ICICI
-
మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?
భారత స్టాక్‌మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్రంగా పడిపోయిన మార్కెట్ సూచీల్లో ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లే అధికంగా ఉన్నాయి. అందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ చేసిన కామెంట్లు కారణమని కొందరు భావిస్తున్నారు. అసలు ఆయన స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారో తెలుసుకుందాం. స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో సాధించిన లాభాలను కాపాడుకోవాలని నరేన్ సూచించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్‌లో ఉన్నాయని, రిస్క్‌లను నిర్వహించడానికి వైవిధ్యభరితంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.లాభాలు కాపాడుకోవడం: గత ఐదేళ్లలో ఆర్జించిన రాబడులను కాపాడుకోవాలని నరేన్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో ఈక్విటీలు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు గణనీయమైన రాబడులను చూశారని ఆయన పేర్కొన్నారు.ఓవర్ వాల్యుయేషన్: లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక విలువను కలిగి ఉన్నాయని నరేన్ అన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను విక్రయించడమే ఈ అసమానతలకు కారణమని, ఇది మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ధరలను పెంచేలా చేసిందన్నారు.డైవర్సిఫైడ్ స్ట్రాటజీ: ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్టాక్స్, బంగారం, వెండి వంటి పెట్టుబడులను సూచిస్తూ వైవిధ్యభరితంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులన్నీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టొద్దని తెలిపారు.మార్కెట్ అస్థిరత: 2008-2010 కాలం కంటే 2025 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు ఈ విభాగాల్లో తమ పెట్టుబడులను రిడీమ్ చేసుకోవాలని సూచించారు.ఇదీ చదవండి: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?వివరణనరేన్ చేసిన ఈ వ్యాఖ్యలను మార్కెట్ పరిగణలోకి తీసుకుని భారీగా నష్టపోయినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై నరేన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భారత మార్కెట్లో దీర్ఘకాలిక వృద్ధి తథ్యం. దానిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రస్తుత సవాలు డబ్బు సంపాదించడం కాదు. దాన్ని పరిరక్షించడం. ఇన్వెస్టర్లు తమ లాభాలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. ఎప్పటినుంచో చాలామంది అంచనా వేస్తున్నట్టుగానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ భారీగా పెరిగాయి. ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఈ వ్యవహారంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడిదొడుకులకు లోనుకావద్దని, దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్‌డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్‌లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్‌కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్‌లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌తో 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్‌డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్‌లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్‌లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్‌సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్‌డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్‌లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్‌లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్‌సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌ల విత్‌డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్‌తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్‌లతో రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్‌లు రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
చందా కొచ్చర్ అరెస్టుపై.. సీబీఐకి కోర్టు మొట్టికాయలు!
ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది. కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం తగదు ‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
అన్ని కాలాలకూ అనువైనది.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్
కొంత కాలంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కీలక సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బంగారం ధరలు చెప్పుకోతగ్గంత పెరిగాయి. మార్కెట్ల గమనం పట్ల స్పష్టమైన సంకేతాలు కనిపించనప్పుడు.. అనుభవం లేని ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించడం కష్టమే అవుతుంది. వేర్వేరు సాధనాల్లో ఉండే అస్థిరతలు, అనుకూల అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గం.. మల్టీ అస్సెట్ మ్యూచవల్ ఫండ్స్. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరుతో ముందుంది. రాబడులు ఈ పథకం 2002 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూస్తే ఏటా 21.13 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై రాబడులను తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలోనూ 22 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్లలో 27 శాతం, ఐదేళ్లలో 15.73 శాతం, ఏడేళ్లలో 14.71 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున సగటు వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడితో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ పథకం రాబడుల్లో అందనంత ఎత్తులో ఉంది. మల్టీ అస్సెట్ అలోకేషన్ విభాగం రాబడి ఏడాది కాలంలో 13.55 శాతం, మూడేళ్లలో 15.42 శాతం, ఐదేళ్లలో 9.35 శాతం, ఏడేళ్లలో 7.69 శాతం, పదేళ్లలో 9.58 శాతం చొప్పున ఉంది. 6–12 శాతం వరకు ఈ పథకమే అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాల నుంచి అద్భుతమైన రాబడులను ఇవ్వడమే కాదు, పనితీరులోనూ ఎంతో స్థిరత్వం కనిపిస్తుంది. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ (ఉద్దాన పతనాలు) ఈ పథకం బలమైన పనితీరు చూపించింది. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఉంటే, గత మూడేళ్లలో 23 శాతం, ఐదేళ్లలో 21.8%, పదేళ్లలో 16.6 శాతం చొప్పున వార్షిక సగటు రాబడిని ఈ పథకం ఇచ్చి ఉండేది. పెట్టుబడుల విధానం.. మల్టీ అస్సెట్ పథకాలు ఈక్విటీ, డెట్, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. దీంతో దీర్ఘకాలంలో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులకు అవకాశం లభిస్తుంది. ఈ మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. వివిధ సాధనాల్లో ర్యాలీ ప్రయోజనాలను ఈ పథకం రూపంలో సొంతం చేసుకోవచ్చు. అచ్చమైన ఈక్విటీ పథకాలు మార్కెట్ల పతనాల్లో ఎక్కువ నష్టాలను చూస్తాయి. వాటితో పోలిస్తే బహుళ సాధనాలతో కూడిన ఈ పథకంలో పెట్టుబడుల విలువ క్షీణించే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. లంప్సమ్ (ఒకే విడత), సిప్ రూపంలో పెట్టుబడులకు ఈ పథకం అనుకూలం. మార్కెట్ల కంటే ఈ పథకమే రిస్క్‌లను మెరుగ్గా నియంత్రించగలదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.21,705 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 58 శాతం కేటాయించింది. 14 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్‌లో 0.94 శాతం పెట్టుబడులు పెట్టింది. నగదు, నగదు సమానాల రూపంలో 33.73 శాతం కలిగి ఉంది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్‌చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్‌చేశాయి. -
ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్‌ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లొచ్చని సూచించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
ఐసీఐసీఐ బ్యాంక్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల జారీని చేపట్టింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. బిజినెస్ వృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రిడీమబుల్ డిబెంచర్ల రూపేణా 50,000 సీనియర్ సెక్యూర్డ్ దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లు బ్యాంక్ తెలియజేసింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వీటిని ఈ నెల 12న(సోమవారం) జారీ చేసినట్లు వెల్లడించింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. 7.63 శాతం కూపన్ రేటుతో వార్షిక చెల్లింపులకు వీలున్న ఈ బాండ్లు ఏడేళ్ల తదుపరి అంటే 2029 డిసెంబర్ 12న రిడీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలోని సంబంధిత విభాగంలో ఇవి లిస్ట్‌కానున్నట్లు తెలియజేసింది. -
RBI CBDC: డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ
ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్‌సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ – రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది. ‘డిజిటల్ రూపీ (హోల్‌సేల్ విభాగం) తొలి పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా.. 2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి. -
రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం భారత్‌లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్‌లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది. అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్‌లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే.. అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్‌ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్ పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ’ఫెస్టివ్ బొనాంజా’ పేరిట ప్రత్యేక ఆఫర్లనక్ప్రకటించింది. తమ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డ్‌లెస్ ఈఎంఐ మొదలైన వాటి ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్‌బాస్కెట్, అజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంకు ఈడీ రాకేష్ ఝా తెలిపారు. రుణాలపై కూడా (గృహ, వ్యక్తిగత, బంగారం రుణాలు మొదలైనవి) ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని వివరించారు. వీటితో పాటు బ్యాంక్ పేర్కొన్న వస్తువులను కొనుగోళ్లు చేసే కస్టమర్లకు కార్డ్‌లెస్ ఈఎంఐ(EMI), 'నో-కాస్ట్ ఈఎంఐ(EMI) వంటి సౌకర్యాలను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంపై ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో ఆన్లైన్ షాపింగ్‌పై 10% తగ్గింపు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: అర్మానీ ఎక్స్ఛేంజ్, కెనాలి, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్, బ్రూక్స్ & బ్రదర్స్ వంటి లగ్జరీ బ్రాండ్లపై అదనపు 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్లపై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో 10% వరకు క్యాష్‌బ్యాక్. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌లో కస్టమర్లు ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు. దుస్తులు & ఆభరణాలు: షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, అజియో, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ దుస్తుల బ్రాండ్లపై అదనంగా 10% తగ్గింపు. అలాగే పీసీ జ్యువెలర్స్ (PCJ) నుంచి కనీసం ₹50,000 కొనుగోలుపై ₹2,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ -
ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ రివ్యూ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్బీఐ, ఫెడ్ సహా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. రాబడులు వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్‌లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. పోర్ట్‌ఫోలియో.. పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్‌కేర్ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్ స్టాక్స్‌కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో బ్రోకరేజీ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 273 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 795 కోట్లకు చేరింది. సంస్థాగత ఈక్విటీల విభాగం ఆదాయం 17 శాతం నీరసించి రూ. 49 కోట్లకు చేరింది. మార్కెట్లో పరిమాణం మందగించడం, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు క్షీణించడం ప్రభావం చూపింది. కాగా.. పంపిణీ బిజినెస్ ఊపందుకుంది. 28 శాతం జంప్‌చేసి రూ.152 కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తదితర ప్రొడక్టులు ఇందుకు సహకరించాయి. మార్జిన్ ఫండింగ్ ద్వారా రూ. 619 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపుకాగా.. 80 లక్షల మంది క్లయింట్ బేస్‌ను కలిగి ఉంది. క్యూ1లో కొత్తగా 4.4 లక్షల మంది జత కలిశారు. ఇదే కాలంలో ఇతర బ్రోకింగ్ సంస్థలు జిరోధా 62 లక్షలు, అప్‌స్టాక్స్ 52 లక్షలు, గ్రో 38 లక్షలు, ఏంజెల్ వన్ 36 లక్షల చొప్పున క్లయింట్లను గెలుచుకోవడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 469 వద్ద ముగిసింది. -
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఐసీఐసీఐ లాంబార్డ్ గురి..
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అదనపు పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలియజేసింది. సంస్థ స్థూల ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,977 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.14,003 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. వార్షికంగా ప్రీమియం ఆదాయంలో 28.7 శాతం వృద్ధి నమోదైంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విజయవంతంగా విలీనం చేసుకుంది. ఈ విలీనం అనంతరం జీడీపీఐ పరంగా పరిశ్రమలో రెండో స్థానానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ చేరుకుంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 2021–22లో 11 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘పరిశ్రమకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యధిక వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా మంచి వృద్ధిని చూస్తోంది. రిటైల్ హెల్త్ విభాగంలో వృద్ధి అవకాశాల దృష్ట్యా మా పెట్టుబడులను పెంచాం. రిటైల్ హెల్త్ ఏజెన్సీ బృందంలో విక్రయదారుల సంఖ్యను పెంచాం’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా వాటాదారులకు వివరించారు. అధిక వృద్ధి నమోదు.. ‘‘సంస్థ మోటారు ఇన్సూరెన్స్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పరిమిత వృద్ధినే చూసింది. సరఫరా సమస్యలు, డిమాండ్ సెంటిమెంట్ తక్కువగా ఉండడం కారణాలు. ఇక ద్వితీయ ఆరు నెలల్లో మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంది. పరిశ్రమ కంటే కంపెనీయే అధిక వృద్ధిని సాధించింది’’అని దాస్ గుప్తా తెలిపారు. ఎస్ఎంఈ విభాగంలో 17.8 శాతం వృద్ధిని చూసింది. ఫైర్ ఇన్సూరెన్స్‌లో సంస్థ వాటా 12.8 శాతం, ఇంజనీరింగ్‌లో 15.2 శాతం, మెరైన్కార్గో ఇన్సూరెన్స్‌లో 17.9 శాతానికి చేరుకుంది. -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్‌లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్‌కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్‌ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్‌చేసి రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్ బేస్ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. క్యూ4లో ఆల్‌రౌండ్ పనితీరు చూపినందుకు సంతోషిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో విజయ్ చందోక్ పేర్కొన్నారు. అన్ని బిజినెస్ విభాగాల్లోనూ వృద్ధి సాధించామని, ఇది మా సామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం జంప్‌చేసి రూ. 3,438 కోట్లయ్యింది. -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్‌కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్‌లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్‌కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్‌యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
ఈ బ్యాంకులు దివాలా తీయవ్ ! ఆర్బీఐ కీలక ప్రకటన
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజాలు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేకత ఏమిటి? డీ–ఎస్ఐబీలను ‘టూ బిగ్ టూ ఫెయిల్ (టీబీటీఎఫ్)లుగా పరిగణిస్తారు. ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదన్నది దీని ఉద్దేశ్యం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనా, దీనిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆయా అంశాల వల్ల ఈ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధుల సమీకరణలో నిర్దిష్ట సాను కూలతలు, ప్రయోజనాలను పొందగలుగుతాయి. మరికొన్ని ముఖ్యాంశాలు... ఆర్బీఐ ప్రకటనకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... డీ–ఎస్ఐబీ నిర్ధారణ ఫ్రేమ్‌వర్క్ 2014 జూలైలో జారీ అయ్యింది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్బీఐ డీ–ఎస్ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీకి కూడా ఇదే హోదా లభించింది. కాగా, డీ–ఎస్ఐబీల కోసం అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) సౌలభ్యతను ఏప్రిల్ 1, 2016 నుండి దశలవారీగా ప్రారంభించడం జరిగింది. 2019 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది. తగిన మూలధన కల్పనలో ఈ సౌలభ్యత కీలకమైనది. బ్యాంక్ షేర్ ధరలు ఇలా... నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో (ఎన్ఎస్ఈ)లో మంగళవారం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల షేర్ ధరలు వరుసగా రూ. 483.50 (2.70% అప్), 772.85 (1.07% పెరుగుదల), 1,528.55 (0.59% పురోగతి) వద్ద ముగిశాయి. చదవండి: ముత్తూట్ విభాగానికి షాక్.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు! -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్‌మార్కెట్స్ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్‌ను బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్‌మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి. అక్టోబర్ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్ కొట్టిన దెబ్బకు రిలయన్స్, హెడీఎఫ్సీ లాంటి టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి. బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్-10 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడింది. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ►రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది. ►హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది. ►టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. ►ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ►కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది. ►బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్-క్యాప్ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. ►హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది. ►హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది. గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది. ►టాప్-10 మార్కెట్ క్యాప్ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! -
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
ఏటీఎం కేటుగాళ్లు.. అసలు సంగతి ఇది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌కు చెందిన సెక్యూర్ వాల్యూ సంస్థలో కస్టోడియన్‌గా పని చేసిన కృష్ణకు ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేయడానికి ఆ సంస్థలో ఉన్న లోపాలే కలిసి వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇతడితో పాటు మాజీ సహోద్యోగి రాజశేఖర్‌ను సైతం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. న్యాయస్థానం అనుమతితో ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్న అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యవస్థాగత లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు. ► సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని చేపట్టింది. వరంగల్‌కు చెందిన రాపాక రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ సంస్థలో కస్టోడియన్‌గా పని చేశాడు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన రూ.1.23 కోట్లు మరికొందరితో కలిసి కాజేసిన ఆరోపణలపై గతంలో అరెస్టు అయ్యాడు. ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఇదే సంస్థలో కస్టోడియన్‌గా పని చేస్తున్న గండెల్లి కృష్ణకు ఓ రూట్ అప్పగించారు. ► సెక్యూర్ వాల్యూ సంస్థ ప్రతి నెలా కచ్చితంగా ఆడిటింగ్ నిర్వహించేది. అయితే ఆ రోజు ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఆడిటింగ్ చేయనున్నారో ముందే సిబ్బందికి చెప్పేది. ఇలా విషయం తెలుసుకునే కృష్ణ మరో ఏటీఎం నుంచి డబ్బు తెచ్చి అందులో పెట్టేవాడు. మరోపక్క ఓ ఏటీఎం మిషన్‌ను తెరవడానికి రెండు పాస్వర్డ్స్ వినియోగించాల్సి ఉంటుంది. భద్రత నిబంధనల ప్రకారం ఒక్కో పాస్వర్డ్ ఒక్కో ఉద్యోగికి చెప్పి బాధ్యుడిని చేయాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం రెండింటినీ ఒకే కస్టోడియన్‌కు చెప్పేస్తోంది. ► ఒక్కో పాస్వర్డ్ వ్యాలిడిటీ గడువు గరిష్టంగా 24 గంటల మాత్రమే. ఆ మరుసటి రోజు ఏ ఏటీఎంలో డబ్బు నింపాలో దానివే చెప్పాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం ఆయా రూట్లలో ఉన్న అన్ని ఏటీఎంలవీ కస్టోడియన్లకు వాట్సాప్ ద్వారా పంపించేస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్న కృష్ణ సంస్థ నిర్వాహకులకు అనుమానం రాకుండా వ్యవహరించాడు. మూడు నెలల కాలంలో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.కోటి కాజేశాడు. ఏ ఒక్క ఏటీఎం నుంచీ మొత్తం డబ్బు కాజేయలేదు. ఒక్కో దాని నుంచి కొంత చొప్పున మాయం చేశాడు. ► ఫలానా రోజు ఏ ఏటీఎంలో ఆడిటింగ్ జరుగుతుందో తెలుస్తుండటంతో.. మరో దాంట్లో నుంచి అవసరమైన మొత్తం తెచ్చి అందులో నింపి తప్పించుకునేవాడు. ఈ వ్యవహారాల్లో తన మాజీ సహోద్యోగి రాజశేఖర్ సలహాలు తీసుకుంటూ కొంత మొత్తం చెల్లించాడు. ఓ దశలో తన వ్యవహారం బయటపడుతుందని భావించిన కృష్ణ ఆ విషయం రాజశేఖర్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి రూ.30 లక్షలు కాజేయాలని, ఆపై కృష్ణ పోలీసులకు లొంగిపోవాలని పథకం వేశారు. అనుకున్నట్లే కాజేసిన కృష్ణను తన వాహనంపై పికప్ చేసుకున్న రాజశేఖర్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన వాటా తాను తీసుకుని ఉడాయించాడు. స్వాహా చేసిన డబ్బును కృష్ణ తన చెందిన వాటితో పాటు తన భార్య బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు. ఆపై ఆన్లైన్ బెట్టింగ్‌లో దాదాపు 90 శాతం కోల్పోయాడు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు ఐసీఐసీఐ ‘హాస్పిక్యాష్’
బెంగళూరు: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్ వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు చెందిన గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీ ‘గ్రూపు సేఫ్ గార్డ్’ను ఆఫర్ చేయనుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే చికిత్సల వ్యయాలతో సంబంధం లేకుండా.. ఈ పాలసీలో ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదును చెల్లించడం ఉంటుందని ఇరు కంపెనీలు ఉమ్మడిగా ఓ ప్రకటనలో తెలిపాయి. గ్రూపు సేఫ్ గార్డ్ పాలసీలో హాస్పిక్యాష్ బెనిఫిట్ కింద ప్రతిరోజూ కనీసం రూ.500 నుంచి గరిష్టంగా ఎంచుకున్న మేరకు పరిహారాన్ని పాలసీదారులు పొందడానికి వీలుంటుంది. అందుబాటు ధరలకే, కాగిత రహిత, సౌకర్యవంతమైన పాలసీ ఇదని, ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరినా లేదా ముందుగా నిర్దేశించుకున్న మేర చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా నగదు ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు తీపికబురు -
12న అమెజాన్ స్మాల్ బిజినెస్ డే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ డిసెంబరు 12న స్మాల్ బిజినెస్ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు, నేతపనివారు, స్థానిక దుకాణదారులకు చెందిన ఉత్పత్తులను ఈ సందర్భంగా విక్రయిస్తారు. డిజిటల్ చెల్లింపులు జరిపితే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీలకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. స్మాల్ బిజినెస్ డే ఈ ఏడాది జరుపుకోవడం ఇది రెండవసారి. (రిలయన్స్ డీల్: అమెజాన్‌కు సమన్లు) ఈడీకి లేఖ రాసిన సీఏఐటీ అమెజాన్‌పై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లేఖ రాసింది. ఉత్పత్తులను అతి తక్కువ ధరల్లో విక్రయిస్తూ కోట్లాది మంది చిన్న వర్తకులకు కష్టాలను తెచ్చిపెడుతోందని లేఖలో పేర్కొంది. ‘అమెజాన్ 2012 నుంచి నిర్లక్ష్యంగా, స్పష్టంగా చట్టాలు, నియమ, నిబంధనలను ఉల్లంఘించింది. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఇతర అనుబంధ కంపెనీలు, బినామీలు మార్కెట్‌ప్లేస్ ఆధారిత విధానం పేరుతో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇది ఎఫ్‌డీఐ పాలసీ, ఫెమా యాక్ట్‌ను ఉల్లంఘించినట్టే’ అని వివరించింది. -
ఐసీఐసీఐ సెక్ రికార్డ్ -ఫెడరల్ బ్యాంక్ జోరు
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బ్రోకింగ్, రీసెర్చ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 569కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 548 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌటర్ 38 శాతం జంప్‌చేయడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 22న క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు వెల్లడించేందుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బోర్డు సమావేశమవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించాక అంటే మే 7 తదుపరి రూ. 361 స్థాయి నుంచి ఈ షేరు 53 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు రూ. 54 సమీపానికి ఎగసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 401 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 3,444 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.99 శాతం నుంచి 2.96 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరుకి గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీ రూ. 74 టార్గెట్ ధరతో బయ్ రేటింగ్‌ను ప్రకటించింది. -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
కరోనా: ఐసీఐసీఐ గ్రూప్ 100 కోట్ల విరాళం
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో ఐసీఐసీఐ గ్రూప్ దేశానికి మద్దతుగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న ఐసీఐసీఐ గ్రూపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని మంగళవారం ప్రకటించింది. ఇందులో రూ.80 కోట్లు పీఎంకేర్స్‌కు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు రూ.20 కోట్లు అందించనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రెసిడెంట్ సందీప్ బాత్రా ప్రకటించారు. కరోనా వైరస్ దేశ ప్రజలపై గట్టి సవాల్ విసిరింది.(కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) ఈ సమయంలో అందరం కలసి కట్టుగా నిలబడి పోరాటాలని కోరుతున్నామని బాత్రా తెలిపారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ విరాళాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్ మాస్కులు, 40వేలకు పైగా ఎన్95 మాస్కులు, 20వేల లీటర్ల శానిటైజర్లు, 16వేల గ్లౌజ్‌లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్ ఐ గేర్, 50 థర్మల్ స్కానర్లు, వెంటీలేటర్లను వివిధ ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని చెప్పారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న ప్రజలకు తమ సేవలను కొనసాగిస్తామని వెల్లడించారు. (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు) -
‘యస్’ ప్రణాళికకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్‌ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ పెట్టుబడులు.. యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది. రాణా కపూర్‌పై మరో సీబీఐ కేసు.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు. ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది. అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు. -
ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్ రుణాలు
ముంబై: ఫైనాన్స్ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్ డ్యురబుల్స్, క్రెడిట్ కార్డులు) కారణంగా రుణ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది. -
ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్ లాభాలు రూ.1,350 కోట్లు–రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 18,574 కోట్ల నుంచి రూ. 21,405 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్ ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి. ఎన్ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ. 5 కోట్ల నుంచి రూ. 2,514 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 27,174 కోట్ల నుంచి రూ. 33,869 కోట్లకు పెరిగింది. ♦ వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి) రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్ పేర్కొంది. ఈ బ్యాంక్ కేటాయింపులు గత ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్పీఏలు జతయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్పీఏలు రూ.4,036 కోట్లకు పెరగ్గా, ఇప్పుడు తగ్గడం గమనార్హం. నిరర్ధక రుణా ల రికవరీలు రూ.931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్న స్థూల ఎన్ పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్పీఏలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది. -
మరోసారి ఈడీ ముందుకు కొచర్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ మంగళవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం దాదాపు ఎనిమిది గంటలపాటు వీరిని ఈడీ ప్రశ్నించింది . వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. బ్యాంకు రుణాలమంజూరులో మోసం, నగదు బదిలీ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్.. ప్రతిగా ఆమె భర్త దీపక్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,170 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,170 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,141 కోట్లు) తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంట్లో ట్యాక్స్ రిఫండ్ ప్రయోజనాల కారణంగా రూ.440 కోట్లు, అనుబంధ కంపెనీల లాభం రూ.489 కోట్ల మేర ఉండటం విశేషం. అయితే స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ఇవ్వనున్నది. తగ్గిన స్టాండ్అలోన్ లాభం... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,020 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 5 శాతం తగ్గి రూ.969 కోట్లకు చేరిందని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా నికర లాభం తగ్గినా, అనుబంధ కంపెనీల తోడ్పాటుతో ఈ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.33,760 కోట్ల నుంచి రూ.36,784 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి 27 శాతం ఎగసి రూ.7,620 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 15 శాతం పెరగ్గా, రుణాలు 17 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. గత క్యూ4లో రూ.7,300 కోట్ల బకాయిలను రద్దు చేశామని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 60 శాతం నుంచి 80 శాతానికి ఎగసిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఇతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం క్షీణించి రూ.3,621 కోట్లకు చేరింది. సగం తగ్గిన తాజా మొండి బకాయిలు.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40 శాతం తగ్గి రూ.3,363 కోట్లకు చేరింది. తాజా మొండి బకాయిలు దాదాపు సగం తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.28,730 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు గత ఆర్థి క సంవత్సరంలో రూ.11,039 కోట్లకు తగ్గాయి. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి 31 నాటికి 8.84 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 6.70 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయని వివరించింది. ఇది 13 క్వార్టర్ల కనిష్ట స్థాయి అని పేర్కొంది. గత క్యూ4లో తాజా మొండి బకాయిలు రూ.3,547 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు వార్షికంగా తగ్గగా, సీక్వెన్షియల్‌గా మాత్రం పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,626 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత క్యూ4లో రూ.5,451 కోట్లకు తగ్గాయి. గత క్యూ3లో కేటాయింపులు రూ.4,244 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వా:త ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్0.11 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. అధ్వాన కాలం ముగిసింది మొండి బకాయిలు భారీగా పెరగడం, అవినీతి ఆరోపణలపై సీఈఓ చందా కొచర్ వైదొలగడం వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఈ బ్యాంక్.... అధ్వాన కాలం ముగిసినట్లేనని పేర్కొంది. రుణ నాణ్యతకు సంబంధించిన సైకిల్లో చివరి దశలో ఉన్నామని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిలు పేరుకుపోవడం తగ్గగలదన్న అంచనాలున్నాయన్నారు. వడ్డీ వ్యయాలు 1–1.2 శాతం రేంజ్లో ఉండేవని, కానీ మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా ఈ వ్యయాలు 3.5 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు. -
23 శాతం తగ్గిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నికర లాభం
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.340 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.261 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,137 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.16,054 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1.55 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఎంబెడెడ్ వేల్యూ(ఈవీ) 15 శాతం పెరిగి రూ.21,623 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. -
కార్పొరేట్లకు ‘విదేశీ’ జోష్!
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్ చోటు చేసుకోవడం దేశీయ పరిశ్రమకు ఉపశమనం వంటిదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పాక్షిక వాటాల విక్రయంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి పూర్తిగా తప్పుకోవడం, ప్రమోటర్ల వాటాల ఉపసంహరణలు, తాజాగా ఈక్విటీల జారీ(క్యూఐపీ)తో నిధుల సమీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘గతేడాది ద్వితీయార్ధం నుంచి మార్కెట్ సెంటిమెంట్ నిద్రాణంగా ఉండగా, గత మూడు వారాల్లో ఇది మారిపోయింది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అనుజ్ కపూర్ తెలిపారు. మార్కెట్లో ఆదరణ డచ్ ఆర్థిక సేవల కంపెనీ ఐఎన్జీ గ్రూపు కోటక్ మహీంద్రాలో తనకున్న మొత్తం 3.06 శాతం వాటాను రూ.7,160 కోట్లకు విక్రయించింది. అలాగే ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబాస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 9 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,751 కోట్లను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ లైఫ్ 5 శాతం వాటాలను రూ.3,634 కోట్లకు విక్రయించింది. రియల్టీ సంస్థ డీఎల్ఎఫ్ రూ.3,178 కోట్లు, లక్ష్మి విలాస్ బ్యాంకు రూ.421 కోట్ల మేర తాజాగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఈ లావాదేవీలకు మార్కెట్లో మంచి ఆదరణే లభించడం గమనార్హం. అంతెందుకు, తాజాగా ముగిసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఫర్‌సేల్‌కు సైతం భారీ మద్దతు లభించింది. ఈ స్థాయిలో నిధుల రాకను మార్కెట్ సర్దుబాటు చేసుకోగలదంటున్నారు నిపుణులు. గత నెలలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు రూ.42,000 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఇన్వెస్టర్లలో ఆసక్తి తిరిగి పుంజుకోవడంతో బ్లాక్ డీల్స్, క్యూఐపీలు చోటు చేసుకుంటున్నాయి. నిధుల సరఫరా పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే మరిన్ని లావాదేవీలు జరగొచ్చు’’ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జీబీ జాకబ్ తెలిపారు. ఈ తరరహా అధిక లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ ట్రేడ్స్, క్యూఐపీలకు అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంటున్నారు. మరిన్ని నిధులు: అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇటీవలి ర్యాలీ, ఎన్నికల ఫలితాల పట్ల దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో మరిన్ని క్యూఐపీలు, బ్లాక్ డీల్స్, ఆఫర్ఫర్సేల్ చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణంతో ఐపీవో మార్కెట్లో ఇష్యూలు తిరిగి ఆరంభం అవుతాయని అనుజ్ కపూర్ తెలిపారు. ఇటీవలే ఎంబసీ నుంచి వచ్చిన తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)కు మంచి డిమాండ్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీవో మార్కెట్‌కు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఐపీవోలను చేపట్టిన విషయం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఐపీవోలు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి డీల్స్ ఎక్కువగా జరుగుతున్నందున ఐపీవోలు వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందంటున్నారు. మొత్తం మీద ఐపీవో మార్కెట్ టర్న్‌అరౌండ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. -
పుంజులాయిడ్ దివాలాకు ఎన్సీఎల్టీ ఓకే!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ అనుమతించింది. ఎన్సీఎల్టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్‌లాయిడ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్‌లోనే పుంజ్‌లాయిడ్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. పుంజ్‌లాయిడ్‌కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు. -
చందా కొచర్, ధూత్ నివాసాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దక్షిణ ముంబైలోని కొచర్ నివాసంలో, ఔరంగాబాద్‌లోని ధూత్ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. కొచర్ నివాసంలో సోదాలు చేయడం ఇదే తొలిసారి. సీబీఐ ఇప్పటికే ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ ఇచ్చిన రుణాల్లో అవకతవకలేమైనా జరిగాయా అన్న కోణంలో జరిగిన ప్రాథమిక విచారణ (పీఈ) అనంతరం చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధికార్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో చందా కొచర్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరీలో చందా కొచర్ పాత్ర కూడా ఉండటం, ఆ తర్వాత ఆమె భర్త దీపక్కి చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ధూత్ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడవటంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కి ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారాయి. -
చందా కొచర్‌కు ఈడీ షాక్!
న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాల వివాదంలో ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈడీ.. చందా కొచర్‌తో పాటు వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా రైడ్ చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో.. అప్పటి సీఈఓ చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అయితే అంతకు ముందే చందా కొచర్ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందా కొచర్‌పై లుక్ అవుట్ నోటీసు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదైన వారం వ్యవధిలోనే నోటీసులపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. చందా కొచర్ స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఇప్పటిదాకా ఆమెకు సమన్లేమీ జారీ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు సీబీఐ లుక్ అవుట్ నోటీసును ఇమిగ్రేషన్ అధికారులకు పంపుతుంది. ఒకవేళ నిందితులు అటువంటి ప్రయత్నమేదైనా చేసిన పక్షంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అంతకు ముందే చందా కొచర్ రాజీనామా చేసినప్పటికీ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందకొచర్‌కు కొత్త చిక్కులు తప్పవా?
-
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం 33% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) నికర లాభం సుమారు 33 శాతం వృద్ధి చెంది రూ.375.5 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 282.8 కోట్లు. క్యూ3లో ఆదాయం 31 శాతం పెరిగి రూ. 1,884 కోట్ల నుంచి రూ. 2,473 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ. 400 కోట్ల నుంచి సుమారు 7 శాతం మేర క్షీణించగా, ఆదాయం మాత్రం రూ. 2,331 కోట్ల నుంచి 6 శాతం వృద్ధి సాధించింది. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య 27,513గా ఉంది. ఎన్ఐఐటీ ఆదాయం రూ. 972 కోట్లు న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ. 972 కోట్ల ఆదాయంపై రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే లాభం 33%, ఆదాయం 29% పెరిగాయి. 2017–18 క్యూ3లో ఆదాయం లాభం రూ. 76 కోట్లు. వివిధ మార్కెట్లలో విభాగాలన్నీ మెరుగ్గా రాణించడంతో ఆదాయం భారీగాగా పెంచుకోగలిగామని ఎన్ఐఐటీ టెక్ వైస్ చైర్మన్, ఎండీ అరవింద్ ఠాకూర్ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐ లాభం 239 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం సుమారు 3 శాతం వృద్ధి చెంది రూ. 239 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 232 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,020 కోట్ల నుంచి రూ. 2,416 కోట్లకు చేరింది. 2019 మే 1 నుంచి మరో అయిదేళ్ల పాటు భార్గవ్ దాస్‌గుప్తాను ఎండీ, సీఈవోగా కొనసాగించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్బీఐ లైఫ్ లాభంలో 15% వృద్ధి న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్బీఐ లైఫ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ. 264 కోట్లకు చేరింది. ఇది అంతక్రితం క్యూ3లో రూ.230 కోట్లు. ఆదాయం రూ.9,586 కోట్ల నుంచి రూ.12,156 కోట్లకు పెరిగింది. ఏయూఎం రూ. 1,11,630 కోట్ల నుంచి రూ. 1,34,150 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐ డిపాజిట్ రేట్లు పావు శాతం పెంపు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్ రుణాల విభాగం అధిపతి ప్రణవ్మిశ్రా చెప్పారు. రెండేళ్లకు పైగా, మూడేళ్లలోపు కాల వ్యవధి కలిగిన రూ.కోటి లోపు డిపాజిట్లపై బ్యాంకు ఇక నుంచి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 46–60 రోజులు, 61–90 రోజులు, 91–120 రోజులు, 121–184 రోజుల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్‌పై మాత్రం వడ్డీ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే, 390 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాల డిపాజిట్లపై వడ్డీ రేటును 0.10% పెంచింది. గురువారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్‌పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్‌కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్‌ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్‌లోకి ఫస్ట్‌ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్‌టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్‌లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్‌ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్‌కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ డైరెక్టర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్ నియామకం దాదాపు ఖరారైంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటు వేసింది. ఆగష్టు 30, గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలోఈ మేరకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్‌ను సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతుండగా, 2018 జూలై 19 నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఐసీఐసీఐ వీడియోకాన్ రుణాల కుంభకోణంలో ప్రధాన ఆరోపణల నేపథ్యంలో సెలవులో ఉన్న ఆమెకు కంటితుడుపు చర్యగా ఈ డైరెక్టర్ పదవిని కట్టబెడుతున్నారని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ, ఇన్‌గవర్న్ విమర్శించిందికాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 80 శాతం వాటా ఉంది. -
ఐసీఐసీఐ సిఇఒ చందా కోచ్చర్‌కు కొత్త కష్టాలు
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. -
‘ఐసీఐసీఐ‘ సన్నిహిత సంస్థలపై నిఘా!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి పలు కంపెనీలకు రుణాల జారీ వెనుక బ్యాంకు చీఫ్ చందాకొచర్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. ఈ వివాదంలో బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలను కలిగిన పలు కంపెనీలకు సంబంధించి పరిశీలన మొదలు పెట్టినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వివాదంలో పేర్లు బయటకు వచ్చిన కంపెనీలకు సంబంధించి మోసపూరిత, ప్రిఫరెన్షియల్ లేదా విలువ తక్కువ చేసి చూపించిన లావాదేవీల ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహారాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడడం లేదని, ఇది పూర్తిగా ఆర్బీఐ పరిధిలోని అంశమని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆయా కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక ‘నీకది, నాకిది’ రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వీడియోకాన్ గ్రూపు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీలోకి నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ చీఫ్ చందాకొచర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు గత నెలలోనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్నుప్రకటించింది. గెలాక్సీ ఎస్9, ఎస్ 9 ప్లస్ డివైస్‌లపై ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, లేదా పేటీఎం మాల్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్9 64 జీబీ వేరియంట్ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్ ధర రూ .65,900 గా ఉంది. అయితే, ఎస్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్ ధర 72,900 రూపాయలు లభిస్తుంది. తాజాగా వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్‌ను క్రెడిట్ చేస్తుంది. అలాగే ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది. Remix your everyday with Super Slow-mo on the reimagined camera of Samsung #GalaxyS9 and #GalaxyS9Plus. Get one time screen replacement* and INR 9000.00 cashback* on ICICI Bank Credit Cards or Paytm mall. Move up now: https://t.co/x6LDp29WsO pic.twitter.com/Xyk2esgrUB — Samsung Mobile India (@SamsungMobileIN) June 2, 2018 -
చందా కొచర్: మరో భారీ కుంభకోణం
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ వివాదం ఉచ్చు బ్యాంకు సీఈఓ చందా కొచర్ చుట్టూ మరింత దృఢంగా బిగుస్తూ వుండగానే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ రుణ వివాదాన్ని వెలికి తీసిన అరవింద్ గుప్తానే చందా కొచర్ దంపతులపై మరోసారి తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. మారిషస్ కంపెనీల ద్వారా భారీగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ది పొందినట్లు ఆరోపించారు. ఇందులో ఎస్సార్ గ్రూపు రుయా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారనీ, తద్వారా సుమారు రూ. 453 కోట్లు దీపక్ కొచర్ కంపెనీ నూ పవర్ గ్రూప్‌నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చిందన్నారు. ఈ లావాదేవీలు అన్నింటిపైనా దర్యాప్తు చేయాలనీ, ఈ నిధులు ఎలా బదిలీ అయ్యాయో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పత్రాలను మే 11న ప్రధాని సహా, సంబంధిత మంత్రిత్వ శాఖ, రెగ్యులేటరీ సంస్థలకు పంపారు. రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్ కనోడియాకు మారిషస్‌లో మాటిక్స్ అనే గ్రూప్ ఉంది. మారిషస్‌లోని ఎస్సార్ గ్రూప్ ప్రధాన కంపెనీ ఎస్సార్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీ నిషాంత్ కనోడియాకు చెందిన మాటిక్స్ గ్రూప్ కంపెనీ మాటిక్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్ ఫర్టిలైజర్స్ షేర్లను భారీగా కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచర్ భర్తకు చెందిన నూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో మాటిక్స్ గ్రూప్ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి కాగా రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన ఏషియా మోటార్ వర్క్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ దీపక్ కొచర్‌కు చెందిన నూ పవర్ టెక్నాలజీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. నేరుగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నష్టాల్లో కూరుకుపోయిన నూ పవర్ టెక్నాలజీస్‌ని, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను భర్త దీపక్ కొచర్ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఎస్సార్ స్టీల్ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని తెలిపారు. సింగపూర్, బ్రిటన్, న్యూయార్క్‌లోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సార్ గ్రూప్‌కు ఇచ్చింది. అలాగే బ్రిటన్‌లోని స్లాన్ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్ ఆయిల్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ఆరోపించారు. చందా కొచర్ భర్తకు నూ పవర్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే నూ పవర్ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలోకి వీడియోకాన్ నిధుల తరలింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా ఇదే కంపెనీలోకి మారిషస్ నుంచి ఎస్సార్ గ్రూప్ నిధులు వచ్చాయనేది అరవింద్ గుప్తా ఆరోపణ. ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ శశిరూయా అల్లుడు నిషాంత్ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్ గ్రూప్‌లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఐసీఐ,ఎస్సార్ గ్రూపు ఖండన అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. ఎస్సార్ గ్రూప్‌కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాలనిచ్చినట్టు వాదించింది. అటు అరవింద్ గుప్తా ఆరోపణలపై ఎస్సార్ గ్రూప్ స్పందిస్తూ ఉద్దేశపూర్వక ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించింది. నూ పవర్లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. త్వరలోనే తమ వైఖరిని బహిరంగంగా తెలియజేస్తామని పేర్కొంది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామనీ, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్ గ్రూప్ స్పష్టం చేసింది. అటు మాటిక్స్ గ్రూప్ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధం లేదని,తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్‌తో ఎస్సార్‌కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని వెల్లడించింది. కాగా వీడియోకాన్-ఐసీఐసీఐ రుణాల కుంభకోణాన్ని 2016 మార్చిలో అరవింద్‌గుప్తా వెలుగులోకి తెచ్చారు. -
కొచర్ సెలవుపై రగడ.. వివరణ ఇచ్చిన బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) చందా కొచర్‌ను స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు మీద వెళ్లాల్సిందిగా బ్యాంక్ బోర్డు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను బ్యాంక్ బోర్డు తోసిపుచ్చింది. ‘ఇండిపెండెంట్ బోర్డు విచారణ పూర్తయ్యేంతవరకు కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా మేం కోరినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఆమె వార్షిక సెలవులో ఉన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే కొచర్ సెలవు తీసుకున్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు’ అని బ్యాంక్ బోర్డు పేర్కొంది. చందా కొచర్ వారసులను ఎంపిక చేసేందుకు ఎలాంటి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయలేదని కూడా స్పష్టం చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణ మంజూరీ విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. -
చందా కొచర్‌కు షాక్.. ఐసీఐసీఐ ఖండన!
వీడియోకాన్ కుంభకోణంలో తమ సీఈవో చందాకొచర్‌కు షాక్ ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్ కుంభకోణంలో స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు చందా కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా ఐసీఐసీఐ బోర్డు ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను తోసిపుచ్చిన ఐసీఐసీఐ.. చందా కొచర్ ప్రస్తుతం వార్షిక సెలవులో ఉన్నారని, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమె సెలవు తీసుకున్నారని వెల్లడించింది. వీడియోకాన్ సంస్థకు రుణాల విషయంలో చందా కొచర్‌పై క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు ఆమె నేతృత్వంలోని ఐసీఐసీఐ కన్సార్షియం వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా గుర్తించడంతో ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ స్కాం విషయంలో కొచర్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని గతంలో ఐసీఐసీఐ బాసటగా నిలిచింది. అయితే, ఈ నెల 29న జరిగిన ఐసీఐసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కొచర్‌ను సెలవు మీద పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు అన్ని తప్పేనని, తాము అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు. -
చందా కొచర్‌పై ఐసీఐసీఐ యూటర్న్
ముంబై: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండీ, సీఈవో చందా కొచర్‌పై విచారణ జరపాలని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు తీర్మానించింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై బోర్డు చర్చించి... స్వతంత్ర ఎంక్వైరీకి ఆదేశించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్చేంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ‘స్వతంత్రమైన, విశ్వసనీయమైన వ్యక్తి సారథ్యంలో ఈ విచారణ జరుగుతుంది‘ అని వివరించింది. వాస్తవాలను పరిశీలించి, అవసరమైతే ఫోరెన్సిక్స్ దర్యాప్తు, ఈమెయిల్స్‌ను సమీక్షించడం, సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్స్ను రికార్డు చేయడం మొదలైన అంశాలతో విచారణ సమగ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఆడిట్ కమిటీకి బోర్డు అప్పగించింది. కొన్నాళ్ల క్రితమే క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చినప్పుడు కొచర్ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని బాసటగా నిల్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు... తాజాగా విచారణకు ఆదేశించడం గమనార్హం. తన కుటుంబీకులకు లబ్ధి చేకూర్చేలా కొందరు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ బ్యాంకు సీఈవో హోదాలో చందా కొచర్ క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిపారని, బ్యాంకు నైతిక నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రావడం తెలిసిందే. వివాదమిదీ..: తన భర్త దీపక్ కొచర్‌కి చెందిన న్యూపవర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరు విషయంలో చందా కొచర్ వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చాయి. రుణం లభించినందుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ తీసుకున్న ఈ రుణాలు మొండిబాకీలుగా మారాయి. మరోవైపు, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిశాంత్ కనోడియాకి చెందిన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి కూడా 2010లో న్యూపవర్‌లోకి రూ. 325 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అదే ఏడాది ఎస్సార్ స్టీల్ మినెసోటాకి ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణమిచ్చింది. ఇది కూడా ప్రస్తుతం మొండిబాకీగా మారడం సందేహాలకు తావిస్తోంది. ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ కార్యకలాపాలపై 2016లో ఆర్బీఐ విచారణ కూడా జరిపింది. -
దిగొచ్చిన ఐసీఐసీఐ : కష్టాల్లో చందా కొచర్
సాక్షి, ముంబై : వీడియోకాన్-ఐసీఐసీ స్కాంలో ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంకు దిగి వచ్చింది. ఈ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది. రుణాల వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌పై ఆరోపణలను మొదట్లో కొట్టిపారేసిన బ్యాంకు, తాజాగా వాటిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఏకసభ్య కమిటీని నియమించింది. బ్యాంక్ నియమావళిని ఎలా ఉల్లంఘనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలుబ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపిందన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారించనున్నది. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ. 3,800 కోట్ల రుణ వ్యవహారంలో చందాకొచ్చర్ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2012లో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణం ఇచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచర్ భర్త దీపక్ కొచర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. వీడియోకాన్కిచ్చిన వేలకోట్ల రుణం 2017నాటికి మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు కొచర్ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇందులో చందాకొచర్ ప్రమేయం ఏమీ లేదని అప్పట్లో ఐసీఐసీఐ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, చందాకొచ్చర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని గట్టిగా వాదించడం, ఈ విషయంలో ఐసీఐసీఐ బోర్డులో కూడా విభేదాలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. చందాకొచర్ భర్త దీపక్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లను అనుమానితులుగా చేర్చింది. -
దీపక్ కొచర్‌కు మళ్లీ ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్ కొచర్‌కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీ ఎండీగా దీపక్ కొచర్ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి. పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. మారిషస్‌కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్స్) నుంచి నూపవర్ రెన్యువబుల్స్లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది. -
గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆభరణాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం ఇచ్చిన రుణాలపై తాజాగా సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం.. గీతాంజలి గ్రూప్‌నకు రూ. 5,280 కోట్ల మేర రుణాలిచ్చాయి. దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మలను మార్చి 6న ఎస్ఎఫ్ఐవో ప్రశ్నించింది. సీబీఐ ప్రస్తుతం పీఎన్బీని వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును దర్యాప్తు చేస్తోంది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎల్వోయూ)ల ద్వారా మోదీ తదితరులు ఈ కుంభకోణానికి తెరతీశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బహ్రెయిన్‌లోని కెనరా బ్యాంక్ అధికారులు ఇద్దరిని, యాంట్వెర్ప్ (బెల్జియం)లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరినికి సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. -
ఐసీఐసీఐపై ఫిచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంతో ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుపై ఆరోపణలు సంస్థ రిపుటేషన్ను దెబ్బతీస్తుందని పేర్కొంది. సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది. అంతేకాదు ఐసీఐసీఐలో గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్ అంచనా వేసింది. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్‌ను అంచనా వేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్‌కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో తగిన రేటింగ్ తీసుకుంటామని తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన సందేహాలను కలగిస్తోందని ఫిచ్ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెర్స్ పటిష్టంగా ఉంటుందనేది తమ విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు, వృత్తిపరమైన నైపుణ్య నిర్వహణ అంశాల కారణంగా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా వుంటుందని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డ్యామేజ్ కంట్రోల్లో పడింది. టాప్ పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త దీపక్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది. అటు ఐసీఐసీఐలో 12.3 శాతం అధిక వాటా కలిగి వున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
వివాదాల్లో చిక్కుకున్న బ్యాంకింగ్ రాణులు
-
ఐసీఐసీఐ స్కాం: ప్రభుత్వ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న అమిత్ అగర్వాల్ స్థానంలో లోక్ రంజన్‌ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్ నియమాకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్ భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్ కొచ్చర్ సోదరుడు విజయ్ కొచ్చర్‌ను శనివారం కూడా విచారిస్తోంది. -
చందా కొచర్‌కు మరో షాక్
-
చందా కొచర్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయంనుంచి సింగపూర్ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కేసులో చందాకొచర్ కుటుంబానికి చెందిన సన్నిహితుడిని సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో మరింత విచారణ చేపట్టే క్రమంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకుంది. అతణ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ధూత్పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ,అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఇంతవరకూ దీపక్‌ను ప్రశ్నించలేదు. కానీ, దీపక్ కొచర్కుచెందిన న్యూపవర్రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తును వ్యతిరేకించింది. కాగా ఈ రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించిందనీ, అవిస్టా సేవలు పొందిన వాటిల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని రాజీవ్ కొచర్ ఖండించిన సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకులతో ఎలాంటి సిండికేషన్ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు. ఈక్రమంలో చందా కొచర్ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్‌లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా రాజీవ్ కొచర్ కొట్టిపారేశారు. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్.. ప్చ్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పేలవంగా లిస్టయ్యాయి. ఇష్యూ ధర, రూ.520తో పోలిస్తే బుధవారం 17 శాతం నష్టంతో రూ.431 వద్ద బీఎస్ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్ రూ.431, రూ.463 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 14.4 శాతం నష్టంతో రూ.445 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 13.15 లక్షలు, ఎన్ఎస్ఈలో 74.17 లక్షలు చొప్పున షేర్లు ట్రేడయ్యాయి. మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,337 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీ ఐపీఓ 86 శాతమే సబ్‌స్క్రైబయింది. దీంతో కంపెనీ రూ.4,000 కోట్ల లక్ష్యానికి గాను, రూ.3,515 కోట్ల నిధులను మాత్రమే సమీకరించింది. -
ఐసీఐసీఐ: తొలిసారి స్పందించిన సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ - వీడియోకాన్ రుణ వివాదం విషయంలో ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని కార్పొరేట్ వ్యవహరాల శాఖ (ఎంసీఏ) సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రిజర్వ్‌బ్యాంక్ ఈ కేసును పరిశీలిస్తోందని తెలిపారు. మరోవైపు సీఈవో చందా కొచర్‌కు ఇప్పటికే పూర్తి మద్దతును ఐసీఐసీఐ బోర్డు ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా ఆమెపై స్వతంత్ర దర్యాప్తునకు ఐసీఐసీఐ అంగీకరించలేదు. దాదాపు 3250 కోట్ల రూపాయల వీడియోకాన్-ఐసీఐసీఐ రుణ వ్యవహారాన్నివెలుగులో తెచ్చిన అరవింద్ గుప్తా ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన నేపథ్యంలో బాహ్య ఏజెన్సీలతో స్వతంత్ర దర్యాప్తును బ్యాంకు వ్యతిరేకించింది. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్‌కు గ్రూపునకు రుణాలిచ్చారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటికే దర్యాప్తును మొదలుపెట్టింది. ముఖ్యంగా వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్, దీపక్‌కొచర్ పై ప్రాథమిక దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ మేరకు కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారుల పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 15శాతం నష్టం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్‌లో నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520. కాగా ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్‌తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. -
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
-
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
ముంబై, న్యూఢిల్లీ : కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు. ఒక పరిశోధనాత్మక కథనం ప్రకారం డిసెంబర్ 2008లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్‌కి బదలాయించేశారు. అయితే, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ‘న్యూపవర్’ కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) కట్టనే లేదు. 2017లో వీడియోకాన్ ఖాతాను మొండిపద్దుగా వర్గీకరించారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. న్యూపవర్ ఆర్థిక పరిస్థితి ఇదీ.. 2008 డిసెంబర్లో ఏర్పాటైన న్యూపవర్.. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాలు ప్రకటిస్తూనే ఉంది. 2012–17 మధ్య కంపెనీ నష్టాలు రూ.78 కోట్ల మేర పేరుకుపోయాయి. 2017లో రూ.14.3 కోట్ల నష్టం ప్రకటించింది. 2016 మార్చి 31 నాటి దాకా సుప్రీమ్ ఎనర్జీ, పినాకిల్ ఎనర్జీలతో పాటు కొచర్‌కి న్యూపవర్‌లో 96.23 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, 2017 మార్చి నాటికి సుప్రీమ్, పినాకిల్‌తో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీపక్ కొచర్ వాటాలు 43.4 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాలు మారిషస్‌కి చెందిన డీహెచ్ రెన్యూవబుల్స్ చేతిలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమంటుందంటే.. తాజా వ్యవహారంపై ఐసీఐసీఐ స్పందిస్తూ... ‘‘2012లో ఎస్బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి చమురు, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీడియోకాన్‌కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లే. మిగిలిన బకాయి రూ.2,810 కోట్లు.. వడ్డీతో కలసి వీడియోకాన్ చెల్లించాల్సింది రూ.2,849 కోట్లు. 2017లో గ్రూప్ ఖాతాను మొండి పద్దుగా వర్గీకరించాం’’ అని వివరణిచ్చింది. దీనిపై ఐసీఐసీఐ చైర్మన్ ఎం.కె. శర్మ మాట్లాడుతూ... కన్సార్షియంలో ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కమిటీ తన వంతు రుణం మంజూరు చేసిందని చెప్పారు. సదరు కమిటీకి అప్పట్లో చందా కొచర్ చైర్‌పర్సన్‌గా లేరని స్పష్టం చేశారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. 2009లోనే వదిలేశా: ధూత్ ‘‘నేను 2009లోనే న్యూపవర్ రెన్యువబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ సంస్థల నుంచి వైదొలిగాను. న్యూపవర్‌లో 24,996 షేర్లను, సుప్రీమ్ ఎనర్జీలో 9,990 షేర్లను అమ్మేసి పూర్తి హక్కులను వదులుకున్నాను. చమురు, టెలికం వ్యాపారాలతో బిజీ అయిపోవడంతో.. ఆ రోజు నుంచి రెండు కంపెనీలతో సంబంధాలు వదులుకున్నాను’’ అని ధూత్ వివరించారు. కానీ ఆర్‌ఓసీలో దాఖలు చేసిన ఫైలింగ్స్ ప్రకారం చూస్తే 2010 అక్టోబర్ దాకా సుప్రీం ఎనర్జీకి ఆయన యజమానిగా కొనసాగినట్లు, 2010 నవంబర్‌లో మాత్రమే తన షేర్లను అనుచరుడు పుంగ్లియాకు బదలాయించినట్లుగా తెలుస్తోంది. న్యూపవర్ వివరణ ఇదీ.. ఈ లావాదేవీల్లో పరస్పరం ప్రయోజనాలు పొందారనడానికేమీ లేదని న్యూపవర్ వివరణనిచ్చింది. అసలు పినాకిల్ ఎనర్జీ ట్రస్టుకు గానీ, సుప్రీమ్ ఎనర్జీకి గానీ ఐసీఐసీఐ బ్యాంకుతో ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవని స్పష్టం చేసింది. లావాదేవీలు జరిగాయిలా.. ♦ 2008 డిసెంబర్లో దీపక్ కొచర్, వేణుగోపాల్ ధూత్‌లు కలసి న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్పీఎల్) ఏర్పాటు చేశారు. ఇందులో ధూత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సంబంధీకులకు 50 శాతం వాటాలుండేవి. అలాగే దీపక్ కొచర్‌కి, ఆయన తండ్రికి చెందిన పసిఫిక్ క్యాపిటల్ సంస్థకు, చందా కొచర్ సోదరుడి భార్యకు మిగతా 50 శాతం వాటాలుండేవి. ♦ 2009 జనవరిలో న్యూపవర్ డైరెక్టర్ పదవికి ధూత్ రాజీనామా చేశారు. రూ. 2.5 లక్షల మొత్తానికి కంపెనీలో తనకున్న 24,999 షేర్లను దీపక్ కొచర్‌కి బదలాయించారు. ♦ 2010 మార్చిలో సుప్రీమ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి న్యూపవర్‌కి రూ.64 కోట్ల రుణం (ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో) లభించింది. ఈ సుప్రీమ్ ఎనర్జీలో ధూత్‌కి 99.9 శాతం వాటాలు ఉన్నాయి. ♦ ధూత్ నుంచి కొచర్‌కి.. ఆ తర్వాత కొచర్ కుటుంబీకులకు చెందిన పసిఫిక్ క్యాపిటల్ నుంచి షేర్లు సుప్రీమ్ ఎనర్జీకి ఒక ఒక పద్ధతి ప్రకారం న్యూపవర్ షేర్ల బదలాయింపు జరిగింది. ఫలితంగా 2010 మార్చి ఆఖరుకు న్యూపవర్‌లో సుప్రీమ్ ఎనర్జీ 94.99 శాతం వాటాదారుగా అవతరించింది. మిగతా వాటాలు కొచర్ పేరిటే ఉండిపోయాయి. ♦ 2010 నవంబర్‌లో ధూత్ సుప్రీమ్ ఎనర్జీలో తనకున్న మొత్తం వాటాలను.. తన అనుచరుడు మహేష్ చంద్ర పుంగ్లియాకు బదలాయించారు. ♦ ఈ పుంగ్లియా.. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 ఏప్రిల్ 29 మధ్య తన వాటాలను పినాకిల్ ఎనర్జీ అనే ట్రస్టుకు బదలాయించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా దీపక్ కొచర్ ఉన్నారు. ఈ షేర్ల విలువ రూ.9 లక్షలుగా చూపించారు. అంటే న్యూపవర్‌కి రూ. 64 కోట్ల రుణాలిచ్చిన ధూత్ సంస్థ సుప్రీమ్ ఎనర్జీ .. మూడేళ్ల వ్యవధిలో దీపక్ కొచర్‌కి చెందిన పినాకిల్ ఎనర్జీ అనే కంపెనీలో కలిసిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.59 కోట్ల జరిమానా బాండ్ల విక్రయ నిబంధనలు ఉల్లంఘించినందుకే... ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. హెచ్టీఎం (హెల్డ్ టు మెచ్యూరిటీ) సెక్యూరిటీలను నేరుగా విక్రయించే విషయంలో మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఆర్బీఐ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలయ్యేవనే విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది. నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తామని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం తనకు లభించిన అధికారాల మేరకు, తాను జారీ చేసిన మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు పాటించకపోవడంతో జరిమానా విధించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పెట్టుబడులను హెల్డ్ ఫర్ ట్రేడింగ్ (హెచ్ఎఫ్టీ), అవైలబుల్ ఫర్ సేల్ (ఏఎఫ్ఎస్), హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ (హెచ్టీఎం) అని మూడు వర్గీకరణలు చేయాల్సి ఉంటుంది. హెచ్టీఎం కేటగిరీలో సెక్యూరిటీలు కాల వ్యవధి తీరే వరకు వాటికి కొనసాగించాలి. ఒకవేళ ఈ విభాగం నుంచి సెక్యూరిటీలను విక్రయించినట్టయితే, అది ఈ విభాగంలో అవసరమైన పెట్టుబడుల్లో 5 శాతానికి మించితే ఆర్బీఐకి తెలియజేయాలి. కానీ, ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేయలేదు. -
బ్రిటిష్ ఆసియన్స్‌లో ధనిక కుటుంబం.. హిందూజా
లండన్: హిందూజా కుటుంబం బ్రిటన్‌లోని బ్రిటిష్ ఆసియన్లలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదవ ఏడాది. నలుగురు సోదరులు– శ్రీచంద్ పీ హిందూజా, గోపీచంద్ పీ హిందూజా, ప్రకాశ్ పీ హిందూజా, అశోక్ పీ హిందూజా నేతృత్వంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్– 2017లో వీరి కుటుంబ సంపద విలువను అంతక్రితం ఏడాదితో పోల్చితే 3 బిలియన్ పౌండ్లు పెంచింది. బ్రిటన్‌కు చెందిన ఆసియన్ మీడియా గ్రూప్ (ఏఎంజీ) ప్రచురించిన వార్షిక ‘ఆసియన్ రిచ్ లిస్ట్’ తాజా వివరాలను తెలిపింది. రెండవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ జాబితాలో రెండవ స్థానం– ఇండియన్ స్టీల్ దిగ్గజం– లక్ష్మీ నివాస్ మిట్టల్‌కు దక్కింది. ఆయన సంపద 14 బిలియన్ పౌండ్లు. 2016లో ఈ విలువ 12.6 బిలియన్ పౌండ్లు. ఐదవ స్థానంలో అనిల్ అగర్వాల్ ►పెట్రోకెమికల్, టెక్స్టైల్స్ కంపెనీ– ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియా 5.1 బిలియన్ పౌండ్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. ►నాల్గవ స్థానంలో 2.35 బిలియన్ పౌండ్లతో పాకిస్తానీ అన్వర్ పర్వేజ్ (బెస్ట్‌వే వ్యవస్థాపకులు) ఉన్నారు. ►రిటైల్ దిగ్గజాలు సిమన్, బాబీ అండ్ రాబిన్ అరోరా, మెటల్ కింగ్ అనిల్ అగర్వాల్‌లు 2.3 బిలియన్ పౌండ్ల సంపదతో సంయుక్తంగా ఐదవ స్థానంలో నిలిచారు. సంపద మొత్తం 80.2 బిలియన్ డాలర్లు... ►దక్షిణాసియాలో మూలాలు ఉన్న 101 మంది బ్రిటన్ మిలియనీర్ల సంపద మొత్తంగా చూస్తే, 2017లో 80.2 బిలియన్ పౌండ్లు. 2016తో పోల్చితే ఈ సంపద 11 బిలియన్ పౌండ్లు పెరిగింది. వీరిలో మొదటి 10 మంది ప్రముఖ బ్రిటిష్ ఆసియన్ల సంపద 54.25 బిలియన్ పౌండ్లు. మొత్తం సంపదలో ఇది 68 శాతం. ►తాజా జాబితాను లండన్‌లో జరుగుతున్న 21వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా... బ్రిటన్ ఆసియన్లు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంకుకూ... ఈ అవార్డుల కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ (ఆసియన్ బిజినెస్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్), హోటల్స్ వ్యాపారవేత్త జోగీందర్ సింగ్ (బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్), బ్రిటన్‌లో డిష్యూమ్ ఇండియన్ రెస్టారెంట్ల చైన్ చీఫ్ షామిల్ తక్రార్ (రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్)లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతుండటం గమనార్హం. -
ఐసీఐసీఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,894 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.2,611 కోట్లు)తో పోల్చితే 27 శాతం క్షీణత నమోదైందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ట్రెజరీ ఆదాయం 92 శాతం తగ్గడం, ఇతర ఆదాయం కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ చెప్పారు. ట్రెజరీ ఆదాయం 92 శాతం క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైందని, ఫారెక్స్ లాభాలు రూ.82 కోట్లే వచ్చాయని వివరించారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.27,876 కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధిచెంది రూ.28,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.2,442 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,650 కోట్లకు తగ్గిందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయ్... నికర వడ్డీ ఆదాయం రూ.5,363 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,705 కోట్లకు పెరిగిందని కొచర్ పేర్కొన్నారు. నిర్వహణ లాభం 10 శాతం వృద్ధితో రూ.4,992 కోట్లకు పెరిగిందని తెలిపారు. రిటైల్ రుణాలు 22 శాతం పెరగడంతో దేశీయ రుణ వృద్ధి 15.6 శాతానికి ఎగసిందని, ఇది ఐదు క్వార్టర్ల గరిష్ట స్థాయి అని వివరించారు. రుణాలు నిలకడగా 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. రిటైల్ రుణాలు 18–20 శాతం రేంజ్లో, కార్పొరేట్ రుణాలు 10 శాతం మేర వృద్ధి చెందగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని చందా కొచర్ వ్యాఖ్యానించారు. 3.14 శాతంగా నికర వడ్డీ మార్జిన్.. దేశీయ నికర వడ్డీ మార్జిన్ 3.53 శాతం సాధించామని, మొత్తం మీద నికర వడ్డీ మార్జిన్ 3.14 శాతంగా ఉందని చందా కొచర్ వివరించారు. గత క్యూ3లో 7.20 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 7.82 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 4.20 శాతానికి పెరిగాయని తెలిపారు. అయితే స్థూల మొండి బకాయిల జాబితాలోకి చేరిన తాజా రుణాలు తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయి, రూ.4,380 కోట్లకు తగ్గాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా పెరిగాయని, గత క్యూ3లో రూ.2,713 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే. ఈ క్యూ2లో రూ.44,488 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.46,039 కోట్లకు పెరిగాయని, నిక మొండి బకాయిలు మాత్రం రూ.24,129 కోట్ల నుంచి రూ.23,810 కోట్లకు తగ్గాయని వివరించారు. కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన తగ్గాయని, ఈ క్యూ2లో రూ.4,503 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆర్బీఐ రెండో మొండి జాబితాలో తమ బ్యాంక్‌కు చెందిన 18 ఖాతాల రూ.10,000 కోట్ల రుణాలున్నాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎన్ఎస్ కన్నన్ చెప్పారు. వీటికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. అంతర్జాతీయ రుణాలు 14.5 శాతం క్షీణించాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్ప లాభంతో రూ.353 వద్ద ముగిసింది. -
పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ రుణాలు
ముంబై: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ద్వారా కొనుగోళ్లు జరిపే తమ కస్టమర్లకు స్వల్పకాలిక తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోళ్లు చేసే వారికి దాదాపు రూ. 20,000 దాకా రుణం అందించనున్నట్లు పేర్కొంది. పేటీఎం–ఐసీఐసీఐ బ్యాంక్ పోస్ట్ పెయిడ్ కార్డ్ మీద తీసుకునే రుణంపై తొలి నలభై అయిదు రోజులదాకా వడ్డీ ఉండదని, ఒకవేళ ఆ వ్యవధిలో గానీ చెల్లించకపోతే.. జాప్యానికి గాను రూ. 50 ఫీజుతో పాటు మూడు శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. రుణపరిమితి ఒక్క లావాదేవీకి రూ. 20,000 మాత్రమే ఉన్నప్పటికీ.. బకాయిని తీర్చేసిన తర్వాత కస్టమర్ మళ్లీ ఈ రుణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ తెలిపారు. ఈ ప్రయోగాన్ని బట్టి ఐసీఐసీఐ బ్యాంక్‌యేతర కస్టమర్లకు, ఇతర పెద్ద వ్యాపార సంస్థలకు కూడా విస్తరించే అవకాశం పరిశీలిస్తామని పేర్కొన్నారు. -
పాతతరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు
ముంబై: దక్షిణాదికి చెందిన వెనుకటి తరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు ముందున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంటోంది. ఆస్తుల నాణ్యత మెరుగు పడటంతో ఆదాయార్జన అవకాశాలు పెరిగాయని, కొన్నేళ్ల పాటు వరుసగా రుణాల్లో వృద్ధి లేకపోగా, అది మళ్లీ పుంజుకోనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఫెడరల్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు తామున్న ప్రాంతాల్లో బలమైన స్థితి కారణంగా వేగంగా వృద్ధి చెందనున్నట్టు నివేదికలో పొందుపరించింది. ‘‘అత్యధిక ఆదాయ వృద్ధి అవకాశాలతోపాటు స్థిరమైన నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం), నిలకడైన ఆస్తుల నాణ్యత, తగినంత నిధులు కలిగిన బ్యాంకులకే మా ప్రాధాన్యం. ఈ ఐదు బ్యాంకులు వచ్చే రెండేళ్ల కాలంలో రుణాల్లో 11–22%, ఆదాయాల్లో 12–25% మధ్యలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును సాధించగలవు’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఫెడరల్, సిటీ యూనియన్ బ్యాంకులను కొనుగోలు చేయవచ్చని, మిగిలిన వాటిని హోల్డ్ చేయవచ్చంటూ సిఫారసు చేసింది. -
ఐసీఐసీఐ ఆఫర్: ప్రతీ ఈఎంఐపై క్యాష్‌బ్యాక్
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు పండుగ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని హోం లోన్లపై 'క్యాష్ బ్యాక్' సదుపాయం కల్పిస్తోంది. ఈ సదుపాయం ఎన్ఆర్ఐలకు కూడా అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ తెలిపింది. కొత్తగా గృహ రుణాలపై 'క్యాష్ బ్యాక్' సదుపాయంతో ప్రారంభించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. కొత్త హోం లోన్లపై ప్రతీ ఈఎంఐ పైనా 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 36 నెలల తరువాత మొదటి విడత క్యాష్ బ్యాక్ సొమ్మును ఖాతాదారుడి అకౌంట్లో జమ చేస్తుంది. ఇక ఆ తరువాత నుంచి 12 నెలలకొకసారి ఈ క్యాష్ బ్యాక్ ను క్రెడిట్ చేస్తుంది. కనిష్టంగా 15 సంవత్సరాల కాలపరిమితి గృహ రుణాలకు ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే బ్యాంకులో గృహరుణం తీసుకునే సమయంలో క్యాష్ బ్యాక్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఈఎంఐలో 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సొంత ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ చెప్పారు. దీంతోపాటు ఆస్తి తనఖా రుణాలపై , ఇతర తనఖారుణాలపై కూడా తమ పండుగ ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. Just in: ICICI Bank launches #CashbackHomeLoan, offering borrowers benefit of 1% cashback on every EMI for the entire tenure of the loan. pic.twitter.com/njnu7dzXrY — ICICI Bank (@ICICIBank) September 28, 2017 -
ఐసీఐసీఐ లాంబార్డ్ లిస్టింగ్ రోజు లాభమే!
ముంబై: ప్రైవేటు రంగంలోని సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ మార్కెట్ల బలహీనతలోనూ లిస్టింగ్ లాభాల్ని పంచింది. బుధవారం ఎన్ఎస్ఈలో రూ.651 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అయిన రూ.661 కంటే ఒకటిన్నర శాతం తక్కువ. తర్వాతma అమ్మకాల ఒత్తిడికి 3% వరకు పడిపోయి రూ.638.65కి చేరింది. అక్కడ కొనుగోళ్ల మద్దతుతో రూ.694 వరకు పెరిగింది. చివరికి ఆఫర్ ధరతో పోలిస్తే 4.45% లాభంతో రూ.680.10 వద్ద ముగిసింది. రూ.5,700 కోట్ల ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ఈ నెల 19న ముగిసిన విషయం తెలిసిందే. 8,62,47,187 షేర్లను కంపెనీ ఆఫర్ చేసింది. ఇష్యూ 3 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కాగా, లిస్టింగ్ లాభాలు ఎక్కువగా ఉండకపోవచ్చని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. కాగా, స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తొలి సాధారణ బీమా కంపెనీ ఇదే. జూన్ చివరి నాటికి కంబైన్డ్ రేషియో (నష్టాలు, వ్యయాలను, వసూలైన ప్రీమియంతో భాగించగా వచ్చేది) 102 ఉండగా, దాన్ని సమీప భవిష్యత్తులో 100%కి తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను లాభాల బాట పట్టించడంపై దృష్టి పెట్టినట్టు కంపెనీ ఎండీ భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. -
ఈసారి డర్టీ40
♦ మొండిబకాయిలపై ఆర్బీఐ రెండో అస్త్రం ♦ 40 కంపెనీల జాబితా సిద్ధం ♦ తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు కంపెనీలు ♦ ఐవీఆర్సీఎల్, ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ, నాగార్జునా ఆయిల్, సోమా ♦ తెలుగు ప్రమోటర్‌కు చెందిన ఆర్చిడ్ ఫార్మా కూడా... ♦ ఎన్సీఎల్టీకి సమర్పిస్తారనే వార్తలతో కుప్పకూలిన షేర్లు ♦ ఇప్పటికే డిఫాల్టర్లుగా ప్రచారంలో పలు బడా సంస్థలు (సాక్షి, హైదరాబాద్ / అమరావతి) : రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలపై దివాలా చట్టం ప్రయోగించడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 12 పెద్ద కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వగా తాజాగా మరో 40 కంపెనీలతో రెండో జాబితాను తయారు చేసినట్లు తెలియవచ్చింది. భారీగా అప్పుల్లో కూరుకుపోయి వరుస నష్టాలను నమోదు చేస్తున్న కంపెనీలకు చెందిన ఆస్తులను విక్రయించడం ద్వారా వాటి రుణాలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ అధికారమిచ్చింది. దీంతో బ్యాంకులు ఆర్బీఐ అనుమతి మేరకు ఆయా కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు చేస్తున్నాయి. తాజాగా రూపొందించిన జాబితాలో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కలిసి 40 వరకు ఉండవచ్చని సమాచారం. ఈ నలభైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపెనీలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రెండు ఇన్ఫ్రా కంపెనీలు ఐవీఆర్సీఎల్, సోమా ఎంటర్‌ప్రైజెస్‌లతో పాటు నాగార్జునా ఆయిల్ రిఫైనరీ, శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నించి చేతులెత్తేసిన ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రమోటర్ కె.రాఘవేంద్రరావు తమిళనాడు కేంద్రంగా నడిపిస్తున్న ఆర్కిడ్ కెమికల్స్ (ఇపుడు ఆర్కిడ్ ఫార్మాగా పేరు మార్చుకుంది) తదితర కంపెనీలున్నాయి. వీటి పేర్లన్నీ ఆర్బీఐ ద్వారా బ్యాంకులు ఎన్సీఎల్టీకి సిఫారస్సు చేసినట్లు మంగళవారం మార్కెట్లో వార్తలు షికారు చేయగా... ఆయా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. అధిక ఖాతాలు ఎస్బీఐ వద్దే!! గతంలో ఆర్బీఐ విడుదల చేసిన 12 డిఫాల్టింగ్ కంపెనీలను చూస్తే... దాదాపు అన్ని కంపెనీలకూ ఐసీఐసీఐ ఎంతో కొంత రుణాలు మంజూరు చేసి ఉంది. తాజాగా ఆర్బీఐ జాబితాగా చెబుతున్న 35– 40 కంపెనీలకు గాను దాదాపు 25–26 కంపెనీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నాగార్జునా ఆయిల్ రిఫైనరీ సుమారు రూ.4,000 కోట్ల మేర రుణాలు బకాయి పడగా, ఐవీఆర్సీఎల్ రూ.3,579 కోట్లు, సోమా ఎంటర్ప్రైజెస్ రూ.1,895 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ఐవీఆర్సీఎల్ షేరు ధర 13 శాతం నష్టపోయి రూ.4.65 వద్ద ముగిసింది. నాగార్జునా ఆయిల్ రిఫైనరీ 5.45 శాతం నష్టపోయి రూ. 3.45 వద్ద ముగిసింది. ఇక సోమా ఎంటర్ప్రైజెస్ అన్‌లిస్టెడ్ కంపెనీ. సోమా ఎంటర్‌ప్రైజెస్‌కు మాగంటి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, మాగంటి అంకనీడు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్చిడ్ ఫార్మా షేరు సైతం దాదాపు 9 శాతం నష్టపోయి రూ.18.95 వద్ద ముగిసింది. ఉత్తమ్‌గాల్వా, రేణుకా షుగర్స్ కూడా!! ఈ రెండవ జాబితాలో ఉన్నట్లుగా కొత్తగా ప్రచారంలోకి వచ్చిన కంపెనీల్లో ఉత్తమ్ గాల్వా, కాస్టెక్స్ టెక్నాలజీస్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, రుచి సోయా, వీసా స్టీల్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, ఏసియన్ కలర్స్, ఇస్పాత్ కోటెడ్, యూనిటీ ఇన్ఫ్రా తదితర కంపెనీలున్నాయి. ఇక డిఫాల్టర్ల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టెయిన్లెస్, జయప్రకాష్ పవర్, అబాన్ ఆఫ్‌షోర్, శ్రీ రేణుక షుగర్స్ వంటి కంపెనీలున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం కంపెనీల అప్పుల విలువ ఎంతుందో తెలియాల్సి ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా, జయస్వాల్ నెకో, రుచిసోయా, జేపీ అసోసియేట్స్, ఉత్తమ్ స్టీల్ కంపెనీల షేర్లు 9 శాతానికిపైగా నష్టపోయాయి. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ 14 శాతానికిపైగా పడిపోయింది. గత జూన్‌లో ఆర్బీఐ విడుదల చేసిన ‘డర్టీ డజన్’ ఎగవేతదార్ల రుణాల విలువ రూ.1.75 లక్షల కోట్లు. ఇది మొత్తం నిరర్థక ఆస్తుల్లో 25 శాతానికి సమానం. ఈ కంపెనీలను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేసిన తర్వాత రుణాలిచ్చిన బ్యాంకులు లిక్విడేషన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 180 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును 270 రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాభం రూ.406 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. నికర ప్రీమియం ఆదాయం వృద్ధి చెందినప్పటికీ లాభంలో ఎదుగుదల లేదు. కంపెనీ రూ.406 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.405 కోట్లతో పోలిస్తే కేవలం కోటి రూపాయలే మెరుగుపడింది. పాలసీలపై అధిక కమీషన్లు చెల్లించడం, పెట్టుబడులపై ఆదాయం తగ్గడం వంటివి లాభం పెరగకపోవడానికి కారణాలుగా కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ.4,820 కోట్ల ప్రీమియం ఆదాయం లభించింది. 2016–17 జూన్ క్వార్టర్లో ప్రీమియం ఆదాయం రూ.3,509 కోట్లతో పోల్చితే తాజాగా 35%కిపైగా వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.9,074 కోట్లుగా ఉండగా, తాజా జూన్ త్రైమాసికంలో రూ.8,456 కోట్లకు క్షీణించింది. -
స్టాక్స్ వ్యూ
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.427 ; టార్గెట్ ధర: రూ.546 ఎందుకంటే: కంపెనీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 25 శాతం పెరిగాయి. ఎల్ఎన్జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు అనుకూలంగా ఉండడం, దహేజ్ టెర్మినల్ విస్తరణ దీనికి ప్రధాన కారణాలు. ఎల్ఎన్జీ ధరలు తక్కువగా ఉండడం, దేశీయంగా గ్యాస్ లభ్యత తక్కువగా ఉండడడం, డిమాండ్ పెరుగుతుండడం.. వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు జోరుగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ రంగంలో పోటీ తక్కువగా ఉండడం, దహేజ్, కోచి టెర్మినల్స్ మంచి కాంట్రాక్ట్‌లను సాధించడం, దేశవ్యప్తంగా గ్యాస్‌పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. ఐదేళ్లలో ఎల్ఎన్జీ వినియోగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. గ్యాస్‌కు డిమాండ్ పెరిగితే ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది మొదటివరసలో ఉంటుంది. నిర్మాణంలో ఉన్న జగదీష్ పూర్–హల్డియా పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే, మరిన్ని ప్రాంతాలకు ఈ కంపెనీ గ్యాస్ సరఫరా చేయగలుగుతుంది. టర్మినల్ వృద్ధి 3 శాతంగా ఉంటుందని భావిస్తూ ఈ షేర్ ఏడాది కాలంలో రూ.546కు , మూడేళ్ల కాలంలో రూ.767కు చేరగలదని అంచనా వేస్తున్నాం. భారత్‌లో ఎల్ఎన్జీకు డిమాండ్ బాగా వుండటం, లేకపోవడం, సరఫరాలు తగినంతగా లేకపోవడం, పోటీ పెద్దగా ఉండకపోవడం, ఎల్ఎన్జీ ధరలు తగ్గే అవకాశాలు అధికంగా ఉండడం.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. స్పాట్, స్వల్పకాలిక అమ్మకాల్లో మార్కెటింగ్ మార్జిన్లు తక్కువగా ఉండడం, ఎల్ఎన్జీ ధరలు పెరిగితే నాఫ్తా, తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలకు డిమాండ్ పెరిగి ఎల్ఎన్జీకి డిమాండ్ తగ్గడం, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరిగితే, ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గి, పీఎల్‌ఎన్‌జీ అమ్మకాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు. బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.529 ; టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: 2015 ఏప్రిల్‌లో ఈ షేర్ రూ.1,200 గరిష్ట స్థాయిలో ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 50% వరకూ తగ్గింది. హలోల్ ఇతర ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు ప్రతికూల ప్రభావం చూపడం, కొన్ని కీలకమైన ఔషధాలకు పోటీ పెరగడం, కొత్త ఔషధ ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం పరిమితంగా ఉండడం.. తదితర అంశాల కారణంగా కంపెనీ షేర్ ధర బాగా తగ్గిపోయింది. అయితే అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న ఔషధాల విలువను, నిలకడగా వృద్ధి చెందుతున్న, నగదు నిల్వలను అందిస్తున్న దేశీయ వ్యాపార విలువను.. ప్రస్తుత షేర్ ధర ప్రతిబింబించడం లేదని చెప్పవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. హలాల్ ప్లాంట్‌పై ప్రతికూల ప్రభావం తగ్గడం, స్పెషాల్టీ ఫార్మా విభాగంలో రెండు కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేనుండడం, దీనికి కారణం కానున్నాయి. అమెరికాలో జనరిక్స్ వ్యాపార విభాగం కంటే ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. పోటీ పెరుగుతుండడంతో జనరిక్స్ వ్యాపార వృద్ధి భవిష్యత్తులో చెప్పుకోదగిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నాం. అందుకని ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగంపై దృష్టి సారించే కంపెనీల వృద్ధి జోరుగా ఉండనున్నది. ఇక సన్ ఫార్మా ప్రత్యేక ఔషధ విభాగం 2019–20లో బ్రేక్ఈవెన్కు వస్తుందని అంచనా. ర్యాన్‌బాక్సీ విలీనంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర ఇబిటా ప్రయోజనాలు రావచ్చు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కం పెనీ నగదు నిల్వలు 150 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ కంపెనీ ఏడాదికి 70 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ఫ్లోస్ను సాధిస్తోంది. ప్రత్యేక ఫార్మా వ్యాపారంపై 2–3 ఏళ్లుగా చేస్తున్న వ్యూహాత్మక పెట్టుబడులు, దేశీ మార్కెట్లో నిలకడైన వృద్ధి, అమెరికాలో కాంప్లెక్స్ జనరిక్స్‌పై దృష్టి సారించడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు. -
స్టాక్స్ వ్యూ
ఎస్బీఐ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.308 ; టార్గెట్ ధర: రూ.375 ఎందుకంటే: అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. వాచ్ లిస్ట్‌లో ఉండే రుణాలు తగ్గుతుండడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, తదితర కారణాల వల్ల రుణ నాణ్యత మెరుగుపడగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీలకు, భారీ ప్రైవేట్ రంగ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల రుణాల విషయంలో బ్యాంక్ సౌకర్యవంతంగా ఉందనే చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వాతావరణం మెరుగుపడితే రుణ నాణ్యత అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరపతి వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగినా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు పెరుగుతున్నాయి. ఈ పోకడ మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర మొండి బకాయిలు తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్(నిమ్), నిర్వహణ మెరుగుపడుతాయనే అంచనాలతో బ్యాంక్ ఆదాయం(స్టాండోలోన్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవని భావిస్తున్నాం. అనుబంధ బ్యాంక్‌ల విలీనం విషయమై 70వేలకు పైగా ఉద్యోగుల సర్దుబాటు, బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ, విద్యుత్తురంగ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై ఒత్తిడి అధికంగా ఉండడం... అంశాలు కొంచెం సమస్యాత్మకమైనవి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యుత్తమంగా ప్రయోజనం పొందే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 66 శాతంగా ఉండడం, మూలధన నిధులు పుష్కలంగా ఉండడం, రిటైల్ డిపాజిట్లు 95 శాతానికి మించి ఉండడం, నిర్వహణ లాభదాయకత పెంపుపై బ్యాంక్ దృష్టి పెట్టడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.175 ; టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాల, ట్రక్కు, బస్సు టైర్ల(టీబీఆర్) సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొక్కటి. ప్రయాణికుల కార్ల రేడియల్ టైర్ల సెగ్మెంట్లో 12 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చైనా టైర్ల దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. చైనా టైర్ల దిగుమతి లావాదేవీలు అధికంగా నగదులో జరగడమే దీనికి కారణం. మరో వైపు చైనా టైర్లపై అమెరికా ఎలాంటి సుంకాలు విధించకూడదని నిర్ణయించడంతో చైనా కంపెనీలు భారత్‌కు కాకుండా అధిక లాభాలు వచ్చే అమెరికా మార్కెట్‌కు తమ టైర్లను ఎగుమతి చేస్తున్నాయి. ఈ రెండు రణాల వల్ల చైనా నుంచి పోటీ బాగా తగ్గింది. చైనా నుంచి టైర్ల దిగుమతులు తగ్గడం వల్ల కంపెనీ మార్కెట్ వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. టైర్ల తయారీకి కీలకమైన సహజమైన రబ్బరు ధరలు ఇటీవల కాలంలో తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.94గా ఉన్న కేజీ సహజ రబ్బరు ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.159కు పెరిగినా, ప్రస్తుతానికి రూ.140కి పడిపోయింది. ఈ ధర మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఇతర ముడి పదార్ధాల ధరలు (ముడిచమురుతో సంబంధించిన కొన్ని) కూడా తక్కువగానే ఉన్నాయి. నిర్వహణ పనితీరు రక్షణ నిమిత్తం ఈ కంపెనీతో సహా ప్రధాన టైర్ల కంపెనీలు గత ఆర్నెళ్లలో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకూ పెంచాయి. ఈ ధరల పెంపు కారణంగా కంపెనీ మార్జిన్స్ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన కావెండిష్ ఇండస్ట్రీస్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న 2 వీలర్, 3 వీలర్ సెగ్మెంట్లలోకి ఈ కంపెనీ ప్రవేశించడమే కాకుండా, టీబీఆర్ సెగ్మెంట్లో కంపెనీ స్థానం మరింతగా పటిష్టం కానుంది. -
స్టాక్స్ వ్యూ
ఇంజినీర్స్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.155 టార్గెట్ ధర: రూ.182 ఎందుకంటే: ఈ నవరత్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ఈపీసీ కంపెనీ. భారత హైడ్రోకార్బన్స్, పెట్రోకెమికల్స్ కన్సల్టెన్సీ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో ఏర్పాటైన 22 రిఫైనరీల్లో 19 రిఫైనరీలు ఈ కంపెనీ సేవలతో ఏర్పాటైనవే. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీకి ఆదాయం, నికర లాభం పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006–16 కాలానికి ఆదాయం 11 శాతం, నికరలాభం 7 శాతం, నెట్‌వర్త్ 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. కీలకమైన, భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు సహజంగానే ఈ కంపెనీకి లభించడం సానుకూలాంశం. రానున్న కొన్నేళ్లలో భారత హైడ్రో కార్బన్ కంపెనీలు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో ఈ కంపెనీకి రూ.11,000 కోట్ల మేర కన్సల్టెన్సీ ఆర్డర్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. ఈపీసీ విభాగం అంతంత మాత్రంగానే ఉన్నా కన్సల్టెన్సీ విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. ఆదాయంలో 65 శాతానికి మించి ఉన్న కన్సల్టెన్సీ విభాగం 30 శాతం ఇబిటా మార్జిన్ సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి రూ.5,024 కోట్ల ఆర్డర్లను సాధించింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,061 టార్గెట్ ధర: రూ.2500 ఎందుకంటే: రిటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల్లో మంచి స్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొకటి. అధిక వృద్ధి, మంచి లాభదాయకత, తక్కువ పోటీ ఉన్న వ్యాపార విధానాన్ని కంపెనీ అనుసరిస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోంది. వచ్చే నెల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం. ఈ కంపెనీ విలువ మదింపులో పరిగణనలోకి తీసుకోని హౌసింగ్ పైనాన్స్ వ్యాపార విబాగం 3–4 ఏళ్లలో మంచి విలువను సాధిస్తుందని అంచనా. గత నెలలో లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రుణ మంజూరీలు పుంజుకున్నాయి. కంపెనీ పీసీఆర్(ప్రొవిజనల్ కవరేజ్ రేషియో–మొండి బకాయిలను కవర్ చేయడానికి కేటాయించే నిధులు) 81 శాతంగా ఉన్నాయి. ఇది ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పీసీఆర్ కంటే అధికం. ఫలితంగా మరో రెండేళ్ల వరకూ మొండి బకాయిలకు భారీ కేటాయింపుల అవసరం ఉండదని భావిస్తున్నాం. రుణ వృద్ధి పటిష్టంగా ఉండడం, కేటాయింపు వ్యయాలు తక్కువగా ఉండడంతో లాభదాయకత జోరుగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 3 శాతం నుంచి 3.8 శాతానికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 12.3 శాతం నుంచి 17.6 శాతానికి చేరగలదని భావిస్తున్నాం. -
ఖరీదైనా.. మార్కెట్ ముందుకే!
ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్ స్టాక్ మార్కెట్ ఖరీదైనదే... ⇒ వాల్యుయేషన్ అధిక స్థాయిలో ఉంది... ⇒ అయినా, మరింత ఎగబాకే చాన్స్... ⇒ సంస్కరణల జోరు.. మెరుగైన వృద్ధి రేటు తోడ్పాటు ⇒ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఎస్. నరేన్ అభిప్రాయం ముంబై: ప్రధాని మోదీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలేస్తోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి అప్రతిహతంగా దూసుకుపోతోంది. సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టానికి కాస్త దూరంలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లోకి డాలర్ నిధులను కుమ్మరిస్తున్నారు. మరోపక్క, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీరేట్లను పావు శాతం పెంచడంతో రేట్ల పెంపుపై అనిశ్చితికి తెరపడింది. ఇది కూడా ఒకరకంగా మార్కెట్లకు ఇంధనంగా పనిచేస్తోంది. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ప్రవేశించడం మంచిదేనా... రానున్న కాలంలో ఏవిధంగా ఉంటాయి అన్న సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన మార్కెట్ల వాల్యుయేషన్ చాలా అధికంగా ఉందని.. అయినప్పటికీ మరింత ఎగబాకేందుకు అవకాశం కనబడుతోందని... దేశంలోనే టాప్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ అంటున్నారు. వాల్యుయేషన్‌లో జపాన్ను మించిన భారత్... భారత్ మార్కెట్లు గడిచిన కొద్ది నెలలుగా దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో అపూర్వ విజయాన్ని దక్కించుకోవడంతో నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టాలతో పరుగులు తీస్తోంది. గురువారం కూడా ఇంట్రాడేలో 9,218 పాయింట్ల కొత్త గరిష్టాన్ని తాకింది. 9,160 పాయింట్ల ముగింపుతో మరో రికార్డును నమోదు చేసింది. సెన్సెక్స్ కొత్త రికార్డులకు దాదాపు మరో 400 పాయింట్లు దూరంలో మాత్రమే ఉంది. కాగా, తాజా ర్యాలీతో భారత్ స్టాక్ మార్కెట్లు ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో జపాన్ను వెనక్కినెట్టి వాల్యుయేషన్ పరంగా(బుక్ వాల్యూ, పీఈ) అత్యంత ఖరీదైనదిగా అవతరించింది. ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ జీడీపీ–మార్కెట్ క్యాప్ సిద్ధాంతం ప్రకారం.. ప్రస్తుతం మన మార్కెట్ వాల్యుయేషన్ గరిష్టాలకు చేరువవుతోంది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) డాలర్ల రూపంలో ఇప్పుడు 1.82 ట్రిలియన్లకు చేరింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ(సుమారు 2.1 ట్రిలియన్ డాలర్లు)తో పోలిస్తే మార్కెట్ క్యాప్ 87 శాతానికి చేరింది. 2007లో జీడీపీలో మార్కెట్ క్యాప్ 147 శాతానికి చేరడం గమనార్హం. ఆతర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు మన మార్కెట్లు సైతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా, ప్రైస్ టు ఎర్నింగ్స్(కంపెనీల రాబడులతో పోలిస్తే మార్కెట్ విలువ–పీఈ) ప్రకారం చూస్తే మార్కెట్లు ఖరీదైనవే అయినప్పటికీ.. ప్రైస్ టు బుక్, మార్కెట్ క్యాప్–జీడీపీల నిష్పత్తితో పోలిస్తే వాల్యుయేషన్లు ఇంకా చౌకగానే ఉన్నట్లు లెక్క అని నరేన్ చెబతున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందనేందుకు దీన్ని కారణంగా చూపుతున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి... గతంలో వాల్యుయేషన్స్ గరిష్ట స్థాయిలకు చేరినప్పుడు మన మార్కెట్లు భారీగా పతనమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని... అందువల్ల ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మేలనేది మరికొందరు నిపుణుల విశ్లేషణ. 2007లో, 2015లో మార్కెట్ క్షీణతను దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. 2015–16లో మన స్టాక్ మార్కెట్ 23 శాతం మేర దిగజారగా... ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 2008లో 52 శాతం మేర కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, ఆ స్థాయి వాల్యుయేషన్స్‌కు చేరేందుకు ఇంకా అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రధాన సూచీలోని షేర్లు బుక్ వేల్యూతో పోలిస్తే 2.9 రెట్ల ధరకు ట్రేడవుతున్నాయి. ఇదే 2015 మార్చిలో ఇది 3.1 రెట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్(సూచీలు) పీఈ నిష్పత్తి 22.5గా ఉంది. ఇది 2015 నాటి గరిష్టస్థాయికి చేరుకుంది. మోదీ పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత గతేడాది డిసెంబర్లో ఆరు నెలల కనిష్టానికి పడిపోయిన దేశీ మార్కెట్.. ఆతర్వాత మళ్లీ ఎగబాకడం మొదలైంది. గడిచిన ఐదు నెలల్లో తొలిసారిగా ఫిబ్రవరిలో విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మార్చిలోనూ ఇప్పటిదాకా డెట్, ఈక్విటీల్లో కలిపి నికరంగా విదేశీ ఇన్వెస్టర్లు రూ.15,000 కోట్లు కుమ్మరించారు. ఇదే మార్కెట్ ర్యాలీకి ప్రధాన ఇంధనం. కాగా, మార్కెట్లు ఒకేదిశగా ఎగబాకుతూపోవడం అత్యంత ఆందోళనకరమని నరేన్ అభిప్రాయపడుతున్నారు. మరిన్ని సంస్కరణలపై ఆశలు... మోదీ ఘన విజయంతో మరిన్ని భారీ సంస్కరణలకు కేంద్రం తెరతీయనునందన్న అంచనాలు నెలకొన్నాయి. దీనివల్ల పెట్టుబడులు పెరిగి.. ప్రైవేటు రంగంలో వ్యయాలు జోరందుకుంటాయని భావి స్తున్నారు. మార్కెట్లలో జోష్‌కు ఇదీ ఒక కారణమే. ఇక నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ... జీడీపీ వృద్ధి 7% వృద్ధి చెందుతుందన్న తాజా గణాంకాలు కూడా ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి దోహదం చేస్తోంది. అయితే మొండిబాకాయిల సమస్యతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులు.. కార్పొరేట్లకు రుణాలిచ్చేందుకు వెనుకాడుతున్నాయని.. ఇది పెట్టుబడులప్రభావం చూపొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘వచ్చే రెండేళ్లలో కంపెనీల సామర్థ్య వినియోగం, నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉంది. మార్కెట్లు రానున్న కాలంలో మరింత వృద్ధి చెందుతాయనేందుకు దీన్ని సంకేతంగా భావించవచ్చు’ అని నరేన్ పేర్కొన్నారు. -
డబ్బు మీది.. మోత మాది..
ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సామాన్యుల నడ్డి విరచడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులంటేనే ఖాతాదారులు భయపడేలా చార్జీల మోత మోగించడానికి రుసుముల మోత మోగించనున్నాయి. చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బ్యాంకులు కానీ, రిజర్వ్‌బ్యాంకు కానీ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయం తమ పరిధిలో లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండంపై ఖాతాదారులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సామాన్యులు. ఇప్పుడు బ్యాంకులు ట్రాన్సాక్షన్ చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. చిత్తూరు : జిల్లాలో సుమారు 42 లక్షల జనాభా ఉంది. వీరిలో 33 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జిల్లా జనాభాలో 78 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాదారులున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి నుంచి పై స్థాయి వరకు దాదాపుగా అందరికీ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతిఫలాలన్నీ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు చేరుతున్నాయి. దీంతో ప్రజలందరూ బ్యాంకులపై ఆధారపడ్డారు. దీంతో బ్యాంకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారీగా పెంచుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ప్రస్తుతం ఉన్న ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తూ ఇప్పటికే తమ శాఖలకు కొత్త ఛార్జీల వివరాలు పంపాయి. ఈ పెంపుపై జాతీయమీడియా, నెటిజన్లు సామాన్యులు మండిపడుతున్నారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా నో బ్యాంక్ ట్రాన్సాక్షన్డేగా ఏప్రిల్ 6ను ప్రకటించారు నెటిజన్లు. ఆ రోజున దేశంలోని ప్రజలందరూ అన్ని రకాల బ్యాంకు ట్రాన్సాక్షన్లను నిలేపేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 బ్యాంకులు754 బ్రాంచులున్నాయి. వీటిలో సుమారు 33 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అన్ని ప్రైవేటు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు తమకు అనుకూలంగా, తాము అనుకున్న విధంగా రుసుములు పెంచి సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. నెలలో మొదటి మూడు నగదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రస్తుతం 5 వరకు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు ప్రతి నెలా మూడు సార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించింతే ప్రతి లావాదేవిపై సర్వీస్ టాక్స్, రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ. 100 ఫెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్‌ను ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు సార్ల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20తో పాటు సర్వీస్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఇది ఐదు సార్లకు మించకూడదు. రూ.10 వేలు నిల్వ ఉన్న కరెంటు ఖతాదారులు అయితే రూ.25వేలకు ప్రతి రోజూ రూ.25 వేలకు వరకు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ట్యాక్స్, రుసుం చెల్లించాల్సిందే. హెచ్డీఎఫ్సీ.. ప్రతి నెలా నాలుగు ట్రాన్సాక్షన్లకు మించితే రుసుం చెల్లించాల్సిందే. నాలుగుకు మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.150లు ఖాతాదారుడి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒక్కో రోజు రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉటుంది. అదికూడా హోబ్రాంచ్ అయితేనే. అంతకు మించితే బాదుడు తప్పదు. ఈ ఛార్జీలు కేవలం సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఐసీఐసీఐ.. నెలకు నాలుగు లావాదేవీలకు ఎలాంటి రుసుము ఉండదు. అంతకు మించితే బాదుడు తప్పదు. పరిమితి మించిన లావాదేవీలపై ఒక్కోదానిపై సుమారు రూ.150 వసూలు చేస్తుంది. ఇతర ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా భారీగా పెంచినట్లు సమాచారం. యాక్సిస్ బ్యాంకు యాక్సి బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెలా ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. వీటిలోనే డిపాజిట్లు విత్డ్రాలుంటాయి. వీటికి మించితే రుసుము చెల్లించాల్సిందే. ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.95 చార్జీ ఉంటుంది. నాన్హోమ్ బ్రాంచ్‌లో ఐదుకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కి రూ.1000కి రూ.2.5 రుసుం లేదా రూ.95లు ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు ఖాతాదారుల నుంచి. -
ఏ బ్యాంకు.. ఎన్ని ఛార్జీలు
న్యూఢిల్లీ : బ్యాంకు దిగ్గజాలుగా పేరున్న ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు కస్టమర్లపై ఛార్జీలు బాదుడుకు సిద్ధమయ్యాయి. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక యూజర్లు తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపుకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాంకులు భారీగా విధించే సమీక్షించిన ఛార్జీల వివరాలెంటో మీరే ఓ సారి చూడండి.... స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా: 1. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచిత ఛార్జీతో నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే, ప్రతి లావాదేవీకి రూ.50కు మించి సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి. 2. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సర్వీసు ట్యాక్స్ విధింపు ఉంటుంది. 3. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధింపు. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. కనిష్టంగా రూ.20+సర్వీసు ట్యాక్స్ ను బ్యాంకు నిర్ణయించింది. 4. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5000కు 75 శాతానికి పైగా తగ్గితే రూ.100 ప్లస్ సర్వీసు ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 50 శాతం తగ్గితే, రూ.50 ప్లస్ సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. 5. ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే రూ.20 ఛార్జీ వేస్తుంది. ఎస్బీఐ ఏటీఎంలలోనే ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది. 6. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండే సొంత ఏటీఎంలలో అయితే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకునేందుకు ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉండాలి. 7.ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్ కార్డు లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్ఎస్డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. యాక్సిస్ బ్యాంకు : 1. యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెల ఉచితంగా ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ ఐదు లావాదేవీల్లోనే డిపాజిట్లు, విత్ డ్రాలు ఉంటాయి. అంతకుమించితే ప్రతి లావాదేవీకి రూ.95 కనీస ఛార్జీ ఉంటుంది. 2. గరిష్టంగా రూ.50వేలు డిపాజిట్ చేసే కస్టమర్లకు ఐదు నాన్-హోమ్ బ్రాంచు లావాదేవీలు ఉచితం. అదే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు లేదా ఆరో లావాదేవీకు ప్రతి రూ.1000కు రూ.2.50 ఛార్జీ లేదా ప్రతి లావాదేవీకి రూ.95 ఛార్జీ ఏది ఎక్కువైతే అది విధిస్తారు. హెచ్డీఎఫ్సీ : 1. ప్రతినెలా నాలుగు ఉచిత లావాదేవీలు(డిపాజిట్లు, విత్ డ్రాలు కలిపి) చేసుకున్న అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతి లావాదేవీకి రూ.150 లెవీ వేస్తుంది. 2. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు వర్తిస్తాయి. 3. హోమ్-బ్రాంచు లావాదేవీలకు, ఒక్కరోజు ఒకేసారి రూ.2 లక్షల వరకు ఉచితంగా డిపాజిట్ లేదా విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది. అంతకు మించితే ఇక ప్రతి రూ.1000కు రూ.5 లేదా రూ.150 చెల్లించాలి. 4. నాన్-హోమ్ బ్రాంచులో ఒక్కరోజులో రూ.25వేలకు మించి లావాదేవీ జరిపితే, ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీ విధిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు : 1. హోమ్ సిటీలోని శాఖల వద్ద నెలకు నాలుగు లావాదేవీలకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధించదు. ఆ పరిమితికి మించితే విత్ డ్రా లేదా డిపాజిట్ల ఒక్కో లావాదేవీపై కనీస ఛార్జీగా రూ.150 వసూలు చేస్తుంది. 2. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ.50వేలే. 3. నాన్-హోమ్ బ్రాంచుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి క్యాష్ విత్ డ్రాకు క్యాలెండర్ నెలలో ఎలాంటి ఛార్జీ వేయదు. అంతకుమించితే కనీస ఛార్జీ రూ.150. 4. ఎక్కడైనా నగదు డిపాజిట్లకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి రూ.1000కు రూ.5 ఛార్జీ వేస్తోంది. అంటే కనీసం రూ.150 వరకు ఉంటుంది. క్యాలెండర్ నెలలో తొలి క్యాష్ డిపాజిట్ ఉచితం. తర్వాత దానికి రూ.1000కు రూ.5 ఛార్జీ ఉంటుంది. -
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
-
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
⇒ నగదు లావాదేవీలపై పరిమితులు ⇒ నెలలో 4 దాటితే రూ. 150 వడ్డన ⇒ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో అమల్లోకి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్ బ్రాంచ్‌లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్ నో–ఫ్రిల్స్ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్‌డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు. ఐసీఐసీఐ: ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. హోమ్ బ్రాంచ్‌లో నెలలో తొలి నాలుగు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున.. కనిష్టంగా రూ. 150 చార్జీలు ఉంటాయి. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ. 50,000గా ఉంటుంది. నాన్–హోమ్ బ్రాంచ్‌లలో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితం. అటుపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చార్జీ. కనిష్టంగా రూ. 150 చార్జీలు వర్తిస్తాయి. అటు క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా తొలి నగదు డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత రూ. 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్..: విలువపరంగా రూ. 10 లక్షల దాకా తొలి అయిదు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) ఉచితం. దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది) మేర చార్జీలు వర్తిస్తాయి. -
పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!
► ఈఎల్ఎస్ఎస్లవైపు మదుపరుల మొగ్గు ► చివరి నిమిషం పన్ను ఆదాకోసం వీటివైపు చూపు ► ఐదేళ్లుగా 20 శాతానికిపైగా రాబడులనిస్తున్న పథకాలు ► గడిచిన ఒక్క ఏడాదిలో చూస్తే 30 శాతంపైనే రాబడి ► దీర్ఘకాలానికి ఇవే ఉత్తమమంటున్న నిపుణులు ► ‘సిప్’ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిదని సూచన ► గడిచిన 10 నెలల్లోనే రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఇది పన్నుల కాలం. అంటే... ఒకవైపు జీతంలో పన్ను కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి... వాటిని తప్పించుకోవటానికి హడావుడిగా వివిధ పొదుపు పథకాలవైపు పరుగులు తీసే కాలం. ఎవరెన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టినా... అందరూ ఎక్కువగా లబ్ధి పొందేది సెక్షన్ 80సీ నుంచే. దానిక్కూడా గరిష్ఠ పరిమితి రూ.1.5 లక్షలే. దీన్లో కూడా వివిధ బీమా పథకాలు, పిల్లల స్కూళ్లకు చెల్లించే ట్యూషన్ ఫీజులు తీసేస్తే... మహా అయితే ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సింది ఏ రూ.50 వేలో ఉంటుంది. సరే!! మరి ఈ 50వేలైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మన సొమ్ముకు కాస్తంత ఎక్కువ రాబడి వస్తుంది? ఎక్కడైతే దీర్ఘకాలంలో ఊహించనంత లాభాలొస్తాయి? ఇలా ఆలోచించే వారందరికీ కనిపించే పరిష్కారమే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ పథకాలు(ఈఎల్ఎస్ఎస్). సంక్షిప్తంగా ఈఎల్ఎస్ఎస్లు. ఒకవైపు పన్ను ప్రయోజనాలు... మరోవైపు చక్కని రాబడులు.. ఈ రెండూ కలసి ఉండటమే వీటి ప్రత్యేకత. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద బ్యాంకు డిపాజిట్లు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి పెట్టినా పన్ను భారం తగ్గుతుంది. కానీ, చక్కని రాబడి కావాలంటే ఈఎల్ఎస్ఎస్ను పరిశీలించాల్సిందే. ఇవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కనక వీటి రాబడికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ చరిత్ర చూస్తే వీటి రాబడులు మెరుగ్గానే ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 30 శాతం శ్లాబులో ఉన్నవారికైతే ఏడాదికి రూ.7,500 పన్ను ప్రయోజనం లభించినట్టే. అదే పది, ఇరవై ఏళ్ల కాలంలో ఆదా చేసుకునే పన్ను మొత్తం, రాబడులను అంచనా వేస్తే... ఈ అవకాశాన్ని ఎవరూ కాదనుకోరు. పెరుగుతున్న పెట్టుబడులు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. – రాఘవ్ అయ్యంగార్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్ పథకాల పనితీరు బాగు దీర్ఘకాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు చాలా బాగుంది. చాలా మంది ఈఎల్ఎస్ఎస్ను పన్ను ఆదాకు ఒక అవకాశంగా చూస్తున్నారు – హిమాన్షు వ్యాపక్, రిలయన్స్ కేపిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఈవో ‘సిప్’ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు బాగా తగ్గిపోతున్న తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఇపుడా పరిస్థితి మారింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కనక వీటికి గణనీయమైన రాబడులందించే సామర్థ్యం ఉంటుంది. వీటిలో రిస్క్ ఉంటుందనేది నిజమే అయినా... నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. పైగా రాబడుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో మదుపు కంటే ఇది సురక్షితమని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు... ఈఎల్ఎస్ఎస్ల పనితీరు కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లానే ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపుల కోసం ఇందులో పెట్టే పెట్టుబడులను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీనివల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగుతాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో రాబడులు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణమిదే. దీనివల్ల ఫండ్ మేనేజర్లకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఫలితంగా వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి పెట్టుబడుల వరద... మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పది నెలల కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి 940 మిలియన్ డాలర్లు్ల వచ్చాయి. అంటే సుమారు రూ.6,194 కోట్లు. ఇదే కాలంలో పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 29 శాతానికి పైగా ఎగసి జనవరి చివరికి రూ.53,886 కోట్లకు చేరింది. నిజానికి నెలనెలా సిప్ విధానంలో కంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల వైపు చూస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్ను భారం తప్పించుకునేందుకు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే ధోరణి ఎక్కువగా ఉంది. వార్షిక రాబడి 30 శాతం కూడా దాటింది మరి!! మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది డిసెంబర్‌కు రూ.16.46 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది రూ.20 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాలు మెరుగైన రాబడులనిచ్చాయి. 30 శాతానికి పైగా రాబడులను ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ పథకాలు చాలానే ఉన్నాయి. వాటినొకసారి చూస్తే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్
హైదరాబాద్: పెట్రోల్ బంక్ సిబ్బంది తెలివి మీరిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్దకు వచ్చే కస్టమర్లు పేమెంట్ కోసం కార్డులు ఇస్తే డాటా తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైదాబాద్ లోని పెట్రోల్ బంక్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ హేమంత్ నాగ్ పెట్రోల్ పోయించుకున్నారు. మనీ పేమెంట్ కోసం ఐసీఐసీసీ క్రెడిట్ కార్డు ఇచ్చారు. బంక్‌లో పనిచేసే కైసర్ ఖాన్ ఇంజినీర్ ఇచ్చిన కార్డు డాటాను తస్కరించాడు. కార్డు డాటాతో మోసాలకు పాల్పడుతున్నారని హేమంత్ నాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బంక్ లో పనిచేసే కైసర్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
మ్యూచువల్ ఫండ్స్ నుంచి త్వరలో12 కొత్త పథకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడంతో దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలు సంస్థలు సైతం అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 కొత్త పథకాలకు(ఎన్ఎఫ్ఓ) సంబంధించి అనుమతులు కోరుతూ వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెబీ వద్ద దరఖాస్తు చేశాయి. వీటిలో ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు ఉన్నాయి. సుందరం, ఎడెల్వీజ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, రిలయన్స్, డీఎస్పీ బ్లాక్‌రాక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ సంస్థలు నూతన పథకాలను తీసుకురానున్నాయి. సెబీ అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ పథకాలకు సంబంధించి చందాలను ఫండ్ సంస్థలు స్వీకరిస్తాయి. ఇటీవల వచ్చిన కొత్త పథకాల పట్ల ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఫండ్ సంస్థలు కొత్త పథకాలను తీసుకురావడంలో మరింతగా తలమునకలై ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది తాము రిటైల్ ఇన్వెస్టర్లపై మరింత దృష్టి సారించనున్నట్టు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జిమ్మీ పటేల్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ నమోదుకు పేపర్ రహిత ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం సైతం ఈ రంగానికి కలసివస్తుందన్నారు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ వద్ద మొత్తం 106 పథకాలకు సంబంధించి దరఖాస్తులు దాఖలు చేశాయి. -
స్టాక్స్ వ్యూ
బజాజ్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 1,047, టార్గెట్ ధర: రూ. 1,300 ఎందుకంటే: బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటంతో నికర లాభం రూ.556 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.1,547 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు 33 శాతం వృద్ధితో రూ.57,605 కోట్లకు చేరాయి. స్థూల మొండి బకాయిలు 1.47 శాతంగా ఉన్నాయి. చిన్న మొత్తాల్లో రుణాలివ్వడం, జీవన శైలి ఉత్పత్తులకు రుణాలివ్వడం, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించడం, రుణాల్లో వివిధీకరణ తదితర కారణాల వల్ల అగ్రగామి ఎన్బీఎఫ్సీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కారణాల వల్లే 2011–16 మధ్య కాలంలో నిర్వహణఆస్తులు 42 శాతం, నికర లాభం 39 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. పలు ఎన్‌బీఎఫ్‌సీల స్థూల మొండి బకాయిలు 2.5 శాతానికి మించి ఉండగా, ఈ కంపెనీ స్థూల మొండి బకాయిలు 1.2 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో రుణ నాణ్యత బాగా మెరుగుపడింది. జీవన శైలి ఉత్పత్తులకు, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించే అంశంలో ఈ కంపెనీకి పోటీ తక్కువగా ఉండడం వల్ల వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిర్వహణ పనితీరు నిలకడగా ఉండడం, మార్జిన్లు, వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యతపై నియంత్రణ తదితర అంశాల కారణంగా రెండేళ్లలో నికర లాభం 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఆసెట్ 3.3 శాతంగానూ, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23 శాతంగానూ ఉండొచ్చని అంచనా. రెండేళ్ల కాలంలో నిర్వహణ ఆస్తులు 32 శాతం చక్రగతి వృద్ధితో రూ.76,777 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నాం. టెక్ మహీంద్రా బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ. 481, టార్గెట్ ధర: రూ. 600 ఎందుకంటే: మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 13 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.751 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 13 శాతం వృద్ధితో రూ.856 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వ్యయాలు 25 శాతం తగ్గడంతో ఈ క్యూ3లో మంచి నికర లాభం సాధించింది. గత క్యూ3లో 11.5 శాతంగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో 12.4 శాతానికి పెరిగింది. ఈ క్యూ3లో కొత్తగా 19 క్లయింట్లను సాధించింది. దీంతో కంపెనీ మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు చేరింది. ఆదాయం, డీల్స్ పరంగా కమ్యూనికేషన్స్ విభాగం మంచి పనితీరు కనబరుస్తోంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఆరోగ్య సంరక్షణ, తయారీ, రిటైల్ రంగాల నుంచి ఐటీ, సంబంధిత సేవలకు డిమాండ్ పెరుగుతుందని, వాటిని అందిపుచ్చుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. గతంలో సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసింది. ఇటీవలనే ఎల్సీసీ, సాఫ్ట్జెన్లను చేజిక్కించుకుంది. మరిన్ని కంపెనీలను కొనుగోలు చేసి, విలీనం చేసుకోవడం ద్వారా వృద్ధిని పెంచుకుంటోంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీలను కొనుగోలు చేసి విలీనం చేసుకోవడంతో పాటు ఆర్డర్లు కూడా జోరుగా ఉంటుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా కంపెనీ ఆదాయం డాలర్ల పరంగా 11 శాతంగా, రూపాయిల పరంగా 12% చక్రగతి వృద్ధి ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2009లో సమస్యల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి 2014 కల్లా టర్న్ అరౌండ్‌ను సాధించింది. అలాగే ఇటీవల కొనుగోలు, విలీనం చేసుకున్న కంపెనీల పనితీరు మెరుగుపరచి భవిష్యత్తులో 20% ఇబిటా సాధించగలదన్న అంచనాలున్నాయి. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: ఆసియా నుంచి వీస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 36.47 పాయింట్ల నష్టంలో 28,190.14 వద్ద, నిఫ్టీ 12.20 పాయింట్ల నష్టంలో 8722.05 వద్ద ఎంట్రీ ఇచ్చాయి. వచ్చే వారంలో వచ్చే ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు మార్నింగ్ ట్రేడ్‌లో నష్టాలు గడించగా.. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, గెయిల్, కోల్ ఇండియా, ఐడియా సెల్యులార్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా పవర్, టెక్ మహింద్రా, అరబిందో ఫార్మా లాభాలు పొందాయి. గురువారం ట్రేడింగ్‌తో పోలిస్తే శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 67.35 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్‌గా డాలర్ బలహీనపడటంతో రూపాయి విలువ పెరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అశుతోష్ రైనా చెప్పారు. నేడు విడుదలయ్యే అమెరికా ఉద్యోగ డేటాపై కూడా మార్కెట్లు ఎక్కువగా దృష్టిసారించాయన్నారు. అనూహ్యంగా బీజింగ్ తన పాలసీని కఠినతరం చేస్తూ స్వల్పకాలిక రేట్లను పెంచడంతో చైనీస్ మార్కెట్లు పడిపోయాయి. దీంతో ఆసియా షేర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న కఠినతరమైన పాలసీలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అత్యంత స్వల్పంగా 5 రూపాయల లాభంతో 28,875గా ట్రేడవుతోంది. -
సొంతింటికి టైమొచ్చింది..!
గృహ రుణరేటు తగ్గిస్తున్న బ్యాంకులు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతానికి... వడ్డీ 8.6 శాతం ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకునే వారికి వర్తింపు ఏప్రిల్ తర్వాత రుణం తీసుకున్న వారికీ లాభమే అంతకుముందు తీసుకున్న వారైతే మార్చుకోవాలి ఇలా మార్చుకోవటానికి కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి ఎలాంటి చార్జీలూ లేకుండా మారుస్తామంటున్న బీఓబీ పెద్ద నోట్ల రద్దుతో రియల్టీ ధరలు కూడా తగ్గుదల హైదరాబాద్ వంటి చోట్ల పెరగకుండా స్థిరంగా ఉన్నతీరు ఇదే మంచి తరుణమంటున్న హౌసింగ్ నిపుణులు అల్పాదాయ వర్గాల కోసం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రధాని గృహ రుణానికి సంబంధించి ఇపుడొక మంత్రంలా వినిపిస్తున్న సంఖ్య 8.65. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక గృహ రుణాలకు కొన్ని బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేటు శాతం. బహుశా! ఇటీవలి కాలంలో ఇంత తక్కువ రేటుకు గృహ రుణాలు లభ్యం కావటం ఇదేనని చెప్పాలి. నిన్న మొన్నటిదాకా 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేటు... ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 90 బేసిస్ పాయింట్లు కోత విధించటంతో 8.65కు దిగివచ్చింది. గడిచిన మూడేళ్లలో తగ్గించిన రుణ రేటు కన్నా ఇది రెట్టింపు కావటం గమనార్హం. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తానూ రేసులో ఉన్నానంటూ ఎస్బీఐకి జత కలసింది. దాంతో అన్ని బ్యాంకులూ రేట్ల కోతను ప్రకటిస్తున్నాయి. ఈ తాజా తగ్గింపు ఎవరెవరికి వర్తిస్తుందంటే... ♦ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు వచ్చి చేరాయి. సేవింగ్స్ ఖాతాల్లో వేసిన డబ్బులు కాబట్టి వీటిపై బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ తక్కువే. మరోవంక ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తూ వస్తోంది. దీంతో బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించే పనిలో పడ్డాయి. ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీకి ప్రాతిపదికగా భావించే ఎంసీఎల్ఆర్ను తగ్గిస్తున్నట్లు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. ♦ నోట్ల రద్దుతో దేశంలో రియల్టీకి డిమాండ్ తగ్గిందని సర్వేల సారాంశం. చాలా నగరాల్లో ధరలూ ఇప్పటికే తగ్గాయి. కొనుగోళ్లు మందగించటం వల్ల నేరుగా గృహ ప్రవేశం చేయటానికి వీలయ్యే ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ధరలు భారీగా తగ్గకపోయినా గడిచిన నాలుగైదు నెలలతో పోలిస్తే పెరగలేదు. ♦ వీటన్నిటికీ తోడు అల్పాదాయ వర్గాల వారు... తక్కువ రుణంతో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పలు వరాలిచ్చారు. వారు తీసుకునే గృహ రుణాలపై రాయితీల జల్లు కురిపించారు. రూ.12 లక్షల లోపు గృహ రుణాలు తీసుకునేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయన్న మాట. ఇది కూడా సొంతింటి కల సాకారం చేసుకోవటానికి నిచ్చెనలాంటిదే. ♦ ఒకవైపు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. మరోవంక ఇళ్ల ధరలు కూడా ఊరిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు కొన్ని వర్గాల వారికి గృహ రుణాలు రాయితీ ధరకే దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం!! బ్యాంకు లోన్‌కి ఇదే సమయం.. అనుకుంటున్నారా? మరి బ్యాంకుకు వెళ్లే ముందు ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది? ఎంసీఎల్ఆర్ను ఎవరు ఎంత వసూలు చేస్తున్నారు? అసలింతకీ ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...! కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారికి.. తాజా రేట్ల తగ్గింపుతో గరిష్ఠంగా లాభం పొందేది ఎవరైనా ఉంటే వారు కొత్తగా రుణాలు తీసుకోబోతున్నవారే. ఎందుకంటే వారు రుణం తీసుకున్ననాటి నుంచే తాజా రేట్లు వారికి వర్తిస్తాయి. ప్రస్తుతం అందరికన్నా తక్కువగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతం ఉండగా... ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.2 శాతంగా ఉంది. ఇవి 8.6 నుంచి 9.25 మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీరేట్లు తీసుకున్న రుణం, తిరిగి తీర్చే వ్యవధిని బట్టి మారతాయి. ఇప్పటికే ఎంసీఎల్ఆర్ కింద రుణాలు తీసుకుంటే... చాలా బ్యాంకులు తాము ఎంసీఎల్ఆర్ను ఎప్పుడెప్పుడు సవరించేదీ చెబుతుంటాయి. అంటే ఎంసీఎల్ఆర్ వ్యవధి ఏడాదా? 6 నెలలా? 3 నెలలా? అనేది ముందే చెబుతాయి. చాలా బ్యాంకులకు ఇది ఏడాదిగానే ఉంది. అంటే... రుణం తీసుకున్న ఏడాది తరవాతే వారికి కొత్త రేటు వర్తిస్తుందన్న మాట. ఉదాహరణకు అక్టోబర్‌లో ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకున్నారని అనుకుందాం. వారికి తాజా తగ్గింపు ఇప్పుడు వర్తించదు. ఈ ఏడాది అక్టోబర్‌లో అప్పుడు ఎంసీఎల్ఆర్ ఎంత ఉంటే... అది వర్తిస్తుంది. దాని ప్రకారం రుణ రేటు తగ్గటమో, పెరగటమో జరుగుతుంది. బేస్‌రేటు కింద రుణాలు తీసుకుంటే.. గతేడాది ఏప్రిల్‌కన్నా ముందు తీసుకున్న గృహ రుణాలన్నీ బేస్ రేట్ ప్రాతిపదికన తీసుకున్నవే. ఇది కొంత ఎక్కువే. వారికి తాజా తగ్గింపు వర్తించదు. కాకపోతే వారు ఎంసీఎల్ఆర్కు మారాల్సి ఉంటుంది. ఇలా మారడానికి చాలా బ్యాంకులు మొత్తం రుణంలో .0.5 శాతాన్ని గానీ, రూ. 10 వేల మొత్తాన్ని గానీ కన్వర్షన్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. దీన్లో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. రూ.15వేలు కన్వర్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.15 లక్షలైతే... రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం ఎలాంటి కన్వర్షన్ చార్జీలూ వసూలు చేయకుండా బేస్ రేట్ రుణ గ్రహీతలను ఎంసీఎల్ఆర్ విధానంలోకి మారుస్తామని చెబుతోంది. ఎలాంటి షరతులూ ఉండవని కూడా బ్యాంకు ప్రకటించింది. ఏం చేయాలంటే... ఇది ఒక్క గృహ రుణాలకే కాదు. ఎస్బీఐ అయితే ఆటో రుణాలకూ వర్తింపజేస్తోంది. అందుకని మీ రుణ రేట్ ఇపుడెంత ఉందో చూసుకుని... మీ బ్యాంకును సంప్రతించటం మేలు. ఒకవేళ తగ్గింపు మీకూ వర్తిస్తుందని అనుకుంటే వెంటనే ఎంసీఎల్ఆర్లోకి మారిపోవచ్చు. సీఎల్ఆర్లోకి మారడానికి చార్జీలు వసూలు చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మారితే వచ్చే లాభాన్ని లెక్కించేటపుడు ఈ చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకని 0.5 శాతంకన్నా ఎక్కువ లాభం ఉంటేనే మారాలి. మీరిపుడు ఎంసీఎల్ఆర్లో ఉన్నా సరే... తాజా తగ్గింపు వర్తించకపోవచ్చు. అందుకని మీ బ్యాంకును సంప్రదించి, ఎప్పటి నుంచి తగ్గింపు వర్తిస్తుందో తెలుసుకోవాలి. గృహ రుణాలపై ప్రధాని రాయితీ.. ♦ పట్టణ ప్రాంతాల్లో రూ.9 లక్షలలోపు గృహ రుణం తీసుకునేవారికి వడ్డీలో 4 శాతం.. రూ.9–12 లక్షల మధ్య తీసుకున్న వారికి 3 శాతం రాయితీ లభిస్తుంది. తగ్గించిన వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ♦ గ్రామాల్లో అయితే కొత్తింటి కోసం గానీ, ఉన్న ఇంటిని విస్తరించడానికి గానీ రూ.2 లక్షలలోపు రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ♦ 2017లో రుణాలు తీసుకుంటే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈఎంఐ బాగానే తగ్గుతుంది.. ప్రధాని ప్రకటించిన వడ్డీ రాయితీవల్ల ఈఎంఐ గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చు. గతంలో రూ.6 లక్షల లోపు రుణం తీసుకునే వారికి వడ్డీలో 6.5 శాతం రాయితీ ఉండేది. ఈ రాయితీని తగ్గించినా... రుణ మొత్తాన్ని పెంచటం వల్ల చాలామందికి ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.12 లక్షల రుణాన్ని 15 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. వడ్డీ 3 శాతం తగ్గడం వల్ల వారికి ఈఎంఐ నెలకు రూ.2,044 వరకూ తగ్గుతుంది. ఈ పథకానికి అర్హులెవరు? ఈ వడ్డీ రాయితీ పొందడానికి వార్షికాదాయం రూ.6 లక్షల లోపున్న అల్పాదాయ వర్గాలు మాత్రమే అర్హులు. రుణాన్ని మహిళల పేరిట , లేదా జాయింట్‌గా భార్యతో కలసి తీసుకోవాలి. వారికి పక్కా ఇల్లు ఉండకూడదు. ఇంటి కార్పెట్ ఏరియా (బిల్టప్ ఏరియా కాదు) 645 చదరపు అడుగులకు మించి ఉండకూడదు. రుణానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువు పత్రాన్ని, సెల్ఫ్ అఫిడవిట్‌ను జత చేయాలి. వడ్డీ రేటు.. ఇదీ రూటు! అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం... మా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను తగ్గించాం. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానంగా ఉన్న గృహ, వాహన ఇతర రుణ రేట్లు తగ్గుతాయి. – బ్యాంకులన్నీ ఇపుడు చెబుతున్నదిదే బేస్‌రేటుపై రుణాలు తీసుకున్నవారు ఇపుడు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చార్జీల రూపంలో రూ.10,000 లేదా 0.5 శాతం అదనంగా చెల్లించాలి. మా బ్యాంకులో అయితే ఇప్పుడు ఉచితం. – ఇది మరో బ్యాంక్ ప్రకటన ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏ బ్యాంకయినా వడ్డీ రేట్ల గురించి చెప్పేటపుడు తమ ఎంసీఎల్ఆర్ ఎంతో చెబుతోంది. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు కావచ్చు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు కావచ్చు. వారి వడ్డీ రేట్లన్నీ ఈ ఎంసీఎల్ఆర్ మీదే ఆధారపడి ఉంటాయి. దాని హెచ్చుతగ్గులను బట్టే వడ్డీ రేట్లూ మారుతుంటాయి. 2016 ఏప్రిల్ 1వ తేదీకి ముందు బ్యాంకులన్నీ బేస్‌రేటు విధానాన్ని అమలు చేశాయి. అప్పటి నుంచి ఎంసీఎల్ఆర్ను తెచ్చాయి. ఎంసీఎల్ఆర్ను బేస్‌గా చేసుకుని... వినియోగదారులకు వారి రుణ చరిత్ర, ఆదాయం, చెల్లించే సామర్థ్యం ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ను నెలవారీ సమీక్షిస్తుంటారు. బేస్‌రేట్ ప్రకారమైతే... రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా, పెంచినా దాని లాభనష్టాలు వెంటనే బ్యాంకు కస్టమర్లకు బదిలీ అయ్యేవి కావు. ఎంసీఎల్ఆర్ వ్యవస్థను ఆర్బీఐ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఎంసీఎల్ఆర్తో ఈ లోపం కొంత తొలగిపోయింది. రుణరేటు లెక్కింపు నిర్ణయంలో పారదర్శకత పెరిగింది. ఎంసీఎల్ఆర్కు సంబంధించి ఓవర్‌నైట్ (ఒకరోజు), నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలాలకు వేర్వేరు రేట్లు అమలవుతున్నాయి. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే స్వల్ప కాలిక రుణాలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. దీన్ని రెపో రేటుగా పిలుస్తారు ప్రస్తుతమిది 6.25 శాతం. దీన్ని... తాను డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీని లెక్కించి... లాభంగా కొంత మార్జిన్‌ను కలిపి బ్యాంకు ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తుంది. ఇంకా తన డిపాజిట్లలో సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి) ప్రకారం ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు (ప్రస్తుతం ఇది 4 శాతం) ఎంత? నిర్వహణా వ్యయాలెంత? రుణ కాలపరిమితి ఎంత? వంటివి కూడా ఎంసీఎల్ఆర్ లెక్కింపులో చోటు చేసుకుంటాయి. సీఆర్‌ఆర్‌పై ఆర్బీఐ ఎటువంటి వడ్డీనీ చెల్లించదు. దీనికి వడ్డీని పరోక్షంగా బ్యాంకులు రుణ గ్రహీత నుంచే వసూలు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఏ రుణాలకు లింక్... ఫ్లోటింగ్ రేట్ రుణాలన్నీ ఎంసీఎల్ఆర్కే అనుసంధానమవుతాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు– గృహ రుణాలకు తప్ప వ్యక్తిగత రుణాలు, కార్ లోన్లకు ఎంసీఎల్ఆర్ వర్తింపజేయడం లేదు. వాటికి స్థిర వడ్డీరేట్లుండడమే కారణం. ఎస్బీఐ మాత్రం వ్యక్తిగత, విద్య, ఆటో రుణాలకు కూడా ఎంసీఎల్ఆర్ వర్తింపజేస్తోంది. ఎంసీఎల్ఆర్తో లాభమిదీ... బ్యాంకులు ఎంసీఎల్ఆర్పై ‘స్ప్రెడ్’ను అమలు చేస్తుంటాయి. ఇది ఒకరకంగా బ్యాంకుల లాభం. ఇది డిపాజిట్‌పై చెల్లిస్తున్న వడ్డీ ప్రాతిపదికగానే ఉండాలి తప్ప, ఇష్టానుసారంగా ఉండకూడదు. కానీ అన్ని లోన్లకూ ‘స్ప్రెడ్’ను ఒకే శాతంలో విధించరు. గృహ రుణాలకు ఒకరకమైన ‘స్ప్రెడ్’ ఉంటే, తనఖా రుణాలపై మరో రకంగా ఉంటుంది. గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ తక్కువ. ఉదాహరణకు వార్షిక పాతిపదికన గృహ రుణంపై ఎంసీఎల్ఆర్ 9.2 శాతం ఉంటే, అప్‌ట్రెండ్‌లో ‘స్ప్రెడ్’ మరో 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఉంటుంది. అపుడు రుణంపై వడ్డీ రేటు 9.45 శాతం చెల్లించాలన్నమాట. ఎంసీఎల్ఆర్... దీర్ఘకాలానికి బెటర్! నిజమే!! మీరిపుడు ఎంసీఎల్ఆర్కు మారొచ్చు. కానీ దీనికి బ్యాంకులు కన్వర్షన్ చార్జీల్ని వసూలు చేస్తున్నాయి. సాధారణంగా బేస్‌రేటులో ఉన్న రుణ గ్రహీతలు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చెల్లించాల్సిన రుణంలో 0.5 శాతం లేదా రూ.10,000 చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు ఇతర వ్యయాలూ ఉంటాయి. ఇవన్నీ కలిపాక కూడా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీకి, ఎంసీఎల్ఆర్లో చేరితే చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం కనీసం 25 బేసిస్ పాయింట్లుంటే మారొచ్చు. మీది దీర్ఘకాలిక రుణమైతే ఎంసీఎల్ఆర్లోకి మారడం బెటర్. చివరిగా ఒక విషయం.. బ్యాంక్ ఆఫ్ బరోడా..బేస్ రేట్ (9.60 శాతం) ప్రాతిపదికగా ఉన్న బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జీలూ లేకుండా కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారే వెసులుబాటునిచ్చింది. ప్రస్తుత రుణాలకు ప్రాతిపదిక.. ఎంసీఎల్ఆర్ బేస్‌రేట్ స్థానంలో 9 నెలలుగా అమలు ఇప్పుడైనా కొత్త్త రేటుకు మారే అవకాశం వడ్డీ లెక్కింపులో పారదర్శక విధానం -
గృహ రుణాలపై తగ్గేది తక్కువే..!
• ఎంసీఎల్ఆర్ను తగ్గించి.. స్ప్రెడ్‌ను పెంచిన బ్యాంకులు • దీంతో రుణాలపై తగ్గే వడ్డీ అరకొరే సాక్షి, బిజినెస్ విభాగం గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రకటించాయి. ఇం దుకు అనుగుణంగా ఎంసీఎల్ఆర్ను (మార్చినల్ కాస్ట్ ఆఫ్ పండింగ్ రేటు) 0.9% తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ... 0.7% తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించాయి. మరి ఆ మేరకు వడ్డీ రేట్లు తగ్గాయా అంటే... అలాంటిదేమీ లేదు. వాస్తవంగా గృహ రుణంపడ్డీ రెండు బ్యాంకులూ తగ్గిస్తున్న వడ్డీ రేటు 0.5 శాతమే!!. అదీ కథ. లాభాలు పెంచుకోవడానికే... ఆర్బీఐ రేట్లు తగ్గిస్తే... ఆ తగ్గుదలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయకుండా, ఎన్పీఏలు పెరిగాయని, తమ నిధుల వ్యయం ఎక్కువని కుంటిసాకులు చెపుతూ వచ్చిన బ్యాంకులు తాజాగా మరో నాటకానికి తెరలేపాయి. ఆర్బీఐ రేట్ల తగ్గుదలను, నిధుల వ్యయం తగ్గుదలను బ్యాంకులు పూర్తిగా బదిలీ చేయటానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని 2016 ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం బ్యాంకులకయ్యే నిధుల సమీకరణ వ్యయంతో కొంత స్ప్రెడ్ (లాభం) కలుపుకొని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించాలి. ఇందుకు అనుగుణంగా వివిధ బ్యాంకులు గృహ రుణాలపై వాటి ఎంసీఎల్ఆర్పై 0.25–0.60 శాతం స్ప్రెడ్ కలుపుకొని గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. అన్ని బ్యాంకులకంటే చౌకగా రుణాలిస్తామని ప్రచారం చేసుకునే ఎస్బీఐ, ఐసీఐసీఐ ఇప్పటివరకూ వాటి ఎంసీఎల్ఆర్పై 25 శాతం స్ప్రెడ్ వేసుకుని గృహ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ వచ్చాయి. తాజాగా ఇవి వాటి స్ప్రెడ్‌ను బాగా పెంచేశాయి. ఎస్బీఐ స్ప్రెడ్‌ను 0.65 శాతానికి పెంచేయటంతో గృహ రుణంపై వడ్డీ రేటును 0.5 శాతం తగ్గించినా 9.15 శాతం నుంచి 8.65 శాతానికి మాత్రమే దిగుతోంది. ఎంసీఎల్ఆర్ 0.9 తగ్గడం వల్ల ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం 8 శాతానికి దిగుతుంది. దీనికి పాత స్ప్రెడ్‌ను అమలుచేస్తే ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.25 శాతానికి తగ్గాలి. ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణంపై వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గాల్సి వుండగా, ఈ బ్యాంకు కూడా తన స్ప్రెడ్‌ను 0.45 శాతానికి పెంచుకోవడంతో గృహ రుణంపై రేటు 8.65 శాతానికి మాత్రమే తగ్గుతోంది. తద్వారా 0.7 శాతం ఎంసీఎల్ఆర్ తగ్గింపు గృహ రుణ వినియోగదారులకు చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చిపడిన డిపాజిట్ల ప్రయోజనాన్ని ప్రజలకు మళ్లించకుండా, బ్యాంకులు వాటి లాభాల్ని పెంచుకోవడానికే స్ప్రెడ్‌ను పెంచుతున్నాయనేది విశ్లేషకుల మాట. -
ఐసీఐసీఐ బ్యాంకు ఏం చేసిందంటే...
ముంబై : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త మొబైల్ యాప్ ను మంగళవారం లాంచ్ చేసింది. డిజిటల్ చెల్లింపులకు మద్దతునిస్తూ వ్యాపారుల కోసం 'ఈజీ పే' పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు ఎంత మొత్తమైనా డిజిటల్ పద్ధతిలో స్వీకరించవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా క్రెడిట్, డెబిట్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్ 'పాకెట్' నుంచి చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలను పొందవచ్చు. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో ఐఓఎస్ ఫోన్లకు ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సర్వీస్ అని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్ విజయవంతంలో తమ బ్యాంకు తీసుకున్న మరో ప్రోత్సాహకర అడుగు అని బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ వ్యాఖ్యానించారు. ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఒకేసారి ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో చెల్లింపులను స్వీకరించవచ్చని చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
కోల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.340 ఎందుకంటే: కోల్ ఇండియా..ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటి. అపారంగా బొగ్గు నిల్వలున్నాయి. 88.4 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ప్రస్తుతం 413 గనులను నిర్వహిస్తోంది. విద్యుత్తు, ఉక్కు, సిమెంట్, రక్షణ, ఎరువులు, తదితర రంగాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. భారత్‌లో ఉత్పత్తవుతున్న బొగ్గులో 85 శాతం వాటా, అమ్మకాల్లో 65 శాతం వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండడం, ఈ–వేలం ఆశించిన స్థాయిలో లేకపోవడం దీనికి కారణాలు. ఈ కంపెనీ రూ.16,212 కోట్ల నికర నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇబిటా రూ.743 కోట్లుగా ఉంది. రూ.711 కోట్ల ప్రత్యేక కేటాయింపుల కారణంగా ఉద్యోగుల వ్యయాలు పెరిగాయి. నికర లాభం 77 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80 శాతం)క్షీణించి రూ.600 కోట్లకు తగ్గింది. సాధారణంగా రెండో క్వార్టర్ సీజనల్‌గా బలహీనంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం, వచ్చే ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు రావచ్చని అంచనా. బొగ్గు దిగుమతులు బాగా తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి 6 శాతం చక్రగతి వృద్ధితో 605 మిలియన్ టన్నులకు, బొగ్గు అమ్మకాలు కూడా 6 శాతం చక్రగతి వృద్ధితో 600 మిలియన్ టన్నులకు పెరగవచ్చని అంచనా. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, డివిడెండ్ చెల్లింపులు బాగా ఉండడం, బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండడం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండడం తదితర కారణాల వల్ల దీర్ఘకాలానికి ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. జాగరణ్ ప్రకాశన్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.165 టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: జాగరణ్ ప్రకాశన్..ప్రాంతీయ ప్రింట్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. దైనిక్ జాగరణ్ (భారత్‌లో అత్యధిక రీడర్షిప్ ఉన్న పత్రిక) నయీ దునియా, (ఈ రెండూ హిందీ వార్తాపత్రికలు)ఇంక్విలాబ్(ఉర్దూ), పంజాబీ జాగరణ్, మిడ్ డే(సాయంకాల ఇంగ్లిష్ పత్రిక) దినపత్రికలు ఈ సంస్థ నుంచే ప్రచురణ అవుతున్నాయి. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. నికర వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణం.రాబడి 5 శాతం వృద్ధితో రూ.459 కోట్లకు పెరిగింది. ప్రకటనల ఆదాయం 5 శాతం పెరిగింది. . సర్క్యులేషన్ రాబడి 6 శాతం వృద్ధి చెందింది. ఈ క్యూ2లో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 37% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 35 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. వ్యయాలు పెరగడంతో ఇబిటా మార్జిన్లు 230 బేసిస్ పాయింట్లు తగ్గి 26.4 శాతానికి చేరాయి. ఉద్యోగ వ్యయాలు 10 శాతం, ఇతర వ్యయాలు 18 శాతం చొప్పున పెరిగాయి. రెండేళ్లలో ప్రకటనల రాబడి 10%, సరŠుక్యలేషన్ రాబడి 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, దీంతో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ముడి పదార్థాల వ్యయాలు తగ్గాయి. న్యూస్‌ప్రింట్ వ్యయాలు టన్నులకు 2–3% రేంజ్లో పెరగవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ఆదాయం 11% వృద్ధి చెందగలదని గతంలో ఆంచనా వేశాం. కానీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటనల ఆదాయం 9% మాత్రమే వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ షేర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 15 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 13 రెట్ల చొప్పున ట్రేడవుతోంది. -
ఆ కారు కొనాలంటే.. నోటు బాధలేదు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల ప్రభావం.. కారు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదనే అభిప్రాయంతో హోండా కార్స్ ఇండియా కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టిన హోండా కార్స్, కొనుగోలుదారులకు 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. దీంతో కస్టమర్లు నోట్ల బాధ నుంచి తప్పించుకుని, కార్లను తేలికగా కొనుగోలు చేస్తారని హోండా కార్స్ తెలిపింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ల కొనుగోలు ప్రక్రియలో అతిపెద్ద అవాంతరంగా ఏర్పతుందని, నగదుతో కార్లను కొనుగోలు చేసే స్థాయి పడిపోతున్నట్టు అంచనావేస్తున్నట్టు హెచ్‌సీఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా, ఎక్స్‌షోరూం, ఆన్‌రోడ్ ఫండింగ్ డీల్స్‌లో 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టినట్టు చెప్పారు. కార్లను కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లకు నోట్ల రద్దుతో ఏర్పడిన అసౌకర్యానికి ఈ దోస్తి బాగా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. వేతనదారులకు, స్వయం ఉపాధి వ్యక్తులకు ఈ డీల్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, హెచ్‌సీఐఎల్ లైన్-అప్ అన్ని మోడల్స్‌కు ఈ రుణ సౌకర్యం కవర్ చేస్తుందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎక్స్ షోరూం ధరల్లో 100 శాతం, ఆన్-రోడ్ ధరల్లో 90 శాతం స్పెషల్ రిటైల్ ఫైనాన్స్ ఆఫర్స్ ఉంటాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోల్డర్స్‌కు అన్ని హోండా కార్ల ఆన్-రోడ్ ధరల్లో 100 శాతం లోన్ అందుబాటులో ఉంటున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు కూడా రూ.25వేల కంటే ఎక్కువగా వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 7వ వేతన కమిషన్ కిందకు వచ్చే పెన్షన్ స్కీమ్ లబ్దిదారులకు రోడ్ ఫండింగ్‌లో 100 శాతం ఆఫర్ చేయనుంది. బ్రియో, జాజ్, అమేజ్, మొబిలియో, సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ రేంజ్ వెహికిల్స్‌ను విక్రయిస్తోంది. -
స్టాక్స్ వ్యూ
టాటా మోటార్స్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.471 టార్గెట్ ధర: రూ.595 ఎందుకంటే: టాటా మోటార్స్ ఆదాయం (కన్సాలిడేటెడ్) 7 శాతం వృద్ధితో రూ.65,900 కోట్లకు పెరిగింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 23 శాతం వృద్ధి సాధించింది. జేఎల్ఆర్ వాహన విక్రయాలు 19 శాతం పెరుగుదలతో 1,39,235కు పెరిగాయి. జేఎల్ఆర్ విభాగం ఇబిటా 10 శాతంగా ఉంది. జేఎల్ఆర్ ఇటీవల ఎక్స్ఈ, ఎఫ్-పేస్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇక ల్యాండ్ రోవర్ త్వరలో ఈవోక్ కన్వర్టిబుల్, కొత్త డిస్కవరీ మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది.పౌండ్ కరెన్సీ పతనం కావడం జేఎల్ఆర్కు లాభించనున్నది. కొన్ని ఇంజిన్ ప్లాట్ఫార్మ్లపైననే మరిన్ని మోడళ్లను అందించాలన్న వ్యూహం కారణంగా వ్యయాలు తగ్గనుండడం, చైనా జాయింట్వెంచర్ను పునర్వ్యస్థీకరించనుండడం, స్లోవేకియాలో కొత్త ప్లాంట్అండుబాటులోకి రానుండడం... వీటన్నింటి ఫలితంగా జేఎల్ఆర్ నికర లాభం 18 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. జేఎల్ఆర్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి సాధిస్తోంది. జేఎల్ఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను, కొత్త మోడళ్లను అందించనుండడంతో జేఎల్ఆర్ మార్కెట్ వాటా పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప కాలంలో దేశీయంగా అమ్మకాలపై ప్రభావం పడుతుంది. అయితే 95 శాతానికి పైగా వాణిజ్య వాహనాల విక్రయాలు రుణాల ద్వారానే అమ్ముడవుతున్నందున ఈ ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తున్నాం. ఇక మరో నాలుగేళ్ల వరకూ ఏడాదికి రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నందున ప్రయాణికుల వాహన విక్రయాలు కూడా పుంజుకుంటాయని భావిస్తున్నాం. మొత్తం మీద అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరుగుతాయని అంచనా. ఇంద్రప్రస్థ గ్యాస్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.838 టార్గెట్ ధర: రూ.940 ఎందుకంటే: నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)లను సరఫరా చేస్తున్న ఏకై క కంపెనీ ఇది. వాహనాలకు సీఎన్జీని, హోటళ్లు, హాస్పిటల్స్‌కు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు పీఎన్జీని సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. సీఎన్జీ అవుట్లెట్లను పెంచడం, ఉత్తర ప్రదేశ్‌లో పీఎన్జీ అమ్మకాలు పుంజుకోవడం, ఎల్ఎన్జీ ధరలు బలహీనంగా ఉండడం తదితర కారణాల వల్ల అమ్మకాలు 12 శాతం పెరగడంతో నికర లాభం రూ.1,442 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,016 కోట్లు)తో పోల్చితే 42 శాతం వృద్ధి సాధించింది. కొత్త సీఎన్జీ అవుట్లెట్లను ప్రారంభించడవల్ల నిర్వహణ పెట్టుబడులు పెరగడంతో మార్జిన్లు సాధారణంగానే ఉన్నాయి. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాలపై భారీగా పన్నులు విధించడం, సీఎన్జీ రేడియో ట్యాక్సీలకు మాత్రమే లెసైన్‌సలు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు కంపెనీకి ప్రయోజనం కలిగించేవే. త్వరలో హర్యానా మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. రహదారుల్లో సీఎన్జీ అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నది. ధరలు పడిపోవడం వల్ల పారిశ్రామిక రంగం నుంచి పీఎన్జీ వినియోగం పెరుగుతోంది. పీఎన్జీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. రెండేళ్లలో రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 20 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఈ క్యూ2లో సీఎన్జీ అమ్మకాలు 12 శాతం, పీఎన్జీ అమ్మకాలు 13 శాతం చొప్పున పెరిగారుు. రెండేళ్లలో అమ్మకాలు 11 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. -
డిపాజిట్లపై వడ్డీకోత
• పావుశాతం వరకూ తగ్గించిన • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు... • నోట్ల రద్దుతో భారీగా డిపాజిట్ల నమోదు ఎఫెక్ట్ న్యూఢిల్లీ: డిపాజిట్లపై వడ్డీరేట్లను రెండు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు పావుశాతం తగ్గించారుు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌లో దాదాపు రూ.4,00,000 కోట్ల డిపాజిట్ల నేపథ్యంలో ఈ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిపాజిట్ల రేటు తగ్గింపు నేపథ్యంలో వచ్చే కొద్ది రోజుల్లో రుణ రేటును కూడా తగ్గించే వీలుందన్న అంచనాలు వెలువడుతున్నారుు. తగ్గింపు డిపాజిట్ రేటును చూస్తే... ఐసీఐసీఐ బ్యాంక్... 390 రోజుల నుంచి రెండేళ్ల మధ్య స్థిర డిపాజిట్ రేటు 0.15 శాతం తగ్గింది. ఇప్పటివరకూ ఈ రేటు 7.25 శాతం కాగా తాజాగా 7.10 శాతానికి దిగివస్తుంది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇలా... రూ.1 నుంచి రూ.5 కోట్ల మధ్య బల్క్ టెన్యూర్స్ అన్నింటిపై వడ్డీరేటు 0.25 శాతం తగ్గుతుంది. గురువారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది స్థిర డిపాజిట్ రేటు 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గుతుంది. మూడేళ్ల ఒక్కరోజు నుంచి ఐదేళ్ల మధ్య రేటు 6.75 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గుతుంది. ఇప్పటికే ఎస్బీఐ... కొన్ని మెచ్యూరిటీపై బుధవారమే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 0.15 శాతం వరకూ డిపాజిట్ రేటును తగ్గించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత బుధవారం వరకూ ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు కూడా ఎస్బీఐ పేర్కొంది. కాగా ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం నుంచి 0.20 శాతం వరకూ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. -
లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు
ఆటో, ఐటీ స్టాక్స్ మద్దతుతో పాటు, అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 89.69 పాయింట్ల లాభంతో 27,548గా కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ సైతం 26.20 పాయింట్ల లాభంతో 8,523 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ మార్కెట్లో లాభాలు పండిస్తుండగా.. హెయూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్‌లు మేజర్ సెన్సెక్స్ లూజర్లుగా ఉన్నాయి. ప్రారంభంలో 126.94 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 27,600 గరిష్ట స్థాయిని, 27,503 కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం ప్రారంభంలో 8,543.15 గరిష్టస్థాయి, 8,515.20 కనిష్ట స్థాయిల్లో నడిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల్లే మిగిలి ఉన్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలు పెరిగి అటు ఆసియన్ మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. హిల్లరీ ఆశావహంతో పెట్టుబడిదారులు భారీ మొత్తంలో కొనుగోలు చేపడుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకం వ్యవహారంపై ఎఫ్‌బీఐ హిల్లరీకి క్లీన్ చీట్ ఇవ్వడంతో మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొంటున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి 1 అనంతరం ఇవే అతిపెద్ద లాభాలు. డోజోన్స్ 2.08 శాతం, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 2.22 శాతం, నాస్డాక్ కాంపొజిట్ 2.37 శాతం జంప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 494 రూపాయల నష్టంతో 30,063గా కొనసాగుతోంది. -
ఇక చౌక గృహ రుణాలు..!
-
ఇపుడు హెచ్డీఎఫ్సీ కూడా
ముంబై: ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడంలో వరుసగా క్యూ కడుతున్నాయి. వరుసగా ప్రభుత్వరంగ మేజర్ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ వార్షిక ఎంసీఎల్ఆర్ పై కోత పెడుతూ ప్రకటించగా ఇపుడు ఈ కోవలోకి మరో దిగ్గజ బ్యాంక్ చేరింది. ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా హోం లోన్లపై 0.15 శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకులన్నీ మహిళా రుణ గ్రహీతలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. హోం రుణాలను 9.15 శాతం వడ్డీరేటుతో మహిళా రుణగ్రహీతలకు రూ .75 లక్షల వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే ఇతరులకు తగ్గింపు రేటులో అంటే 9.20శాతాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్పటిలాగానే గత రెండు నెలలుగా తమ ఫండ్స్ మార్జినల్ కాస్ట్ (ఉపాంత వ్యయాలు)తగ్గుముఖం పట్టాయని, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పంచడమే తమ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు. కాగా ఆర్ బీఐ సూచనలమేరకు ఎస్ బీఐ తో పాటు మరిన్ని బ్యాంకులు రుణ వడ్డీరేటును తగ్గించక తప్పదని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే ఈ పరిణామం మిగతా చిన్న బ్యాంకులపై పడనుందని కూడా విశ్లేషించారు. -
ఇక చౌక గృహ రుణాలు..!
♦ పండగల వేళ దిగొస్తున్న బ్యాంకులు ♦ కొత్త రుణ గ్రహీతలకు 0.15% తగ్గింపు ♦ ఎస్బీఐ బాటలోనే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ♦ ఇతర బ్యాంకులూ వరసకట్టే అవకాశం! న్యూఢిల్లీ: దసరా.. దీపావళి... మరో రెండు నెలల్లో సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో గృహ రుణాలు దిగొస్తున్నారుు. రుణ గ్రహీతలను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారుు. రూ.75 లక్షలు దాటని గృహ రుణాలపై వడ్డీని 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించటంతో... 24 గంటలు కూడా గడవక ముందే తామూ అదే బాటలో నడుస్తున్నట్లు ప్రరుువేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ప్రకటించారుు. కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి వడ్డీ రేట్లు 15 శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ గురువారం ప్రకటించింది. దీని ప్రకారం రూ.75 లక్షల వరకూ మహిళలకు గృహ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. ఇంతకుముందు ఈ రేటు 9.30 శాతంగా ఉంది. ఇక ఉద్యోగులకిచ్చే రేటు 9.35 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. తాజా రేటు నవంబర్ 2 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలియజేసింది. బుధవారమే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణరేటు 10 బేసిస్ పారుుంట్లు (0.10 శాతం) తగ్గిస్తూ ఐసీఐసీఐ ప్రకటన చేసింది. అక్టోబర్ 4న ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును తగ్గించడం ఇది మూడవసారి. దీనికితోడు ఐసీఐసీఐ.. వేతన అకౌంట్ హోల్డర్లకు ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’ పేరిట కొత్త పథకాన్ని కూడా ఆరంభించింది. టర్మ్ లోన్‌తోపాటు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత. హెచ్డీఎఫ్సీదీ అదే దారి... హౌసింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా తన గృహ రుణ రేట్లను 0.15 శాతం తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రూ.75 లక్షల లోపు గృహ రుణాలకే ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం తాజా రేట్లు అందరికీ 9.20 శాతంగా, మహిళలకు 9.15 శాతంగా ఉంటారుు. ఎస్బీఐ రేటు కాస్త తక్కువ... రూ.75 లక్షలు దాటని గృహ రుణాలకు వడ్డీ రేటును 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారమే ఎస్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం ఈ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. మహిళలకు 9.10 శాతమే ఉంటుంది. కాగా బ్యాంకింగ్ దిగ్గజాలన్నీ గృహ రుణాలపై రేట్లు తగ్గించడంతో ఇతర బ్యాంకులపై సైతం ఈ ప్రభావం పడుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ రంగం నుంచి క్రెడిట్ డిమాండ్ తగ్గడంతో రిటైల్ రుణ మంజూరు ద్వారా రుణ వృద్ధికి బ్యాంకులు వ్యూహ రచన చేస్తున్నారుు. అక్టోబర్ 4 రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్ష తరువాత, పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణరేటు తగ్గించటం తెలిసిందే. అక్టోబర్ 4 తరువాత వివిధ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ రేట్లు.. ⇔ ఆర్బీఐ పాలసీ రేటు ప్రకటించాక ఇప్పటిదాకా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్ఆర్) తగ్గించారుు. దాని ప్రకారం వివిధ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ ఎలా ఉందంటే... ⇔ ఆంధ్రా బ్యాంకు బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ ను 5 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. ⇔ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓవర్‌నైట్ కాలపరిమితి విషయంలో రేటు 0.05 శాతం తగ్గి 9 శాతానికి చేరింది. మూడు నెలల కాలానికి 9.15 శాతానికి, ఏడాది కాలానికి 9.25 శాతానికి, మూడేళ్లకు 9.40 శాతానికి తగ్గింది. -
వడ్డీరేట్లలో కోత పెట్టనున్న ఇతర బ్యాంకులు
ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ వడ్డీరేట్లపై కోత పెట్టిన అనంతరం అదే బాటలో మరిన్ని బ్యాంకులు పయనించనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం, ఐసీఐసీఐ సహా, హెచ్డీఎఫ్ఎసీ లాంటి ఇతర బ్యాంకులు తమ వార్షిక ఎంసీఎల్ ఆర్ ను మరో 20 బేసిస్ పాయింట్లను తగ్గించి, 9.3 శాతంగా ఉంచనున్నాయని పేర్కొంటున్నారు. దీనిపై ఈరోజు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఎస్ బీఐని అనుసరించనున్నారని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పండుగల సీజన్ నేపథ్యంలో తమ రీటైల్ లోన్ బుక్ వృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారంటున్నారు. మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు రుణవడ్డీ రేట్ల కుదింపు తప్పదని ప్రయివేట్ బ్యాంక్ సీనియర్ ప్రతినిధి పేర్కొన్నారు. అలాగే ఇక్రా రేటింగ్ ఏజెన్సీ సీనియర్ ప్రతినిధి కార్తిక శ్రీనివాసన్ అంచనా ప్రకారం ఆయా బ్యాంకులు మరో 15-20 బేసిస్ పాయింట్ల కోత పెట్టనున్నాయి. పెద్ద కార్పొరేట్ల నుంచి క్షీణిస్తున్న డిమాండ్ దృష్ట్యా బ్యాంకులు రీటైల్ రుణాల వైపు దృష్టి పెట్టనున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహరుణాల వృద్ధిపై శ్రద్ధ పెట్టనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2015 ఆగస్టులో రూ. 6,74,500 కోట్ల రుణాలతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి 16.7 శాతం పెరిగి రూ. 7,86,900కోట్లుగా నమోదైంది. కాగా రిజర్వు బ్యాంకు గత నెల పాలసీ రివ్యూలో కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. అలాగే ఈమేరకు దేశీయ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. -
పండుగల సీజన్‌పై బ్యాంకుల దృష్టి..
• గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు • ఐసీఐసీఐ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం న్యూఢిల్లీ: పండుగల సీజన్లో వ్యాపారం పెంపుపై ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి సారించారుు. వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో రేటు తగ్గింపుసహా పలు ఆఫర్లను ప్రకటించారుు. ఎస్బీఐ ఇలా... రూ.75 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటును 0.15 శాతం తగ్గించింది. ఎస్బీఐ గృహ రుణం 9.15 శాతానికి లభిస్తుండగా, మహిళల విషయంలో ఈ రేటు 9.10 శాతంగా ఉంది. బ్యాంక్ రేటు అతితక్కువ అరుునందువల్ల కొత్త గృహ రుణ గ్రహీతలకు అలాగే తమ గృహ రుణాలను ఎస్బీఐకి మార్చుకుని రుణ రేటు ద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారికి ఇది సానుకూలమని పేర్కొంది. గృహ రుణ రేటు తగ్గింపు వల్ల రూ.50 లక్షల రుణంపై నెలవారీగా కొనుగోలుదారుడు రూ.542 పొదుపుచేసుకోగలుగుతాడు. 30 ఏళ్ల రుణ కాలంలో దాదాపు రూ. 2 లక్షల వరకూ ప్రయోజనం ఉంటుంది. ఇదే ఈఎంఐ మొత్తాన్ని రుణ కాలానికి నెలవారీగా రికరింగ్ డిపాజిట్లో పొదుపుచేస్తే... రూ.6 లక్షల ఆదాయం లభిస్తుందనని ఎస్బీఐ వివరించింది. ఐసీఐసీఐ బ్యాంక్... గృహాలకు సంబంధించి అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఆస్తి తనఖాపై ఓవర్‌డ్రాఫ్ట్‌గా రూ. 5 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాన్ని ఆఫర్ చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’గా వ్యవహరిస్తున్న ఈ ప్రొడక్ట్ అటు టర్మ్ లోన్‌గా ఇటు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యంగా ఉపయోగపడుతుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలపింది. తక్షణ అవసరాలకు ఈ నిధులు కస్టమరకు ఉపయోగపడతాయని తెలిపింది. విద్య, వైద్యం, గృహ పునర్ నిర్మాణం , వివాహం, విదేశీయానాలకు సైతం ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సౌలభ్యం దోహదపడుతుందని వివరించింది. టర్మ్‌లోన్ విషయంలో నెలవారీ ఇన్స్టాల్మెంట్ ఆధారంగా వడ్డీరేటు ఉంటుందని తెలిపింది. ఓవర్‌డ్రాఫ్ట్ విషయంలో వినియోగించిన నిధులు, ఆయా కాలాలకు అనుగుణంగా వడ్డీరేటు ఉంటుందని వివరిచింది. -
ఆ కస్టమర్లకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ లో దిగ్గజ బ్యాంకులు ఖాతాదారులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ హోంలోన్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు మరో ఆఫర్ ప్రకకటించింది. సాలరీడ్ కస్టమర్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ , టర్మ్ లోను పేరుతో రెండు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ అవసరాల కోసం టర్మ్ లోన్, పెళ్లి, విద్య, వైద్యఖర్చులు, విదేశీ ప్రయాణం తదితర వ్యక్తిగత అత్యవసర ఖర్చులు నిమిత్తం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా ఆఫర్ లో ఖాతాదారులు ఆస్తుల తనఖా ద్వారా 5 లక్షలనుంచి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. మొత్తం అమౌంట్ లో కనీసం 10 శాతం టర్మ్ లోనుగాను, గరిష్టంగా 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ లో అయితే రుణం తీసుకున్న సొమ్ము, రోజులు ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రివర్స్ స్వీప్ సౌకర్యం కూడా అందుబాటులోఉందని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అందుబాటులో వున్న అదనపు నిధులను ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలోకి జమచేయనున్నట్టు పేర్కొంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉద్యోగస్తుని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు. అంతేకాదు చాలాసులువుగా వీటిని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో వారు వాడుతున్న ఖాతానుంచే అవసరమైన సందర్భాల్లో కావాల్సిన సొమ్మును స్వీకరించవచ్చన్నమాట. అలాగే తమ దగ్గర హోం లోన్ లేని ఉద్యోగులు ముఖ్యంగా కార్పొరేట్ రుణగ్రహీతలు కావాలంటే.. తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని కూడా సూచించింది. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్ల ర్యాలీ జరిపిన సెన్సెక్స్ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఆటో షేర్ల నష్టాలతో ప్రస్తుతం 62.74 పాయింట్ల లాభంతో 27,736 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 8600 మార్కును బీట్ చేసి మళ్లీ కిందకు దిగొచ్చింది. 5.40 స్వల్పలాభంతో 8,588 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 17 పాయింట్ల లాభాలతో మొదలై, అనంతరం 27,803 వద్ద గరిష్టస్థాయిని, 27,681.59 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మెటల్, ఆటో, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నిఫ్టీలో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ,. గెయిల్ షేర్లు సెన్సెక్స్ లో లాభాల్లో నడుస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసల నష్టంతో 66.80గా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి, ఎఫ్ఐఐల అవుట్ప్లోతో రూపాయి విలువ నేటి ట్రేడింగ్‌లో కొంత పడిపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 66.60 నుంచి 67 మధ్యలో కదలాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇతర మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ ఏడు నెలల గరిష్టంలో నమోదవుతుండటంతో ఆసియన్ షేర్లు పడిపోతున్నాయి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మెగా ఐపీవో నేడే
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం నుంచి ఓ కంపెనీ తొలిసారిగా భారీ ఐపీవోకు వస్తోంది. ప్రైవేటు రంగ బీమా దిగ్గజం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో సోమవారం ప్రారంభం కానుండగా, ఈ నెల 21న ముగియనుంది. ఈ ఇష్యూలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ.6వేల కోట్లకు పైగా నిధులు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.300 - 334. ఐపీవోకు ముందే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 40 యాంకర్ ఇన్వెస్టర్లకు 4.89 కోట్ల షేర్లు ఒక్కోటీ రూ.334 ధరకు కేటాయించడం ద్వారా ‘అతిపెద్ద యాంకర్ ఇన్వెస్టర్ ప్లేస్మెంట్’గా రికార్డు సృష్టించింది. ఇష్యూ సైజులో 10 శాతం షేర్లు అంటే 1,81,34,105 షేర్లను ఐసీఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. గరిష్టంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేశారు. యాంకర్ ప్లేస్మెంట్ తర్వాత నికరంగా 13.2 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండగా, అందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 5.71 కోట్ల షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్యకలాపాలు 2001లో ప్రారంభం కాగా, మార్చి చివరి నాటికి సంస్థ నిర్వహణలో 1.4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకుకు 68 శాతం, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్‌కు 26 శాతం వాటా ఉంది. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు 4 శాతం, సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌కు 2 శాతం చొప్పున వాటా ఉంది. గతేడాది నవంబర్‌లో వీరికి 6 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,950 కోట్లను సమీకరించింది. తాజా ఇష్యూ అనంతరం ఐసీఐసీఐ బ్యాంకు వాటా 55 శాతానికి పరిమితం కానుంది. కాగా, 2010లో ప్రభుత్వరంగ కోల్ ఇండియా సంస్థ ఐపీవో తర్వాత మరోసారి భారీ స్థాయి ఇష్యూ రావడం ఇదే. కోల్ ఇండియా అప్పట్లో రూ.15వేల కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించింది. -
త్వరలో సర్కారీ షేర్ల మేళా!
♦ 51 కంపెనీల్లో మైనారిటీ వాటాల విక్రయానికి రెడీ... ♦ మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం.. ♦ ప్రస్తుతం ఎస్‌యూయూటీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వాటా ♦ మూడేళ్లలో పూర్తిగా అమ్మేసే ప్రణాళిక... ♦ జాబితాలో ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ కార్పొరేట్లు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ద్వారా ఖజానా నింపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో తనకున్న మైనారిటీ వాటాల అమ్మకం ప్రక్రియకు తెరతీసింది. రానున్న మూడేళ్లలో ఈ కంపెనీల నుంచి పూర్తిగా వైదొలగాలన్నది సర్కారు ప్రణాళిక. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. వాటా విక్రయ జాబితాలో రిలయన్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), ఐటీసీ, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో పాటు పలు టాటా గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి. ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా కేంద్రానికి ఈ 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో మైనారిటీ వాటాలు ఉన్నాయి. మూడేళ్ల ప్రక్రియ... ప్రభుత్వం విడుదల చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) ప్రకారం ఎస్‌యూయూటీఐ దాదాపు మూడు మర్చంట్ బ్యాంకర్లు/సలహాదారులు, బ్రోకింగ్ సంస్థలను నియమించుకోనుంది. వచ్చే మూడేళ్లపాటు ఈ 51 కంపెనీల్లో మైనారిటీ వాటా అమ్మకం విషయంలో ఎస్‌యూయూటీఐకి మర్చంట్ బ్యాంకర్లు తగిన సహకారాన్ని అందించనున్నారు. ఆఫర్ ఫల్ సేల్(ఓఎఫ్సీ), బ్లాక్ డీల్, బల్క్ డీల్ ఇతరత్రా మార్గాల్లో ఈ వాటా విక్రయాలకు సంబంధించి తగిన సలహాలను ఇస్తారు. కాగా, మర్చెంట్ బ్యాంకర్లు తమ బిడ్లను ఆగస్టు 1 కల్లా సమర్పించాల్సి ఉంటుందని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. ఎస్‌యూయూటీఐకు ఉన్న మొత్తం వాటాలన్నింటికీ కలిపి మర్చెంట్ బ్యాంకర్లు ఒకే బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుందని.. అయితే, 51 కంపెనీల్లో వాటా అమ్మకాలకు సంబంధించి విడివిడిగా అమ్మకం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్ అధ్యయన నివేదిక, ఇష్యూ ప్రైసింగ్ సహా రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ఇష్యూల్లో పాల్గొనేవిధంగా తగిన అవగాహన కలిగించడం, ఇష్యూకి తగిన సమయం వరకూ అన్ని విధాలుగా మర్చెంట్ బ్యాంకర్లు ఎస్‌యూయూటీఐకి తమ సలహాలు, వ్యూహాలన్నింటినీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధానమైన దేశీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాను కూడా సమర్పించాలని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. డిజిన్వెస్ట్మెంట్కు జోష్... ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల రూపంలో(డిజిన్వెస్ట్‌మెంట్) రూ.56,500 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.36,000 కోట్లను పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా, మిగతా రూ.20,500 కోట్లను లాభాల్లో ఉన్న, నష్టాలను ప్రకటిస్తున్న కంపెనీల్లో వ్యూహాత్మక వాటా అమ్మకం రూపంలో సమీకరించాలనేది ప్రణాళిక. ఎస్‌యూయూటీఐ వాటాల విక్రయంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ను పరుగులు పెట్టించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏర్పాటు చేయనున్న సీపీఎస్ఈ(కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు) రెండో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో తమకు వాటాలున్న కంపెనీలను చేర్చే అంశాన్ని కూడా ఎస్‌యూయూటీఐ ప్రత్నామ్యాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యూటీఐకి అనుబంధంగా... అంతక్రితం ఉన్న యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(యూటీఐ) నుంచి విభజించి దానికి అనుబంధంగా ఈ ఎస్యూయూటీఐని 2003లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికిందికి 51 కంపెనీలకు సంబంధించిన మైనారిటీ వాటాలను చేర్చింది. అయితే, వీటిలో ఎన్ఎస్డీఎల్, ఎస్టీసీఐ ఫైనాన్స్, ఓవర్ ద కౌంటర్ ఎక్స్ఛేంజ్, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్, యూటీఐ-ఐఏఎస్ లిమిటెడ్, యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సర్వీసెస్, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఈ 8 ఎనిమిది కంపెనీలు అన్లిస్డెడ్వి. 2014 మార్చిలో యాక్సిస్ బ్యాంక్‌లో 9 శాతం వాటాను ఎస్‌యూయూటీఐ ద్వారా విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లకుపైగానే సమీకరించిన సంగతి తెలిసిందే. ఎస్‌యూయూటీఐకి వాటాలున్న ఇతర లిస్టెడ్ కంపెనీల్లో అంబుజా సిమెంట్స్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లు కూడా ప్రధానంగా ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి
ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు. జేఎన్టీయూలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మురళీకృష్ణ బైక్‌పై వెళ్తుండగా మెట్రోస్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతోంది
* రూ. 50 లక్షల హెల్త్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు * సగటు సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షల స్థాయిలో ఉంటోంది ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి అవగాహన పెరుగుతోందని, దీంతో పాలసీదారులు ఎంచుకునే కవరేజీ సగటున రూ.4-5 లక్షల స్థాయికి చేరిందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అండర్‌రైటింగ్ విభాగం అధిపతి అమిత్ భండారీ చెప్పారు. మెట్రో నగరాల్లో రూ. 50 లక్షల పాలసీలూ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారాయన. పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉండేలా మరిన్ని సేవలు ప్రవేశపెడుతున్నామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంటర్వ్యూలో ఏమన్నారంటే... అధిక కవరేజీపై పెరుగుతున్న ఆసక్తి.. దేశీయంగా ప్రైవేట్ బీమా పాలసీలు తీసుకునేవారు 5 శాతమే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ.. బీమా సురక్ష యోజన మొదలైన ప్రభుత్వపరమైన పథకాలతో కలిపితే ఇది సుమారు 20 శాతం మేర ఉంటుంది. అయితే, ఆరోగ్య బీమాపై ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది. గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. అప్పట్లో సగటున సమ్ అష్యూర్డ్ సుమారు రూ.3 లక్షలుంటే ఇపుడది రూ. 4- 5 లక్షలుంటోంది. మెట్రో నగరాల్లోనైతే కొందరు రూ. 50 లక్షల కవరేజీ కూడా తీసుకుంటున్నారు. అలాగే వినూత్నమైన పాలసీలూ కోరుకుంటున్నారు. ప్రివెంటివ్, ఓపీడీ కవరేజీ లాంటి వాటి గురించి అడుగుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు పాలసీ ప్రీమియాల్లో డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పాలసీదారులు తీసుకునే కవరేజి మొత్తం కాస్త తక్కువగా ఉంటోంది. బహుశా దక్షిణాదిలో చికిత్స ఖర్చు కొంత తక్కువగా ఉండటం కారణం కావొచ్చు. వినూత్న పాలసీలు..: పాలసీదార్ల డిమాండ్లకు అనుగుణంగా మేం వినూత్న ఆప్షన్లూ ఇస్తున్నాం. పూర్తి స్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ పథకంతో పాటు ఇటీవలే హెల్త్ బూస్టర్‌ను కూడా ప్రవేశపెట్టాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించే వారికి నిర్దిష్ట రివార్డ్ పాయింట్లు ఇచ్చి, ఆ మేరకు డిస్కౌంట్లు లేదా అధిక కవరేజీని అందిస్తున్నాం. వివిధ అంశాలను బట్టి మొత్తం 8,000-10,000 దాకా పాయింట్లు కేటాయించాం. ఉదాహరణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మారథాన్లలో పాల్గొనడం మొదలైన వాటికి నిర్దిష్ట పాయింట్లుంటాయి. ఒకో పాయింటు విలువ సుమారు పావలా. ఎనిమిది వేల పాయింట్లూ లభిస్తే సుమారు రూ.2,000 మేర డిస్కౌంటు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వారికిది ప్రోత్సాహమే. పాలసీదారులకు ప్రయోజనకరంగా మరిన్ని సేవలు .. మా నెట్‌వర్క్‌లో సుమారు 2,500 పైగా ఆస్పత్రులున్నాయి. పాలసీదారులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ వారికి మరిన్ని ఆప్షన్లుండేలా చూడాలన్నది మా ఉద్దేశం. ఇక బేస్ పాలసీతో పాటు క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటన్నింటితో కలిపి చూస్తే సుమారు 10 వరకూ పాలసీలు అందిస్తున్నాం. అధిక చికిత్సా వ్యయాలపై ఆస్పత్రులతో బీమా సంస్థలు చర్చించిన మీదట... నగదు చెల్లించేవారితో పోలిస్తే పాలసీదార్లకు సుమారు 10- 15 శాతం దాకా ఆస్పత్రి వ్యయాలు తగ్గుతున్నాయి. చిన్న ఆస్పత్రులైతే ఈ తగ్గుదల 25 శాతం దాకా కూడా ఉండొచ్చు. మా సంస్థపరంగా స్థానికంగా అందుబాటులో ఉండే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాలు, మౌలిక సదుపాయాలు, చికిత్స నాణ్యత తదితర అంశాలను పోల్చి చూసుకునేందుకు ప్రత్యేకంగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంను కూడా అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో దాదాపు 140 పైగా ఆస్పత్రులను, 30 పైగా కీలక చికిత్సలను ఇందులో చేర్చాం. మా పాలసీదారులే కాకుండా మిగతావారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-కామర్స్ సైట్లలో హెల్త్ పాలసీలు.. ఈ-కామర్స్ సైట్లలో బీమా పాలసీల విక్రయమనేది తక్షణమే రాకపోవచ్చు. ఎందుకంటే మిగతా రకాల పాలసీలతో పోలిస్తే హెల్త్ పాలసీ అండర్‌రైటింగ్ చేయాలంటే సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యలు (డయాబెటిస్ వంటివి) తెలిస్తేనే సాధ్యం. వాహనాల పాలసీల్లాగా వీటిని ఆన్లైన్లో ఆషామాషీగా జారీచేయడం కుదరదు. బహుశా మిగతా రకాల పథకాలు వచ్చిన కొన్నాళ్లకు హెల్త్ పాలసీలూ ఈ-కామర్స్ సైట్లలోకి రావొచ్చు. అది కూడా స్టాండర్డ్ పథకంగా పలు పరిమితులతో ఉండొచ్చు. - అమిత్ భండారీ ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ అండర్‌రైటింగ్ విభాగం హెడ్ -
బ్యాంకుల చేతికి జేపీ!
♦ కంపెనీ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించిన రుణదాతలు ♦ ఎస్డీఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఐసీఐసీఐ ♦ త్వరలో విధివిధానాలను చర్చించనున్న బ్యాంకర్లు ♦ అల్ట్రాటెక్‌తో సిమెంట్ ప్లాంట్ల విక్రయం ఒప్పందానికి బ్రేక్! ముంబై: భారీ అప్పుల్లో కూరుకుపోయిన.. జేపీ అసోసియేట్స్ గ్రూప్‌ను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకోనున్నాయి. జేఏఎల్‌కు భారీస్థాయిలో రుణాలిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. దీంతో జేపీ గ్రూప్ ప్రధాన కంపెనీ జేఏఎల్ తమ సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడం కోసం కుదుర్చుకున్న రూ.15,900 కోట్ల ఒప్పందానికి బ్రేక్ పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ అకౌంట్‌ను మొండిబకాయి(ఎన్పీఏ) ల్లోకి చేర్చామని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక తమ అప్పులకు సరిపడా కంపెనీలో వాటాను తీసుకోవడం కోసం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఏ) ప్రక్రియను ఆరంభించినట్లు ఆయన తెలిపారు. ఎస్డీఆర్ ప్రక్రియ పూర్తయితే జేఏఎల్లో మెజారిటీ వాటా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లినట్లే లెక్క. కంపెనీ యాజమాన్య, నియంత్రణ అధికారాలన్నీ ఇక రుణదాతలు నియమించే వ్యక్తులే చూసుకుంటారు. కాగా, ఎస్డీఆర్ విధివిధానాలు, షరతులతో పాటు జేపీ-అల్ట్రాటెక్ సిమెంట్ డీల్‌పై చర్చించేందుకు త్వరలో జాయింట్ లెండర్స్ ఫోరమ్(జేఏఎఫ్) మరోసారి సమావేశం కానుందని ఎస్బీఐ అధికారి వెల్లడించారు. అల్ట్రాటెక్‌తో డీల్‌ను ఆమోదించాలా వద్దా అనేది ఫోరమ్ నిర్ణయిస్తుందన్నారు. జేఏఎఫ్కు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది. రుణ భారం రూ.58 వేల కోట్లపైనే... జేపీ అసోసియేట్స్‌కు ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం రూ.58,250 కోట్ల అప్పులు లెక్కతేలాయి. ఇందులో ఎస్బీఐ వాటా రూ.7,000 కోట్లుగా అంచనా. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుకు జేఏఎల్ రుణ బకాయిని చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్డీఆర్ ప్రక్రియకు తెరతీసింది. ఎస్డీఐఆర్కు జూన్ 28 రిఫరెన్స్ తేదీగా కూడా పేర్కొన్నట్లు జేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎస్డీఆర్ను అమోదించడం లేదా తిరస్కరించేందుకు జేపీ అసోపసియేట్స్కు బ్యాంకర్లు మూడు నెలల గడవు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సిమెంట్ ప్లాంట్ల విక్రయంపై అనిశ్చితి ఎఫెక్ట్... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు జేఏఎల్ ఆస్తుల విక్రయంపై దృష్టిసారించింది. అయితే, ఈ ప్రయత్నాలేవీ సజావుగా సాగకపోవడంతో కంపెనీ బకాయిల చెల్లింపు విషయంలో చేతులేత్తేసేందుకు దారితీసింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో తమకున్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి 31న దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఎస్డీఆర్ నేపథ్యంలో దీనిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. -
రుణానికి బ్యాంకుకెళ్లటం ఎందుకు?
బ్యాంక్‌బజార్.కామ్, పైసాబజార్.కామ్, అప్నాపైసా.కామ్, క్రెడిలా.కామ్... ఇంకా చాలా. గృహ రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం పాత మాట. ఇపుడు దాదాపు ప్రతి బ్యాంకూ, ప్రతి ఆర్థిక సంస్థా ఆన్లైన్ రుణ సేవలందిస్తున్నాయి. దేనికైనా ఆన్లైన్లో దరఖాస్తు నింపితే చాలు. బ్యాంకు ప్రతినిధులే దరఖాస్తుదారు దగ్గరకొచ్చి పత్రాలన్నీ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు. ఇవి కాక బ్యాంక్‌బజార్, పైసా బజార్, క్రెడిలా వంటి సంస్థల సైట్లను ఆశ్రయిస్తే మాత్రం... లోన్ కాలిక్యులేటర్ నుంచి, వివిధ బ్యాంకుల వాయిదాలను సరిపోల్చుకోవటం, అన్నిటినీ పరిశీలించాక ఏది నప్పుతుందో చూసుకోవటం కుదురుతుంది. అంతేకాదు! మీ వివరాలు నింపితే... మీకు రుణం ఎంత వస్తుంది? ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? తదితర వివరాలన్నీ తెలిసిపోతాయి. అన్నీ చూసుకున్నాక... ఈ సంస్థల ద్వారా దరఖాస్తు నింపితే ఇవే మనం ఎంచుకున్న ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు దరఖాస్తును పంపిస్తాయి. హోమ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, హౌసింగ్ లోన్ కాలిక్యులేటర్, హోమ్ లోన్ ఎలిజిబిలిటీ, మైఈఎంఐ వంటి ఫీచర్లను ఇవి అందిస్తున్నాయి.ఇవన్నీ నచ్చని వారు... ఆన్లైన్లో కేవలం తమ పేరు, ఫోన్‌నెంబరు, ఈ-మెయిల్ ఇస్తే చాలు. ఆయా సంస్థల ప్రతినిధులే ఫోన్లు చేసి... మీ దగ్గరకొచ్చి మరీ దరఖాస్తు తీసుకెళతారు. వారే బ్యాంకు ద్వారా ప్రాసెస్ చేయిస్తారు. బ్యాంకుల యాప్‌ల ద్వారా... ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్ హోమ్లోన్స్ తదితర సంస్థలు సొంత యాప్‌లను విడుదల చేశాయి. వీటిద్వారా వడ్డీరేట్లు తెలుసుకోవటమే కాదు. నెలవారీ వాయిదాలు కూడా ఆన్లైన్ బ్యాంకింగ్‌లో చెల్లించొచ్చు. మీ దగ్గర్లోని బ్రాంచి చిరునామా తెలుసుకోవచ్చు. -
మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
ముంబై: అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలతో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సోమవారం పతనాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు(మంగళవారం) కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టతో 25642.54 దగ్గర, నిఫ్టీ 5.25 పాయింట్ల నష్టంతో 7,849.80 పాయింట్లను వద్ద ట్రేడ్ అవుతోంది హిందాల్కో, టాటాస్టీల్, మహింద్రా అండ్ మహింద్రా, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాలను పండిస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, హీరో, బజాజ్ ఆటో, ఎస్బీఐ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ వారం పెట్రోలియం స్టేటస్ రిపోర్టు(స్టాక్ ఫైల్స్ డేటా)ను యూఎస్, రేపు(బుధవారం) విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలులో తొణికిసలాడుతున్నట్టు మార్కెట్ నిపుణులంటున్నారు. అదేవిధంగా రేపు ఫెడరల్ రిజర్వు బ్యాంకు పాలసీ మీటింగ్ కూడా నిర్వహిస్తుండటం, కొత్తగా ఫెడ్ ఎలాంటి చర్యలను ప్రవేశపెట్టదని సంకేతాలు వస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీపై ముందస్తు మార్గదర్శకాలు, భవిష్యత్ లో వడ్డీరేట్లు పెరుగుతాయనే సూచనలను ఫెడ్ ప్రకటిస్తుందని డీలర్లు ఆశిస్తున్నారు. మరోవైపు టుబాకో షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. టుబాకో రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించడంతో, మంగళవారం ట్రేడింగ్ లో గాడ్ఫ్రే ఫిలిప్స్ దాదాపు 17శాతం మేర పడిపోయింది. -
4 నెలల గరిష్టానికి దేశీయ మార్కెట్లు
ముంబై : గురువారం ట్రేడింగ్ లో స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు(శుక్రవారం) ఫుల్ జోష్ ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక్కసారిగా 225 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 26 వేల మార్కును దాటింది. ప్రస్తుతం 85.90 పాయింట్ల లాభాలతో 25,930గా కొనసాగుతోంది. నాలుగు నెలల అనంతరం సెన్సెక్స్ 26 వేల గరిష్ట స్థాయిని తాకడం ఇదే మొదటిసారి. నిఫ్టీ సైతం 40 పాయింట్ల లాభంతో 7,931 వద్ద నమోదవుతోంది. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింక్ రంగ షేర్లు మార్కెట్ నులీడ్ చేస్తున్నాయి. రిలయన్స్, టీసీఎస్, మారుతీ సుజుకీ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, టాటా మెటార్స్, యాక్సిస్ బ్యాంకు, గైల్ షేర్లు లాభాల్లో నడుస్తుండగా.. టాటా స్టీల్, విప్రో, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. గురువారం విడుదలచేసిన క్యూ 4 ఫలితాల్లో విప్రో లాభాలు స్వల్పంగా తగ్గడంతో, మార్కెట్లో ఈ షేరు 6శాతానికి పడిపోయింది. మరోవైపు బంగారం షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి వైదొలగిన రెండు మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌లు వైదొలిగాయి. వచ్చే వారం ఇన్పీబీమ్ ఐపీఓ మార్కెట్‌కు రానున్నది. అయితే ఈ రెండు సంస్థలు వైదొలగడానికి కారణాలను ఇన్ఫీబీమ్ వెల్లడించలేదు. ఐపీఓకు వస్తున్న సమయం, ధర వంటి విషయాల్లో వచ్చిన తేడాల వల్ల ఈ రెండు సంస్థలు నిష్ర్కమిస్తున్నాయని సమాచారం. భారత్‌లో ఐపీఓకు వస్తున్న తొలి ఈ కామర్స్ కంపెనీ ఇది. మార్చి 21 నుంచి ప్రారంభమై 23న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.450 కోట్లకు సమీకరించాలని ఇన్ఫీబీమ్ యోచిస్తోంది. ఈ ఐపీఓకు రూ.360-432 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌లు వైదొలగడంతో ఇక ఇప్పుడు ఈ ఐపీఓకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఇలర క్యాపిటల్ ఇండియాలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. -
డివిడెండ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తిస్తుందా ?
తాజా బడ్జెట్లో రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించారు కదా ! ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లకు కూడా వర్తిస్తుందా ? కొన్ని మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై డీడీటీని ఎలా లెక్కిస్తారు? - హిమాంశు, హైదరాబాద్ బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించదు. కంపెనీలు ఇచ్చిన డివిడెండ్లపై మాతమే ఈ ట్యాక్స్‌ను లెక్కిస్తారు. ఏడాది కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ ఆదాయం పొందినట్లయితే ఆ వ్యక్తి 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వ్యక్తులకు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్), సంస్థలకు వర్తిస్తుంది. నా కూతురి చదువు కోసం నెలకు రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎస్బీఐ ఈవెల్త్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందని నా మిత్రుడొకరు సలహా ఇచ్చారు. నా కూతురి భవిష్యత్ విద్యావసరాల కోసం ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా ? ఈ ప్లాన్‌కు బదులుగా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం సరైనదా ? ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు 10(10డి ) పన్ను ప్రయోజనాలు లభిస్తాయా ? - అనూష, విశాఖపట్టణం ఎస్బీఐ లైఫ్-ఈవెల్త్.. ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్ ఉన్న బీమా ప్లాన్ ఇది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ కలగలసిన ప్లాన్లను ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఈ తరహా ప్లాన్లు చాలా తక్కువ బీమా కవర్‌ను అందిస్తాయి. ఐదేళ్ల లాకిన్ పీరియడ్, లిక్విడిటీ తక్కువగా ఉండడం... ఇవన్నీ కూడా యూలిప్‌లకు ప్రతికూలాంశాలు. కూతురి విద్య వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే సరైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహం. మీరు దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి పన్ను అంశాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏడాది తర్వాత విక్రయించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ ఫండ్స్ పరిశీలించవచ్చు. ... ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీప్లయర్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్-రెగ్యులర్ ఫండ్, యూటీఐ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్, ఐడీబీఐ ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్. నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ఎన్పీఎస్ అకౌంట్ మాకు తప్పనిసరి. నా వేతన ఖాతాతో అనుసంధానమై ఉన్న ఎన్పీఎస్ అకౌంట్లో ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవడానికి లేదు. అందుకని మరో ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వీలు ఉందా? - భార్గవ్, కరీంనగర్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఖాతా తెరవడానికి వీలు లేదు. అంతేకాకుండా ఎన్‌పీఎస్‌లో ఈక్విటీకి కేటాయింపులు 50 శాతానికి మించి పెంచడానికి లేదు. ఈక్విటీ కేటాయింపులు పెంచాలంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి మార్గం. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి ప్రకారం పన్ను తగ్గింపులు కావాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీ ప్రకారం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను తగ్గింపులు రూ.1.5 లక్షల వరకూ పొందవచ్చు. ఒకవేళ ఇప్పటికే సెక్షన్ 80 సీ పరిమితిని మీ ఇన్వెస్ట్మెంట్స్ మించిపోతే, ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ స్కీమ్స్‌ను గానీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను గానీ పరిశీలించవచ్చు. నేను ఐసీఐసీఐ లైఫ్‌స్టేజ్ పెన్షన్ ప్లాన్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. మూడు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. సరెండర్ విలువ ఎంత వస్తుంది? - సుశీల్, నెల్లూరు ఐసీఐసీఐ లైఫ్‌స్టేజ్ పెన్షన్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. బీమా, ఇన్వెస్ట్మెంట్స్ కలగలసిన పాలసీ ఇది. మూడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లిస్తే, ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. అన్ని చార్జీలు పోను మీరు సరెండర్ చేసేటప్పుడు ఈ ఫండ్ విలువలో 96 శాతం సరెండర్ విలువగా మీకు లభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎప్పుడూ ఇలా ఇన్వెస్ట్మెంట్, బీమా కలగలసిన పాలసీలు తీసుకోవద్దు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలుగుతారు. జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్టాక్స్ వ్యూ టీటీకే ప్రెస్టీజ్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.4,176 టార్గెట్ ధర: రూ.5,150 ఎందుకంటే: గృహోపకరణాలు, కుక్వేర్ కేటగిరీల్లో అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటి. ప్రెజర్ కుక్కర్ల కేటగిరీలో 37 శాతం, కుక్వేర్ కేటగిరీలో 31 శాతం, గృహోపకరణాల కేటగిరీలో 10 శాతం చొప్పున మార్కెట్ వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో రూ.380 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 17 శాతం వృద్ధితో రూ.450 కోట్లకు పెరిగాయి. ఇబిటా మార్జిన్ 110 బేసిస్ పాయింట్ల వృద్ధితో 13 శాతానికి ఎగసింది. నికర లాభం రూ.28 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.37 కోట్లకు పెరిగింది. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జోరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో ఈ కామర్స్ విభాగం వాటా 5 శాతంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఒక కుక్వేర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికాలంలో విభిన్న మోడళ్లలో వాటర్ ప్యూరిఫయర్లను అందించనున్నది. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా కొత్త మోడళ్లలో పాత్రలను, కుక్కర్లను, ఇండక్షన్ కుక్‌టాప్‌లను అందుబాటులోకి తేనున్నది. కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనుండడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మంచి పనితీరు కనబరచడం, ముడి పదార్థాల ధరలు తగ్గుతుండడం, సొంతంగా వస్తువులను ఉత్పత్తి చేయడం పెరుగుతుండడం వల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుండడం, ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో దేశీయంగా డిమాండ్ పుంజుకుంటుండడం...ఇవన్నీ కంపెనీకి కలసి వచ్చే అంశాలు. గత ఐదేళ్లలో కంపెనీ స్థిరాస్తులు 8 రెట్లు పెరిగాయి. ఆస్తుల వినియోగం అత్యుత్తమంగా ఉండడం వల్ల రీ ఇన్వెస్ట్మెంట్ అవసరాలు స్వల్పంగా ఉండడంతో నగదు ప్రవాహాలు పుష్కలంగా వస్తాయిని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 14 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఆల్ట్రాటెక్ సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.2,719 టార్గెట్ ధర: రూ.3,600 ఎందుకంటే: దేశంలోనే అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సిమెంట్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా సిమెంట్ రంగంలో 18 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. గత ఐదేళ్లలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 72.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,747 కోట్లకు పెరిగింది. విద్యుత్తు, ఇంధన వ్యయాలు తగ్గడంతో ఇబిటా టన్నుకు 15 శాతం వృద్ధితో రూ.900కు ఎగసింది. ఇంధన వ్యయాలు మరింతగా తగ్గుతాయని అంచనా. ఈ వ్యయాల క్షీణత పూర్తి ఫలాలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కనిపిస్తాయి. మౌలిక రంగాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడం, హౌసింగ్ డిమాండ్ క్రమక్రమంగా పుంజుకోవడం, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణమవుతుండడం..ఈ అంశాలన్నీ సిమెంట్‌కు డిమాండ్ పెరగడానికి తోడ్పడతాయని అంచనా వేస్తున్నాం. డిమాండ్ పుంజుకుంటే అతి పెద్ద సిమెంట్ కంపెనీగా ఈ కంపెనీకి ప్రయోజనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా విస్తరించడం, సొంత పవర్ ప్లాంట్లు ఉండడం, కంపెనీ వినియోగించే విద్యుత్తు 80% సొంత ప్లాంట్ల నుంచే కావడం, పెట్ కోక్ వినియోగం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుండడం, మరిన్ని గ్రైండింగ్ యూనిట్లను ప్రారంభించడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గనుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నాయి. రెండేళ్లలో సిమెంట్‌కు డిమాండ్ 9% చొప్పున, కంపెనీ అమ్మకాలు 8% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.187 టార్గెట్ ధర: రూ.250 ఎందుకంటే: 1984లో కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 550కు పైగా కార్యాలయాలతో, 2 అంతర్జాతీయ కార్యాలయాలతో సేవలందిస్తోంది. ఈ కంపెనీ 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.190 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. రుణ మంజూరీ 31 శాతం ఎగసింది. అయితే రుణ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ2లో 0.81 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 0.84 శాతానికి పెరిగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తన పెట్టుబడులను 53 శాతం బ్యాంకుల నుంచే సమీకరిస్తోంది. అందువలన బ్యాంక్‌లు బేస్ రేట్ (కనీస రుణరేటు) తగ్గించడం ఈ కంపెనీకి కలసి వచ్చే అంశం. మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) కాలంలో ఎస్ఎంఈ సెగ్మెంట్ రుణాలు పెరిగాయి. ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన వారంట్ల జారీ ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అందరికీ ఇళ్లు’(హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్ వల్ల దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రయోజనం కలగనున్నది. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.159గా ఉన్న కంపెనీ పుస్తక విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.232కు పెరుగుతుందని భావిస్తున్నాం, నికర మొండి బకాయిలు 0.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 22 శాతం చొప్పున, ఆదాయం 18 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. రిస్క్ అధికంగా ఉండే ప్రాజెక్ట్ లోన్లు మొత్తం లోన్‌బుక్‌లో పెరుగుతుండడం.. ప్రతికూలాంశం. -
శ్రీకాళహస్తిలో హైదరాబాద్ వాసి దారుణహత్య
శ్రీకాళహస్తి: శ్రీకాళాహస్తిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి చేతులు కట్టేసి గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్టు తెలిసింది. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తున్న అతను విధిలో భాగంగా శ్రీకాళహస్తికి వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుని వద్ద లభించిన అతని ఆధార్ కార్డు అధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పసిడి నాణేల విక్రయాల పెంపుపై దృష్టి
ఎస్బీఐ, ఐసీఐసీఐ, పోస్టాఫీసులతో ఒప్పందాలకు ఎంఎంటీసీ కసరత్తు చండీగఢ్: పసిడి డిపాజిట్ పథకంలో భాగంగా ఉన్న ఇండియన్ గోల్డ్ కాయిన్ల విక్రయ మార్కెటింగ్ నెట్వర్క్ పటిష్టతపై ఎంఎంటీసీ దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇండియా పోస్ట్‌తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, రెండు వారాల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం తక్షణం నాణేల అమ్మకానికి దేశ వ్యాప్తంగా 100 నుంచి 150 బ్రాంచీలు ఖరారయ్యే అవకాశం ఉందని వివరించారు. తరువాత అమ్మకానికి సంబంధించిన బ్రాంచీల పెంపుపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం సంస్థ 22 ఔట్లెట్ల ద్వారా ‘ఇండియన్ గోల్డ్’కాయిన్ల రిటైల్ విక్రయాలు నిర్వహిస్తోంది. నాణేల విక్రయానికి పంజాబ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్‌తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు కూడా శుక్రవారం సంస్థ తెలిపింది. 24 క్యారట్ల ప్యూరిటీ ఇండియన్ గోల్డ్ కాయిన్ ఒకవైపు అశోకచక్రను కలిగిఉండగా, మరోవైపు మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. 5, 10, 20 గ్రాముల్లో తొలిదశల్లో ఈ కాయిన్లు లభ్యమవుతున్నాయి. -
ఎస్బీఐ, ఐసీఐసీఐలకు కీలక బ్యాంకుల హోదా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకును.. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకులుగా (డీ-ఎస్ఐబీ) ఆర్బీఐ గుర్తించింది. భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున..ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా, వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయి. -
వృత్తి నైపుణ్యాలతోనే ఉజ్వల భవిత
వృత్తి నైపుణ్యాలు ప్రస్తుతం ఈ అంశంపైనే విద్య, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నైపుణ్యాల కొరత తీవ్రంగా వేధిస్తోందంటూ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో యువత కేవలం విషయ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఎంపిక చేసుకున్న రంగంలో క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయమంటున్న ఐసీఐసీఐ ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చిన్మయ్ సేన్‌గుప్తాతో గెస్ట్ కాలమ్... ప్రస్తుతం యువత ముందు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే కన్న కలలు కొందరికే నిజమవుతున్నాయి. ఉన్నత అవకాశాలు కొందరికే అందుతున్నాయి. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నవారే త్వరగా తమ లక్ష్యాలను చేరుకోగలుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ... నేటి ప్రపంచంలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వరకు.. పదో తరగతి అర్హతతో లభించే ఉద్యోగాల నుంచి పీహెచ్డీ స్థాయి అవకాశాల వరకు వృత్తి నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకంగా మారాయి. ఉదాహరణకు సంస్థల్లో అకౌంటింగ్ విభాగంలో ఏళ్లనాటి పద్దులు రాసే విధానం పోయింది. సాఫ్ట్వేర్ ఆధారిత ఈఆర్పీ సొల్యూషన్స్ ద్వారా కంపెనీలు తమ పని సులువు చేసుకోవాలని భావిస్తున్నాయి. పీహెచ్డీ, ఆర్ అండ్ డీ స్థాయిలో ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ వరకు సాఫ్ట్వేర్ ఆధారిత డిజిటైజేషన్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పరిశోధకులు తమ పనిని తేలిగ్గా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆధునిక వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకుంటేనే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అయినా, ఆవిష్కరణల విభాగంలోనైనా మంచి కెరీర్ లభిస్తుంది. అందుకే ఏ రంగమైనా, ఏ స్థాయి అయినా యువత కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అకడమిక్ స్థాయిలో వీటిని బోధించకపోతే, ప్రత్యేకంగానైనా శిక్షణ తీసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం: క్షేత్ర స్థాయిలో ఒక ఉత్పత్తి గురించి వినియోగదారుడికి సరిగా తెలియజేసే నైపుణ్యం లేకపోతే ఆ ప్రభావం ఉత్పత్తి విక్రయాలపై పడుతుంది. అదే విధంగా కంపెనీల విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలను బోర్డ్ మీటింగ్స్‌లో సరిగా చెప్పలేకపోతే అది కంపెనీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఎదుటి వారిని మెప్పించే రీతిలో చెప్పగలిగే నైపుణ్యం అవసరం. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరి. బృందంతో కలిసి సమర్థవంతంగా పనిచేయగలగడం (బృంద స్ఫూర్తి) కూడా కీలకమైనది. పరిశ్రమ ధోరణి ప్రకారం: విద్యార్థులు తాము చేరిన కోర్సుకు సంబంధించి అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంతో పాటు ఆ కోర్సుకు సంబంధించిన రంగంలో పరిశ్రమ పరంగా వచ్చిన కొత్త పరిణామాలను తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదించుకోవాలి. పరిశ్రమ స్థితిగతులను అనుసరిస్తూ వాటిని అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే కోర్సు పూర్తయ్యే నాటికి సర్టిఫికెట్‌తోపాటు జాబ్ రెడీ స్కిల్స్ కూడా సొంతమవుతాయి. సాఫ్ట్వేర్ అనుబంధ కోర్సులు: ప్రస్తుతం కంపెనీల్లో పనితీరు పరంగా అవలంబిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో సాఫ్ట్వేర్ నైపుణ్యాలు అందించే కోర్సులు అభ్యసించాలి. ఉదాహరణకు అకౌంటింగ్లో షార్ట్‌టర్మ్ ఈఆర్పీ సర్టిఫికేషన్లు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించి వస్తున్న స్వల్పకాలిక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలి. ఇలా చేస్తే ఆయా రంగాల జాబ్ మార్కెట్లో ముందుంటారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు: మేనేజ్మెంట్ పీజీ ఔత్సాహికులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రత్యేక నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. కేస్ స్టడీస్‌ను సమగ్రంగా విశ్లేషించగల స్కిల్స్ అవసరం. వాస్తవ కేస్స్టడీస్ను విశ్లేషించి, ఒక సమస్యను ఎలా పరిష్కరించగలరు? దానికి అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? తాము ఆ స్థానంలో ఉంటే సమస్యను ఎలా పరిష్కరించగలరు? అనేదాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడే ఐఐఎంలో చదివినా, సాధారణ ఇన్స్టిట్యూట్లో చదివినా కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరుతుంది. ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది. టీఎస్పీఎస్సీ ఎఈఈ స్టడీ మెటీరియల్ హైదరాబాద్: టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పరీక్షలో జనరల్ స్టడీస్ పేపరే కీలకం. సిలబస్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమైన అంశాలను ఎంపిక చేసుకొని మరీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. వీలైనన్నీ మోడల్ పేపర్లు సాధన చేయడం వల్ల కొత్త పరీక్ష విధానంపై అవగాహన ఏర్పడుతుంది. అందుకే సాక్షి ఎడ్యుకేషన్ నిపుణులతో రూపొందించిన కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ సమస్యలు, భారత భూగోళ శాస్త్రం, భారత రాజకీయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డాటా విశ్లేషణ, ఇంగ్లిష్ గ్రామర్ వంటి అంశాలకు పూర్తిస్థాయి మెటీరియల్‌ను అందిస్తోంది.గమనిక: తెలంగాణ చ రిత్ర, ఆర్థిక వ్యవస్థ, జియోగ్రఫీ, సంస్కృతి, సాహిత్యం, తెలంగాణ ఉద్యమ క్రమం వంటి వాటికి త్వరలోనే స్టడీ మెటీరియల్‌తో పాటు ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. లాగాన్ అవండి.. http://www.sakshieducation.com/AEE/Index.html -
మిడ్‌క్యాప్ కన్నా లార్జ్‌క్యాప్ షేర్లే చౌక
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా వచ్చే ఏడాది నుంచి కార్పొరేట్ లాభాలు పెరుగుతాయి ♦ మూడేళ్ల కాలపరిమితితో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు ♦ వచ్చే రెండేళ్లలో వడ్డీరేట్లు 1.5% వరకు తగ్గొచ్చు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఏడాదిన్నర కిందటికీ ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో చాలా తేడా వచ్చిందని, ఇపుడు రిస్క్ పెరిగిందని చెబుతోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ సంస్థ. అందుకే ఇపుడు ఇన్వెస్ట్ చేసేవారు కనీసం మూడేళ్ల దృష్టితో పెట్టుబడి పెట్టాలని, గడిచిన రెండేళ్లుగా వస్తున్న లాభాలు ఈ ఏడాది కూడా వస్తాయని ఆశించటం అత్యాశేనని చెప్పారు సంస్థ ఎండీ, సీఈవో నిమేష్ షా. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ఈక్విటీ, డెట్ మార్కెట్ల పనితీరుతో సహా పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివ రాలివీ... చౌక కాదు... ఖరీదూ కాదు! విలువ పరంగా చూస్తే దేశీయ మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని చెప్పలేం. అలా అని మరీ ఖరీదని కూడా చెప్పలేం. ఏడాదిన్నర కిందటితో పోలిస్తే మార్కెట్లో కొద్దిగా రిస్క్ పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు విలువ పరంగా అధిక ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం 3-4 పీఈ వద్ద ఉన్న మిడ్‌క్యాప్ షేర్లలో చాలా షేర్లు 30-40 పీఈ కంటే అధికంగా ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రతి 100 లార్జ్‌క్యాప్ షేర్లలో 20 మాత్రమే అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిస్క్ రివార్డ్ నిష్పత్తి ప్రకారం చూస్తే మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ షేర్లే ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మూడు నుంచి నాలుగేళ్ల దృష్టితో లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నాం. కనిష్ట స్థాయికి ఆర్‌వోఈ : కార్పొరేట్ల లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటి లాభాల ఆర్జన(ఆర్‌వోఈ) కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీల వాటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది కూడా కంపెనీలు ఆదాయాలు అంతగా వృద్ధి కాకపోవచ్చు. అక్టోబర్ నుంచి ప్రభుత్వం రైల్వేలు, రహదారులపై పెద్ద ఎత్తున వ్యయం చేయనుండటంతో వచ్చే ఏడాది నుంచి కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం పెంచుకుంటే లాభాలు 40 నుంచి 50 శాతం పెరుగుతాయి. ఇది జరిగితే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో కంపెనీల లాభాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నాం. బుల్ రంగాలు..: కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇన్ఫ్రా రంగానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయించింది. వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి ఈ నిధుల కేటాయింపులు మొదలవుతాయని అంచనా వేస్తున్నాం. అందుకే ఈ రంగంతో నేరుగా సంబంధం ఉండే ఆటోమొబైల్, ఆటో మొబైల్ కాంపొనెంట్స్, రోడ్లు, రైల్వేలు, ప్రైవేటు బ్యాంకులు, ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఎగుమతులపై ఆధారపడ్డ ఐటీ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నాం. ఇదే సమయంలో రంగాలతో సంబంధం లేకుండా అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లకు దూరంగా ఉంటున్నాం. వడ్డీరేట్లు ఎందుకు తగ్గుతాయంటే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతుంటే ఒక్క ఇండియాలో మాత్రమే తగ్గనున్నాయి. సాధారణంగా వడ్డీరేట్లు రిటైల్ ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటాయి. గతంలో రిటైల్ ద్రవ్యోల్బణం 11 శాతం ఉంటే వడ్డీరేట్లు 10 శాతంలోపు ఉండేవి. కానీ ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటే అంత కంటే అధిక స్థాయిలో వడ్డీరేట్లున్నాయి. అంతర్జాతీయంగా చమురు, లోహాల ధరలు తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వడ్డీ రేట్లు దిగి రాక తప్పదు. వచ్చే రెండేళ్ళలో వడ్డీరేట్లు 100 నుంచి 150 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వడ్డీరేట్లు తగ్గేసమయంలో డెట్ పథకాలు కూడా మంచి రాబడులను అందిస్తాయి. భారీగా నిధులు దేశీ ఈక్విటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండేళ్లలో కొత్తగా 20 లక్షల మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ప్రారంభం కావడమే దీనికి నిదర్శనం. 2007లో అన్ని బ్యాంకుల డిపాజిట్ల విలువ రూ.30 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడిది రూ.90 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి విలువ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు చేరింది. మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో డిపాజిట్ల నుంచి ఇతర అసెట్స్‌లోకి నగదు బదిలీ అవుతుంది. ప్రస్తుత తరుణంలో బంగారం, రియల్ ఎస్టేట్ ఆకర్షణీయంగాలేవు కనక అధిక మొత్తం ఈక్విటీల్లోకి వచ్చే చాన్స్ ఉంది. అమెరికా వడ్డీరేట్లు పెం చినా ఆ ప్రభావం మన మార్కెట్లపై అంతగా ఉండదు. ఈ సమయంలో మార్కెట్లు పడితే వాటిని కొనుగోళ్లకు వినియోగించుకోండి. -
ఎఫ్‌డీల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు మారమంటారా?
