ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.
ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment