expenditure
-
రైతే 'రాజు'
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది. అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది. నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది. సర్వేలో తీసుకున్న అంశాలివీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది. ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. -
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
బాబు దుబారా భరించలేనంత..!
సాక్షి, అమరావతి: ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. గతంలో 2014 – 19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.హైదరాబాద్‌లో ఏడు నక్షత్రాల పార్క్ హయత్ హోటల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, స్టార్ హోటల్లో ఉంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం గమనార్హం. ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియాకు మచ్చుకు కూడా కనిపించడంలేదు. పైగా వైఎస్ జగన్ భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ దుష్ప్రచారానికి దిగారు.చంద్రబాబు 2014లో సీఎం అయిన తర్వాత హైదరాబాద్ మదీనాగూడలోని తన బంగ్లాను క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 65లోని తన ఇంటిని కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఇక విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌ను కూడా క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత లింగమనేని గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు, నివాస భవనంగా చేసుకున్నారు. వీటన్నింటికీ మరమ్మత్తులు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీస్ బరాక్ల నిర్మాణం, 24 గంటలు నిఘా ఏర్పాట్లు, విద్యుత్తు పనులు, విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో కంట్రోల్ ఎక్విప్మెంట్, రహదారుల నిర్మాణాలకు చంద్రబాబు ఆ ఐదేళ్లలో ఏకంగా 126.76 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమయంలో ఇష్టానుసారం క్యాంపు ఆఫీస్‌లకు కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని అప్పట్లోనే అధికార వర్గాలు తప్పుపట్టాయి. అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్ హౌస్‌ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకుని అక్కడ రోడ్ల నిర్మాణం, భద్రత కోసం ఏకంగా రూ.10 కోట్లు వ్యయం చేశారు.కార్యాలయాల పేరుతో సెక్యూరిటీ తదితరాలకు 2014–19 మధ్య చంద్రబాబు చేసిన కొన్ని ఖర్చులు ఇలా.. ఇదంతా జీవోల ద్వారా చేసిన ఖర్చే..» హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం (ఎల్ బ్లాక్)రూ.14.63 కోట్లు»సీఎం కోసంహైదరాబాద్ సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు»హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు»సీఎం కార్యాలయం ఫర్నిచర్‌కు రూ.10.00 కోట్లు»మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లిహిల్స్ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు»విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్, కలెక్టరేట్లో సీఎం క్యాంపు ఆఫీసులకు రూ.42.00 కోట్లు»లింగమనేని గెస్ట్ హౌస్‌కు రూ.10.00 కోట్లు»హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్లో బసకురూ.30.00 కోట్లు -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్‌బౌండ్) టూరిజం మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్‌లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్‌ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్‌ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
ఆహారంపై భారీగా తగ్గిన వ్యయాలు
కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అయితే ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా కుటుంబాలు ఆహారంపై సగటున చేసే వ్యయాలు 1947 నాటితో పోలిస్తే తొలిసారిగా సగానికి పైగా తగ్గినట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఒక వర్కింగ్ పేపర్లో వెల్లడించింది.దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలవారీగా చేసే మొత్తం వ్యయాల్లో ఆహారానికి వెచ్చించేది భారీగా తగ్గింది. అట్టడుగున ఉండే 20 శాతం మంది విషయంలో ఇది మరింత గణనీయంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోని వారికి, ముఖ్యంగా అట్టడుగు 20 శాతం కుటుంబాలపై ప్రధానంగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత పాలసీలు సమర్ధమంతంగా అమలవుతుండటాన్ని ఇది ప్రతిఫలిస్తోందని వర్కింగ్ పేపర్ పేర్కొంది.వివిధ వర్గాల్లో తృణధాన్యాల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి తగు సాగు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించింది. 2011–12 నాటి వినియోగ ధోరణులను 2022–23తో పోలుస్తూ ఈ పేపర్ సమగ్రంగా విశ్లేషించింది. -
ఎన్నికల వేళాపేదల సంక్షేమం
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి రూ.37, 699.55 కోట్ల వ్యయం చేసి టాప్‌లో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రూ.32,800.46 కోట్ల వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందుగానే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది. -
అంతా అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్‌నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్‌కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా. ‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్‌ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు. 2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్‌కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్‌గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో డబుల్స్‌లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. -
కేటాయించినవి ఖర్చు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను తన నివేదికలో అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కేటాయింపులు, ఖర్చులు ఇష్టారాజ్యంగా జరిగాయని, కొన్ని పద్దుల్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని, కొన్ని పద్దుల్లో మాత్రం అసెంబ్లీ ఆమోదం పొందకుండానే ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టిందని ఆక్షేపించింది.డబుల్‌బెడ్ రూం ఇళ్లకు రూ.11వేల కోట్లు, గొర్రెలు, మేకల కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, ఆయిల్‌పామ్ పెంపకానికి రూ.1000 కోట్లు, దళిత బంధు కింద రూ. 15,700 కోట్లు, రైతులకు రుణమాఫీ కింద కేటాయించిన రూ.3,964 కోట్లు ఖర్చు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. 2014–21 వరకు రూ.2,89,115 కోట్ల అధిక వ్యయం జరిగిందని కూడా వెల్లడించింది. గత మూడేళ్ల పన్నేతర రాబడుల అంచనాలను భారీగా వేశారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లు రాకపోయినా అవే అంచనాలను రూపొందించారని తెలిపింది.సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లు ఎక్కువగా పెరిగిందని, పాలమూరు–రంగారెడ్డికి రూ.12,937 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,370 కోట్ల మూలధన వ్యయం ఎక్కువగా జరిగిందని వెల్లడించింది. ద్రవ్యలోటును ఆ ఆర్థిక ఏడాదిలో రూ.2,749 కోట్లు తక్కువగా చూపెట్టారని తెలిపింది.2022–23 ఆర్థిక సంవత్సరంలో అనివార్య ఖర్చులు 43 శాతానికి చేరాయని, రుణాలు, అడ్వాన్సులు 150 శాతం పెరిగి మొత్తం బడ్జెట్లో 11 శాతానికి చేరాయని వెల్లడించింది. బడ్జెట్ వెలుపలి రుణాల విషయంలో స్పష్టత లేదని, డిస్కంల అప్పులను రూ.16వేల కోట్ల మేర తక్కువగా చూపెట్టారని కూడా కాగ్ ఆక్షేపించింది. ఈ మేరకు రెవెన్యూ, ఆర్థిక రంగాల కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పురపాలకశాఖ ఖర్చు చేసింది రూ. 7,990 కోట్లుపురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 2022–23 సంవత్సరంలో కేటాయించిన రూ.10,591 కోట్లలో ఖర్చు చేసిన మొత్తం రూ. 7,990 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రాంట్ కింద కేటాయించిన ఈ మొత్తంలో రూ. 3,832 కోట్లు సరెండర్ చేసిన మొత్తంగా పేర్కొంది. ఇందులో మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ. 500 కోట్లు పనులు ప్రారంభించనందున ఖర్చు కాలేదు.ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ.378 కోట్లు కూడా అదే పరిస్థితిలో ఖర్చు కాలేదు. ఓఆర్ఆర్కు కేటాయించిన రూ.200 కోట్లు విడుదల కాలేదు. హైదరాబాద్ పట్టణ సముదాయం కోసం కేటాయించిన రూ.151 కోట్లు, భూముల సేకరణకు కేటాయించిన రూ.100 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి. మూలధన విభాగం కింద రూ.151 కోట్లలో కేవలం రూ. 20,000 మాత్రమే వినియోగించబడినట్టు తెలిపింది.కాంపాలో మిగిలిన రూ.1,114 కోట్ల బ్యాలెన్స్2022–23 ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రత్యామ్నాయ అటవీకరణ నిధిలో (కాంపా) రూ.1,114 కోట్ల మొత్తం మేర బ్యాలెన్స్ మిగిలిపోయిందని కాగ్ పేర్కొంది. ఈ ఏడాది సందర్భంగా రూ.68 కోట్లు ఈ నిధిలోకి జమచేసి, మొత్తంగా ఈ నిధినుంచి రూ.404 కోట్లు కేటాయించిందని తెలిపింది. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ‘స్టేట్ కాంపన్సెటరీ అఫారెస్టెషన్ ఫండ్’ను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. -
జూన్ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్ బడ్జెట్ లక్ష్యం. విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది. -
25 కోట్ల కుటుంబాలకు ఐటీసీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్‌లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్‌ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్బుక్లలో క్లాస్మేట్, నూడుల్స్‌లో ఇప్పీ, బాడీవాష్లో ఫియామా, అగర్‌బత్తీల్లో మంగళ్‌దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగం పుంజుకుంటుంది.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. ‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది. -
పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్దకాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ(హెచ్సీఈఎస్) నివేదిక వెల్లడించింది. 2011–12 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వినియోగ వ్యయం 9.20శాతం పెరిగింది. కాగా, ఇతర వర్గాల్లో 8.5శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహావసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందని తెలిపింది. హెచ్సీఈఎస్ నివేదికలోని ప్రధాన అంశాలు » 2011–12 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం (ఎంపీసీఈ) రూ.1,430 ఉండగా, 2022–23లో రూ.3,773కు పెరిగింది. » పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011–12లో రూ.2,630 ఉండగా, 2022–23లో రూ.6,459కు పెరిగింది. » గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం ఆహార పదార్థాలకు, 54శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. » పట్టణ ప్రాంతాల్లో 39శాతం ఆహార పదార్థాలకు, 61శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. » సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ చివరి స్థానంలో ఉంది. » ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,870 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.6,782లుగా ఉంది. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్‌లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్‌తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్‌లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్‌కి పంజాబ్‌లోని జలంధర్‌లో రూ.15. అదే మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్‌లో రూ.15 అయితే మధ్యప్రదేశ్‌లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్‌లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్‌లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్‌తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్‌లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్‌లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్‌జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌజ్‌లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్లు హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్ అదిరిపోయే కలర్‌ఫుల్ ఫ్లవర్ సెట్టింగ్స్ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్‌లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది. -
సామాజిక హితం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. జీతభత్యాలు భారీగానే.. ► ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. ► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. ► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. ► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. -
తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం. అలాగే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. అప్పులు ఇలా..! ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది. మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే. ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్‌ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
అది పార్టీ సభా..లేక కుల సభా..
అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు.. కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ. -
ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!
బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53) గుర్తున్నాడా. గే కపుల్‌గా క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్ సందర్భంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం 28 కోట్ల రూపాయలకు పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్‌ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023 సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్లో తన ఫియాన్సీ స్కాట్ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ ఆడి ఆర్8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్ సందర్భంగా ఆస్పెస్కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్‌లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్మెంట్, కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కొనుగోలు చేశాడు. ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్, లెక్కలేనన్ని దుస్తులు, లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు. దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు వెల్లడించాడు. బారీ డ్రూవిట్-బార్లో టోనీ రికార్డులు, పిల్లలు బ్రిటన్‌లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి గే కపుల్‌గా రికార్డు సృష్టించారు. దాదాపు 11 సంవత్సరాలు కలిసి వున్న తరువాత పిల్లల్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ 1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా కవలలు సాఫ్రాన్, ఆస్పెన్ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్ -1, పేరెంట్-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది. ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు అంతర్జాతీయ స్పెర్మ్ డోనర్‌గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల ప్రకటించాడు బారీ. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు. కూతురు సాఫ్రాన్ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్‌తో ప్రేమ కారణంగా 2019లో టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట. కొడుకు కోసం ఏకంగా రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్‌గా ఇచ్చాడు పుట్టిన రెండు రోజులకే మిలియనీర్ క్లబ్లో మనవరాలు అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్‌గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్‌ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడం అప్పట్లో వైరల్ అయింది.ఈ భవనంలో పాపాయికి సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఆ సీట్లలో రూ.కోట్ల వరద
సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండగకు కొత్త నిర్వచనం నోట్ల పండగ. ఎన్నికలు వచ్చాయంటే గ్రేటర్లో నోట్ల వర్షమే కురుస్తోంది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.50–75 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ.150–200 కోట్ల వరకు వ్యయం కానుందని విశ్లేషకుల అంచనా. ఈ మేరకు వెచ్చించగల సత్తా, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారినే అభ్యర్థులుగా ఆయా రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి గ్రేటర్ హైదరాబాద్‌లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. పాతబస్తీ, రిజర్వ్ స్థానాలు మినహా మిగిలిన గ్రేటర్ నియోజకవర్గాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో నోట్ల వరద పారనుంది. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తాయిలాలు పంపిణీ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రతి రోజు కార్యకర్తలు, అనుచరుల బాగోగులు చూసు కోవడం తప్పనిసరిగా మారింది. పెట్రోల్ బంక్‌లలో ఇంధనం వైన్స్, బెల్ట్ షాపులలో మద్యాన్ని పద్దు రూపేణా ఆయా దుకాణాలు, బంకుల యజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవేగాకుండా నియోజకవర్గ కేంద్రం సహా మండలం, వార్డుకు, పంచాయితీకో క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు బ్రేక్ ఫాస్ట్ మొదలు రాత్రి విందు, మందు వరకు ఫ్రీ. మరోవైపు ప్రచారరథాలు, ప్రజలను సమీకరణకు లారీలు, డీసీఎం వంటి వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలకు తెలంగాణ పేరుగాంచింది. గతేడాది నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టాయి. ఒక్కో ఓటుకు రెండు పార్టీలు కలిపి రూ.10 వేల వరకూ ఓటర్‌కు అందించినట్లు, మొత్తంగా రూ.600 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే నవంబర్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులకే టికెట్లను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ప్రకారం.. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల మధ్య ఖర్చు చేశాయని తెలిపింది. 2013 ఎన్నికల వ్యయం కంటే ఇది రెండింతలు అని పేర్కొంది. విభాగాల వారీగా తాయిలాలు.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్దేశించిన రూ.40 లక్షలకు మించి వ్యయం చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా కరెంట్ ఖాతాను తెరవాలి. వ్యయ, నిర్వహణ రికార్డులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈసీ నిర్ణయించిన మొత్తానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది జగమెరిగిన సత్యం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను వర్గాల వారీగా విభజించి వారిని ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు చీరలు, వెండి, బంగారం, కుట్టు మిషన్లు, కుక్కర్లు, మిక్సీలు వంటి గృహోపకరాలను అందిస్తుంటే... యువత కోసం గిఫ్ట్ కూపన్లు, ఆట వస్తువుల పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరాలు, దసరా, దీపావళి బహుమతులు, బాణాసంచాలు అందిస్తున్నారు. ఆ సెగ్మెంట్లపై ఈసీ స్పెషల్ ఫోకస్ గ్రేటర్లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులు అత్యధిక వ్యయం ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఈ నియోజక వర్గాలలో సగటున ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువే అయినప్పటికీ రాజకీయ పార్టీలు వెచ్చించే సొమ్ము మాత్రం ఎక్కువగా ఉంటుంది.