polavam project
-
బాబూ.. కేంద్రం వద్ద తలవంచడానికి కారణమేంటి?: కారుమూరి
సాక్షి, తాడేపల్లి: పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో కేంద్రం నిర్ణయానికి చంద్రబాబు ఎందుకు తలవంచారో తెలియాలన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోందని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కారుమూరి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదు. పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పోలవరం అంగుళం ఎత్తు తగ్గినా ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్రానికి చంద్రబాబు ఎందుకు తలొంచారో తెలియాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. చంద్రబాబు ప్రీమియం చెల్లించకుండా రైతులను నష్టపరిచారు.ఏపీలో ఈక్రాప్‌తో సహా ఏదీ ఈ ప్రభుత్వం చేయటంలేదు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం కొనుగోలులోనూ రైతులపై రకరకాల వేధింపులకు దిగారు. రైతుల ఉసురు తీయవద్దు. సూపర్ సిక్స్‌లో రైతులకు 20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. రైతులకు చేయాల్సినవి అన్నీ చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు. -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, యాఫ్రి సంస్థ ప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ అశ్వనీకుమార్, జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), వ్యాప్కోస్ అధికారులతో కలిసి అంతర్జాతీయ నిపుణులు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, లీకేజీలను నిశితంగా పరిశీలించారు.ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టడానికిముందు లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరద ఉధృతి గరిష్ఠంగా ఉన్నప్పుడు, కనిష్ఠంగా ఉన్నప్పుడు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీల స్థాయి ఎంత ఉందని అడిగారు. కాఫర్ డ్యామ్‌ల లీకేజీలను తెలుసుకోవడానికి ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ఫలితాలపై ఆరా తీశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి, మ్యాప్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు.అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పరిస్థితిపై జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, అధికారులతో సమీక్షించారు. సోమవారం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లను పరిశీలించి, కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను నింపి వైబ్రోకాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చిన పనులను తనిఖీ చేయనున్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో కోతకుగురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను పరిశీలించనున్నారు. -
చంద్రబాబు తప్పిదాలు రామోజీకి కనబడవా?: మంత్రి అంబటి ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. నిత్యం ఈనాడు అసత్య కథనాలను వండివారుస్తోందని ఫైరయ్యారు. బాబు చేసిన తప్పిదం ఎల్లోమీడియాకు కనబడలేదా? అంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. నిత్యం ఈనాడు అసత్య కథనాలను వండివారుస్తోంది. పోలవరం నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం అనే తప్పిదాలు చేసింది. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం నిర్మాణంలో తీవ్ర నష్టం జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో బాబు చేసిన తప్పదం ఎల్లో మీడియాకు కనబడలేదా?. టీడీపీ హయాంలో తప్పిదాలు రామోజీకి కనబడవా?. చంద్రబాబు తప్పిదాల వల్ల రూ.2020 కోట్ల నష్టం వాటిల్లింది. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదు. బాబు చేసిన తప్పిదాలను మేము సరిచేస్తున్నాం. తొలి దశ పనులకు కేంద్రం రూ.12,911 కోట్లు విడుదల చేసింది. అదనంగా రూ.5127 కోట్లు విడుదల చేయాలని కోరాం. త్వరితగతిన పోలవరం తొలిదశ పనులు పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతోనే నిధుల కొరత సమస్య తీరింది. పోలవరం చూస్తామంటూ టీడీపీ పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది. ప్రచార యావ కోసమే టీడీపీ హంగామా సృష్టిస్తోంది. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలి. కేవలం కడుపు మంటతోనే రామోజీ అసత్య కథనాలు రాస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: లోకేశ్ కోసమేనా ఇంత హైప్.. ఇంతటి దరిద్రమా బాబు! -
ప్రాజెక్టు పనులపై కాసేపట్లో అధికారులతో సీఎం జగన్ సమీక్ష
-
సీఎం జగన్ హయాంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
-
పోలవరం వ్యయం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం నుంచి విశాఖపట్నం నగరానికి మంచి నీరు అందించేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టేసింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం తామే భరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం ఉల్లంఘిస్తే, దానికి కట్టుబడి ఉండాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం, పార్లమెంట్లో ఇచి్చన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయంలో విశాఖ నగరానికి తాగు నీరు అందించేందుకు అయ్యే వ్యయాన్ని అంతర్భాగంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన రమేష్‌చంద్ర వర్మ దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ ప్రజల దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను పోలవరం ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్లో చెప్పిందన్నారు. అయితే ఈ హామీ నుంచి కేంద్రం ఇప్పుడు తప్పుకుందన్నారు. ఇది కూడా చదవండి: పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
‘పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది’
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు మహానేత వైఎస్సార్ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్సార్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్ నిధులు కేంద్రం నుంచి రావాలి అని స్పష్టం చేశారు. పోలవరం చంద్రబాబు ఏటీఎం.. ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. పోలవరానికి అయ్యే ప్రతీ పైసాను కేంద్రమే భరిస్తుంది అని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా మేమే కడతాం అని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?. 2013, 2014 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. అందుకు చంద్రబాబుకు కూడా అంగీకరించారు. తర్వాత పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. చంద్రబాబు హయాంలో 48 శాతం మాత్రమే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. పోలవరాన్ని తామే నిర్మాస్తామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో దోచుకో.. పంచుకో.. తినుకో అన్న పద్దతిలో పోలవరం నిధులను చంద్రబాబు కాజేశారు. రామోజీ బంధువుదే నవయుగ.. రామోజీకి అత్యంత సమీప బంధువులదే నవయుగ కంపెనీ. అలాంటి నవయుగ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారు. చంద్రబాబుకు డబ్బులు కావాల్సినప్పుడల్లా పోలవరం నిధులను వాడుకున్నారు. టీడీపీ హయాంలో డయాఫ్రం వాల్ నిర్మాణం కాకుండానే కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే గత వరదల్లో తీవ్ర నష్టం జరిగింది. మీరు నాశనం చేసిన డయాఫ్రం వాల్‌ను మేము కట్టాము. టీడీపీ తప్పిదం వల్ల రూ.2022 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: లోకేష్ యాత్రలో డబ్బుల గోల.. సోషల్ మీడియాలో వైరల్ -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనపు నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.61,071.51 కోట్లు అవసరమని గత సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొందని, తమ ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని తెలియ చేశామన్నారు. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం వివిధ పనులు, పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి రూ.50 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందువల్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30 గంటల సమయంలో 7, లోక్ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. సుహృద్భావ వాతావరణంలో సాయంత్రం 5.50 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. గోదావరి–కృష్ణా అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీతోపాటు పలు అంశాలపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలు ఇవీ.. కృష్ణా – గోదావరి అనుసంధానానికి నిధులివ్వండి.. ►కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి. ►గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,780 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుంది. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి.. ►పోలవరం పనుల్లో 2014–19 మధ్య అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాం. ►పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికే రూ.838 కోట్లు ఆదా అయ్యాయి. ఇందులో హెడ్ వర్క్స్, హైడ్రో పవర్ ప్రాజెక్టు పనుల్లో రూ.780 కోట్లు ఆదా కాగా, లెఫ్ట్ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయి. ►పోలవరం కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.5,103 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలి. ►పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించాం. వరదలు తగ్గగానే పనులు ప్రారంభించి శరవేగంగా చేసేందుకు ఈ ఏడాది రూ.16 వేల కోట్లు విడుదల చేయాలి. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. ►రూ.55,548 కోట్లతో ప్రతిపాదించిన పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఇందులో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి.. ►విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులను కేంద్రమే నిర్మించాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలి. ►విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌లకు తగిన రీతిలో నిధులు విడుదల చేయాలి. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరుతున్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఊతమివ్వండి.. ►ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారు. బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. కానీ, ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందువల్ల ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ►ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఆరేళ్లలో రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా నిధులు విడుదల చేసి ఈ జిల్లాల అభివృద్ధికి ఊతమివ్వాలి. నవరత్నాలకు చేయూత ఇవ్వండి.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రకటించిన నవరత్నాలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించాలి. కేంద్రం తరఫున సహకారం అందించాలి. హోదాతోనే సమగ్రాభివృద్ధి.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మీకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాం. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలి.. రాజధాని నిర్మాణం కోసం రూ. 2,500 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరతాం. ఆ మేరకు నిధులు విడుదల చేసి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలి. రెవెన్యూ లోటు భర్తీ చేయండి.. రెవెన్యూ లోటు కింద ఇంకా రూ.18,969.26 కోట్లను విడుదల చేయాలి. సవరించిన లెక్కల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం.. వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించేందుకు ఈనెల 15న రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. అయితే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తుండటం... మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఊపిరిసలపనంత బిజీగా ఉన్నందున రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, అదనపు కార్యదర్శి కె. ధనుంజయరెడ్డి, ఏపీ భవన్ ఓఎస్డీ భావన సక్సేనా తదితరులున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 9.25 సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
మహా నేత సంకల్పం.. పోలవరం
సాక్షి, అమరావతి : డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన ‘జల యజ్ఞం’ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది పోలవరం. మిగతావాటి అన్నింటి కంటే బృహత్తరమైనది కావడంతో ఆయన దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అప్పటివరకు కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ, సహాయ పునరావాస ప్యాకేజీ సహా అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించి పనులకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. జాతీయ ప్రాజెక్టు హోదా వస్తే నిధుల కొరత అధిగమించవచ్చన్న భావనతో అందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతి కూడా సాధించారు. కేంద్రం నుంచి నేడో, రేపో ఆ మేరకు ప్రకటన కూడా రానుందనగా ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్ 90 (1)లో ఆనాటి యూపీఏ–2 ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ, విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు నిర్మాణాన్ని తన ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా సీఎం చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టారు. దీనికిముందు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇదీ వైఎస్ ముద్ర 2004–05 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.10,151.04 కోట్లు. బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాబట్టి జాతీయ హోదా సాధిస్తే 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. దీంతో శరవేగంగా పూర్తి చేయొచ్చని వైఎస్ భావించారు. నిబంధనల మేరకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలంటే అన్ని అనుమతులుండాలి. దాంతో ‘సైట్ క్లియరెన్స్’ను సెప్టెంబరు 19, 2005న, అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్ 25, 2005న, అభయారణ్య అనుమతిని జూలై 6, 2007న, సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్ 17, 2007న అనుమతి సాధించారు. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి ఒక్కటీ వస్తే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం ఖాయం. దానికోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు సర్దుబాటు చేశారు. జలాశయం నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూమిలో సింహభాగం, కుడి, ఎడమ కాలువల పనుల కోసం అవసరమైన భూమిలో 80 శాతం సేకరించారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నాగాలకు తెరతీశారు. కుడి కాలువ తవ్వకానికి అవసరమైన భూ సేకరణకు వ్యరేతికంగా కోర్టును ఆశ్రయించేలా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని రెండు మండలాలకు చెందిన తన సామాజికవర్గ రైతులను రెచ్చగొట్టారు. అయినా సరే వైఎస్... కుడి కాలువను 145 కి.మీ. పొడవునా, ఎడమ కాలువను 134 కి.మీ. పొడవునా లైనింగ్ సహా పూర్తి చేశారు. హెడ్ వర్క్స్ (జలాశయం) పనులకు ప్రయత్నిస్తూనే ఫిబ్రవరి 25, 2009న కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతిని సాధించారు. మరే ఆటంకం లేకపోవడంతో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంతలోనే 2009 ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అది వాయిదా పడింది. ఆ ఎన్నికల్లో వైఎస్ గెలవడం, ఒకట్రెండు రోజుల్లో పోలవరానికి జాతీయ హోదా ప్రకటన చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో అమరుడయ్యారు. మహా నేత సంకల్పం వైఎస్ చాలా ముందుచూపుతో పోలవరాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కుడి కాలువ ద్వారా రోజూ 17,633 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 17,561 క్యూసెక్కులు తరలించవచ్చు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తూ, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. విశాఖపట్నం నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమే కాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చు. 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమూ పోలవరంతోనే సాధ్యం. వైఎస్ ఏం చేశారు? పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణ పనులను 2005లో దివంగత మహానేత వైఎస్ ప్రారంభించారు. వాటికి సమాంతరంగా కుడి, ఎడమ కాలువ పనులు చేపట్టారు. తద్వారా తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారానికి నడుంబిగించారు. 2005లో రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టారు. ప్రణాళిక ప్రకారం వెళ్తూ ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చూశారు. రూ.5,135.87 కోట్లతో 44.84 శాతం పనులు పూర్తి చేయించారు. జాతీయ ప్రాజెక్టు హోదా సాధనకు అన్ని అనుమతులు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. – ఆలమూరు రామగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి -
బీజేపీనేతలు రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు: గాలి
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా పని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కితాబిచ్చారు. కొంతమంది బీజేపీ నాయకులే రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో కేంద్రానికి లెక్కలు చెబుతున్నామని, అయినా ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాలంటే కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెయ్యటం మంచిది కాదని సూచించారు. మనం కట్టిన డబ్బులో నుంచి కేంద్రం కొంత రాష్ట్రాలకు ఇస్తుందని వెల్లడించారు. ఇండియాలో మన ఒక భాగం అని, మనం కూడా ట్యాక్సులు కడుతున్నామని గుర్తుచేశారు. మన దగ్గర కూడా కేంద్రం డబ్బులు తీసుకుంటుందని చెప్పారు. ఇది ఒక వ్యక్తి ఎస్టేట్ కాదని, ఇక్కడ అసెంబ్లీ, మంత్రులు, అధికారులు ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కేంద్రం పంపిన ఐఎస్ఎస్లు కూడా ఉన్నారని చెప్పారు. కేంద్రం మమ్మల్ని నమ్మాలని..డబ్బులు కూడా విడుదల చెయ్యాలని విన్నవించారు. -
పోలవరంపై విచారణ జరిపితే బాబు జైలుకే
సాక్షి, విజయవాడ : పోలవరంపై విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా జైలుకు వెళ్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై విలేకరులతో మాట్లాడారు. పోలవరం కడితే 800 టీఎంసీలు వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమన్నారు. శ్రీ రాంసాగర్ తరువాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 లోనే పోలవరం టెండర్లు పిలిచి, ఒక్కో అనుమతిని ఆయనే సాధించారని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాలకు ఇచ్చే పునరావాసం ఖర్చుకు ఆనాడే ముందు చూపుతో వైఎస్ఆర్ లెక్కగట్టి ప్రాజెక్ట్ ఖర్చులో చూపించారని తెలిపారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలకు కూడా వైఎస్ఆర్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష ఆరోపణలను కేంద్రం ప్రశ్నిస్తోంది.. 2014లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టిన పోలవరంను రాష్ట్రం ఎందుకు కడతామని పట్టుబట్టిందని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెబితే బాబు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖల్లో అమర్జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్ లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టారని ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారని ఉండవల్లి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ నోటిఫికేషన్ లో 1300 కోట్లని, వెబ్సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని, కేవలం కాంట్రాక్టుల కోసమే అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం కూడా అడుగుతోందన్నారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. పోలవరంతో ఏపీ సస్యశ్యామలం.. 1600 కోట్లు పట్టిసీమ కోసం, 1800 కోట్లు పురుషోత్తం పట్నంకు కేటాయించారన్న ఉండవల్లి.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి రాసిన లేఖలో పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారని, ఈ ప్రాజెక్టులు సరిపోతాయి తప్ప, పోలవరం అక్కరలేదని లేఖలో ప్రస్తావించారని తెలిపారు. 17,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యం తో ఆనాడు పోలవరం కాలువలను వైఎస్ఆర్ తవ్వించారని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. పనులు చేయకపోతే తప్పించండి.. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనిచేయడం లేదని తెలిస్తే, సదరు కంపెనీతో మాట్లాడి తప్పించాలన్నారు. ఆనాడు వైఎస్ఆర్ పోలవరం పనులు చేయడం లేదని టిడిపి నేత నామా నాగేశ్వరరావు కంపెనీని పిలిచి, పనుల నుంచి తప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇకనైనా పోలవరంపై నిజాలను ప్రజలతో పంచుకోవాలని హితవు పలికారు. సాక్షాత్తు బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్ళు తెరవడం లేదన్నారు. ఇప్పటికైన పోలవరంపై చంద్రబాబు శ్వేత పత్రం ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. 2.16లక్షల కోట్లు ఈ మూడేళ్ళలో రాష్ట్రం చేసిన అప్పులని. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయో.. లెక్కలు చెప్పాలన్నారు. యూపీఏ ప్రభుత్వం ముందు చూపు.. యూపీఏ ప్రభుత్వం తన ఆఖరి కేబినెట్ సమావేశంలో పోలవరం నిర్మాణంకు ఎంత ఖర్చుఅయితే అంతా కేంద్రమే భరించాలని తీర్మానించి చట్టం చేసిందన్నారు. దీనిని గమనించకుండా చంద్రబాబు నీతి అయోగ్ ద్వారా రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపట్టేందుకు అంగీకారం తెలిపాడన్నారు. ఏడు ముంపు మండలాలను 2014 మార్చి 1న ఏపీలో విలీనం చేస్తూ యూపీఏ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కు రాష్ట్రపతికి పంపారని, అసెంబ్లీ అభిప్రాయం లేదని అధికారులు దానిని పక్కన పెట్టారని ఉండవల్లి గుర్తు చేశారు. మే 28న జైరాం రమేష్ చొరవ తీసుకుని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చెప్పి ముంపు మండలాలపై ఎన్డీఎ ప్రభుత్వం ద్వారా ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. ఇది తన ఘనతే అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై స్పందిస్తూ.. మంజునాథ్ నివేదిక లేకుండా కమిషన్ రిపోర్ట్‌కు చట్ట బద్దత ఏమేరకు ఉంటుందని ప్రశ్నించారు. చట్టాలపై గౌరవం లేకుండా బాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. -
‘డ్రామాలకు తెరలేపిన బాబు’
సాక్షి, కర్నూలు: కమీషన్ల కోసమే సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు చేపట్టారని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లోగా ప్రాజెక్టు పూర్తికాదని తెలుసుకున్న చంద్రబాబు కేంద్రం పై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్లే పోలవరంపై ప్రజలకు అంచనాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇంత కాలమైనా ప్రాజెక్టు కోసం సీఎం భూసేకరణ ఎందుకు చేయలేదని ఎంపీ ప్రశ్నించారు. పోలవరంపై మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేమిటి అని ఆయన ధ్వజమెత్తారు. 2019లోగా ప్రాజెక్టు పూర్తికాదని తెలిసే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆయన నిప్పులు చెరిగారు. గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బాబు రెండు నాలుకల ధోరణి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై శివాలెత్తి 24 గంటలు గడవక ముందే ఆయన స్వరం మార్చారు. కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయవద్దని, సంయమనం పాటించాలని నేతలకు హుకుం జారీ చేశారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పై ప్రకటన సమయంలో కేంద్రానికి ఓ నమస్కారమంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించగా.. పలువురు టీడీపీ నేతలు మద్దతు ప్రకటిస్తూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే డ్యామేజ్ కంట్రోల్‌కి దిగిన చంద్రబాబు కేంద్రం విషయంలో విమర్శలు చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. -
ఆగని అక్రమం
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసింది.ఇసుక తవ్వకూడని ప్రాంతాలను గుర్తిస్తూ హద్దులు నిర్ణయించింది. హద్దుల వెంబడి కర్రలు సైతం పాతించింది. అయినా.. ఇసుకాసురులు ఆగటం లేదు. చిత్తం వచ్చినట్టు చెలరేగిపోతూ పెద్దఎత్తున ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రమాదం ముంచుకొస్తుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా.. అక్రమార్కులకు లోపాయికారీగా సహకారం అందిస్తున్నారు. ఫలితంగా పోలవరం గ్రామంలో అక్రమ తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నాయి. ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల ర్యాంపు నుంచి రేయింబవళ్లు ఇసుకను ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. గోదావరి లంక ఒడ్డున గట్టును ఎత్తుచేసి నెక్లెస్ బండ్ నిర్మించినా.. అక్రమార్కులు ప్రత్యేకంగా బాటలు వేసుకుని ర్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక అవసరాలు, అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు ట్రాక్టర్లపై తరలించి ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల్లో ఇసుకను లోడ్‌చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నిత్యం 150 నుంచి 200 ట్రాక్టర్ల ఇసుకను తవ్వుకుపోతున్నా కన్నెత్తి చూసిన అధికారులు లేరు. దీంతో గోదావరి నదిలో రెండు నుంచి మూడు మీటర్ల లోతున భారీ గోతులు ఏర్పడుతున్నాయి. కర్రల్ని మార్చేస్తున్నారు ఇసుక తవ్వకూడని ప్రదేశాల్లో సీడబ్ల్యూసీ అధికారులు మూడు రంగులు పూసిన కర్రలను ఇసుక తిన్నెలపై పాతారు. వాటిని ఇసుకాసురులు నిత్యం నది వెలుపలకు మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు ర్యాంపు మార్గంలో ఉన్న గేటుకు గతంలో తాళం వేశారు. ఆ మార్గంలో పెద్ద గొయ్యి తవ్వి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎన్ని నిబంధనలు ఉన్నా అక్రమార్కుల దందా కొనసాగుతూనే ఉంది. చివరకు సీడబ్ల్యూసీ అధికారులు హద్దులు నిర్ణయించినా బేఖాతరు చేస్తూ ఇసుకను తోడేస్తున్నారు. కూలీల సాయంతోనూ తవ్వకూడదు హద్దులు దాటి ఇసుక తవ్వేస్తున్న వైనాన్ని సీడబ్ల్యూసీ ఏఈ సి.సత్యమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకూడదన్నారు. పోలవరంలోని సీడబ్ల్యూసీ కార్యాలయ స్టేషన్ గేజ్ లైన్ ప్రకారం దిగువన అర కిలోమీటరు, ఎగువన అర కిలోమీటరు భాగంలో ఎలాంటి తవ్వకాలు చేయకూ డదన్నారు. దీనివల్ల నీరు ప్రవహించే మార్గం మారిపోయే ప్రమాదం ఉందన్నారు. స్టేషన్ గేజ్లైన్ ఇరువైపులా మార్కింగ్ ఇస్తూ కర్రలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హద్దులు దాటి ఇసుక తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇస్తామన్నారు.