ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది.
కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది.
అధికార దుర్వినియోగం తగదు
‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment