fund
-
ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం
యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పుఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది. -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్‌క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్‌మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌లకు కేటాయించింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్‌కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
ఏంజెల్ ఫండ్ పెట్టుబడి పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్‌లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది. -
తెలంగాణలో CMRF భారీ స్కామ్.. సాక్షి చేతిలో FIR కాపీ
-
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో కీలక మలుపు
బెంగుళూరు: కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో సిట్ కీలక పురోగతి సాధించింది. హైదరాబాద్‌లో ఫస్ట్ క్రెడిట్ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల మళ్లింపు కేసులో సిట్ విచారణ చేస్తోంది.127 కోట్ల రూపాయల మహర్షి వాల్మీకి నిధులను ఫస్ట్ క్రెడిట్ సహకార సంస్థకు కర్ణాటక అధికారులు బదిలీ చేశారు. 60 కోట్ల రూపాయల నిధులను ఫస్ట్ క్రెడిట్ సంస్థకి బదిలీ చేసి కర్ణాటక అధికారులు డ్రా చేసుకున్నారు. వాల్మీకి మండలి సభ్యులు చంద్రశేఖర్ ఆత్మహత్యతో స్కాం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణను అరెస్టు చేసిన సిట్ బృందం బెంగుళూరుకు తీసుకెళ్లింది. -
రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
మరోసారి ఇన్ఫోసిస్ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం
బెంగళూరు: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీసీఐటీఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. -
ఘనమైన రాబడుల చరిత్ర
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ చాలా ఎక్కువ. కనుక స్వల్ప కాల పెట్టుబడులకు ఇవి అనుకూలంగా ఉండవు. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచి్చపెడతాయి. ఉదాహరణకు పదేళ్ల కాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాన్ని ఎంచుకుని ప్రతీ నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుందాం. పదేళ్లకు మీ పెట్టుబడులను తీసుకునే సమయంలో మార్కెట్లు ఏదేనీ కారణంతో భారీగా పతనం అయితే.. అప్పుడు పెట్టుబడులను మరో ఏడాది రెండేళ్ల పాటు కొనసాగించే వెసులుబాటు ఉన్న వారే ఈ పథకాల వైపు చూడాలి. ఎందుకంటే మార్కెట్ల కరెక్షన్లలో ఎక్కువగా నష్టపోయేవి స్మాల్‌క్యాప్ స్టాక్స్. ఆ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే రాబడులను పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వస్తుంది. ప్రతీ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి కొంత మొత్తాన్ని స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ (గతంలో రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్) పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులు ఉన్నాయంటే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ల కాలంలో ఏటా 32 శాతం రాబడిని తెచి్చపెట్టింది. అదే ఐదేళ్లలో ఏటా 29 శాతం, ఏడేళ్లలో 23.6 శాతం, పదేళ్లలో 28 శాతం చొప్పున రాబడులు అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐ సూచీ రాబడితో పోలిస్తే ఈ పథకమే ఎంతో మెరుగ్గా ఉండడాన్ని గమనించొచ్చు. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చినప్పుడు వివిధ కాలాల్లో గరిష్టంగా 10 శాతం వరకు అధిక రాబడులను అందించింది. స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూసినా సరే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకంలోనే 8 శాతం వరకు అధిక రాబడి ఉంది. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో స్మాల్‌క్యాప్ పథకం అయినప్పటికీ పెట్టుబడుల్లో స్మాల్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు వెయిటేజీ ఇవ్వడాన్ని గమనించొచ్చు. భవిష్యత్తులో మలీ్టబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారినవి ఉన్నాయి. అందుకే మిడ్‌క్యాప్‌లోనూ గణనీయంగా పెట్టుబడులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,044 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. స్మాల్ క్యాప్ పథకం అయినప్పటికీ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 37 శాతం పెట్టుబడులే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలలో 44 శాతం, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 19 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో 202 స్టాక్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ పథకం కావడం, భారీ పెట్టుబడుల నిర్వహణ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 18.79 శాతం ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 12.42 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
బీజేపీకి పార్టీ ఫండ్‌గా ప్రధాని మోదీ రూ.2వేల విరాళం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. ‘నమో’ యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని ప్రధాని మోదీబీజేకి పార్టీ ఫండ్‌గా అందజేశారు. ఈ సందర్భంగా ‘నమో’ యాప్ ద్వారా ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పేమెంట్‌కు సంబంధించిన స్లిప్‌ను షేర్ చేశారు. ‘బీజేపీకి దోహదపడటం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయటం సంతోషంగా ఉంది. ‘నమో’ యాప్ ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్ ’లో పోస్ట్ చేశారు. I am happy to contribute to @BJP4India and strengthen our efforts to build a Viksit Bharat. I also urge everyone to be a part of #DonationForNationBuilding through the NaMoApp! https://t.co/hIoP3guBcL pic.twitter.com/Yz36LOutLU — Narendra Modi (@narendramodi) March 3, 2024 డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్.. ప్రచార కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన కూడా రూ. 1000 విరాళాన్ని పార్టీకి అందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణం కోసం నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. నమో యాప్ ద్వారా అందరూ ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో పాల్గొనండి’ అని జేపీ నడ్డా ‘ఎక్స్’ ద్వారా పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2022-2023 ఏడాదిలో బీజేపీ రూ. 719 కోట్లు సేకరించినట్లు తెలిపింది. అదేవిధంగా 2021-2022తో పోల్చితే 17 శాతం అధికం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2022 -2023 ఏడాదికి రూ. 79 కోట్లు, 2021-2022 ఏడాదికి రూ. 95.4 కోట్లు పార్టీ ఫండ్ సేకరించినట్లు పేర్కొంది. -
చదువులకు ఊతమిచ్చేలా కల్యాణమస్తు
సాక్షి, అమరావతి : పిల్లలను చదివించే దిశగా ఒక అడుగు ముందుకేసి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్–డిసెంబర్ 2023 (త్రైమాసికం)లో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు ఈ పథకం కింద రూ.78.53 కోట్ల ఆరి్థక సాయాన్ని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. దీనివల్ల ఈ పథకానికి అర్హత రావాలంటే, ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి కాబట్టి పిల్లలను చదివించడానికి ప్రోత్సాహం అందించేదిగా ఉంటుందన్నారు. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలన్న నిబంధన వల్ల పది పాసయ్యాక ఇంటర్లో చేరుస్తారని చెప్పారు. పైగా ఇంటర్ చదువుకు అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నాం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారన్నారు. ఇంటర్ పూర్తైన తర్వాత విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం ఉన్నందున డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు అడుగులు పడతాయని అన్నారు. ఇలా చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి అమ్మాయి, అబ్బాయి గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని తెలిపారు. ‘కుటుంబంలో తల్లి చదువుకుని ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చే పిల్లలు ఆటోమేటిక్‌గా చదువుల బాట పడతారు. భవిష్యత్‌లో కుటుంబాల తల రాతలు మారాలన్నా, మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలన్నా, మంచి చదువులు మన చేతుల్లో ఉండాలి. అప్పుడు మన తల రాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంద’ని చెప్పారు. అందువల్ల గత ప్రభుత్వ హయాంలో వలె ఈ పథకాన్ని ఏదో నామ్‌కే వాస్తేగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా.. ప్రతి త్రైమాసికం (క్వార్టర్) పూర్తయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ చేసి తర్వాత ఇస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సర్టీ ఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేలా మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించేలా సచివాలయం వరకూ తీసుకుపోయాం. ► గతం కంటే పెంచి మరీ సాయమందిస్తున్నాం. గతంలో ఎస్సీలకు రూ.40 వేలకే పరిమితమైన పథకాన్ని రూ.లక్ష వరకు తీసుకుపోయాం. అదే కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల వరకూ పెంచాం. ఎస్టీలకు గతంలో రూ.50 మాత్రమే ఉంటే దాన్ని కూడా రూ.లక్ష వరకు పెంచడంతోపాటు, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలకు పెంచాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల నుంచి రూ.50 వేలకు, కులాంతర వివాహం అయితే రూ.75 వేలకు తీసుకుపోయాం. దివ్యాంగులకు అయితే ఏకంగా రూ.1.50 లక్షల వరకు తీసుకెళ్లాం. వాళ్ల కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏ ఒక్కరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నాం. చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ► గతంలో అరకొరగా ఇచ్చిన పరిస్థితులు. దాదాపు 17,709 మంది పిల్లలకు అరకొరగా ఇచ్చేవి కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితి గతంలో ఉంది. ఏ ఒక్కరూ మిస్ కాకూడదని అనే ఉద్దేశంతో త్రైమాసికం (క్వార్టర్) అయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఐదో విడత కార్యక్రమం. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఈ ఒక్క పథకానికే ఇప్పటి వరకు 56,194 జంటలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ రూ.427 కోట్లు ఇచ్చాం. ఇది అందరూ గర్వించే పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నత ఆశయంతో అమలు చేస్తున్న వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో గౌరవప్రదంగా వివాహం నిర్వహించేలా భరోసా కల్పిస్తున్న పథకం. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్లు లేని కబోదుల్లా నోరు పారేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. కళ్యాణమస్తు పథకం చదువుకు లింక్ అవడంతో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గడం పట్ల ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ప్రశంసించారు. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పేదల పెళ్లికి పెద్ద భరోసా అన్నా.. మాది నిరుపేద కుటుంబం. మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఎస్సీని. పెళ్లి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అంటూ పేదల పెళ్లికి పెద్ద భరోసా ఇస్తున్నారు. అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్య వివాహాలు తగ్గుతున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మేం చాలా లబ్ధి పొందాం. నాడు–నేడుతో స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. పేదలకు ఇంగ్లిష్ చదువులు వచ్చాయి. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. థ్యాంక్యూ జగన్ అన్నా. – భార్గవి, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా -
దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి
ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగంగా అందుబాటులోకి వచ్చే కొత్త అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఇన్వెస్ట్ చేయడం సాధారణ ఇన్వెస్టర్లకు సాధ్యమయ్యేది కాదు. నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఇలాంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకని ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం ఆర్థిక వ్యవస్థలో భాగంగా వివిధ వ్యాపార సైకిల్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. అంటే ఒక్కో కాలంలో కొన్ని రంగాల్లోని కంపెనీలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా లాభపడే రంగాలు, స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీన్నే బిజినెస్ సైకిల్ ఆధారిత పెట్టుబడుల విధానం అంటారు. ఆయా ఆర్థిక వృద్ధి దశల్లో భాగంగా ఎక్కువ లాభపడే కంపెనీలను గుర్తించడంలోనే పథకం రాబడులు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం సమయంలో చాలా రంగాలు సమస్యలను ఎదుర్కొంటాయి. కానీ, అదే సమయంలో కొన్ని రంగాలకు వృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి వాటిని ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ సైతం ఈ పథకంలో భాగంగా ఉంటుంది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 36 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో బెంచ్ మార్క్రాబడులు 28 శాతంగానే ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఏటా 24 శాతం చొప్పున రాబడులను ఈ పథకం తెచ్చిపెట్టింది. 2021 జనవరి 18న ఈ పథకంలో ఏక మొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, రూ.1.93 లక్షలుగా మారేది. అంటే ఏటా 25 శాతం సీఏజీఆర్ రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ విభాగంలో ముందు నుంచీ ఉన్న పథకంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఫండ్ మేనేజర్లు అనీష్ తవాక్లే, లలిత్ కుమార్, మనీష్ బంతియా తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, 2024 జనవరి 1 నాటికి రూ.5.23 లక్షలు సమకూరి ఉండేది.. ఇందులో పెట్టుబడి భాగం రూ.3.6 లక్షలు. అంటే 26.8 సీఏజీఆర్ రాబడులను అందించింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో రూ.7,616 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 54 శాతం పెట్టుబడులు దేశీయ రంగాలపై దృష్టి సారించే కంపెనీల్లోనే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం పెట్టుబడులు బ్యాంక్‌లు, ఆటోలు, నిర్మాణ రంగ కంపెనీలు, ఇంధన కంపెనీల్లోనే ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల్లో 94.34 శాతం ఈక్విటీలకు కేటాయించగా, డెట్‌లో 0.85 శాతం, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 85 శాతం మేర పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. అంటే రిస్క్ చాలా తక్కువగా భావించొచ్చు. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12.52 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.84 శాతం చొప్పున ఉన్నాయి. -
ఈ ఫండ్‌తో నమ్మకమైన రాబడులు!
ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్‌ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. రాబడులు ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్ మార్క్ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్‌లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్ విభాగంలో ఎస్వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 7.43 ఐసీఐసీఐ బ్యాంక్ 7.01 భారతీ ఎయిర్టెల్ 6 ఓఎన్జీసీ 4.18 మారుతి సుజుకీ 3.92 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.39 సన్‌ఫార్మా 3.07 ఇన్ఫోసిస్ 3.02 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.95 టాటామోటార్స్ డీవీఆర్ 2.63 -
'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్ 31న) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి కేంద్రం తన వాదనను సమర్పించింది. "ఎలక్టోరల్ బాండ్ల విధానంలో విరాళాలు సమర్ఫించే దాతల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛమైన డబ్బును రాజకీయ పార్టీలకు అందిస్తుంది. ఈ విరాళాలు పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అందువల్ల ఇది ఏ హక్కుకు కూడా భంగం కలిగించదు" అని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండబోదని అటార్ని జనరల్ తెలిపారు. అభ్యర్థుల వివరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని వెల్లడించారు. రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు జనవరి 2, 2018న ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎన్నికల బాండ్లు ఓ ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకుని ప్రచారాల కోసం వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు -
ఈ మ్యానిఫ్యాక్చరింగ్ ఫండ్‌తో లాభాలే లాభాలు
ప్రపంచ సేవల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశ ఎగుమతుల ఆదాయంలో సేవల రంగం వాటాయే ఎక్కువ. ప్రపంచ తయారీ రంగంలో మన వాటా నామమాత్రం. అందుకే కేంద్ర సర్కారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆత్మనిర్భర భారత్, భారత్‌లో తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 14 రంగాల్లో ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు తయారీ కోసం చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు, సరఫరా వ్యవస్థలో భాగంగా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల వైపు చూస్తున్నాయి. దీంతో భారత్ ముందు తయారీ పరంగా అపార అవకాశాలున్నాయి. దీంతో వచ్చే దశాబ్ద కాలంలో భారత్ అంతర్జాతీయ తయారీ రంగంలో తన వాటాను గణనీయంగా పెంచుకోనుందని అంచనా. ఆటోమొబైల్, రక్షణ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, రైల్వేస్, టెక్స్టైల్స్, కెమికల్స్, పెట్రోలియం అండ్ గ్యాస్ రంగ కంపెనీలు మంచి వృద్ధి అవకాశాలు చూడనున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, పెరుగుతున్న ఆదాయం హౌసింగ్, ఇన్ఫ్రా రంగాలకు కలసి రానుంది. కనుక తయారీ రంగంలో రానున్న అద్భుతమైన అవకాశాల నుంచి లబ్ధి పొందాలనుకునే ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. రాబడులు ఘనం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆరంభం నుంచి అద్భుత పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 అక్టోబర్‌లో మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతానికి పైనే రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ట్రెయిలింగ్ విధానంలో (ఏడాది, రెండు, మూడేళ్ల చొప్పున) ఏడాదిలో 35.3 శాతం, మూడేళ్లలో ఏటా 35.3 శాతం చొప్పు న రాబడిని అందించింది. ఇక ఐదేళ్లలో చూస్తూ రాబడి ఏటా 19.7 శాతంగా ఉంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో చేసిన పెట్టుబడులపై రాబడి ఐదేళ్లలో ఏటా 25.3 శాతం చొప్పున ఉంది. ముఖ్యంగా రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. రోలింగ్ రాబ డులు (ఒక కాలం నుంచి మరో కాలం వరకు నిర్ధేశిత కాలంలో పనితీరు) చూస్తే 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య ఏటా 24.6 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 116గా ఉంది. అంటే మార్కెట్ ర్యాలీల్లో ఈ పథకం ఎన్ఏవీ వృద్ధి మెరుగ్గా ఉండడానికి ఇది నిదర్శనం. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 59.3గా ఉంది. అంటే బెంచ్ మార్క్‌తో పోలిస్తే తక్కువ నష్టపోతుందని అర్థం. పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం తయారీలో సైక్లికల్, డిఫెన్సివ్ (రక్షణాత్మకమైనవి) రంగాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. వ్యాల్యూ, గ్రోత్ ఈ రెండు రకాల పెట్టుబడి విధానాలను అనుసరిస్తుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఇలా అన్ని రకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మల్టీక్యాప్ తరహా విధానాన్ని అనుసరిస్తోంది. మెరుగైన ఫలితాలకు, రంగాల వారీ, కంపెనీల వారీ ఎంపిక విధానాన్ని కూడా పాటిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఆటో యాన్సిలరీ, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 15 శాతం ఇన్వెస్ట్ చేయగా, ఇంధన రంగ కంపెనీలకు 7 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 7%, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.81%, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.47 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలపై తక్కువ వెయిటేజీ అనుసరిస్తోంది. తన నిర్వహణ ఆస్తుల్లో 90 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.43 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 8.86% మేర నగదు నిల్వలు ఉన్నాయి. -
వరంగల్: 'మేడారం జాతర'కు ఆరు నెలలే గడువు.. అయినా ఇలా..??
వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు. నిధులు సరిపోయేనా..? మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్‌హౌజ్‌లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి. అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. జాతరకు ఆరు నెలలే గడువు.. మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు. నిధులు మంజూరు చేయాలి.. మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
నేను బతికే ఉన్నాను.. అయినా నన్ను చంపేశారు!
జగిత్యాల: రాయికల్ మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన పుల్ల వెంకటేశ్‌కు గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు 2021 వరకు మంజూరయ్యాయి. తర్వాత ఖాతాలో డబ్బులు జమకాకపోవడంతో సందేహం వచ్చిన వెంకటేశ్ మీసేవలో సంప్రదించగా చనిపోయినట్లుగా ఉండటంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిలిచిపోయినట్లు చూపించింది. దీంతో అవాక్కయిన వెంకటేశ్ సంబంధిత వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎక్కడో తప్పిదం జరిగిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు మంజూరయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా తాను బతికుండగా చనిపోయినట్లుగా ఆన్లైన్లో నమోదైందని వెంకటేశ్ వాపోయాడు. -
పన్ను ఆదా.. మెరుగైన రాబడినిచ్చే ఈ ఫండ్ గురించి తెలుసా?
మెరుగైన రాబడులతోపాటు, పన్ను పరిధిలో ఉన్న వారు కొంత ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇదొక విభాగం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఒకటి. రాబడులు టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ రాబడులు అద్భుతంగా ఏమీ లేకపోయినా.. ఈ పథకం అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. గత ఏడాది కాలంలో ఈ పథకం 14 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో ఏటా 23 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 13 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 17.56 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. బెంచ్ మార్క్ సూచీ అయిన ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఈ పథకం కొన్ని కాలాల్లో మెరుగ్గానూ, కొన్ని కాలాల్లో ఫ్లాట్‌గానూ పనితీరు నమోదు చేసింది. దీర్ఘకాలంలో సూచీతో పోలిస్తే టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకంలోనే మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. 1996 మార్చిలో ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 18.40 శాతం చొప్పున ఇప్ప టి వరకు ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చిపెట్టింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మార్కెట్ అస్థిరతలను అధిగమించేందుకు, దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబా టు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో అధిక రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి 3557 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 97.57 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 57 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 22.64 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 10 శాతం వరకు కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.54 ఐసీఐసీఐ బ్యాంక్ 6.53 రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.84 ఇన్ఫోసిస్ 4.42 ఎస్బీఐ 4.36 యాక్సిస్ బ్యాంక్ 3.49 ఎల్అండ్టీ 2.94 రాడికో ఖైతాన్ 2.65 క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ 2.58 భారతీ ఎయిర్టెల్ 2.35 -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్‌లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్‌లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్‌కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీడీపీ నిధులొచ్చాయ్..! ఒక్కో ఎమ్మెల్యేకు రూ.??
ఆదిలాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) మంజూరయ్యాయి. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల చొప్పున రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి అందించే రూ.3కోట్లలో ప్రతీ మూడు నెలలకోసారి రూ.75లక్షల చొప్పున విడుదల చేస్తోంది. ఆ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాక మరోమూడు నెలలకు నిధులు విడుదల చేసేది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.75లక్షలు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేసింది. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా మూడు విడతల నిధులు రూ.2.5కోట్లను ముందస్తుగానే విడుదల చేసింది. దీంతో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కాగా, ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంఽధించిన ప్రతిపాదనల తయారీలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. జిల్లాకు రూ.5 కోట్లు.. ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, శాసనమండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, దండె విఠల్ ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఏ జిల్లానైనా వారు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో జీవన్‌రెడ్డి నిజా మాబాద్ను ఎంపిక చేసుకోగా, దండె విఠల్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. వారి కోటా నిధులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తోంది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నిధులు ఒకేసారి రావడంతో అత్యవసరమైన, పెండింగ్ పనులు పూర్తిచేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు కలగనుంది. ప్రతిపాదనలకే పరిమితమైన గ్రీన్‌ఫండ్ 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో రూ.2కోట్లను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఖర్చు చేయాలని సూచించింది. మిగతా రూ.3కోట్లలో 10 శాతం అంటే రూ.30లక్షలను గ్రీన్‌ఫండ్‌కు వినియోగించాలని సూచించింది. దీంతో ఆ నిధులు నియోజకవర్గ పరిధిలో పచ్చదనం పెంపునకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు జిల్లాలో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతేడాదికి సంబంధించి ప్రతిపాదనలు అందాయే గానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రూ.30లక్షలకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రూ.17లక్షలతో ప్రతిపాదనలు అందించగా పనులు కొనసాగుతున్నట్లుగా ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ.11లక్షలతో కూడిన ప్రతిపాదనలు అందించారు. తాజాగా విడుదలైన నిధుల్లోనూ 10 శాతం నిధులు గ్రీన్‌ఫండ్ కింద ఖర్చు చేయాల్సి ఉండడంతో వాటిని ఏ మేరకు ఖర్చుచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
తక్కువ రిస్క్.. మంచి రాబడి - ఉందిగా సరైన మార్గం!
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్తంత అధికరాబడులు కోరుకునే వారు హైబ్రిడ్ ఈక్విటీ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. రాబడి మాత్రం అచ్చమైన డెట్ సాధనాలకు మించి ఉంటుంది. అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ పథకం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పథకం కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో 14.52 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 17.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11.70 శాతం, ఏడేళ్లలోనూ ఏటా 11.55 శాతం, పదేళ్లలో 14.37 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఉంది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.43 శాతంగా ఉన్నాయి. డెట్‌తో కూడిన పెట్టుబడులు కనుక దీర్ఘకాలంలో వార్షిక రాబడి 11–12 శాతం చొప్పున ఉంటే మెరుగైనదిగా పరిగణించొచ్చు. అచ్చమైన ఈక్విటీ కాకుండా, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన సాధనాల్లో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వారు ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. ఇంతకంటే అధిక రాబడి కోరుకునే వారికి అచ్చమైన ఈక్విటీ పథకాలే సూచనీయం. (ఇదీ చదవండి: గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?) పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల కేటాయింపు సమయోచితంగా ఉంటుంది. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015, 2020 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు తీసుకొచ్చేలా పథకం పరిశోధనా బృందం పనిచేస్తుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.58వేల కోట్లకు పైనే పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో 75.80 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడులు 18.72 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాలకు కూడా ఒక శాతం లోపు కేటాయించగా, 4.61 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో కేవలం 0.73 శాతమే ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈక్విటీల్లోనూ రిస్క్‌ను తగ్గించే విధంగా కేటాయింపులు ఉన్నాయి. 18.72 శాతం డెట్ కేటాయింపుల్లోనూ అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సాధనాల్లోనే 14 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లో అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం కేటాయింపులు చేయగా, సేవల రంగ కంపెనీలకు 7 శాతానికి పైన కేటాయించింది. హెల్త్‌కేర్‌లో 6 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
నయా ఫండ్: యాక్సిస్ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్
ముంబై: యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది జూన్ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్‌లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్‌కుమార్ తెలిపారు. -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
రక్షించండి ప్రభో! పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. పాక్ ప్రధాని ఆవేదన
పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్ఎఫ్ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్ఎఫ్కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే.. -
సీఎం జగన్ మాట ఇచ్చారు.. నెరవేర్చారు
సాక్షి అమలాపురం: ‘మాట ఇస్తే.. చేస్తానంతే..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. బాధితులు కోరిన ఆర్థిక సహాయాన్ని 24 గంటల్లో రోగులకు, పేదలకు అందేలా చేసి వారిపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం జగన్ బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి వచ్చిన సీఎం జగన్‌ను కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 24 గంటలు తిరగకుండానే 25 మంది బాధితులకు రూ.26 లక్షలను కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. లబ్ధిపొందినవారిలో పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధుల బాధితులు ఉన్నారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ శుక్లా తెలిపారు. వీరిలో టి.సుజాతకు రూ.రెండులక్షలు అందించారు. డీఎం అండ్ హెచ్‌వో ఎం. బాబూరావు దొర, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఏవో కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు. చదవండి: గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
ఆటోక్రాస్ ఛాంపియన్ షిప్
-
ఒకే పథకం.. రెండు ప్రయోజనాలు
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. పెట్టుబడులకు పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. మెరుగైన రాబడులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే పన్ను ఆదా ప్రయోజనం చూడాలి. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని తెలిసిందే. పన్ను ఆదా ప్రయోజనంతో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలతో దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో చక్కని, నమ్మకమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో చేసే ప్రతి పెట్టుబడికి అక్కడి నుంచి మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. మూడేళ్లు నిండిన తర్వాతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. రాబడులు 5 స్టార్ రేటెడ్ పథకం ఇది. ఏడాది కాలంలో 11 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్లలో ఏటా 27 శాతం ప్రతిఫలాన్ని పెట్టుబడులపై అందించింది. ఇక ఐదేళ్లలో ఏటా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఏడేళ్లలో చూసుకున్నా వార్షిక రాబడి రేటు 17.44 శాతంగా ఉంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో వార్షిక సగటు రాబడి 12 శాతానికి పైన ఉంటే దాన్ని మెరుగైనదిగా భావిస్తారు. ఈ పథకం రాబడులకు బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూచీతో పోలిస్తే మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో రెండు నుంచి మూడు శాతం అధికంగా వార్షిక రాబడిని అందించింది. కనుక ఐదేళ్లకు మించిన కాలానికే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లలోపు లక్ష్యాలకు అచ్చమైన ఈక్విటీలు అనుకూలం కాదని నిపుణుల సూచన. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అంటే నగదు నిల్వలు తక్కువగా నిర్వహిస్తుండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,218 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో 99.16 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులోనూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 69 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఇక మిడ్‌క్యాప్ కంపెనీల్లో 25 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 5.57 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 66 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే 32 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇంధన రంగ కంపెనీల్లో 11.13 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 9 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8.15 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఈ నాలుగు రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. -
దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలంటే.. ఈ ఫండ్‌ను పరిశీలించండి
ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్లో ఈక్విటీలకు కచ్చితంగా స్థానం కల్పించాలి. అప్పుడే మెరుగైన సంపద సృష్టి, ఆర్థిక లక్ష్యాల సాధన సాధ్యపడుతుంది. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈక్విటీల్లోనూ ఎన్నో రకాల విభాగాలున్నాయి. అందులో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం ఒకటి. అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలను పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకునేవే మల్టీక్యాప్ ఫండ్స్. అంటే, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో.. ఒక్కో విభాగంలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడతాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పెట్టుబడి అవకాశాలను సొంతం చేసుకునే అనుకూలత ఈ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ దీర్ఘకాలం నుంచి స్థిరమైన, నమ్మకమైన పనితీరును చూపిస్తోంది. సొంతిల్లు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, అలాగే దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని భావించే వారు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలలో 29 శాతం రాబడులను తెచ్చిపెట్టింది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడికి పోల్చుకోతగిన ప్రామాణిక సూచీ బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి కేవలం 15.63 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో చూసినా బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి ఏటా 30 శాతంగా ఉంటే, ఈ పథకంలో రాబడి వార్షికంగా 41.50 శాతం మేర ఉంది. ఐదేళ్లలోనూ బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే 2 శాతం అధికంగా 14.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలం ఈ పథకంలో వచ్చింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 15.61 శాతం చొప్పున వార్షిక రాబడి రేటు ఉంది. 2005 మార్చిలో ఈ పథకం మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 17.18 శాతం చొప్పున రాబడి ఈ పథకంలో ఉండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లు సిప్ రూపంలో కనీసం రూ.1,000 నుంచి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకాన్ని 16 ఏళ్ల నుంచి శైలేష్ రాజ్ భాన్ నిర్వహిస్తుండడం సానుకూల అంశం. అతని మెరుగైన నిర్వహణ పథకం స్థిరమైన రాబడులకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మెరుగైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను, సరైన విలువల వద్ద ఉంటే ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం విధానంలో భాగం. పోటీ కంపెనీలతో పోలిస్తే అనుకూలతలు ఉన్న కంపెనీలు కొంచెం అధిక విలువల వద్ద ఉన్నా, పెట్టుబడులను కేటాయిస్తుంది. ఆయా రంగాల్లో అగ్రగామి కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వచ్చే స్వల్పకాల, మధ్య కాల అనుకూలతల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో మొత్తం రూ.15,088 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన 1.29 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 49 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 34.05 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 17.29 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 91 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 27.73 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 19.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 7.72 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 5.19 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 4.92 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం లిండే ఇండియా 4.69 ఐసీఐసీఐ బ్యాంక్ 4.26 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.03 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.53 యాక్సిస్ బ్యాంక్ 3.42 ఇండియన్ హోటల్స్ కంపెనీ 3.37 ఎల్అండ్టీ 3.13 ఈఐహెచ్ 3.11 ఎస్బీఐ 3.07 కెన్నమెటల్ ఇండియా 3.06 -
‘ఈనాడు’ అసత్య యజ్ఞంలో ‘వాస్తవాలే’ సమిధలు
సాక్షి, అమరావతి: వాస్తవాలన్నింటినీ సమిధలుగా మార్చి ‘ఈనాడు’ అసత్యాల యజ్ఞం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో రాష్ట్రంలో సాగుతున్న అతి పెద్ద హిందూ ధార్మిక కార్యక్రమంపైనే ఓ అసత్య కథనాన్ని అల్లింది. సనాతన హిందూ సంప్రదాయం, ధర్మ ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకి చాటి చెప్పేలా, పురాణాలలో చెప్పిన మహత్తర యజ్ఞాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేయిస్తుంటే ‘ఈనాడు’ ఏమాత్రం ఓర్వలేకపోయింది. పలువురు పీఠాధిపతుల సమక్షంలో అనేక మంది వేద పండితులు, వందలాది రుత్విక్కుల ఆధ్వర్యంలో విజయవాడలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ‘అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ పైనా విషం చిమ్మింది. దానికి పెట్టే ఖర్చును ‘‘దేవదాయ సొత్తే.. సమిధ’’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. హిందూ ధర్మ వ్యాప్తికి, దైవ కార్యక్రమాలకు దేవదాయ శాఖ డబ్బు కాకుండా మరే డబ్బును ఖర్చు చేస్తారన్న కనీస జ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది ఆ పత్రిక. కేవలం దైవ, హిందూ ధర్మ ప్రచారాలకు మాత్రమే ఉపయోగించాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసినా కిమ్మనని ఈనాడు.. ఇప్పుడు ధర్మ ప్రచారానికి ఉపయోగించడమూ నేరమే అంటోంది. నాడు చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాల్సిన దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం భవనానికి రూ.10 కోట్ల సీజీఎఫ్ నిధులు ఖర్చు చేసింది. ఇదంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయిన ‘ఈనాడు’.. ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు దైవ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడాన్ని తప్పుపడుతోంది. ఈనాడు కథనంలో అవాస్తవాలను దేవదాయ శాఖ కమిషనర్ బట్టబయలు చేశారు. వాస్తవాలను వివరించారు. ఆ వాస్తవాలిలా ఉన్నాయి.. ఈనాడు ఆరోపణ:మహా యజ్ఞానికి ఉపయోగించే నెయ్యిని దేవదాయ శాఖ కిలో రూ. 1400లు పెట్టి కొంటోంది. మార్కెట్లో దాని ధర రూ. 600 – 650 మాత్రమే. దేవదాయ శాఖ కమిషనర్ చెబుతున్న వాస్తవం: కిలో రూ. 1,400 అన్నది పచ్చి అబద్ధం. యజ్ఞ నిర్వహణకు ఉపయోగించే పవిత్ర దేశీ ఆవు నెయ్యిని కొంటున్నది రూ. 1,071కే. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవముల సందర్భంగా హైదరాబాద్‌లో చిన జీయర్ స్వామి ఆశ్రమం నిర్వహించిన యజ్ఞానికి ఆ సంస్థ కొన్న ధరకన్నా దేవదాయ శాఖ కొన్న ఆవు నెయ్యి ధర చాలా తక్కువ. ఈ రెండు యజ్ఞాలకూ దేశీ ఆవు నెయ్యి సరఫరా చేసింది ఒకే సంస్థ. చిన జీయర్ స్వామి వారి ఆశ్రమం 15 లీటర్ల ఆవు నెయ్యి టిన్ను రూ. 24107.14కి కొనగా, దేవదాయ శాఖ బేరమాడి 15 లీటర్ల టిన్నును రూ. 16,071కే కొన్నది. ఆరోపణ: దుర్గగుడి కొనే నెయ్యి ధరకన్నా యజ్ఞానికి ఎక్కువ ధర. వాస్తవం: వివిధ ఆలయాలు కొనే నెయ్యి అత్యధికం ప్రసాదాల తయారీకి మాత్రమే వినియోగిస్తారు. యజ్ఞ కార్యక్రమాలకు ఉపయోగించే నెయ్యి పూర్తి భిన్నమైనది. యజ్ఞ యాగాదులకు వినియోగించవలసిన నెయ్యి పూర్తిగా స్వదేశీ ఆవు పాలను మరిగించి పెరుగు చేసి, ఆ పెరుగు నుండి తీసిన వెన్నను మరిగించి తయారు చేసిన నెయ్యి మాత్రమే అయి ఉండాలి. ఆరోపణ: యజ్ఞ సామాగ్రిని ఇష్టానుసారం ధరలకు కొన్నారు. దీక్షా వస్త్రాలకే రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. వాస్తవం: యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే వేద పండితులకు, రుత్విక్కులు, పరిచారికలు, భజంత్రీలకు కలిపి మొత్తం 688 మందికి ఒక్కొక్కరి మూడు దీక్షా వస్త్రాల చొప్పున మొత్తం 2064 అందజేయాలని నిర్ణయం జరిగింది. మహా యజ్ఞంలో సుమారు 15 మంది పీఠాధిపతులను ఆహ్వానించినందున హైందవ సంప్రదాయాన్ని అనుసరించి వారికి ఉపయోగించే వస్త్రాలు ఏకతానుతో చేసినవి అయి ఉండాలి. దీక్షా వస్త్రాల కొనుగోలుకు రూ. 11.35 లక్షలు ఖర్చు చేశాం. ‘ఈనాడు’లో పేర్కొన్నట్టు రూ.20 లక్షలు కాదు. ఆరోపణ: మహా యజ్ఞం నిర్వహణకు పెద్ద ఆలయాల నుంచి నిధులు సమీకరించారు. వాస్తవం: ఆలయాల ప్రథమ కర్తవ్యం సనాతన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం. ఈనాడు ఆరోపణ: ప్రతి పనినీ అధికారులు దుర్గగుడికే అప్పగిస్తున్నారు కమిషనర్ చెబుతున్న వాస్తవం: మహా యజ్ఞం నిర్వహణకు వచ్చిన వివిధ శాఖల సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థల వలంటీర్లకు మాత్రమే దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి భోజనాలు ఏర్పాటు చేశాం. -
రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె!
స్టాక్ మార్కెట్ రంగంలో ఫండింగ్ మందగించిన ప్రస్తుత తరుణంలో ప్రముఖ వ్యాపార నిపుణులే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించి సంచలనానికి తెరతీశారు భారతదేశానికి చెందిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ క్రేషా గుప్తా. క్రేషా గుప్తా వయసు 24 సంవత్సరాలు. ఐదేళ్లుగా ఆమె మార్కెట్ ట్రెండ్లను అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కోసం ఆమె రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించారు. భారతదేశపు అతి పిన్న వయస్కులైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా నిలిచారు. ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్.. ఆమె ప్రారంభించిన ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగానికి సంబంధించినది కాదు. అయితే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లలో పెట్టుబడుల కోసం దీన్ని ప్రారంభించారు క్రేషా గుప్తా. దీంతో స్టార్టప్‌లపై దృష్టి సారించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా ఇన్వెస్టర్‌గా నిలిచారు. క్రేషా గుప్తా కంపెనీ పేరు చాణక్య ఆపర్చునిటీస్ ఫండ్ 1. సెబీలో నమోదైన ఈ ఫండ్ కంపెనీ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అవసరమైతే మరో రూ.100 కోట్ల నిధులు సమీకరిస్తుంది. అంటే ఇది గ్రీన్ ఇష్యూ ఫండ్. ఈ ఫండ్ లాభదాయకమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడి పెడుతుందని ఆమె మీడియాకు తెలిపారు. 25 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు, ఇందు కోసం అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. ఎవరీ క్రేషా గుప్తా? అహ్మదాబాద్‌కు చెందిన క్రేషా గుప్తా 2019లో సీఏ పూర్తి చేశారు. అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ డిప్లొమా చదివారు. క్రేషా గుప్తా సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా. ఎప్పుడూ చదువులో చురుగ్గా ఉండే క్రేషాకు మంచి అకడమిక్ రికార్డు ఉంది.(ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) కార్పొరేట్, కన్సల్టింగ్ రంగాలలో ఫైనాన్స్, అకౌంట్స్, MIS, టాక్స్ అడ్వైజరీ వంటి విభాగాల్లో పనిచేసిన ఆమె ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ ట్రెజరీ టీమ్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియాతో తన కెరియర్ను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్న క్రేషా గుప్తాకు పెట్టుబడి అవకాశాలను గుర్తించడంలో, నష్టాలను తగ్గించడంలో విశేష నైపుణ్యం ఉంది. ట్రెండ్లైల్ ప్రకారం... 2023 మార్చి 31 నాటికి ఆమె 3 స్టాక్లను కలిగి ఉన్నారు. వీని నికర విలువ రూ. 6.9 కోట్లు. విజయ రహస్యాలు అవే.. రూ. 100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించడం తనకు సరికొత్త అనుభవమని క్రేషా గుప్తా లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. ఫండ్ విషయంలో అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు తరచూ హెచ్చిరిస్తుంటారని, అయితే ఏళ్ల అనుభవం మాత్రమే ఎల్లప్పుడూ విజయాన్ని నిర్దేశించదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి నేర్చుకునే సుముఖత, కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉండటం, నేర్చుకునే అవకాశాలను వెతకడం, ప్రశ్నించేందుకు సంకోచించకపోవడం.. ఇవే ఇంత చిన్న వయస్సులో తన విజయానికి రహస్యాలని వివరించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
నిర్మాతల సంఘానికి లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం
భారీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవల మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా మణిరత్నం దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ తరపున తమిళ నిర్మాతల సంఘానికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి రామస్వామికి అందించారు. -
ఫ్రెష్‌టుహోమ్ 104 మిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే స్టార్టప్ సంస్థ ఫ్రెష్‌టుహోమ్ తాజాగా రూ. 104 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్ ఎస్ఎంభవ్ వెంచర్ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్‌టుహోమ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్ స్టోర్స్ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
ఇకపై ‘లా నేస్తం’ పథకం ఏడాదికి రెండుసార్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు ‘‘గత మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు ‘లా నేస్తం’ అందించాం. ఇప్పటి వరకు రూ.35.40 కోట్లు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,011 మంది అడ్వకేట్లకు ‘లా నేస్తం’ అందిస్తున్నాం. 2,011 మంది అడ్వకేట్లకు రూ.కోటి 55 వేలు జమ చేస్తున్నాం. ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండుసార్లు అందిస్తాం అడ్వకేట్ల కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం’’ అని సీఎం అన్నారు. ‘‘న్యాయ వాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని నాకు పాదయాత్రలో చెప్పారు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలిగే వృత్తిలో ఉన్నారు. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంది. ఈ పథకంలో కొంత మార్పులు తీసుకు వచ్చాం. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 దఫాలుగా ఇచ్చేందుకు నిర్ణయించాం. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని. రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కోవిడ్ సమయంలో మంచి కూడా జరిగింది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నాం. ఆధీకృత వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నాం. ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేస్తున్నాం. మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నాను. మీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నాను’’అని సీఎం జగన్ అన్నారు. చదవండి: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు -
దేశీ స్టార్టప్స్‌లోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్‌లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది 38 శాతం క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నిధుల సమీకరణ, పెట్టుబడుల కార్యకలాపాలపై ప్రభావం పడటమే ఇందుకు కారణం. డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021లో 33.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 1,715 డీల్స్ కుదరగా 2022లో 1,726 ఒప్పందాలు కుదిరినా పెట్టుబడుల పరిమాణం 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. టాప్ 4 మార్కెట్లలో భారత్.. వీసీ పెట్టుబడుల పరిమాణం, విలువపరంగా చైనా తర్వాత ఆసియా–పసిఫిక్ దేశాల్లో భారత్ కీలక మార్కెట్‌గా ఉందని గ్లోబల్‌డేటా లీడ్ అనలిస్ట్ అరోజ్యోతి బోస్ తెలిపారు. అంతర్జాతీయంగా టాప్ 4 మార్కెట్లలో (అమెరికా, బ్రిటన్, చైనా, భారత్) ఒకటిగా ఉందని పేర్కొన్నారు. 2022లో అంతర్జాతీయంగా వీసీ ఫండింగ్‌లో విలువపరంగా 5.1 శాతం, పరిమాణంపరంగా 6.3 శాతం మేర భారత్ వాటా దక్కించుకుంది. అమెరికా, బ్రిటన్, చైనాలో 2022లో డీల్స్ పరిమాణం క్షీణించగా భారత్ మాత్రం 0.6 శాతం వృద్ధితో ప్రత్యేకంగా నిల్చింది. గ్లోబల్‌డేటా ప్రకారం 2021లో వీసీ ఫండింగ్ డీల్ సగటు విలువ 19.7 బిలియన్ డాలర్లుగా ఉండగా 2022లో 12.1 మిలియన్ డాలర్లకు తగ్గింది. అలాగే 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య 2021లో 86గా ఉండగా గతేడాది 42కి తగ్గింది. ఇన్వెస్టర్లకు గణనీయంగా రాబడులు ఇవ్వగలిగే కంపెనీల కొరత కూడా వీసీ పెట్టుబడుల తగ్గుదలకు కారణమైందని బోస్ వివరించారు. వర్ధమాన దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. -
లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
వడ్డీ రేట్లు దాదాపు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లకు మించిన లక్ష్యాల కోసం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. మన దగ్గర దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల సాధనాలు పరిమితం. పీపీఎఫ్, ఎన్పీఎస్ పథకాలు ఉన్నా, వీటిల్లో లాకిన్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు వీలు కాదు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై రెగ్యులర్ ఆదాయం వస్తుంటుంది. వడ్డీపై వ్యక్తిగత పన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ గడువు కంటే ముందే వైదొలగాలని అనుకుంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. కానీ, లాంగ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కోరుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య ఫండ్ పదేళ్లకు మించిన లక్ష్యాలకు అనుకూలం. కోరుకున్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ పథకం. కనుక ఎప్పుడైనా పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలంతో కూడిన జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సగటున 20–25 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే (గడువు ముగిసే) సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. పైగా వ్యయాలు చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్‌లో కేవలం 0.16 శాతమే ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన మొదటి మూడేళ్లలో కేవలం 20 శాతం యూనిట్లనే విక్రయించుకోగలరు. ఈ మొత్తంపై ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంతకుమించిన మొత్తం ఉపసంహరించుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాంటి పరిమితులు, చార్జీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దీర్ఘకాల పెట్టుబడులకు ఉద్దేశించినది. కనుక స్వల్పకాలంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు ఈ నిబంధన విధించడం జరిగింది. దీర్ఘకాల జిసెక్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ. పరిమితి విధించడానికి ఇది కూడా ఒక కారణం. కనుక కనీసం 8–10 ఏళ్లకు మించిన కాలానికే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. సరైన సమయమే.. గతంలో వడ్డీ రేట్ల సైకిల్ 8–8.5 శాతం వద్ద గరిష్టానికి చేరి, 5–5.5 శాతం వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఈల్డ్స్ 7.4 శాతానికి చేరాయి. గరిష్టానికి ఒక శాతం తక్కువ. సాధారణంగా వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడే లాంగ్ డ్యురేషన్ ఫండ్స్/సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు అధిక రాబడులు పొందొచ్చు. ఏ సైకిల్లో అయినా గరిష్ట రేటును అంచనా వేయడం కష్టం. కనుక ఇక్కడి నుంచి ఈల్డ్స్ ఇంకా పెరుగుతాయా? అన్నది చెప్పలేం. కనుక ఇక్కడి నుంచి లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆరంభించుకోవచ్చు. వడ్డీ రేట్ల క్షీణత ఆరంభమైన తర్వాత తాజా పెట్టుబడులు నిలిపివేసుకోవచ్చు. రాబడులు.. డెట్ పథకాల్లో మూడేళ్లు పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. నివేష్ లక్ష్య తదితర లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో గడిచిన ఏడాది, మూడేళ్ల కాల రాబడులు అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. వీటిల్లో రాబడులను సైకిల్ ఆధారంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే లాంగ్ డ్యురేషన్ పథకాల్లోని పెట్టుబడుల ఎన్ఏవీ సైతం తగ్గుతుంది. గడిచని ఏడాదిలో 5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 6 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. కానీ, ఎనిమిదేళ్లు అంతకుమించిన కాలానికి ఈ పథకాలు ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్, చైనాకు ఊహించని ఝలక్
No Money for Terror: పాక్ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్(నో మనీ ఫర్ టెర్రర్)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్ ఫైనాన్సింగ్‌పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్ ఫండింగ్‌కి సహయపడతాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్ఎస్సీ, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఎఫ్‌ఏలీఎఫ్) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. (చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్) -
రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం భారత్‌లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్‌లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఎన్హెచ్ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఎన్హెచ్ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది. కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్హెచ్ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్ అధికారి ఇటీవల వెల్లడించారు. -
ఐపీవోకు అప్రమేయ ఇంజినీరింగ్
న్యూఢిల్లీ: మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ అప్రమేయ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రధానంగా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, నిర్వహణ తదితర హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులను అందిస్తోంది. చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
‘బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు’
భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ...తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా ఆయన బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి... ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ...సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
Fact Check: కేంద్రం ఒక్కొక్కరికి రూ.5వేల కోవిడ్-19 ఫండ్‌ను అందిస్తుందా?
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం కోవిడ్ ఫండ్‌ను విడుదల చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరికి ఒక్కొక్కరికి కేంద్ర ఆరోగ్య శాఖ రూ.5 వేలు అందిస్తుంది. అందుకే కేంద్రం ఇచ్చే కోవిడ్ ఫండ్ పొందాలనుకుంటే వ్యక్తిగత వివరాలు వెల్లడించాలంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. एक फर्जी मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार के हेल्थ मंत्रालय द्वारा कोरोना फंड के तहत ₹5000 की धनराशि प्रदान की जा रही है।#PIBFactcheck ▶️ ऐसे फर्जी संदेशों को फॉरवर्ड न करें। ▶️ इस तरह की संदिग्ध वेबसाइट पर अपनी किसी भी तरह की निजी जानकारी साझा न करें। pic.twitter.com/qiAbnHlJLi — PIB Fact Check (@PIBFactCheck) January 11, 2022 అయితే దీనిపై కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఇది స్కామ్ అని. అలాంటి ఆఫర్/స్కీమ్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పీఐబీ అధికారిక ట్విట్టర్ అకౌంట్నుంచి ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని, దాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. వైరల్ అవుతున్న లింక్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ఇక జనవరి 15, 2022 వరకు మాత్రమే కేంద్రం కోవిడ్ ఫండ్ ఇస్తుందని మెసేజ్‌లో ఉందని, ఇది కూడా ఫేక్ ఇన్మర్మేషన్ అని కొట్టి పారేసింది. ఇలాంటి ప్రమాదకరమైన మెసేజ్‌లను ఎవరూ పట్టించుకోవద్దని,వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరింది. చదవండి: విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్‌మాల్యా? -
అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్.. స్టార్లప్‌లకు కొత్త వరం
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల విభాగంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్ పేరుతో త్వరలో తొలి దశను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ ఎస్.తోమర్ పేర్కొన్నారు. తద్వారా బిజినెస్ ఐడియాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఐఎఫ్సీఐ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థే ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సంస్థ ప్రస్తుతం ఐదు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో రెండింటిని సామాజికంగా వెనుకబాటు, వెనుకబడిన కులాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మద్దతిచ్చేందుకు వినియోగిస్తోంది. 2020లో తొలుత షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు)కు చెందిన 1,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మిషన్‌ను ప్రారంభించింది. తద్వారా అంబేడ్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ మిషన్ పేరుతో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఎస్సీల కోసం ఫండ్‌ను ఏర్పాటు చేసిననట్లు ఈ సందర్భంగా తోమర్ తెలియజేశారు. చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా -
కరుణాలయంపై కాఠిన్యమా!
నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించేందుకు 71 ఏళ్ళ క్రితం ఏర్పాటైన సంస్థ అది. కష్టాల్లో ఉన్న దీనులకు కేయూతనివ్వడానికి అమృతమూర్తి మదర్ థెరెసా ఆరంభించిన కరుణాలయం అది. అలాంటి ఇంటర్నేషనల్ ట్రస్ట్ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (ఎంఓసీ) ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలవడం విషాదం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు వీలుగా విరాళాలను స్వీకరించడానికి ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద ఆ సుప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కున్న లైసెన్స్‌ను పొడిగించడానికి కేంద్ర హోమ్‌శాఖ నిరాకరించింది. అదీ సరిగ్గా క్రిస్మస్ నాడు ఆ నిర్ణయం రావడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఈ సేవాసంస్థకు సంబంధించి ‘కొంత ప్రతికూల సమాచారం’ గుర్తించినందు వల్లే లైసెన్స్‌ను పొడిగించబోమన్నామని ప్రభుత్వ అధికారులు సోమవారమిచ్చిన వివరణ. కానీ, తమకొచ్చిన సదరు ‘ప్రతికూల సమాచారం’ ఏమిటన్నది ప్రభుత్వం పెదవి విప్పకపోవడమే విచిత్రం. పారదర్శకత లేని ఈ సర్కారీ చర్యతో నేరుగా ఆ సంస్థల్లోని 22 వేల మంది రోగులకూ, ఉద్యోగులకూ ఆహారం, ఔషధాలు కరవయ్యాయి. అందుకే, తృణమూల్ కాంగ్రెస్ మొదలు కాంగ్రెస్ సహా రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కొన్నేళ్ళుగా ఎఫ్సీఆర్ఏ చట్టాలను కఠినతరం చేస్తూ, ఎన్జీఓలపైన ప్రభుత్వానికి బోలెడంత పెత్తనం కట్టుబెడుతూ పాలకులు చేపడుతున్న చర్యలతో పలువురికి అనేక అనుమానాలూ వస్తున్నాయి. భారతదేశాన్ని స్వగృహంగా మార్చుకున్న జన్మతః అల్బేనియన్ క్రైస్తవ సన్న్యాసిని మదర్ థెరెసా 1950లో కలకత్తా వీధుల్లో స్థాపించిన సేవాసంస్థ – ఎంఓసీ. సేవాతత్త్వంతో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రేమజ్యోతిగా వెలిగిన ఆ ‘భారతరత్న’ం పెట్టిన ఈ సంస్థ మానవతా దృష్టితో సుదీర్ఘకాలంగా ఎందరికో సేవలందిస్తూ, అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎన్నో ఏళ్ళుగా ఆ సంస్థకు విదేశీ విరాళాలు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏటా నివేదికలు సమర్పిస్తూనే ఉంది. ఒకవేళ ఆ సంస్థ గనక నిబంధనల్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు లేదు. కానీ, ముందుగా చేసిన ఆ తప్పులేమిటో, వాటి స్వభావమేమిటో కూడా ప్రభుత్వమే ప్రకటించాలి కదా! ఇప్పుడు అలా జరగకపోవడం ప్రధానంగా విమర్శకు కారణమైంది. అనాథలు, అభాగ్యులు, అంధులు, అంగవికలురు, అసహాయులైన వృద్ధులు, వరదలు – కరవు కాటకాలు – మహమ్మారి రోగాల బారిన పడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకొనే పనిలో దాదాపు 139 దేశాల్లో ఎంఓసీ విస్తరించింది. అలాంటి సేవాసంస్థకు అశేష అభిమానులతో పాటు, బలవంతపు మత మార్పిడికీ, బాలికల అక్రమ రవాణాకూ పాల్పడుతోందని నిరాధార ఆరోపణలు చేసే సంప్రదాయవాద సంస్థల ఏజెంట్లూ అనేకులున్నారు. గుజరాత్‌లోని వడోదరాలో బాలికా కేంద్రంపై ఈ నెలలో కొందరిచ్చిన ఫిర్యాదు ఫలితమే తాజా చర్య అని లోపాయకారీగా అధికారుల మాట. ఆడిట్లో అవకతవకలని మరో మాట. అయితే, వాటిల్లో నిజం లేదని ఎంఓసీ ఖండిస్తోంది. 2016–17, 2018–19 మధ్య ఏటా రూ. 58 వేల కోట్లకు పైగా విదేశీ విరాళాలొచ్చాయని హోమ్ శాఖ డేటా. నిజానికి, గత ఏడేళ్ళలో మోదీ సర్కారు విదేశీ విరాళాల మూలాలను గుప్పెట బిగించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ, కొన్ని వందల ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది. ఎఫ్సీఆర్ఏలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఎన్జీఓలకొచ్చే విదేశీ విరాళాలపై కత్తెర వేసేలా ప్రభుత్వానికి అదనపు అధికారాలూ వచ్చిపడ్డాయి. ఆ అధికారాన్ని అనేక మానవ హక్కుల బృందాలపై హోమ్ శాఖ ప్రయోగించడం, ఆ ఆదేశాల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేయడం జరిగిన కథ. ఈ చట్టం కింద దేశంలో 22 వేలకు పైగా ఎన్జీఓలు నమోదు కాగా, వాటిలో కనీసం 10 – 15 శాతానికి మోదీ పాలనలో లైసెన్సు పొడిగింపులు దక్కబోవని నిపుణుల మాట. ‘దేశ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ భంగకరమైన చర్యల’కు చెక్ పెట్టడం ఈ ఎఫ్సీఆర్ఏ ఉద్దేశం. మదర్ థెరెసా పెట్టిన సంస్థ అలాంటి పనేం చేసింది? ముందుగా షోకాజ్ నోటీసులివ్వాల్సి ఉన్నా, ఈ తాజా ఘటనలోనూ అలాంటివేవీ పాటించలేదు. అందుకే, అనేక ఎన్జీఓలకు ప్రభుత్వ చర్యలకు కారణాలేమిటో కూడా తెలియని పరిస్థితి. పైపెచ్చు, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల సంస్థలపై ఇలా వేటు ఎక్కువగా పడుతోందన్నది ఓ విశ్లేషణ. ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, గ్రీన్‌పీస్ ఇండియా, ది ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి ఎన్జీఓల విదేశీ విరాళాల లైసెన్సులు సస్పెండవడమో, రద్దు కావడమో అందుకు ఉదాహరణ. ఒకపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చిలపైన దాడులు, మరోపక్క కర్ణాటకలో కొత్తగా పెట్టిన మతమార్పిడి వ్యతిరేక బిల్లు మైనారిటీల్లో ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రసిద్ధ ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’పై తీసుకున్న చర్య ఎలాంటి సంకేతమిస్తుంది? ఆహారం, విద్యే కాదు... ఆక్సిజన్ నుంచి ప్లాస్మా దాకా అనేకం ప్రభుత్వమే అందరికీ అందించలేని చోట ఇలాంటి సంస్థల సేవ నిరుపమానం. చట్టం సర్వోన్నతమైనదే. కానీ, దాన్ని సాకుగా తీసుకొని, నిరూపణ కాని సమాచారంతో మానవతావాద కృషికి గండికొట్టకూడదు. అలా చేస్తే అంతకన్నా నేరం, ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడిక ప్రజల్లోని అనుమానాల్ని పాలకులే పోగొట్టాలి. పౌర సమాజ సంస్థలను ఇరుకునపెట్టడానికి ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని వాటంగా వాడుకుంటోందనే భావనను తొలగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రభువులదే! -
మైక్రో డొనేషన్స్: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!
Help Make BJP And India Strong: భారతీయ జనతా పార్టీకి "మైక్రో డొనేషన్స్" ద్వారా సహాయం చేయాలని బీజేపీ మద్దతుదారులను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్లో ..." నేను భారతీయ జనతా పార్టీ ఫండ్‌కి రూ. 1,000 విరాళం ఇచ్చాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనేది నా కోరిక. మా క్యాడర్ ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి మీ సూక్ష్మ విరాళం ద్వారా మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడండి. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం అలాగే భారతదేశాన్ని బలంగా తయారు చేయడంలో సహాకరించండి ' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ నిధికి మోదీ విరాళంగా ఇచ్చిన రసీదు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ జెపి నడ్డా కూడా పార్టీ ఫండ్‌కు రూ. 1,000 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నడ్డా ట్విట్టర్లో... నేను నమో యాప్ అనే 'డొనేషన్' మాడ్యూల్‌ని ఉపయోగించి బీజెపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. అంతేకాదు రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా కనెక్ట్ చేయవచ్చు" అని ట్విట్ చేశారు. అయితే ఈ విరాళాలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ ఈ భారీ డ్రైవ్‌ని ప్రారంభించింది. పైగా సూక్ష్మ విరాళాలు రూ. 5 నుండి రూ. 1,000 వరకు ఉండవచ్చు అని నడ్డా ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
గుడ్‌న్యూస్: ఆ నాలుగు జిల్లాలకు దళితబంధు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు మొత్తం రూ.250 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో మంగళవారం జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుం గతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన నిజాంసాగర్‌కు రూ.50 కోట్ల చొప్పున కలెక్టర్ల ఖాతాలో జమ అయినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు) -
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ (ఫోటోలు)
-
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్కులను అందజేశారు. పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను సీఎం వైఎస్ జగన్ అందజేశారు. కాగా, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు. తద్వారా దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1. వాసు గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మీ భవాని గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 2. శ్రీరాములు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన భార్య ఝాన్సీరాణి గారు 10 లక్షల చెక్కు అందుకున్నారు. 3. నాగేశ్వర్రావు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన సతీమణి సి.హెచ్.విశ్వశాంతి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 4. రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 5. పద్మ(వుమెన్ హోంగార్డు)అమరులయ్యారు. ఆమె భర్త టీ. చంద్రశేఖర్ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 6. ప్రసాద్‌రావు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన భార్య బి. లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 7. సయ్యద్ జలాలుద్దీన్ (ఏఆర్ఎస్పై)అమరులయ్యారు. ఆమె సతీమణి సయ్యద్ ఉమే సల్మా గారు గ్రాంట్‌ను అందుకున్నారు. 8. హరిబాబు గారు అమరులయ్యారు. ఆయన భార్య నిర్మల గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 9. రత్నంరాజు గారు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన సతీమణి కె. సుజాతావాణి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. చదవండి: నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్ -
తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై మరింత లోతైన విచారణ అవసరమని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. అకౌంట్స్ ఆఫీసర్ మొదలుకొని తెలుగు అకాడమీ ఉన్నతాధికారుల వరకు ఇందులో పాత్ర ఉందని, బ్యాంకు సిబ్బందితోనూ లాలూచీ వ్యవహారం కొనసాగిందన్న అనుమానం వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని భావించింది. అకాడమీలో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో కూడిన ఈ కమిటీ మంగళవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వాస్తవానికి ఈ నెల 2వ తేదీనే కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. కానీ అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు, మరికొన్ని వివరాల కోసం గడువు పొడిగించారు. వీటి ఆధారంగా ప్రాథమిక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. సీఐడీకి బదలాయింపు? మొత్తం మీద బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది, బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో కన్పిస్తోందని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. విభిన్న కోణాల్లో, శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భావించింది. మరికొన్ని లోతైన అంశాలకు ఆధారాలు వెలికితీయాల్సి ఉందని పేర్కొంది. దీన్నిబట్టి కేసును సీఐడీకి అప్పగించే వీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. నివేదికలోని వివరాలు ఇవి..! గోల్మాల్ గుర్తించకపోవడానికి కారణాలేమిటి? ‘ఏపీ, తెలంగాణ ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి చెందిన రూ.43 కోట్లను యూబీఐ బ్యాంకులో కొన్నేళ్ళ క్రితం డిపాజిట్ చేశారు. ఈ నిధులను ఏపీకి పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో అకాడమీ అధికా రులు భవనాలు, నగదు వివరాలను లెక్కించారు. పలు బ్యాంకులు సహా యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని గుర్తించారు. వీటిని తీసుకునేందుకు డిపాజిట్పత్రాలను ఈ నెల 21న బ్యాంకుకు పంపినా అక్కడి నుంచి సమాధానం రాలేదు. దీన్ని అకాడమీ అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఉన్నతాధికా రుల దృష్టికి ఈ విషయం వచ్చిందా? లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత ఉన్న అకౌంటింగ్ విభాగం డిపాజిట్ల విత్ డ్రా వ్యవహారం గుర్తించకపోవడానికి కారణా లేంటి?’ అని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుత అధికారుల బాధ్యతారాహిత్యం ‘అసలు డిపాజిట్‌ను ఆగస్టులోనే విత్‌డ్రా చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. దీనిపై అంతర్గతంగా ఏం జరిగిందనేది ఇప్పటికీ తెలుగు అకాడమీ స్పష్టంగా చెప్పడం లేదు. రికార్డుల పరిశీలనకు సంబంధించి గానీ, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. తమ హయాంలో ఏమీ జరగలేదని ప్రస్తుత అధికారులు చెప్పడాన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నాం..’ అని పేర్కొంది. ఉన్నతాధికారుల ఆమోదంతోనే.. ‘గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని ఆ సొమ్మును హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. ఎస్బీఐ తెలుగు అకాడమీ ఖాతాకు రూ. 5.70 కోట్లు బదిలీ అయ్యాయి. మిగిలిన రూ. 26 కోట్లు అకాడమీ అధికారులే విత్‌డ్రా చేశారని బ్యాంకు వర్గాల వాదన. అయితే ఈ మొత్తం వ్యవహారం అకౌంట్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాతే వ్యవహారం ముందు కెళ్తుంది. కాబట్టి ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఇదంతా జరిగిందనేది మా దర్యాప్తులో వెల్లడైంది..’ అని కమిటీ తెలిపింది. అయితే ఎందుకు? ఎవరు? అనే అంశాలపై స్పష్టత లేదని దీనిపై ఆరా తీసినప్పుడు అకాడమీ ఉన్నతాధికారులు విభిన్న వాదనలు విన్పించినట్టు కమిటీ సభ్యుడొకరు తెలిపారు. స్వాహా సూత్రధారుల పట్టివేత హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల స్వాహా కేసులో సూత్రధారులను హైదరాబాద్ సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పట్టుకు న్నారు. అకాడమీ ఏఓ రమేష్ సహా మొత్తం ఆరు గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎవరిని అరెస్టు చేయాలి? ఎవరికి నోటీసులు ఇవ్వాలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని ఈ నెల 12 వరకు సీసీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీ సులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా మిగతా నిందితుల కస్టడీపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాజేసిన సొమ్ముతో నిందితులు కొన్ని స్థిరాస్తులు ఖరీదు చేశారని, పాత అప్పులు తీర్చడం, కొత్తగా అప్పులు ఇవ్వడం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద కొంత మొత్తం నగదు అధికారులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. -
TS Assembly: పచ్చదనానికి హరిత నిధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమ చేయాలని కోరారు. దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో హరితహారం అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘హరితనిధి’ ఏర్పాటుతోపాటు ఇతర ప్రతిపాదనలను వివరించారు. సభలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అడవులు నాశనం అవుతున్నాయి. ప్రణాళికబద్ధంగా పచ్చదనం పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు హరితనిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సాయం చేయాలి. ఈ విషయంగా అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం. ప్రతినెలా జీతాల నుంచి చెల్లించేందుకు వారు అంగీకరించారు. మొత్తం 184 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని కోరాం. దీనికి టీఆర్ఎస్ సభ్యులందరూ సమ్మతం తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ హరితనిధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. గ్రీనరీలో మూడో స్థానం ప్రపంచంలో గ్రీనరీ విషయంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 66.25 లక్షల ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒకప్పుడు అద్భుతమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మాయమైపోయాయి. నర్సాపూర్ అడవులు మన కళ్ల ముందే ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఐక్యరాజ్యసమితి కూడా దీనిని ప్రశంసించింది. గ్రామపంచాయతీల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం ప్రాధాన్యతను ప్రజలకు చెప్పాం. 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. మండలానికి ఒకటి లెక్కన బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. 526 మండలాల్లోని 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లోని 109 ఏరియాల్లో మొత్తంగా 75,740 ఎకరాల్లో అర్బన్ ¯ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నాం. 53 అర్బన్ పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతాచోట్ల కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో మొక్కలు నాటాం మొత్తంగా రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం లక్ష్యంగా పెట్టుకున్నాం. సిద్దిపేటలో 20కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటాం. హైదరాబాద్ ఎకో సిస్టం నిర్వహణకు 188 రిజర్వు ఫారెస్ట్ బ్లాక్‌లున్నాయి. 1.60 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిని గోడలు, కంచెలతో రక్షిస్తున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచడా నికి 10% బడ్జెట్‌ను గ్రీనరీకే పెట్టాం. మొక్కల బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించాం. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తనిఖీలు చేసి మొక్కల పరిస్థితిని పరిశీలించాలి. కంపా నిధులు కేంద్రానివి కావు కంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావు. 100 శాతం రాష్ట్రాల డబ్బే. నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాల కోసం అటవీ భూములు తీసుకుం టాం. ఇందుకోసం అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బు చెల్లించాలి. ఇలా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.4,675 కోట్లు. ఈ నిధులనే తిరిగి రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధాని మోదీని కలిసి కోరాం. నాలుగేళ్ల తర్వాత రూ.3,109 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.1,320 కోట్లు ఖర్చు పెట్టాం. ఉపాధి హామీ కింద రూ.3,673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్ఎండీఏ ద్వారా రూ.367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ.83 కోట్లు ఖర్చు పెట్టాం. నర్సరీల పెంపకం, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఈ నిధులు వినియోగించాం. ఎక్కడా దుర్వినియోగం లేదు. ఇప్పటివరకు హరితహారం కోసం రూ.6,555 కోట్లు ఖర్చు చేశాం. అధికారుల అత్యుత్సాహం పోడు భూముల విషయంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటీవల ఘర్షణలు కూడా జరిగాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అడవుల్లో జీవిస్తున్న గిరిజనులకు ఆశ్రయం కల్పించేందుకు 2005 నాటికి ఎవరెవరు, ఎక్కడ ఉన్నారో సర్వే చేశారు. ఆ ప్రకారం భూములకు పత్రాలు ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల ఓనర్షిప్ మారదు. అది సుప్రీంకోర్టు తీర్పుల మేరకు రూపొందిన కేంద్ర చట్టం. మన చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు 3.08 లక్షల ఎకరాల మేర ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం. రైతుబంధు ప్రారంభించినప్పుడు వారికి రైతుబంధు వచ్చేది కాదు. తర్వాత వారికి కూడా ఇస్తున్నాం. పోడు భూములపై ఢిల్లీకి అఖిలపక్షం పోడు భూముల వ్యవçహారాన్ని తేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. తేల్చాల్సిన అవసరం ఉంది. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం మంచిది కాదు. అది సమసిపోవాలి. ఈ సమస్యపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ చేశాం. ఇప్పటికే పట్టాలిచ్చిన భూములు కాకుండా.. ఎంత భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారో తేల్చాల్సి ఉంది. వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చి, రైతుబంధు ఇస్తే సమస్య సమసిపోతుంది. ఇందుకోసం చట్టంలో పేర్కొన్న కటాఫ్ తేదీని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. అవసరమైతే పోడు భూముల విషయంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం. దీనితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతంలోకి వస్తున్న గిరిజనులను అడ్డుకుని, మన గిరిజనులకు రక్షణ కల్పించాల్సి ఉంది. అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందన్న ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘అభివృద్ధి కార్యక్రమాల కోసం అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములను తీసుకుంటున్నాం. వంద ఎకరాలను దళితులకు అసైన్ చేశామని అనుకుందాం. మరి ఆ భూములకు నీరివ్వాలంటే కాల్వను ఆ భూముల నుంచే తవ్వాలి. అందువల్ల కొంత భూమి తీసుకోవాల్సి వస్తుంది. పట్టా భూమి ఉన్నవారికి ఎంత పరిహారం ఇస్తామో, వీరికీ అంతే పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకున్నవి ఎక్కడైనా ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ’’ అని స్పష్టం చేశారు. ఆ 7 మండలాలపై ప్రధానితో గొడవపడ్డా.. రాష్ట్ర విభజన సమయంలో ఇష్టమున్నట్టు గీతలు గీసి భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, తమ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘ఏడు మండలాలను ఇష్టమొచ్చినట్టుగా ఏపీలో కలిపారు. అది ఫాసిస్ట్ పద్ధతి. ఈ విషయంగా ప్రధానమంత్రితోనూ గొడవపడ్డాను. గతంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడులకూ చెప్పాను. ప్రస్తుతం అక్కడ వేరే ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. ఇతర మార్గాల ద్వారా.. ►నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు ప్రభుత్వం నుంచి అందుతున్న మాదిరిగానే.. ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్, ఇతర కాంట్రాక్టుల నిధుల్లోంచి విధిగా 0.1 శాతాన్ని హరిత నిధికి జమచేయాలి. దీనిద్వారా ఏటా రూ.20–30 కోట్లు వస్తాయని అంచనా. ►నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10 శాతాన్ని హరితనిధికి జమ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్నిరకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవీకి రూ.50 చొప్పున హరిత నిధికి జమచేయాలి. ►వ్యాపార సంస్థల లైసెన్సు రెన్యువల్ సందర్భంగా రూ.1,000 జమ చేయాలి. హరితనిధి ఇలా.. ప్రజాప్రతినిధులు, అధికారులు (ప్రతినెలా జీతాల్లోంచి..) ►ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి రూ.500 (రాష్ట్రానికి చెందిన 24 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల్లో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు హరితనిధికి ప్రతినెలా రూ.500 ఇవ్వడానికి అంగీకరించారు.) ►జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ల నుంచి రూ.100 ►మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీపీ, జెడ్పీటీసీల నుంచి రూ.50 ►మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల నుంచి రూ.10 ►ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి రూ.100 చొప్పున.. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25 సాయపడతాం ప్రభుత్వం ప్రతిపాదించిన హరితనిధి కోసం కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అమాయక ప్రజల భూములు పోకూడదని.. సుమారు ఆరేడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాల విషయంగా వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. దళితులకు ఇచ్చిన భూములను హరితహారం కోసం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. హరితనిధి ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో భట్టి, రాజాసింగ్ ఇద్దరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
రిస్క్ తక్కువ.. నాణ్యత ఎక్కువ
యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్ రివర్స్ రెపో (వీఆర్ఆర్) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసుకునే వారు షార్ట్ డ్యురేషన్ (స్వల్ప కాల) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్ సాధనాలైన కార్పొరేట్ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. పనితీరు.. ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్ షార్ట్ టర్మ్ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్ 4స్టార్ రేటింగ్ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది. చదవండి: ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు పోర్ట్‌ఫోలియో.. అధిక నాణ్యత, తక్కువ రిస్క్ అనే విధానాన్ని యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్ బాండ్స్‌లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్‌ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్ డెట్ పేపర్లలో ఉన్నాయి. -
రాబడులు, రక్షణ ఒకే పథకంలో..
రిస్క్, రాబడుల మధ్య సమతుల్యం కోసం పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య (ఈక్విటీ, డెట్, ఇతర) వర్గీకరించుకోవాలన్నది ఆర్థిక సూత్రాల్లో భాగం. ఉదాహరణకు ఈక్విటీలు అధిక రాబడులకు మార్గం. కానీ, వీటిల్లో స్వల్ప కాలానికి అధిక రిస్క్ ఉంటుంది. డెట్ పథకాల్లో రిస్క్ తక్కువ. రాబడులు కూడా మోస్తరుగానే ఉంటాయి. హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అన్నది ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడులు చేయాలని కోరుకునే వారికి అనుకూలమైనది. ఈ విభాగంలోని అగ్రగామి పథకాల్లో ఇది కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 45 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో 13.47 శాతం, ఐదేళ్లలో 12.86 శాతం, ఏడేళ్లలో 12.72 శాతం, పదేళ్లలో 14.92 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఒక శాతం వరకు ఈ పథకమే మెరుగైన రాబడులను అన్ని కాలాల్లోనూ ఇచ్చింది. 2000 సెప్టెంబర్ 11న ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకున్నా కానీ వార్షిక రాబడులు 16 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం ఈ పథకం ఈక్విటీల్లో కనిష్టంగా 65 శాతం, గరిష్టంగా 80 శాతం వరకు, డెట్‌లో 20–35 శాతం మధ్య ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక ఈక్విటీ ర్యాలీల్లో మెరుగైన రాబడులు ఒడిసి పట్టుకునేందుకు.. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్ల పతనాల్లో నష్టాలను పరిమితం చేసుకునేందుకు ఈ పథకంలో అవకాశం ఉంటుంది. రెండు దశాబ్దాల చరిత్ర కలిగి ఉండడంతో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని పరిశీలించొచ్చు. డెట్ కంటే ఎక్కువ రాబడులు సమకూర్చుకోవడం, ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్ ఉండేలా చూడడం ఈ పథకం పనితీరులో భాగం. ఈక్విటీ విషయానికొస్తే స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛను కలిగి ఉంది. 65 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లో ఉంటే ఆదాయపన్ను చట్టం కింద.. ఈక్విటీ పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. 2020 మార్చి ఈక్విటీల పతనం నాటికి ఈ పథకంలో ఈక్విటీలకు కేటాయింపులు 64.9 శాతం ఉండగా.. ఆ తర్వాతి నుంచి 2020 డిసెంబ ర్ నాటికి 75 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం ఈక్విటీల్లో పెట్టుబడులు 72.4 శాతం మేర ఉంటే, డెట్‌లో 19 శాతం, మిగిలిన మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలి కాలంలో ఈక్విటీలు గణనీయమైన ర్యాలీ చేయడం తెలిసిందే. కనుక కరెక్షన్ చో టుచేసుకుంటే ఈక్విటీలకు కేటాయింపులను పెం చేందుకు ఈ పథకం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,394 కోట్ల ఆస్తులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో 38 స్టాక్స్‌ను కలిగి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులను ఈ రంగాల స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 8.26 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.28 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 6.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 7.46 ఇన్ఫోసిస్ 5.69 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5.43 రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.20 ఎల్అండ్టీ 4.15 హెచ్డీఎఫ్సీ 4.11 ఎస్బీఐ 3.66 భారత్ ఎలక్ట్రానిక్స్ 3.32 ఐటీసీ 2.98 యాక్సిస్ బ్యాంకు 2.89 చదవండి : లాభాల స్వీకరణకు అవకాశం -
Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు
మోస్తరు రిస్క్ భరించే వారు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్పీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్, స్మాల్క్యాప్లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్ పేరుతో కొనసాగడం గమనార్హం. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టుగానే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్ట్ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్ మార్కెట్లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 93గా, అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 103గా ఉన్నాయి. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్‌క్యాప్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల కేటాయింపులు ఐసీఐసీఐ బ్యాంకు 8.26 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.02 ఇన్ఫోసిస్ 4.12 అల్ట్రాటెక్సిమెంట్ 3.79 బజాజ్ ఫైనాన్స్ 3.27 బజాజ్ ఫిన్సర్వ్ 3.16 అవెన్యూ సూపర్‌మార్ట్స్ 3.07 గుజరాత్ గ్యాస్ 2.93 యాక్సిస్ బ్యాంకు 2.78 మదర్సన్ సుమీ 2.34 చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నిర్మాత భారీ విరాళం
సాక్షి, చెన్నై: ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఆ సంస్థ అధ్యక్షుడు, నిర్మాత కలైపులి ఎస్.ధాను 15 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశానికి తొలిసారి తాను అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సినిమాటోగ్రఫీ యాక్ట్ సవరణ తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో నిర్మాత హీరాచంద్, రవికొట్టారకర, సి.కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, టిపి.అగర్వాల్ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. -
నిధుల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్‌లు విజయవంతంకావడం పీఎస్‌బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్‌బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి. సంస్కరణల ఎఫెక్ట్ గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్‌బీల ఎన్పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి. 2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్‌అరౌండ్‌ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా. -
ఆ ఇంజక్షన్ ఖరీదు పదహారు కోట్లు.. ఇస్తేనే ప్రాణం నిలబడేది ?
వయస్సు పదహారు నెలల పసితనం... సమస్య అంతు చిక్కని వ్యాధి.. పరిష్కారం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్. ఇప్పుడు కావాల్సింది మనందరి సహకారం. అవును 16 నెలల పాలబుగ్గల ఆయాన్ష్ బతకాలంటే మనవంతు సాయం తప్పనిసరిగా మారింది. పన్నెండేళ్లకు వందన, మదన్ దంపతులకు పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు కలగలేదు. టీసీఎస్ ఉద్యోగిగా పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేని ఆ కుటుంబానికి సంతాన లేమి ఒక్కటే తిరని లోటుగా మారింది. పండండి బిడ్డ కోసం తిరగని ఆస్పత్రి లేదు మొక్కని దేవుడు లేడు. చివరికి వారి మొర ఆలకించి పన్నెండేళ్ల తర్వాత వారికి మగ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు ఆయాన్ష్గా పేరు పెట్టుకుని ఆ పిల్లాడే లోకంగా .. అతని ఆలనా పాలానే జీవితంగా వందన బతుకుతోంది. గుండె పగిలే నిజం ఏడాది గడిచిన తర్వాత కూడా తల్లి పాలు తాగడానికి ఊపిరి తీసుకోవడానికి ఆయాన్ష్ ఇబ్బంది పడేవాడు. అనుమానం వచ్చిన ఆ దంపతులు వెంటనే వైద్యులను సంప్రదిస్తే గుండె పగిలే నిజం తెలిసింది. ఆయాన్ష్ను పరీక్షించిన డాక్టర్లు.. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. పది వేల మంది పిల్లలలో ఒక్కరికి ఈ తరహా సమస్య వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు. ఎప్పుడూ నేలపైనే పడుకుని ఉంటారు. అలాగే వదిలేస్తే వేగంగా మృత్యువుకి చేరువ అవుతారు. రూ. 16 కోట్లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) చికిత్సకు ఔషధాలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. వైద్యులు అంతా గాలించగా కేవలం అమెరికాలోనే జోల్జెన్స్మా అనే ఔషధం అందుబాటులో ఉన్నట్టుగా తేలింది. ఆ ఇంజక్షన్ ధర 2.14 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల పదహారు కోట్ల రూపాయాలు. అంత ఖరీదైన మందు కొనే స్థోమత వందనా మదన్ దంపతులకే కాదు మన దేశంలో ఏ మధ్య తరగతి కుటుంబానికి కూడా ఉండదు. (Advertorial) చేయిచేయి కలుపుదాం ఓవైపు కన్న కొడుకును కబళిస్తున్న వ్యాధి, మరోవైపు చికిత్సకు అవసరమైన డబ్బు సర్థుబాటు చేయలేక ఆ తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఆయాన్ష్ మరణానికి చేరువ అవుతున్నారు. వారి ఇబ్బందిని చూసి బాలుడి చికిత్సకు అవసరమైన ఔషధం కొనేందుకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టో ప్రయత్నాలు ప్రారంభించింది. సోనూసూద్, ఫర్హాన్ అక్తర్ వంటి సినీ ప్రముఖులను, కొందరు వ్యాపారవేత్తలను సంప్రదించింది. కొంత వరకు డబ్బు సమకూరింది. అయితే కావాల్సిన మొత్తం రూ. 16 కావడంతో ఇంకా సాయం కావాల్సిన అవసరం ఉంది. మనం చేసే చిన్న సాయం చిన్నారి ఆయాన్ష్ ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశం కల్పిస్తుంది. ఆయాన్‌కి సాయం చేయాలనుకునే వారు కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీగిరిపల్లి పిల్లలకు చేయూత
గజ్వేల్: ‘సాక్షి’ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఆసరా లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ పిల్లల దైన్యస్థితిని తీసుకెళ్లడంతో చలించిన ఆయన, వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సోమవారం ఐదుగురు పిల్లలకు మొత్తం రూ.2.5 లక్షల చెక్కులను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో చిన్ననర్సని యాదయ్య, లక్ష్మి దంపతుల మృతితో వారి కుమారుడు సతీశ్‌తో పాటు నలుగురు కూతుళ్లు అనూష, అశ్విని, మేనక, స్పందనలు అనాథలైన విషయాన్ని జూన్ 7న ‘సాక్షి’మెయిన్ సంచిక వెలుగులోకి తెచ్చింది. ఏడాది క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోగా.. తల్లి కరోనా కారణంగా జూన్ 6న మృత్యువాత పడడంతో ఈ పిల్లలంతా అనాథలైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా సతీశ్ కొద్ది రోజుల నుంచి బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు. అనూష టెన్త్ పూర్తి చేసింది. ఆశ్విని 10వ తరగతి, స్పందన ఏడో తరగతి, మేనక అయిదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన పిల్లల పరిస్థితిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఆదేశాలిచ్చారు. విచారణ అనంతరం ముత్యంరెడ్డి కొన్ని రోజుల క్రితం నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు పిల్లలకు ఒక్కొక్కరి పేరిట రూ.50 వేల చొప్పున మొత్తంగా రూ. 2.5 లక్షల సాయాన్ని కలెక్టర్ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి బాధిత పిల్లలకు చెక్కులను అందజేశారు. -
‘మహమ్మారి నిధి’ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 తరహా పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక రిస్కు నిర్వహణ కోసం ’మహమ్మారి నిధి (పూల్)’ వంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది. తొలినాళ్లలో ప్రభుత్వమే దీనికి ఆర్థికపరమైన తోడ్పాటు అందించాలని కోరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు, వ్యక్తులు అందరి ఆలోచన.. మహమ్మారి రిస్కులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ఉందని, పూల్‌కి అవసరమైన నిధులను వారి నుంచి కూడా సేకరించడానికి అవకాశం ఉంటుందని సీఐఐ తెలిపింది. ‘తొలినాళ్లలో పూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అవసరమైనప్పటికీ.. 12–15 ఏళ్లలో మిగులు నిధులు సమకూరే కొద్దీ క్రమంగా ప్రభుత్వ మద్దతును సున్నా స్థాయికి తగ్గవచ్చు‘ అని వివరించింది. మహమ్మారిపరమైన నష్టాలను బీమా కంపెనీలు ఇప్పటిదాకానైతే ఎదుర్కొనగలిగినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కొనాలంటే మరింత భారీ స్థాయిలో మూలనిధి అవసరమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నిధి ఏర్పాటు తోడ్పడగలదని సీఐఐ తెలిపింది. పూల్‌లో కనీసం 5 శాతం నిధిని సమకూర్చుకునేందుకు పాండెమిక్ బాండ్ల జారీ అంశాన్ని పరిశీలించవచ్చని, అలాగే దీనికి కేటాయించే నిధులను కంపెనీల సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) వ్యయాలుగా పరిగణించాలని కోరింది. నిధి కోసం వసూలు చేసిన ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపునిచ్చే అంశాన్నీ పరిశీలించవచ్చని సీఐఐ పేర్కొంది. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు
హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారి బాధ్యత తీసుకుని చదివించేందుకు ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. కాగా చిన్న హీరో అయినప్పటికీ సంపూ ఇప్పటికే వరదలు, విపత్తుల సమయంలో తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలిచారు. ఇటీవల జర్నలిస్టు టీఎన్ఆర్ మృతి అనంతరం ఆయన కుటుంబానికి రూ. 50 వేలు అర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు అనాథలుగా మారారు. ఈ వార్త చూసి చలించిన సంపూర్ణేష్ బాబు తక్షణమే వారికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇదే విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేస్తూ.. ‘దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలకు నేను, మా నిర్మాత సాయి రాజేష్‌లు కలిసి రూ. 25వేల ఆర్థిక సాయం అందించాం. అంతేగాక వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇవ్వడం జరిగింది’ అంటూ ఆయన రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం సంపూ.. ‘బజారు రౌడీ, క్చాలీఫ్లవర్, పుడింగి నంబర్ వన్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరిమట్ట చిత్రంతో సంపూ హిట్ అందుకున్నారు. -
62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: ఆ బిడ్డకు తల్లిదండ్రులు జన్మనిస్తే...దాతలు పునర్జన్మను ప్రసాదించారు. పుట్టుకతోనే అతి క్లిష్లమైన స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) తో బాధపడుతున్న మూడేళ్ల బాలున్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా 62,400 మంది దాతలు చేయూతను అందించారు. ఇందుకు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా గత ఏడాది కాలంగా క్రౌడ్ ఫండింగ్ నిర్వహించి రూ.16 కోట్లు సమకూర్చింది. చందానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లిదండ్రులు నగరంలోని సికింద్రాబాద్ రెయిన్బో ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు. సదరు వైద్యుడు బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రూ.22 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఈ వ్యాధికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్ గురు స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. సదరు నిర్వాహకులు ఆన్లైన్ వేదికగా దాతలను అభ్యరి్థంచారు. ఇందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దాతల నుంచి సేకరించిన రూ.16 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసిన ఈ మందును బాలునికి ఇచ్చి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చారు. ప్రస్తుతం బాలుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు ఇప్పటికే ఇదే ఆస్పత్రి లో విజయవంతంగా వైద్యం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శనివారం మీడియా ము ఖంగా చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. చదవండి: దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి -
అగ్రి ఫండ్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: అగ్రి ఫండ్ ప్రాజెక్టులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల(ఎంపీఎఫ్సీ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఉద్యానవన కమిషనర్ ఎఫ్ఎస్ శ్రీధర్‌తో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
YouTube Shorts: చేస్తున్నారా.. అయితే..
టిక్..టాక్ దూరమైన తరువాత ఇప్పుడు యూత్ ‘యూట్యూబ్ షార్ట్స్’ వీడియోలపై మనసు పారేసుకుంది. జస్ట్ 60 సెకండ్లలో ‘ఆహా ఏమి క్రియేటివిటీ!’ అనిపిస్తే... మనసు నిండే ప్రశంసలే కాదు, పర్స్ నిండే డబ్బు కూడా మీ సొంతమవుతుంది..... డబ్బు ఉన్న దగ్గరికి మనం వెళతాం. కానీ క్రియేటివిటీ ఉన్న దగ్గరికి డబ్బు వెళుతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేయకపోవచ్చుగానీ, పర్స్ బరువును పెంచుతుంది. భరోసా ఇస్తుంది! వరల్డ్ బిగ్గెస్ట్ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ మన దినచర్యల్లో ఒకటి. మన రచ్చబండ కూడా. కాస్తో కూస్తో క్రియేటివిటీ ఉన్న యువతరానికి ఇదొక సువర్ణవేదిక అయింది. ఎందరికో ఎన్నో అవకాశాలు వచ్చాయి. సినిమా తీయడం గొప్ప. అంత పెద్ద సినిమాను నవలగా రాయడం గొప్ప. అంత పెద్ద నవలను కథగా రాయడం గొప్ప. అంత పెద్ద కథను మూడు ముక్కల్లో మినీ కవితగా రాయడం గొప్ప. మాధ్యమం మారుతున్నప్పుడు అచ్చులో అయితే ‘స్థలపరిధి’కి, దృశ్యాల్లో అయితే ‘కాలపరిధి’కి ప్రాధాన్యత ఏర్పడుతుంది. మెరుపు వేగంతో చానల్స్, వీడియోలు మార్చేస్తున్న ఈ కాలంలో ప్రేక్షక మహానుభావుల మనసును క్షణాల్లో దోచేయాలి. ‘అరే ఇదేదో బాగుందే’ అని అక్కడే ఆగిపోవాలి. అదే ‘క్లుప్తత’ గొప్పతనం. అందుకే టిక్.. టాక్ పొట్టి వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. టిక్..టాక్‌ను అచ్చంగా అనుకరిస్తూ కొన్ని బోల్తా పడ్డాయి. కొన్ని ఫరవాలేదనిపించుకున్నాయి. ‘యూట్యూబ్ షార్ట్స్’కు మాత్రం మంచి స్పందన మొదలైంది. ఈ స్పందనను మరోస్థాయికి తీసుకెళ్లడానికి తాజాగా ‘షార్ట్స్ ఫండ్’ ప్రకటించింది యూట్యూబ్. దీని ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా సొమ్ము చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు టిక్... టాక్ లేదు కాబట్టి చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపారు. ‘ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో యూట్యుబ్ సహాయపడుతుంది. మా ప్రయాణంలో షార్ట్ఫండ్స్ అనేది తొలి అడుగు మాత్రమే’ అంటున్నారు యూట్యూబ్ షార్ట్స్ డైరెక్టర్ ఎమీ సింగర్. ఎప్పుడు మొదలవుతుంది? ఎంత సొమ్ము ఇస్తారు..? మొదలైన విషయాలను ఇంకా ప్రకటించనప్పటికీ బహుమతికి అర్హమైన షార్ట్స్ వీడియోల గురించి వస్తే... ప్రేక్షకులను మెప్పించే కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్ మరి! మీ కోసం... కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ సాంకేతిక సహాకారం అందిస్తోంది. కొన్ని టూల్స్... ∙మ్యూజిక్ అండ్ సౌండ్: వీడియోకు ఒక పాట లేదా ఆడియో యాడ్ చేయవచ్చు ∙స్పీడ్: రికార్డింగ్ స్లోడౌన్ చేయడం ∙టైమర్: ఎక్కువ, తక్కువ సమయం తీసుకోకుండా నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా రికార్డింగ్ ఆగిపోవడం ∙యాడ్ క్లిప్స్ ఫ్రమ్ ఫోన్ గ్యాలరీ ∙బేసిక్ ఫిల్టర్లు -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న అక్షయ్ కుమార్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. మరోసారి కరోనా వైరస్ నివారణకు విరాళం ప్రకటించి రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో హీరో కూడా అనిపించుకుంటున్నారు. కష్టకాలంలో ఆయన ఎన్నోసార్లు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో తన వంతు సాయం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఆయన భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా కరోనా సెకండ్ వేవ్‌లో సైతం ఆయన స్వచ్చందంగా ముందకు వచ్చారు. కరోనా వైరస్ నియంత్రణకు దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందు కోసం మాజీ క్రికేటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఆయన కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా గంభీర్ తన స్వచ్చంధ సంస్థకు అక్షయ్ రూ. కోటి విరాళం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అక్షయ్ ఇచ్చింది డబ్బులు మాత్రమే కాదు, ఎందరో జీవితాలకు భరోసాను కల్పించారు. మీరు ఇచ్చిన డబ్బును మా ఫౌండేషన్ ద్వారా ఆక్సీజన్, ఆహరం ,మెడిసిన్ వంటివి అవరసరమైన వారి కోసం వినియోగిస్తాం అక్షయ్’ అంటూ రాసుకొచ్చారు. ఇక గంభీర్ ట్వీట్‌పై అక్షయ్ కూడా స్పందిస్తూ.. ‘కఠినమైన ఈ సమయంలో సాయం చేయడం నా వంతు బాధ్యత. ఈ సంక్షోభం నుండి త్వరలోనే బయటపడతామని ఆశిస్తున్నా’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల అక్షయ్ కుమార్ సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. Every help in this gloom comes as a ray of hope. Thanks a lot @akshaykumar for committing Rs 1 crore to #GGF for food, meds and oxygen for the needy! God bless 🙏🏻 #InThisTogether @ggf_india — Gautam Gambhir (@GautamGambhir) April 24, 2021 చదవండి: అందుకే 7 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పా: త్రిశాలా ఒళ్లంతా చెమటలు, ఆ క్షణం చచ్చిపోతున్నా అనుకున్నా -
ఫండ్ రివ్యూ: పెట్టుబడుల్లో పూర్తి వైవిధ్యం
గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బాస్కెట్లో పెట్టేయరాదన్నది పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి పూర్తిగా డెట్ సాధనాల్లోనో లేక ఈక్విటీల్లోనో లేక బంగారంలోనో లేక రియల్ ఎస్టేట్పైనో ఇన్వెస్ట్ చేయరాదన్నది ఇందులోని సూత్రం. ఇలా ఒకే విభాగంలో మొత్తం పెట్టుబడులను పెట్టేయడం వల్ల రిస్క్ పాళ్లు చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా విభాగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో నిధుల అవసరం ఏర్పడిందనుకోండి.. పెట్టుబడులపై రాబడులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వైవిధ్యం అన్నది పెట్టుబడులకు ప్రాణం వంటిది. మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా వైవిధ్యాన్ని కల్పిస్తాయి. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్.నరేన్ ఈ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడుల విధానం.. మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి నిబంధనల ప్రకారం ఈక్విటీలకు 10 శాతం నుంచి 80 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను బట్టి ఈ కేటాయింపులను ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటే గరిష్టంగా 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయింపులు చేయవచ్చు. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరాయని భావించిన సందర్భంలో ఈక్విటీలకు కేటాయింపులను కనిష్టంగా 10 శాతానికి వరకూ తగ్గించుకునే వెసులుబాటు ఈ పథకాల్లో ఉంటుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 నుంచి 35 శాతం మధ్య, బంగారం ఈటీఎఫ్‌లకు 10 శాతం నుంచి 35 శాతం మధ్య కేటాయింపులు చేయడం పెట్టుబడుల విధానంలో భాగంగా ఉంటుంది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలోనూ గరిష్టంగా 10 శాతం వరకు కేటాయింపులు చేస్తుంటాయి. ముఖ్యంగా ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఈ పథకాల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీల్లో 87 శాతం, డెట్ సాధనాల్లో 9 శాతం, బంగారంలో 3.9 శాతం చొప్పున పెట్టుబడులను కలిగి ఉంది. రాబడులు మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 44 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు కూడా ఉన్నాయి కనుక ఏడాది రాబడులను అంత ముఖ్యంగా పరిగణించరాదు. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలంలో పనితీరును పరిశీలించాలి. మూడేళ్లలో ఈ పథకం వార్షికంగా 10 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలోనూ 14 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను ఇస్తున్నట్టయితే మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) 34 రెట్లు వృద్ధి చెందింది. ఆరంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. గడిచి ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేయడం తెలిసిందే. ఈ విధంగా చూస్తే నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలతో పోలిస్తే ఈ పథకం మెరుగైన ఎంపికే అవుతుంది. -
సాక్షి ఎన్ఆర్ఐ ఫండ్ ఫ్యాక్టర్ లైవ్ షో
-
శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం
సాక్షి, శ్రీశైలం: దేవస్థానం అభిషేకాది ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శన కౌంటర్లు, డొనేషన్ కౌంటర్, పెట్రోల్‌బంక్‌లో జరిగిన అక్రమాల్లో 20 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీస్ విచారణలో మరో ఆరుగురి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నిందితుల్లో 16 మంది..నిజాన్ని ఒప్పుకొని, నిధులు ఎలా స్వాహా చేశారో చెప్పారని డీఎస్పీ వెంకట్రావ్‌కు తెలియజేశారు. ముఖ్యంగా దేవస్థానంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న దార్శెల్లి, రూపేష్.. ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. ఒకరి ఐడీపై మరొకరు టిక్కెట్లను అక్రమ మార్గంలో విక్రయించారు. సాంకేతికతను ఆధారం చేసుకుని ఫేక్ ఐడిని సృష్టించి దాని ద్వారా అక్రమార్జనకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ప్రక్రియ అంతా 2017లో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దేవస్థానం ఈఓ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారే కాకుండా పోలీసులు విచారణలో..హరినాయక్, చంద్ర, మురళీధర్‌రెడ్డి, రామనాయుడు, అనీల్, నరసింహులు హస్తం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: చరిత్ర గతిని మార్చే పాలన మొత్తం మీద 23 మంది నిందితులు అక్రమాలను ఒప్పుకోవడంతో.. వీరి వద్ద నుంచి అక్రమార్జిత సొమ్మును సాధ్యమైనంతవరకు రికవరీ చేసేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దేవస్థానం ద్వారా వచ్చిన రెండు కేసులే కాకుండా విడివిడిగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉన్న కేసులను ఆధారం చేసుకుని దేవస్థానంలోని మరికొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగులను దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. -
కరోనాపై పోరు: విరుష్కల మరో విరాళం
సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పోలీసులు నిర్విరామ కృషి చేస్తున్నారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తూ జనాలు అనవసరంగా రోడ్లపై రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న నిస్వార్థ సేవకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు పోలీసులకు తమ వంతు సహాయంగా శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు అందిస్తున్నారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లి అయన సతీమణి అనుష్క శర్మ పోలీసుల సంక్షేమం కోసం తమ వంతు సాయం ప్రకటించారు. ముంబై పోలీసుల సంక్షేమ నిధికి చేరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ముంబై పోలీసు శాఖకు విరుష్క దంపతులు విరాళమిచ్చినట్లు నగర కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ట్వీట్ చేశారు. విరుష్క దంపతులు రూ.5 లక్షల చొప్పున విరాళమిచ్చినందుకు కృతజ్ఞతలు కమిషనర్ తెలిపారు. కరోనా పోరులో ముందుండి నడుస్తున్న పోలీసుల రక్షణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా పోరులో భాగంగా విరుష్క దంపతులు పీఎం కేర్స్‌కు విరాళాన్ని ప్రకటించారు అయితే ఎంత విరాళం ప్రకటిచారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. Thank you, @imVkohli and @AnushkaSharma for contributing Rs. 5 lacs each towards the welfare of Mumbai Police personnel. Your contribution will safeguard those at the frontline in the fight against Coronavirus.#MumbaiPoliceFoundation — CP Mumbai Police (@CPMumbaiPolice) May 9, 2020 చదవండి: మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం ‘సెహ్వాగ్ వేరే దేశానికి ఆడుంటే..’ -
హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం
సాక్షి, ముంబై: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ కరోనాపై పోరుకు సాయం చేసేందుకు నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రూ .150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్స్ ఫండ్)కి ఈ సాయాన్ని అందించనునున్నామని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ వంతు సాయంగా బాధితుల ఉపశమన, పునరావాస చర్యలకు మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది మనందరికీ అనిశ్చితమైన, కష్టమైన సమయం. కరోనాని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా సాయుధ పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఎనలేని సేవలందిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలన్నారు. చదవండి : కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
కరోనా కష్టాలు : ఓలా ఏం చేసిందంటే...
సాక్షి, ముంబై : లాక్ డౌన్ కష్టాలనుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా నడుం బిగించింది. కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ ఇబ్బందుల్లో పడిన లక్షలమంది డ్రైవర్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. నిరుద్యోగులుగా మిగిలిపోయిన డ్రైవర్లకు, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకోసం రూ. 20 కోట్లతో ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ప్రారంభిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. స్వయంగా తన వార్షిక జీతాన్ని ఈ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దాతలందించే ప్రతీ చిన్న సహకారం మిలియన్ల కుటుంబాల శ్రేయస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందనీ, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారామొత్తం రూ .50 కోట్లు సేకరించాలని కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సంక్షోభ సమయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అవసరమైన సామాగ్రి, ఉచిత వైద్య సేవలు లాంటి వాటిపై దృఫ్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే వారి పిల్లల విద్యకు ఆర్థిక సహాయం లాంటి అంశాలపై కూడా చొరవ తీసుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వెన్నుముక లాంటి తమ డ్రైవర్లు ప్రస్తుత అసాధారణ సమయంలో ఆదాయంలేక ఇబ్బందుల్లో పడ్డారని, వారిని ఆదుకునే లక్ష్యంతోనే సంస్థ ఈ నిధిని ప్రారంభించిందని ఓలా కమ్యూనికేషన్స్ హెడ్ ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు. తక్షణ సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. అయితే ఇప్పటికే తమ డ్రైవర్ల కోసం ప్రత్యేక కోవిడ్-19 బీమా కవరేజీని ప్రకటించింది. అలాగే ఓలా అనుబంధ సంస్థ ఫ్లీట్ టెక్నాలజీస్ డ్రైవర్ల లీజ్ రెంట్లను, ఈఎంఐలను కూడా మాఫీ చేసింది. ఓలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల క్యాబ్‌లను కలిగి వుంది. 2/2 Even a small contribution will have a lasting impact on the well-being of millions of families. We invite everyone to join us and help the entire driver community in their time of need. #StrongerTogether. https://t.co/2LHrzYLNvc — Bhavish Aggarwal (@bhash) March 27, 2020 -
వారికోసం ఐటీసీ రూ. 150 కోట్ల ఫండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ కరోనా వైరస్ (కోవిడ్ -19) పై పోరులో తాను సైతం అంటూ ముందుకు ఒచ్చింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకుంది. సమాజంలోని బలహీన వర్గాల కోసం రూ .150 కోట్ల కరోనావైరస్ తక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. అలాగే లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఫండ్ ఏర్పాటుతో పాటు, సమాజంలోని బలహీన వర్గాల కోసం జిల్లా ఆరోగ్య, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు సహాయం అందించడానికి అధికారులతో కలిసి పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ సంక్షోభ సమయంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్న క్రమంలో, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రూ. 150 కోట్ల తక్షణ నిధిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన, లేదా జీవనోపాధిని కోల్పోతున్న సమాజంలోని బలహీన వర్గాలకు ఈ సాయం అందుతుందని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని అత్యంత పేద వర్గాలకు ఉపశమనం కలిగించడానికి ఈ నిధిని ప్రధానంగా ఉపయోగించనున్నామని వెల్లడించింది. తద్వారా కరోనా వ్యాప్తి నిరోధానికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతును అందిస్తున్నట్టు ఐటీసీ తెలిపింది. కరోనాపై పోరులో ముందు నిలబడి సేవలందిస్తున్న, ప్రజలకు నిత్యావసరాలను చేరవేస్తున్న యోధులకు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన పరికరాలను దేశ వ్యాప్తంగా అందిస్తామని తెలపింది. అలాగే రక్షణాత్మక వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనాకు చెక్ పెట్టాలని ఐటీసీ కోరింది. కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
సీఎం సహాయ నిధికి ఉద్యోగ సంఘాల విరాళం
సాక్షి నెట్వర్క్: కోవిడ్19 నియంత్రణకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతం విరాళంగా ప్రకటించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి, అదనపు కార్యదర్శి కత్తి రమేష్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వై.వి.రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఒకరోజు జీతం విరాళం ద్వారా దాదాపు రూ.100 కోట్లు సమకూరుతాయని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. కోవిడ్ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాన్ని అందిస్తా మని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కోన దేవదాసు, కళ్లేపల్లి మధుసూదనరాజు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల వితరణ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ విద్యుత్ ఉద్యోగులు బాసటగా నిలిచారు. మార్చి నెలలో ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర బాబు ఈ విషయాన్ని గురువారం మీడియాకు వెల్లడించారు. విరాళంగా పోగయ్యే మొత్తం రూ. 20 కోట్ల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి సీఎం సహాయనిధికి విరాళాల లేఖలను అందజేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నేతలు -
యూజర్ల ’అన్క్లెయిమ్డ్’ మొత్తం విద్యానిధికే
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది. ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది. -
ఇన్ఫ్రాకు ప్రత్యేక ఫండ్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్, విద్యుత్ సహా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ విభాగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. ఇన్ఫ్రా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రతింపులు జరిపినట్లు ఆయన వివరించారు. వీరిలో పరిశ్రమవర్గాలు, బ్యాంకులు, గృహాల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు ఉన్నట్లు మిశ్రా తెలిపారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (నారెడ్కో) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నిల్చిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తోడ్పాటునిచ్చేలా స్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నారెడ్కో, రియల్ ఎస్టేట్ సంస్థల సమాఖ్య క్రెడాయ్ మొదలైనవి కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 11న ఆర్థిక మంత్రితో భేటీ అయిన గృహ కొనుగోలుదారుల ఫోరం కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం రూ. 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని, గృహ కొనుగోలుదారులకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు ఎకానమీ మందగమనంలోకి జారుకుంటున్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా రూ. 1 లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని దేశీ కార్పొరేట్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ ప్రారంభించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 4తో ముగుస్తుంది. ప్రధానంగా దేశీ ఫార్మా, హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సేవలందించే సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000. ధరలు, నియంత్రణసంస్థల నిబంధనలపరమైన ఒత్తిళ్లన్నీ అధిగమించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఫార్మా విభాగం మెరుగైన రాబడులు అందించగలవని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ. బాలసుబ్రమణ్యన్ తెలిపారు. -
37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్
ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్ తగ్గించింది. ఇప్పటికే యూరప్, చైనా, జపాన్ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38,565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 వద్దకు పెరగవచ్చు. అటుపైన 38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,572 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275 వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11,570 స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630 వరకూ పెరగవచ్చు. -
ఓలాలో 25 కోట్ల డాలర్ల హ్యుందాయ్ పెట్టుబడులు
బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్, ఓలాలో హ్యుందాయ్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. ఓలా కంపెనీలో కొంత వాటా(సుమారుగా 4 శాతం) కొనుగోలు కోసం హ్యుందాయ్ 25 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడి సంబంధిత చర్చలు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో డీల్ కుదిరే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓలాలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ వాహన కంపెనీ ఇదే. ఈ వాటా విలువ పరంగా చూస్తే, ఓలా విలువ 600 కోట్ల డాలర్లను (రూ.42,000 కోట్లు)మించి ఉంటుందని అంచనా. తాజా పెట్టుబడుల సమీకరణలో భాగంగా ఓలా కంపెనీ 40 నుంచి 50 కోట్ల డాలర్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ పెట్టుబడులు పెట్టనున్నది. కాగా ఈ రౌండ్లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్, హాంగ్‌కాంగ్ హెడ్జ్‌ఫండ్ స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌లు ఇప్పటికే అంగీకరించాయి. మిరా అసెట్–నవెర్ ఏషియా గ్రోత్ ఫండ్ కూడా 3–4 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. గతంలో వాహన కంపెనీలు ఈ తరహా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన దృష్టాంతాలు ఉన్నాయి. సెల్ఫ్–రైడ్ కంపెనీ జూమ్‌కార్‌లో మహీంద్రా, ఫోర్డ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కాగా మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. హ్యుందాయ్‌కు ప్రయోజనం... ఒక వేళ ఈ డీల్ సాకారమైతే, హ్యుందాయ్ కంపెనీకి మంచి ప్రయోజనాలే దక్కుతాయి. ఓలాకు చెందిన లీజింగ్ యూనిట్, ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్‌కు హ్యుందాయ్ తన కార్లను విక్రయించగలుగుతుంది. త్వరలో మార్కెట్లోకి తేనున్న కోనా ఎలక్ట్రిక్ వెహికల్తో సహా మరిన్ని మోడళ్లను ఓలాకు విక్రయించగలుగుతుంది. ప్రస్తుతమున్న గ్రాండ్ ఐ10 తో సహా పలు మినీ కార్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లను అందించాలని కూడా హ్యుందాయ్ యోచిస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఓలా, ఉబెర్‌లు దాదాపు 7–8 లక్షలకు పైగా ట్యాక్సీలను నిర్వహిస్తున్నాయి. -
అభివృద్ధే తరువాయి
మెదక్ అర్బన్: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 2018–19 సంవత్సరానికి గాను రెండో విడత కింద రూ.3.70 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సెక్రటేరియట్, ప్లానింగ్ శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిధుల్లో మెదక్ నియోజకవర్గానికి రూ.1.85 కోట్లు, నర్సాపూర్ నియోజకవర్గానికి రూ.1.85 కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అభివృద్ధిపనులకు ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో తమతమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నేరుగా అభివృద్ధి పనులను చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి (సీపీఓ) శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నిధులను రెండు నియోజకవర్గాల్లో రహదారులు, మురికి కాల్వలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 2018–19 సంవత్సరానికి గాను మొదటి విడత, మే నెలలో రూ. 90 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఒక్కో నియోజకవర్గానికి రూ.45 లక్షలు చొప్పున విడుదల చేశారు. ఈ నిధులతో వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించడం, మురికి కాల్వలు శుభ్రం చేయించడం, సీసీ రోడ్లు వేయించడంతో పాటు, పెండింగ్‌లోని సమస్యలు, అలాగే నియోజకవర్గంలో నెలకొన్న ఇతర చిన్నచిన్న ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు పరిష్కారం కల్పించాల్సి ఉంటుంది. -
ఉచితం.. గగనం!
ముద్దనూరు మండలానికి చెందిన బాలవెంకటన్న కొత్తగా బోరు తవ్వించుకున్నాడు. ఏడాది కిందట వ్యవసాయ ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్‌శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బోరు బావిలో నీరుండి పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్నానని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క బాలవెంకటన్నదే కాదు.. వ్యవసాయ సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సర కాలంగా వేచి చూస్తున్న రైతులు జిల్లాలో ఎందరో ఉన్నారు. కడప అగ్రికల్చర్: రైతులకు మేం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదని పదే పదే వేదికలెక్కి సీఎం, వ్యవసాయ, విద్యుత్‌శాఖామంత్రి చెబుతున్నారు.అయితే క్షేత్రస్థాయిలో పథకాలు సరిగా అందడంలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో ప్రవేశపెట్టి రైతుల కళ్లలో వెలుగు నింపారు. అలాంటి పథకానికి టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల దరఖాస్తులకు మాత్రమే ఈ ఏడాది కనెక్షన్లు ఇస్తున్నారు.అదే ఏడాదిలో దరఖాస్తులు చేసుకున్న ఇతర వర్గాల రైతులకు ఎప్పుడు కనెక్షన్లు ఇస్తారని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్‌ప్లాన్‌లో 7,223 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 3,821 పెండింగ్‌లో ఉన్నాయి. పెరిగిన విద్యుత్ వినియోగం జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటల సాగు నేటికి 1.10 లక్షల ఎకరాలకు చేరుకుంది. పండ్లతోటలు, కూరగాయల సాగు పెరిగింది. బోరుబావుల కింద వ్యవసాయ పంటల సాగు కూడా పెరుగుతోంది. గతంలో జిల్లాలో వ్యవసాయానికిగాను 80 వేల ట్రాన్స్ఫార్మర్లు ఉండగా వీటి కింద 95,674 కనెక్షన్లు ఉండేవి.వీటి పరిధిలో రోజుకు 8.15 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది. ఇప్పుడు జిల్లాలో మొత్తం 97 వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1,53,443 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గాను రోజుకు 11.17 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటోంది. దాదాపు రోజు జిల్లాకు సరఫరా చేసే దాంట్లో 38 శాతం వ్యవసాయానికి గతంలో అవసరం ఉండేది. ఇప్పుడు పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా వినియోగం 43 శాతానికి చేరుకుంది. అంటే ఒక రోజుకు 4.3 మిలియన్ యూనిట్లు పైబడి అవసరమవుతోంది. ఇంత మొత్తంలో సరఫరా చేయడం కష్టం గా ఉందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. 3821 వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్ జిల్లాలో ఆరు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో కొత్త సర్వీసుల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 7223 దరఖాస్తులకు అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 3821 దరఖాస్తులకు ఇవ్వాల్సి ఉంది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో కనెక్షన్లు ఇవ్వకపోతే నీరుండి పంటలు పండించుకోలేకపోతున్నామని దరఖాస్తుదారులు పలుసార్లు అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిధుల కొరత వేదిస్తున్నట్లు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ పోయిందని, కనీసం రబీ సీజన్లోనైనా కనెక్షన్లు ఇస్తే నగదు పంటలు పండించుకుంటామని అన్నదాతలు అంటున్నారు. నిధుల కొరతే ప్రధాన కారణం.. ఒక సర్వీసు ఇవ్వాలంటే 3 స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, 180 మీటర్లు వైర్లు, ఇతర సామగ్రి కలిపి రూ. 80 వేలు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉచిత విద్యుత్ నేపథ్యంలో ఈ ఖర్చును విద్యుత్‌శాఖ భరిస్తోంది. ఈ లెక్కన 11,044 కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.88.35 కోట్లు పైగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇంత మొత్తం భరించడం డిస్కంకు తలకు మించిన భారం అవుతోంది. ప్రభుత్వం విద్యుత్ సంస్థకు గతంలో ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. నిధులు ఇస్తేనే పెండింగ్ కనెక్షన్లకు మోక్షం కలుగుతుంది. ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పట్లో ఇచ్చే సమస్యలేదని విద్యుత్‌శాఖ అ«ధికారులు రైతుల వద్ద తెగేసి చెబుతున్నారు. ఉచిత విద్యుత్ మంగళానికి రంగం సిద్ధం జిల్లాలో వ్యవసాయానికి ఉచిత çసర్వీసులకు సంబంధించి కడప డివిజన్లో 9,800 సర్వీసులు, పులివెందుల డివిజన్లో 22,985 సర్వీసులు, ప్రొద్దుటూరు డివిజన్లో 20,450 సర్వీసులు, మైదుకూరు డివిజన్లో 37879 సర్వీసులు, రాజంపేట డివిజన్లో 36348 సర్వీసులు, రాయచోటి డివిజ న్ 25981 సర్వీసులున్నాయి. 2004లో ఈ సర్వీసులన్నింటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పధకాన్ని అందించారు. అప్పటి నుంచి ఇప్పటì వరకు సర్వీసు చార్జీల కింద ఒక్కో సర్వీసుకు రూ.40లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వీసులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని, దీన్ని భరించడం సాధ్యం కాదని తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులకు ఎంత మేలు చేసినా తక్కువేనని, రైతులేనిది రాజ్యం లేదని, మా పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను మరింత సరళతరం చేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల సభల్లో చెప్పారని, ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ నుంచి రెండు ఫండ్స్
ముంబై: ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐక్యాప్ వెంచర్స్ (ఎస్వీఎల్) ఎంఎస్ఈ రంగానికి, అందుబాటు ధరల ఇళ్ల రంగానికి ఒక్కో ఫండ్‌ను ప్రారంభించింది. ఎస్ఎంఈ ఫండ్ ద్వారా రూ.400 కోట్లు, అందుబాటు ధరల ఇళ్ల ఫండ్ ద్వారా రూ.350 కోట్లు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ‘‘ఎస్‌ఎంఈకి సంబంధించి రూ.400 కోట్ల ఫండ్ అన్నది ఈక్విటీ ఆధారితంగా ఉంటుంది. ఇందులో ఎస్బీఐ, ఎస్బీఐ క్యాప్/ ఎస్వీఎల్ యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉంటాయి’’అని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, సీఈవో వర్ష పురంధరే విలేకరులకు తెలిపారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 18– 22% మధ్య ఉంటుందని అంచనా వేశారు. -
కేరళకు ప్రముఖ ఆలయాల విరాళాలు
సాక్షి,హైదరాబాద్ : కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అక్కడ సంభవించిన వరదల్లో ఆస్తి నష్టంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం నలుమూలల నుంచి కేరళకు విరాళాలు, సహాయ సహాకారాలు అందుతున్నాయి. తాజాగా ప్రముఖ దేవాలయాలు కేరళకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. శబరిమల అయ్యప్ప ఆలయం రూ. 10కోట్లు, తిరుమల దేవస్థానం రూ.5కోట్లు, షిర్డీ సాయి ఆలయం రూ.5కోట్లు, ముంబై సిద్ధివినాయక ఆలయం రూ. కోటి, జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం రూ.కోటి, కొల్లురూ మూకాంబికా దేవాలయం రూ.1.25కోట్లు, పండరీపుర్ ఆలయం రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. -
చైనాకు అమెరికా టెక్ దిగ్గజం సాయం
బీజింగ్ : ఓ వైపు అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్ వార్ పరిస్థితులు ఉద్రిక్తమవుతే, మరోవైపు అమెరికా టెక్ దిగ్గజాలు చైనాకు సాయం చేస్తున్నాయి. తాజాగా ఆపిల్, చైనాలో 300 మిలియన్ డాలర్ల(రూ.2,054 కోట్ల) క్లీన్ ఎనర్జీ ఫండ్‌ను లాంచ్చేసింది. ఆ దేశంలో 10 లక్షల గృహాలకు విద్యుత్ అందించే లక్ష్యంతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆపిల్ ప్రకటించింది. చైనా ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య పొగను తగ్గించాలని, దేశం జలమార్గాలను, కలుషిత మట్టిని శుభ్రం చేయాలని స్థానిక, అంతర్జాతీయ కంపెనీలను చైనా ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. పెగాట్రోన్ కార్ప్, విస్ట్రోన్ కార్ప్ వంటి 10 మంది సప్లయిర్స్‌తో కలిసి, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని ఐఫోన్ తయారీదారి పెట్టుబడిగా పెడుతోంది. కాగ, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై దెబ్బకు దెబ్బ మాదిరి టారిఫ్‌ల మోత ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రతికూలంగా మారాయి. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పిలుపు కూడా ఇచ్చారు. ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనాకే సరఫరా చేస్తుంది. ఆపిల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల స్థానిక స్మార్ట్‌ఫోన్ ప్రత్యర్థుల నుంచి ఆపిల్‌కు పెద్ద ఎత్తున్నే సవాళ్లు ఎదురవుతున్నాయి.