ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న 'టాటా టియాగో ఈవీ' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 50,000 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన టియాగో ఈవీ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ మోడల్.
సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన టాటా టియాగో ఈవీ కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ అందుకుంది. ఇప్పుడు అమ్మకాల్లో 50వేలు దాటేసింది. డెలివరీలు ప్రారంభమైన మొదటి నాలుగు నెలల కాలంలో 10వేల యూనిట్ల టియాగో ఈవీలను విక్రయించిన కంపెనీ మరో 17 నెలల్లో 40000 యూనిట్ల విక్రయాలను సాధించగలిగింది.
ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
టియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 250 కిమీ రేంజ్ అందించే 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 315 కిమీ రేంజ్ అందించే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు 55 కేడబ్ల్యుహెచ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న టాటా మోటార్స్ సరసమైన మోడల్ టాటా టియాగో ఈవీ ప్రారంభ ధరలు రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
Comments
Please login to add a commentAdd a comment