న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది.
ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది.
Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year.
— All India Radio News (@airnewsalerts) June 27, 2023
One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia
Comments
Please login to add a commentAdd a comment