ఎన్‌హెచ్‌ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ | Nhai Raises Rs 1,217 Crore Raise Through Infrastructure Investment Trust | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ

Published Wed, Oct 5 2022 8:52 AM | Last Updated on Wed, Oct 5 2022 8:52 AM

Nhai Raises Rs 1,217 Crore Raise Through Infrastructure Investment Trust - Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌) ద్వారా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. 

కేంద్ర రహదారి రవాణా, హైవేస్‌ శాఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్‌ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది.

కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్‌ అధికారి ఇటీవల వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement