సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పోలీసులు నిర్విరామ కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తూ జనాలు అనవసరంగా రోడ్లపై రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న నిస్వార్థ సేవకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు పోలీసులకు తమ వంతు సహాయంగా శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు అందిస్తున్నారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లి అయన సతీమణి అనుష్క శర్మ పోలీసుల సంక్షేమం కోసం తమ వంతు సాయం ప్రకటించారు.
ముంబై పోలీసుల సంక్షేమ నిధికి చేరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ముంబై పోలీసు శాఖకు విరుష్క దంపతులు విరాళమిచ్చినట్లు నగర కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ట్వీట్ చేశారు. విరుష్క దంపతులు రూ.5 లక్షల చొప్పున విరాళమిచ్చినందుకు కృతజ్ఞతలు కమిషనర్ తెలిపారు. కరోనా పోరులో ముందుండి నడుస్తున్న పోలీసుల రక్షణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా పోరులో భాగంగా విరుష్క దంపతులు పీఎం కేర్స్‌కు విరాళాన్ని ప్రకటించారు అయితే ఎంత విరాళం ప్రకటిచారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
Thank you, @imVkohli and @AnushkaSharma for contributing Rs. 5 lacs each towards the welfare of Mumbai Police personnel.
— CP Mumbai Police (@CPMumbaiPolice) May 9, 2020
Your contribution will safeguard those at the frontline in the fight against Coronavirus.#MumbaiPoliceFoundation
చదవండి:
మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం
‘సెహ్వాగ్ వేరే దేశానికి ఆడుంటే..’
Comments
Please login to add a commentAdd a comment