న్యూఢిల్లీ: బొగ్గు గనుల ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) బిల్లు-2015ను బొగ్గుశాఖ మంత్రి పీయూష్ గోయల్ సభ ముందుకు తెచ్చారు. దీనిపై బీజేడీ సభ్యుడు భరృ్తహరి నిరసన తెలిపారు. బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనలు)-2014 పేరుతో కేంద్రం గత అక్టోబర్, డిసెంబర్‌లో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది.
పౌరసత్వ బిల్లుకు ఆమోదముద్ర
రాజ్యసభలో ఆమోదించిన పౌరసత్వ(సవరణ) బిల్లు-2014కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో భారత ప్రవాస పౌరసత్వ కార్డు(ఓసీఐ), భారత సంతతి వ్యక్తి కార్డు(పీఐవో)లను విడివిడిగా కాకుండా ఇకపై ఒకే కార్డుగా గుర్తిస్తారు. ప్రధాని మోదీ కిందటేడాది అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఓసీఐ, పీఐవోలను కలుపుతామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇటీవలే దీనిపై ఆర్డినెన్స్ తెచ్చింది. సర్కారు తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లలో ఇదొకటి.
లోక్‌సభలో బొగ్గు బిల్లు
Published Tue, Mar 3 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement