సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం నుంచి విశాఖపట్నం నగరానికి మంచి నీరు అందించేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టేసింది.
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం తామే భరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం ఉల్లంఘిస్తే, దానికి కట్టుబడి ఉండాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం, పార్లమెంట్‌లో ఇచి్చన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయంలో విశాఖ నగరానికి తాగు నీరు అందించేందుకు అయ్యే వ్యయాన్ని అంతర్భాగంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన రమేష్‌చంద్ర వర్మ దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ ప్రజల దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను పోలవరం ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో చెప్పిందన్నారు. అయితే ఈ హామీ నుంచి కేంద్రం ఇప్పుడు తప్పుకుందన్నారు.
ఇది కూడా చదవండి: పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment