పరిశ్రమలు డీలా.. | India Index of Industrial Production grew by 3 percent in March 2025 | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు డీలా..

Published Tue, Apr 29 2025 8:35 AM | Last Updated on Tue, Apr 29 2025 10:07 AM

India Index of Industrial Production grew by 3 percent in March 2025

దేశీ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే మార్చిలో పెద్దగా మార్పులు లేకుండా 3 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, విద్యుత్‌ రంగాల పేలవ పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో నమోదైన 5.5 శాతం పోలిస్తే మాత్రం తగ్గింది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4 శాతానికి నెమ్మదించింది.

  • 2023–24లో ఇది 5.9 శాతంగా, 2020–21లో ఏకంగా మైనస్‌ 8.4 శాతంగా నమోదైంది.

  • 2021–22లో 11.4 శాతంగా, 2022–23లో 5.2 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..

  • జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకారం ఈ ఏడాది మార్చిలో తయారీ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి (వార్షికంగా) 3 శాతానికి, మైనింగ్‌ ఉత్పత్తి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి, విద్యుదుత్పత్తి 8.6 శాతం నుంచి 6.3 శాతానికి నెమ్మదించింది.

  • ఐఐపీ గణాంకాలను 28వ తారీఖున విడుదల చేయడం ఇదే ప్రథమం.

  • ఇప్పటివరకు నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెల 12వ తారీఖున విడుదల చేసేవారు. ఇకపై నాలుగు వారాల తేడాతో ప్రకటిస్తారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement