పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
సరైన ఫారం ఎంపిక
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.
ఐటీఆర్-2
వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.
నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.
ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.
ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.
వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.
ఐటీఆర్ 3
వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.
నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.
ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.
వ్యాపార ఆదాయం ఉండవచ్చు.
వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.
ఐటీఆర్-4
వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.
నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.
ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.
వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.
వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.
ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..
ఐటీఆర్-5
ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.
ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.
ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.
వ్యాపార ఆదాయం ఉండాలి.
ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.
కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment