consequences
-
ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?
ITR filing deadline July 31: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని విధి. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నప్పటికీ, ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. జరిమానా జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే వరకు గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది. (బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్) అప్డేటెడ్ రిటర్న్స్ సెక్షన్ 139(8A) ప్రకారం అప్డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టింది. అయితే, సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని ఫైల్ చేయవచ్చు. ప్రాసిక్యూషన్, జైలు శిక్ష? అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైల్ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ITRను అస్సలు ఫైల్ చేయకపోతే, వారు ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరంలోని నష్టాలను ముందుకు తీసుకెళ్లలేరు. అలాగే, అసెస్డ్ ట్యాక్స్‌లో కనిష్టంగా 50 శాతం లేదా అసెస్డ్ ట్యాక్స్‌లో గరిష్టంగా 200 శాతం పెనాల్టీ విధించవచ్చు. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం వేతన జీవులను ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది. కాగా ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు శరవేవంగా జరుగుతోందనీ, సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఐటీ రిటర్న్స్‌లో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్‌గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
టీడీపీలో పరిణామాలపై ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీలో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడేనంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలను ఎంటర్టైన్ చేస్తే ఎలా?. అక్కడో రూ. 10వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి టికెట్ కావాలంటే ఇచ్చేస్తారా?. ఇప్పుడేదో రూ.కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. తర్వాత చేతులెత్తేస్తారు’’ అని ప్రత్తిపాటి అన్నారు. ‘‘ఎన్నికల ముందే ఫౌండేషన్, ట్రస్టుల పేరుతో నేతలు హడావుడి చేస్తారు. నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు?. ఫౌండేషన్, ట్రస్టుల పేరుతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారు?. ఈ నేతలంతా ఎన్నికల ముందొస్తారు.. తర్వాత వెళ్లిపోతారు. ఎమ్మెల్యేనని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో వస్తారు. భాష్యం ప్రవీణ్‌కు.. చిలుకలూరిపేటకు సంబంధమేంటి?. కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందే’’ అని ప్రత్తిపాటి పుల్లారావు తేల్చి చెప్పారు. చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? -
హస్తినలో హై టెన్షన్.. ఢిల్లీ పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పుటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు. కాగా, లిక్కర్ స్కాంలో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతుంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు వద్ద దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోంది. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఈడీ విచారణలో ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవు. వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు. చదవండి: కవితపై బండి అనుచిత వ్యాఖ్యలు! -
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. గతేడాది యూఎస్‌కు తాలిబన్లకు మధ్య దోహాలో జరిగిన డీల్‌లోని పలు అంశాల్లో భారత్‌ను పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి ఇండియాకు కావాల్సిన అంశాలన్నారు. ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సమావేశంలో ఆయన ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. అఫ్గాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో ఇండియాకు ఎలాంటి తొందర లేదన్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌తో ఏర్పాటైన క్వాడ్ గ్రూప్ ఏదేశానికి వ్యతిరేకం కాదని, దురుద్దేశాలతో ఏర్పాటైన కూటమి కాదని స్పష్టం చేశారు. అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో ఇండియా, అమెరికాకు సామ్యాలున్నాయని చెప్పారు. అయితే దోహా డీల్ సందర్భంగా తమను అనేక అంశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఎత్తిపొడిచారు. అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని పరోక్షంగా అమెరికాను దెప్పిపొడిచారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ప్రశ్నించారు. అంత రహస్యమెందుకు? దోహాలో యూఎస్, తాలిబన్లకు మధ్య అఫ్గాన్‌పై ఒప్పందం కుదరింది. దీని ప్రకారం యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలుగుతాయి, తాలిబన్లు హింసను వీడతారు. కానీ పాలన చేతికొచ్చాక తాలిబన్ల ప్రవర్తన ప్రశ్నార్ధకంగా మారింది. దీన్నే జైశంకర్ ప్రస్తావించారు. కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని, కానీ సదరు డీల్‌లో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని చెప్పారు. అఫ్గాన్‌లో ఉగ్ర తండాలకు అభయం చిక్కకూడదన్న అంశాన్ని జోబైడెన్‌తో ప్రధాని ప్రస్తావించారని తెలిపారు. అఫ్గాన్‌లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. పాక్‌కు సంయుక్త వార్నింగ్ ఇవ్వడంపై అమెరికానే తేల్చుకోవాలన్నారు. క్వాడ్‌ను నెగిటివ్ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందన్నారు. -
తెలుగు వారిని కాపాడండి: ఎంపీ మిథున్‌రెడ్డి
-
వారందరినీ క్షేమంగా తీసుకురావాలి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అఫ్గనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్షం గురువారం సమావేశమైంది. తాజా పరిస్థితిని ఫ్లోర్‌లీడర్లకు విదేశాంగ శాఖ వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అఫ్గాన్‌లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కోరామని తెలిపారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని పేర్కొన్నారు. ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని మిథున్‌రెడ్డి తెలిపారు. ఇవీ చదవండి: ‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’ 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ -
మానసిక రుగ్మతలను ముందే గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: మానసిక రుగ్మతలను ముందే గుర్తించి చికిత్స అందిస్తే తీవ్ర పరిణామాలను నివారించగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం 7వ వార్షిక సదస్సును శనివారం ఆమె రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారం భించి మాట్లాడారు. దేశంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 తర్వాత ఈ రుగ్మతలు ఎక్కువయ్యాయని తెలిపారు. మానసిక సమస్యల వల్ల దేశం 2012–30 మధ్య కాలం లో 1.3 ట్రిలియన్ డాలర్లను నష్టపోనుందని గవర్నర్ ఓ సర్వేను ఉటంకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక సమస్యల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులను చిన్నచూపు చూడవద్దని, వారిపట్ల వివక్ష ప్రదర్శించవద్దని కోరారు. మానసిక సమస్యల గురించి కొందరు ప్రముఖులు బహిరంగంగా మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని గవర్నర్ అభినందించారు. -
తప్పక తెలుసుకోవాల్సినవి: కరోనా వచ్చి తగ్గాక కనిపించే పరిణామాలు
నిరుటి తొలి అల నుంచి నేటి మలి అల వరకు కరోనా వైరస్ ఎందరినో కాటేసింది. కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో బాధితులు జ్వరం, తలనొప్పి, ఊపిరి అందకపోవడం, ఆయాసం, వాసనలూ, రుచులూ తెలియకపోవడం ఇలాంటి తాత్కాలిక ఇబ్బందులు ఎన్నింటినో ఎదుర్కొన్నారు. సాధారణంగా ఏదైనా జబ్బు తగ్గాక క్రమంగా కోలుకోవాలి. కానీ కరోనా బారిన పడ్డవారు మాత్రం కొన్ని అనంతర అనర్థాలకు లోనవుతున్నారు. దాదాపు అన్ని అవయవాలపైనా, అంతర్గత వ్యవస్థలపైనా... కొన్నింటిపై ప్రత్యక్షంగా, మరికొన్నింటిపై పరోక్షంగా కరోనా తన దుష్ప్రభావాలు చూపుతోంది. తల మొదలుకొని కాలి వేలి వరకు కరోనా వచ్చి తగ్గాక కనిపించే కొన్ని అనంతర పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఉపయోగపడే కథనం ఇది. ఛాతీ: ఊపిరితిత్తులు / గుండె లాంటి కీలకమైన అవయవాలు అన్నిటికంటే ముఖ్యంగానూ వ్యాధి సమయంలోనూ, ఆ తర్వాత చాలాకాలం పాటు కూడా కరోనాతో ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిమోనియా రావడం, కరోనా అనంతరం కూడా చిన్న చిన్న పనులకే ఆయాసం రావడం, ఊపిరి పూర్తిగా అందకపోవడం వంటివి చాలాకాలంపాటు చాలామందిలో కనిపిస్తున్న లక్షణాలు. దీనికి తోడు ఏసీఈ–2 రిసెప్టార్స్ కారణంగా కరోనాకు గుండె వంటి కీలక అవయవాలే ఎక్కువగా గురవుతున్న సంగతీ తెలిసిందే. ముక్కు – నోరు – గొంతు: కరోనాను నిర్ధారణ చేసేలా అత్యంత ముఖ్యమైన లక్షణాలుగా ముక్కుకు వాసన తెలియకపోవడం, నోటికి రుచి తెలియకపోవడం వంటివి తాత్కాలికంగా జరుగుతాయని మనకు తెలిసిందే. అదృష్టవశాత్తు అవి ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో కనిపించే తాత్కాలిక లక్షణాలు కాగా... గొంతు విషయానికి వస్తే కొందరిలో కోవిడ్ అనంతర పరిణామంగా ‘డిస్ఫేజియా’ అని పిలిచే మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థ : అన్ని వ్యవస్థల్లాగే జీర్ణవ్యవస్థలోని కాలేయం, పేగులు కూడా కరోనా ప్రభావానికి గురవుతున్నాయి. చాలామందిలో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. నిజానికి కాలేయం పనితీరు బాగుంటే... కాలేయ సంబంధిత ఎంజైములైన ఎస్‌జీపీటీ, ఎస్జీఓటీ వంటి ఎంజైములు రక్తంలో కనిపించవు. కానీ కరోనా అనంతర పరిణామంగా కొంతమందిలో ఇవి కనిపిస్తున్నాయి. అంటే... కాలేయం పనితీరు దెబ్బతిన్నదని చెప్పడానికి ఎస్జీపటీ, ఎస్జీఓటీలు రక్తంలో పెరగడం ఓ సూచన అన్నమాట. దీనికి తోడు జీర్ణవ్యవస్థలోని పేగులు సైతం కరోనాకు ప్రభావితమవుతున్నాయి. అందుకే కొందరిలో డయేరియా, నీళ్లవిరేచనాలు కూడా ఓ లక్షణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవన్నీ తాత్కాలికమైన అనర్థాలే అని ఇప్పటికి నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. చర్మం: ఒకింత అరుదుగానే అయినప్పటికీ అక్కడక్కడా కొందరిలో దేహం మొత్తాన్ని కప్పి ఉంచే చర్మంపైనా లేదా చేతుల్లోని చర్మంపైనా తిమ్మిర్లు, గుచ్చినట్లుగా అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్నట్లు అనిపించడం, దాంతో స్పర్శ తెలియకపోవడం లేదా కొందరిలో చర్మం మండుతున్నట్లు అనిపించడం, మొద్దుబారిపోవడం (పారాస్థీషియా) వంటి లక్షణాలు కోవిడ్ అనంతర పరిణామాలుగా కనిపిస్తుండటాన్ని వైద్యనిపుణులు, అధ్యయనవేత్తలు గుర్తించారు. కాళ్లూ, పాదాలు: చాలామందిలో కాళ్లలోని కండాలు పట్టేయడం, కండరాల నొప్పులు అన్న లక్షణాలు కరోనా అనంతర పరిణామంగా ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంతమందిలో మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్‌లో కనిపించినట్లే కండరాలపైనా, అలాగే కొన్ని టెండన్స్పైనా నియంత్రణ కోల్పోవడం వల్ల కాళ్లూ, చేతులు వంటి అవయవాలను కదిలించే ప్రయత్నంలో పాక్షికంగా మాత్రమే ఆ అవయవాలపై అదుపు సాధించే అటాక్సియా వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఇక పాదాల విషయానికి వస్తే... కరోనా అనంతర పరిణామంగా పాదం పైకెత్తలేకపోవడం (ఫుట్ డ్రాప్) వంటి సమస్యలూ కొందరిలో కనిపిస్తున్నాయి. కళ్లు : కళ్లు ముఖ్యంగా ప్రభావితమయ్యేది ‘బ్లాక్ ఫంగస్’ ఇన్ఫెక్షన్తో అన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కొందరు తమ కంటి చూపునూ కోల్పోవాల్సి వస్తోంది. కొందరిలో మెదడు కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోయినట్లే... ‘మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్’ కారణంగా కంటి కండరాల మీద కూడా నియంత్రణ కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతోంది. దాంతో చూపు మందగించడం, కన్ను, కంటి గుడ్డు కదిలించలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కొందరిలో అరుదుగా కనపిస్తున్నాయి. మెదడు: కరోనా సోకిన వారిలోని 30 % వ్యక్తుల్లో, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిన వారిలో 45%, వెంటిలేటర్ ఉన్న వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు కరోనాకే ప్రత్యేకమైన లక్షణాలైన వాసన, రుచి తెలియకపోవడం నాడీ వ్యవస్థపై పడిన దుష్ప్రభావం వల్లనే. ఇది మాత్రమే గాక అనంతర దుష్ప్రభావంగా కొందరిలో మింగడంలోనూ సమస్య కనిపిస్తోంది. ఇక రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం కరోనాలో ప్రత్యేకం కాబట్టి... అలాంటి అనర్థం గనక మెదడులో సంభవిస్తే స్ట్రోక్, హేమరేజ్ వంటి తీవ్రమైన అనర్థాలూ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. నాడీవ్యవస్థలోని నరాలపై ఉన్న మైలీన్ షీత్ దెబ్బతినడం అన్నది మిగతా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కనిపించే ‘జీబీ సిండ్రోమ్’ కూడా ఓ ‘అనంతర’ పరిణామంగా ఇందులోనూ వస్తుంది. దీని వల్ల కాలి నుంచి పైవైపునకు తాత్కాలికంగా అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉంటుంది. మరోవైపు చాలామందిలో తలనొప్పి, చాలా ఎక్కువగా నిద్రపోతూ ఉండటం లేదా మరికొందరిలో అస్సలు నిద్రలేకపోవడం వంటి4 సమస్యలు వినిపిస్తున్నాయి. వీటి అన్నింటికీ మించి తీవ్రమైన అయోమయానికి గురిచేసే ‘బ్రెయిన్‌ఫాగ్’ మరో ప్రముఖమైన అనంతర పరిణామం. చాలామంది లో మెదడులోని గ్రేమ్యాటర్ పరిణామం తగ్గి మళ్లీ చాలాకాలం తర్వాత యథాతథ స్థితికి వస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. ఇక మానసికమైన ఒత్తిడి కారణంగా ‘డిప్రెషన్’ కు లోనవుతున్న వారి సంఖ్య పెరిగింది. మూత్రవిసర్జన వ్యవస్థ: కరోనా అనంతర పరిణామంగా మూత్రం చాలా చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించడం అరుదుగానైనా చాలా కొద్దిమందిలో కనిపిస్తోంది. అయితే మూత్రపిండాలు దెబ్బతినడం చాలా చాలా అరుదు. చెవి : కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లలో ‘టినైటస్’ అనే కండిషన్లో కనిపించిన విధంగా చెవులో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉన్నట్లుగా హోరున శబ్దం వినిపిస్తున్నట్లు కొన్ని కొత్త అధ్యయనాల్లో తేలింది. దీనికి తోడు కరోనాకు గురైన 7 – 20 శాతం మందిలో వినికిడి లోపాలు వస్తున్నట్లు అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఇవి కొందరిలో ఒకే చెవిలో కనిపిస్తుండగా... మరికొందరిలో రెండు చెవుల్లోనూ వస్తున్నాయి. సాధారణంగా ఒక్క కరోనా విషయంలోనే కాకుండా... వ్యక్తులు ఏవైనా ఇతరత్రా ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డప్పుడు కూడా... కొందరిలో వినికిడి సమస్యలు, కళ్లు బాగా తిరిగి ఒళ్లంతా తూలిపోయే ‘వర్టిగో’ వంటి లక్షణాలు కనిపించేవి. వర్టిగో అన్నది చెవిలో మనల్ని బ్యాలెన్స్డ్గా ఉంచేందుకు ఉపయోగపడే ద్రవంలో లోపాల కారణంగా వస్తుంటాయన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడూ కరోనాకు గురైన అనంతర పరిణామంగా ‘బినైన్ పెరాక్సిమల్ పొజిషన్ వర్టిగో (బీపీపీవీ)’ అంటే హానికరం కాని వర్టిగో లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డయాబెటిస్ : కరోనా అనంతర పరిణామంగా... కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స చేయడం ఓ సాధారణ ప్రోటోకాల్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇలా స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు రోగుల్లోని గ్లుకోజ్ పెరుగుతుందన్న విషయమూ తెలిసిందే. అయితే చిత్రంగా కేవలం స్టెరాయిడ్స్ ఇచ్చిన వారి విషయంలోనూ కాకుండా... స్టెరాయిడ్స్ ఇవ్వకుండా చికిత్స పొందినవారిలోనూ చక్కెర లెవెల్స్ ఎక్కువ గా నమోదవుతూ ఉండటం వైద్యవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. థైరాయిడ్ సమస్యలు సాధారణంగా ఏదైనా వైరల్ లేదా ఇతరత్రా ఇన్ఫెక్షన్ వచ్చాక తాత్కాలికంగా థైరాయిడ్ సంబంధిత సమస్యలు కనిపించడం మామూలే. అదే విధంగా కరోనా అనంతర పరిణామంగా కూడా చాలామందిలో థైరాయిడ్ పనితీరు ఎక్కువగా ఉండే హైపర్‌థైరాయిడిజమ్, తక్కువగా మారే ‘హైపోథైరాయిడ్’ సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికైతే ఇవి తాత్కాలికంగానే ఉండటం వైద్యవర్గాలనూ, నిపుణులనూ, అధ్యయనవేత్తలను కాస్త తేలిగ్గా ఊపిరిపీల్చుకునేలా ఉపశమనం కలిగిస్తున్నాయి. కోవిడ్ అనంతర పరిణామాలతో తల మొదలుకొని... కాలి చివరివరకూ ప్రతి అవయవం, ప్రతి వ్యవస్థా ప్రభావితమవుతూ ఉండటం అధ్యయనవేత్తలను అబ్బురపరుస్తుంది. గత ఏడాదే తొలి దశ రావడం.. తక్కువ మొత్తంలోనే అయినా ఇంకా కేసులు వస్తూనే ఉండటంతో కోవిడ్ తర్వాతి దుష్ప్రభావాలూ, అనంతర అనర్థాలపై అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు తమలో కనిపించిన లక్షణాలను బట్టి ఆయా వైద్య నిపుణులనుగానీ లేదా మెడికల్ స్పెషలిస్ట్‌లైన ఫిజీషియన్లను సంప్రదించాలి. దాంతో వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల... కోవిడ్ అనంతర ప్రభావాలతో కనిపించే అనర్థాలను మొగ్గలోనే తుంచేసినట్లవుతుంది. భవిష్యత్తులో అవి ముదరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తపడినట్లుగానూ అవుతుంది. డాక్టర్ వెంకటేష్ బిళ్లకంటి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ -
బైడెన్‌కు అన్నీ సవాళ్లే
అమెరికాను పాలించిన నాలుగేళ్లూ ఇంటా, బయటా ప్రశంసలకన్నా విమర్శలే అధికంగా మూట గట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ నిష్క్రమణ ఖాయమైంది. 290 ఓట్లు సాధించి విజయపథంలో వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుం డగా... 214 దగ్గరే ఆగిపోయిన ట్రంప్ తన ఓటమిని ఇంకా అంగీకరించలేదు. బైడెన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ర్యాలీలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లోకి, ఆ వెంటనే అధి కారంలోకి ‘బయటి వ్యక్తి’గా వచ్చిన ట్రంప్ చివరివరకూ అలాగే వుండిపోయారు. వ్యక్తిగత దూష ణలు, జాత్యహంకార ధోరణులు, కయ్యానికి కాలుదువ్వే మనస్తత్వం ఆయన వదులుకోలేదు. ఇప్పుడు అదే దూకుడుతో న్యాయస్థానాల ద్వారా జో బైడెన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జార్జియా, అరిజోనా, నెవెడా, పెన్సిల్వేనియా, మిషిగాన్, టెక్సాస్‌లలో ఇప్పటికే ఆయన న్యాయ వాదులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అనుమానాస్పదమైనవని, పోలింగ్‌లో తమ పార్టీ పరిశీలకుల్ని అనుమతించలేదని వాటి సారాంశం. ట్రంప్ వాదనల మాటెలావున్నా ఆయన్ను 2016లో అధ్యక్ష పీఠం ఎక్కించిన శ్వేతజాతి అమెరికన్లలో విద్యాధికవర్గం ఆయనకు దూరం జరి గింది. దేశంలో అమలవుతున్న ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల వల్ల నష్టపోయిన సంప్రదాయ పెట్టుబడిదారీవర్గం, అట్టడుగు శ్వేత జాతీయులు 2016 మాదిరే ఇప్పుడు కూడా ఆయన వెనక దృఢంగా నిలబడ్డారు. అందువల్లే సర్వేలు జోస్యం చెప్పినట్టుగా డెమొక్రాట్ల ప్రభంజనం జాడ కనబడలేదు. ఈసారి అధ్యక్ష ఎన్నికల విశ్వసనీయతపై, ప్రత్యేకించి ఎన్నికల ప్రక్రియపై ప్రచారపర్వంలో ఒక పద్ధతి ప్రకారం డోనాల్డ్ ట్రంప్ సంశయాలు రేకెత్తించారు. ఓటమిని అంగీకరించేలోగా ఆయన ఈ బాణీనే కొనసాగిస్తారు. చేతనైనంతమేరకు వివాదాన్ని సాగదీస్తూనే వుంటారు. కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాల్సిన జనవరి 20 వరకూ లెక్కేస్తే అధికార మార్పిడికి సంబంధించి వివిధ లాంఛనాలు ముగియడానికి ఇంకా 11 వారాలు గడువుంది. ఈ వ్యవధిని సాధ్యమైనంత మేర వివా దాలమయంగా మారిస్తే ఇప్పుడు అధ్యక్ష పీఠం దక్కకపోయినా, 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని మరోసారి చేజిక్కించుకోవడానికి ట్రంప్‌కు ఛాన్సుంటుంది. నిజానికి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా రచ్చ చేస్తున్నారని కొందరి అనుమానం. అమెరికా 22వ అధ్యక్షుడిగా విజయం సాధించి 1889 వరకూ పనిచేసి, ఓడిపోయి తిరిగి 1893లో 24వ అధ్యక్షుడిగా ఎన్నికైన గ్రోవర్ క్లీవ్‌లాండ్ మాదిరే తాను కూడా మరోసారి పాలించవచ్చని ట్రంప్ కలలు కంటున్నారని వారి అంచనా. ఆయన మాటెలావున్నా బైడెన్ మాత్రం సెనేట్‌లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి వుంటుంది. సెనేట్‌లో మెజారిటీగా వున్న రిపబ్లికన్ల నాయకుడు మెక్ కానెల్ సృష్టించే అవాంతరాలను అధిగమించడం ఆయనకంత సులభం కాదు. ఒబామా పాలించిన ఎనిమిదేళ్లలో ఆరేళ్లపాటు సెనే ట్లో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగిలి, అవి అమలు కాకుండా చూడటంలో మెక్ కానెల్ విజయం సాధించారు. ఆఖరికి తమ పార్టీకి లాభించే నిర్ణయాలను సైతం అడ్డగించి, ఒబామా ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ ఆయన కలగజేశారు. 2016లో డెమొక్రాట్లు ఓడిపోవడానికి గల అనేక కారణాల్లో సెనేట్ వైఫల్యాల పాత్ర కూడా గణనీయంగానేవుంది. మెక్ కానెల్, ఒబామాల మధ్య మాటలే వుండేవి కాదు. చిత్రమేమంటే అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఒబామా దూతగా జో బైడెన్ వెళ్లి మెక్ కానెల్‌ను ఒప్పించేవారు. కనుకనే డెమొక్రాట్లలో ‘ప్రచ్ఛన్న రిపబ్లికన్’గా బైడెన్‌పై ముద్రపడింది. కానెల్, బైడెన్లకు 1985 నుంచి పరిచయం వుంది. కానీ డెమొక్రాటిక్ ప్రాధాన్యతలను నెరవేర్చే నిర్ణయాలకు అడ్డుతగలకుండా ఈసారి బైడెన్ ఆయనకు నచ్చజెప్పగలరా అన్నది ప్రశ్న. జాతీయ భద్రతా సలహా దారు పదవి మొదలుకొని ఖజానా మంత్రి పదవి వరకూ చాలావాటికి కానెల్ ఆమోదం కావాల్సి వుంటుంది. అందుకోసం ఒకటి, రెండు పదవులకు రిపబ్లికన్లను బైడెన్ నామినేట్ చేయక తప్పక పోవచ్చు. అయితే సెనేట్‌లోని ఒకరిద్దరు రిపబ్లికన్లను పదవుల ఆశ చూపి లోబర్చుకున్నా, వచ్చే జనవరి 5న జార్జియానుంచి జరగబోయే రెండు సెనేట్ స్థానాల ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించినా బైడెన్ పని సులభమవుతుంది. క్లింటన్ హయాంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు పార్టీలో వామపక్షవాదుల్ని దూరం పెట్టేవారు. ఆ రకంగా రిపబ్లికన్లను బుజ్జగించి పనులు జరిపించుకునేవారు. బైడెన్ తీరెలావుంటుందో చూడాలి. ఈ నాలుగేళ్లలో ట్రంప్ అనేక విషయాల్లో ఇల్లు పీకి పందిరేసిన చందాన నిర్ణయాలు తీసు కున్నారు. వాటిని చక్కదిద్దడం బైడెన్‌కు తలకు మించిన భారం. ప్రస్తుతానికి ప్రతినిధుల సభలో మెజారిటీ వుంది. రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరిగేనాటికి సమర్థుడన్న పేరు తెచ్చుకుని ఆ మెజారిటీని ఆయన నిలబెట్టుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు అంతక్రితం ప్రభుత్వాలు తీసుకొచ్చిన 125 నిబంధనలు ట్రంప్ ఏలుబడిలో రద్దయ్యాయి. కొన్ని నామమాత్రంగా మిగిలాయి. వాటిని వెనక్కు తీసుకోవాలంటే అదనంగా 1.7 లక్షల కోట్ల నిధులు అవసరం. పారిస్ ఒడంబడిక నుంచి బయటి కొస్తున్నట్టు నిరుడు నవంబర్ 4న ట్రంప్ ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మళ్లీ ప్రపంచానికి చాటాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొనసాగుతామని చెప్పాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి పూర్తి స్థాయిలో కొత్త వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలి. ట్రంప్ హయాంలో నిరాదరణకు గురైన నాటో మిత్రుల్ని దగ్గర చేసుకోవాలి. చైనాతో సంబంధాలను మరమ్మత్తు చేసుకోవాలి. ఏతావాతా ఓడిన ట్రంప్ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే, బైడెన్ అడుగడుగునా అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి వుంటుంది. -
జరిగేది చెబుతాను.. జరగబోయేది చెబుతాను..
చరిత్రను మలుపు తిప్పే సంఘటనలను ప్రస్తావిస్తూ.. అంతకుముందు.. ఆ తర్వాత అన్నట్లు చెబుతుంటాం.. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం.. మన జీవితాలు కూడా కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్నట్లు మారబోతున్నాయి. సామాజిక, ఆర్థిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవెలా ఉండవచ్చన్నది ఓసారి భవిష్యత్తులోకి వెళ్లి చూసి వద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ డిజిటల్ సేవలు, ఈ–కామర్స్‌కు జై ఇప్పటికే కాంటాక్ట్ లెస్ డెలివరీలు అన్నవి పెరిగాయి.. కరోనా అనంతర పరిస్థితుల్లో ఇవి మరింతగా పెరుగుతాయి. కాంటాక్ట్ లెస్ గూడ్స్ సేవలు, డిజిటల్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఫుడ్ డెలివరీ తదితర కంపెనీలు వృద్ధి చెందు తాయి. అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రకటనల మీద పెట్టే ఖర్చును చాలా కంపెనీలు తగ్గించుకుంటాయి. ఉద్యోగాల్లో యాంత్రీకరణ.. యాంత్రీకరణ పెరుగుతుంది. కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. ఇంట్లో నుంచే ఉద్యోగం చేసేలా చాలా కార్యకలాపాలు ఉండొచ్చు. ఇవన్నీ ఔట్‌సోర్సింగ్‌లో తక్కువ వ్యయంతో ప్రాజెక్టులు పూర్తి చేసే దేశాల్లోని నిపుణులకు లభించే అవకాశముంది. టెలి మెడిసిన్‌కు గిరాకీ ఇంటికి వచ్చి టెస్టులు చేసే వ్యవస్థ ఇప్పటికే ఉంది.. ఇది మరింతగా పెరుగుతుంది. టెలిమెడిసిన్, పరిశోధనలు, బయోటెక్, హెల్త్‌కేర్ వ్యవస్థలకు నిధులు బాగా పెరుగుతాయి. మరో వలస సంక్షోభం.. ఆంక్షలు ఎత్తేసిన తర్వాత హెల్త్‌కేర్ వ్యవస్థ సరిగా లేని దేశాల నుంచి మెరుగైన మంచి ఆరోగ్య వ్యవస్థ ఉన్న యూరప్ వంటి దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ధనిక దేశాలు నైపుణ్యం ఉన్న వారిని అనుమతించే అవకాశం ఉంది. నిఘా, ఆంక్షలు పెరగొచ్చు.. ప్రస్తుతం కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అత్యవసర అధికారాలు ప్రదర్శిస్తున్నారు. కరోనా తర్వాత మరింత నిఘా పెరగొచ్చు. దేశ, రాష్ట్ర సరిహద్దుల వెంబడి బయోమెట్రిక్ స్క్రీనింగ్ జరపొచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లే పరిస్థితి రావొచ్చు. ప్రాధాన్యాలు మారుతాయి కరోనా ఎంతటి మహమ్మారో ప్రపంచానికి తెలిసొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి వైరస్ల నుంచి మానవాళిని కాపాడటానికి ప్రపంచ దేశాల నేతలు దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తారు. పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రాధాన్యంగా మారే అవకాశముంది. -
తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పసిడికి యూరోజోన్ పరిణామాలు కీలకం
రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి ఇటలీలో రెఫరెండం తదితర యూరోజోన్ పరిణామాలు ఈ వారం పసిడి రేట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు పరిశీలకుల అంచనా. ఇక, ఈసీబీ పాలసీ సమీక్షా సమావేశం తదితర అంశాలూ పుత్తడిపై ప్రభావం చూపనున్నాయన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకునే పసిడి ధరలు సర్దుబాటు అరుునందున.. మెరుగైన ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు ఇక 2017లో మరింతగా రేట్ల పెంపుపై దృష్టి పెట్టొచ్చు. ఏదైతేనేం.. బంగారంలో ప్రస్తుతం ఓవర్‌సోల్డ్ ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. షార్ట్ కవరింగ్ ర్యాలీ కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలానికి మాత్రం బేరిష్ అంచనాలే నెలకొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, క్రితం వారం దేశీయంగా పసిడి ధరలను సమీక్షిస్తే.. అంతర్జాతీయంగా బేరిష్ ధోరణి, దేశీయంగా డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాలతో బంగారం రేట్లు వరుసగా నాలుగో వారమూ తగ్గారుు. బంగారం రేటు నష్టాలతో కీలకమైన రూ.29,000 మార్కు దిగువకు పడిపోరుుంది. ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 29,035-28,345 మధ్య తిరుగాడి చివరికి క్రితం వారంతో పోలిస్తే సుమారు రూ. 475 తగ్గుదలతో రూ. 28,380 వద్ద ముగిసింది. మేలిమి బం గారం రేటూ దాదాపు అంతే నష్టంతో రూ. 28,530 వద్ద ముగిసింది. వారం మొత్తంలో రూ.29,185-28,495 మధ్య తిరుగాడింది.