ITR forms
-
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి. -
ధార్మిక సంస్థలకు.. ఐటీఆర్ ఫారం-7
ఐటీఆర్ ఫారం 7 గురించి చెప్పే కథ పెద్దగా ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైనదేనని చెప్పక తప్పదు. ఎవరెవరు ఈ ఫారం వేయొచ్చంటే..– ధార్మిక సంస్థలు, మత ట్రస్టులు– రాజకీయ పార్టీలు – సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థలు – యూనివర్సిటీలు, కాలేజీలు, సంస్థలు – ఖాదీ, గ్రామ పరిశ్రమ సంస్థలు పైన చెప్పిన అన్నింటికీ నిర్వచనాలు ఉన్నాయి. ఆ పరిధిలోకి వచ్చినవే ఫారం 7 వేయాలి. నిర్వచనం, పరిధి, కార్యకలాపాలు, ఆంక్షలు ఇలా కొన్ని విషయాలను చట్టంలో పొందుపర్చారు. ఇటువంటి సంస్థలు మినహాయింపు పొందాలంటే దీన్ని వినియోగించుకోవచ్చు. ఇటువంటి సంస్థలకు ఆదాయం ఉంటుంది. ఖర్చులు ఉంటాయి. నికర ఆదాయం పన్ను పరిమితిని దాటి ఉంటుంది. కానీ వారికి మినహాయింపు ఉంటుంది.పన్ను చెల్లించనక్కర్లేదు. పూర్తిగా మినహాయింపు వెసులుబాటు ఉంటుంది (చట్టానికి లోబడి). వారే ఫారం 7 వేయాలి. మినహాయింపునకు అర్హత లేని వారు, మినహాయింపు వద్దనుకున్న సంస్థలు ఫారం 7 వేయనక్కర్లేదు. అటువంటి సంస్థలు ఫారం 5 వేయాల్సి ఉంటుంది. గతంలో చెప్పినట్లు ఫారం 5 వేయాలా లేక ఫారం 7 వేయాలా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరం అయితే, వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ట్రస్ట్, సొసైటీ, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, స్థానిక సంస్థల, వ్యక్తుల కలయిక.. వీరందరూ కూడా ఈ రిటర్ను వేయొచ్చు.అయితే, ఫారం 3,4,5,6లకు .. ఈ ఫారం 7కు తేడా ఏమిటీ అంటే దీన్ని వేయాల్సిన వారు మినహాయింపు కోవకు చెందినవారై ఉండాలి. మినహాయింపునకు అర్హత ఉన్నవారే దాఖలు చేయాలి. ఆడిట్‌కి వర్తించే కేసులైతే, 31–10–2024 లోపల వేయాలి. వీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్టును కూడా నిర్దేశించిన ఫారంలో దాఖలు చేయాలి. ఇతరులు 31–07–2024 లోపల వేయాలి.ఏ చిన్న తప్పు దొర్లినా, భూతద్దంలో చూస్తారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు కొన్ని సంస్థలు అర్హత లేకపోయినా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నాయి. మీరు ట్రస్టీలైనా, మేనేజ్మెంట్ మెంబర్లయినా తగిన జాగ్రత్తలు వహించండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
పన్నుదారులకు అందుబాటులో ఐటీఆర్ ఫారాలు
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2024, ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) 1, 2, 4, 6 ఫారాలు అందుబాటులో ఉన్నాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు 23,000 రిటర్న్‌లు దాఖలయ్యాయని తెలిపింది. 2024-25 మదింపు సంవత్సరానికి (2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఐటీఆర్ దాఖలు అవకాశాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు వాడే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కంపెనీలు కూడా ఐటీఆర్-6 ద్వారా ఏప్రిల్ 1 నుంచే రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఐటీ విభాగం అవకాశం కల్పించడం ఇటీవలి కొన్నేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిబంధనల సరళీకరణ, పన్ను చెల్లింపు సేవల సులభతరం దిశగా ఇది ఓ కీలక అడుగుగా చెప్పొచ్చు. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లు వాడుతారు. ఐటీఆర్-2 ఫారంను నివాస స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఆర్జించే వాళ్లు దాఖలు చేస్తారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్ : ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు!
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్ ఫైలింగ్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఐటీఆర్-2, ఐటీఆర్ -3 ఫారమ్స్ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఆడిట్ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్ 31, 2024 లోపు ఐటీఆర్-3 ఫైల్‌ను తప్పని సరిగా చేయాలని కోరుంది. ఐటీఆర్-2 ఫైలింగ్ ఎవరు చేయాల్సి ఉంటుంది? ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్‌పోర్టల్ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్‌యూఎఫ్.. అంటే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్‌యూఎఫ్‌కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్ కట్టేవారు ఐటీఆర్-2ని తప్పని సరిగా ఫైల్ చేయాలి. ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-2లో మార్పులు రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల
ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫారాలు - 1, 4 లను విడుదల చేసింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న హిందూ అవిభక్త కుటుంబాలు, వ్యక్తులు, సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లోనే ఐటీఆర్ ఫారాలను ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ముందస్తుగా ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలు కలిగింది. ఏ ఫారం ఎవరికి? ఐటీఆర్ ఫారం-1 (సహజ్), ఐటీఆర్ ఫారం-4 (సుగమ్) అనేవి పెద్ద సంఖ్యలో ఉండే చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించిన సరళీకృత ఫారాలు. వీటిలో జీతాలు, ఇళ్లు, వడ్డీలు, వ్యయసాయం తదితర మార్గాల ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులకు ఫారం-1 వర్తిస్తుంది. ఇక వ్యాపారం, వృత్తి మార్గాల ద్వారా రూ. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు ఫారం-4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేస్తారు. -
ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?
ITR filing deadline July 31: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని విధి. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నప్పటికీ, ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. జరిమానా జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే వరకు గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది. (బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్) అప్డేటెడ్ రిటర్న్స్ సెక్షన్ 139(8A) ప్రకారం అప్డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టింది. అయితే, సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని ఫైల్ చేయవచ్చు. ప్రాసిక్యూషన్, జైలు శిక్ష? అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైల్ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ITRను అస్సలు ఫైల్ చేయకపోతే, వారు ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరంలోని నష్టాలను ముందుకు తీసుకెళ్లలేరు. అలాగే, అసెస్డ్ ట్యాక్స్‌లో కనిష్టంగా 50 శాతం లేదా అసెస్డ్ ట్యాక్స్‌లో గరిష్టంగా 200 శాతం పెనాల్టీ విధించవచ్చు. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం వేతన జీవులను ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది. కాగా ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు శరవేవంగా జరుగుతోందనీ, సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఐటీ రిటర్న్స్‌లో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్‌గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఐటీఆర్ ఫారమ్‌లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్ యుటిలిటీ షీట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అందరికీ అనుకూలమైన ఒకే ఒక్క ఆదాయపన్ను రిటర్నుల పత్రాన్ని (ఐటీఆర్ ఫామ్) తీసుకురావాలంటూ ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ పత్రంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక భాగం ఉంటుంది. ట్రస్ట్‌లు, ఎన్జీవోలు మినహా మిగిలిన పన్ను చెల్లింపుదారులు అందరూ నూతన ప్రతిపాదిత ఐటీఆర్‌ను ఫైల్ చేసుకోవచ్చంటూ, దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) భాగస్వాములను కోరింది. ఐటీఆర్–7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను విలీనం చేయాలన్నది ప్రతిపాదన. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది ఐటీఆర్–1, ఐటీఆర్–4 దాఖలు చేస్తుంటారు. ఇంటి రూపంలో ఆదాయం, వేతనం రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయవచ్చు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు వ్యాపార ఆదాయం కూడా కలిగి ఉంటే ఐటీఆర్–4ను, వేతన లేదా వ్యాపార ఆదాయంతోపాటు మూలధన లాభాల పన్ను పరిధిలోని వారు ఐటీఆర్–2 దాఖలు చేయాలి. చదవండి: ‘జెఫ్ బెజోస్’ను అధిగమించి..ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీకి 3వ స్థానం -
ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు: మీకు ఫారం -16 అవసరం లేదు
ప్రశ్న: నేను 2022 మార్చి 31వరకూ పర్మనెంట్ ఉద్యోగం చేశాను. రిటైర్ అయ్యాక ఏప్రిల్–మేలో ఓ ఉద్యోగం తర్వాత మారి జూన్, జూలై, ఆగస్టులో మరో ఉద్యోగం చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మానేశాను.ఆరోగ్యం కుదుటపడ్డాకా కొన్ని రోజులు కన్సల్టెంటుగా చేశాను. కలిసి రాలేదు. దాంతో అక్టోబర్ నుండి మళ్లీ ఉద్యోగం. ఎక్కడా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటలేదు. అందుకని పన్ను రికవరీచేయలేదు. జవాబు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, మధ్యలో కన్సల్టెన్సీ చేసి మళ్లీ ఉద్యోగం .. ఇలా ఎన్నో చేస్తున్నారు. మీకు నెలకు వచ్చిన జీతం వివరాలు ఇవ్వలేదు. ఎవరూ పన్ను రికవరీ చేయలేదు. కాబట్టి ఫారం 16 ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీ జీతం, వేతనం అలాగే కన్సల్టెంటుగా మిగిలిన లాభం ఇలా.. మొత్తం ఆదాయం లేదా నికర ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,00,000 దాటకపోతే మీకు ఎటువంటి పన్ను భారం ఏర్పడదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే రిబేటు అమల్లో ఉండటం వల్ల పన్ను భారం పడదు. పన్ను రికవరీ జరగలేదు. ఇక ముందు కూడా జరగకపోతే రిఫండు ప్రశ్న రాదు. కాబట్టి రిటర్ను వేయనవసరంలేదు. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో యజమాని జీతం ఇచ్చారు కానీ పన్ను రికవరీ చేయలేదంటున్నారు. ఆ తర్వాత మూడు నెలల పాటు మరో యజమాని కూడా అదేవిధంగా చేశారు. అంటే ఈ ఇద్దరూ ఎవరి మటుకు వాళ్లు ‘‘మీరు పన్ను భారం పరిధిలోకి రాలేదు’’ కాబట్టి వదిలేశారు. ఉదాహరణగా, మొదటి యజమాని నెలకు రూ. 1 లక్ష ఇచ్చారనుకోండి. మీ జీతం రూ. 2 లక్షలు, బేసిక్ లిమిట్ దాటలేదు. కాబట్టి రికవరీ చేయలేదు. రెండో యజమాని కూడా నెలకు రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలకు ఇచ్చారు అనుకోండి. మొత్తం రూ. 3 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 .. మిగతాది బేసిక్ లిమిట్ దాటలేదు అందుకని రికవరీ చేయలేదు. ఇక కన్సల్టెంటు ఎందుకు రికవరీ చేయలేదో తెలియదు. నాలుగో వ్యక్తి మరో యజమాని. ఇక ఇప్పుడు మీరే స్వయంగా మీ కొత్త యజమానికి తెలియజేయండి. గతంలో మీరు పుచ్చుకున్న జీతభత్య వివరాలు, వాటితో బాటు .. చెల్లించి ఉంటే ఇంటద్దె, మీరు చేసిన సేవింగ్స్, మెడిక్లెయిం, డొనేషన్లు .. ఇవన్నీ రాతపూర్వకంగా తెలియజేయండి. అన్నీ కలిపితే ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త యజమానిని ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని లెక్కించమనండి. ఆ ప్రకారం పన్నును రికవరీచేసి .. అంటే టీడీఎస్ చేసి లెక్కించి, చెల్లించమనండి. ఇదే సరైన మార్గం. ఒకవ్యక్తి ఒక సంవత్సర కాలంలో వచ్చినది పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పన్ను భారం లెక్కించాలి సుమా! -
ఐటీ రిటర్న్: గడువులోగా ఫైల్ చేయలేదా?.. ఫైన్ మాత్రమే కాదు.. ఇవన్ని కోల్పోతారు!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ గుడువు ఆదివారంతో (జూలై 31) ముగిసింది. ఆఖరి రోజు పన్ను చెల్లింపుదారులు ఉరుకులు పరుగులు మీద ఐటీఆర్ దాఖలు చేశారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇటీవల వారాల్లో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరో వైపు గడువు తేది పొడిగించే ఆలోచన లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చివరి రోజైన ఆదివారం రాత్రి 11గంటల వరకు మొత్తం 67,97,067 మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేయగా.. చివరి గంటలో 4,50,013 ఐటీఆర్ దాఖలు చేశారని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. దీంతో ఈ సంఖ్య మొత్తంగా ఐదున్నర కోట్లకు పైనే చేరుకుంది. ఒకవేళ మీరు జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఫైల్ చేయడం కుదరని వాళ్లు డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే అందుకు కొంత పెనాల్టీ చెల్లించక తప్పదు. దీంతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలకు కోల్పోతారని నిపుణులు చెపుతున్నారు. డెడ్‌లైన్‌లోపు ఫైల్ చేయకపోతే: ►డెడ్‌లైన్ తర్వాత ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు రూ.5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానాగా చెల్లించాలి. ►పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి గడువు తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ► ఐటీర్ ఆలస్యంగా పైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు.. వారి మూలధనరాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేసుకోగలరు. ► ఐటీ రిటర్న్ సకాలంలో దాఖలు చేసి, ధృవీకరించుకున్న తర్వాతే రీఫండ్ అనేది వస్తుంది. కాకపోతే దాఖలు చేయడం అలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా అదే తరహాలో ఆలస్యం అవుతుంది. ►2022 డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. Statistics of Income Tax Returns filed today. 67,97,067 #ITRs have been filed upto 2300 hours today & 4,50,013 #ITRs filed in the last 1hr. For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or on our help desk nos 1800 103 0025 & 1800 419 0025. We will be glad to assist! — Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022 చదవండి: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ -
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30. డిజిటల్ సంతకం.. డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్లైన్లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్మెంటు ఆన్లైన్లో మెషీన్ ద్వారా జరుగుతుంది. ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
ఏ ఆదాయవర్గాల వారికి ఐటీఆర్ ఫారం 2 అవసరం
గత వారం ఐటీఆర్ ఫారం 1 గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఐటీఆర్ ఫారం 2కి సం బంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇది ఎవరికి వర్తిస్తుందంటే.. కేవలం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలే దీన్ని దాఖలు చేయొచ్చు. ఇక ఏ ఆదాయవర్గాల వారు దాఖలు చేయొచ్చంటే.. జీతం రూపంలో ఆదాయం ఉన్నవారు పింఛను అందుకునేవారు ఇంటి మీద ఆదాయం పొందేవారు (ఎన్ని ఇళ్లున్నా .. అంటే రెండు అంతకు మించిన సంఖ్యలో ఇళ్లపై ఆదాయం పొందుతున్నవారు) ఇతరత్రా ఆదాయ మార్గాలు, లాటరీలు, గుర్రపు పందాలు మొదలైన వాటి ద్వారా ఆదాయం రూ. 50,000 దాటితే ఈ ఫారం దాఖలు చేయవచ్చు వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవారు విదేశాలలో ఆస్తులు ఉన్న వారు, విదేశాల నుంచి ఆదాయం ఉన్నవారు కంపెనీలలో డైరెక్టర్లు క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం గలవారు అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటా ఉన్న వారు నాన్ రెసిడెంట్లు ఎవరికి ఇది వర్తించదంటే.. వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు వృత్తి మీద ఆర్జించేవారు ఫారం 1 వేయడానికి అర్హులైన వ్యక్తులు ఫారం 1 దాఖలు చేయడానికి అర్హత గల ఉమ్మడి కుటుంబాలు స్థూలంగా చెప్పాలంటే.. రూ. 50,00,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు ఫారం 1, అంతకు మించి ఉన్నవారు ఫారం 2 దాఖలు చేయాలని భావించవచ్చు. ఫారం 1 వేసే వారు ఫారం 2 వేయకూడదు. ఫారం 2 దాఖలు చేసే వారు ఫారం 1 దాఖలు చేయకూడదు. సర్దుబాటు కాని నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసేవారు ఫారం 2ని ఉపయోగించాలి. మిగతా ప్రక్రియంతా షరా మామూలే. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
2020-21 ఐటీ రిటర్న్ ఫారమ్‌ల నోటిఫై!
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను (ఐటీఆర్ ) తెలియజేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఐటీఆర్ ఫారమ్‌ల ఫైలింగ్‌లో కూడా ఎటువంటి మార్పులూ చేయలేదని వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ ఫామ్స్‌ను నోటిఫై చేసింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) గురువారం ఒక ప్రకటన చేస్తూ, కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది ఐటీఆర్‌ఫారమ్‌లలో ఎటువంటి కీలక మార్పులూ చేయకుండా, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా తాజా ఫారమ్‌లను నోటిఫై చేసినట్లు వివరించింది. నోటిఫైడ్ ఐటిఆర్ ఫారాలు ఇ-గెజిట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఐపీవోకు సెవెన్ ఐలాండ్స్.. న్యూఢిల్లీ: సముద్ర రవాణా కంపెనీ సెవెన్ ఐలాండ్స్ షిప్పింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందింది. ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. దీనికి అదనంగా మరో రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. కాగా.. 2003లో ప్రారంభమైన కంపెనీ ఇంతక్రితం 2017లోనూ ఐపీవో ప్రయత్నాలు చేయడం గమనార్హం! -
విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటితే రిటర్న్‌లు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ వర్గాలు దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలను (ఐటీఆర్ ఫామ్) నోటిఫై చేసింది. సహజ్ (ఐటీఆర్–1), ఐటీఆర్–2, ఐటీఆర్–3, సుగమ్ (ఐటీఆర్–4), ఐటీఆర్–5, ఐటీఆర్–6, ఐటీఆర్–7 నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను వీటిల్లో తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ.కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే, విద్యుత్తు బిల్లు రూ.లక్షకు మించితే రిటర్నుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. -
‘ఐటీఆర్ ఫామ్స్’లో మార్పుల్లేవ్..
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫామ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం స్పష్టంచేసింది. ఐటీఆర్ ఫామ్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటోన్న కారణంగా రిటర్నులను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు కేవలం అపోహలు మాత్రమే అని కొట్టిపడేసింది. యుటిలిటీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందే తప్పించి మరే ఇతర మార్పులు లేవని వివరించింది. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) సమాచారం ఆధారంగా ప్రీ–ఫైలింగ్ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉన్నట్లు తెలిపింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 ఆఖరి తేదీ. -
కొత్త ఐటీఆర్ ఫారంలు వచ్చేశాయ్
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కొత్త ఐటీఆర్ ఫారాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. 2015-16 అసెస్మెంట్ ఇయర్‌కి (2014-15 ఆర్థిక సంవత్సరం) సంబంధించి రిటర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా మూడు పేజీలతో కూడిన ఐటీఆర్ ఫారంలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొంది. గతంలో ఐటార్2ఏ ఫారంను పూర్తి చేయడానికి 15 పేజీలు నింపాల్సి ఉండటంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పేజీల సంఖ్యను మూడుకు తగ్గిస్తూ ఐటీఆర్ ఫారంలను సరళీకరించడం జరిగింది. ఐటీఆర్ ఫారంల విడుదల జాప్యం కావడంతో రిటర్నుల దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. -
నెలాఖరుకల్లా సరళీకృత ఐటీఆర్ ఫారాలు
న్యూఢిల్లీ: సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాల(ఐటీఆర్)ను ఈ నెలాఖరుకల్లా తీసుకొచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీఆర్‌లలో పన్ను చెల్లింపుదార్లు(అసెస్సీ) తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించాలని పేర్కొనడంపై అటు పార్లమెంటు సభ్యులతో పాటు పరిశ్రమవర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. దీంతో వీటిలో మార్పుచేర్పులు చేసి కొత్త ఫారాలను తీసుకొస్తామని ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ప్రకటించారు. ఈ నెలఖరులోగా సరళీకృత ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారాలపై జైట్లీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అంతర్గత సమావేశం జరగనుందని కూడా వెల్లడించారు. కాగా, కొత ఫారాల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు, కనీస బ్యాలెన్స్లేని ఖాతాల వివరాల వెల్లడిని మినహాయించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారానికి కూడా వెసులుబాటు ఇవొచ్చని భావిస్తున్నారు. వేతనజీవులు... వ్యాపారం/వృత్తిగత ఆదాయాలు లేని వ్యక్తులు ఐటీఆర్-1/ఐటీఆర్-2లతో తమ రిటర్న్‌లను జూలై 31కల్లా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఫారాలు 14 పేజీలు ఉన్నప్పటికీ.. సాధారణ పన్ను చెల్లింపుదారులు తొలి 2-3 పేజీల్లో వివరాలిస్తే సరిపోతుందని.. మిగతావి అధిక ఆదాయవర్గాల కోసం మరిన్ని వివరాలకు సంబంధించినవిగా అధికారులు చెబుతున్నారు.