కొంత సొమ్మును బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఇన్వెస్ట్ చేశాను. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులు వస్తాయని మిత్రులు చెబితే ఇటీవలే ఒక ఫిక్స్డ్ డిపాజిట్‌ను విత్‌డ్రా చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాను. మిగిలిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చమంటారా ? లేకుంటే వాటిని అలాగే కొనసాగించమంటారా? ఒక వేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - అభిమన్యు, విశాఖపట్టణం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీకు ఐదేళ్లలోపు అవసరమైన పక్షంలో, లేదా నిర్దేశిత మొత్తంలో రాబడులు ఆశించినప్పుడు మాత్రమే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆ ఫిక్స్డ్ డిపాజిట్లలోనే కొనసాగించవచ్చు. ఐదేళ్లలోపు నిర్దేశిత రాబడులు కావాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్స్ వద్దనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐదేళ్లలోపు మీకు డబ్బులు అవసరం లేనిపక్షంలో, కొంత రిస్క్ భరించగలిగేటట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, ముం దుగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ వంటి రిస్క్ తక్కువగా ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేయండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ వంటి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత శాతం ఇన్వెస్ట్ చేస్తారు? డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత శాతమైతే ఇన్వెస్ట్ చేస్తారో అంతే మొత్తం ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా కాకుండా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్పెషలైజ్డ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? - శ్రీలత, హైదరాబాద్ ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అయినప్పటికీ, ఎక్కువగా లార్జ్ క్యాప్ లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించే ఫండ్స్ కూడా ఉన్నాయి. కేవలం డెట్ ఇన్స్ట్రుమెంట్స్పైననే ప్రత్యేకంగా దృష్టిసారించే స్పెషలైజ్డ్ ఫండ్స్ ఏమీ లేవు. మార్కెట్లు పతన బాటలో ఉన్నప్పుడు ఫండ్ పనితీరు మెరుగైన విధంగా ఉండటానికి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. నేనొక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నా వయస్సు 29 సంవత్సరాలు. గత మూడేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. బిర్లా ఫ్రంట్‌లైన్ ఈక్విటీ(డివిడెండ్ ప్లాన్)లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో రూ.2,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత రెలిగేర్ ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్‌లో రూ.1,000 చొప్పున సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను.ఇటీవలనే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్‌లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.2.75 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నెలకు రూ.8,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. నేను 55 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాను. రిటైరయ్యేనాటికి రూ. 3 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్నవి సరిపోతాయా? ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచమంటారా? - విజయ్, ఈ-మెయిల్ రిటైరయ్యేనాటికి రూ.3 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం అభినందనీయమే. అయితే ఏ ప్రాతిపదికన రూ.3 కోట్ల లక్ష్యం నిర్దేశించుకున్నారో వివరించలేదు. ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నారని భావిస్తున్నాం. ఇక మీ పెట్టుబడి ప్రణాళిక విషయానికొద్దాం. ప్రతి నెలా రూ.8,000 చొప్పున 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ఏడాదికి 12%రాబడి అంచనాలతో మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం విలువ రూ. రూ.1.52 కోట్లవుతుంది. ప్రస్తుతమున్న మీ రూ.2.75 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ అదే కాలానికి రూ.46.75 లక్షలవుతాయి. వీటిని కూడా కలుపుకుంటే మీరు రిటైరయ్యేనాటికి రూ.1.99 కోట్ల నిధి తయారవుతుంది. ఒక వేళ ఏడాది రాబడులు 15% ఉంటాయనుకుంటే, 25ఏళ్లకు మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువ రూ.3.53 కోట్లవుతుంది. సాధారణ పరిస్థితుల్లో చూస్తే మీరు ఇప్పుడు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌తో మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకని మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని కొంత పెంచండి. నెలవారీ బడ్జెట్‌ను తయారు చేసుకోండి. దేనికెంత ఖర్చు చేస్తున్నారో, రాసుకోండి. ఖర్చుల్లో ఏవైనా తగ్గించుకోలరేమో చూడండి. మీ జీతం లో కనీసం 30-40% వరకూ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీంట్లో డివిడెండ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్చేయాలా? - అజయ్, ఈ-మెయిల్ భవిష్యత్‌లో రిటైరవుతున్నట్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒకవేళ మీరు ఇప్పటికే రిటైరై ఉంటే మీ ఆర్థిక అవసరాలను బట్టి గ్రోత్ ప్లాన్‌నో, డివిడెండ్ ప్లాన్‌నో ఎంచుకోవాలి. నెలవారీ కొంత సొమ్ము కోసం లేదా వార్షికంగా కొంత రాబడి కోసం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నిర్దేశిత కాలానికి కొంత సొమ్ము రావాలనుకునే పక్షంలో డివిడెండ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. -
పీఎఫ్.. ఈక్విటీ ఎంఎఫ్.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ఇప్పటివరకూ నా ప్రావిడెండ్ ఫండ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పటి నుంచి వచ్చే పదేళ్ల వరకూ నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా కాకుండా ఆ మొత్తాన్ని ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు చెబుతున్నారు. ఈ రెండిటిలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఒక వేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు వచ్చే పక్షంలో నేను ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సూచించగలరు? -ప్రసన్న, హైదరాబాద్ పదేళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రావిడెండ్ ఫండ్‌లో కన్నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ సురక్షితమైనదే కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. కొంత నష్ట భయం ఉన్నప్పటికీ, పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు పొందవచ్చు. ఇక మీరు అనుకున్నట్లే నెలకు రూ.5,000 చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో కానీ, ఒక మిడ్ క్యాప్ ఫండ్‌లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా ఒక లార్జ్‌క్యాప్ ఫండ్‌లో కొంత, మరో మిడ్‌క్యాప్ ఫండ్‌లో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. లార్జ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..., హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ బిల్డర్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ.. లను పరిశీలించవచ్చు. మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికైతే.., బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ ఆపర్చ్యునిటీస్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన 7,8 సంవత్సరాల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా డెట్ ఫండ్స్‌కు బదిలీ చేస్తే, అప్పటి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కవచ్చు. కనీసం ఏడాదికొకసారైనా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సమీక్షించడం మాత్రం మరచిపోకండి. గ్రీస్ రుణ సంక్షోభం, చైనా స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం... ఈ రెండు అంశాల కారణంగా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడం మాలాంటి రిటైల్ ఇన్వెస్టర్లను బాగా ఆందోళన పరుస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు అంశాల ప్రభావం ఎలా ఉండబోతోంది ? రిటైల్ ఇన్వెస్టర్లుగా మేము ఏం చేయాలి? -రాజేష్, విశాఖపట్నం మీరన్నట్లు గ్రీస్ రుణ సంక్షోభం, చైనా షాంఘై స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇది ఒకింత ఆందోళన కలిగించే విషయమే. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదు. మీ ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పటికే ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని నిస్సంకోచంగా కొనసాగించండి. డైవర్సిఫికేషన్‌ను పాటించడం మాత్రం మరచిపోకండి. డివిడెండ్లు క్రమం తప్పకుండా చెల్లించే ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు వెల్లడించండి. -శ్రీనివాస్, ఈమెయిల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఇది సరైన విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో డివిడెండ్లు అసలు పరిగణించే విషయమే కాదు. ఒపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత కావాలనుకుంటే అంత, లేకపోతే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. డివిడెండ్ చెల్లింపులను బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్-టెర్మ్ ఫండ్ రెగ్యులర్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఆ తర్వాత కొంత కాలానికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? -నీరజ, తిరుపతి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే మీలాంటి వారికి ఇది సరైన నిర్ణయమే. ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయని వారికి, ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ అనేది సరైన ఎంపికే. మీరనుకుంటున్నట్లుగా మీ నిర్ణయాన్ని అమలుపరచండి. -
సాక్షిమైత్రి ఇన్వెస్టర్క్లబ్కి విశేషస్పందన
-
మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ
గ్రీస్ సంక్షోభం తమ బ్యాంకుపై ఎటువంటి ప్రభావం చూపబోదని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ అన్నారు. 21వ ఏజీఎం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, యూరప్‌లో తమకు వ్యాపార కార్యకలాపాలు ఏవీ లేవని అన్నారు. అక్కడి కంపెనీలకు తమ బ్యాంక్ ఎటువంటి రుణాలూ అందజేయలేదని వెల్లడించారు. -
బ్రిక్స్ అధ్యక్షుడుగా కె.వి.కామత్
న్యూ ఢిల్లీ: బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడుగా కే వీ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామత్ ఈ పదవిలో ఐదేళ్ళు కొనసాగుతారు . ఐదు దేశాల కూటమికి 2001లో బ్రిక్స్ గా నామకరణం చేశారు. ఈ బ్యాంకుకు అధ్యక్షుడిని నామినేట్ చేసే అవకాశం భారత్‌కు లభించింది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకును భవిష్యత్తు ప్రపంచ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్‌మన్ సాచే అసెట్ మేనేజ్మెంట్ గతంలో అభివర్ణించింది. ఆర్థిక విశ్లేషకులు కూడా బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్థిక ప్రణాళికతోనే జీవితంలో విజయం
కడప కార్పొరేషన్/వైవీయూ : జీవితంలో విజయం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ జి.వి.రవిశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని మయూర గార్డెనియాలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ప్రతినిధులు, ఫైనాన్సియల్ అడ్వైజర్లు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మదుపరులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు విచ్చేసిన జి.వి. రవిశేఖర్ మదుపరులను ఉద్దేశించి మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి సంపాదించిన సొమ్మును సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. చేసే పని ఏదైనా ప్రణాళిక ఉంటే విజయం సాధిస్తామన్నారు. అదే విధంగా తెలిపారు. సాధారణ ప్రజలు సైతం పెట్టుబడి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. డబ్బు అందరికీ ప్రధానమేనని, అందరూ పనిచేసేది దానికోసమేనన్నారు. అయితే సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రణాళిక, లక్ష్యం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక మొబైల్, ఒక ఫ్రిజ్ కొనేటప్పుడు అందరినీ విచారించి కొంటారని, పెట్టుబడి మాత్రం ఆలోచించకుండానే పెట్టేస్తుంటారని ఇది సరైన విధానం కాదన్నారు. అలాగే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలా, పెట్టుబడి పెట్టాలా అన్న విషయంలో కూడా సందిగ్ధత నెలకొంటుందన్నారు. సెన్సెక్స్‌లో దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెడితే నష్టాలు రావన్నారు. అనంతరం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శాంతి రాజ్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి, ఆదాయం, ఖర్చులు, పొదుపు ఎలా చేస్తున్నాం, పెట్టుబడి ఎందుకు పెట్టాలి, ఎలాంటి బీమా చేయాలి వంటి వాటి గురించి సుదీర్ఘంగా వివరించారు. సాక్షి కడప యూనిట్ ఇన్చార్జి నాగభూషణం మాట్లాడుతూ మదుపరుల అవగాహన సదస్సును మొట్టమొదటగా కడపలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు మదుపరులకు అవగాహన కల్పించడానికి ప్రదర్శించిన లఘునాటిక ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి ఉగ్రగిరి రావు, బ్యూరో ఇన్చార్జి ఎం. బాలక్రిష్ణారెడ్డి, సాక్షి ఏడీవీటి రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి, ఏడీవీటి జిల్లా ఇన్చార్జి చాముండేశ్వరి, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి పలువురు వ్యాపారులు, డాక్టర్లు, ఫైనాన్షియర్లు, పాల్గొన్నారు. -
సంపాదనను సంపదగా మార్చుకోండి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జి.వి. రవిశేఖర్ సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్’ నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన సాక్షి, కడప: మదుపరులు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపాదనను సంపదగా మార్చుకోవచ్చని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్; ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ జి.వి.రవిశేఖర్ పేర్కొన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కడప నగరంలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్రతినిధులు, ఫైనాన్సియల్ అడ్వైజర్లు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మదుపరులకు అవగాహన కల్పించారు. సంపాదించిన సొమ్మును సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని రవిశేఖర్ చెప్పారు. జీవితంలో విజయం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాధారణ ప్రజలు సైతం పెట్టుబడి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా చక్కటి జీవితానికి నేటి పొదుపు, మదుపు ఉపయోగపడతాయని వివరించారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాతిపదికన ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలన్నారు. నేటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే పెట్టుబడులు పెడుతున్నారని దానికి భిన్నంగా అనేక అవకాశాలు వచ్చాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం... సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హోల్‌లైఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డెరైక్టర్ పి. శాంతిరాజ్ మాట్లాడుతూ... కోరుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇన్వెస్ట్మెంట్ దోహదం చేస్తుందన్నారు. మెడికల్ హెల్త్ లాగే ఫైనాన్షియల్ హెల్త్ అవసరమన్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తినా క్రమబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణతో జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్ బాగుండాలంటే ఆర్థికంగా పునాదులు బాగుండాలని.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత మొత్తమైనా పొదుపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఇన్వెస్టర్‌కు కొన్ని అంశాలపై అవగాహన ఉండాలన్నారు. అప్పుడే చక్కటి నిర్ణయాలు తీసుకోగలడన్నారు. పెరుగుతున్న ధరలు, భవిష్యత్ ఆర్థిక సూచీని అనుసరించి దానికి తగ్గ ప్రణాళికలను నేటి నుంచే అమలు చేయాలని చెప్పారు. సాక్షి కడప యూనిట్ ఇన్చార్జి వి.నాగభూషణం మాట్లాడుతూ ప్రజల్లో స్టాక్ మార్కెట్, ఇతరత్రా అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని వీటివల్ల ఆర్థిక అంశాలపై అవగాహన పెరిగిందని ఈ సందర్భంగా పలువురు మదుపరులు పేర్కొన్నారు. -
మదుపరుల కోసం సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్
ఆదివారం కడపలో తొలి అవగాహన సదస్సు ⇒ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారం... ⇒ఆర్థిక ప్రణాళికలపై సూచనలు, సందేహాల నివృత్తి; ప్రవేశం ఉచితం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక విషయాల పట్ల పాఠకుల్లో అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ నడుంబిగించింది. ఇందుకోసం ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ను ఏర్పాటు చేసింది. ఈ క్లబ్లో సభ్యులుగా చేరిన వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్, బీమా, పిల్లల చదువు, వివాహం, సొంతింటి కల నెరవేర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం ఎలా వంటి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలన్న విషయాలపై ఆర్థిక నిపుణులు సూచనలను అందిస్తారు.అంతేకాకుండా మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్లో చేరిన వారి ఆర్థిక పరమైన సందేహాలను నిపుణులు తీరుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి మదుపరుల అవగాహన సదస్సుకు కడప వేదిక కానుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారంతో ఏప్రిల్ 19(ఆదివారం)న కడపలోని మయూరా గార్డేనియాలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 9505555020 అనే నెంబర్‌కు ఫోన్ చేసి, మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. -
టాటా కమ్యూనికేషన్స్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.426 టార్గెట్ ధర: రూ.510 ఎందుకంటే: బడ్జెట్ రోజు దాదాపు చాలా షేర్లు పెరిగాయి. అలా పెరిగిన చాలా షేర్లలో ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. కానీ బడ్జెట్ రోజు పెరిగినదానికంటే కూడా ప్రస్తుతం అధిక ధర ఉన్న కొన్ని షేర్లలో టాటా కమ్యూనికేషన్స్ ఒకటి. టెలి కమ్యూనికేషన్స్‌లో ఉన్న మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీల్లో ఇదొకటి. 2,10,000 కి.మీ సబ్‌మెరైన్(సముద్రాంతర్భాగ) నెట్వర్క్ ఉంది. పది లక్షల చదరపు కిమీ. డేటా సెంటర్ స్పేస్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రోటొకాల్(ఐపీ) నెట్‌వర్క్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 10 శాతంగా ఉంది. అలాగే అంతర్జాతీయ హోల్‌సేల్ వాయిస్ ట్రాఫిక్‌లో 19 శాతం వాటా ఉంది. భారత డేటా సెంటర్ మార్కెట్లో నాలుగో వంతు ఈ కంపెనీదే. ఇటీవలనే ఇండోనేషియాకు చెందిన టెలికాం దిగ్గజ కంపెనీ ఇండోశాట్తో ఒప్పందం కుదర్చుకుంది. ఇండోనేషియాలోని కంపెనీలకు కమ్యూనికేషన్ సొల్యూషన్స్ అందించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందం టాటా కమ్యూనికేషన్స్‌కు ప్రయోజనం కలిగించనున్నది. రెండేళ్లలో నికర అమ్మకాలు 6 శాతం, ఇబిటా 18 శాతం, నికర లాభం 129 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. సియారామ్ సిల్క్మిల్స్ బోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.899 టార్గెట్ ధర: రూ.1,102 ఎందుకంటే: కొత్త బ్రాండ్లు, కొత్త సెగ్మెంట్లోకి ప్రవేశం కారణంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయి. కంపెనీ ఇటీవలనే ప్రవేశపెట్టిన జెనిసిస్, మెరెట్టి(ఈ రెండు ప్రీమియం కాటన్ బ్రాండ్స్)కు మంచి స్పందన లభిస్తోంది. అలాగే మహిళల దుస్తుల రంగంలోకి కూడా ప్రవేశించింది. అధిక వృద్ధికి అవకాశాలున్న కాటన్ షర్టింగ్, లినన్ ఫ్యాబ్రిక్స్ల్లో అడుగిడుతోంది. అధిక లాభాలుండే రెడీమేడ్ దుస్తుల విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2014 మార్చి 31 నాటికి రెడీమేడ్ దుస్తుల విభాగం నుంచి వచ్చే ఆదాయం కంపెనీ మొత్తం ఆదాయంలో 15 శాతంగా ఉంది. మూడేళ్లలో ఈ మార్కెట్ వాటా 17.4 శాతానికి పెరుగుతుందని అంచనా. దీంతో 2017 నాటికి ఇబిటా మార్జిన్లు 12 శాతానికి పెరుగుతాయి. ముడి పదార్ధాల ధరలు తగ్గడం, విభిన్నమైన సెగ్మెంట్లలో ఉత్పత్తులనందించడం వంటి కారణాల వల్ల కూడా మార్జిన్లు మెరుగుపడతాయి. 2014లో 0.7 గా ఉన్న రుణ, ఈక్విటీ నిష్పత్తి 2017 నాటికి 0.3కు తగ్గుతుందని భావిస్తున్నాం. పుష్కలంగా నగదు నిల్వలున్న ఈ కంపెనీ నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో రూ.115 కోట్లకు పెరుగుతుందని అంచనా. 2017 మార్చి 31 నాటికి కంపెనీ ఆదాయం 12.5 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో రూ.1,855 కోట్లకు చేరుతుం దని భావిస్తున్నాం. -
బ్యాంకుల రుణరేట్లు దిగొచ్చే సంకేతాలు!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు.. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కొన్ని మెచ్యూరిటీలపై బల్క్ (అధిక విలువ కలిగిన) డిపాజిట్ రేట్లను పావు శాతం వరకూ తగ్గించాయి. తద్వారా రుణ రేటు తగ్గింపు సంకేతాలను ఇచ్చాయి. రూ. కోటికిపైగా డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. తక్షణం ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రూ. ఐదు కోట్లు ఆ పైబడిన డిపాజిట్ రేటును బ్యాంక్ పావు శాతం వరకూ తగ్గించింది. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ నెలారంభంలోనే వివిధ మెచ్యూరిటీలపై స్థిర డిపాజిట్ రేట్లను పావుశాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. మొండిబకాయిల ప్రొవిజనింగ్ నిబంధనలు సరళతరం బ్యాంకుల మొండి బకాయిలకు సంబంధించి బ్యాంకింగ్ ప్రొవిజనింగ్ (ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొండి బకాయిలకు లాభాల్లో కేటాయించాల్సిన పరిమాణం) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సోమవారం సడలించింది. ప్రొవిజినింగ్ జరిగిన ఎన్పీఏలు వసూలయినప్పుడు, అప్పటికే అందుకు కేటాయించిన మొత్తంలో(ప్రొవిజినింగ్ బఫర్‌లో) 50 శాతాన్ని తిరిగి మొండిబకాయిలకు, నిరర్థక ఆస్తులకు ప్రొవిజినింగ్ రూపంలో కేటాయింపులుగా చూపించుకోడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ ఈ రేటు 33%గా ఉంది. దీనివల్ల తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో లాభాల్లో ప్రొవిజినింగ్కు కేటాయించాల్సిన పరిమాణం తగ్గి, సంబంధిత బ్యాంకులకు మరింత నిధుల లభ్యత(లిక్విడిటీ) సమకూరే అవకాశం ఏర్పడుతుంది. -
స్టాక్ మార్కెట్లో మరికొంత కాలం... సర్దుబాటు ధోరణే..!
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సీఐవో మనీష్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి కంపెనీల ఆదాయాలు పెరిగితే స్టాక్ మార్కెట్లో తిరిగి ర్యాలీ మొదలవుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్లో లక్ష కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న తొలి ప్రైవేటు రంగ బీమా కంపెనీగా రికార్డులకు ఎక్కిన సందర్భంగా ప్రస్తుత మార్కెట్ల స్థితిగతులపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) మనీష్ కుమార్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... బడ్జెట్ తర్వాత నుంచి దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది మరింత కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుత కరెక్షన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికల ఫలితాల (జూన్, 2014) తర్వాత మార్కెట్లు సుదీర్ఘ ర్యాలీ చేయడంతో బడ్జెట్ తర్వాత సర్దుబాటు మొదలయ్యింది. దేశ ఆర్థిక వృద్ధి ఫలాలు వాస్తవ రూపంలోకి వచ్చే వరకు సూచీలు పరిమిత శ్రేణిలో కదులుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగినప్పుడే మార్కెట్లో తిరిగి ర్యాలీ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది కాలంలో స్టాక్ సూచీల నుంచి ఎటువంటి రాబడులను అంచనా వేస్తున్నారు? సెన్సెక్స్, నిఫ్టీల రాబడి కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను ప్రతిబింబిస్తాయని అంచనా వేస్తున్నాం. కంపెనీల ఆదాయాల్లో ఏమైనా వృద్ధి ఉంటే ఆ మేరకు సూచీలు కూడా పెరుగుతాయి. కానీ చరిత్రను పరిశీలిస్తే మాత్రం.. దేశీయ ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో 13 నుంచి 15 శాతం రాబడిని అందించాయి. బీమా బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మోదీ సంస్కరణల అమలుపై మార్కెట్లకు నమ్మకం పెరిగిందా? దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోదీ ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తుందన్న నమ్మకం ఉంది. బీమా బిల్లు చట్ట సవరణ తర్వాత రానున్న కాలంలో ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రానున్నాయి. భవిష్యత్తు వ్యాపార విస్తరణకు నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీమా కంపెనీలకు ఈ బిల్లు పెద్ద ఊరటనిస్తుందని చెప్పొచ్చు. ఇంటా బయట నుంచి దేశీయ మార్కెట్లు తక్షణం ఎదుర్కొనే నష్టభయాలు ఏమిటి? గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే... అమెరికా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల పెద్ద ఎత్తునున్న ఎఫ్ఐఐ నిధులు రావడంతో దేశీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఆ మేరకు నిధులపై తప్పక ప్రభావం కనిపిస్తుంది. అలాగే దేశాల మధ్య ఏమైనా యుద్ధాలు వచ్చినా, ఓపెక్ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించినా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు అంతర్జాతీయ విషయాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఇక స్థానిక విషయాలకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో జాప్యం జరిగితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి. అంటే..అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం తగ్గి మార్కెట్లు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందా? అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఇండియాతో సహా అన్ని వర్ధమాన దేశాల మార్కెట్లలో ఒడిదుడుకులు పెరుగుతాయి. కానీ ఇండియా విషయానికి వస్తే ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు చాలామటుకు డిస్కౌంట్ చేసుకున్నాయి. అలాగే... ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే అదే సమయంలో యూరప్, జపాన్ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు పెంచే అవకాశం ఉంది. దీంతో అమెరికా నుంచి తగ్గే ఎఫ్ఐఐల నిధుల ప్రవాహాన్ని యూరప్, జపాన్ దేశాల నిధులు భర్తీ చేయవచ్చు. వచ్చే ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో వడ్డీరేట్లు ఇంకా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే అరశాతం వడ్డీరేట్లు తగ్గడం చూశాం. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిరేటు బలహీనంగా ఉంటంతో వడ్డీరేట్లు మరింత తగ్గడానికే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లోగా వడ్డీరేట్లు మరో అరశాతం తగ్గొచ్చని అంచనా. సూచీలు నూతన రికార్డులు నెలకొల్పిన తర్వాత యులిప్ పథకాల అమ్మకాలు ఏమైనా పెరిగాయా?... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో యులిప్స్ పథకాల్లో పెట్టుబడులు పెరగడం స్పష్టంగా కనిపించింది. రానున్న కాలంలో మార్కెట్ పరిస్థితులు బాగుండే అవకాశాలుండటంతో యులిప్స్ అమ్మకాలు పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. ఇది మార్కెట్ల వృద్ధికి మరింత దోహదం చేస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏ రంగ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు? వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు? దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వడ్డీరేట్ల కదలికతో నేరుగా సంబంధం ఉన్న ప్రైవేటు బ్యాంకులు, ఆటో రంగ షేర్లతో పాటు టెలికం షేర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, కమోడిటీ రంగాల షేర్లకు దూరంగా ఉండమని సూచిస్తా. -
అప్‌ట్రెండ్‌కు అవకాశం..!
బడ్జెట్‌తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగు - కార్పొరేట్ పన్ను తగ్గింపు,గార్ వాయిదాతో బూస్ట్ - సంవత్సరాంతానికి సెన్సెక్స్ 32,500 పాయింట్లు-ఐసీఐసీఐ సెక్యూరిటీస్ న్యూఢిల్లీ: బడ్జెట్లో కొన్ని సానుకూల ప్రతిపాదనల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని, దాంతో ఈ వారం స్టాక్ మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% మేర తగ్గించాలన్న ప్రతిపాదన, విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన వివాదాస్పద ‘గార్’పన్ను అమలును వాయిదావేయడం వంటి అంశాలు అప్‌ట్రెండ్‌కు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సందర్భంగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 141 పాయింట్లు లాభపడటం తెలిసిందే. గత మూడు బడ్జెట్ల సమర్పణ రోజుల్లో సూచీలు నష్టపోయాయి. ఈ దఫా మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే బడ్జెట్ ఉన్నం దున, ఈ వారం సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం కూడా లేకపోలేదని క్యాపిటల్ వయా రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఏడాదికి 15-20% పెరగవచ్చు...: వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును క్రమేపీ 5% తగ్గించాలన్న ప్రతిపాదనను 2015-16 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పొందుపర్చారు. దీంతో పాటు జీఎస్టీని 2016 ఏప్రిల్ నుంచి అమలుపర్చాలన్న ప్రతిపాదన, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రతిపాదించిన చర్యల ఫలితంగా ఆర్థికాభివృద్ధి రెండంకెలకు చేరే అవకాశం ఉంటుందని ఎడల్వైజ్ సెక్యూరిటీస్ సీఈఓ వికాశ్ ఖేమాని వ్యాఖ్యానించారు. శనివారం మార్కెట్ ముగిసిన తీరు కారణంగా ఈ వారం మరికొంత పెరుగుదల ఉండవచ్చని, అయితే విదేశీ ఇన్వెస్టర్లు స్పందించే తీరు ఆధారంగా ట్రెండ్ కొనసాగుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ అన్నారు. రూపాయి కదలికలు, చమురు ధర హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్ ఆధారంగా ట్రేడింగ్ ఉండవచ్చని మరికొంతమంది నిపుణులు విశ్లేషించారు. బడ్జెట్లో పలు సానుకూల ప్రతిపాదనల కారణంగా రానున్న 2-3 ఏళ్లలో ఏటా 15-20% చొప్పున మార్కెట్ పెరుగుతుందని ఆనంద్‌రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ ఆనంద్‌రాఠి చెప్పారు. ఆటోమొబైల్స్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2015 డిసెంబర్‌కల్లా సెన్సెక్స్ 32,500, నిఫ్టీ 9,750 పాయింట్లకు పెరగవచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. శుక్రవారం హోలీ పండుగ కారణంగా సెలవు అయినందున, ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమవుతుంది. గార్ అంటే ఏంటి? మారిషస్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి కొన్ని‘ట్యాక్స్ హెవెన్స్’ దేశాల నుంచి పెట్టుబడుల ద్వారా భారత్‌లో పన్ను భారాల నుంచి తప్పించుకునే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉద్దేశించినదే జనరల్ యాంటీ అవెడైన్స్ రూల్(గార్). అయితే దీనిలో నిబంధనల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గార్ అమలు ఎప్పుటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలలో రెండు ఐపీవోలు చాలాకాలం నుంచి మందకొడిగా వున్న ఐపీఓ మార్కెట్‌కు ఊపునిస్తూ రెండు కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) ఈ నెలలో జారీకానున్నాయి. కేబుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒర్టల్ కమ్యూనికేషన్ ఐపీఓ మార్చి 3న, అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వహిస్తున్న అడ్లాబ్స్ ఇమేజికా ఇష్యూ మార్చి 10న మార్కెట్లోకి రానున్నాయి. మరో ఐదు కంపెనీలు-యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్ఎల్ లాజిస్టిక్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఏసీబీ ఇండియా, శ్రీపుష్కర్ కెమికల్స్-ఐపీఓలు జారీచేసేందుకు ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. ఈ కంపెనీల ఇష్యూలు రానున్న నెలల్లో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. -
ఐపీఓకు బీమా కంపెనీలు?
జనరల్ ఇన్సూరెన్స్ లిస్టింగ్‌కు కేంద్రం యత్నాలు అదే బాటలో ప్రైవేటు బీమా కంపెనీలు బీమా ఆర్డినెన్స్‌తో ఇన్వెస్టర్లకు పెరిగిన నమ్మకం గతేడాది జనరల్ పీఎస్‌యూ కంపెనీల లాభం రూ. 2,899 కోట్లు 5-10 శాతం విక్రయిస్తామంటున్న ఐసీఐసీఐ, ఎస్బీఐ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ గడప తొక్కడానికి బీమా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జీవిత బీమాతో పాటు సాధారణ బీమా సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలు రెండూ స్టాక్ మార్కెట్లో నమోదవటం ద్వారా నిధులు సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రైవేటు రంగంలోని ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బీమా కంపెనీలు ఈ దిశగా సంకేతాలివ్వగా మరికొన్ని కంపెనీలు తెరవెనుక కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ మూడూ అటు జీవిత బీమా, ఇటు సాధారణ బీమా రెండు రంగాల్లోనూ ఉన్నాయి. ఎస్బీఐ సొంతంగానే రెండు రంగాల్లోనూ ఉండగా... ఐసీఐసీఐ సంస్థ దక్షిణాఫ్రికాకు చెందిన లాంబార్డ్‌తో కలసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన ప్రుడెన్షియల్‌తో కలసి జీవితబీమా సేవల్ని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కూడా జర్మనీకి చెందిన ఇర్గోతో కలసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన స్టాండర్డ్‌తో కలసి జీవిత బీమా సేవల్ని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ సంస్థ ఎంత వాటాను విక్రయించాలనుకుంటున్నదీ చెప్పకపోయినా... ఐసీఐసీఐ మాత్రం 5 శాతం వాటాను విక్రయించే అవకాశముందని తెలియజేసింది. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య కూడా 10 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు ఇటీవల ఫలితాల సందర్భంగా తెలియజేశారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం సైతం తన చేతిలో ఉన్న బీమా కంపెనీల్లో కొంత వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. అయితే ముందుగా ఎల్ఐసీతో కాకుండా సాధారణ బీమా సేవలందిస్తున్న నాలుగు కంపెనీల్లో ఏదో ఒకదాన్లో వాటాలు విక్రయించాలని భావిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆర్థిక ఏడాది ఏదో ఒక సాధారణ బీమా కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటీవలే కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అదియా నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం నిర్వహించారు. మొదటగా న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అతిపెద్ద జీవిత బీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీతో మొదలుపెడితే ఉద్యోగులు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావచ్చని భావిస్తున్న కేంద్రం... మొదట జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆరంభించాలని, వీటిని విజయవంతంగా నమోదు చేస్తే ఎల్ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుదిబండగా వాహన బీమా... వాహనదార్లందరికీ ఉండే మోటార్ ఇన్సూరెన్స్ విభాగమే కంపెనీలకు గుదిబండగా మారింది. 2013-14లో వాహన బీమాలో రూ.7,549 కోట్ల అండర్‌రైటింగ్ నష్టాలు నమోదయ్యాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి వాహన బీమా ప్రీమియంలు పెంచడానికి కూడా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ గతేడాది 4 ప్రభుత్వ రంగ బీమా కంపెనీలూ కలసి రూ.2,899 కోట్ల లాభాల్ని ప్రకటించాయి. లాభాల్లో ఉన్న కంపెనీలను నమోదు చేస్తే ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చన్నదని ప్రభుత్వ యోచన. అందుకే బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవాలని పీఎస్‌యూ యాజమాన్యాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. బీమా ఆర్డినెన్స్‌తో కదలిక... స్టాక్ మార్కెట్లో నమోదవటానికి వీలుగా బీమా కంపెనీలకు రెండేళ్ళ క్రితమే ఐఆర్డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. తాజాగా బీమా చట్ట సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తేవటంతో ఈ రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయం స్పష్టమైంది. ఈ ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత వచ్చినవెంటనే ఐపీవోకి వచ్చేలా కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా సగటున 20 శాతం వృద్ధిని సాధిస్తున్న బీమా రంగం ప్రస్తుతం రూ.85,000 కోట్లకు చేరింది. 2015-16లో లక్ష కోట్ల మార్కును దాటుతుందని అంచనా. అంటే..? అండర్‌రైటింగ్ నష్టాలు: కంపెనీలు వసూలు చేసిన ప్రీమియం కంటే క్లెయిమ్‌ల మొత్తం ఎక్కువగా ఉండటం. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు 1) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 2) న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 3) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ 4) ద ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ 5) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 6) అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా సాధారణ, జీవిత బీమా రెండూ ఉన్న ప్రైవేటు సంస్థలు 1) భారతీ యాక్సా 2) బజాజ్ అలయెంజ్ 3) ఎల్ అండ్ టీ 4) రిలయన్స్ 5) ఎస్బీఐ సాధారణ బీమా మాత్రమే అందిస్తున్నవి... 1) చోళమండలం ఎంఎస్ 2) ఫ్యూచర్ జెనరాలీ 3) హెచ్డీఎఫ్సీ ఇర్గో 4) ఐసీఐసీఐ లాంబార్డ్ 5) ఇఫ్కో టోకియో 6) లిబర్టీ వీడియోకాన్ 7) మాగ్మా హెచ్‌డీఐ 8) రహేజా క్యూబీఈ 9) రాయల్ సుందరం 10) శ్రీరామ్ 11) టాటా ఏఐజీ 12) యూనివర్సల్ సంపూ జీవిత బీమా మాత్రమే అందిస్తున్నవి... 1) ఏగాన్ రెలిగేర్ 2) అవీవా ఇండియా 3) కోటక్ మహీంద్రా ఓఎం 4) టాటా ఏఐఏ 5) స్టార్ యూనియన్ దైచీ 5) మ్యాక్స్ లైఫ్ 6) హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ 7) ఐడీబీఐ ఫెడరల్ 8) ఇండియా ఫస్ట్ లైఫ్ 9) బిర్లా సన్‌లైఫ్ 10) ఐసీఐసీఐ ప్రు.. 11) ఎక్సైడ్ లైఫ్ 12) కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఆరోగ్య బీమా కంపెనీలు... 1) అపోలో మ్యూనిచ్ 2) సిగ్నా టీటీకే 3) ఐసీఐసీఐ లాంబార్డ్ 4) స్టార్ హెల్త్ అల్లీడ్ 5) రెలిగేర్ హెల్త్ -
ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ట్విట్టర్ ద్వారా కూడా నగదును బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని, ప్రి పెయిడ్ మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే అవకాశాన్నందిస్తున్న తొలి ఆసియా బ్యాంక్ తమదేనని, అలాగే ప్రపంచంలో రెండవదని వివరించారు. ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విటర్ హ్యాండిల్లో నమోదు చేసుకోవాలని వివరించారు. నగదు బదిలీకి నగదు పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తికి ట్విట్టర్ హ్యాండిల్ తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీ అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యూనిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్‌పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం నగదు బదిలీకి ఎన్ఈఎఫ్టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్), ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) విధానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్)లో కూడా చేరతామని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీకి ఎలాంటి చార్జీలు ఉండవని, నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. ఒక వేళ డబ్బులు పొందే వ్యక్తి వేరే బ్యాంక్ ఖాతాదారు అయితే, ఆ వేరే బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది ఫేస్బుక్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని అందించామని చెప్పారు. ట్విట్టర్ ఇండియా బిజనెస్ హెడ్.. తరన్‌జిత్ సింగ్ ట్విట్టర్ ఇండియా బిజినెస్ హెడ్‌గా తరన్‌జిత్ సింగ్ నియమితులయ్యారు. భారత్‌లో ట్విట్టర్‌కు వాణిజ్య పరమైన అవకాశాలను పెంచడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తారని ట్విట్టర్ మేనేజింగ్ డెరైక్టర్ పర్మిందర్ సింగ్ చెప్పారు. -
ట్విటర్ లో నగదు బదిలీ
ముంబై: తమ ఖాతాదారుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ట్విటర్ ద్వారా నగదు బదిలీ, బ్యాలెన్స్ ఎంక్వరీ, ప్రిపెయిడ్ మొబైల్ రీచార్జి చేసుకునే సదుపాయాన్ని సోమవారం ప్రారంభించింది. దీనికోసం ఖాతాదారులు బ్యాంకు ట్విటర్ పేజీలోకి వెళ్లి తమ పేర్లు రిజిష్టర్ చేసుకోవాలని ఐసీఐసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు బదిలీ చేయాలంటే అవతలివారి ట్విటర్ ఎకౌంట్ తెలుసుండాలి. నగదు బదిలీ చేసిన తర్వాత యూనిక్ కోడ్ తో ఎస్ఎంఎస్ వస్తుంది. నగదు తీసుకోవాలనుకునే వారు ఐసీఐసీఐ ట్విటర్ లో ఉన్న ప్రత్యేక పేజీలో ఈ కోడ్ ఎంటర్ చేస్తే బదిలీ పూర్తవుతుంది. త్వరలో ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ప్రవేశపెడుతున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు. -
డిపాజిట్ రేట్లు డౌన్..
ఎస్బీఐ పావు శాతం కోత ఇప్పటికే తగ్గించిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు.. ఇతర బ్యాంకులదీ ఇదే బాట! ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేటును పావు శాతం తగ్గించింది. దీనిప్రకారం ఏడాది పైబడి, ఐదేళ్ల లోపు డిపాజిట్లపై రేటును ప్రస్తుత 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించింది. కోటి రూపాయిల లోపు రిటైల్ డిపాజిట్లకు తాజా నిర్ణయం అమలవుతుంది. సోమవారం నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు రెండు- ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు డిపాజిట్ రేట్లు పావు శాతం నుంచి అరశాతం శ్రేణిలో తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా చర్య తీసుకుంది. ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ కూడా గురువారం ఆరు నెలల నుంచి 20 ఏళ్ల మధ్య డిపాజిట్లపై అరశాతం వరకూ వడ్డీరేటు కోత విధించింది. గత కొద్ది నెలల్లో రెండు సార్లు ఏడాది కాలం లోపు స్వల్పకాలిక మెచ్యూరిటీల్లో ఎస్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకుంది. రుణ రేట్ల తగ్గుదలకు సూచన! డిపాజిట్ రేటు కోతను సాధారణంగా రుణ రేటు తగ్గుదలకు సంకేతంగా భావిస్తారు. వ్యవస్థలో రుణ వృద్ధి రేటు మందగమనం, బ్యాంకుల వద్ద తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ఉండడం, రానున్నది తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థన్న సంకేతాలు బ్యాంకుల డిపాజిట్ రేటు కోతకు నేపథ్యం. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే (ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రఘురామ్ రాజన్ డిసెంబర్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రుణ రేటు కోత: హెచ్డీఎఫ్సీ వచ్చే ఏడాది మార్చి నాటికి రుణ రేటును తగ్గిస్తామని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ, మార్చి నాటికి బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్ రేటు) ను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 10 శాతంగా ఉంది. డిపాజిట్ రేటు కోత నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతకు అందించడంపై బ్యాంక్ దృష్టి సారిస్తుందని ఆదిత్య పురి అన్నారు. ఫిబ్రవరిలో రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇదిలాఉండగా, ఫిబ్రవరిలో జరగనున్న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో పావుశాతం రేట్ల కోత ఉండవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మిరిల్ లించ్(బీఓఎఫ్ఏ- ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2015 సంవత్సరం మొత్తంలో ముప్పావుశాతం వడ్డీరేటు తగ్గే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరల తగ్గుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశమని కూడా నివేదిక విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా గడచిన ఐదు పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ ఈ రేటును యథాతథంగా కొనసాగిస్తోంది. -
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్ రేట్ల కోత
ముంబై: ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు డిపాజిట్ల రేట్లను అరశాతం వరకూ తగ్గించాయి. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి మెరుగ్గా ఉండడం, రుణ వృద్ధి రేటు మందగమనం, ఇక రానున్నది తక్కువ రేటు వడ్డీ కాలమేనన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గింపు ఇలా: ఐసీఐసీఐ బ్యాంక్ 390 రోజుల నుంచి రెండేళ్ల కాల పరిమితి డిపాజిట్ రేటు పావు శాతం తగ్గి 8.75 శాతానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విషయానికి వస్తే, 46 రోజుల నుంచి ఏడాది కాల పరిమితి డిపాజిట్ల రేట్లను పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గించింది. తాజా రేట్లు ఐసీఐసీఐ విషయంలో నవంబర్ 28 నుంచీ అమల్లోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ విషయంలో ఇవి డిసెంబర్ 1 నుంచీ అమల్లోకి వచ్చాయి. కాగా యస్ బ్యాంక్ కూడా ఇదే తీరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రజత్ మోర్గా తెలిపారు. -
స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్
ముంబై: స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ పాల్గొన్నారు. మంగళవారం ముంబైలోని ఐసీఐసీఐ బ్యాక్బే రిక్లమేషన్ బ్రాంచ్ సమీపంలో ఆమె, ఇతర ఉద్యోగులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చందా కొచర్ వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐసీఐసీఐ బ్రాంచ్‌ల సమీపంలోని ప్రాంతాలను శుభ్రపరుస్తామని, ఈ కార్యక్రమం ఏడాది పొడవునా నిర్వహిస్తామని వివరించారు. పటిష్టమైన, పరిశుభ్రమైన భారత దేశాన్ని సాధించడానికి అందరూ కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఐసీఐసీఐ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. -
ibps RRBs CWE-III (Office Assistant) Model Paper
Directions (Q. 38 - 39): Study the following information carefully and answer the questions given below: (i) P × Q' means 'P is brother of Q' (ii)'P -Q' means 'P is sister of Q' (iii) 'P ÷ Q' means 'P is father of Q' (iv) 'P + Q' means 'P is mother of Q' 38. Which of the following means 'D is nephew of R'? 1) D × M ÷ R 2) R - M ÷ D 3) R - M ÷ D × T 4) R × M + D 5) None of these 39. Which of the following means 'M is maternal uncle of T'? 1) M × R + T 2) M × R ÷ T 3) T × J - N ÷ M 4) M - R + T 5) None of these 40. Pointing to a man Leena said "He is the son of my grandmother's only child". How is the man related to Leena? 1) Son 2) Brother 3) Cousin Brother 4) Data inadequate 5) None of these General Awareness 41. ICICI has recently launched its mobile banking service called mobile money with which of the following public service providers? 1) Vodafone 2) Aircel 3) Airtel 4) Tata Docomo 5) None of these 42. GDP growth in 2014-15 is estimated at ______ per cent year-on-year. 1) 5.4 - 5.9 2) 5.6 - 5.9 3) 5.4- 5.6 4) 4.5 -4.9 5) 4.6 -4.9 43. Development of new airports in ____ cities will be launched for implementation through Airport Authority of India or PPPs. 1) Tier I and Tier II 2) Tier II and Tier III 3) Tier I and Tier III 4) Tier I and Tier IV 5) Tier I and Tier V 44. The security which is a claim on the government and is a secured financial instrument guarantees certainty of both capital and interest is called? 1) Gilt-Edged Security 2) Call Money 3) Treasury Bills 4) Certificate of Deposits 5) All of these 45. Income Tax Deduction limit under Section 80-C raised to _______ . 1) Rs 1.5 lakh 2) Rs 1.6 lakh 3) Rs 1.7 lakh 4) Rs 2.5 lakh 5) Rs 2.6 lakh 46. Who is appointed as 41st Chief Justice of India? 1) Dr. Harsh Kumar Bhanwala 2) Rajendra Mal Lodha 3) S.K.Roy 4) J. M. Shanti Sundharam 5) Shashikanth Sharma 47. Govt. proposes to launch ___ prog-ramme to ensure broad band conne-ctivity at village level. 1) Digital India 2) Satellite India 3) Broadband India 4) Smart India 5) New India 48. Who is the Leader of the Opposition of Rajya Sabha? 1) Gulam Nabi Azad 2) Sonia Gandhi 3) Rahul Gandhi 4) Ambica Soni 5) None of the above 49. Who is the author of the book "Gandhi before India"? 1) Ravindranath Tagore 2) Ramchandra Guha 3) A.P.J Abdul kalam 4) Pele 5) Sunaina Singh 50. The Euro is not used in which of the following countries? 1) Germany 2) Italy 3) France 4) Norway 5) None of these 51. Who won the Indian Premier League (IPL) - 2014 ? 1) Rajasthan royals 2) Punjab kings 3) Chennai super kings 4) Kolkata Knight Riders 5) Sun rises 52. Which of the following relationship is incorrect in case of Locker facility: 1) Lessor- Lessee 2) Landlord-Tenant 3) Bailor-Bailee 4) Licensor- Licencee 5) None of these 53. Largest shareholder (in percentage shareholding) of a nationalized bank is ____ 1) RBI 2) NABARD 3) LIC 4) Govt. of India 5) IBA 54. RBI recently issued draft guidelines for implementation (BBPS) of an "any time -any where" bill payment system. What does BBPS stands for: 1) Barath Bill Payment Serves 2) Barath Bill Payment System 3) Barathiya Bill Payment system 4) British Bill payment System 5) None of these 55. Most important small scale industry of India is ___ 1) Agarbatti 2) Paper industry 3) Handloom 4) All the above 5) None of these 56. Project Namaskar launched by which bank as a part of financial inclusion __ 1) PNB 2) BOI 3) BOB 4) SBI 5) None of these 57. SEBI on 19th March 2014 inaugu-rated its local office at? 1) Pune 2) Shimla 3) Ranchi 4) Bhopal 5) Delhi 58. Madhya Pradesh Government's financial inclusion model is ____ 1) Vihari 2) Samriddhi 3) Paripurna 4) Akhshara 5) None of these 59. Which bank opened CSP (Customer Service Point) to extend financial inclusion targeting urban poor? 1) Andhra bank 2) SBI 3) SBH 4) Canara bank 5) Corporation bank 60. RBI pays interest on CRR balances of banks at _____. 1) Bank Rate 2) Repo Rate 3) Bank Rate minus 2% 4) Zero % 5) 5% 61. Statutory Liquidity Ratio (SLR) can be maintained in the following ways? 1) Cash 2) Gold 3) Unencumbered approved securities 4) All of these 5) None of the above 62. The Rate at which the domestic currency can be converted into foreign currency and vice-versa is known as the 1) Domestic Rate 2) Exchange rate 3) Bank rate 4) Fixed rte 5) None of these 63. Which credit card company has tied up the Railways to issue a credit cum loyalty card? 1) ICICI Cards 2) SBI Cards 3) ABN Amro Cards 4) Citibank 5) SBH cards 64. Who has won the 2014 Templeton Prize? 1) Dalai Lama 2) Desmond Tutu 3) Tomas Halik 4) Aung San Su Kyi 5) None of these 65. Which Indian shooter clinched a silver medal at the ISSF World Cup in Fort Benning, USA in March 2014? 1) Chain Singh 2) Pooja Ghatkar 3) Rahi Sarnobat 4) Heena Sidhu 5) None of these 66. Abdel Fattah el-Sisi became the President of which of the following countries in June 2014? 1) Yemen 2) Egypt 3) Iran 4) Libya 5) Syria 67. "The Substance and The Shadow" is the autobiography of which of the following actors? 1) Dev Anand 2) Rajesh Khanna 3) Dilip Kumar 4) Dharmendra 5) Aamir Khan 68. Bor Wildlife Sanctuary has been notified as the 47th Tiger Reserve of India. It is in? 1) Maharashtra 2) Odisha 3) Assam 4) Gujarat 5) Madhya Pradesh 69. Which team won the Deodhar Trophy Cricket recently in Visakhapatnam? 1) West Zone 2) North Zone 3) South Zone 4) Central Zone 5) East Zone 70. Which of the following countries ho-nored Shah Rukh Khan with Officer of the Legion of Honor recently? 1) Germany 2) France 3) South Korea 4) Italy 5) UK 71. Rani-Ki-Vav, an 11th century step well was accorded the UNESCO World Heritage Site status. It is in? 1) Rajasthan 2) Madhya Pradesh 3) Gujarat 4) Uttar Pradesh 5) Haryana 72. Who won the gold medal in the World Rapid Chess championship in Dubai in June 2014? 1) Magnus Carlsen 2) Viswanathan Anand 3) Fabiano Caruana 4) Hikaru Nakamura 5) None of these 73. Who visited China in June 2014 to attend the events to mark the 60th anniversary of Panchsheel agreement? 1) Pranab Mukherjee 2) Hamid Ansari 3) Narendra Modi 4) Sushma Swaraj 5) Arun Jaitley 74. Who is the Union Minister of Consumer Affairs, Food and Public Distribution? 1) Anantha Kumar 2) Anant Geete 3) Ramvilas Paswan 4) Radha Mohan Singh 5) Jual Oram 75. Who has been appointed as the Governor of Gujarat? 1) Kesri Nath Tripathi 2) Om Prakash Kohli 3) Balram Das Tandon 4) Padmanabha Acharya 5) Ram Naik 76. Which city hosted the 6th BRICS Summit in July 2014? 1) Durban 2) Rio de Janeiro 3) Moscow 4) Fortaleza 5) Cape Town 77. Nay Pyi Taw is the capital of which of the following countries? 1) Bangladesh 2) Vietnam 3) Cambodia 4) Laos 5) Myanmar 78. Nadine Gordimer of South Africa passed away in July 2014. She was a winner of Nobel Prize in which of the following fields? 1) Physics 2) Peace 3) Literature 4) Chemistry 5) Economics 79. Which of the following became the 1000th site to be included in the UNESCO World Heritage Site List in June 2014? 1) Iguazu National Park, Argentina 2) Great Barrier Reef, Australia 3) Ruins of Loropeni, Burkina Faso 4) Preah Vihear Temple, Cambodia 5) Okavango Delta, Botswana 80. Petra Kvitova defeated which of the following players in the final to win the 2014 Wimbledon women's singles tennis title? 1) Serena Williams 2) Venus Williams 3) Eugenie Bouchard 4) Maria Sharapova 5) Li Na Computer Knowledge 81. Which of the following is an example of non volatile memory? 1) VLSI 2) LSI 3) ROM 4) RAM 5) Hard disk 82. IEEE 802.16 popularly called ___ 1) Ethernet 2) Wi-Fi 3) WIMAX 4) Wireless Network 5) None of these 83. To protect system, there are how many security levels? 1) One 2) Two 3) Three 4) Four 5) Five 84. Java was originally invented by 1) Oracle 2) Microsoft 3) Novell 4) Sun 5) IBM 85. A small network making up the internet and also having a small number of computers with in it is called ___ 1) Host 2) Address 3) Sub domain 4) Domain 5) URL 86. The operating system of a computer serves as a software interface between the user and ___ 1) Software 2) Hardware 3) Processor 4) Compiler 5) RAM 87. Both the ALU and control section of CPU employ special purpose storage locations called: 1) Decoders 2) Buffers 3) Multiplexer 4) Registers 5) Flip flops 88. The address of the next instruction to be executed by the current process is provided by the ___ 1) CPU registers 2) program counter 3) process stack 4) pipe 5) coding counter 89. Which command combines the contents of one file with another? 1) Restore 2) Rename 3) Append 4) Add 5) Store 90. The ___ is the administrative section of the computer system. 1) Memory Unit 2) Input Unit 3) Central Processing Unit 4) Control Unit 5) Logic Unit 91. Coded entries which are used to gain access to a computer system are called 1) Codeword's 2) Entry codes 3) Entry words 4) Security commands 5) Data codes 92. What is the primary requisite of a good computer programmer? 1) Mathematical mind 2) Artistic mind 3) Logical mind 4) Scientific knowledge 5) Memory Knowledge 93. The errors that can be pointed out by the compiler: 1) Syntax errors 2) Internal errors 3) Semantic errors 4) Coding errors 5) Logical errors KEY 38) 3; 39) 1; 40) 2; 41) 5; 42) 2; 43) 1; 44) 1; 45) 1; 46) 2; 47) 1; 48) 1; 49) 2; 50) 4; 51) 4; 52) 3; 53) 4; 54) 2; 55) 3; 56) 1; 57) 3 ; 58) 2; 59) 2; 60) 4; 61) 4; 62) 2; 63) 2; 64) 3; 65) 4; 66) 2; 67) 3; 68) 1; 69) 1; 70) 2; 71) 3; 72) 1; 73) 2; 74) 3; 75) 2; 76) 4; 77) 5; 78) 3; 79) 5; 80) 3; 81) 3; 82) 3; 83) 4; 84) 4 ; 85) 1; 86) 2 ; 87) 4; 88) 2; 89) 3; 90) 3; 91) 4; 92) 3; 93) 5. (Continued in tomorrow's VIDYA) -
బ్యాంకింగ్.. ‘సెల్’చల్!
దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరుగుతుండటంతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు రెండు రెట్లు పెరగడం విశేషం. 2013-14 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ రూ. 3,190 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది రూ. 10,118 కోట్లు దాటింది. గతేడాది మొత్తం మీద జరిగిన లావాదేవీల విలువ రూ. 37,698 కోట్లు మాత్రమే. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగితే ఈ ఏడాది టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమీక్షా కాలంలో లావాదేవీల సంఖ్యలో కూడా భారీ వృద్ధి నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో 63 లక్షల లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 1.11 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో సగటు లావాదేవీ విలువ రూ. 5,145 నుంచి రూ. 9,198కి పెరగడం విశేషం. ప్రైవేటు బ్యాంకులే టాప్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులే ముందున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐ తప్ప మిగిలిన వాటిల్లో నామమాత్రపు లావాదేవీలే జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జూలై నెలలో రూ. 1,000 కోట్ల లావాదేవీలను నమోదు చేయడం ద్వారా ఈ మార్కును అందుకొన్న తొలి బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ రికార్డులకు ఎక్కింది. గతేడాది మొత్తం మీద రూ. 5,741 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ. 2,635 కోట్ల లావాదేవీలను నమోదు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబాంటీ బెనర్జీ తెలిపారు. గతేడాది మొదటి మూడు నెలల్లో రూ. 941 కోట్ల లావాదేవీలను ఐసీఐసీఐ బ్యాంక్ నమోదు చేసింది. ఈ ఏడాది మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ రూ. 2,269 కోట్లు, యాక్సిస్ రూ.1,826 కోట్లు, ఎస్బీఐ రూ.1,535 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి. బిల్లు చెల్లింపులే అధికం... మొబైల్ బ్యాంక్ ద్వారా జరుగుతున్న లావాదేవీల్లో ప్రధానంగా యుటిలిటీ బిల్లులు, మొబైల్ ఫోన్ రీ-చార్జ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్సే ప్రధానంగా నమోదవుతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు, ఖాళీ సమయంలో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండటం కూడా లావాదేవీలు పెరగడానికి కారణంగా బెనర్జీ పేర్కొన్నారు. రానున్న కాలంలో మొబైల్ బ్యాంక్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 15.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని, ఈ సంఖ్య 2017 నాటికి 48 కోట్లు దాటుతుందని గూగుల్ తాజా సర్వే వెల్లడించింది. -
డెబిట్ కార్డ్‌తోనూ ఈఎంఐ స్కీమ్
ముంబై: డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై సమాన నెలవాయిదా (ఈఎంఐ) స్కీమ్‌ను ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది. ఈ తరహా స్కీమ్ దేశంలో ఇదే మొదటిదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు.్ర కెడిట్ కార్డ్‌ల ద్వారా వస్తువులను ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయవచ్చని, కానీ డెబిట్ కార్డ్ ద్వారా వస్తువుల కొనుగోళ్లకు ఈఎంఐ స్కీమ్‌ను తొలిసారిగా అందిస్తున్నామని వివరించారు. అయితే సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కనీసం రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారే ఈ స్కీమ్‌కు అర్హులని తెలిపారు. మొదటగా ఈ స్కీమ్‌ను శామ్సంగ్ బ్రాండ్ ఉత్పత్తులకు ఆఫర్ చేస్తున్నామని, ఆ తర్వాత ఇతర బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించారు. ఈఎంఐలను మూడు/ఆరు/తొమ్మిద/ పన్నెండుగా ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈఎంఐ స్కీమ్‌కు సంబంధించి డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై 13 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వివరించారు. ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ స్కీమ్ కారణంగా 2.2 కోట్ల మంది ఐసీఐసీఐ డెబిట్ కార్దుదారులు పండుగల సీజన్ సందర్భంగా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పొందవచ్చని, కొనుగోళ్ల లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చని తెలిపారు. -
జెన్సర్ టెక్నాలజీస్ చేతికి ‘ప్రొఫెషనల్ యాక్సెస్ ’
న్యూఢిల్లీ: రిటైల్ ఈ-కామర్స్ సొల్యూషన్స్ అందించే ప్రాఫెషనల్ యాక్సెస్ సంస్థను మధ్య తరహా సాఫ్ట్వేర్ సంస్థ జెన్సర్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫ్రొఫెషనల్ యాక్సెస్(పీఏ) సంస్థతో ఒప్ప ందం కుదుర్చుకున్నామని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న జెన్సర్ టెక్నాలజీస్ గురువారం తెలిపింది. అయితే ఎంత మొత్తానికి పీఏ సంస్థను కొనుగోలు చేసింది వెల్లడించలేదు. అమెరికా, ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లోని మధ్య, భారీ రిటైల్ సంస్థలకు ఈ-కామర్స్ సొల్యూషన్స్‌ను న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఏ కంపెనీ అందిస్తోందని వివరించింది. ఈ సంస్థ కొనుగోలుకు కావలసిన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని పేర్కొంది. పీఏ ఆదాయం 3.8 కోట్ల డాలర్లని వివరించింది. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, న్యాయ సలహాదారులుగా భారత్‌లో నిషిత్ దేశాయ్ అసోసియేట్స్, అమెరికాలో స్టాల్ కోవెన్ క్రోలే ఆడిస్ ఎల్ఎల్సీలు వ్యవహరించాయని జెన్సర్ టెక్నాలజీస్ పేర్కొంది. -
పింఛన్ పాట్లు ఎప్పుడొస్తుందో!
2.47 లక్షల మంది ఎదురు చూపరు పండుటాకులపై కనికరం చూపని ప్రభుత్వం అర్ధనెల దాటుతున్నా అందని పింఛన్ అక్టోబరు నుంచి ఐరిస్ ఆధారంగా పంపిణీకి చర్యలు వేలిముద్రలు సరిపోని లబ్ధిదారులకు నిలుపుదల పింఛన్ కోసం ఎదురుచూస్తున్న 2.47 లక్షల లబ్ధిదారులు పండుటాకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పింఛన్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నా పాలకులకు కనికరం కలగడం లేదు. ఏ ఆదరువూ లేక సర్కారు ఇచ్చే పింఛన్‌పై ఆధారపడి బతుకు వెళ్లదీసే వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సగం నెల గడిచిపోయినా పింఛన్ అందక కొందరు అవస్థలు పడుతుంటే.. వేలిముద్రలు సరిపోలేదంటూ మరికొందరి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారం లేకుండా కేవలం పింఛన్‌పై ఆధారపడి జీవితం వెల్లదీస్తున్న పండుటాకులపై పాలకులు కనీసం కనికరం చూపడం లేదు. ఒకరోజు కాదు...రెండు రోజులు కాదు...ఏకంగా సగం నెల గడిచిపోతున్నా పింఛన్ అందించాలనే ఆలోచన అధికారులకు కలగడం లేదు. ఎందుకివ్వలేదని అడిగే వారు లేరు... ఫలానా సమయంలో ఇస్తామని కచ్చితంగా చెప్పే అధికారులూ కనిపించడం లేదు. వెరసి జిల్లాలో జూన్ నెల పింఛన్ ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లాకు సంబంధించి ఐసీఐసీఐ, సినో సంస్థలు గత కొన్ని నెలలుగా పింఛన్ పంపిణీ చేస్తున్నాయి. అయితే జూన్ నెలకు సంబంధించి జులై 1 నుంచి 5వ తేదీలోగా పంపిణీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు పంపిణీకి నోచుకోలేదు. పండుటాకుల కష్టాలపై అధికారులు దృష్టి సారించి పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. వేలి ముద్రలు సరిపోలేదని పలువురికి నిలుపుదల జిల్లాలో 2 లక్షల 47వేల 592 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఇందులో కొంతమందికి ఎన్నికల సమయంలో వరుసగా మూడు నెలలు పింఛన్ అందలేదు. కారణం ఫింగర్ ప్రింట్ (వేలిముద్రలు) మ్యాచ్ కాలేదని కంపెనీ ప్రతినిధులు పింఛన్‌ను నిలిపి వేశారు. వారందరికీ గతనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంపిణీ చేశారు. అయితే ఇప్పటికీ చాలామంది లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోకపోవడంతో పింఛన్ నిలుపుదల చేశారు. దాదాపు వారందరి పేర్లను కూడా లబ్ధిదారుల జాబితాలో నుంచి తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి పండుటాకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పంపిణీ కాని పింఛన్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 47 వేల 592 మంది లబ్ధిదారులు ఉండగా, అందులో వృద్ధులు 1 లక్ష 25 వేల 907 మంది ఉండగా, వికలాంగులు 30 వేల 781, వితంతువులు 65 వేల 699, అభయహస్తం కింద 16 వేల 316 మంది, చేనేత 8 వేల 869, కల్లుగీత కార్మికులు 20 మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు సంబంధిత మండల కేంద్రాల్లోని కార్యాలయాల వద్దకు వెళ్లి నిరీక్షించడం తప్ప పింఛన్ తీసుకున్న పాపాన పోలేదు. మున్సిపల్ కార్యాలయాలకు కూడా ప్రతిరోజు పింఛన్ దారులు వస్తున్నారు. అయితే, ఇప్పటికే ఒక్కొక్క లబ్ధిదారుడు మూడు, నాలుగుసార్లు వచ్చి వెళ్లారు. వీరికి ఆటో ఛార్జీలు దాదాపు రూ. 50-60 అవుతుండటంతో పింఛన్లో సగం సొమ్ము దీనికే పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ పంపిణీకి కసరత్తు జిల్లాలో ఇప్పటికే పింఛన్ పంపిణీ జరగక 15 రోజులు కావస్తున్న నేపథ్యంలో సోమవారమే కొంత మొత్తం ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయానికి అందింది. దీంతో జిల్లాలోని లబ్ధిదారులకు సత్వరమే పింఛన్ పంపిణీ చేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అక్టోబరు నుంచి ఐరిస్ ద్వారా పంపిణీకి చర్యలు ప్రస్తుత సీఎం చంద్రబాబు పింఛన్‌ను పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నా అది అక్టోబరు నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటూనే వీలైనంత మేర లబ్ధిదారులను తగ్గించే చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదంటూ లబ్ధిదారుల పింఛన్‌కు ఎగనామం పెడుతున్న అధికారులు అక్టోబరు నుంచి ఐరిస్ మ్యాచ్ అయితేనే పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అదికూడా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకుంటే ఐరిస్ ఖచ్చితంగా సరిపోయే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ రెండింటిలో ఏది మ్యాచ్ కాకపోయినా లబ్ధిదారుడి పేరు పింఛన్ జాబితాలో కనుమరుగు కావడం ఖాయం. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రిలో ఉండి రాలేని పరిస్థితి ఉంటే ఒక మెసెంజర్‌కు సంబంధించి కూడా ఫింగర్ లేదా ఐరిస్ పరీక్షలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఫండ్స్ ఫేవరెట్ షేరు ఐసీఐసీఐ
రెండో స్థానానికి ఇన్ఫోసిస్ - క్యూ4లో పెట్టుబడుల తీరిది - ఈ కాలంలో 13% ఎగసిన బ్యాంకు షేరు న్యూఢిల్లీ: గడిచిన క్వార్టర్(జనవరి-మార్చి)లో దేశీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐసీఐసీఐ బ్యాంకు షేరును పెట్టుబడులకు అత్యధికంగా ఎంపిక చేసుకున్నాయి. దీంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ విషయంలో వెనకబడినట్లు ఒక నివేదిక పేర్కొంది. మార్చి చివరికల్లా ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో చోటుచేసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల విలువ రూ. 9,152 కోట్లను తాకింది. ఇదే సమయంలో ఫండ్స్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ స్టాక్స్ విలువ రూ. 7,339 కోట్లకు పరిమితమైంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్‌స్టార్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ చివరికి ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల విలువ రూ. 8,194 కోట్లుకాగా, ఇన్ఫోసిస్ షేర్ల ఫోలియో విలువ రూ. 9,262 కోట్లుగా నమోదైంది. వెరసి ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఫండ్స్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇందుకు ఐసీఐసీఐ షేరు విలువ పుంజుకోవడానికి దోహదపడింది. ఈ కాలంలో ఐసీఐసీఐ షేరు 13%పైగా ఎగసిన సంగతిని ఈ సందర్భంగా మార్నింగ్‌స్టార్ ప్రస్తావించింది. నిజానికి ఈ కాలంలో ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ షేర్ల సంఖ్య తగ్గినప్పటికీ, మార్కెట్ విలువరీత్యా పెట్టుబడుల విలువలో మొదటి స్థానాన్ని పొందడం విశేషం! 5% జారిన ఇన్ఫీ క్యూ4లో ఇన్ఫోసిస్ షేరు 5%పైగా క్షీణించింది. కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు గతేడాది జూన్‌లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తిని తిరిగి చైర్మన్‌గా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశీ సాఫ్ట్వేర్ రంగ వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం అత్యున్నతస్థాయి అధికారుల రాజీనామాలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత రెండేళ్లలో కంపెనీ నుంచి 9 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగిన విషయం విదితమే. ఇటీవల ఇతర పోటీ కంపెనీలకు మార్కెట్ షేరును సైతం కోల్పోతూ వస్తోంది కూడా. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో డాలర్ల రూపేణా ఆదాయం 7-9% స్థాయిలో పుంజుకోవచ్చునంటూ కంపెనీ అంచనా(గెడైన్స్)ను ప్రకటించింది. అయితే ఇది ఐటీ పరిశ్రమ వృద్ధిపై నాస్కామ్ వేసిన 13-15% అంచనాలకంటే తక్కువే కావడం గమనార్హం. -
ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్
2014-15 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రుణాల పునర్వ్యవస్థీకరణ కూడా తగ్గొచ్చు. రిటైల్ రుణాల్లో ప్రస్తుతం వృద్ధి జోరు ఇదేవిధంగా కొనసాగనుంది. అదేవిధంగా నికర వడ్డీ మార్జిన్లు కూడా ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.2,652 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.2,304 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఫీజులు ఇతరత్రా రూపంలో లభించిన వడ్డీయేతర ఆదాయం భారీగా ఎగబాకడం... బ్యాంక్ లా భాల జోరుకు దోహదం చే సింది. కాగా, క్యూ4లో కంపెనీ మొత్తం ఆదా యం రూ.14,465 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.12,574 కోట్ల ఆదాయంతో పోలిస్తే 15 శాతం మేర వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదా యం క్యూ4లో 15 శాతం పెరుగుదలతో రూ.4,357 కోట్లకు చేరింది. ఇక వడ్డీయేతర ఆదాయం ఏకంగా 35 శాతం ఎగబాకి రూ.2,976 కోట్లుగా నమోదైంది. ఫీజుల రూపంలో రూ.1,974 కోట్లు(12 శాతం వృద్ధి), ట్రెజరీ ఆదాయం రూ.245 కోట్లు చొప్పున లభించాయి. ఇక అనుబంధ సంస్థల నుంచి బ్యాంకుకు రూ.541 కోట్ల భారీ డివిడెం డ్ మొత్తం జమ అయింది. పూర్తి ఏడాదికి ఇలా.... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ స్డాండెలోన్ నికర లాభం రూ.9,810 కోట్లకు ఎగసింది. 2012-13 ఏడాదిలో నమోదైన రూ.8,325 కోట్లతో పోలిస్తే లాభం 18% పెరిగింది. మొత్తం ఆదా యం విషయానికొస్తే... రూ.48,421 కోట్ల నుంచి 54,606 కోట్లకు(12%) వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన... మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రూ.2,724 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,492 కోట్లతో పోల్చిచూస్తే 9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.20,240 కోట్ల నుంచి రూ.21,653 కోట్లకు పెరిగింది. 7 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2013-14 పూర్తి ఏడాదికి లాభం రూ.9,604 కోట్ల నుంచి రూ.11,041 కోట్లకు(15% వృద్ది) ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.74,204 కోట్ల నుంచి రూ.79,564 కోట్లకు(7.2 శాతం అప్) పెరిగింది. నికర మొండిబకాయిలు పెరిగాయ్... మార్చితో ముగిసిన కాలానికి ఐసీఐసీఐ నికర మొండిబకాయిలు(ఎన్పీఏ)లు రూ.3,321 కోట్లకు(0.82 శాతం) పెరిగాయి. డిసెంబర్ చివరినాటికి రూ.3,121 కోట్లు(0.81%), క్రితం ఏడాది మార్చి చివరినాటికి రూ.2,234 కోట్లు(0.64%)గా నికర ఎన్పీఏలు నమోదయ్యాయి. కాగా, క్యూ4లో తాజాగా రూ.1,241 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. దీంతో స్థూల మొండిబకాయిలు మార్చి చివరినాటికి 3.03 శాతానికి చేరాయి. డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే దాదాపు అదేస్థాయిలోనే నమోదయ్యాయి. క్యూ4లో రూ.400 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోవడం దీనికి దోహదం చేసింది. కాగా, క్యూ4లో రూ.700 కోట్ల విలువైన ఎన్పీఏలను బ్యాంక్ ఖాతాలనుంచి తొలగించింది(రైట్ ఆఫ్). రూ.2,156 కోట్ల విలువైన రుణాలను పునర్వ్యవస్థీకరించడంతో 2013-14 పూర్తి ఏడాదికి ఈ విధమైన రుణాల మొత్తం రూ.10,558 కోట్లకు ఎగబాకింది. మరో 1,500 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ బాటలో ఉన్నాయి. 2012-13 మార్చి క్వార్టర్లో రూ.460 కోట్లుగా ఉన్న ఎన్పీఏలపై ప్రొవిజనింగ్ ... 2013-14 మార్చి క్వార్టర్లో రూ.714 కోట్లకు పెరగడంతో లాభాలపై ప్రభావం చూపింది. ఇతర ముఖ్యాంశాలివీ... 2013-14 పూర్తి ఏడాదికి ఐసీఐసీఐ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.23 డివిడెండ్‌ను ప్రకటించింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ క్యూ4లో 3.35 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం 0.22 శాతం పెరిగి 3.33 శాతానికి చేరింది. 2013-14 ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణాలు 17% వృద్ధి చెంది రూ.3,38,703 కోట్లకు పెరిగాయి. ప్రధానంగా రిటైల్ రుణాల్లో 23% వృద్ధి సాధించింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.3,31,914 కోట్లకు ఎగబాకాయి. అనుంబంధ సంస్థల విషయానికొస్తే... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం గ డచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,496 కోట్ల నుంచి రూ.1,567 కోట్లకు పెరిగింది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ నికర లాభం రూ.306 కోట్ల నుంచి రూ.511 కోట్లకు వృద్ధి చెందింది. క్యూ4లో బ్యాంక్ కొత్తగా 653 శాఖలు, 834 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. దీంతో మార్చినాటికి ఐసీఐసీఐ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 3,753కు, ఏటీఎంల సంఖ్య 11,315కు చేరాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 2.29% క్షీణించి రూ.1,269 వద్ద స్థిరపడింది. -
ఐసీఐసీఐ కొత్త యులిప్
ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ వెల్త్ ప్రొటెక్టర్ పేరుతో యూనిట్ ఆథారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్విటీలకు కేటాయిస్తూ.. ఇన్వెస్ట్ చేసిన అసలును రక్షించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారు గరిష్టంగా 60 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆరు ఏళ్లు దాటిన తర్వాత సగటు ఫండ్ విలువలో 0.25% లాయల్టీ అడిషన్, 10 ఏళ్లు నిండితే వెల్త్ బూస్టర్ పేరుతో అదనపు రాబడి ఈ పాలసీలోని ప్రత్యేక ఆకర్షణలు. -
ఒప్పందం మేరకే రుణమివ్వాలి
రియాల్టీ రంగంపై బ్యాంకులకు స్పష్టం చేసిన ఫోరం ఐసీఐసీఐకి మొట్టికాయ సాక్షి, హైదరాబాద్: రియల్టర్, వినియోగదారుడు, బ్యాంకు చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మాణ దశకు అనుగుణంగా మాత్రమే రుణం మొత్తాన్ని విడుదల చేయాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం బ్యాం కులకు స్పష్టం చేసింది. అలా కాకుండా రియల్టర్ పరపతి మేరకు నిర్మాణ దశను పట్టించుకోకుండా విడుదల చేసిన మొత్తాన్ని విని యోగదారుని నుంచి వసూలు చేసే అధికారం బ్యాంకులకు ఉండదని తేల్చిచెప్పింది. వినియోగదారునితో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా, నిర్మాణ దశను పరిశీలించకుండా హిల్‌కౌంటీ యాజమాన్యానికి రూ.63.90లక్షలు విడుదల చేసిన ఐసీఐసీఐ తీరుపై ఫోరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి బ్యాంకు రుణం మంజూరు చేయడాన్ని సేవల్లో లోపంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒప్పందానికి విరుద్ధంగా విడుదల చేసిన రుణానికి ఈఎంఐలను వసూలు చేసే హక్కు సదరు బ్యాంకుకు ఉండదని తెలిపింది. అయితే పిటిషనర్ బ్యాంకును ప్రతివాదిగా పేర్కొనని కారణం గా.. రూ.63.90 లక్షలను 12 శాతం వడ్డీతో, పరిహారంగా మరో రూ.లక్షను నాలుగు వారాల్లో చెల్లించాలని మేటాస్ హిల్‌కౌంటీ యాజమాన్యాన్ని ఆదేశించింది. హిల్‌కౌంటీతో చేసుకున్న ఒప్పందం మేరకు తాను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకొని డబ్బు చెల్లించినా ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయలేదని, తాను చెల్లించిన రూ.63.90 లక్షలను తిరిగి ఇప్పించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కృష్ణచైతన్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫోరం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2009 ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తిచేసి అప్పగించాల్సి ఉందని, అయితే సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు అరెస్టుతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. -
క్యాష్‌లెస్ ఓపీడీ వైద్య బీమా
దేశంలోనే తొలిసారిగా ఔట్ పేషెంట్ చికిత్సకి నగదు రహిత బీమా రక్షణ కల్పించే విధంగా ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఐ-హెల్త్ క్యాష్‌లెస్ ఓపీడీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలోని పాలసీదారులకు కంపెనీ ఒక హెల్త్కార్డ్ను జారీ చేస్తుంది. ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా ఎటువంటి నగదు లేకుండా నేరుగా చికిత్స చేయించుకోవచ్చు. ఇండియాలో జరుగుతున్న వైద్య చికిత్సా వ్యయంలో 60 శాతం ఔట్ పేషెంట్ విభాగానిదేనని, కాని దీనికి బీమా రక్షణ ఉండకపోవడంతో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ అండర్‌రైటింగ్ సంజయ్ దత్తా తెలిపారు. సంవత్సరానికి రూ.120 ప్రీమియం నుంచి అందుబాటులో ఉన్న ఈ పాలసీ ప్రస్తుతం గ్రూపు ఇన్సూరెన్స్కే ఇస్తున్నామని, త్వరలోనే వ్యక్తిగత పాలసీదారులకు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా ఏఐఏ మహాలైఫ్ గోల్డ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తూ గరిష్టంగా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పించే విధంగా మహాలైఫ్ గోల్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 15 ఏళ్లు మాత్రం ప్రీమి యం చెల్లించే ఈ పాలసీలో 10 ఏళ్లు నిండిన తర్వాత నుంచి మెచ్యూర్టీ వరకు ఏటా 5.5 శాతం రాబడిని మనీ బ్యాక్ రూపంలో అందిస్తుంది. 6వ ఏట నుంచి గ్యారంటీ లేని రాబడి కూడా ఉంది. అప్పుడే పుట్టిన వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. గ్యారంటీ పెన్షన్ పథకం ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఈజీ రిటైర్మెంట్’ పేరుతో యులిప్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ప్రీమియాన్ని 5, 10 ఏళ్ల పరిమిత కాలానికి లేదా పూర్తి పాలసీ కాలపరిమితి వరకు చెల్లించవచ్చు. ఈ పథకం రెండు రకాల ఫండ్స్‌ను అందిస్తోంది. బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకుంటే గరిష్టంగా 50% ఈక్విటీలకు మిగిలినది డెట్ పథకాలకు అందిస్తుంది. అదే సెక్యూర్ ఫండ్ పూర్తిగా 100 % డెట్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. -
ఎన్నికల కంటే ముందే 6,700కు నిఫ్టీ!
ముంబై: తాజాగా వెలువడ్డ నాలుగు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్‌నిస్తాయని బ్రోకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్(ఐ-సెక్) పేర్కొంది. వెరసి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ 6,700 పాయింట్లను తాకుతుందని అంచనా వేసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం కావడం విశేషంకాగా, గడిచిన శుక్రవారం(6న) నిఫ్టీ 6,260 వద్ద ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లభించిన నేపథ్యంలో వెనువెంటనే నిఫ్టీ 6,300 పాయింట్ల కొత్త రికార్డును నెలకొల్పుతుందని అభిప్రాయపడింది. 2008 జనవరిలో నిఫ్టీ ఇంట్రాడేలో 6,357ను తాకగా, ఈ నవంబర్ 3న 6,317 వద్ద ముగిసి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిరోధం కూడా అక్కడే: స్వల్ప కాలంలో సాంకేతికంగా నిఫ్టీకి 6,300 పాయింట్ల స్థాయి నిరోధాన్ని(రెసిస్టెన్స్) కల్పిస్తుందని ఐ-సెక్ అంచనా వేసింది. అయితే ఆపై నిఫ్టీ నిలదొక్కుకోవడమేకాకుండా 6,700 పాయింట్లను చేరుతుందని అభిప్రాయపడింది. ఇందుకు బీజేపీ సాధించిన విజయాలు కారణంగా నిలుస్తాయని ఐ-సెక్ సీఈవో అనుప్ బాగ్చీ చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ జోష్ కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకు చెందిన బ్రోకింగ్ సంస్థే ఐ-సెక్. అయితే ఈ ర్యాలీ స్వల్పకాలమే కొనసాగుతుందని, ఆపై ఫండమెంటల్స్ ఆధారంగా ట్రెండ్ ఉంటుందని పేర్కొంది.