
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ కోల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్(సీఎంపీడీఐఎల్)ను మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్)తో విలీనం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే సీఎంపీడీఐఎల్‌ను కోల్ ఇండియా అనుబంధ సంస్థగా కొనసాగించనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదనకు మద్దతుగా కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బొగ్గు రంగంలో సీఎంపీడీఐఎల్ ప్రధానంగా ఎక్స్‌ప్లొరేషన్, కన్సల్టెన్సీ సరీ్వసులను అందిస్తోంది. ఇతర ఖనిజాల(మినరల్స్)లోనూ వ్యాపార విస్తరణ నేపథ్యంలో కంపెనీని మరింత పటిష్ట పరచేందుకు ఎంఈసీఎల్‌లో విలీన ప్రతిపాదనను చేపట్టినట్లు బొగ్గు శాఖ ఒక ప్రకటనలో వివరించింది.
ఈ వార్తల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం పతనమై రూ. 189 వద్ద ముగిసింది.