ITR filing deadline July 31: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని విధి. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నప్పటికీ, ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం.
జరిమానా
జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే వరకు గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది. (బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్)
అప్‌డేటెడ్ రిటర్న్స్
సెక్షన్ 139(8A) ప్రకారం అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టింది. అయితే, సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్‌డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని ఫైల్ చేయవచ్చు.
ప్రాసిక్యూషన్, జైలు శిక్ష?
అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైల్ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ITRను అస్సలు ఫైల్ చేయకపోతే, వారు ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరంలోని నష్టాలను ముందుకు తీసుకెళ్లలేరు. అలాగే, అసెస్‌డ్ ట్యాక్స్‌లో కనిష్టంగా 50 శాతం లేదా అసెస్‌డ్ ట్యాక్స్‌లో గరిష్టంగా 200 శాతం పెనాల్టీ విధించవచ్చు. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం వేతన జీవులను ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది.
కాగా ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు శరవేవంగా జరుగుతోందనీ, సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఐటీ రిటర్న్స్‌లో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్‌గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్ చేసినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment