని విస్మరించలేం. ఏ నాగరిక సమాజపు చారిత్రక, సాంస్కృతిక మూలాలు ఆదివాసుల్లోనే నిలిచి ఉంటాయి. పోలవరం ముంచెత్తనున్న ఆదివాసి ప్రాంతాలతో పాటే మన తెలంగాణ కుదుళ్లు కూడా శాశ్వతంగా అదృశ్యం కానున్నాయి. విశాఖలో బహుళ జాతి కంపెనీల కోసం ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్ అవసరాలే పోలవరం నిర్మాణపు ప్రధాన లక్ష్యమని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నాడు. వెంకయ్యనాయుడుతో కుట్ర చేసి ఆసాధారణమైన ఆర్డినెన్స్‌ను తెచ్చి ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అందుకే ఇక్కడ మనం విజయోత్సవాలు జరుపుకుంటుండగా అక్కడ ఆదివాసులు నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వపు ప్రజా ఎజెండాలో మొదటి అంశం పోలవరం ముంచేయనున్న ఆదివాసుల పరిరక్షణే కావాలి. సాగు నీరు: మూడు జీవ నదులున్నా నేల తల్లి దాహార్తిని తీర్చలేని రైతాంగానికి తెలంగాణ రావడమంటే సాగు నీరు రావడమేనని ఆశలు కల్పించాం. వాటిని తీర్చడమే తొలి ప్రభుత్వపు ఎజెండాలోని రెండో అంశం కావాలి. భూములు పడావులు పడగా, పొట్ట చేతబట్టుకుని రైతులు, కూలీలు పట్టణాలకు తరలుతున్న దైన్య గ్రామీణ తెలంగాణకు కావాల్సింది ప్రజలను నిరాశ్రయులను చేసే పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు కావు. చిన్న చిన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్నిచ్చి తక్కువ వ్యయాలతో ఎక్కువ ప్రయోజనాలను సాధించాలి. కాకతీయులు గొలుసుకట్టు చెరు వులతో లక్షలాది ఎకరాలకు నీరందించారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాల ఫలితంగా అవి పూడుకుపోవడమో, తెగిపోవడమో జరిగింది. కొత్త ప్రభుత్వం వాటితో పాటూ జూరాల, సాగర్, శ్రీరాంసాగర్ ఎడమ కాల్వలకు మరమ్మతులు చేయిం చాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేయాలి. పారిశ్రామిక రంగ పునరుజ్జీవం: చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలోని వేలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఆల్విన్, హెచ్ఎంటీ, డీబీఆర్, అజాంజాహీ మిల్లు అందులో మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ పరిశ్రమలను పునరుద్ధరించి, వ్యవసాయాధార పరిశ్రమలను, చేతివృత్తులను ప్రోత్సహించి పారిశ్రామికీకరణకు నూతనోత్తేజాన్ని కల్పించడమే నూతన ప్రభుత్వానికి ప్రజల మూడో ఎజెండా. తెలంగాణ రావడమంటే ఉపాధి అవకాశాలు కలగడమేనని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మాదిగ, కమ్మరి, కుమ్మరి, చేనేత వృత్తుల వాళ్లంతా ధ్వంసమైన తమ వృత్తులకు మంచి రోజులు రావడమేనని నమ్ముతున్నారు. కొత్త ప్రభుత్వం తక్షణమే ఆ వృత్తులను నవీకరించి పోటీ ప్రపంచంలో నిలిచేలా నిలపాల్సి ఉంది. అందుకు స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే మార్గం. విద్యారంగ పునర్నిర్మాణం: తెలుగు భాష నిరాదరణకు గురైన నిజాం పాలనలో 4 శాతం అక్షరాస్యతతో తెలంగాణ దేశంలోనే వెనుకబడిపోయింది. ఆ తదుపరి కోస్తా కమ్మ దొరల, పెట్టుబడిదారుల పాలనలో వివక్షకు గురై విద్యారంగం పుంజుకోలేకపోయింది. తెలంగాణ భాష, సాహిత్యం నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ చరిత్రకు పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కకుండా పోయింది. బాబు ‘విజన్-2020’ విద్యారంగం 70% పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. చదువు అంగడి సరుకుగా మారి పేదలు, బడుగు వర్గాలకు అందకుండా పోయింది. దళితుల్లో 10%, బీసీల్లో 12%, ముస్లింలలో 8% మాత్రమే ఉన్నత విద్యకు నోచుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకు కళ్లెం వేసి, ఉన్నత విద్యకు బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించడం కొత్త ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ కృషికి సహకరించి విద్యాప్రమాణాలను, నాణ్యతను పెంచాల్సిన బాధ్యత గురువులు, నిపుణులు, పౌరప్రభుత్వానిది. తెలంగాణ ఉద్యమంలో ఎనలేని త్యాగాలు చేసిన విద్యార్థి, యువత తెలంగాణతోపాటే ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. వాటిని నెరవేర్చడమే ఐదో ఎజెండా. తెలంగాణలో గుర్తించిన ఖాళీలే లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి వాటిని భర్తీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైరె జ్ చేస్తామనే వాగ్దానాన్ని తు.చ. తప్పక నెరవేర్చాలి. ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగాలను రద్దు చేసి పూర్తి కాలం ఉద్యోగులను నియమించాలి. స్థానిక వనరులతో చిన్న పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి పథకాలతో యువత శక్తులను తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా వినియోగించుకోవాలి. త్యాగాలను చాలు బోసిన అమరుల కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి. తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలిపిన కవులు, కళాకారులకు తగు గుర్తింపును, సహాయాన్ని అందించాలి. ప్రజా కళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. తీవ్ర అణచివేతకు గురైన పౌర, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అంతిమంగా ప్రజాస్వామిక విలువలు పరిఢవిల్లే తెలంగాణ ను రూపొందించుకోవాలి. (వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్) డాక్టర్ సి. కాశీం -
మిన్నంటిన తెలంగాణ సంబురాలు
సాక్షి, ముంబై: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ముంబైలోని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్, ఎంటీజాక్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం చెంబూర్ నాకా వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటీజాక్కు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణేత ర ప్రజలు కూడా పాల్గొన్నారు. మిఠాయిలు పంచుకుంటూ, గులాబీ పువ్వులను వెదజల్లుతూ నాకాను గులాబిమయం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ‘జాక్’ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి చేతుల మీదుగా ‘టీ అధికారిక రాజముద్రను’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాజముద్రలో పొందుపర్చిన కాకతీయ చిహ్నం, సత్యమేవ జయతే, చార్మినార్ చిహ్నాల గురించి సువిస్తారంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంటీజాక్ కన్వీనర్ దేవానంద్ నాగిల్ల, డాక్టర్ శ్రీగాది లక్ష్మణ్, ఎస్.అంజయ్య, బహుజన కళాకారులు నాగ్‌రాజ్, బి.రాములు మాదిగ, శంకర్, భీంరత్న మాల, టీఆర్ఎస్ ముంబైశాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, పాండురంగ్ పద్మశాలి, బి.ద్రవిడ్ మాదిగ, మూల్నివాసి మాల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. ముంబై తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తూర్పు బాంద్రా తెలంగాణ సంబురాలు జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చినందుకు కార్మిక సంఘం సభ్యులందరూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పు ష్పాల సత్తయ్య మాట్లాడుతూ.. ఇది తెలంగాణ అ మర వీరుల త్యాగ ఫలితమనీ, వారి కృషి, పో రాటం వల్ల వచ్చిన తెలంగాణను వారికే అంకిత మి వ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నగరానికి వలస వచ్చిన కార్మికులందరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని కోరారు. ముంబైలోని తెలంగాణ ప్రజలు కుల ధ్రువీకరణ పత్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు రాష్ట్రంలో వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేషన్, ఓటింగ్, ఆధార్ కార్డులు తెలంగాణలో ఉండే విధంగా చూడాలని కోరారు. అధ్యక్షుడు జట్ట కృష్ణ, ఉపాధ్యక్షుడు జె.రాంచందర్, ప్రధాన కార్యదర్శి కుండ చంద్రయ్య, కార్యదర్శి పిట్టల గణేష్, కోశాధికారి పుష్పాల సత్తయ్య, కార్యకర్తలు బొల సిద్దులు, కె. యాదగిరి, కంచర్ల ఉప్పలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్లిలో... స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సాగిన ఈ సంబరాల్లో మహిళలు, వృద్ధులతోపాటు భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా అన్నపూర్ణ, నారాయణ తదితరులు తెలంగాణ పాటలు పాడి ఉత్తేజపరిచారు. మహిళలు బోనాలతో ఊరేగింపు తీశారు. రాత్రి 12 గంటలకు భారీ కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట గౌరవాన్ని ఈ మరాఠీ నేలపై ఇనుమడింపచేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వ్యక్తిదన్నారు. మాతృసంస్థ అయిన ఆంధ్రమహాసభలో కూడా తెలంగాణ వారికి తగిన గౌరవమర్యాదలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్లి పద్మశాలి సమాజ సుధారక మండలి అధ్యక్షులు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి కార్యదర్శి డాక్టర్ వీరబత్తిని చంద్రశేఖర్, ఆంధ్రమహాసభ అధ్యక్షులు సంకు సుధాకర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్, తెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, ముంబై తెలుగు మిత్రబృందం చైర్మన్ మర్రి జనార్ధన్, పద్మశాలి యువక సంఘం అధ్యక్షులు గంజి గోవర్ధన్, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అశోక్ కంటే, మోడ్రన్ ఇంగ్లిష్ స్కూల్ వ్యవస్థాపకులు గాలి మురళి తదితరులతోపాటు మండలి ప్రతినిధులు వేముల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ముంబై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో... చెంబూర్ నాకా వద్ద ముంబై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన కార్యదర్శి శివ్‌రాజ్ బొల్లే ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలలో వందలసంఖ్యలో కార్యకర్తలు జెండాలు పట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలను ధూంధాంగా నిర్వహించారు. సోమవారం ఉదయం బోరివలి స్టేషన్ సమీపంలో తెలుగు నాకా వద్ద జరిగిన సంబరాల్లో వందల సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొని ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. డ్యాన్సులు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. సంఘం అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ కల సాకారమైందని కొనియాడారు. తెలంగాణ నూతన రాష్ట్రానికి ప్రప్రథమంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కె. చంద్రశేఖర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నూర సతయ్య, పెంట గంగన్న, కోశాధికారి తోట సత్తయ్య, కమిటీ చైర్మన్ నీరటి భూమన్న, సాంస్కృతిక కార్యదర్శి గాజుల నర్సారెడ్డి, సుఠారి నారాయణ, పురంశెట్టి గోపాల్, పంతులుగారి సత్యనారాయణ, గంగాధరి లచ్చన్న, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సోనియా దేవతా?: కేటీఆర్
ఇంటర్వ్యూ: కల్వకుంట్ల తారకరామారావు * వందలమంది బలిదానాలకు సోనియానే కారణం * తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి బోరెడ్డి అయోధ్యరెడ్డి: తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని, అధికారంలోకి రాగానే నెరవేరుస్తానని కరీంనగర్ సభలో పదేళ్ల కిందట చెప్పిన సోనియాగాంధీ ఆ తర్వాత ఆ విషయంలో జాప్యం చేయడం వల్లే 12వందల మంది ఆత్మత్యాగం చేసుకున్నారని టీఆర్ఎస్ నేత, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా ఉన్న ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణకు జరిగిన అన్యాయం, పార్టీని విలీనం చేయకపోవడానికి కారణాలు, తెలంగాణ పునర్నిర్మాణం.. తదితర అంశాలపై వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దేవతని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 12వందల మందిని బలితీసుకున్న సోనియాని దేవత అని ఎలా అనాలి. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గడం వల్లే ఇంతమంది ప్రాణం త్యాగం చేసుకున్నారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ బిడ్డ యాదిరెడ్డి సాక్షాత్తూ పార్లమెంటు ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి సోయి తెచ్చింది టీఆర్ఎస్సే. తెలంగాణ కోసం టీఆర్ఎస్, కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగం వృథాపోవు. తెలంగాణ ఆకాంక్షలు, దు:ఖం, ఆర్తి తెలిసిన టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. షరతుల మధ్య విలీనమెలా? తెలంగాణ అంశంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ తీవ్రంగా కలత చెందారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తెలంగాణను ఏర్పాటు చేసి ఆత్మహత్యలు ఆపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అందుకు అవసరమైతే పార్టీని విలీనం చేస్తానని ఏడాదిన్నర క్రితమే మాటిచ్చారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఆ పార్టీ నయవంచనతో ఆత్మహత్యల పరంపర కొనసాగింది. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేశారు. అందులోనూ ఎన్నో షరతులు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం, స్థానికత ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన వంటి మెలికలు పెట్టారు. ఇన్ని షరతుల మధ్య పార్టీని ఎలా విలీనం చేస్తాం. నెలల శిశువులాంటి తెలంగాణను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెడితే భావితరాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని ప్రజలే భావిస్తున్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలంటే టీఆర్ఎస్ మనుగడ సాగించాల్సిందే. తెలంగాణ కష్టం, నష్టం తెలిసిన పార్టీ.. పునర్నిర్మాణంలో ఉండాలని ప్రజలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్. వసూళ్ల పార్టీ అని నిరూపించగలరా.. టికెట్ల కోసం టీఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నవారు ఆ విషయం నిరూపించగలరా? టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత లెక్కలేనని బహిరంగ సభలు, కార్యక్రమాలు చేపట్టాం. ఉప ఎన్నికల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చాం. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ 13ఏళ్లలో పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నిరసనలకు, పోరాటాలకు వాటిని వేదికలుగా చేసుకుంది. ఇందుకోసం విరాళాలను ప్రజల నుంచే సమీకరించాం. పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా ముఖ్యనేతలంతా కూలి పనులు చేసి విరాళాలు సేకరించాం. తెలంగాణ వ్యతిరేక వర్గాలే టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అని దుష్ర్పచారానికి దిగుతున్నయ్. మరి కాంగ్రెస్, టీడీపీ నిధులు ఎలా సమకూరుస్తున్నయ్, వాటి గురించెందుకు మాట్లాడరు. వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఒక్కటీ లేదు రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణపై మమకారంతో మా కుటుంబమంతా ఉద్యమంలో మమేకమైంది. ఉద్యమంలో కేసీఆర్, హరీష్‌రావు, నేను, కవిత జైలుకు కూడా వెళ్లొచ్చాం. ఉద్యమానికి అడ్డురాని కుటుంబ నేపథ్యం.. ఎన్నికలకు మాత్రం అడ్డెలా అవుతుంది. కుటుంబ పెద్ద రాజకీయాల్లో ఉంటే వారి వారసులకు కొంత అడ్వాంటేజీ అవుతుందనేది కాదనలేని నిజం. అయినా దేశంలో వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏది చెప్పండి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీవి వారసత్వ రాజకీయాలు కావా? డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, శివసేన వంటి అన్ని పార్టీల్లోనూ వారసులు ఉన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్లినవారు చేసే ఇటువంటి విమర్శలు అర్థం లేనివి. -
మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల
* టీఆర్ఎస్ పునాదులివే: టీ-పీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం * కేసీఆర్‌కు అహకారం ఎక్కువైంది * అమరవీరుల కుటుంబాలను అవమానిస్తావా? * తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారు సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులు, మోసం, దగా, కుట్ర, నమ్మక ద్రోహం వంటి వాటితో నిర్మించిందే టీఆర్ఎస్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నిత్యం అబద్దాలాడుతూ గుడ్డిగా ఓట్లు దండుకోవాలనుకునే ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడాల్సిందేముందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్మ, రెడ్లు రాజ్యమేలగా లేనిది.. తన సామాజికవర్గం రాజ్యమేలితే ఏముం దంటూ కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతుంటే.. టీఆర్ఎస్ మాత్రం అమరవీరులను చులకన చేస్తోందని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వాలంటే దక్షిణాదిలోని సీట్లన్నీ కావాలని ఆ పార్టీ హేళనగా మాట్లాడుతోందని, 1200 మంది అమరుల కుటుంబాలకు ఏనాడూ సాయం చేయని నైజం కేసీఆర్‌దని మండిపడ్డారు. కేసీఆర్‌నుద్దేశించి పొన్నాల ఇంకా ఏమన్నారంటే.. నాకు, నా కుటుంబ సభ్యులకు పదవులు వద్దు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానని ఆనాడు అనలేదా? ఇప్పుడేమో నా కుటుంబ సభ్యులు ఉద్యమంలో లేరా.. ఎవరి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావట్లేదని ప్రశ్నిస్తావా? నీ కుటుంబం ఒక్కటే తెలంగాణ కుటుంబమా? టీఆర్ఎస్లో సమర్థులెవరూ లేరా? * తెలంగాణ వస్తే దళితుడిని సీఎం, మైనారిటీని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పావు. ఇప్పుడేమో వారు ఆ పదవులకు సమర్థులుకారనే విధంగా మాట్లాడుతూ అవమానపర్చడం నీ అహంకారానికి నిదర్శనం కాదా? * ఉద్యమంలో నీ కుటుంబం ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే టిక్కెట్లు ఇస్తున్నామని చెబుతున్నావు. మరి వేలాది మంది ఉద్యమకారులు వందలాది కేసులు మోసి ఉద్యమాన్ని నడిపించారు. వారికి టిక్కెట్లు అవసరం లేదా? ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన చెరుకు సుధాకర్‌లాంటి నేతలను అవమానిస్తావా? * ఉద్యమం పేరుతో దందాలు చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నావని... దళిత, బడుగు వర్గాల యువకులను ఆత్మహత్యలకు ప్రోత్సహించావని కొండా సురేఖ దంపతులు గతంలో నీపై చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నావా? * జలయజ్ఞంలో భాగంగా 48 ప్రాజెక్టులపై బహిరంగ చర్చ పెడితే ఏ ఒక్కనాడూ స్పందించని నీవు.. ఇంతకాలం నిద్రపోయి ఎన్నికలు రాగానే పోలవరం, పులిచింతల, దుమ్ముగూడెం అంటూ సాంకేతిక అంశాలను ముందుపెట్టి రాజకీయాలు చేస్తావా? తెలంగాణ వచ్చినందున నీ దుకాణం బందవుతుందన్న భయంతోనే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నావు. -
యువత చేతుల్లోనే..
