Industrial Production Index
-
పరిశ్రమలు రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
మౌలికం 6.3 శాతం అప్
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి మే నెలలో 6.3 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గతేడాది ఇదే నెలలో ఇన్ఫ్రా రంగ వృద్ధి 5.2 శాతం. మరోవైపు, ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతంతో పోలిస్తే గత నెలలో వృద్ధి మందగించడం గమనార్హం. ఎరువులు, క్రూడాయిల్, సిమెంటు రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది కీలక మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో.. బొగ్గు ఉత్పత్తి 10.2 శాతం, సహజ వాయువు 7.5 శాతం, విద్యుదుత్పత్తి 12.8 శాతంగా నమోదైంది. 2023లో ఇదే నెలలో ఇవి వరుసగా 7.2 శాతం, (–) 0.3 శాతం, 0.8 శాతంగా ఉన్నాయి. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ వృద్ధి రేటు 0.5 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 7.6 శాతానికి మందగించింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, దశలవారీగా సుదీర్ఘ సమయం పాటు పార్లమెంటు ఎన్నికలు జరగడం వంటి అంశాలు కొన్ని రంగాల్లో కార్యకలాపాలపై ప్రభావం చూపి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌కి భారీ డిమాండ్ నెలకొందని, ఏప్రిల్‌తో పోలిస్తే మే లో బొగ్గు, విద్యుత్ రంగాల వృద్ధికి ఇది దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. మే నెలలో ఐఐపీ వృద్ధి 4–5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నాయర్ చెప్పారు. -
మందగించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్‌లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్‌లో ఇది 6.7%గా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్‌లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్‌లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. -
దేశీ సంస్థల్లో ఏఐ జోరు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్‌కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం. ► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది. -
India industrial production index: తగ్గిన పారిశ్రామిక వృద్ధి స్పీడ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2022 డిసెంబర్లో మందగించింది. సమీక్షా నెల్లో ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు 7.3 శాతం. మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు డిసెంబర్ గణాంకాలపై పడినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెలువరించిన లెక్కలు పేర్కొంటున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల రంగం ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం కూడా వృద్ధి (5.1 శాతం) నుంచి క్షీణతకు (–10.4 శాతం) మారింది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలో వృద్ధి రేటు తగ్గింది. వార్షికంగా పరిశీలిస్తే మాత్రం 2021 డిసెంబర్‌కన్నా 2022 డిసెంబర్లో పనితీరు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తున్న అంశం. అప్పట్లో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే. 9 నెలల్లో ఇలా... మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్– డిసెంబర్) ఐఐపీ 5.4 శాతం పురోగమించగా, 2021 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 15.3 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి ఈ వృద్ధి రేటు 5.5 శాతం -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్‌లో రయ్!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఏప్రిల్ నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో ఉత్పత్తి 7.1 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టులో 13 శాతం పెరుగుదల తర్వాత) ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. విద్యుత్, మైనింగ్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన లెక్కలు వెల్లడించాయి. కొన్ని ముఖ్య విభాగాలను పరిశీలిస్తే... ► తయారీ: ఐఐపీలో దాదాపు 70 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో 6.3 శాతం పురోగతి నమోదయ్యింది. ► విద్యుత్: ఈ రంగం 11.8 % వృద్ధి సాధించింది. ► మైనింగ్: మైనింగ్‌లో 7.8% వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులు, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 14.7% వృద్ధి నమోదుకావడం హర్షణీయం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేట్లర్ల వంటి దీర్ఘకాల వినియోగ వస్తువులకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది. ► నాన్–కన్జూమర్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కి సంబంధించిన నాన్–కన్జూమర్ గూడ్స్ విభాగంలో స్వల్పంగా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నిర్మాణ) గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 10.1 శాతం, 7.6 శాతం, 3.8 శాతాలుగా ఉన్నాయి. -
పరిశ్రమలు పడక.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ తాజా స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు నవంబర్‌లో కేవలం 1.4 శాతంగా ఉంది. ఇక డిసెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 5.59 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న శ్రేణి కన్నా (2–6 శాతం) ఇది తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువముఖ పయనం ఆందోళన కలిగిస్తోంది. సూచీ కదలికలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో ఐఐపీ సూచీ 126.7 వద్ద ఉంది. 2021 నవంబర్‌లో ఈ సూచీ 128.5కు ఎగసింది. అంటే వృద్ధి రేటు 1.4 శాతమన్నమాట. 2019 నవంబర్‌లో సూచీ 128.8 పాయింట్ల వద్ద ఉంటే. అంటే కోవిడ్–19 దేశంలోకి ప్రవేశించిక ముందు నవంబర్ నెలతో పోల్చితే ఇంకా పారిశ్రామిక వృద్ధి దిగువలోనే ఉందని గ ణాంకాలు సూచిస్తున్నాయి. 2020 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి (–1.6%) క్షీణతలో ఉన్నా, తాజా సమీక్షా నెల (నవంబర్ 2021) ఈ విభాగం పేలవ పనితీరునే కనబరచడం గమనార్హం. కీలక రంగాలు చూస్తే.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో వృద్ధి (2020 నవంబర్‌తో పోల్చి) కేవలం 0.9 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో మాత్రం కొంచెం సానుకూల వృద్ధి రేటు 5 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాలు, డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 5.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎంఎఫ్‌సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో వృద్ధి 0.8 శాతం. నవంబర్–డిసెంబర్ మధ్య ‘బేస్ ఎఫెక్ట్’ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 17.4%గా నమోదైంది. దీనికి ‘లో బేస్’ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చు తున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదవడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కు వగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. ధరల తీవ్రత మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం అప్పర్ బాండ్ 6 శాతం దిశగా కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌లో 4.91 శాతంగా ఉన్న రిటైల్ ఉత్పత్తుల ధరల బాస్కెట్, డిసెంబర్లో ఏకంగా 5.59 శాతానికి (2020 ఇదే నెలతో పోల్చి) చేరింది. తాజా సమీక్షా నెల్లో ఒక్క వస్తు, సేవల ధరలు (ఆహార, ఇంధన రంగాలు కాకుండా) ఏకంగా 6.2 శాతానికి చేరడం గమనార్హం. 2021 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతంగా ఉంది. నవంబర్‌లో రేటు 1.87 శాతం. తృణ ధాన్యాలు, ఉత్పత్తులు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు నవంబర్‌తో పోల్చితే పెరిగాయి. అయితే కూరగాయలు, పండ్లు, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయి. ఇంధనం, లైట్ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 10.95 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఈ రేటు 13.35 శాతంగా ఉంది. 2021 జూలైలో 5.59 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాత తగ్గుతూ వచ్చినా, తిరిగి 2021 అక్టోబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. -
Stock Market: ప్రపంచ పరిణామాలే దిక్సూచి
ముంబై: ప్రపంచ పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ తదితర అంశాల నుంచీ సంకేతాలను మార్కెట్ అందిపుచ్చుకోవచ్చని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అనూహ్యరీతిలో పెరగడంతో ధరల కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చు. బాండ్లపై రాబడులు పెరగవచ్చు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపై ప్రభావం చూపవ చ్చు. ఈ నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టాక్ సూచీలు నేడు (సోమవారం) ముందుగా గత వారాంతంలో విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఈ రోజు విడుదల కానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటాపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎక్స్చెంజీలకు సెలవు. కనుక ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గత వారంలో సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ‘‘పండుగలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే సూచీలు నష్టాన్ని చవిచూడవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకరింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కొనసాగుతున్న అమ్మకాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నవంబర్ ప్రథమార్థంలో రూ.4,694 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో డెట్ మార్కెట్ నుంచి రూ.3,745 కోట్లను, ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.949 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈక్విటీలు అధిక విలువ ట్రేడ్ అవుతున్నాయనే కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని మార్నింగ్‌స్టార్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంతంతే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి సెప్టెంబర్‌లో స్వల్పంగా 3.1 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. మైనింగ్ రంగం మెరుగైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దన్నుతో గడచిన ఆరు నెలలుగా (2021 మార్చి నుంచి ) రెండంకెల్లో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, తన ధోరణిని కొనసాగించకుండా తక్కువ వృద్ధి రేటుకు పడిపోవడం ఆందోళన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎలా అంటే... 2020 సెప్టెంబర్‌లో సూచీ 124.1 పాయింట్ల వద్ద ఉంది. 2021 సెప్టెంబర్‌లో సూచీ 127.9 పాయింట్లకు ఎగసింది. అంటే వృద్ధి 3.1 శాతమన్నమాట. 2019లో సూచీ 122.9 వద్ద ఉంది. కరోనా ముందస్తు కాలంతో పోల్చినా సూచీల్లో పురోగతి ఉన్నా... ఇది అతి స్వల్పంగా మాత్రమే ఉండడం గమనించాల్సిన అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం ఈ గణాకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు ఇవీ... ► మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం సెప్టెంబర్‌లో 2.7 శాతం పురోగమించింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి కేవలం ఒక శాతం పెరిగింది. ► భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగం కేవలం 1.3 శాతం లాభపడింది. 2020 ఇదే కాలంలో ఈ రంగం అసలు క్షీణతలో ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి క్షీణతలో ఉండడం గమనార్హం. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ 2021 సెప్టెంబర్‌లో 2 శాతం క్షీణించింది. నిత్యావసరాలకు సంబంధించి (ఎఫ్ఎంసీజీ) నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి. ► మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్ 4.4 శాతం పురోగమించింది. సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6% ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7% క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02% పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 1% పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1%. -
జూన్‌లో పారిశ్రామిక వృద్ధి 13.6 శాతం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జూన్‌లో 13.6 శాతంగా నమోదయ్యింది. లో బేస్ ఎఫెక్ట్కుతోడు తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు బాగుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 16.6 శాతం క్షీణత నమోదయ్యింది. సమీక్షా నెల– జూన్ గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇవీ.. ► మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీ రంగం 13 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2020 జూన్‌లో ఈ విభాగం 17 శాతం క్షీణించింది. ► మైనింగ్ రంగం పురోగతి 23.1 శాతం. 2020 జూన్‌లో 19.6 శాతం క్షీణత నమోదయ్యింది. ► విద్యుత్ జూన్ ఉత్పత్తి 8.3 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెల్లో 10 శాతం క్షీణతలో ఉంది. ► భారీ పెట్టుబడులు, యంత్రసామాగ్రి ఉత్పత్తిని ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ రంగం 37.4 శాతం క్షీణత నుంచి 25.7 శాతం పురోగతికి మారింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల ఉత్పత్తికి సంబంధించి ఈ విభాగం సమీక్షా నెల్లో 30.1 శాతం లాభపడింది. 2020 ఇదే నెల్లో 4.5 శాతం క్షీణతలో ఉంది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఈ ఉత్పత్తుల 4.5 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో 6.9 శాతం వృద్ధి నెలకొంది. 2019 జూన్‌తో పోల్చితే తక్కువే.. 2019 జూన్‌తో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి ఇంకా బలహీనంగా ఉంది. 2019 జూన్‌లో సూచీ 129.3 పాయింట్ల వద్ద ఉంటే, తాజా సమీక్షా నెల (2021 జూన్)లో 122.6 పాయింట్ల వద్ద ఉంది. 2020లో ఇది కేవలం 107.9 (16.6% క్షీణత). వార్షికంగా చూస్తే 2021 జూన్‌లో 13.6% వృద్ధి అన్నమాట. -
పరిశ్రమలకు ‘లో బేస్’ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తిపై మే నెల్లో ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 29.3 శాతం పురోగమించింది. గణాంకాల ప్రకారం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సూచీలు మహమ్మారి ముందస్తు స్థాయికన్నా ఇంకా దిగువనే ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 90.2 పాయింట్లకు పడిపోయింది. 2021 మేలో (తాజా సమీక్షా నెల్లో 116.6 పాయింట్లకు ఎగసింది. అంటే పెరుగుదల 29.3 శాతం. ఇక కరోనా ముందు 2019 మే నెల్లో సూచీ 135. 4 పాయింట్లుగా ఉంది. అంటే 2019 మే ఐఐపీతో పోల్చితే 2020 మేలో సూచీ వృద్ధి లేకపోగా 33.5 శాతం క్షీణించిందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన కీలక విభాగాల లెక్కల తీరు క్లుప్తంగా.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం కలిగిన ఈ విభాగం వృద్ధి 34.5 శాతం. 2020లో 37.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► మైనింగ్: వృద్ధి 23.3 శాతం (2020 మేలో 20.4 శాతం క్షీణత) ► విద్యుత్: 2020 మేలో 14.9 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో 7.5 శాతం పురోగతి సాధించింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులు, భారీ యంత్ర సామగ్రి ఉత్పత్తికి సంకేతమైన ఈ విభాగంలో 65.9 శాతం క్షీణత.. 2021 మేలో 85.3 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి ఈ ఉత్పత్తుల విభాగం 70.3 శాతం క్షీణత నుంచి బయటపడి 98.2 శాతం పురోగమించింది ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, ఫేస్ క్రీమ్స్, పౌడర్ల వంటి ఉత్పత్తులకు సంబంధించిన ఈ ఎఫ్ఎంసీజీ విభాగం 9.7% క్షీణత నుంచి బయటపడి స్వల్పంగా 0.8% పెరిగింది. 2020 మార్చి నుంచీ ఒడిదుడుకులు.. కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (–0.6 శాతం)జారిపోయింది. ధరలు తగ్గినా.. ఆర్బీఐ లక్ష్యానికి ఎగువనే..! జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ముందు నెల మేతో పోల్చితే స్వల్పంగా ఉపశమించింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యంకన్నా ఎగువన 6.26 శాతంగా నమోదయ్యింది. మే నెల్లో ఇది 6.3%. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకా ప్రకారం వార్షికంగా చూస్తే (2020 జూన్‌తో పోల్చి) ఆహార ద్రవ్యోల్బణం 5.15%గా ఉంది (మేలో 5.01%) ఇక చమురు, వెన్న పదార్థాల ధరలు ఏకంగా 34.78% ఎగశాయి. పండ్ల ధరలు 11.82 శాతం పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 0.7% తగ్గాయి. విద్యుత్, లైట్ విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 12.68%. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా 6.16%, 6.37%గా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఎస్ఓ సిబ్బంది వ్యక్తిగతంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణ మండీల నుంచి వారంవారీగా గణాంకాల సేకరించి నెలవారీ ద్రవ్యోల్బణాన్ని మదింపుచేస్తారు. ఆర్బీఐ కీలక పాలసీ రేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి పరపతి విధాన కమిటీ యథాతథంగా 4%గా కొనసాగిస్తోంది. -
ఎకానమీ ప్రగతిబాట!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య, పరపతి విధానం కొనసాగింపునకు తగిన ఆర్థిక గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. 2020 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ‘పాజిటివ్’లోకి మారింది. ఒక శాతం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగం కొంత మెరుగవడం దీనికి ప్రధాన కారణమని తాజా గణాంకాలు తెలిపాయి. ఇక ఆర్బీఐ తన పాలసీ విధానానికి ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతంగా నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6% –2% శ్రేణిలో (ప్లస్ లేదా మైనస్ 2తో 4 శాతంగా) ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు ఇలా... మైనింగ్ మినహా అన్నీ మెరుగే... ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ రంగం 2020 డిసెంబర్లో 1.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2019 డిసెంబర్లో ఈ రంగం 0.1 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యం త్రాల ఉత్పత్తికి సూచికగా ఉండే ఈ విభాగంలో వృద్ధి 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020 డిసెంబర్లో 18.3 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: దీర్ఘకాలం మన్నే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 4.9 శాతంగా నమోదయ్యింది. 2019 డిసెంబర్లో 5.6 శాతం క్షీణత ఈ విభాగంలో ఉంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు చెందిన ఈ విభాగంలో సైతం రెండు శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 డిసెంబర్లో ఈ విభాగంలో క్షీణ రేటు 3.2 శాతం. ► మైనింగ్: మైనింగ్ రంగం 4.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2019లో ఈ రంగం 5.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణత కాగా పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణించింది. 2019 ఇదే కాలంలో ఇది స్వల్పంగా 0.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఐఐపీ నడత ఇలా... 2019 డిసెంబర్లో ఐఐపీ స్వల్పంగా 0.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2019 డిసెంబర్లో తయారీ రంగం 0.3 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ఇక్కడ ప్రస్తావనాంశం. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, దేశాల రక్షణాత్మక విధానాల వంటి అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితి దీనికి నేపథ్యం. కాగా కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా, తాజా గణాంకాలను కోవిడ్–19 ముందు నెలలతో పోల్చుకోవడం సరికాదని కూడా గణాంకాల శాఖ పేర్కొనడం గమనార్హం. 16 నెలల కనిష్టానికి ‘రిటైల్’ ధరలు జనవరిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం 4.06 శాతంగా నమోదయ్యింది. గడచిన 16 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2019 సెప్టెంబర్‌లో 4 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిత స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడమూ వరుసగా ఇది రెండవనెల కావడం గమనార్హం. డిసెంబర్ 2020లో 4.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఎన్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం, జనవరిలో ఫుడ్ బాస్కెట్ ధర (2019 ఇదే నెల ధరతో పోల్చి) కేవలం 1.89 శాతం పెరిగింది. 2020 డిసెంబర్లో ఈ రేటు 3.41 శాతం. కూరగాయల ధరలు 15.84 శాతం తగ్గాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 13.39 శాతం దిగివచ్చాయి. ప్రొటీన్ రిచ్ మాంసం, చేపలు ధరలు 12.54 శాతం తగ్గితే, గుడ్ల ధరలు 12.85 శాతం తగ్గాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.73 శాతం తగ్గాయి. కాగా సీపీఐలో ఒక భాగంగా ఉన్న ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల 3.87 శాతంగా ఉంది. కొన్ని నిర్దిష్ట గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ఎన్ఎస్ఓ గణాంకాలను సేకరిస్తుంది. ఆర్బీఐ సరళతర పాలసీ కొనసాగింపునకు దోహదం ఆర్థికాభివృద్ధికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినబడుతోంది. వడ్డీరేటు తగ్గింపు ద్వారా డిమాండ్‌కు, వినియోగానికి తద్వారా వృద్ధికి ఊపును ఇవ్వవచ్చని ఆయా వర్గాలు కోరుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణం భయాలతో ఆర్బీఐ మరింత రెపో తగ్గించడానికి వెనుకాడుతోంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్. ఫిబ్రవరి నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గుచూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. -
మార్కెట్‌కు రిలయన్స్ అండ
ముంబై: అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా లాభపడటంతో సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 51,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 15,173 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు ఆల్‌టైం హై కావడం విశేషం. కన్జూమర్, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఆర్థిక, మీడియా, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 435 పాయింట్ల పరిధిలో 51,157 – 51,592 శ్రేణిలో కదలాడగా.., నిఫ్టీ 123 పాయింట్ల రేంజ్లో 15,065 –15,188 స్థాయిల మధ్య ట్రేడైంది. ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప జేసే డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి రిటైల్ ధరల(సీపీఐ) ఆర్థిక గణాంకాలు నేడు (శుక్రవారం) విడుదల అవుతాయి. ఇన్వెస్టర్లు ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నారు. మార్కెట్లో మూమెంటమ్ ఇలాగే కొనసాగితే నిఫ్టీ తనకు కీలక నిరోధంగా ఉన్న 15,250 స్థాయిని ఛేదించవచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగు శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ ... ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించడంతో గత కొన్ని రోజులుగా నష్టాన్ని చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం రాణించింది. ఈ షేరు బీఎస్ఈలో రూ.1,980 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 4.55 శాతం ఎగిసి రూ.2064 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4.13 శాతం లాభంతో రూ.2056 వద్ద స్థిరపడింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం ఢిల్లీ డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లకు పావెల్ వ్యాఖ్యల జోష్... అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, కొత్త ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయికి చేరుకునే వరకు అవసరమైతే భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు. పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, జపాన్, సౌత్ కొరియా మార్కెట్లకు గురువారం సెలవు రోజు. మార్కెట్లో మరిన్ని సంగతులు... 1. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించడంతో హిందా ల్కో షేరు ఆరు శాతం లాభపడింది 2. రూట్ మొబైల్ షేరు ఇంట్రాడేలో 20 శాతం ఎగసి రూ.1,527 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. 3. డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు మెప్పించినా ఎంఆర్ఎఫ్ షేరు ఏడు శాతం పతనమై రూ.90,084 వద్ద స్థిరపడింది. 4. ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఐటీసీ షేరు అరశాతం క్షీణించి రూ.227 వద్ద ముగిసింది. -
పరిశ్రమలు రయ్రయ్..!
న్యూఢిల్లీ: తయారీ, కన్జూమర్ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్‌లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదు కాగా.. కరోనా వైరస్‌పరమైన పరిణామాల కారణంగా మార్చి నుంచి ఆగస్టు దాకా ప్రతికూల స్థాయిలోనే కొనసాగింది. సెప్టెంబర్‌లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25న కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల కార్యకలాపాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక విభాగాలవారీగా చూస్తే అక్టోబర్‌లో.. ► తయారీ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో ఇది 5.7 శాతం క్షీణించింది. ఐఐపీలో తయారీ రంగానికి 77.6 శాతం వాటా ఉంటుంది. ► కన్జూమర్ గూడ్స్ విభాగం 17.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో ఇది 18.9 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. గత అక్టోబర్‌లో ఇది 3.3 శాతం క్షీణించింది. ► విద్యుదుత్పత్తి మెరుగ్గా 11.2% వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.5% క్షీణించింది. ► పెట్టుబడులకు కొలమానంగా నిల్చే భారీ యంత్రపరికరాల ఉత్పత్తి 3.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో క్షీణత 22.4 శాతం. ► ఇన్ఫ్రా/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం 7.8% వృద్ధి చెందింది. అయితే, ప్రైమరీ గూడ్స్ విభాగంలో 3.3% క్షీణత నమోదైంది. ఇంకా బలహీనంగానే.. ఐఐపీ ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసినప్పటికీ.. అక్టోబర్ డేటా ఊహించిన దానికన్నా బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘ఆశాభావంతోనే ఉన్నప్పటికీ ఎకానమీ పటిష్టంగా రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయి‘ అని నాయర్ పేర్కొన్నారు. మరోవైపు, ఐఐపీ గణాంకాలు సానుకూలంగా ఆశ్చర్యపర్చినప్పటికీ.. ఇదే ధోరణి కొనసాగకపోవచ్చని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సంస్థ ఈడీ సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు. భారీ ఉద్దీపన, ప్రభుత్వ వ్యయాలు, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు, నిధుల లభ్యత మెరుగుపడటం, సానుకూల ఐఐపీ.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు.. ఎకానమీ సత్వరం కోలుకోవడానికి తోడ్పడ్డాయని మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. పటిష్టమైన రికవరీ సుదీర్ఘకాలం కొనసాగగలదని అంచనా వేశారు. -
ఆరు నెలల తర్వాత వృద్ధిబాటకు పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆరు నెలల క్షీణత తర్వాత తిరిగి వృద్ధిబాటకు మళ్లింది. 2020 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం స్వల్ప స్థాయి వృద్ధిని చూసింది (2019 సెపెంబర్ గణాంకాలతో పోల్చి). మైనింగ్, విద్యుత్ రంగాల్లో అధికోత్పత్తి దీనికి కారణమని గురువారం కేంద్రం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన ఈ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. సెప్టెంబర్‌లో 0.6 శాతం క్షీణత నమోదయ్యింది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.4 శాతంగా ఉంది. విద్యుత్: 4.9 శాతం వృద్ధిరేటు వచ్చింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికాల ఉత్పత్తి, డిమాండ్‌కు సంకేతమైన క్యాపిటల్ గూడ్స్‌లో ఉత్పత్తి సెప్టెంబర్‌లో 3.3 శాతం క్షీణతలో ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీ షనర్లు వంటి దీర్ఘకాల కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 2.8% వృద్ధి నమోదవడం కీలకాంశం. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సానుకూల అంశం. కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, టూత్‌పేస్టులు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్ఎంసీజీ) విషయంలో ఉత్పత్తి భారీగా 4.1 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో క్షీణతే... కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ భారీగా 21.1 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 1.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తక్కువ బేస్‌రేటే కారణమా? పారిశ్రామిక ఉత్పత్తిలో తాజాగా వృద్ధి రేటు కనబడ్డానికి తక్కువ బేస్‌రేటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఐఐపీ భారీ క్షీణతలో మైనస్ 4.6 శాతంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత మార్చి (–18.7 శాతం), ఏప్రిల్ (–57.3 శాతం), మే (–33.4 శాతం), జూన్ (–16.6 శాతం), జూలై (–10.8 శాతం) ఆగస్టులో (–8 శాతం) క్షీణ రేటు నమోదయ్యింది. అయితే కఠిన లాక్డౌన్ నెల ఏప్రిల్‌లో భారీ క్షీణత తర్వాత మైనస్రేట్లు క్రమంగా తగ్గుతుండడం పరిగణనలోకి తీసుకోవాల్సిన సానుకూల అంశం. 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల వల్ల వివిధ రంగాల్లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజం అవుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పరిశ్రమలు పతనబాటే..!
న్యూఢిల్లీ: కఠిన లాక్డౌన్ ప్రభావం ఆగస్టులోనూ కొనసాగిందని సోమవారం విడుదలైన అధికారిక పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడించాయి. సమీక్షా నెలలో 8 శాతం క్షీణత (2019 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. అయితే కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న తాజా గణాంకాలను మహమ్మారి వ్యాప్తి ముందు నెలలతో పోల్చి చూడడం తగదని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వరకూ వెయిటేజ్ ఉన్న తయారీసహా విద్యుత్, మైనింగ్ రంగాలు ఆగస్టులో తీవ్ర నిరాశపరిచాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ రంగంలో 8.6 శాతం క్షీణరేటు నమోదయ్యింది. ► మైనింగ్ రంగంలో ఉత్పత్తి 9.8 శాతం క్షీణించింది. ► విద్యుత్ విషయంలో క్షీణ రేటు 1.8 శాతంగా ఉంది. ► భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, పెట్టుబడులు, డిమాండ్‌కు సంకేతం అయిన క్యాపిటల్ గూడ్స్ కూడా 15.4 శాతం క్షీణతలో ఉంది. ► ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలుసహా కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోని ఉత్పత్తుల్లో క్షీణ రేటు 10.3 శాతంగా ఉంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఉత్పత్తి సైతం 3.3 శాతం క్షీణతలోనే ఉంది. క్షీణత తగ్గుతూ రావడమే ఊరట... కరోనా కట్టడి లక్ష్యంగా మార్చి 25వ తేదీ నుంచీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా 57.3 శాతం క్షీణించింది. మేలో ఈ రేటు మైనస్ 33.4 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు మైనస్ 15.8 శాతానికి తగ్గింది. జూలైలో మైనస్ 10.8 శాతానికి దిగివచ్చింది. తాజా సమీక్షా నెల ఆగస్టులో– క్షీణ రేటు మరింత తగ్గి 8 శాతానికి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి బాటలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్న అంచనాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అవుట్‌పుట్ సెప్టెంబర్‌లో క్షీణ బాట నుంచి 54.6కు చేరి వృద్ధి బాటలోకి రావడం ఇక్కడ గమనార్హం. అలాగే సెప్టెంబర్‌లో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 56.8కి ఎగసింది. లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తుండడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టులోనూ క్షీణతే... నిజానికి వాణిజ్య యుద్ధం ప్రభావంతో 2019 ఆగస్టులో సైతం పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా (2018 ఆగస్టులో పోల్చి) 1.4 శాతం క్షీణతలోనే ఉంది. దెబ్బమీద దెబ్బలాగా కరోనా తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి పరిమాణం కనీసం 2018 ఆగస్టునాటి స్థాయికన్నా దిగువకు ప్రస్తుతం పడిపోవడం తీవ్ర ప్రతికూలతకు అద్దంపడుతోంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య 25 శాతం క్షీణత ఏప్రిల్–ఆగస్టు మధ్య పారిశ్రామిక ఉత్పత్తి భారీగా 25% క్షీణించింది. 2019 ఇదే కాలంలో వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. -
పరిశ్రమలు మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్‌తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కీలక విభాగాలూ నేలచూపే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం క్షీణించింది. ► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది. ► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి ఈ విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది. నాలుగు నెలల్లో... కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది. మౌలిక రంగం 9.6 శాతం క్షీణత ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం. -
పరిశ్రమలు.. రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పట్టింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా –4.3 శాతం క్షీణించిందన్నమాట. ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (–1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో –3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. మోటార్ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో –24.8 శాతం క్షీణత నమోదయితే, –23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నిచర్ ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు –2.6 క్షీణతలోకి జారింది. ► మైనింగ్: గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా –8.5 శాతం క్షీణత వచ్చింది. ► క్యాపిటల్ గూడ్స్: ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఉత్పత్తి –9.9 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా – 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం. ► మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది. త్రైమాసికంగా –0.4 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో పారిశ్రామిక ఉత్పత్తి – 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018–19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం. క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం? ఏప్రిల్–జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై–సెప్టెంబర్) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జల్లుతున్నాయి. నవంబర్ 29న జూలై– సెప్టెంబర్ జీడీపీ డేటా వెలువడనుంది. -
పారిశ్రామిక వృద్ధి అర శాతమే..!
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది. భారీ యంత్ర పరికరాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్ గూడ్స్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి లెక్కల్లో ముఖ్యమైన అంశాలు... మొత్తం సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో నవంబర్‌లో వృద్ధిలేకపోగా –0.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2017 ఇదే నెలలో ఈ రేటు 10.4 శాతం. ఈ విభాగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10తప్ప మిగిలినవి ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా వృద్ధిలేకపోగా –3.4 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రంగం వృద్ది రేటు 3.7 శాతం. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో కూడా 3.1 శాతం వృద్ధి రేటు 0.9 శాతం క్షీణతలోకి జారింది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విషయంలో కూడా 23.7 శాతం భారీ వృద్ధిరేటు 0.6% క్షీణతలోకి పడిపోవడం గమనార్హం. మైనింగ్ వృద్ధి రేటు 1.4% నుంచి 2.7 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి 3.9% నుంచి 5.1%కి ఎగసింది. 2017 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది రేటు 8.5%. ప్రస్తుతం నమోదయిన తక్కువ స్థాయి వృద్ధి రేటు 2017 జూన్ తరువాత ఎప్పుడూ నమోదుకాలేదు. ఆ నెల్లో పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో వృద్ధిరేటును 8.1 శాతం నుంచి 8.4 శాతానికి పెంచడం విశేషం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పర్లేదు... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తి (2017 ఇదే కాలంతో పోల్చి) 3.2 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5 నుంచి 6 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందని అంచనా -
ధరలు పైపైకి.. పారిశ్రామికోత్పత్తి కిందకు!
న్యూఢిల్లీ: భారత తాజా ఆర్థిక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం మంగళవారం సాయంత్రం అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కేవలం 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు ఈ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. గడిచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి నమోదు కాలేదు. 2016 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 4.2 శాతం. సెప్టెంబర్‌లో ఐఐపీ రేటు 4.14 శాతంగా నమోదయ్యింది. ఇక ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ (ఏప్రిల్ నుంచీ) చూసినా ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. కాగా నవంబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.88 శాతంగా నమోదయ్యింది. ఆర్బీఐ రేటు పెంపు అవకాశం లేనట్లే..! పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుదల ధోరణి కనిపించడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పట్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గడచిన 15 నెలల్లో నవంబర్ అంత భారీ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ఆర్బీఐ అంచనా (4.3–4.7 శాతం) మించి ధరల పెరుగుదల నమోదుకావడం గమనార్హం. కీలక రంగాలు ఇలా...: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు అక్టోబర్‌లో 4.8% నుంచి 2.5 శాతానికి పడిపోయింది. ఇక మైనింగ్ వృద్ధి 1% నుంచి 0.2 శాతానికి తగ్గింది. గుడ్డు ధరకు రెక్కలు... అక్టోబర్‌లో 3.58% ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఏకంగా 4.88 శాతానికి పెరిగింది. 2016 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతం. గుడ్లు ధర వార్షిక ప్రాతిపదికన నవంబర్‌లో 7.95% పెరిగాయి. అక్టోబర్‌లో ఈ పెరుగుదల 0.69 శాతమే. ఇక ఇంధనం, లైట్ విభాగంలో రేటు 6.36 శాతం నుంచి 7.92%కి పెరిగింది. కూరగాయల ధరలు ఏకంగా 22.48 శాతం పెరిగాయి. -
సెప్టెంబర్‌లో ఇన్ఫ్రా స్పీడ్!
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల కీలక ఇన్ఫ్రా గ్రూప్ వృద్ధి రేటు సెప్టెంబర్‌లో ఊరట నిచ్చింది. ఇది 5.2 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ ఎనిమిది పరిశ్రమల ఉత్పత్తి విలువ 2016 సెప్టెంబర్‌తో పోలిస్తే 2017 సెప్టెంబర్‌లో 5.2 శాతం వృద్ధి చెందిందన్న మాట. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ వృద్ధిరేటు 5.3 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల గ్రూప్ వాటా దాదాపు 30 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఈ ఎనిమిది రంగాల్లో ఉన్నాయి. ఒక్క ఎరువుల విభాగం తప్ప, సెప్టెంబర్‌లో అన్ని విభాగాలూ వృద్ధి బాటనే ఉండడం గమనార్హం. కాగా స్టీల్, సిమెంట్‌లో వృద్ధిబాటనే ఉన్నా, ఈ రేటు తగ్గింది. ఈ ఎనిమిది రంగాల తాజా సానుకూల ఫలితం ఈ నెల రెండవ వారం చివర్లో వెలువడే ఐఐపీ సెప్టెంబర్ గణాంకాలకు ప్లస్ అవుతుందని కొందరు నిపుణుల వాదన. -
ద్రవ్యోల్బణం ఊరట – పరిశ్రమల ఉసూరు!
► మార్చిలో పారిశ్రామిక వృద్ధి కేవలం 2.7 శాతం ► కొత్తగా 2011–12 బేస్ ఇయర్‌తో గణాంకాలు ► టోకు ద్రవ్యోల్బణ గణాంకాల బేస్ ఇయర్నూ 2011–12గా సవరింపు ► ఏప్రిల్‌లో టోకు ధరలు 3.85 శాతమే ► ఇదే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 2.99 శాతం ► రెపో రేటు తగ్గింపునకు మళ్లీ డిమాండ్ న్యూఢిల్లీ: దేశ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్‌కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకూ బేస్ ఇయర్‌గా 2004–05గా ఉండేది. ఈ బేస్ ఇయర్ తాజాగా 2011–12గా మారింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇప్పటికే 2011–12 బేస్ ఇయర్‌గా అమలవుతోంది. ఇక మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి అతి తక్కువగా 2.7 శాతంగా నమోదయితే, ఏప్రిల్‌లో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కేంద్రం, ఆర్బీఐ లక్ష్యాలకు అనుగుణంగా వరుసగా 3.85 శాతం, 2.99 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ది తగ్గడంతో మరోమారు రెపో రేటు (ప్రస్తుతం 6.25 శాతం)ను తగ్గించాలని ఆర్బీఐని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. మూడు విభాగాలకు సంబంధించి తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... పారిశ్రామిక రంగానికి ‘తయారీ’ దెబ్బ ► మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరు మార్చి నెల ఐఐపీపై ప్రతికూల ప్రభావం చూపింది. 2016 మార్చిలో ఐఐపీ వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదయితే ఇప్పుడు 2.7 శాతానికి పడిపోయింది. ► మార్చిలో తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి (2016 ఇదే నెలతో పోల్చి) పడిపోయింది. 2016 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 11.9% నుంచి 6.2%నికి Sతగ్గింది. ► మైనింగ్ రంగంలో వృద్ధి మాత్రం 4.7 శాతం నుంచి 9.7 శాతానికి పెరిగింది. వార్షికంగా చూస్తే...: 2016–17 మొత్తంగా చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి 3.4 శాతం నుంచి (2015–16లో) 5 శాతానికి పెరిగింది. వార్షికంగా తయారీ రంగం వృద్ధి 3 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగం ఉత్పత్తి స్వల్పంగా 5.7 శాతం నుంచి 5.8 శాతానికి ఎగసింది. వార్షికంగా మైనింగ్ రంగం వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి చేరింది. కొత్త వస్తువుల్లో ఇవి..: కొత్త సిరిస్‌లో ఒక్క తయారీ రంగంలోనే 809 వస్తువులు ఉన్నాయి. ఇంతక్రితం ఈ సంఖ్య 620గా ఉండేది. 149 కొత్త ప్రొడక్టుల్లో స్టెరాయిడ్స్, సిమెంట్ క్లింకర్స్, మెడికల్ లేదా సర్జికల్ వస్తువులు వంటివి ఉన్నాయి. రిటైల్ ధరలు తగ్గాయ్... ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.89 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 2.99 శాతానికి తగ్గింది. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు భారీగా 15.94 శాతం మేర తగ్గాయి. కూరగాయల ధరల తగ్గుదల 8.59 శాతంగా ఉంది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 6.13 శాతంగా నమోదయ్యింది. పండ్ల ధరలు 3.78 శాతం ఎగశాయి. మొత్తంగా చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 1.93 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 0.61 శాతంగా నమోదయ్యింది. టోకు ధరలు... 4 నెలల కనిష్టం... టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 ఏప్రిల్‌తో పోల్చితే 2017 ఏప్రిల్‌లో టోకు బాస్కెట్ ధరలు మొత్తంగా 3.85 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ముఖ్యాంశాలు చూస్తే... ♦ మార్చిలో ఈ రేటు 5.29 శాతంగా ఉంది. ♦ టోకు ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు మార్చిలో 3.82 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 1.16 శాతానికి తగ్గింది. పప్పు దినుసుల ధరలు 13.64 శాతం, కూరగాయలు (7.78 శాతం), ఆలూ (40.97 శాతం), ఉల్లి (12.47శాతం) ధరలు తగ్గడం (వార్షికంగా) దీనికి కారణం. ♦ ఇక ఇంధనం, విద్యుత్ విభాగంలో రేటు 18.52 శాతంగా నమోదయితే, తయారీ రంగంలో ఈ రేటు 2.66 శాతంగా ఉంది. 199 కొత్త ఐటమ్స్‌లో కాకర, దోస, టిష్యూ పేపర్ కొత్త ఇండెక్స్ బాక్స్‌లో 697 వస్తువులు చేరాయి. ఇందులో ప్రైమరీ ఆర్టికల్స్‌లో 117 వస్తువులు ఉండగా, ఇంధన విభాగంలో 16 ఐటమ్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో 564 ఐటమ్స్ ఉన్నాయి. డబ్ల్యూపీఐ కొత్త సిరీస్‌లో 199 కొత్తగా వచ్చి చేరాయి. ఇందులో టిష్యూ పేపర్, గ్యాస్. కన్వేయర్ బెల్ట్, రబ్బర్ థ్రెడ్, స్టీల్ కేబుల్స్, దోసకాయ, కాకరకాయ, పనస ఉన్నాయి. తొలగించిన వస్తువుల్లో వీడియో సీడీ ప్లేయర్, పటికబెల్లం, లైట్ డీజిల్ ఆయిల్ వంటివి ఉన్నాయి. ఇక గణాంకాలకు తీసుకునే కోట్స్ పెరిగాయి. బేస్ ఇయర్ మార్పు ఎందుకు? గణాంకాల్లో మరింత స్పష్టత, పారదర్శకత, కాలానికి అనుగుణంగా సరైన గణాంకాలను వెలువరించడం బేస్ ఇయర్ మార్పు లక్ష్యం. ఉదాహరణకు ఇప్పటి వరకూ 2004–05 మూల సంవత్సరంగా తీసుకుని ఒక స్థిర ధరల వద్ద అటు తర్వాత సంవత్సరాల్లో ధరల్లో మార్పును శాతాల్లో పేర్కొంటారు. అయితే బేస్ ఇయర్¯ మార్పు వల్ల గణాంకాల్లో మరింత స్పష్టత వస్తుంది.