భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గత నెలలో కంపెనీ 79,705 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి మునుపటి కంటే 2.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరి నెలలో 77,733 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
గత నెల దేశీయ విక్రయాల మొత్తం 78,006 యూనిట్లు కాగా ఇదే నెల గత సమత్సరంలో 73,875 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 6 శాతం పెరిగింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు, ప్యాసింజర్ వాహన విక్రయాలలో కూడా మంచి పురోగతిని సాధించింది.
భారతదేశంలో గత నెల మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు (ఎలక్ట్రిక్ వాహాలతో కలిపి) 42,862 యూనిట్లు. 2022 ఇదే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మొత్తం 39,981 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా గతేడాదికంటే 7 శాతం పెరిగాయి. మొత్తం మీద 2023 ప్రారంభం నుంచి టాటా మోటార్స్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment