ఎనిమిది రంగాలూ నెమ్మది వృద్ధి | Eight Industries Growth Rate Downfall in July | Sakshi
Sakshi News home page

ఎనిమిది రంగాలూ నెమ్మది వృద్ధి

Published Wed, Sep 4 2019 10:44 AM | Last Updated on Wed, Sep 4 2019 10:44 AM

Eight Industries Growth Rate Downfall in July - Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగ పరిశ్రమల వృద్ధి రేటు జూలైలో కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదుకావడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూలైలో ఈ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది.   మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల పనితీరు జూలైలో వేర్వేరుగా...

వృద్ధి అప్‌...1  
ఎరువులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా 1.3 శాతం నుంచి (2018 జూలై) నుంచి 1.5 శాతానికి పెరుగుదల

వృద్ధి తగ్గినవి.. 3
స్టీల్‌: 6.9 శాతం నుంచి 6.6 శాతానికి డౌన్‌
సిమెంట్‌: 11.2% నుంచి 7.9 శాతానికి పయనం
విద్యుత్‌: 6.7% నుంచి 4.2%కి తిరోగమనం

క్షీణతలో... 4
బొగ్గు, క్రూడ్‌ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది.
ఏప్రిల్‌–జూలై మధ్య..: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో, ఈ ఎనిమిది రంగాల గ్రూప్‌ వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 3 శాతానికి పడింది.  

ఆగస్టులో ‘తయారీ’ పేలవం: పీఎంఐ
ఆగస్టు నెలలో తయారీ రంగం పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. జూలైలో  52.5గా ఉన్న ఈ సూచీ ఆగస్టులో 51.4కు పడింది. గడచిన 15 నెలలుగా ఇంత తక్కువ సూచీ ఇదే తొలిసారి. ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. ఉపాధి కల్పనపైనా ఈ ప్రభావం పడింది.  ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement