cental government
-
కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.అధికారాలను హరించేందుకే..కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్రం హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. -
ఎంఈసీఎల్‌తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ కోల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్(సీఎంపీడీఐఎల్)ను మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్)తో విలీనం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే సీఎంపీడీఐఎల్ను కోల్ ఇండియా అనుబంధ సంస్థగా కొనసాగించనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదనకు మద్దతుగా కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బొగ్గు రంగంలో సీఎంపీడీఐఎల్ ప్రధానంగా ఎక్స్‌ప్లొరేషన్, కన్సల్టెన్సీ సరీ్వసులను అందిస్తోంది. ఇతర ఖనిజాల(మినరల్స్)లోనూ వ్యాపార విస్తరణ నేపథ్యంలో కంపెనీని మరింత పటిష్ట పరచేందుకు ఎంఈసీఎల్‌లో విలీన ప్రతిపాదనను చేపట్టినట్లు బొగ్గు శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 6.5 శాతం పతనమై రూ. 189 వద్ద ముగిసింది. -
ధాన్యం కొనుగోలు పై ధర్నా
-
ఐదుగురు తెలంగాణవాసులకు శ్రమ్‌శ్రీ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను 2018 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. డిపార్ట్మెంటల్ అండర్ టేకింగ్స్–పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు వారి విశిష్ట పనితీరు, వినూత్న సామర్థ్యాలు, ఉత్పాదకత రంగంలో అత్యుత్తమ సహకారం, అసాధారణమైన ధైర్యానికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. శ్రమ్ భూషణ్ అవార్డ్, శ్రమ్వీర్ అవార్డ్, శ్రమ్‌శ్రీ అవార్డులుగా ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను మూడు కేటగిరీల్లో అందించనున్నారు. ఈ సంవత్సరానికి ప్రకటించిన మొత్తం శ్రమ్ అవార్డుల సంఖ్య 33 ఉండగా, అవార్డులను 69 మంది కార్మికులు అందుకుంటున్నారు. శ్రమ్‌శ్రీ అవార్డును అందుకునే వారిలో తెలంగాణ నుంచి కొరివి రమేశ్, పట్లూరి రాజశేఖర్, కొట్టె రాజు (హైదరాబాద్– బీహెచ్ఈఎల్), చాడ సురేందర్‌రెడ్డి, పూస రాము (బ్రహ్మోస్ ఏరో స్పేస్ ప్రై.లి.) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2017–18, 2018–19 సంవత్సరాలకు జాతీయ యువ పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ప్రదానం చేశారు. వ్యక్తిగత కేటగిరీలో 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన మహ్మద్ ఆజంకు జాతీయ యువ పురస్కారాన్ని అందించారు. -
బతికున్నా.. లేకున్నా పేర్లు రాయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మీ పుట్టిన రోజు గుర్తులేదా? ఏ సంవత్సరమో తెలీదా..? ఏ నెలలో, ఏ తేదీన పుట్టారో మీ తల్లిదండ్రులు నమోదు చేయలేదా? మీరు చదువుకోకపోవడంతో సర్టిఫికెట్లలోనూ పుట్టిన తేదీ పేర్కొన లేదా..? అయినా ఫర్వాలేదు.. త్వరలో జరగనున్న జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) నమోదు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తారు. ఎలాగో తెలుసా.. వర్షాకాలంలో పుట్టారా? ఎండాకాలం తర్వాత జన్మించారా అని తెలుసుకుం టారు. అప్పుడు ఏ పండుగలున్నాయో చూస్తారు.. పండుగల ఆధారంగా మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ తేలకపోతే మీ కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన వారే మీ శారీరక పరిస్థితి, మీ కుటుంబసభ్యుల వయసు, మీ పిల్లల వయసు ఆధారంగా మీ పుట్టిన తేదీ ఖరారు చేసి నమోదు చేస్తారు. ఈ మేరకు కేంద్రం ఎన్పీఆర్ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా నిర్ణీత షెడ్యూల్లో జనగణనతో పాటు ఎన్పీఆర్ను ఏకకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్) మీ మూలాలను తేల్చనుంది. మీ తల్లిదండ్రులు ఎక్కడి వారో నమోదు చేయనుంది. వారు బతికున్నా లేకపోయినా వారి పేర్లనూ రికార్డు చేయనుంది. మీ కుటుంబసభ్యులు ఇంట్లో లేకపోయినా, ఏదైనా ప్రాంతంలో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్లినా, అక్కడ నమోదు చేసుకోకపోతే మీ దగ్గరే వారి పేర్లు, వివరాలను నమోదు చేసుకోనుంది. ఈసారి కొత్తగా సొంత ఇళ్లు లేని వారి జాబితాను కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ఎన్పీఆర్ తయారీ మార్గదర్శకాల్లో కొన్ని.. ప్రతి కుటుంబానికి తాత్కాలిక ధ్రువీకరణ సంఖ్య (టీఐఎన్) కేటాయిస్తారు. అందులో రాష్ట్రం, జిల్లా, మండలం, పట్టణం లేదా గ్రామాలకు కోడ్ నంబర్లు ఉంటాయి. ఆ తర్వాత 2010, 2015లో రూపొందించిన డేటా ప్రకారం ఇంటి అడ్రస్ సరిచూస్తారు. అవసరమైతే చిరునామా మారుస్తారు. ఇందులో పిన్‌కోడ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య నమోదు చేసి, ప్రతి ఒక్కరికి సీరియల్ నంబర్ కేటాయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తి పూర్తి పేరు (ధ్రువపత్రాల్లో ఉన్న పేర్లతో పోల్చి), యజమానితో బంధుత్వం, ఎన్యూమరేటర్ వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నారా.. లేదా.. ఎక్కడికి వెళ్లారనే విషయాలను నమోదు చేస్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించి వివాహమైందా? లేదా అనే అంశాన్ని వయసుతో సంబంధం లేకుండా నమోదు చేసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరి పుట్టిన రోజులు ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం నమోదు చేస్తారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎక్కడ పుట్టారనే నే విషయాన్ని విడివిడిగా రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం లేదా పట్టణం లాంటి వివరాలను నమోదు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి భారతీయుడా? కాదా అనేది నిర్ధారిస్తారు. జాతీయత విషయంలో కుటుంబంలోని అందరిని అడిగి రికార్డు చేసుకుంటారు. పాస్‌పోర్టు నంబర్, విద్యార్హతల వివరాలు, వృత్తి, మాతృ భాషలాంటి సమాచారాన్ని కోడ్ ఆధారంగా నమోదు చేస్తారు. మీతో పాటు మీ నివాసంలోనే పనిమనిషులు శాశ్వతంగా ఉంటే వారి పేర్లను కూడా మీ కుటుంబ వివరాల్లోనే నమోదు చేసుకుంటారు. మిలిటరీ ఏరియాలు, బయటప్రాంతాల్లో నివసించే రక్షణ సిబ్బంది వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటారు. వారి వివరాలను సంబంధిత విభాగాలతో చర్చించిన తర్వాతే జాబితాలో పొందుపరుస్తారు. యాచకులు, వలసజీవులు, సంచార జీవులు, ప్లాట్‌ఫారాలు, బస్స్టేషన్లు, పార్కుల్లో ఉండేవారి వివరాలను కూడా ఈసారి ఎన్పీఆర్లో నమోదు చేయనున్నారు. – కుటుంబ శాశ్వత చిరునామా, ఆ ఇంట్లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు. గతంలో ఆ కుటుంబ వివరాలు ఎన్పీఆర్లో నమోదయ్యాయా? లేదా అనే విషయాలను కూడా రాసుకుంటారు. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను లభ్యతను బట్టి తీసుకుంటారు. ఈ వివరాలన్నింటినీ కలిపి ప్రతి కుటుంబానికి ఒక సంగ్రహ నివేదికను ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్ తయారు చేస్తారు. -
‘మీ నిర్ణయాల వల్లే ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది’
సాక్షి, కరీంనగర్: కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(నవంబర్ 7)తో పెద్దనోట్ల రద్దుకు మూడేళ్లు అవుతుదని.. శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. వాటికి లొంగకుండా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. హైకోర్టు చేస్తున్న కామెంట్లు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన సర్కారు.. ఆర్టీసీకి రూ. 40 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకునే మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు ఈ సర్కారుకు తగిలి తీరుతుందన్నారు. హైకోర్టుపై గౌరవం లేకుండా ‘కోర్టేమైనా కొడుతుందా?’ అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు నకిలీ ఫైటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సకల జనుల సమ్మెలో సమైక్య సర్కారు ఒక్కరి ఉద్యోగమైనా తీసిందా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
మాతృభాషలో పరీక్షలే మేలు
జాతీయ స్థాయిలో ఉద్యోగాలకోసం పరీక్షలు దాదాపుగా హిందీ, ఇంగ్లిష్ భాషలలో ఉండటం వలన చాలామంది ప్రాంతీయ భాషలలో చదువుకున్నవారు ఉద్యోగాలలో ఎంపిక కావడం కష్టమైపోతోంది. అఖిలభారత సర్వీసు వంటి కీలక పరీక్షలలో కూడా ప్రాంతీయ భాషలలో రాసే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల పరిజ్ఞానం అంచనావేయడానికి పదవతరగతి స్థాయిలో ప్రత్యేక పరీక్ష ఉంటుంది. అర్హత కోసమే తప్ప, ఈ మార్కులకు ఉద్యోగం ఎంపికకు ముడిపెట్టరు. ఇతర కేంద్ర ఉద్యోగాలలో చాలా చిన్న ఉద్యోగాలకు సైతం ప్రాంతీయ భాషలలో రాసే అవకాశం లేకుండా ఇన్నాళ్ళు కొనసాగుతూ వస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుండి కేంద్రం నిర్వహించే పరీక్షలు ప్రాంతీయ భాషలలో కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వాల్ని చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. చాలా కేంద్ర ఉద్యోగ పరీక్షలకు దక్షిణాది వారు దరఖాస్తు కూడా చేసేవారు కాదు. ఉత్తరాది వారి ఆధిపత్యమే కేంద్ర ఉద్యోగాలలో సాగేది. ప్రజలనుండి వస్తున్న విజ్ఞప్తులపై ఇటీవల కేంద్రం స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల పరీక్షలను ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో బ్యాంకులకు సంబంధించిన స్కేల్ 1, 2, 3 అధికారులను, ఇతర కింది స్థాయి సిబ్బందిని నియామకం చేస్తారు. ఈ ప్రాంతీయ బ్యాంకుల పరీక్షలను కూడా కేవలం ఇంగ్లిష్, హిందీ భాషలలో నిర్వహించే వారు. ఇప్పటి నుండి తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కొంకణి, పంజాబీ, మణిపురి, ఉర్దూ తదితర పదమూడు ప్రాంతీయ భాషలలో కూడా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. వివిధ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాథమిక, ఉన్నత స్థాయిలలో మాతృభాషలలో విద్యను అభ్యసించిన వారు తాము చదువుకొన్న భాషలో భావనలు వ్యక్తం చేయడం సౌకర్యంగా ఉంటుంది. చాలా రాష్ట్రాలలో విద్యార్థులు తమ మాతృభాషా మాధ్యమంలోనే విద్య అభ్యసిస్తారు. ఇంగ్లిష్, హిందీ భాషలను కేవలం ఒక అంశంగా మాత్రమే చదువుతారు. తాము పొందిన జ్ఞానం, భావనలు ఇతర భాషలలో అనువదించుకొని, పదజాలాన్ని అవగాహన చేసుకొని పరీక్షలలో పోటి పడి ఉద్యోగం సాధించడం సులువుకాదు. ఈ కారణంగా ఎంతో మంది మాతృభాషలలో వివిధ విషయాలపట్ల పరిజ్ఞానం, అవగాహన ఉండి కూడా అవకాశాలను అందుకోలేకపోయారు. ఒక ఉద్యోగి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేయవలసిన సందర్భాలలో హిందీ, ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరమే అవుతుంది. అందుకు ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రాథమిక పరిజ్ఞానం పరిశీలించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగాల ఎంపికలో మొత్తం జ్ఞానం అంతా పరాయి భాషలోనే సామర్థ్యం ఉండాలనుకోవడం అశాస్త్రీయం అవుతుంది. స్వరాష్ట్రాలలో పని చేసే కేంద్ర ఉద్యోగులకు హిందీ, ఇంగ్లిష్‌లో సాధారణ పరిజ్ఞానం ఉన్నా సరిపోతుంది. కేంద్రప్రభుత్వం వివిధ శాఖ లలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో కూడా రాసే విధంగా అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలి. రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తది తర ఉద్యోగుల ఎంపికలోను ప్రాంతీయ భాషలలో అవకాశాలు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించే నెట్ జనరల్ స్టడీస్ పరీక్ష ఆయా ప్రాంతీయ భాషలలో నిర్వహించాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఉద్యోగాలకు పరీక్షలను ఇంగ్లిష్, తెలుగు భాషలో నిర్వహించాలి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా తెలుగులో అనువాదం చేయ డం వలన పరీక్షలలో నష్టపోయినవారు ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉంటూ శాఖాపరమైన పదోన్నతులకోసం రాసే పరీక్షలను పూర్తిగా ఇంగ్లి ష్లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరీక్షలను అన్ని రాష్ట్రాలలో వారి మాతృభాషలలో నిర్వహిస్తున్నారు. కానీ మనవాళ్లు మాత్రం ఆంగ్లంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పదోతరగతి అర్హతతో ఉద్యోగంలోకి ప్రవేశించిన వారు సైతం శాఖాపరమైన పదోన్నతి పరీక్షలు ఇంగ్లిష్‌లోనే రాయాలనడం అసమంజసమైన విషయం. కష్టపడి తమ మాతృభాషలో జ్ఞానం పొందిన ఉద్యోగార్థులను, పరాయి భాషల ద్వారా పెత్తనం చేసే కృతక చర్యలతో మానసికంగా బలహీనం చేయడం అంటే వారి అవకాశాలను, హక్కులను భంగం చేయడమే అవుతుంది. వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, అనంతపురం మొబైల్ : 99639 17187 డా: అప్పిరెడ్డిహరినాథరెడ్డి -
పథకాలతో కేంద్రం లాలన
అభిప్రాయం ఆరుగాలం కష్టపడి పని చేసే రంగం భారతదేశంలో ఏదైనా ఉందంటే వ్యవసాయరంగమేనని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా అంటే గ్యారంటీ లేని రంగం ఇదే. దాదాపు 60 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకుల నిర్వాకం నిర్లక్ష్యమే దీనికి కారణం. దేశంలో ఏ వస్తువును తయారు చేసే ఉత్పత్తిదారైనా తాను తయారు చేసిన వస్తువుకు సరైన ధర నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాడు. కానీ రైతుకు మాత్రం తాను పండిచే పంటకు ధర నిర్ణయించే అధికారం లేదు. దీంతోనే రైతులు దళారీ వ్యవస్థలో చిక్కుకుని తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ దుర్భరపరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చే దిశలో కొన్ని అడు గులు వేసింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన పలు పథకాల్లో ప్రధాన మంత్రి కృషి సంచయ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్ష కార్డులు, రాష్ట్రీయ గోకుల్ మిషన్, అగ్రి ఉడాన్ 2017 వంటివి కీలకమైనవి. ఇటీవల14 రకాల పంటలకు కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా మద్దతు ధర ప్రకటించింది కూడా. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నిం టికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి చేనుకూ నీరు నినాదంతో కరువు నివారణ లక్ష్యంతో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకమే క్రిషి సంచన యోజన. దీన్ని మోదీ ప్రభుత్వం 2015 జూలైలో ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో 23 ప్రాజెక్టులు చేపట్టి మార్చి 2017లోగా పూర్తి చేయాలని సంకల్పించింది. తర్వాతి దశలో 2018 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 31 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణ యించి పనులు చేపట్టింది. ఈ మొత్తం 99 ప్రాజె క్టులను పూర్తి చేసి 76 లక్షల హెక్టార్లకు సాగునీరం దించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం అయిదేళ్లలో (2015–16 నుంచి 2019–20) 50 వేల కోట్ల రూపాయల దీర్ఘ కాలిక ధనసహాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. రైతులు చెమటోడ్చి పండించిన పంట మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా నమ్మకం లేని దుస్థితి. అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా పంట చేనుల్లోనే రైతు కళ్లముందే పంట నాశనం కావటంతో, ఆ బాధను తట్టుకోలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు మోదీ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన్ను ప్రవేశపెట్టింది. బీమా మొత్తానికి, ఉత్పత్తి వ్యయానికీ మధ్య తేడాను తగ్గించడం దీని ప్రత్యేకత. ఇందు కోసం రైతులు ఖరీఫ్ పంటల బీమా ప్రీమియంలో కేవలం రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం చెల్లిస్తే సరి పోతుంది.ప్రీమియంలో మిగతా భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. అంటే కేంద్రం భారీ సబ్సిడీని రైతులకు అందిస్తున్నట్లు లెక్క. ఇది ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో అమలవుతోంది.వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇబ్బడిముబ్బడిగా పెంచింది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం పెంచని విధంగా అత్యధికంగా వరికి క్వింటాలుకు రూ. 200 చొప్పున పెంచగా, జొన్నకు 725, పత్తికి 1,130, వలిసెలకు 1,827, పొద్దుతిరుగుడుకు 1,288, పెసర్లకు 1,400, రాగు లకు 997 రూపాయలుగా పెంచింది. సజ్జ, మొక్క జొన్న, కంది, మినుములు, సోయాబీన్స్, నువ్వులు తదితర పంటలకు కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం భారీగా పెంచి రైతులకు న్యాయం చేయ సంకల్పించింది. కేంద్రం మరో బృహత్తరమైన పథకా నికి శ్రీకారం చుట్టింది. దేశంలో కూలీలు దొరకని పరి స్థితులను నివారించేందుకు వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించాలని భావించింది. రైతులకు భారీ సబ్సిడీపై ట్రాక్టర్లను, వరినాటు యంత్రాలను అందించాలని నిర్ణయించింది. రైతులకు 50 శాతం సబ్సిడీపై వరినాటు యంత్రాలను, మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్వాతంత్య్రానంతరం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం గత నాలుగేళ్లుగా చేపట్టిన వివిధ రకాల పథకాలతో కొంత భరోసా పెరిగింది. కేంద్రం చిత్తశుద్ధితో చేపడుతున్న ఈ పథకాల ద్వారా భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు లేని, రైతే రాజుగా మారే భవ్య భారతాన్ని మనం దరం చూడాలని ఆశిద్దాం. శ్యామ్ సుందర్ వరయోగి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఫౌండర్ – మేనేజింగ్ ట్రస్టీ, రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ ఫోన్ నెంబర్: 98669 66904 -
ఈపీఎఫ్‌వో కనీస పింఛన్ రూ.2,000
-
జగన్‌తోనే ప్రత్యేక హోదా సజీవం
తిరుపతి మంగళం/యూనివర్సిటీ క్యాంపస్: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటివరకు సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు భూమన అభినయ్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వారం రోజులుగా తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక హోదా అడగని గాడిద, ప్రత్యేక హోదా కల్పించని గాడిద అంటూ పార్టీ యువజన విభాగం జిల్లా, నగర అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్, బండ్ల లక్ష్మీపతి ఆధ్వర్యంలో రెండు గాడిదలకు బోర్డులు తగిలించి వినూత్న నిరసన తెలిపారు. భూమన అభినయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కన్నా చంద్రబాబుతోపాటు వారి ఎంపీలకు పదవులే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రత్యేక హోదా కోసం రోడ్డుపైకి వచ్చి నినదించడంలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుంటే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లేక, కూలిపనులు, భిక్షాటన చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పార్టీ నాయకులు ఎస్కే.బాబు, కేతం జయచంద్రారెడ్డి, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, పుల్లయ్య, కోటూరు ఆంజినేయులు,పాముల రమేష్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, తాలూరి ప్రసాద్, ఆమోస్‌బాబు, జీవకోన శ్రీనివాసులు, శివాచ్చారి, వంశీ, గోపాల్‌రెడ్డి, గీత, రమణమ్మ, శాంతారెడ్డి, పుణీత, కవితమ్మ పాల్గొన్నారు. కూలి పని చేసి విద్యార్థుల నిరసన ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఎస్వీయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కూలీ పనిచేసి నిరసన తెలిపారు. ఎస్వీయూలో భవన నిర్మాణ పని చేసి ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోతే విద్యార్థులు కూలీ పనిచేసుకోవాల్సిందేనని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వారిని చూసి 5 కోట్ల మంది గర్విస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, నరేంద్ర, హేమంత్‌కుమార్ రెడ్డి, సుధాకర్, సతీష్, శివకృష్ణ పాల్గొన్నారు. -
‘ఎన్నికల హామీల అమలులో విఫలం’
రెబ్బెన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్ని కల హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలం అ య్యాయని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఆ రోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఐ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గత 90 సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం సీపీఐ ఎన్నో ప్రజా పోరాటాలు చేపట్టిందన్నారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల హక్కుల కో సం ఎన్నో త్యాగాలను చేసిందన్నారు. కాని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రజ లకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తోందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ మి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కేజీటూ పీజీ ఉచిత విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పో యిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 4వ వరకు నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో రెబ్బెన పట్టణ కార్యదర్శి రామడుగుల శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కుందారపు బసవయ్య, నాయకులు సాగర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, అంకూస్, జేఏసీ కన్వీనర్ మల్లయ్య పాల్గొన్నారు. -
బీటీ–3పై ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రమాద కరమైన బీటీ–3 పత్తి విత్తనాన్ని ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ‘క్షేత్రస్థాయి తనిఖీ, శాస్త్రీయ మూల్యాం కన కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఈసీ)’పరిశీలన ము మ్మరం చేసింది. పత్తి అధికంగా సాగుచేసే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌లలో.. అనుమతిలేని బీటీ–3 విత్తనం ఏమేరకు వ్యాప్తి చెందిందో అధ్యయనం చే స్తోంది. అందులో భాగంగా 12 మంది సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో తెలం గాణలోని గద్వాల, మంచిర్యాల, వికా రాబాద్ జిల్లాల్లో పర్యటించింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవు లు నేతృత్వంలో రైతులను కలసి విచారించిం ది. ఆయా జిల్లాల్లో పత్తి పంటలను, జిన్నింగ్ మిల్లులను, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలిం చి, విత్తన నమూనాలను సేకరించింది. బీటీ–3కి అనుమతి లేకున్నా పలు చోట్ల ఆ విత్తనాన్ని వేశారని గుర్తించింది. అనంతరం హైదరాబాద్‌లో విత్తన కంపెనీలు, డీలర్లు, విత్తనోత్పత్తిదారులతో సమావేశమైంది. దిశా నిర్దేశం చేయండి అనధికార, పర్యావరణ కాలుష్య కారకమైన బీటీ–3 పత్తి విత్తనాలను అరికట్టడంపై స్పష్టమైన నిబంధనలతో అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర బృందాన్ని కోరారు. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ విత్తనాలను క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్నేళ్లుగా అనధికార బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ, రాష్ట్ర విత్తన సంఘాల ప్రతినిధులు, విత్తనోత్పత్తిదారులు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. అనధికార పత్తి విత్తనాలను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. కొందరు విత్తనోత్పత్తిదారులు చేసిన తప్పులకు విత్తన డీలర్లు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి తగిన నిబం ధనలు రూపొందించాలని.. విత్తనాల గుర్తిం పుపై డీలర్లకు, రైతులకు శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి కావలసిన పత్తి విత్తనాల్లో 40 శాతం వరకు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని.. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు పేర్కొన్నారు. బీటీ–3 పత్తిలో హెచ్‌టీ లక్షణాన్ని కనుగొని విత్తన ధ్రువీకరణ చేయటానికి ప్రైవేటు పత్తి సంకరజాతి రకాల నోటిఫికేషన్ అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వ జీవ సాంకేతిక విభాగం ముఖ్య శాస్త్రీయ అధికారి వి.ఎస్.రెడ్డి చెప్పారు. కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలివీ.. 1. చట్టవిరుద్ధ బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిని, అమ్మకాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి. 2. అన్ని రాష్ట్రాల లాఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించాలి. 3. బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిపై, గ్లైఫోసేట్ అమ్మకాలపై పర్యవేక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలి. 4. విత్తన ఉత్పత్తిదారుల వద్ద లేదా ప్రొసెసింగ్ ప్లాంట్లలో బీటీ–3 పత్తి విత్తనాలను తనిఖీ చేసి వెంటనే నాశనం చేసేలా విధివిధానాలు రూపొందించాలి. 5. బీటీ–3 పత్తి వాడకం, గ్లైఫోసేట్ దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 6. బీటీ–3లో హెచ్‌టీ లక్షణం పరీక్ష కోసం ప్రొటోకాల్స్ రూపొందించాలి. -
బీజేపీనేతలు రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు: గాలి
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా పని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కితాబిచ్చారు. కొంతమంది బీజేపీ నాయకులే రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో కేంద్రానికి లెక్కలు చెబుతున్నామని, అయినా ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాలంటే కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెయ్యటం మంచిది కాదని సూచించారు. మనం కట్టిన డబ్బులో నుంచి కేంద్రం కొంత రాష్ట్రాలకు ఇస్తుందని వెల్లడించారు. ఇండియాలో మన ఒక భాగం అని, మనం కూడా ట్యాక్సులు కడుతున్నామని గుర్తుచేశారు. మన దగ్గర కూడా కేంద్రం డబ్బులు తీసుకుంటుందని చెప్పారు. ఇది ఒక వ్యక్తి ఎస్టేట్ కాదని, ఇక్కడ అసెంబ్లీ, మంత్రులు, అధికారులు ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కేంద్రం పంపిన ఐఎస్ఎస్లు కూడా ఉన్నారని చెప్పారు. కేంద్రం మమ్మల్ని నమ్మాలని..డబ్బులు కూడా విడుదల చెయ్యాలని విన్నవించారు. -
సమన్వయంతో సాగుదాం
కొట్లాడి తెలంగాణ సాధించుకున్నం... పాత ప్రభుత్వ పాలన వేరు. తెలంగాణ ప్రభుత్వ పాలన వేరు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయంతో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన లేదు. అధికారులే అవగాహన కలిగించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను ఖర్చు పెట్టడంలో మన జిల్లా దేశానికే దిక్సూచి కావాలి. సమస్యలుంటే నా సెల్‌కు ఫోన్ చేయండి. ఎత్తకుంటే ఎస్ఎంఎస్ కొట్టండి. - వినోద్‌కుమార్, కరీంనగర్ ఎంపీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ప్రభుత్వం ఎడ్లబండి అయితే మనం(అధికారులు, ప్రజాప్రతినిధులు) జోడెడ్లం.. సమన్వయంతోనే అభివృద్ధి చేసుకుందాం. కేంద్ర ప్రభు త్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలి. ఆరునెలలవుతున్నా ఇక్కడున్న అధికారులెవరూ నాకు తెలియదు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అ వసరముంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. సమస్యలపై ఎ ప్పటికప్పుడు స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లాలి. - బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ, కమిటీ కో చైర్మన్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. నిధుల విని యోగంలో దేశానికే జిల్లా దిక్చూచిలా ఉండేలా చూడాలని సూచించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ సమావేశంలో 14 పథకాలపై నాలుగు గంటల పాటు సమీక్షించారు. పథకాల ప్రగతిపై పలువురు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. - ముకరంపుర ముకరంపుర : కమిటీ చైర్మన్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉద యం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా గంట ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమీక్షించారు. వాస్తవంగా ఏటా మూడుసార్లు విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశం నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే అవకాశమున్నందున అత్యవసరంగా ఏర్పాటు చేసినట్లు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. జనవరిలో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఆయా ప్రాంతాల్లో పథకాల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో కూలీలకు తక్కువ పనిదినాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జారీ చేసిన జాబ్‌కార్డులకు పనిదినాలకు వ్యత్యాసాన్ని డ్వామా ఇన్చార్జి పీడీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కలపెంపకంలో ప్రగతి గతి తప్పిందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడంలో జాప్యంతోనే పథకం వెనుకంజలో ఉందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ లేవనెత్తారు. జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీపీలు సైతం ఇదే విషయాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మార్చి 31లోగా పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించినట్లు డ్వామా ఇన్చార్జి పీడీ శ్రీనివాస్ తెలిపారు. సాంక్షన్ లేకుండా నిర్మాణాలు చేసిన వాటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెద్దపల్లి, మంథని ప్రాంతంలో చేపట్టిన 105 కిలోమీటర్ల రింగురోడ్డు పూర్తి చేయడానికి ఓ పెద్దాయన అడ్డుకుంటున్నారని, స్టేజ్ టూ వర్క్ మొదలుపెట్టనివ్వడం లేదని, ఇంకా 55 కిలోమీటర్ల రోడ్డు పెండింగ్‌లో ఉందని ఆర్అం డ్బీ ఎస్ఈ చందూలాల్ పేర్కొన్నారు. ఈ విషయం డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలి పారు. నాణ్యమైన పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త క్కువ కోట్ చేసే టెండర్‌దారుల నుంచి డిపాజిట్లు పెట్టేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఎస్ఎస్ఏ ద్వారా ఖర్చు చేసే నిధులు కాంట్రాక్టర్ల ఉపాధికే పరిమితమవుతున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం కావటం లేదన్నారు. పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించలేకపోతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులకు నామమాత్రమైన శిక్షణలతో సరిపుచ్చుతున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ లేదని, 2013లో బదిలీ అయిన టీచర్లు రిలీవ్ కాలేదని, సర్దుబాటుపై డీఈవో స్పందించడం లేదని అన్నారు. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వ పాలసీ వెల్లడైన అనంతరం అసలు కథ ఉంటుందని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. కేజీటూ పీజీ విద్యావిధానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి పాఠశాలలు మండలానికొకటి తెస్తామన్నారు. ఆ మిషన్లు ఏమయ్యాయి? మహిళల్లో క్యాన్సర్ కారకాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, శానిటరీ నాఫ్కిన్స్ తయారీలో పూర్తిగా వైపల్యం చెందిందని ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు మండలాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి రూ.3 కోట్లతో తెచ్చిన మిషన్లను నిరుపయోగంగా గదుల్లో వేసి తాళం వేశారని అన్నారు. ఈ విషయమై సంబంధిత డీఎంహెచ్‌వో అలీం మాట్లాడుతూ ఆ మిషన్ విలువ రూ.2.44 లక్షలని మాత్రమే నివేదికలో ఉందన్నారు. వెంటనే ఆరా తీసి నివేదికలు సమర్పించాలని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని, అవసరమైతే మరిన్ని ఎంపీ నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, సీపీవో సుబ్బారావు, టీఎస్‌ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మి, జడ్పీ సీఈవో అంబయ్య, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహనలు.. అసంతృప్తులు కేంద్రప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమవేశంలోనే పలువురు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగింది. అసలు తనకేమీ తెలియడం లేదని స్వయంగా పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్ చెప్పడం విశేషం. కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు కూడా అధికారులు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విన్నారు. వివిధ పథకాలపై జరిగిన సమీక్షలో ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏఏవై పథకం కింద గ్రామాలలో మైనార్టీలకు చెందిన గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకా రూ.4 కోట్ల నిధులు మిగిలాయని, సంబంధిత ప్రజాప్రతినిధుల సహాకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాలుగు మండలాల్లోని గ్రామాలకు రూ.24.97 కోట్లు వాటర్‌షెడ్ పథకానికి రెండు నెలల క్రితం మంజూరు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లోని అక్కన్నపేట, భీమదేవరపల్లిలోని గట్లనర్సింగాపూర్, సిరిసిల్లలోని తాడూర్, బెజ్జంకిలోని దాచారం గ్రామాలకు దాదాపు రూ.7 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వాటర్ షెడ్ పనుల కోసం వచ్చే నిధులు 90 శాతం దుర్వినియోగమవుతున్నాయని, అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధితోపాటు వారు ఎదర్కుంటున్న సాంఘిక సమస్యలపై దృష్టిసారించాలన్నారు. గ్రామీణ విద్యుదీకరణ పథకం పూర్తిప్రణాళిక నివేదిక ప్రతిని తనకు అందజేయాలని ఎస్ఈకి సూచించారు. మోడ ల్ స్కూళ్లలో నిబంధనలను అనుసరించి విద్యార్థుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం మెరుగుదలకు తగిన సూచనలు అందించాలని డీఈవోను కోరారు. వచ్చే సమావేశంలో చర్చలుండవని, చర్యలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేశారని, ఈ సారి గంపగుత్తగా కేంద్రమిచ్చే నిధులను ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగమైతే సహించేది లేదన్నారు.