ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2024, ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) 1, 2, 4, 6 ఫారాలు అందుబాటులో ఉన్నాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు 23,000 రిటర్న్‌లు దాఖలయ్యాయని తెలిపింది.
2024-25 మదింపు సంవత్సరానికి (2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఐటీఆర్ దాఖలు అవకాశాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు వాడే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కంపెనీలు కూడా ఐటీఆర్-6 ద్వారా ఏప్రిల్ 1 నుంచే రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఐటీ విభాగం అవకాశం కల్పించడం ఇటీవలి కొన్నేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిబంధనల సరళీకరణ, పన్ను చెల్లింపు సేవల సులభతరం దిశగా ఇది ఓ కీలక అడుగుగా చెప్పొచ్చు. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లు వాడుతారు. ఐటీఆర్-2 ఫారంను నివాస స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఆర్జించే వాళ్లు దాఖలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment