మందగించిన పారిశ్రామికోత్పత్తి  | iip Growth Slips To 8 Month Low In November | Sakshi
Sakshi News home page

మందగించిన పారిశ్రామికోత్పత్తి 

Published Sat, Jan 13 2024 7:44 AM | Last Updated on Sat, Jan 13 2024 7:46 AM

iip Growth Slips To 8 Month Low In November  - Sakshi

న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది.

గతేడాది నవంబర్‌లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్‌లో ఇది 6.7%గా ఉంది.

విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్‌ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్‌లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్‌లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement