హైదరాబాద్ : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. బుధవారం దీపావళి పండగ పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
వెలుగులు విరజిమ్మే ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను ఆరోగ్య సౌభాగ్యాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. అయితే కేసీఆర్ దీపావళి వేడుకులు జరుపుకునేందుకు మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్ కి మంగళవారం రాత్రే చేరుకున్న సంగతి తెలిసిందే.