raised
-
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు. ఇదీ చదవండి: సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) 2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఫోన్‌పే రూ.828 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా రూ.828 కోట్ల అదనపు నిధులను జనరల్ అట్లాంటిక్ నుంచి సమీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రూ.8,281 కోట్ల ఫండింగ్ రౌండ్లో భాగంగా జనరల్ అట్లాంటిక్, దాని సహ ఇన్వెస్టర్లు ఫోన్‌పే కంపెనీకి తాజా నిధులతో కలిపి రూ.4,554 కోట్లు అందించారు. ఈ పెట్టుబడులకు ముందు ఫోన్‌పే విలువను రూ.99,372 కోట్లుగా లెక్కించారు. ‘ఈ పెట్టుబడి సంస్థ వ్యాపారం, వృద్ధి సామర్థ్యంలో జనరల్ అట్లాంటిక్ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని ఫోన్‌పే తెలిపింది. జనరల్ అట్లాంటిక్ నుండి ఈ తాజా నిధులతో ఫోన్‌పే ప్రస్తుత రౌండ్లో మొత్తం రూ.7,039 కోట్ల ప్రాథమిక మూలధనాన్ని సేకరించింది. రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్లు కూడా కంపెనీ ప్రస్తుత రౌండ్లో పెట్టుబడి పెట్టాయి. -
ఐసీఐసీఐ బ్యాంక్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల జారీని చేపట్టింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. బిజినెస్ వృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రిడీమబుల్ డిబెంచర్ల రూపేణా 50,000 సీనియర్ సెక్యూర్డ్ దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లు బ్యాంక్ తెలియజేసింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వీటిని ఈ నెల 12న(సోమవారం) జారీ చేసినట్లు వెల్లడించింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. 7.63 శాతం కూపన్ రేటుతో వార్షిక చెల్లింపులకు వీలున్న ఈ బాండ్లు ఏడేళ్ల తదుపరి అంటే 2029 డిసెంబర్ 12న రిడీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలోని సంబంధిత విభాగంలో ఇవి లిస్ట్‌కానున్నట్లు తెలియజేసింది. -
ఎన్హెచ్ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఎన్హెచ్ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది. కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్హెచ్ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్ అధికారి ఇటీవల వెల్లడించారు. -
రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రుణ గ్రహీతలపై భారీ భారాన్ని మోపనుంది. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను 0.05శాతం లేదా 5 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు సోమవారం (డిసెంబరు 10) నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఏడాదిపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 8.50 నుంచి 8.55కి పెరగగా, 2-3 సంవత్సరాల పరిమితి రుణాలపై వరుసగా 8.66 శాతంనుంచి 8.65 కి, 8.70 శాతంనుంచి 8.75 పెరుగుతాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, రుణాలు, రీటెయిల్ట్ పర్సనల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. -
వడ్డీరేట్లు పెంచిన యూనియన్ బ్యాంకు
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు చేదువార్త అందించింది. ఎంసీఎల్ఆర్ రేటు 0.5శాతం పెంచుతూ శనివారం ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీరేట్లు ఈరోజు(డిసెంబరు 1) నుంచేఅమల్లోకి వస్తాయని వెల్లడించింది. -
రూ.10,000 వరకు పెరగనున్న టీవీల ధరలు
న్యూఢిల్లీ: టెలివిజన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్ఈడీ ల్యాంపులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై గత వారం కేంద్రం సుంకం పెంచడంతో వీటి కొనుగోలుకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్లపై సుంకం 20 శాతానికి, స్మార్ట్ఫోన్లపై సుంకం 15 శాతానికి పెరిగింది. ఎల్ఈడీ ల్యాంపులు, మైక్రోవేవ్ ఓవెన్లపైనా దిగుమతి సుంకం 20 శాతానికి చేరింది. ఎల్ఈడీ టీవీల ధరలు సగటున రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వాటి సైజుల ఆధారంగా పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల స్థానిక తయారీదారులు లాభపడతారని, దేశీయ తయారీని పెంచడమే కాకుండా ‘భారత్‌లోనే తయారీ’కి డిమాండ్ ఏర్పడుతుందన్నారు. ఓవెన్లపై రూ.400-500 వరకు పెంపు ఉంటుందని గోద్రేజ్ అప్లియన్సెస్ బిజినెస్ హెచ్ కమల్‌నంది తెలిపారు. డ్యూటీ పెంపు తర్వాత యాపిల్ ఐఫోన్ల ధరలను రూ.3,720 వరకు పెంచిన విషయం విదితమే. -
దిగొస్తున్నారు.. ధర పెంచుతున్నారు
- రూ. 1400లకు పెరిగిన బొండాలు ధర - మొదట్లో రూ. 1,150లు మాత్రమే - గత సీజన్లో రూ.1800లు వరకు కొనుగోళ్లు - రైతులకు అండగా నిల్చిన వైఎస్సార్ సీపీ నేతలు - రూ.1500 వరకు పెంచాలని డిమాండ్ - ధర పెరుగుదల కోసం రైతులు ఎదురుచూపులు - కేరళ ఎగుమతులు పెరగడంతో ధర పెంచుతున్న మిల్లర్లు - కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లపై అనుమానాలు మండపేట : మొదట్లో 75 కిలోల బొండాలు బస్తా రూ.1,150లు మించి కొనుగోలు చేయని మిల్లర్లు ముందెన్నడూ లేనివిధంగా సీజన్ ఆరంభంలోనే ధర పెంచుతున్నారు. ఊహించని విధంగా ఇప్పటికే రూ.1400లు వరకు పెరగ్గా కేరళ డిమాండ్ మేరకు ఈ ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఆరంభంలోనే అమ్మకాలు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతాంగం ఈ సీజన్లో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ధాన్యం అమ్మకాలు మందకొడిగా సాగుతుండగా ప్రస్తుత మిల్లింగ్, భవిష్యత్తు స్టాకుల కోసం మిల్లర్లు ధర పెంచక తప్పడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్టలోని మొత్తం 4.2 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరిగింది. 80 శాతం మేర బొండాలు రకాన్నే సాగుచేశారు. వాతావరణం అనుకూలించడడంతో ఈ సీజన్ ఆశాజనకంగా సాగింది. ఎకరానికి కొన్నిచోట్ల 47 బస్తాల నుంచి 50 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 13.77 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి లక్ష్యం కాగా దానిని అధిగమించి రైతులు దిగుబడులు సాధించారు. మాసూళ్లు మొదలుకావడంతో ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తుతాయని భావించిన మిల్లర్లకు ఈసారి చుక్కెదురైంది. సాగు కోసం చేసిన అప్పులు, ఎరువుల దుకాణాల బాకాయిలు చెల్లించేందుకు సాధారణంగా సన్నచిన్నకారు రైతులు దళారులకు కళ్లాల్లోనే ధాన్యాని అమ్మేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని సీజన్ ఆరంభంలో ధర తగ్గించేసి రైతుల వద్ద ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు, దళారులు ధర పెంచడం పరిపాటి. ఈ క్రమంలో మిల్లర్లు, స్టాకులు పెట్టుకున్న దళారులు భారీగా లాభపడుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైంది. కేరళలో డిమాండ్ లేదంటూ మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లు సీజన్ ముగిసిన అనంతరం ధర పెంచడం ప్రారంభించారు. 75 కేజీల బస్తా ధర క్రమంగా పెంచుతూ రూ.1800లు వరకు పెంపుదల చేశారు. రబీ సీజన్ మాసూళ్లు దగ్గరపడే వరకు రూ.1800లుండగా మార్కెట్లోని ధాన్యం రావడం ప్రారంభించే సరికి ఒక్కసారిగా ధరను రూ.1,150లకు తగ్గించేశారు. గత ఏడాది ఇదే తరహాలో మొదట్లో ధరను తగ్గించేయడం, తమవద్ద ఉన్న ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు ధరను పెంచడంతో మోసపోయిన రైతాంగం ఈసారి అమ్మకాలు చేసేందుకు ఆచితూచీ అడుగేస్తున్నారు. పెంచకుంటే ఉద్యమిస్తాం : వైఎస్సార్ సీపీ కేరళలో ఉన్న డిమాండ్ మేరకు 75 కేజీల బస్తా రూ.1500లు వరకు కొనుగోలు చేసే వీలుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసూళ్ల ఆరంభంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కంగారు పడి అమ్మకాలు చేయరాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. రూ.1500 కొనుగోళ్లు చేయకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని, అందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రూ. 1500లకు కొనుగోలు చేయాలి ప్రస్తుతం కేరళ మార్కెట్ దృష్ట్యా బస్తా రూ. 1500లు వరకు కొనుగోలు చేసే వీలుంది. ఆ దిశగా కొనుగోళ్లు జరపడం ద్వారా రైతులకు మేలు చేయాలి. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వారి పక్షాన ఉద్యమిస్తాం. వేగుళ్ల లీలాకృష్ణ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్. -
పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన
దగాపడిన అన్నదాత రబీ వరి దిగుబడి ఘనం.. ధర చూస్తే దైన్యం ఆరుగాలం శ్రమించినా రైతుకు దక్కని లాభం బస్తా ధాన్యం రూ.900 నుంచి రూ.950కి కొంటున్న దళారులు అంతంతమాత్రంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రకృతి కరుణించి.. నేలతల్లి ఒడిలో పసిడి కంకులు పండించిన వేళ.. సిరుల రాశులు పొంగిపొరలుతాయనుకున్న అన్నదాత.. షరా మామూలుగానే మరోసారి దగా పడ్డాడు. అవసరమైన సమయంలో ప్రభుత్వం తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఇదే అదునుగా అటు దళారులు, ఇటు ధాన్యం వ్యాపారులు ధర తగ్గించేయడంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. దీంతో అమ్మబోతే అడవి అన్నతీరుగా రైతు పరిస్థితి మారింది. అమలాపురం : అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు. అక్కరకు రాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడికి సరిపోతుంది పండిన పంట పెట్టుబడికి సరిపోతుంది. పెదపూడి గ్రామంలో రెండెకరాల్లో కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 50 బస్తాలు వస్తుందనుకుంటే చివరిలో దోమ సోకి ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గింది. యంత్రంతో కోసిన పంట 75 కేజీలు బొండాలు రకానికి రూ.1000, సన్నాలకు రూ.900 చొప్పున ధాన్యం కమిషన్ వ్యాపారులు ఇస్తున్నారు. దీనివల్ల మరింత నష్టపోయేలా ఉన్నాను. - వీవీ రమణ, కౌలురైతు, పెదపూడి -
బాల్యానికి రక్షణెలా?
పిల్లల రక్షణకు సంబంధించి మనకు అనేక చట్టాలున్నాయి. వారి విషయంలో అతిగా ప్రవర్తిస్తే, నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో అవన్నీ ఏకరువు పెడతాయి. అయినా ఆ నేరాల్లో తగ్గుదల లేదు. నానాటికీ పెరుగుతున్నాయి. పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో ఆ ఉదంతాలు నిత్యం తారస పడుతూనే ఉంటాయి. తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదిక దేశంలో పిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో వెల్లడించింది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ తరలింపు, బాలలపై లైంగిక నేరాలు, వారిలో పౌష్టి కాహార లోపం వగైరాలతోపాటు సామాజిక అశాంతి పిల్లలపై చూపే ప్రభావం, మధ్యలో బడి మానేస్తున్న, అసలు అక్షరానికే దూరంగా ఉన్న చిన్నారుల పరిస్థితిపై నివేదిక చర్చించింది. దేశంలోని ఏ జిల్లాల్లో పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో చెప్పే డిజిటల్ మ్యాప్‌ను కూడా రూపొందించారు. దాని ప్రకారం దేశం లోని 678 జిల్లాల్లో 409... అంటే 60 శాతం జిల్లాలు బాలలకు కంటకప్రాయంగా ఉంటున్నాయి. ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల అపహరణ అధికంగా ఉంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల బాలల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్నదని తేలింది. ఈ రాష్ట్రాలన్నిటా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. పిల్లలకు ఓట్లుంటే పాలకులు ఎలా ప్రవర్తించేవారో గానీ... ఇప్పుడైతే వారి విషయంలో క్షమార్హం కాని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏటా దాదాపు 50,000మంది మహిళలు, పిల్లలు వివిధ రాష్ట్రాల్లో మాయమవుతుండగా బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వేలాదిమంది ఆడపిల్లలు ఈ నరక కూపాల్లో పడు తున్నారు. దేశంలోని వివిధచోట్ల వ్యభిచార గృహాల్లో ఉన్న నేపాల్ బాలికల సంఖ్య 2 లక్షలుంటుందని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ చెబుతోంది. అపహరణకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి వారిని కన్నవారి వద్దకు చేర్చాలని ది హేగ్‌లో జరిగిన సదస్సులో ఆమధ్య ఒక ఒడంబడిక కుదిరింది. అయితే సకారణంగానే మన దేశం ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయినప్పుడు పరస్పర అంగీకారం లేకుండా భార్య తనతోపాటు పిల్లల్ని తీసుకెళ్లడాన్ని కూడా ఆ ఒప్పందం అపహ రణగా భావిస్తోంది. అందువల్ల సంతకం చేయకపోవడం సబబేనని వేరే చెప్పనవ సరం లేదు. అయితే అంతమాత్రాన మొత్తంగా పిల్లల అపహరణ అంశంపై అసలు శ్రద్ధే పెట్టాలన్న ధ్యాస లేకపోవడం అమానుషం. కానీ జరుగుతున్నది అదే. ఇందు వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయో తెలిస్తే గుండె చెరువవుతుంది. అపహరణకు గురవుతున్న ఆడపిల్లల్ని వ్యభిచార గృహాల్లో అత్యంత అమానవీయ మైన పరిస్థితుల మధ్య ఉంచి, మాట వినేవరకూ వారికి సరిగా నీరు, ఆహారం కూడా ఇవ్వరని ఈమధ్యే ఆంగ్ల వారపత్రిక కథనం వెల్లడించింది. వారితో వ్యభి చారం చేయించడం, బూతు చిత్రాలు తీయడం వంటివి చేస్తున్నారని తెలిపింది. చట్టాల్లో ఉంటున్న లొసుగులు, వాటిని సరిచేయడం తక్షణావసరమని గుర్తిం చని పాలకులు, ఫిర్యాదులందినప్పుడు వాటిని స్వీకరించడానికే సిద్ధపడని, స్వీక రించినా దర్యాప్తు చేయడానికి ఆసక్తి చూపని పోలీసులు ఆ బాలలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కారకులవుతున్నారు. కిడ్నాప్ ముఠాలకు రాజకీయ నాయకుల అండదండలుండటం కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. రేపటి సమాజాన్ని సుసంపన్నం చేసేలా ఎదగవలసిన పిల్లలపట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని వీరంతా గుర్తిస్తే తప్ప ఈ స్థితి మారదు. ఇప్పుడు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలలు ఎంత దయనీయంగా బతుకులీడు స్తున్నారో అందరి దృష్టికీ తీసుకురావడం హర్షించదగిన విషయం. అయితే ఇక్క డితో ఆగితే సమస్య తీరదు. ఈ డేటా ఆధారంగా, దీనికి కొనసాగింపుగా తీసుకోవా ల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శాంతిభద్రతల యంత్రాంగంలో ఈ సమస్యపై అవగాహన పెంపొందించడం అవసరం. బాలల పట్ల అపచారం జరి గిందని తెలిసిన వెంటనే చర్య తీసుకునే సంస్కృతి పెంపొందాలి. నిందితుల అరెస్టు, వేగవంతమైన దర్యాప్తు, సత్వర విచారణ, దోషులకు కఠిన శిక్షలు పడటం చాలా ముఖ్యం. బాలలకు విద్యనందించడంలో, వారికి ఆరోగ్యకర జీవనాన్ని కల్పించడంలో ముందుంటానని మన దేశం ప్రతినబూనింది. అయితే ఆచరణంతా అందుకు విరు ద్ధంగా సాగుతోంది. పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఉచిత, నిర్బంధ విద్యనందించడం కోసం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం నీరుగారింది. ఆరోగ్యా నికి సంబంధించిన అంశాల్లోనూ అదే స్థితి. యునిసెఫ్ నివేదిక ప్రకారం నివారించ దగ్గ వ్యాధులతో ఏటా దేశంలో 2 లక్షలమంది పిల్లలు కన్నుమూస్తున్నారు. వేయి మందిలో 63మంది పుట్టిన వారం రోజుల్లోనే చనిపోతుంటే అందులో 47 శాతం మరణాలు కేవలం మశూచి, ధనుర్వాతం వంటి వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు అధిక సంఖ్యలో ఉంటు న్నాయి. ఇక బాల కార్మిక వ్యవస్థ వరకూ చూస్తే ఆ విషయంలో అత్యధిక చట్టా లున్న దేశం మనదే. చిత్రంగా బాల కార్మికులు అధికంగా ఉన్నది కూడా మన దేశం లోనే. దీన్ని అరికట్టడానికి బదులు మరింత పెంచేలా నిరుడు జూలైలో 1986నాటి బాలకార్మిక వ్యవస్థ నిరోధక చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. కుటుంబ వ్యాపా రాలు, వృత్తులు, వ్యవసాయం తదితర అంశాల్లో తల్లిదండ్రులు పిల్లల సేవలను వినియోగించుకునే వెసులుబాటును ఆ సవరణ ఇచ్చింది. ఎందరు కాదన్నా దానికి పార్లమెంటు ఆమోదం కూడా లభించింది. బాల్యం పిల్లలపాలిట బందీఖానాగా, చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. అది వారి సమగ్ర వికాసానికి తోడ్పడాలి. రేపటి తరాలు బహుళ రంగాల్లో మెరికల్లా రూపొందాలంటే... వారు అన్నిటా పదు నెక్కాలంటే పిల్లలను నిరంతరం అపురూపంగా చూసుకునే వ్యవస్థ ఉండాలి. వారి రక్షణకు తోడ్పడే సకల చర్యలనూ తీసుకోవాలి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక ఆ దిశగా సాగే కృషికి ప్రాతిపదిక కావాలి. -
సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం
పట్టణంలో తీవ్రమైన ఆందోళనలు ప్రధాన రహదారిపై రాస్తారోకో సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారం పట్టణంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయపార్టీలు, ముస్లింలు నిరసనలను చేపట్టారు. కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై మహాధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆటపాటలతో నిరసనలు తెలిపారు. రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. –సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ న్యాయవాదుల కోర్టు ముందు రెండో రోజు రిలేదీక్షలు చేపట్టారు. విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, జిల్లా సాధన సమితి నాయకులు దీక్షల్లో పాల్గొంటున్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు కోడి లక్ష్మన్, బొంపెల్లి రవీందర్రావు, కళ్యాణ చక్రవర్తి, గుంటుక భువనేశ్వర్, ఆడెపు వేణు, దాసరి శ్రీధర్, మొగిలి రాజు, కటుకం బాలకుమార్‌లు పాల్గొన్నారు. – జిల్లా సాధన కోరుతూ పట్టణంలో ముస్లింలు శాంతిర్యాలీ నిర్వహించారు. ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్‌యూసుఫ్, ఎండీ.సత్తార్, ఇంతియాజ్, ముస్తాఫా, సర్వర్, రియాస్, రఫీయొద్దీన్, పాల్గొన్నారు. కేటీఆర్ ఇల్లు ముట్టడి.. జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా మంత్రి కేటీఆర్ స్పందించడం లేదంటూ ఆయన ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను జిల్లా చేయటంలో విఫలమైతున్న కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ నాయకులు పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపి పట్టణ అధ్యక్షుడు గౌడ వాసు, నాయకులు అన్నల్దాస్ వేణు, వెల్ది చక్రపాణి, చందు, కోడం ఆనంద్‌బాబు, అంజన్న, శ్యాం పాల్గొన్నారు. ఆస్పత్రిలోనూ ఆమరణదీక్ష జిల్లా సాధనకు అంబేద్కర్ చౌరస్తాలో అర్బన్బ్యాంక్ చైర్మన్ గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టగా శుక్రవారం ఉదయం పోలీసులు వారి దీక్షలను భగ్నం చేశారు. అరోగ్యం క్షీణించడంతో ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారు ఆహారం తీసుకోకుండా మొండి కేయడంతో వైద్యులు ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. -
మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!
న్యూ ఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్ గా ఈ సిఫారసుల అమలుతో వీరి ఆదాయం 23.5 శాతం మేర పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదీంచిన సిఫారసుల్లో ప్రధానంగా.. ఉద్యోగుల మూల వేతనం నెలకు 7 వేల నుంచి 18 వేలకు చేరుకోనుంది. కనీస పెన్షన్ సైతం 3,500 నుంచి 9 వేలకు పెంపును కేబినెట్ ఆమోదించింది. అలవెన్స్‌ల విషయంలో వేతన సంఘం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
పన్నుల పెంపు.. ధరలపై ఒత్తిడి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో సర్వీసు పన్నులు దాదాపు 25శాతం పెరిగాయట. ఆర్థికసంవత్సరం 2016లో దాదాపు రూ.2.1లక్షల కోట్లు సేకరించినట్టు అంచనా. అయితే ఈ పన్నుల పెరుగుదల కారణంగానే రిటైల్ ధరల పెరుగుదలపై ఒత్తిడి తీవ్రతమవుతుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిడి, కార్లు, మొబైల్ ఫోన్లపై వేసే ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కంటే ఈ సర్వీసు పన్నులు ఎక్కువగా ఉన్నాయట. 2015 ఏప్రిల్ లో ప్రభుత్వం సేకరించిన 12.3 శాతం పన్నులు 2015 మే వరకు 14శాతానికి పెరిగాయని తెలుస్తోంది. రెస్టారెంట్లు, పెట్రోలు పంపులు, మల్టీ ఫ్లెక్సిల్స్ లాంటి వాటిపై వేసే పన్నులు సర్వీసు టాక్స్ ల కిందకు వస్తాయి. పీవీఆర్ భారత్ లో కలిగిఉన్న 500 మల్టీప్లెక్సిల్స్ పై రూ.1,750 కోట్ల అమ్మకాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ.40కోట్లు సర్వీసు పన్నులు చెల్లించారట. అయితే 2014 ఆర్థికసంవత్సరంలో ఈ పన్నుల మొత్తం కేవలం రూ.7.3కోట్లు మాత్రమే. అయితే కేవలం పన్నుల రేట్లు పెంచడం ద్వారానే ఈ మొత్తం పెరగడం లేదని, పన్నుల ఎగవేతపై ప్రభుత్వం తీసుకునే చర్యలు సర్వీసు పన్నుల కలెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.. అయితే పన్నుల రేట్ల పెంపు, టాక్స్ బేస్ పెరగడం కూడా పన్నుల కలెక్షన్ కు సహాయపడుతుందని తెలిపారు. టెక్నాలజీ సహాయంతో సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ పన్నుల ఎగవేతదారులను గుర్తించడం ప్రారంభించింది. దీంతో ఎగవేతదారులను నిరోధించగలిగామని సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. -
ఉత్తరప్రదేశ్ లో నినాదాల కలకలం
మీరట్: ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సర్దానా ప్రాంతంలో మళ్ళీ కలకలం సృష్టించింది. ఇప్పటికే జెఎన్ యు కేసుతో దేశం అట్టుడుకుతుండగా మీరట్ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఓ సంతాప సభ సమావేశం అనంతరం ఓ గ్రూప్ నకు చెందని కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంలో ముజఫర్ నగర్ సోనిపట్ లో మృతి చెందిన దళిత యువకుడు కులదీప్ మృతికి సంతాపంగా సర్దానాలో సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పాటు రోడ్లను నిర్బంధించినట్టు రూరల్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. మత వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్ళిన కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆరుగురు కార్యకర్తలు మత మనోభావాలను దెబ్బతీసేవిధంగా నినాదాలు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని రూరల్ ఎస్పీ తెలిపారు. ప్రత్యేక భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. -
’నా పై ఆరోపణలు అవాస్తవం’
-
తెలుగు రాష్ట్రాలు భగభగ
నిజామాబాద్‌లో 45 డిగ్రీలు కోస్తాలోనూ సెగలు సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. వేడి సెగలు కక్కుతున్నాయి. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో శనివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో ఈ సీజనులో ఇదే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం విశేషం. రామగుండంలో 43 డి గ్రీలు, రాయలసీమలోని కర్నూలు, కోస్తాంధ్రలోని నెల్లూరులో 42 డిగ్రీలు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురంలో 41 డిగ్రీలు, నందిగామ, కావలి, గన్నవరంలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో ఒకట్రెండు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం తన నివేదికలో పేర్కొంది. -
కార్ల ధరలకు రెక్కలు
-
మద్యం కేసుల పై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావన