సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పుటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు.
కాగా, లిక్కర్ స్కాంలో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతుంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు వద్ద దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోంది. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఈడీ విచారణలో ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవు. వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు.
చదవండి: కవితపై బండి అనుచిత వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment