ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్‌సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment