న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల జారీని చేపట్టింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. బిజినెస్ వృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రిడీమబుల్ డిబెంచర్ల రూపేణా 50,000 సీనియర్ సెక్యూర్డ్ దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లు బ్యాంక్ తెలియజేసింది.
ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా వీటిని ఈ నెల 12న(సోమవారం) జారీ చేసినట్లు వెల్లడించింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. 7.63 శాతం కూపన్ రేటుతో వార్షిక చెల్లింపులకు వీలున్న ఈ బాండ్లు ఏడేళ్ల తదుపరి అంటే 2029 డిసెంబర్ 12న రిడీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలోని సంబంధిత విభాగంలో ఇవి లిస్ట్‌కానున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment