స్టాక్స్ వ్యూ | stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Nov 21 2016 1:34 AM | Last Updated on Wed, Sep 19 2018 8:41 PM

స్టాక్స్ వ్యూ - Sakshi

స్టాక్స్ వ్యూ

 టాటా మోటార్స్
 బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ 
 ప్రస్తుత ధర: రూ.471  టార్గెట్ ధర: రూ.595
 
 ఎందుకంటే: టాటా మోటార్స్ ఆదాయం (కన్సాలిడేటెడ్) 7 శాతం వృద్ధితో రూ.65,900 కోట్లకు పెరిగింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) ఆదాయం 23 శాతం వృద్ధి సాధించింది. జేఎల్‌ఆర్ వాహన విక్రయాలు 19 శాతం పెరుగుదలతో 1,39,235కు పెరిగాయి. జేఎల్‌ఆర్ విభాగం ఇబిటా 10 శాతంగా ఉంది.   జేఎల్‌ఆర్ ఇటీవల ఎక్స్‌ఈ, ఎఫ్-పేస్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇక ల్యాండ్ రోవర్ త్వరలో ఈవోక్ కన్వర్టిబుల్,  కొత్త డిస్కవరీ మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది.పౌండ్ కరెన్సీ పతనం కావడం జేఎల్‌ఆర్‌కు లాభించనున్నది.
 
 కొన్ని ఇంజిన్ ప్లాట్‌ఫార్మ్‌లపైననే మరిన్ని మోడళ్లను అందించాలన్న వ్యూహం కారణంగా వ్యయాలు తగ్గనుండడం, చైనా జాయింట్‌వెంచర్‌ను పునర్వ్యస్థీకరించనుండడం, స్లోవేకియాలో కొత్త ప్లాంట్‌అండుబాటులోకి రానుండడం... వీటన్నింటి ఫలితంగా జేఎల్‌ఆర్ నికర లాభం 18 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. జేఎల్‌ఆర్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి సాధిస్తోంది. జేఎల్‌ఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను, కొత్త మోడళ్లను అందించనుండడంతో జేఎల్‌ఆర్ మార్కెట్ వాటా పెరుగుతోంది.  
 
 పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప కాలంలో దేశీయంగా అమ్మకాలపై ప్రభావం పడుతుంది. అయితే 95 శాతానికి పైగా వాణిజ్య వాహనాల విక్రయాలు రుణాల ద్వారానే అమ్ముడవుతున్నందున ఈ ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తున్నాం.  ఇక మరో నాలుగేళ్ల వరకూ ఏడాదికి రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నందున ప్రయాణికుల వాహన విక్రయాలు కూడా పుంజుకుంటాయని భావిస్తున్నాం. మొత్తం మీద అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరుగుతాయని అంచనా. 
 
 ఇంద్రప్రస్థ గ్యాస్
 బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ 
 ప్రస్తుత ధర: రూ.838  టార్గెట్ ధర: రూ.940
 ఎందుకంటే: నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్)లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ), పైప్‌డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ)లను సరఫరా చేస్తున్న ఏకై క కంపెనీ ఇది. వాహనాలకు సీఎన్‌జీని, హోటళ్లు, హాస్పిటల్స్‌కు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు  పీఎన్‌జీని సరఫరా చేస్తోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. సీఎన్‌జీ అవుట్‌లెట్‌లను పెంచడం, ఉత్తర ప్రదేశ్‌లో పీఎన్‌జీ అమ్మకాలు పుంజుకోవడం, ఎల్‌ఎన్‌జీ ధరలు బలహీనంగా ఉండడం తదితర కారణాల వల్ల అమ్మకాలు 12 శాతం పెరగడంతో నికర లాభం రూ.1,442 కోట్లకు ఎగసింది.
 
 అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.1,016 కోట్లు)తో పోల్చితే 42 శాతం వృద్ధి సాధించింది.  కొత్త సీఎన్‌జీ అవుట్‌లెట్‌లను ప్రారంభించడవల్ల నిర్వహణ పెట్టుబడులు పెరగడంతో మార్జిన్లు సాధారణంగానే ఉన్నాయి. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాలపై భారీగా పన్నులు విధించడం, సీఎన్‌జీ రేడియో ట్యాక్సీలకు మాత్రమే లెసైన్‌‌సలు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు కంపెనీకి ప్రయోజనం కలిగించేవే. త్వరలో హర్యానా మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. రహదారుల్లో సీఎన్‌జీ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయనున్నది. ధరలు పడిపోవడం వల్ల పారిశ్రామిక రంగం నుంచి పీఎన్‌జీ వినియోగం పెరుగుతోంది.
 
 పీఎన్‌జీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. రెండేళ్లలో రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 20 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం.  ఈ క్యూ2లో సీఎన్‌జీ అమ్మకాలు 12 శాతం, పీఎన్‌జీ అమ్మకాలు 13 శాతం చొప్పున పెరిగారుు. రెండేళ్లలో అమ్మకాలు 11 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement