రాబడులు ఓకే.. గత నిధుల వినియోగమే లేదు: కాగ్ | previous funds didnt utilised: cag | Sakshi
Sakshi News home page

రాబడులు ఓకే.. గత నిధుల వినియోగమే లేదు: కాగ్

Published Thu, Mar 26 2015 11:17 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవిన్యూ రాబడులు పెరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం గురువారం సభ ముందు ఉంచింది.

హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవిన్యూ రాబడులు పెరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం గురువారం సభ ముందు ఉంచింది. రెవిన్యూ రాబడులు ఏడాది 6.63శాతం పెరిగాయని, రూ.6,889 కోట్ల మేర రాబడులు పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, నిధుల వినియోగం ఆశించినంతగా జరగలేదని కాగ్ పేర్కొంది. ఇక నీటి పారుదల, రహదారుల విభాగాల్లో నిర్మాణపనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని వెల్లడించింది.

2014 మార్చి నాటికి అసంపూర్తిగా ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పెట్టుబడులు రూ.82,665 కోట్లుగా కాగ్ స్పష్టం చేసింది. దీంతోపాటు 2013-14లో కేటాయించిన నిధులను కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని తెలిపింది.  వైద్యారోగ్య ప్రమాణాలను ఏ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోనూ పాటించలేదని పేర్కొంది. ఔషదాలు, మందుల నిర్దేశిత ప్రమాణాలను వైద్య కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులు పాటించలేదని వివరించింది. వైద్య సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయలేదని తెలిపింది.

ఎస్టీ సబ్ ప్లాన్ కు 6.6శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఐదేళ్లలో 3.9 మాత్రమే కేటాయించారని వివరించారు. ఐటీడీఏ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని వివరించారు. 2009-14 మధ్య కాలంలో పాఠశాల భవన నిర్మాణాలు 19శాతం మాత్రమే పూర్తయ్యాయని, బంగారు తల్లి పథకం నిధులు సక్రమంగా వినియోగం కాలేదని కాగ్ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement