న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం.
మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment