బీజేపీనేతలు రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు: గాలి | BJP leaders are criticizing for only politics: gali | Sakshi
Sakshi News home page

బీజేపీనేతలు రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు: గాలి

Dec 28 2017 2:36 PM | Updated on Aug 10 2018 8:34 PM

BJP leaders are criticizing for only politics: gali - Sakshi

సాక్షి, అమరావతి : పోల‌వ‌రం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బాగా ప‌ని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కితాబిచ్చారు. కొంత‌మంది బీజేపీ నాయకులే రాజ‌కీయం కోస‌ం విమ‌ర్శ‌లు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో కేంద్రానికి లెక్క‌లు చెబుతున్నామని, అయినా ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు చెప్పాలంటే కుద‌ర‌దని స్పష్టం చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్త‌నం చెయ్య‌టం మంచిది కాదని సూచించారు.

 మ‌నం క‌ట్టిన డ‌బ్బులో నుంచి కేంద్రం  కొంత రాష్ట్రాలకు ఇస్తుందని వెల్లడించారు. ఇండియాలో మ‌న ఒక భాగం అని, మ‌నం కూడా ట్యాక్సులు క‌డుతున్నామని గుర్తుచేశారు. మ‌న ద‌గ్గ‌ర కూడా కేంద్రం డ‌బ్బులు తీసుకుంటుందని చెప్పారు. ఇది ఒక వ్య‌క్తి ఎస్టేట్ కాదని, ఇక్క‌డ అసెంబ్లీ, మంత్రులు, అధికారులు ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కేంద్రం పంపిన ఐఎస్ఎస్‌లు కూడా ఉన్నారని చెప్పారు. కేంద్రం మ‌మ్మ‌ల్ని న‌మ్మాలని..డ‌బ్బులు కూడా విడుద‌ల చెయ్యాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement