Coal
-
కొత్తగా బొగ్గు గనుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్సీ) 30 ఎంటీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానమ్)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
సింగరేణి పూర్వ వైభవం కోసం కిషన్ రెడ్డి గారు కృషి చేయాలి
-
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?
పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్పీజీ గ్యాస్‌లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్‌పై వంటలు చేయడం మొదలయ్యింది. ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!) -
బొగ్గు దిగుమతి ఆపొద్దు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ భారీగా పెరగనున్నందున విదేశీ బొగ్గు దిగుమతులను ఆపొద్దని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ వరకూ విదేశీ బొగ్గు దిగుమతులను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే మే నెలలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 250 గిగావాట్లు ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఇంత భారీ డిమాండ్‌ను తట్టుకోవాలంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నిజానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను దశల వారీగా మూసేయాలని కేంద్రం కొంతకాలం క్రితం సూచించింది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత మంచి నిర్ణయం కాదని కేంద్రం భావిస్తోంది. థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడపాలంటే బొగ్గు చాలా అవసరం. దీంతో అన్ని థర్మల్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని గతేడాది అక్టోబర్‌లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. దిగుమతి చేసుకున్న బొగ్గులో స్వదేశీ బొగ్గును కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. ఏపీకి ఇబ్బంది లేదు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం, ఇంధన శాఖ ముందస్తు వ్యూహాల కారణంగా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వీటీపీఎస్‌కి రోజుకు 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,34,563 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. ఆర్టీపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా..90,003 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంట్‌కు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా..1,14,858 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో రోజుకు 19,200 మెట్రిక్ టన్నులు వాడుతుండగా, 1,17,375 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు రెండు రోజుల నుంచి ఆరు రోజులకు సరిపోతాయి. నిల్వలు తరిగిపోయి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాయి. -
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్‌లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్‌ను ఫ్యూయల్ గ్యాస్‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌ను గ్యాస్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
తాను నడుపుతున్న లారీ.. తనకే మృత్యు శకటమై..
కరీంనగర్: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖని–మంథని ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఎండీ మన్సూర్ ఆలం(48) దుర్మరణం చెందాడు. తాను నడుపుతున్న లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మన్సూర్ ఆలం భూపాలపల్లిలో నివాసం ఉంటున్నాడు. లారీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఓసీపీ–3 సీహెచ్‌పీ వద్ద బొగ్గు డంప్‌చేసి గోదావరిఖని నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రామగిరి మండలం సుందిళ్ల గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ బ్రేకులు ఆగిపోయాయి. దీన్ని గమనించని డ్రైవర్ మన్సూర్ ఆలం లారీ ఆపలేదు. దీంతో ముందు ఉన్న మరోలారీని ఢీకొట్టుకున్నాడు. ఈప్రమాదంలో మన్సూర్ ఆలం క్యాబిన్ నుంచి కిందపడ్డాడు. తాను నడుపుతున్న లారీ కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవి చదవండి: మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా.. -
బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు. బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్‌లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు! -
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్‌లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్‌గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్‌లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్‌గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్‌పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్‌షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్‌ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
Fact Check: నాడు ఒప్పు.. నేడు తప్పా..!
సాక్షి, అమరావతి: ఎందుకేడుస్తున్నావురా అంటే.. ఏదో ఒకటి ఏడవాలిగా.. అన్నాడటొకడు. కరెంటు కోసం కొనే విదేశీ బొగ్గుపై ఓ కథ అచ్చేసిన ఈనాడు తీరూ ఇలానే ఉంది. వాస్తవాలతో పని లేకుండా, ఏదో ఒకటి బురద జల్లడమే పనిగా ఈనాడు మరో తప్పుడు కథనం అచ్చేసింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ సమకూరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బరద జల్లే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ విదేశీ బొగ్గును అడ్డగోలుగా కొన్న విషయాన్ని మరుగున పెట్టింది. ఇప్పుడు వీలైనంత తక్కువ ధరతో అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొంటుంటే అదే తప్పయినట్లు ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పైపెచ్చు 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని కేంద్రం కూడా నిబంధన విధించింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి కేంద్ర నిబంధనలేమీ లేకపోయినా విదేశీ బొగ్గు కొన్నప్పటికీ, రామోజీ కిమ్మనలేదు. రామోజీ ఈ కుట్రపూరిత రాతలను రాష్ట్ర ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్), ఏపీజెన్కో ఖండించాయి. వాస్తవాలను ‘సాక్షి’కి వివరించాయి. విదేశీ బొగ్గు తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అన్నీ 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని ఈ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జనవరి నెలలో కూడా 6 శాతం విదేశీ బొగ్గు కొనాలంటూ కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను కాదని ముందుకు వెళ్లే అవకాశం రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే.. స్వదేశీ బొగ్గు సరఫరా అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. స్వదేశీ బొగ్గు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలో కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పిన మేరకు విదేశీ బొగ్గు కొనకపోతే స్వదేశీ బొగ్గులో కోత విధిస్తుంది. బయట కూడా కొనలేం. అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే బొగ్గు తగ్గిపోయి, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. పైగా, దేశీయ బొగ్గుకు కూడా కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సరిపడినంత బొగ్గు దొరకకపోతే రాష్ట్రం అంధకారమే అవుతుంది. ఇలా రాష్ట్రానికి అన్ని విధాలా నష్టమే కలుగుతుంది. మన రాష్ట్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎనీ్టపీసీ, ప్రైవేటు సంస్థలు కూడా కేంద్రం ఆదేశాలను పాటించి విదేశీ బొగ్గు కొంటున్నాయి. అయితే, ఈనాడుకు, టీడీపీకి విద్యుత్ ఉత్పత్తికంటే రాష్ట్రంలో అంధకారం నెలకొనడమే ఇష్టంలా ఉంది. అందుకే ఓ విషపు కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్డగోలుగా కొనుగోళ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటువంటి నిబంధనలేమీ లేకుండానే భారీ మొత్తంలో విదేశీ బొగ్గు కొనుగోలు చేశారు. ఇష్టానుసారం టెండర్లు పిలిచి, సరఫరా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లో తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎక్కువ ధరకే బొగ్గు కొన్నారు. 2015–16 నుంచి 2018–19 మధ్య రివర్స్ టెండరింగ్ లేకుండానే ఏపీపీడీసీఎల్ విదేశీ బొగ్గు కొనుగోలు చేసింది. 2015–16లో 1,24,361 టన్నులు, 2016–17లో 7,67,505 టన్నులు, 2017–18లో 3,80,049 టన్నులు, 2018–19లో 8,31,632 టన్నులు.. ఇలా మొత్తంగా ఆ ఐదేళ్లలో 21.03 లక్షల టన్నుల విదేశీ బొగ్గును బాబు ప్రభుత్వం కొన్నది. ఈ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత అన్నది లేదు. రివర్స్ టెండరింగ్ లేదు. దొంగ లెక్కలతో ఇష్టానుసారం టెండర్లు పిలిచి, ఇష్టమొచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశమున్నా, ఎక్కువ ధర చెల్లించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్‌కు విదేశీ బొగ్గు తప్పనిసరి రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ –1 కింద నిర్మించిన రెండు యూనిట్లకు విదేశీ బొగ్గునే వాడాలి. 70:30 నిష్పత్తిలో స్వదేశీ, విదేశీ హైగ్రేడ్ బొగ్గు వాడాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ రెండు యూనిట్లకు ఇది తప్పనిసరి. అందువల్లే హైగ్రేడ్ విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ టెండర్లు పిలిచింది. విదేశీ బొగ్గుతో ప్రజలకూ లాభమే ముడి సరకుల ధరలు పెరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం, సరఫరా ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సు ప్రకారమే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దేశీయ బొగ్గుతో పోల్చితే విదేశీ బొగ్గు ధర ఎక్కువ ఉండవచ్చు. కానీ దేశీయ బొగ్గుకు విదేశీ హైగ్రేడ్ బొగ్గు 70:30 నిష్పత్తిలో కలపడంవల్ల అధిక ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ. 3.14 మాత్రమే అవుతుంది. బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే ఇది సగం కూడా ఉండదు. చాలాసార్లు మూడో వంతు మాత్రమే. విదేశీ బొగ్గు వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు సరఫరా చేస్తారు. ఆమేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన భారం తగ్గి ప్రజలకు అంతిమంగా లాభమే చేకూరుతుంది. తెలంగాణతో పోలికేమిటి? తెలంగాణ ప్రభుత్వానికి సొంతంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందువల్ల ఆ రాష్టానికి విదేశీ బొగ్గు అవసరం లేదు. బొగ్గు గనులు లేని ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణతో పోల్చడానికి వీలు లేదు. ఈ తేడా చూడండి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ విధానంతో తక్కువ ధరకు విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా సరఫరా సంస్థలకు ప్రాధా న్యత ఇవ్వడంలేదు. దొంగ రేట్లు నిర్ణయించడంలేదు. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది విదేశీ బొగ్గు కోసం పిలిచిన టెండర్లను నాలుగు సార్లు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ ఈ ఏడాది టెండర్లు పిలిచింది. ధర ఎక్కువగా ఉండటంతో నాలు గు సార్లు వాటిని రద్దు చేసింది. అయిదోసారి తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు లభిస్తుండటంతో ఆ టెండర్లు ఖరారు చేసింది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత తక్కువ ధరతో హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అన్నీ కలుపుకొని ప్లాంటు వరకు చేర్చేలా టన్నుకు రూ. 13,219 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదే హైగ్రేడ్ విదేశీ బొగ్గుకు ఎనీ్టపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాణ్యమైన బొగ్గును ఎంత తక్కువ ధరకు కొంటోందో, ఎంత ఆదా చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. దీనిద్వారా ఉత్పత్తి వ్యయమూ తగ్గి, వినియోగదారులకు లాభమూ కలుగుతుంది. ఎవరైనా టెండర్లు వేయొచ్చు 7.5 లక్షల టన్నుల హ్రైగ్రేడ్ విదేశీ బొగ్గు సరఫరా చేసే సంస్థలు బిడ్లు దాఖలు చేయాలంటూ ఏపీపీడీసీఎల్ అత్యంత పారదర్శకంగా గ్లోబల్ టెండర్లు పిలిచింది. నిబంధనల ప్రకారం ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొని బిడ్లు వేసి కాంట్రాక్టు దక్కించుకోవచ్చు. అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ బొగ్గు సరఫరా చేయవచ్చు. ఇందులో ప్రత్యేకంగా అదానీ సంస్థకు ప్రయోజనం కలిగించే ప్రశ్నే ఉత్పన్నమవదు. టెండర్లలో హడావుడి ఏముంది? ఈ ఏడాది జనవరిలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరాకు ఏపీపీడీసీఎల్ టెండరు ఖరారు చేసింది. అందులో ఇప్పటికే 6.30 లక్షల టన్నులు సరఫరా అయింది. రావాల్సింది 1.20 లక్షల టన్నులు మాత్రమే. ప్రస్తుత అవసరాల్లో అది స్వల్ప పరిమాణమే. అందువల్లే మళ్లీ టెండర్లు పిలిచింది. టెండరు ఖరారు అనేది సుదీర్ఘ ప్రక్రియ. నోటిఫికేషన్ జారీ నుంచి రివర్స్ టెండరింగ్, సంప్రదింపుల ద్వారా ధర తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా సవ్యంగా పూర్తయ్యాకే ఒప్పందం చేసుకోవాలి. అందువల్ల హడావుడిగా టెండర్లు పిలిచిందనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. టెండర్లలో అర్హత ఉన్న ఏ సంస్థలైనా పాల్గొనవచ్చు. ఏ సంస్థలు పాల్గొంటాయన్నది ఎవరూ ముందుగా చెప్పలేరు. ఒకవేళ ఏ సంస్థా టెండర్లలో పాల్గొనలేదంటే లాభదాయకం కాదని అర్థం. అలాంటప్పుడు ఏదో ఒక సంస్థకు ప్రయోజనమని ఎలా చెప్పగలం? టెండరు నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ సంస్థలైనా బిడ్లు దాఖలు చేస్తాయి. -
కరెంటును కమ్మేసిన ‘బాబు’ అవినీతి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులూ విద్యుత్ శాఖను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు నిదర్శనం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు). అనవసర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు అధిక బిడ్డింగ్, నాణ్యతలేని బొగ్గు సేకరణ, విదేశీ బొగ్గు కొనుగోలు వరకూ దేనినీ వదిలిపెట్టలేదు. వీటిలో అవినీతిని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)నే వెల్లడించింది. ముడుపుల కోసం విద్యుత్ రంగాన్ని కకావికలం చేసి, డిస్కంలను అప్పులపాలు చేసి, విద్యుత్ వ్యవస్థను కుంగదీసి భారీ అవినీతిని పెంచి పోషించిన ‘బాబు’ను అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అవసరం లేకపోయినా ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు. 2014 మే నుంచి 2015 అక్టోబరు వరకు దాదాపు ఏడాదిన్నరలోనే 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొన్నారు. దీని విలువ రూ.8,286 కోట్లకు పైనే. ఇందులో కొంత విద్యుత్‌ను ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ.10కు కొన్నారు. జెన్కో విద్యుత్ యూనిట్ రూ.4.50 మాత్రమే ఉంది. అయితే జెన్కో ఉత్పత్తి పెంచకుండా చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు చేసైనా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో రూ. 15 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ఇందులో ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు దాదాపు రూ.4 వేల కోట్లు ముడుపులుగా అందినట్లు అంచనా. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి రాసిన లేఖలో చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరలకు ప్రైవేటు నుంచి కొంటున్న విషయాన్ని బయటపెట్టింది. మూసేస్తే రూ.675.69 కోట్లు నష్టం చంద్రబాబు హయాంలో బొగ్గు కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలను కాగ్ కడిగిపారేసింది. ఇష్టారాజ్యంగా బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లిన వైనాన్ని ఎండగట్టింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు కొన్న ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీని వల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ.2.94 నుంచి రూ.4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ.675.69 కోట్లు నష్టం వాటిల్లింది. అధిక ధరకు నాణ్యత లేని బొగ్గు మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడంలేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొన్న బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యత లేని రూ.3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరకు కొనడం వల్ల జెన్కోకు రూ.918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెర వెనుక కోల్ మాఫియా చక్రం తిప్పింది. రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. ఇందులో రూ.200 కోట్లు బాబు అండ్ కోకు ముడుపులుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
రాజస్తాన్‌లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్‌లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్‌తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్‌టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్‌లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
బాహుబలి గని!
కరీంనగర్: రాబోయే రోజుల్లో వంద మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజ మాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రసుత్తం 78 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, రాబోయే రో జుల్లో మరో 22మిలియన్ టన్నులు పెంచేందు కు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే మరో భా రీ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగు గనులు కలిపి రామగుండం కోల్‌మైన్ పేరుతో కొత్త ఓసీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 633.45మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆర్జీ–3ఏరియాకు అనుబంధంగా.. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–3 ఏరియాకు అనుబంధంగా రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. భవిష్యత్‌లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కలుపుకుని ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గని, ఆర్జీ–3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–1, 2, మూసివేసిన జీడీకే–10 గనిని కలుపుకుని మెగా ప్రా జెక్టు ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆర్జీ–2, 3 జీఎంలతో ఎ ప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. రెండు ఏరియాల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రాజెక్టు పనులు సిద్ధం చేసేందుకు ప్రత్యేక అధికారిని యాజమాన్యం నియమించింది. పెరుగనున్న బొగ్గు ఉత్పత్తి రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏ టా 10మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ కాలానుగుణంగా అన్ని గనులను ఒకే ఓసీపీ కిందకు తీసుకరానున్నారు. నూతన మెగా ఓసీపీ మూలంగా వకీల్‌పల్లి గనిని మరో రెండేళ్లలో మూసివేయనున్నారు. ఇప్పటికే మూ సివేసిన జీడీకే–10గనితో పాటు నాలుగు గనులను ఒకే ప్రాజెక్టు పరిధిలోకి తీసుకరానున్నారు. దీనివల్ల సరిహద్దు సమస్య లేకుండా ఉండనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓసీపీ–2 ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మార్పు తదితర పనుల మూలంగా ఉత్పత్తి వెనకపడింది. ఇదే ప్రాజెక్టు పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ ప్రాజెక్టు గని కూడా ఇందులో అంతర్భాగంగా కొనసాగించనున్నారు. రెమిడేషన్ ప్లాన్‌లో వకీల్‌పల్లి, ఓసీపీ–1 పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఉత్పత్తి తీసిన వకీల్‌పల్లిగని, ఓసీపీ–1 ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం రెమిడేషన్ ప్లా న్ చేయాల్సింది ఉంది. ఈ మేరకు రెండు గనుల అధికారులు సమీప గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే రెండు గనులకు సంబందించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. క్లియరెన్స్ రాగానే రామగుండం కోల్‌మైన్ ఓసీపీ కోసం యాజమాన్యం ఎన్విరాన్మెంట్ విభాగానికి దరఖాస్తు చేసుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈఏడాది నవంబర్‌లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. 2024 నాటికి నాలుగు గనుల సరిహద్దు కలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు ప్రొఫైల్ వివరాలు.. ప్రాజెక్టు పేరు: రామగుండం కోల్‌మైన్, విస్తరణ: 3445హెక్టార్లు, బొగ్గు నిల్వలు: 633.45మిలియన్ టన్నులు, ఏటా బొగ్గు ఉత్పత్తి: 14మిలియన్ టన్నులు(భూగర్భగనితో కలిపి), ఓవర్‌బర్డెన్: 2,846 మిలియన్ క్యూబిక్‌మీటర్లు, ప్రాజెక్టు జీవిత కాలం: సుమారు 30ఏళ్లు, అటవీభూమి: 719హెక్టార్లు. -
బొగ్గుపై సుంకం స్కామ్‌లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గుపై అదనంగా అక్రమ పన్ను కేసులో మనీ లాండరింగ్ కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. తాజాగా రూ.51.4 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మంగళవారం తెలిపింది. వీటిలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేందర్ యాదవ్, చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌లకు సంబంధించిన స్థిరాస్థులు, విలాసవంత వాహనాలు, ఆభరణాలు, నగదు ఉన్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి, నాటి రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ రాణు సాహూ, బొగ్గు వ్యాపారి, కేసులో ప్రధాన నిందితుడు సూర్యకాంత్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. రాష్ట్రంలో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన కొద్దిరోజులకే ఈ ఆస్తుల జప్తు జరగడం గమనార్హం. ఈడీని బీజేపీ ఏజెంట్‌గా పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ దీనిని తప్పుడు కేసుగా అభివర్ణించారు. -
రికార్డు సృష్టించిన సింగరేణి.. చరిత్రలోనే తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్‌టైం రికార్డుగా ఉంది. అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. -
సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 %
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది. బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది. సంప్రదాయేతర విద్యుత్‌కే మొగ్గు దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%). అయితే ఈ సౌర, పవన విద్యుత్ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్ నుంచి సోలార్ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్. సంప్రదాయ విద్యుత్‌లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే ఉండేవి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి. ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్‌తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్ తెరపైకి వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. పడిపోతున్న థర్మల్ ఉత్పాదన సామర్థ్యం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్‌డౌన్ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది. తాజాగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్ 566 మెగావాట్లు, స్మాల్హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్ , 287 మెగావాట్ల రూఫ్‌టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమలదే సింహభాగం.. పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తక్కువే. అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. -
పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది. వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. -
గ్యాస్ ధర 2012లో రూ.410.. ఇప్పుడేమో 1100.. కట్టెలపొయ్యివైపే జనం మొగ్గు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల కారణంగా రోజురోజుకూ భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడంలేదు. అధిక కర్బన ఉద్గారాల విడుదల కారకాల్లో ఒకటైన వంట చెరకు వినియోగం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎల్పీజీ, సోలార్, విద్యుత్ వాడకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పాతకాలం తరహాలో కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తద్వారా అడవుల నరికివేత కూడా ఎక్కువవుతోంది. దేశంలో ఇంకా దాదాపు 44 శాతం మంది అడవుల నుంచి కలప, పంటల వ్యర్థాలు, పిడకలను వినియోగించి ఆహారం తయారు చేసుకుంటున్నారు. ఇటుకల తయారీకి కూడా కలప, పంటల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు సైతం కట్టెలనే వాడుతున్నాయి. చివరకు బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం పంట వ్యర్థాలు కాకుండా ఏకంగా అటవీ కలపను వినియోగిస్తున్నాయి. మరోవైపు కలపతో బొగ్గు తయారీ కూడా చేస్తున్నారు. ఫలితంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా మరణాలు చైనా తరువాత భారత్‌లోనే ఎక్కువని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగం పెరిగినా.. దేశంలో దశాబ్దకాలంగా ఇళ్లలో ఎల్పీజీ వినియోగం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30.5 కోట్ల ఎల్పీజీ గృహ వినియోగదారులున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. 2012లో రూ. 410 ఉన్న 14.5 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,100కు చేరుకోవడంతో వినియోగదారుల సంఖ్య పడిపోతోందని డీలర్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచితంగా దాదాపు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారిన నేపథ్యంలో చాలావరకు రీఫిల్లింగ్‌కు రావడం లేదని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లోనూ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు తగిన స్థాయి లో అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి సిలిండర్లను తెచ్చుకోవాల్సి రావడం వల్ల సిలిండర్ ధరతోపాటు రవాణా చార్జీలు కూడా తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్ అయిపోయిన వెంటనే రీఫిల్ దొరుకుతుందన్న గ్యారంటీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కలపతో ఆహార తయారీకి మొగ్గుతున్నా రు. స్నానాలకు అవసరమైన వేడినీటి కోసం కలపనే వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఎల్పీజీ వినియోగం దాదాపు 88.6 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 42 శాతం మాత్రమే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులు ఇంకా అడవుల నుంచి తెచ్చిన కలప, పంట పొలాల్లోని వ్యర్థాలు, పిడకలను వాడుతున్నారు. కలప కాలడం వల్ల వచ్చే.. కలప, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 3.3 లక్షల మంది మరణిస్తున్నారని ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’అధ్యయనం వెల్లడించింది. అదే చైనాలో 3.8 లక్షల మంది, యూరప్‌లో 1.17 లక్షల మంది, యూఎస్‌లో 32 వేల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు దాదాపు 28 కోట్ల మంది ఇంకా కలప, పంట వ్యర్థాలను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నారని సమాచారం. వంట చెరకు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మరణిస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. ఎల్పీజీ వినియోగిస్తున్న వారిలోనూ 12 శాతం మంది రెండో ఇంధనంగా ఈ కలపను వినియోగిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. బొగ్గు డిమాండ్‌ను తగ్గించాలి... చెట్లను కొట్టేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. కొట్టేసిన చెట్టును బొగ్గుగా మార్చడానికి విద్యుత్ లేదా ఇతర రూపాల్లో ఇంధనం అవసరమవుతుంది. మళ్లీ బొగ్గును కాల్చినా అది కూడా కాలుష్యమే. ఈ రకంగా మూడు దశల్లోనూ కాలుష్యం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో ఈ తరహా కలప కాల్చివేత ఎక్కువగా జరుగుతోంది. ఇదొక పాత విధానమైనా ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ బొగ్గును అధికంగా చిన్నతరహా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వంటి వాటిలో వాడుతున్నారు. వీటికి బొగ్గు సరఫరా పెంచితే ఇలాంటి బొగ్గు ఉపయోగించరు. అసలు బొగ్గే వద్దనుకుంటే సబ్సిడీపై విద్యుత్ ఇవ్వాలి. బాయిలర్ వంటివి ఎలక్ట్రిక్‌పై నడిచేవి అందుబాటులోకి తేవాలి. ముందుగా ఈ రకమైన బొగ్గుకు ఉన్న డిమాండ్‌ను తగ్గించాలి. చెట్లు కొట్టేయకుండా చట్టాన్ని తీసుకురావాలి.పచ్చదనానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయ్‌ను తగ్గించడం ద్వారా అనుకున్న ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతానికైతే చెట్లకు, పర్యావరణానికి నష్టం కలగజేసే వాటిపై ప్రభుత్వపరంగా ఎలాంటి నియంత్రణలు, పర్యవేక్షణలు లేవు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త, పాలసీ అనలిస్ట్