నవ తెలంగాణ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర కొత్త రాష్ట్రంలో సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరతలను నెలకొల్పే నిర్మాణాత్మక ప్రక్రియలో తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉంది. తమ ఆశయాలు ప్రభుత్వ అజెండాలో, విధాన ప్రక్రియలో భాగమ య్యేలా.. వేగంగా మార్పు చెందుతున్న రాజకీయ వ్యవస్థలో తమ వాణి కూడా వినిపించేలా.. సమ్మిళిత, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ యువత కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, తమపై ప్రభావం చూపే వ్యవస్థాపరమైన నిర్మాణాల సమగ్ర సంస్కరణల కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ‘ప్రెజర్ గ్రూప్’ బాధ్యతను కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి కోసం.. తమ వాణిని వినిపించే విషయంలో, భాగస్వామ్యాన్ని కోరే విషయంలో తమ డిమాండ్లను పట్టించుకునే వ్యవస్థ కోసం పని చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగావకాశాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ ఉద్యోగాల వల్ల లభించే ఉద్యోగ భద్రత, అధిక వేతనాల వల్ల యువత ఆ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. అదీకాక, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక తామేం చదవాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతగా ఉండే డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగ పడే డిగ్రీలు, లేదా వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు వారు ప్రయత్నించడం లేదు. దాంతో మార్కెట్ అవసరాలకు.. విద్యార్థులు నేర్చుకుంటున్న నైపుణ్యాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. అందువల్ల ప్రైవేటు రంగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలనిచ్చే కోర్సులను రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలను యువత ప్రభావితం చేయాల్సి ఉంది. సంప్రదాయ విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా కానీ, కొత్త కోర్సుల రూపకల్పన ద్వారా కానీ విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంచే దిశగా ప్రభుత్వంపై యువత ఒత్తిడి తేవాల్సి ఉంది. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయంపై తెలంగాణ యువత దృష్టి పెట్టాలి. తెలంగాణ యువతలోని కొన్ని వర్గాల్లో స్వయం ఉపాధిపై, సొంతంగా పరిశ్రమలు స్థాపించడంపై ఆసక్తి ఉంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయంలో కూడా వాస్తవం ఉంది. అయితే, సరైన రుణ సదుపాయాలు కల్పించడంలో కానీ, వ్యాపార నిర్వహణలో సహకారం విషయంలో కానీ ఉన్న అనేక అడ్డంకులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యాపారావకాశాల్లో, ఉద్యోగ కల్పనలో అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంపై యువత దృష్టి పెట్టాలి. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. దీనివల్ల నిరుద్యోగ సంక్షోభానికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం కాకుండా, తమ జీవితాల్లో నిజమైన మార్పు రావడానికి యువత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినూత్న ఆవిష్కరణల అభివృద్ధిని నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారంగా భావించవచ్చు. నూతన అభివృద్ధిదాయక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం యువత సానుకూల చైతన్యంతో, అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. ఆకలి, అభిలాష, స్ఫూర్తి, పట్టుదల, అద్భుత శక్తి కలిగిన యువత.. తెలంగాణ నవ నిర్మాణంలో తన వంతు పాత్ర కచ్చితంగా పోషించగలదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలించింది. 2014 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తమ ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపమైన బంగారు తెలంగాణను రూపొందించుకునేందుకు యువత పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. - ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ జర్నలిజం విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం మార్పు కోసం పరితపిస్తారు ‘‘వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల లోపు యువకుల్లో సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాల ఆధారంగా వారు ఓట్లు వేసే అవకాశముంది. తమలా ఉండే నాయకుని వైపే వారు మొగ్గుతారు. వారికి కులం, మతం పట్టవు. సమాజం కోసం పాటుపడే వారికి మాత్రమే ఓటు వేస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. - ఎ.వి.రంగనాథ్, ఎస్పీ, ఖమ్మం జిల్లా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ‘‘యువ ఓటర్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మిన పార్టీకే నిర్భయంగా ఓటేస్తారు. సుపరిపాలను, జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీ కంటే ముఖ్యంగా నేతను చూసి ఓటేసే అవకాశముంది. అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా’ మీట నొక్కేవారిలో యువకులే అధికంగా ఉంటారు’’ - సిద్ధార్థ జైన్, కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా ఆలోచించి ఓటేస్తారు ‘‘సాధారణ ఓటర్లు ప్రలోభాలకు గురవుతుంటారు. కానీ యువతీ యువకులు మాత్రం అలాగాక మంచీ చెడు ఆలోచిస్తారు. ఎవరు సరైన నాయకుడో పరిశీలించి ఓటేస్తారు. దీనివల్ల మనం సరైన నాయకత్వాన్ని చూసే అవకాశముంటుంది’’ - డాక్టర్ నిఖిత, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాద్ ‘రెడీమేడ్’తో బతుకు ఛిద్రం వృత్తిపథం: స్వర్ణకారులు మేం చేసే ఆభరణాలు మగువల ఒంటిపై మెరుస్తాయి గానీ మా బతుకులు మాత్రం మెరవడం లేదు. మార్కెట్లోకి వస్తున్న రెడీమేడ్ వస్తువులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీలు సైతం నగల దుకాణాలు ప్రారంభించడంతో మా బతుకులు దుర్భరం గా మారుతున్నాయి. ఎవరూ మా సమస్యలను పట్టించు కున్న పాపాన పోవడం లేదు. మా సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలోనూ గట్టి ప్రతినిధి లేకపోవడం వల్ల మా సమ స్యలు బయటకు రాకుండా పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత మా సమస్యలు చెప్పేందుకు వెళ్తే కనీసం కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న రెడీమేడ్ ఆభరణాలతో మేం పోటీ పడలేక పోతున్నాం. దాంతో పూట గడవక పస్తులుండాల్సి వస్తోంది. ప్రస్తుతం బంగారం పనులు లేక వెండి పనులు చేస్తూ పొట్టపోసు కుంటున్నాం. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్లో మా దుకాణాలు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు. సంప్రదాయ ఆభరణాలపై మోజు తగ్గిన మహిళలు తేలికపాటి మిషన్ తయారీ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. దాంతో ఉపాధి లేక, వేరే పని చేయలేక రోడ్డన పడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంత నరకం అనుభవిస్తున్నా కనీసం మా గురించి మాట్లాడేవారే కరువవడం మాకు బాధగా ఉంది. - టి.వెంకటాచారి, వనపర్తి, మహబూబ్‌నగర్ యూత్ పార్టీ తిరుగుబాటు స్వభావం గల కొందరు యువకులు అమెరికాలో ఈ పార్టీని 1967లో ప్రారంభించారు. ఈ పార్టీ కార్యకర్తలను ‘యిప్పీ’లనే వారు. అమెరికా అధ్యక్ష పదవికి 1968లో జరిగిన ఎన్నికల్లో అడవి పందిని అభ్యర్థిగా బరిలోకి దించి ఈ పార్టీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పేరుకు ఇది రాజకీయ పార్టీయే అయినా, చిత్ర విచిత్ర విన్యాసాలతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నాలు, విచిత్రమైన నిరసనల ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాతికేళ్లకే ఎమ్మెల్యే అప్పుడు ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. డాక్టరు కోర్సు చదివి ప్రజా సేవ చేద్దామనుకున్నారు. అనుకోని విధంగా నేతగా మారి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. దేశంలోనే పిన్నవయసు ఎమ్మె ల్యేగా గుర్తింపు పొందారు. ఆమే డాక్టర్ బాణోతు చంద్రావతి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా ఆమె స్వగ్రామం. లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం మొదటి నుంచి సీపీఐలో ఉంది. ఆమె తండ్రి రామ్మూర్తి ఆర్టీసీలో డిపో మేనేజర్. తాతయ్య బీక్యా నాయక్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. జిల్లా కమ్యూనిస్టు యోధుడు రజబ్ అలీకి శిష్యుడుగా గుర్తింపు పొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో వైరా ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో బీక్యా నాయక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దాంతో విద్యాధికురాలు అయిన చంద్రావతికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిం చారు. అప్పుడే ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. వెంటనే ఆమెను పార్టీ సంప్రదించడం... ఆమె అంగీకరించడం... పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం... విజయం సాధించడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేశ్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి
ఖమ్మం, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పటడం సంతోషకరమని, ఈ ప్రాంతంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని నవ తెలంగాణ నిర్మాణం కోసం మేనిఫెస్టో తయారు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న జిల్లా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టోలో చోటు కల్పిస్తామని చెప్పారు. కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబుతోపాటు తెలంగాణ నేతలతో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలను అన్నివర్గాల ప్రజలనుంచి సేకరిస్తామని తెలి పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్ని కల్లో కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. -
మాట నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్
* రెండు ప్రాంతాల్లోనూ విద్వేషాలు పెంచిన కాంగ్రెస్‌ను ఓడిద్దాం * అమరవీరులకు తెలంగాణ రాష్ట్రం అంకితం.. * ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చుంటే వారి ప్రాణాలు దక్కేవి * నరేంద్ర మోడీని ప్రధాని చేసేలా మరిన్ని సీట్లు ఇవ్వండి.. * సుపరిపాలన మాతోనే సాధ్యం, పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు * బీజేపీ తెలంగాణ అభినందన సభలో రాజ్‌నాథ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘మేం మాటిచ్చాం, తెలంగాణ తెచ్చాం. అవునా? కాదా? ఇక తీర్పు చెప్పాల్సింది మీరే’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్.. తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదింపజేయడంలో తమ పార్టీ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు కూడా బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు భవిష్యత్ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఇదో అద్భుత అవకాశం. సుపరిపాలన ఎవరిస్తారో ఆలోచించండి. మేమా? వాళ్లా? (కాంగ్రెస్)’’ అని ఉభయ ప్రాంతాల ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ‘బీజేపీ ఎన్నికల శంఖారావం, తెలంగాణ అభినందన, ఆవిర్భావ సభ’ పేరిట మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నాగం జనార్దన్ రెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకరరావు తదితరులు హాజరయ్యారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 2006లో ఇదే మైదానంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చామన్నారు. కుటుంబం విడిపోవడంతోనే కుదేలవకూడదని, గతంలో మాదిరే కొనసాగాలని ఆకాంక్షించారు. పార్లమెంటులో ఇంత రభస ఎన్నడూ జరగలేదు.. ‘‘2009 ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చాం. ఆవేళ మేం రాలేదు. ఐదేళ్లు గడిచింది. కాంగ్రెస్ పార్టీ 2009లో మాటిచ్చి తప్పింది. ఒక రాష్ట్ర విభజన విషయమై పార్లమెంటు చరిత్రలో ఇంతటి రభస ఎన్నడూ జరగలేదు. మేమూ మూడు రాష్ట్రాలిచ్చాం. అందరూ సంతోషంగా అంగీకరించి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయానికి పాల్పడింది. తెలంగాణ, ఆంధ్రలో విద్వేషాలు పెంచింది. ఇంతదాకా రాకుండా ఇప్పుడు చేసిన పని ఆవేళే చేసుంటే 1100 మంది చనిపోయి ఉండేవారు కాదు. అందుకే నవ తెలంగాణను అమరవీరులకే అంకితం ఇస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. రెండు ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి ‘‘మేం అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలనే దానిపై దృష్టి సారిస్తాం. రైతుల ఆత్మహత్యలు, నక్సల్స్ సమస్య, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మంచినీటి కొరత, కరెంటు కోతలు వంటి ముఖ్యమైన సమస్యలు అక్కడా ఇక్కడా ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే విధమైన ప్రభుత్వాలుంటే వీటిని పరిష్కరించడం సులువు. కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. మేం ఇద్దరికీ న్యాయం చేస్తాం. ఇది నా మాట. మనస్పర్థలు దూరం కావాలి. అన్నదమ్ముల్లా ఉండాలి. ప్రేమ, అప్యాయతలు పెంపొందాలి’’ అని రాజ్‌నాథ్ అభిలషించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ లాగా ఓట్ల కోసం రాజకీయం చేయడం మా పార్టీ పని కాదు. మాది దేశం కోసం పని చేసే పార్టీ. బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధితో మిగతా రాష్ట్రాలను పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గుజరాత్ అభివృద్ధిని దేశంలోని విశ్లేషకులే కాకుండా అమెరికా పార్లమెంటులోని ఓ పరిశోధనా కమిటీ, సోనియా చైర్మన్‌గా ఉండే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పింది. ఇప్పుడు వేయి రోజులు దాటిపోయినా తగ్గకపోగా పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో ఐదున్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఇక అధికారంలోకి రాబోమని కాంగ్రెస్‌కు అర్థమై నిరాశ, నిస్పృహలతో మానసిక స్థితిని కోల్పోయి మాపార్టీపై విషప్రచారాన్ని ప్రారంభించింది’’ అని విమర్శించారు. చరిత్ర తెలుసుకో రాహుల్... ‘‘మహాత్మా గాంధీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హత్య చేయించిందని రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకోవాలి. గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్పై విధించిన నిషేధాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే తొలగించింది. ఈ హత్యపై నియమించిన కపూర్ కమిషన్ కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పటికయినా ఆయన తన తప్పును తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఇందిరా గాంధీ హత్యపై రాజీవ్ గాంధీ నియమించిన ఠక్కర్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ బయటపెట్టాలి. ఇందిర హత్య వెనుకున్న కుట్ర ఏమిటో ప్రజలకు తెలియజేయాల’’ని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. పింగళి వెంకయ్యా మీ వారే... ‘‘దేశాభివృద్ధిలో, సమైక్యత, సమగ్రతను కాపాడడంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల వారి పాత్ర చాలా ఎక్కువ. జాతీయ పతాక రూపకర్త పింగళివెంకయ్య తెలుగు వారే’’ అని ఆయన చెప్పారు. ‘‘స్వతంత్ర భారత దేశంలో నరేంద్రమోడీపై జరిగిన రాజకీయ దాడులు మరెవ్వరిపైనా జరగలేదు. వజ్రాన్ని సానబట్టే కొద్దీ ప్రకాశవంతమైనట్టే మోడీ కూడా మరింత రాటు దేలి అన్ని పరీక్షలనూ అధిగమించారు. మోడీ ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోని ఏశక్తీ భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు’’ అని అన్నారు. మీ మాట విన్నాం, ఇప్పుడు మాకో హామీ ఇవ్వండి: జైట్లీ ‘‘తెలంగాణ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి ఓ హామీని కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు ఇచ్చి మోడీ ప్రధాని అయ్యేందుకు సహకరించాలి. అప్పుడు మాత్రమే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టవుతుంది’’ అని అరుణ్ జైట్లీ అన్నారు. తెలంగాణ ఇచ్చిందే తామంటున్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలను ప్రకాశ్ జవదేకర్ తిప్పికొట్టారు. అంత సత్తా ఉంటే తమ పార్టీ నేతలు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీల చుట్టూ ఎందుకు తిరిగావ్? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల అంత శ్రద్ధే ఉంటే 2004లో ఎందుకివ్వలేదన్నారు. బీజేపీ వ్యూహం వల్లే సాకారమైంది: కిషన్‌రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని, ఇక నవ తెలంగాణ నిర్మాణానికిగాను కాంగ్రెస్‌కు పాతరేసి, బీజేపీకి పట్టం కట్టాలని పార్టీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తూ 1997లోనే బీజేపీ కాకినాడలో స్పష్టమైన తీర్మానం చేసిందని, బంగారు లక్ష్మణ్ స్వయంగా ఆ తీర్మానాన్ని రాశారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నాగర్‌కర్నూల్, పాలమూరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు విద్యాసాగరరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు సభలో ప్రసంగించారు. సినీ పాటల రచయిత లక్ష్మణ్‌సాయి రచించిన తెలంగాణ పాటల సీడీని రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీలు ఆవిష్కరించారు. ఇంద్రసేనారెడ్డి రూపొందించిన ఎన్నికల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు పరామర్శ ఇటీవల మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులను రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... లక్ష్మణ్ మృతి పార్టీకి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడం చాలా కష్టమని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కళాకారులతో స్వాగతం బీజేపీ నిర్దేశించుకున్న 272 లోక్‌సభ సీట్ల లక్ష్యానికి అనుగుణంగా 272 మంది డప్పు కళాకారులతో పార్టీ నాయకులు.. రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్రనేత బి.వెంకటరెడ్డి నాయకత్వంలో రామబాణాన్ని రాజ్‌నాథ్‌తో సంధింపజేశారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రాంగణంలో మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చిత్రపటం కనిపించలేదు. పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు రాజ్‌నాథ్‌సింగ్‌కు బేగంపేట విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న ప్రశ్నకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రమే ఆయన జవాబిచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ బసచేసిన హోటల్లో పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ చానళ్ల అధిపతులు ఆయన్ను కలిశారు. తెలుగుదేశానికి రాజీనామా చేసిన సుధీశ్ రాంబొట్ల రాజ్‌నాథ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ లేదా అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని 2009లో అన్నామని, ఆ తరువాత 1200 మంది యువకులు ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తెలంగాణను ఇచ్చి టీఆర్ఎస్ను విలీనం చేయాలంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ లేకుంటే మరోసారి అదే అన్యాయం జరుగుతుందని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేసీఆర్ వ్యవహరిస్తారని చెప్పారు. ఆటో రిక్షా డ్రైవరు నుంచి ఐఏఎస్ అధికారి దాకా అందరూ టీఆర్ఎస్ విలీనం చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణకు, ముస్లిం మైనారిటీలకు అన్యా యం చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్అలీకి టీఆర్ఎస్ను విమర్శించే నైతికఅర్హత లేదన్నారు. తెలంగాణ గురించి, వక్ఫ్ ఆస్తుల గురించి షబ్బీర్ ఏనాడూ నోరు మెదపకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో త్వరలో సోనియా, రాహుల్ సభలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీని రాష్ట్రానికి తీసుకురావాలని తమకు ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా వినతులు వస్తున్నాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. త్వరలోనే తెలంగాణలో సోనియా, రాహుల్‌గాంధీలతో భారీ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం, పొత్తు సంబంధిత అంశాలను తమ హైకమాండ్ చూసుకుంటుందని వారన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావుతోపాటు నంది ఎల్లయ్య మంగళవారం రాత్రి దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన కొందరు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారే కానీ కాంగ్రెస్ ఏనాడూ అడగలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులెవరూ టీఆర్ఎస్ పొత్తు కోరుకోవడం లేదని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని ఎద్దేవా చేశారు. కాగా దిగ్విజయ్‌తో సమావేశమయ్యేందుకు కేంద్ర మంత్రి బలరాంనాయక్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, సురేశ్ షెట్కార్, అంజన్‌కుమార్ మిగిలిన ఎంపీలతో కలసి వచ్చారు. దిగ్విజయ్ లేకపోవడంతో కాసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం సమయంలో దిగ్విజయ్‌తో ఎంపీ కేవీపీ భేటీ అయ్యారు. దిగ్విజయ్‌ను కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు. -
దయ్యమా, దేవతా.. ప్రజలే నిర్ణయిస్తారు: మందా
న్యూఢిల్లీ: ‘‘సోనియా గాంధీ దేవతా.. దయ్యమా? అన్నది కాదు. అది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె దయ్యమా? దేవతా? అన్న అభిప్రాయం మా పార్టీకి ఎందుకుంటుంది?..’’ అని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా జగన్నాథం పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘స్నేహహస్తం చాపాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు ఎంత త్వరగా పొత్తుల బంధం చెడిపోతే బాగుండని చూస్తున్నారు. కేసీఆర్ గతంలో సెప్టెంబరు 30లోపు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామన్న మాట నిజమే. కానీ కాంగ్రెస్ మాటపై నిలబడలేదు. స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్ఎస్పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి. దొరల పాలన అంటూ జైరాం రమేశ్ ఎలా మాట్లాడతారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఏర్పాటు అనేది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరిగేలా ఉంటుంది. మేం తెలంగాణకు న్యాయం చేయాలని, ప్యాకేజీలు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ వాళ్లు కేవలం సోనియాను స్తుతించేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ స్నేహహస్తం అంటూనే వెనుక నుంచి కత్తితో పొడిచే ప్రయత్నం చేసింది..’’ అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. -
'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'
అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణలోని సీమాంధ్రులంతా తెలంగాణవారే!
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవారేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 75 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలిపారు. తెలంగాణ వారంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ, సీమాంధ్రలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వార్ధం కోసం అధికార, ధన బలంతో ప్రజల మధ్య రాగద్వేషాలను పెరిగేలా చేశాడని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. -
తెలంగాణకు మీరే అమ్మ
- కాంగ్రెస్ అధినేత్రితో టీ-జేఏసీ నేతలు - మాట ఇచ్చినం.. అమలు చేసినం: సోనియా న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేకప్రతినిధి: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం మీ వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరే తెలంగాణ ప్రజలకు అమ్మ. మీకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటరు. మీరు తీసుకున్న నిర్ణయం, అమలుకు చూపిన తెగువ మరెవరికీ సాధ్యంకాదు’ అని ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం సాయంత్రం టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలోని బృందం కాంగ్రెస్ అధినేత్రిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బిల్లును ఉభయసభల్లో ఆమోదించేవిధంగా కృషి చేసిం దుకు సోనియాకు పుష్పగుచ్చం అందించారు. సోనియాగాంధీ సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా జేఏసీ నేతలు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న నేతలు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ‘తెలంగాణ ప్రజల కోరికను నెరవేరుస్తానని పదేళ్ల కిందటే హామీని ఇచ్చినా. కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన మాటను నిలుపుకున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కట్టుబడి ఉన్నాం. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాల్లేకుండా అభివృద్ధి కోసం పనిచేయండి. ముందుగా మనమంతా భారతీయులం. ఆల్‌దిబెస్ట్’ అని సోనియా అభినందనలు తెలియజేశారని చెప్పారు. ‘తెలంగాణ అంటే భౌగోళిక విభజన మాత్రమే కాదు. తెలంగాణలో వెనుకబడిన, అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం చేయాలమ్మా’ అని సోనియాను కోరినట్టు జేఏసీ నేతలు చెప్పారు. దీని గురించి ఆసక్తి చూపించిన సోనియా వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సామాజిక న్యాయం గురించి చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారన్నారు. సోనియాను కలిసిన వారిలో జేసీనేతలు కోదండరాం, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
చిరకాల ఆకాంక్ష నెరవేరింది: కేసీఆర్
* తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదంపై హర్షం * దృఢ సంకల్పంతో ముందుకువెళ్లిన సోనియూగాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా * తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు.. * పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు * ఇది ఒకరి ఓటమో.. మరొకరి విజయమో కాదు * జరిగినదంతా మర్చిపోదాం.. అందరం కలసిమెలసి ముందుకు సాగుదాం.. హైదరాబాద్‌లో సీమాంధ్రులు సంతోషంగా ఉండొచ్చు * తెలంగాణను ప్రగతిశీల రాష్ర్టంగా తీర్చిదిద్దుకుందాం * రాజకీయ అంశాలు తరువాత మాట్లాడతా సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కావాలనే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లి కఠిన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహా బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ, ఇతర రాజకీయ పక్షాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ కోసం అహోరాత్రులు పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకరి ఓటమో...మరొకరి విజయమో అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమ సందర్భంలో వైషమ్యాలు తలెత్తి ఉండొచ్చని, వాటిని ఇంకా గుర్తుంచుకోవాల్సిన పనిలేదని చెప్పారు. అన్నీ మర్చిపోయి ఉభయ రాష్ట్రాల ప్రజలు కలసిమెలసి ముందుకు సాగాలని కోరారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులంతా తమవాళ్లేనని, వారిక్కడ సంతోషంగా జీవించవచ్చునని అన్నారు. రాజ్యసభలో గురువారం రాత్రి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదానంతరం కేసీఆర్ నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. నేతలు మిఠారుులు పంచుకుంటూ, బాణసంచా పేలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. కేసీఆర్ రెండు చేతులు పెకైత్తి విజయ సంకేతాలు చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీలు కె.కేశవరావు, మందా జగన్నాథం, వివేక్ సహా టీఆర్ఎస్ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై ప్రశ్నలేవీ అడగొద్దని మీడియాను అభ్యర్థించారు. మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉంటానని, వాటిపై అప్పుడు మాట్లాడతానని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. సోనియాగాంధీకి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. అలాగే ప్రధానమంత్రికి, హోంమంత్రి షిండేకు, ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలకు కృతజ్ఞతలు. బిల్లుకు మద్దతిచ్చిన మాయావతి, పవార్, లాలూప్రసాద్, పాశ్వాన్, అజిత్‌సింగ్, సీపీఐ పార్టీలకు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక అహోరాత్రులు తెలంగాణకోసం పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఒక్క పిలుపిస్తే ఎప్పుడంటే అప్పుడు ముందుకొచ్చి పనిచేసిన కార్యకర్తలదే ఉద్యమంలో మహాపాత్ర. అటుకులు తిన్నా, పాదయాత్ర చేసినా ఎండలో వానలో పనిచేసిన కార్యకర్తల అపూర్వ శ్రమ మరువలేనిది. నేను రాజీనామా చేయాలని కోరితే గడ్డిపోచల్లా పదవులు వదిలేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. వారి పట్టుదలా మరువలేనిది. తెలంగాణ ప్రజలు అస్థిత్వం, స్వయంపాలన, ఆత్మగౌరవం కావాలనుకు ని సాధించుకున్నారు. ఉద్యమం సందర్భంలో ఇరుప్రాంతాల మధ్య వైషమ్యాలు తలెత్తి ఉండొచ్చు. గతంలో జరిగిన మంచి చెడ్డలు మర్చిపోయి ఉభయ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించుకుందాం. పరస్పర సహకారంతో ముందుకు పోదాం. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే. వారి అభివృద్ధే మాకు ముఖ్యం. తెలంగాణ అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలి. ఉద్యమంలో అపూర్వపాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు, ఇంజ నీర్లు, విద్యార్థులు, కవులు, కళాకారులు... ఒక్కరేమిటి యావత్ తెలంగాణ సమాజానికి నా కృతజ్ఞతలు. వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకుపోయిన జేఏసీకి నా ధన్యవాదాలు. తెలంగాణ పండుగలైన దసరా, బతకమ్మ పండుగలనూ పక్కనపెట్టి సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మీరే నాకు ఊపిరిపోశారు. ఉద్యమం ఎప్పుడు తగ్గినా ముందుండి నడిపించారు. తెలంగాణ కోసం అమరులైన యువకులకు ప్రత్యేకించి నివాళులు అర్పిస్తున్నా. వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యమ భావజాలాన్ని అందించిన జయశంకర్ ఇప్పుడు లేకపోవడంతో(గద్గద స్వరంతో) బాధేస్తోంది. ఆయనుంటే ఎంత సంతోషించేవారో... కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధిస్తాననుకున్నా. కానీ ఈరోజు మహబూబ్‌నగర్ ప్రజలకు అదృష్టం దక్కింది. నన్ను గెలిపించిన అక్కడి ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు. సోనియా, ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్, చైర్మన్లను స్వయంగా కలసి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత నాపై ఉంది. తెలంగాణ సాధన జరిగింది. ఇక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. అందరం అందులో భాగస్వాములమవుదాం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుదాం. యువతకు ఉద్యోగాలు కల్పించాలి. హైదరాబాద్‌కు ఐటీఏఆర్ వచ్చింది కాబట్టి దానిని త్వరగా ఏర్పాటు చేసుకుందాం. అందరం కలిసి ముందుకు సాగుదాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దేశంలోనే తెలంగాణను ప్రగతిశీల రాష్ర్టంగా తీర్చిదిద్దుదాం. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రే కీలకం: కిషన్‌రెడ్డి
ఉపవాసదీక్ష విరమింపజేసిన కోదండరాం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాయితీలు, ప్రాజెక్టులు అందించడంలోనూ జాతీయపార్టీగా బీజేపీ సఫలమైందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉభయసభల్లో పాస్‌కావాలని కోరుతూ ఢిల్లీలోని ఏపీభవన్‌లో కిషన్‌రెడ్డి సోమవారం నుంచి చేపట్టిన దీక్షను టీజేఏసీ చైర్మన్ కోదండరాం నిమ్మరసం తాగించి విరమింపజేశారు. అనంతరం ఏపీభవన్‌లోని వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరవాత విలేకర్లతో మాట్లాడారు. సమావేశంలో కోదండరాం, జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, దేవిప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
YSR లాంటి నాయకుడే కావాలి
-
రెండోరోజూ.. భగ్గుమన్న జిల్లా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీమాంధ్ర నేతల వైఖరిపై తెలంగాణవాదులు రెండోరోజూ భగ్గుమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా పార్లమెంట్లో వ్యవహరించిన సీమాంధ్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల కమిటీ (జీఓఎం) సిఫారసుల మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన టీ బిల్లుపై చర్చను అడ్డుకోవడంపై నిరసస వ్యక్తం చేశారు. టీ బిల్లుపై బీజేపీ దాటవేసే ధోరణితో వ్యవహరించిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా... బీజేపీ నేతలు ఖండించారు. ‘తెలంగాణ’కు కట్టుబడి ఉన్నామని కమలదళ నేతలు స్పష్టం చేశారు. నిరసనల హోరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకోవాలని చూసిన సీమాంధ్ర ఎంపీల వైఖరిని ఎండగడుతూ జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్‌లో తెలంగాణ జాగృతి, పీడీఎస్యూల ఆధ్వర్యంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, అద్వానీల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. కామారెడ్డి, భిక్కనూరు, నవీపేట, రెంజల్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో లగడపాటి దిష్టిబొమ్మలను అగ్నికి ఆహుతి చేశారు. లగడపాటిపై కేసు పెట్టాలి పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ తదితరులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల ని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిజామాబాద్, బోధన్ కోర్టులలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నెల 21 వరకు విధులు బహిష్కరించనున్నట్లు బోధన్ న్యాయవాదులు ప్రకటించా రు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణవాదులు పేర్కొన్నారు. -
ఉత్కంఠ...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ బిల్లు విషయంలో ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు జిల్లా వాసుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా బిల్లును లోక్‌సభలో పెట్టేందుకు గురువారం ప్రభుత్వం సిద్ధపడడం... అదే సమయంలో కొందరు పార్లమెంటు సభ్యులు వ్యవహరించిన తీరు.... బీజేపీ అగ్రనేతల మాటలు... కాంగ్రెస్ అధిష్ఠానం వేసిన అడుగులు.... ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే రీతిలో జరిగిన పరిణామాలు జిల్లా ప్రజలను టెన్షన్‌కు గురిచేశాయి. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారనే వార్తలు రావడంతో జిల్లా ప్రజలంతా గురువారం టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారానికి వాయిదా పడేవరకు జరిగిన పరిణామాలను ఆసక్తిగా గమనించారు. సభలో నిరసన తెలపడంలో భాగ ంగా కొందరు ఎంపీలు చేసిన చర్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనికి తోడు బీజేపీకి చెందిన అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా తెలంగాణవాదులు చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో ఒక దశలో అయితే, తెలంగాణ బిల్లు గురువారమే లోక్‌సభ ఆమోదం పొందనుందన్న ఊహాగానం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో తెలంగాణవాదులంతా విజయోత్సవాలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ పక్షాలు జిల్లాలో ధూంధాం చేసేందుకు ప్రణాళికలు రచించాయి. కానీ, సభను సోమవారానికి వాయిదా వే స్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించడంతో వారి ఆశలు నెరవేరలేదు. దీంతో మరో మూడు రోజుల పాటు ‘టీ’ బిల్లు ఏమవుతుందనే దాని కోసం ఎదురుచూపులు తప్పలేదు. కాగా, లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో కొందరు ఎంపీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దిష్టిబొమ్మల దహనాలు, ప్రదర్శనలు, ఉరి తీయడం లాంటి నిరసనలతో తెలంగాణవాదులు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. కొనసాగుతున్న ‘ముంపు’ ఆందోళనలు తెలంగాణ బిల్లు మాట అటుంచితే, జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు సాగుతున్నాయి. మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలంలో దీక్షలు కొనసాగుతుండగా..., ఈనెల 15 నుంచి పాపికొండల విహార యాత్రకు బ్రేక్ వేయనున్నట్టు ఆదివాసీ సంఘాలు చెపుతున్నాయి. తమ నిరసనను తెలియజెప్పేందుకు ఎలాంటి ఉద్యమానికయినా సిద్ధపడతామని వారంటున్నారు. అయితే, పోలవరం ముంపు కారణంగా జిల్లాలోని మండలాలను రద్దు చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని, నియోజకవర్గాల మనుగడకు ఇబ్బంది లేకుండా మండలాలు అలానే ఉంటాయని, కేవలం ముంపునకు గురయ్యే గ్రామాలనే సీమాంధ్రలో కలపాలని బిల్లులో సవరణలు తెచ్చారన్న వార్తలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు తెలంగాణ బిల్లు, మరోవైపు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రలో విలీనం అంశాలు జిల్లా ప్రజల మెదళ్లలో పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. -
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
-
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
తెలంగాణ ప్రజలకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆదర్శమని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా ఈటెల మాట్లాడుతూ... 60 ఏళ్ల నిరీక్షణ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన టీఆర్ఎస్ తరఫున బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల మనస్సును దోచుకునే పని ఒక్కటి కూడా ఆంధ్ర పాలకులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలసి ఉన్నామని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అలాగే ఉందామని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది కాదని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మద్దతిచ్చేవారు సీమాంధ్రలో కూడా ఉన్నారని ఈటెల గుర్తు చేశారు. -
కేబినెట్ నిర్ణయంపై ఎవరేమన్నారంటే..
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది: కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ నవ తెలంగాణను నిర్మాణమే మా ముందున్న కర్తవ్యం. - దామోదర రాజనర్సింహ, డిప్యూటీ సీఎం అమరవీరుల త్యాగ ఫలం తెలంగాణ: తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన రాజ్‌నాధ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అద్వానీ, అరుణ్‌జెట్లీ తదితరులకు ధన్యవాదాలు. బీజేపీ వత్తిడి, పోరాటం కారణంగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణను కాంగ్రెస్ ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నాం. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు: ప్రాంతాలుగా విడిపోయినా తెలుగుప్రజలంతా ఒక్కటే. రానున్న కాలంలోనూ అన్నదమ్ములుగా రెండు రాష్ట్రాలు పురోగమనంలో ముందుకు వెళ్లాలి. ద్వేషాలకు తావులేకుండా తెలుగుజాతి ఐక్యతను ప్రపంచానికి చాటాలి. తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. - డి.శ్రీనివాస్, పీసీసీ మాజీ చీఫ్ కాంగ్రెస్‌కే ఓట్లేయండి: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్టీకి అనేక ఒడిదుడుకులు, అష్టకష్టాలు, అపనిందలు ఎదురైనా, మరెన్నో విమర్శలొచ్చినా తొణకకుండా వ్యవహరించిన సోనియాగాంధీ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. 2014లో జరిగే ఎన్నికల్లో నూటికి నూరుశాతం కాంగ్రెస్‌కు ఓట్లేసి మద్దతు పలకాలి. - కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేబినెట్ మంత్రులందరికీ కృతజ్ఞతలు. - డి.శ్రీధర్‌బాబు, డీకే.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి అమరవీరుల ఫైలుపై తొలి సంతకం చేయాలి: తెలంగాణ ప్రకటించినందుకు సోనియాగాంధీకి, కేంద్రానికి ధన్యవాదాలు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తూ తొలి సంతకం చేయాలి. - పూల రవీందర్, టీచర్ ఎమ్మెల్సీ అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుంది: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుంది. సోనియాగాంధీకి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలంతా ఆమెకు రుణపడి ఉంటారు. - నిరంజన్, తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం(టీసీఎంజీ) కన్వీనర్ రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించాలి : నాన్చుడు ధోరణికి మారుపేరయిన కాంగ్రెస్ ఇంకా అనేక కుట్రలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లోనైనా గందరగోళం సృష్టించకుండా రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలి. - దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. వందలాది మందిని బలిగొన్నందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. - కూనంనేని సాంబశివరావు, సీపీఐ శాసనసభా పక్ష ఉపనాయకుడు పార్లమెంట్లో ఏం చేస్తారో తేలాలి: భాషాప్రాతిపదిక రాష్ట్రాలకే మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర రాజకీయ అనిశ్చితిపై కాంగ్రెస్ ఇప్పటికీ దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. పార్లమెంటులో కాంగ్రెస్ పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది. - వై.వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అమరుల త్యాగాల ఫలితమే: అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. పదిజిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రివర్గం నిర్ణయం ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. కేంద్రం ఆలస్యం చేయకుండా వెంటనే బిల్లు పెట్టాలి. - చుక్కారామయ్య, మాజీ ఎమ్మెల్సీ సోనియాకు కృతజ్ఞతలు: 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ప్రకటించినందుకు కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు. సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, అజిత్‌సింగ్‌కు ధన్యవాదాలు. - దిలీప్‌కుమార్, ఎమ్మెల్సీ ఇదే స్ఫూర్తితో చివరిదాకా: తెలంగాణ ఏర్పాటయ్యేదాకా ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో సామాజిక న్యాయంకోసం, ఇప్పటిదాకా కోరుకున్న ప్రగతికి మరోసారి అంకితం కావాలి. - విమలక్క, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ ఇది ప్రజా విజయం: తెలంగాణ సాధన ప్రజా విజయం. నవ తెలంగాణ నిర్మాణంలో ఇదే అంకితభావాన్ని చూపాలి. అమరవీరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ ఏర్పాటు. - కె.గోవర్ధన్, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ నేత బాధ్యత పెరిగింది: తెలంగాణ ఏర్పాటుతో ఇప్పటిదాకా చెప్పిన ప్రగతిని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత సమష్టిగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటయ్యేదాకా పార్లమెంటులో మా పార్టీ అండగా ఉంటుంది. - దాస్యం ఉదయభాస్కర్, జేడీయూ రాష్ట్ర అధ్యక్షులు త్యాగాల పొద్దుపొడుపు: త్యాగాల పొద్దుపొడుపులోంచి పుట్టినదే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం. సకలజనుల సబ్బండ వర్ణాల విజయమే సంపూర్ణ తెలంగాణ. అమరుల త్యాగఫలితం నెగ్గింది, తెలంగాణ ప్రజాపోరాటాలు విజయం సాధించాయి. - జూలూరు గౌరీశంకర్, టీ రచయితల వేదిక అధ్యక్షుడు -
'తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణను అంగీకరించరు'
తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించరని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ మంత్రుల తరపున ఆయన ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింట్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాయల తెలంగాణ ప్రతిపాదన సరికాదని తప్పుపట్టారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు వివరించామని, ఈ మేరకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతు సభలు నిర్వహించామని లేఖలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయల ప్రతిపాదన విరమించుకుని వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని రాజనరసింహ కోరారు. -
రాయల తెలంగాణను ఒప్పుకోం: కోదండరాం
నల్లగొండ, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు ఎక్కడా పొంతన కుదరదని తెలిపారు. రాయల తెలంగాణతో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పారు. మునగాల, భద్రాచలం సరిహద్దుల నిర్ణయం, పాలకుల కోసం కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం ఎలాంటి కిరికిరి పెట్టినా మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. -
చిన్న గ్రామాన్ని కూడా వదులుకోం: కోదండరాం
బొంరాస్‌పేట, న్యూస్‌లైన్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలని, ఈ ప్రాంతంలో చిన్న గ్రామాన్ని కూడా వదులుకునే ప్రసక్తేలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఇన్నేళ్ల పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు తుది దశకు వచ్చిందని నమ్ముతుండగా సీమాంధ్ర నేతలు, కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే మలివిడత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేటలోని ఉపాధ్యాయ శిక్షణ సమావేశం, కోస్గిలో జరిగిన విద్యార్థి గ ర్జనలో కోదండరాం మాట్లాడారు. సీమాంధ్ర నేతలు భద్రాచలం, కృష్ణా, తదితర అంశాలతో దింపుడుకళ్లం ఆలోచనలు మానుకోవాలన్నారు. ముక్కలైన తర్వాత బలవంతంగా కలుపుతామనుకోవడం సీమాంధ్ర నేతల మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చివరివరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సామాన్య ప్రజలను సైతం పాల్గొనేలా స్ఫూర్తినిచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్ర అమోఘమని టీజేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ నిర్మాణంలో విద్య, తదితర రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. -
కిరణ్ ‘రచ్చ’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో నిర్వహిస్తున్న మూడో విడత రచ్చబండకు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. రాష్ర్ట విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న తరుణంలో రచ్చబండ సభల్లో సీఎం కిరణ్ ఫ్లెక్సీలు, ఫొటోలు, సందేశాన్ని తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి సభలో అధికారులు, తెలంగాణవాదులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. మొదటి, రెండు విడతలో దరఖాస్తు చేసుకున్నవారికి పింఛన్లు, కూపన్లు పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటి అవుతోంది. గురువారం కూడా దిలావర్పూర్, సారంగాపూర్, ముథోల్, కోటపల్లి, నార్నూరు, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఇదే తంతు కొనసాగింది. ఏడు మున్సిపాలిటీలు, 52 మండలాలు కలిపి 15 రోజుల్లో మొత్తం 59 సభలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు 49 సభలు నిర్వహించిన అధికారులు మంచిర్యాల, సిర్పూరు-టి, ముథోల్ నియోజకవర్గాల్లో మొత్తం పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి మున్సిపాలిటీలతోపాటు మరో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్వహించాల్సి ఉంది. అయితే రచ్చబండ సభల్లో ఇన్చార్జి మంత్రి నియమించిన త్రిసభ్య కమిటీ దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్కూపన్లు పంపిణీ సందర్భంగా హంగామా సృష్టించడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అనుచరులు జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేస్తుండటం అక్కడక్కడ రచ్చబండ రాజకీయ సభలను తలపిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఫ్లెక్సీల చించివేత.. సందేశానికి అడ్డంకులు.. ఈ నెల 11 నుంచి 26 వరకు సుమారు 15 రోజుల పాటు నిర్వహించే రచ్చబండ కోసం అధికారులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి మొదటి, రెండో విడతలకు భిన్నంగా మండల కేంద్రాలు, పట్టణాలకే రచ్చబండను పరిమితం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలో రచ్చబండల్లో సీఎం కిరణ్ ఫొటో లు, ఆయన సందేశం వినిపించడంపై సర్వత్రా నిరసనలు తెలుపడంతో సభలు ‘రచ్చ’ రచ్చగా మారాయి. ప్రారంభం రోజే 13న ఆదిలాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను టీఆర్ఎస్ కార్యకర్తలు, జేఏసీ సభ్యులు చించివేసి, సందేశం వినిపించద్దంటూ అడ్డుకోవడం రాష్ట్రస్థాయిలో రసాభాసగా మారింది. సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్ ఫొటోలను తెలంగాణ జిల్లాల్లో వాడొద్దంటూ నిరసనలకు దిగడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇదిలా వుంటే ఎంపీటీసీ, మున్సిపల్‌తోపాటు 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆధికార కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కార్యక్రమాల రూపకల్పన జరిగిందంటూ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి, రెండో విడతల్లో స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిశీలించి పూర్తిగా ‘అధికార’ ముద్ర ఉండేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ సభలను తలపించిన ‘రచ్చబండ’ మూడో విడత రచ్చబండ సభల్లో అత్యధికంగా నిరసనలు వెల్లువెత్తగా, మరికొన్ని చోట్ల రాజకీయ సభలను తలపించాయి. పొంచివున్న ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీ తాయిలాల పంపిణీకే రచ్చబండ నిర్వహిస్తుందన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో రచ్చబండపై ‘అధికార’ ముద్ర వేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల సిఫారసు మేరకు నియోజకవర్గాలు, మండలాలవారీగా ఇన్చార్జి మంత్రి వేసిన కమిటీలు సభల్లో హల్చల్ చేశాయి. కాగా, మూడో విడుత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధదారులకు పూర్తిస్థాయి రేషన్ కార్డులు ఇవ్వకుండా సరిగ్గా ఏడు నెలలకు సరిపడా (డిసెంబర్ 2013 నుంచి జూన్ 2014 వరకు) రేషన్ కూపన్లు పంపిణీ చేస్తూండటం గమనార్హం. ఓ వైపు తెలంగాణవాదుల నిరసనలు, మరోవైపు అధికార పార్టీ కార్యకర్తలు చేసిన హంగామా అధికారులకు తలనొప్పిగా మారాయి. ఇదిలా వుండగా నార్నూరు మండల కేంద్రంలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై ఐటీడీఏ పీవో జె.నివాస్‌తో వాగ్వావాదానికి దిగి సభను బహిష్కరించారు. దిలావర్పూర్, సారంగపూర్ మండలాల్లో జరిగిన సభలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. భీమిని మండల కేంద్రం లో జరిగినన సభలో అధికారులతోపాటు ఎమ్మెల్యే గుండా మల్లేశ్ పాల్గొన్నారు. కోటపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన మూడో విడుత రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ వాదులు సీఎం ఫ్లెక్సీని తొలగించారు. ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొని మాట్లాడారు. ముథోల్ రచ్చబండలో ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, గుడిహత్నూర్‌లో గోడం నగేశ్ పాల్గొన్నారు. -
బాబు పర్యటనకు.. రైతులు కరువు
నల్లగొండ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నిరసన సెగ తగిలింది. తెలంగాణవాదులు, జేఏసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పలుచోట్ల నల్లజెండాలు ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉన్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ఆనందంలో ఉండి గడిచిన ఆరు దశాబ్ధాల దోపిడీపై ఎలుగెత్తుతున్న తరుణంలో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవతరణ వేడుకలను నిర్వహించడంతో తెలంగాణవాదుల ఆగ్రహాన్ని కలిగించింది. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంట ర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బి.నరేందర్‌రెడ్డి నల్లజెండాను ఎగురవేశారు. ఎన్జీ కాలేజీలో విద్యార్థులు నల్లజెండా ఎగురవేసేందుకు ప్రయత్నించారు. జిల్లాకోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లజెండాను జి.జవహర్లాల్ ఎగురవేశారు. అనంతరం న్యాయవాదులు నల్లజెండాలతో క్లాక్‌టవర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ప్రదర్శను అడ్డుకున్నారు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో విద్రోహదినాన్ని పాటించారు. తెలంగాణ ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారుల సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగురవేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ, జేఏసీ, న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లజెండా ఎగుర వేసి నిరసన తెలిపారు. కోదాడ పట్టణంలోని నాగార్జున సెంటర్ జేఏసీ, టీఆర్ఎస్, నయానగర్‌లో టీవీఎస్‌ల ఆధ్వర్యంలో నల్లజెండాలను ఎగుర వేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి రంగా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరోసభ్యుడు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య, ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో నల్లజెండాను ఎగరవేశారు. కట్టంగూర్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగరవేశారు. సూర్యాపేట పట్టణంలో ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో జాతీయ, తెలంగాణ జెండాలను మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ ఎగరవేశారు. కొత్త బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, 60 ఫీట్ల రోడ్డులో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగరవేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలు ఎగరవేశారు. తిరుమలగిరిలో జేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగుర వేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అర్వపల్లిలో టీఆర్ఎస్, తెలంగాణ సామాజిక వేదిక ఆద్వర్యంలో నల్లజెండాలు ఎగురవేశారు. నూతన్‌కల్‌లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. -
అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు
తెలంగాణ పోరాటంలో ఇది సంధి కాలం దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’లో టీ-నేతల పిలుపు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో ఇప్పుడు నడుస్తున్నది సంధికాలమని.. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు రాజకీయ వేత్తలు, ఉద్యమనేతలు, మేధావులు, కవులు, కళాకారులు పిలుపిచ్చారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో కొందరు మోకాలడ్డే ప్రమాదం ఉందన్నారు. సమన్యాయమనే వాదన వట్టి డొల్ల వాదనని విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో దసరా మిలాప్- అలయ్ బలయ్-ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిధిగా రావాల్సిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గైర్హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఏడేళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కళారూపాల ప్రదర్శనతో పాటు ఆ ప్రాంత పిండివంటలు ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయా నేతలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఉద్యమ కార్యాచరణ గురించి మాట్లాడారు. విడిపోయి.. కలుసుందాం... తెలంగాణ కల సాకారమయ్యేవేళ ఈ ప్రాంత సంస్కృతిని దేశవ్యాప్తం చేయాలని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఆప్యాయత, ఆత్మీయత తెలంగాణ సద్గుణమని, అటువంటి సంస్కృతిని ప్రతిబింబించేలా మున్ముందు మరిన్ని ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటులో కొన్ని చిక్కులు, ప్రలోభాలు, రాజకీయ ఇబ్బందులు వస్తాయని సురవరం వ్యాఖ్యానించారు. ప్రధాన రాజకీయ పక్షాలు తమ వాగ్దానం నుంచి వెనక్కు వెళ్లకుండా తెలంగాణ కల సాకారమయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం ముందయినా ఈ ప్రాంతంలోని రాజకీయ పక్షాలన్నీ కలిసికట్టుగా ఒకే గొంతు వినిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామన్నారు. త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తోందని, పార్లమెంటులో బిల్లు పాసయ్యేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ కల సాకారమయ్యేంత వరకు కదం కదం కలిపి నడవాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. విజయం సిద్ధించుతున్న వేళ వినమ్రంగా ఉండాలన్నారు. వచ్చే అలయ్ బలయ్ స్వతంత్ర తెలంగాణలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌పై కాంగ్రెస్ కిరికిరి పెట్టడం తథ్యమని.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు పిలుపిచ్చారు. వెంకయ్య అడ్డుపుల్లగా మారారు... వెంకయ్యనాయుడు తెలంగాణకు అడ్డుపుల్లగా మారారని, మరోపక్క చంద్రబాబునాయుడు కూడా వస్తున్నారని ప్రముఖ కవి అంద్శైవిమర్శించారు. గడ్డిపోచ మాదిరి వెంకయ్య అడ్డం వస్తే ఒక్కసారిగా భగ్గుమనక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ యూ టర్న్ తీసుకునే ప్రశ్నే లేదని.. ఇక తెలంగాణ వచ్చేలా చూడాల్సిన బాధ్యత బీజేపీదేనని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన దొబ్బిపోయిన ఉద్యోగాలు క్రమబద్ధీకరించమనా? అని ఎంపీ రాజయ్య ప్రశ్నించారు. తెలంగాణలో దొంగలు పడ్డారని నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి కార్మిక సంస్కృతితో ముడిపడి ఉందని చుక్కా రామయ్య చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కుపోదని, లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సీమాంధ్రకు వ్యతిరేకమైంది కాదని మురళీధర్‌రావు పేర్కొన్నారు. దత్తాత్రేయ సహా ప్రముఖులకు సన్మానం... ఈ కార్యక్రమంలో దత్తాత్రేయను కురుమ సంఘం సన్మానించింది. అలాగే.. వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖుల్ని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వీరిలో పి.వేణుగోపాల్‌రెడ్డి (ఆర్ఎస్ఎస్ ప్రచారక్), డాక్టర్ వ్యాకరణం నాగేష్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్), రసమయి బాలకిషన్ (తెలంగాణ కవి, గాయకుడు), ఖాన్ అక్తర్ (ప్రముఖ సంగీత విద్వాంసుడు), సంఘంరెడ్డి సత్యనారాయణ (జై తెలంగాణ పత్రిక వ్యవస్థాపకులు), దరువు ఎల్లన్న (ఉస్మానియా జేఏసీ నేత), మాడభూషి శ్రీధర్ (నల్సార్ యూనివర్శిటీ), యడ్లపాటి రఘునాథ్‌బాబు (బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ) తదితరులు ఉన్నారు. వివిధ పార్టీల నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సి.హెచ్.విద్యాసాగరరావు, బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ కె.హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, పుష్పలీల, పి.చంద్రశేఖర్‌రావు, ఎన్.రామమోహనరావు, దాసరి మల్లేశం, శాంతారెడ్డి (బీజేపీ), ఈటెల రాజేందర్, వివేక్ (టీఆర్ఎస్), మధుయాష్కీ (కాంగ్రెస్), అజీజ్‌పాషా (సీపీఐ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), కఠారి శ్రీనివాస్ (లోక్‌సత్తా), టీజేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, అద్దంకి దయాకర్, విఠల్, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, శైలేష్‌రెడ్డి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు, పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించింది
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ఆకాంక్ష, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ముందుగా రాష్ట్రపతి అనుమతితో బిల్లును ప్రవేశ పెట్టి...చివరకు రాష్ట్రపతి ఆమోద ముద్రపడిన తర్వాతే కలసాకారం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ ఐదు దశల్లో ఉంటుందని, చివరి ప్రక్రియ జరిగే వరకు తెలంగాణ వాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిల్లు ఆమోదముద్ర పొందిన తర్వాత రాష్ట్రంలో సెక్షన్-3 ప్రకారం సవరణలు తెచ్చిన తర్వాతే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. తెలంగాణ కల సాకారం అవుతున్న వేళ ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని కోరారు. ఆంధ్ర ఎన్జీఓలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అశోక్‌బాబు తనను తాను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. కొంతమంది సీమాంధ్రులు జూరాల ప్రాజెక్టు ఎత్తున పెంచుతారని అసత్య ప్రచారం చేస్తున్నారని, సాంకేతికంగా ఇది సాధ్యం కాదన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఇస్మాయిల్, కర్ణకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ తన వైఖరి మార్చుకోవాలి: మందకృష్ణ
కేసీఆర్ వెంటే తెలంగాణ ద్రోహులున్నారని వ్యాఖ్య హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని గతంలో ప్రకటించిన వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోవడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లనే జగన్ జైలునుంచి విడుదల అయ్యారని ఆరోపించారు. సీమాంధ్రలో తొలి సీఎం కావాలనుకుంటున్న జగన్‌ను అక్కడి బడుగు బలహీన వర్గాలు తిప్పికొట్టాలన్నారు. గుంటూరులో నిర్వహించనున్న అంబేద్కర్‌వాదుల సభను అడ్డుకోవడానికి కుటిల యత్నాలు జరుగుతున్నాయని, అందుకే 5, 6 తేదీల్లో ప్రైవేట్ ట్రావెల్స్, పెట్రోల్ బంక్‌ల బంద్‌ను నిర్వహించాలని ఏపీఎన్జీవోల సంఘం పిలుపునిచ్చిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వినిపించేందుకు సభను విజయవంతం చేస్తామని అన్నారు. సకలజనుల భేరిలో కేసీఆర్ ఆంధ్రవాళ్లందరు తెలంగాణ ద్రోహులని అన్నారని, నిజానికి తెలంగాణ ద్రోహులు ఆయన వెంటనే ఉన్నారని వ్యాఖ్యానించారు.