Tata Motors
-
ఏటా పెట్టుబడి.. 2,000 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త వాణిజ్య వాహనాలు, యంత్ర పరికరాల అభివృద్ధిపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ఈడీ గిరీశ్ వాఘ్ వెల్లడించారు. ఇందులో ఎలక్ట్రిఫికేషన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, కనెక్టెడ్ వెహికిల్ ప్లాట్‌ఫామ్ వంటి నూతన సాంకేతికతలపై 40 శాతంపైగా వెచి్చస్తామన్నారు. సంస్థకు చెందిన వాణిజ్య వాహన విభాగం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఉద్గారాలను వెదజల్లని బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వంటి వివిధ సాంకేతికతలపై పని చేస్తోందని చెప్పారు. సున్నా ఉద్గారాల దిశగా పరివర్తన వెంటనే జరగదు కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నామని అన్నారు. ‘నగరాలు, సమీప దూరాలకు బ్యాటరీ వాహనాలు పనిచేస్తాయి. సుదూర ప్రాంతాలకు, అధిక సామర్థ్యానికి హైడ్రోజన్ వంటి సాంకేతికత అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ పరిష్కరించే సాంకేతికతలలో పెట్టుబడి పెట్టాం’ అని వివరించారు. హైడ్రోజన్ ట్రక్స్.. హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ట్రక్స్‌ను మార్చిలోగా పైలట్ ప్రాతిపదికన వినియోగిస్తామని గిరీశ్ వాఘ్ వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఐవోసీఎల్‌తో కలిసి కంపెనీ 18 నెలల పాటు మూడు రూట్లలో ఈ ట్రక్కులను నడుపనుంది. ఫలితాలను బట్టి వాహనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వాఘ్ పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసిన 15 ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ బస్‌లు ఐవోసీఎల్ 10 నెలలుగా వినియోగిస్తోందని వివరించారు. ఒకట్రెండేళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెప్పారు. -
నాలుగేళ్లలో 5 లక్షలమంది కొన్న కారు ఇదే
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.టాటా పంచ్ 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. -
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్‌పీవో 1618 బస్టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
టాటా సియెరా మళ్లీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సియెరా ఎస్యూవీ వచ్చే ఏడాది భారత రోడ్లపై పరుగుతీయనుంది. 2025 ద్వితీయార్థంలో ఈ మోడల్ రీ–ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాది పండుగల సీజన్ నాటికి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.తొలుత ఎలక్ట్రిక్ వర్షన్లో ఇది రంగ ప్రవేశం చేయనుంది. తర్వాత ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారిత సియెరా మార్కెట్లోకి రానుంది. అడాప్టివ్ టెక్ ఫార్వార్డ్ లైఫ్‌స్టైల్ (అట్లాస్) ప్లాట్‌ఫామ్‌పై సియెరా ఐసీఈ, అలాగే హారియర్ ఈవీలో ఉపయోగించిన జెన్2 ఈవీ ప్లాట్‌ఫామ్‌పై సియెరా ఈవీ రూపుదిద్దుకోనుందని సమాచారం.అడాస్ ఫీచర్లను జోడిస్తున్నట్టు తెలుస్తోంది. సియెరా కాన్సెప్ట్ వర్షన్‌ను 2020, 2023 ఆటో ఎక్స్పో వేదికల్లో టాటా మోటార్స్ ప్రదర్శించింది. అయితే తయారీకి సిద్దంగా ఉన్న వెర్షన్ ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు హ్యారియర్ ఈవీ 2025 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తోంది. -
టాటా మోటార్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,450 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు తగ్గడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,832 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,04,444 కోట్ల నుంచి రూ. 1,00,534 కోట్లకు వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,00,649 కోట్ల నుంచి రూ. 97,330 కోట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహన విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 11,700 కోట్ల ఆదాయం లభించగా.. అమ్మకాలు 6% నీరసించి 1,30,500 యూనిట్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. వాణిజ్య వాహన(సీవీ) అమ్మకాలు 20 శాతం క్షీణించి 79,800 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 11% తగ్గి 4,400 యూనిట్లకు చేరాయి. సీవీ బిజినెస్ ఆదాయం 14% తక్కువగా రూ. 17,300 కోట్లకు పరిమితమైంది. జేఎల్ఆర్ డీలా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్ ఆదాయం 6 శాతం నీరసించి 6.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అల్యూమినియం సరఫరాల తాత్కాలిక సమస్యలతో లాభాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. వీటికితోడు 6,029 వాహనాలను అదనపు నాణ్యతా సంబంధ పరిశీలనలకోసం నిలిపిఉంచినట్లు వెల్లడించింది. దీంతో డిమాండుకు అనుగుణంగా వాహన డెలివరీలను చేపట్టలేకపోయినట్లు తెలియజేసింది. ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి కోసం యూకే హేల్ఉడ్ ప్లాంట్‌పై 25 కోట్ల పౌండ్లను ఇన్వెస్ట్ చేసినట్లు జేఎల్ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో 1.7 శాతం నష్టంతో రూ. 806 వద్ద ముగిసింది. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
అప్పుడు భారీ బుకింగ్స్.. ఇప్పుడు రికార్డ్ సేల్స్
ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న 'టాటా టియాగో ఈవీ' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 50,000 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన టియాగో ఈవీ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ మోడల్.సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన టాటా టియాగో ఈవీ కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ అందుకుంది. ఇప్పుడు అమ్మకాల్లో 50వేలు దాటేసింది. డెలివరీలు ప్రారంభమైన మొదటి నాలుగు నెలల కాలంలో 10వేల యూనిట్ల టియాగో ఈవీలను విక్రయించిన కంపెనీ మరో 17 నెలల్లో 40000 యూనిట్ల విక్రయాలను సాధించగలిగింది.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనటియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 250 కిమీ రేంజ్ అందించే 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 315 కిమీ రేంజ్ అందించే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు 55 కేడబ్ల్యుహెచ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న టాటా మోటార్స్ సరసమైన మోడల్ టాటా టియాగో ఈవీ ప్రారంభ ధరలు రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్ఇన్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రారతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
టాటా ప్రతీకారం అలా తీరింది..!
దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్‌నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.టాటా కలను ఎగతాళి చేశారు..కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్‌ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.అసలే టాటా గ్రూప్‌నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కోసం డెట్రాయిట్కు వెళ్లారు.అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్‌కి తిరిగొచ్చేశారు.ప్రతీకారం ఇలా తీరింది..తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది. -
రూ.9000 కోట్ల పెట్టుబడి.. 5000 ఉద్యోగాలు: టాటా మోటార్స్
టాటా మోటార్స్ తమిళనాడులోని రాణిపేటలో సరికొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదుపాయంలో టాటా మోటార్స్, జేఎల్ఆర్ రెండింటికీ వాహనాలను తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టాటాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.2024 మార్చిలో టాటా మోటార్స్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. కంపెనీ నిర్మించనున్న కొత్త ప్లాంట్‌లో ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్, లగ్జరీ వాహనాలతో సహా మా తర్వాతి తరం కార్లు, ఎస్‌యూవీలకు త్వరలో పూర్తికానున్న ప్లాంట్ నిలయంగా మారుతుంది. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ.. వివిధ స్థాయిల్లో మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.I can proudly say that Tamil Nadu leads India in both automobile production and #EV manufacturing.With a 35% share of the nation’s total automobile output and 40% of all EVs sold, we are pivotal in shaping India’s mobility future.@TataMotors, along with industry giants like… pic.twitter.com/pdZ47rcel8— M.K.Stalin (@mkstalin) September 28, 2024 -
నెక్సాన్ సీఎన్జీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ టర్బోచార్జ్డ్ ఐసీఎన్జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనమిది వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.99 లక్షలతో ప్రారంభమై రూ.14.59 లక్షల వరకు ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో తయారైంది. కేజీకి 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఫీచర్లు. 321 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టాప్ వేరియంట్‌కు 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో హెడ్‌లైట్, ఆటో వైపర్స్ వంటివి జోడించారు. ఈవీ 489 కిలోమీటర్లు.. టాటా మోటార్స్ తాజాగా 45 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ధర రూ.13.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 48 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టచ్ బేస్డ్ ఏసీ ప్యానెల్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు జోడించారు. కాగా, టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్‌ను రూ.17.19 లక్షల ధరతో ప్రవేశపెట్టింది. -
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది. -
భారత్‌లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
టాటా కర్వ్ ఈవీ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్.ఈవీ ఎస్యూవీ కూపే విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.49 లక్షలతో ప్రారంభమై రూ.21.25 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ఈ కారు తొలిసారిగా దర్శనమిచ్చింది. కర్వ్.ఈవీ చేరికతో టాటా మోటార్స్ ఖాతాలో ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్య అయిదుకు చేరుకుంది. 123 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కర్వ్. ఈవీలో పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 502 కిలోమీటర్లు, 55 కి.వా.అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 585 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. భారత్ ఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇవీ అదనపు ఫీచర్లు.. 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్‌తో లెవెల్–2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోహోల్డ్‌తో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 18 అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇతర హంగులు. 40 నిమిషాల్లో బ్యాటరీ 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. కర్వ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్‌ను సెప్టెంబర్ 2న ఆవిష్కరిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. లక్ష టాటా ఈవీలు భారత రోడ్లపై పరుగెడుతున్నాయన్నారు. కంపెనీకి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో 70% వాటా ఉందన్నారు. -
15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీ.. కొత్త ఈవీ లాంచ్
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా కర్వ్ (Tata Curvv) ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ (EV)తో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఐసీఈ వెర్షన్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది.టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 45 kWh ప్యాక్ 502 కిమీ రేంజ్, 55 kWh ప్యాక్ 585 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. వాస్తవ పరిస్థితులలోకి వచ్చేసరికి ఇవి వరుసగా 350 కిమీ, 425 కిమీల వరకు రేంజ్‌ని అందిస్తాయని అంచనా. టాటా కర్వ్ ఈవీ 45 (Tata Curvv EV 45) ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 19.29 లక్షల మధ్య ఉండగా, కర్వ్ ఈవీ 55 (Curvv EV 55) ధర రూ. 19.25 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్య ఉంది.ఇది 1.2C ఛార్జింగ్ రేట్‌తో వచ్చింది. అంటే కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. అదనంగా, Curvv EV వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఫంక్షన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, పాదచారులను అప్రమత్తం చేసే అకౌస్టిక్ అలర్ట్ వంటివి ఉన్నాయి. దీంతోపాటు లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఉంది.ఇక టాటా కర్వ్ ఐసీఈ (Curvv ICE) మూడు ఇంజన్ ఆప్షన్లు అందిస్తుంది. రెండు పెట్రోల్‌తో నడిచేవి కాగా ఒకటి డీజిల్‌తో నడిచేది. పెట్రోల్ వేరియంట్లలో 225 Nm టార్క్‌ను అందించే 125 hp కొత్త హైపెరియన్ GDi ఇంజన్ ఇచ్చారు. డీజిల్ ఇంజన్ టాటా లైనప్‌లో మొదటిసారిగా డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈవీ, ఐసీఈ రెండు వెర్షన్లు 18-ఇంచ్ వీల్స్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్, 450 mm వాటర్-వేడింగ్ డెప్త్‌తో ఉన్నాయి. -
టాటా మోటార్స్ లాభం జంప్
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 74 శాతం జంప్ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్ క్వార్టర్లో జేఎల్ఆర్ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా మోటార్స్ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది. కంపెనీ విభజనకు బోర్డు ఓకే... టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని టాటా మోటార్స్ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్‌సీవీ, టీఎంఎల్ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది. -
ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణ
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగుల భవిష్య నిధిని ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే అంశంపై చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. గతంలో కంపెనీ చెల్లించిన ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్‌ను తిరిగి సంస్థ అకౌంట్లో జమ చేయాలని కోరుతుంది. అయితే సంస్థలోని ఉద్యోగులు, కంపెనీ ఆర్థికస్థితికి సంబంధించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ సమర్పించాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆగస్టు 8న విచారణ జరగనుంది.టాటా మోటార్స్ 2019-20, 2020-21, 2021-22 వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలను చవిచూసింది. దాంతో యాక్చురియల్ వాల్యుయేషన్(ఆస్తులు, ఖర్చులను పోల్చి చూసే విశ్లేషణ పత్రం) ద్వారా పెన్షన్ ఫండ్ చెల్లింపులను రద్దు చేయాలని కోరింది. 2019లో కంపెనీ మినహాయింపు పొందిన పెన్షన్ ఫండ్‌ను సరెండర్ చేయడానికి ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసింది.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?భవిష్య నిధికి సంబంధించిన కార్పస్ బదిలీకి ఈపీఎఫ్ఓ అంగీకరించింది. కానీ, అధికారులు పెన్షన్ స్కీమ్ వివరాలను కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ కార్పస్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. గతంలో కంపెనీ సమర్పించిన నగదు బదిలీని అనుమతించడానికి అవసరమయ్యే నిర్దిష్ట ఖాతాల సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ అంశం ఆగస్టు 8న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
రెండేళ్ల తరువాత లాంచ్‌కు సిద్దమవుతున్న కారు ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సుమారు రెండేళ్ల తరువాత ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ కారును ఆవిష్కరించింది. ఇది ఆగష్టు 7న భారతీయ విఫణిలో లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 2022 లో కాన్సెఫ్ట్ మోడల్‌గా కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డు మీదికి రానుంది.కంపెనీ లాంచ్ చేయనున్న ఈ మిడ్ సైజ్ SUV పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. ఈ కారు ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుతుంది. ఫ్రంట్ ఫాసియా కొంతవరకు హారియర్, సఫారీకి మాదిరిగా ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చూడచక్కగా ఉంటుంది.టాటా కర్వ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ బేస్డ్ హెచ్‌విఎసి కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందవచ్చని సమాచారం. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.టాటా కర్వ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నాము. ఎలక్ట్రిక్ మోడల్ 450 కిమీ రేంజ్ అందించడానికి ఉపయోగపడే బ్యాటరీ ప్యాక్ అందిస్తుందని సమాచారం. -
ఆటోమోటివ్ రంగంలో 4,000 మందికి శిక్షణ!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్, నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్)లోని 4,000 మంది విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ‘జాతీయ విద్యా విధానం 2020’కి అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరునలను తయారు చేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌ల్లో 25 ‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్స్’ ప్రారంభించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది.టాటా మోటార్స్ సీఎస్ఆర్ హెడ్ వినోద్ కులకర్ణి మాట్లాడుతూ..‘విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 25 ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వీటిని సిద్ధం చేసి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్ ల్యాబ్‌ల్లో ఏటా 4,000 మందికి ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 30% మంది బాలికలు ఉండడం విశేషం. ప్రాక్టికల్ ఆటోమోటివ్ స్కిల్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కోసం తగిన విధంగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు’ అని తెలిపారు.‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన అన్ని సాధనాలు ఏర్పాటు చేశాం. సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యార్థులకు (9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) లోతైన విషయ పరిజ్ఞానానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. క్లాస్‌రూం ట్రెయినింగ్తో పాటు టాటా మోటార్స్ ప్లాంట్లను సందర్శించడం, సర్వీస్, డీలర్షిప్ నిపుణులతో చర్చించడం, వారి ఉపన్యాసాలు వినడం వల్ల మరింత ఎక్కువ సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాటా మోటార్స్, ఎన్వీఎస్ నుంచి జాయింట్ సర్టిఫికేట్లను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతిభ చూపిన వారికి టాటా మోటార్స్ పూర్తి స్టైపెండ్ అందించి ఉద్యోగ శిక్షణతో కూడిన డిప్లొమా ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయిన తర్వాత టాటా మోటార్స్‌లో విద్యను కొనసాగించాలనుకునేవారు ఇంజినీరింగ్ సంస్థలతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ పట్టా పొందే వీలుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా సంస్థలో ఉద్యోగం కూడా పొందవచ్చు’ అని వివరించారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?2023లో ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) నిర్వహించిన ‘నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్’లో ఈ ప్రోగ్రామ్ నుంచి 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 17 మంది పోటీలో రెండో దశ వరకు చేరుకున్నారు. పుణెలోని స్కిల్ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాత్మక శిక్షణలో భాగంగా ఇ-రిక్షాను కూడా ఆవిష్కరించారు. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్‌యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
60 లక్షల ప్యాసింజర్ వాహనాలు
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు. కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్.. వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్‌కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్‌గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్‌యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్గ్రేడ్లు కొన్నేళ్లుగా ట్రెండ్‌గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. అత్యంత విఘాతం..సీఏఎఫ్ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్‌ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. -
ఈ కంపెనీ వాహనాలు ఇప్పుడే కొనేయండి.. లేటయితే..
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ వాహనాలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా తమ వాహనాల రేట్లను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ బుధవారం తెలిపింది.టాటా మోటార్స్ ప్రస్తుతం కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. జెన్ నెక్ట్స్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియాల్లో ఈ వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ వాహనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ చివరిసారిగా మార్చిలో తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచింది.2024 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఆదాయం 52.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టాటా మోటార్స్ షేరు కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. 26.6 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేరు ప్రస్తుతం (బుధవారం మధ్యాహ్నం) రూ.983 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా ఇది నిరంతరాయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పలుమార్లు రూ.1000 మార్కును దాటింది. -
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
భారత్‌లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.