నల్లగొండ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నిరసన సెగ తగిలింది. తెలంగాణవాదులు, జేఏసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పలుచోట్ల నల్లజెండాలు ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉన్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ఆనందంలో ఉండి గడిచిన ఆరు దశాబ్ధాల దోపిడీపై ఎలుగెత్తుతున్న తరుణంలో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవతరణ వేడుకలను నిర్వహించడంతో తెలంగాణవాదుల ఆగ్రహాన్ని కలిగించింది.
నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంట ర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బి.నరేందర్‌రెడ్డి నల్లజెండాను ఎగురవేశారు. ఎన్జీ కాలేజీలో విద్యార్థులు నల్లజెండా ఎగురవేసేందుకు ప్రయత్నించారు. జిల్లాకోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లజెండాను జి.జవహర్‌లాల్ ఎగురవేశారు. అనంతరం న్యాయవాదులు నల్లజెండాలతో క్లాక్‌టవర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ప్రదర్శను అడ్డుకున్నారు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో విద్రోహదినాన్ని పాటించారు. తెలంగాణ ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారుల సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగురవేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు.
హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, జేఏసీ, న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లజెండా ఎగుర వేసి నిరసన తెలిపారు.
కోదాడ పట్టణంలోని నాగార్జున సెంటర్ జేఏసీ, టీఆర్‌ఎస్, నయానగర్‌లో టీవీఎస్‌ల ఆధ్వర్యంలో నల్లజెండాలను ఎగుర వేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి రంగా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
నకిరేకల్‌లో టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరోసభ్యుడు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య, ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో నల్లజెండాను ఎగరవేశారు. కట్టంగూర్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగరవేశారు.
సూర్యాపేట పట్టణంలో ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో జాతీయ, తెలంగాణ జెండాలను మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ ఎగరవేశారు.
కొత్త బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, 60 ఫీట్ల రోడ్డులో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగరవేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో టీఆర్‌ఎస్ నాయకులు నల్లజెండాలు ఎగరవేశారు.
తిరుమలగిరిలో జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగుర వేశారు. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అర్వపల్లిలో టీఆర్‌ఎస్, తెలంగాణ సామాజిక వేదిక ఆద్వర్యంలో నల్లజెండాలు ఎగురవేశారు. నూతన్‌కల్‌లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
బాబు పర్యటనకు.. రైతులు కరువు
Published Sat, Nov 2 2013 5:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement