auto mobile
-
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
దస్తన్ ఆటో వరల్డ్ కార్స్ మ్యూజియం - పాతకాలపు కార్ల అడ్డా
-
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి. -
భారత్‌లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో తన మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భారత్‌లో టెస్లా ఇకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పియూష్ గోయల్ ప్రకారం..మస్క్ భారత్ ఆటోమొబైల్ రంగం లాభదాయకమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారే నమ్మకం తమకు ఉందన్నారు. తద్వారా అన్ని ప్రధాన కంపెనీలు భారత్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశం సాధించిన పురోగతిని ప్రపంచం గమనించిందని ఉద్ఘాటించారు. -
భారత్‌లో టెస్లా కార్ల తయారీ షురూ.. ఆ మోడల్ పేరు ఇదేనా..?!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్‌లో వచ్చే ఏడాది కార్ల తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలో ‘రెడ్‌వుడ్’ అనే పేరుతో కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టెస్లా 2025 మధ్యలో ‘రెడ్‌వుడ్’ కోడ్‌నేమ్‌తో కొత్త 'మాస్ మార్కెట్' ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రాయిటర్స్ ప్రకారం, రాబోయే మోడల్‌లు ప్రారంభ కారు ధర 25వేల డాలర్లతో చవకైన కార్లను విడుదల చేసి చైనాకు చెందిన బీవైడీ తయారు చేసే అధిక ధరలతో కూడిన ఈవీ కార్ల కంటే పెట్రోల్ వేరియంట్ కార్లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని టెస్లా యాజమాన్యం భావిస్తున్నది. ఎలాన్ మస్క్ తొలిసారి 2020లో 25 వేల డాలర్ల ధరతో కార్లను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, అమెరికాలో టెస్లా బడ్జెట్ కారు మోడల్ 3 సెడాన్ ప్రారంభ ధర 38,990 డాలర్లుగా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఈ కార్లను అమెరికాతో పాటు భారత్‌లో తయారు చేస్తారా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజా వణుకుతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతుంది. నగరంలోని మార్చురీలు నిడిపోయాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. హమాస్‌ను తుద ముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సమీపంలో దాడులకు తెగబడ్డారు. దీంతో సామాన్యులు తమ ప్రాణాల్ని కాపాడుకోడవం కోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు. అంతటి భయానక వాతావరణంలో హమాస్ టెర్రరిస్ట్‌ల బీభత్సం సృష్టిస్తూ కురించిన బుల్లెట్ల వర్షం టెస్లా ఎలక్ట్రిక్ కార్ తన ప్రాణాలు కాపాడిందంటూ ఆ కారు ఓనర్ గద్గద స్వరంతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లా (walla) ఓ కథనాన్ని ప్రచురించింది. మెషిన్ గన్స్‌తో బీభత్సం హమాస్ దాడి ప్రారంభమైన సమయంలో కారు యజమాని టెస్లా మోడల్ 3 కారులో తప్పించుకునేందుకు ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే, ఊహించని విధంగా అతనికి హామాస్ దాడి ప్రారంభమైన సమయంలో మరో ప్రాంతానికి వెళుతుండగా కలాష్నికోవ్స్ రైఫిల్స్ ,భారీ మెషిన్ గన్స్‌తో టెర్రరిస్టులు వస్తున్న కారు ఎదురు పడింది. ఎలక్ట్రిక్ కారని వాళ్లకి తెలియదు అంతే టెర్రరిస్టుల వాహనం తనవైపుకు దూసుకు వచ్చింది. రెప్పపాటులో తనది ఎలక్ట్రిక్ కారు (టెస్లా మోడల్ 3) అని తెలియకపోవడంతో ఈవీలో లేని ఇంజన్ ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కారుపై కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంక్ పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కార్ కావడంతో ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాడు. వాళ్ల బుల్లెట్లు నన్ను ఏం చేయలేకపోయాయ్ అతని టైర్లను కాల్చినప్పటికి తన కారు యాక్సిలరేటర్‌ను రేజ్ చేసి డ్యూయల్-డ్రైవ్ ఫీచర్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకునేందుకు సాయం చేసిందని చెప్పాడు. పైగా, ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు బ్యాటరీ వెడెక్కలేదు. టెస్లా కారులో ఉన్న తనని టెర్రరిస్ట్‌లు కురిపించిన బుల్లెట్లు సైతం తనని ఏం చేయలేకపోయానని అన్నారు. అతని భార్య టెస్లా యాప్ ద్వారా తన కారు లొకేషన్, ఎమర్జెన్సీ రూమ్‌ల గురించి సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు చెప్పాడు. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లోని సూపర్‌చార్జర్ల గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని టెస్లా సూపర్ఛార్జర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. I think he deserves an highland. looking for the dashcam videos as well. pic.twitter.com/DJhrGwBubg — Michael Lugassy (@mluggy) October 12, 2023 -
ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!
Afghanistan Simurgh Super Car: ఈ నెల 5 నుంచి జెనీవాలో ప్రారంభమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో గురించి అందరికి తెలిసిందే. ఖతార్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఈ షోలో ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక సూపర్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మొదటి చూపులోనే చూపరుల మదిదోచిన ఈ సూపర్ కారు తాలిబన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్మించిన సూపర్‌కార్ మాడా 9 ఆధారంగా తయారైనట్లు తెలుస్తోంది. కాబూల్‌కు చెందిన తయారీ సంస్థ ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ (ATVI)చే నిర్మితమైన ఈ కారుకి 'సిముర్గ్' అని పేరు పెట్టారు. సిముర్గ్ కారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొట్టమొదటి స్వదేశీ సూపర్‌కార్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటోమోటివ్ ఈవెంట్లలో ఒకటైన జెనీవా మోటార్ షోలో ఈ సూపర్‌కార్ ఎంతోమంది ఔత్సాహికులను ఆకర్షించింది. 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు.. బ్లాక్ కలర్ పెయింట్ థీమ్ కలిగిన ఈ కారుని 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో కరోలా నుంచి తీసుకున్న ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. అయితే దీని సాంకేతిక వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. బహుశా త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ విషయానికి వస్తే.. ఈ సూపర్ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఫ్రంట్ స్ప్లిటర్, పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ ఫెండర్లు, ఎయిర్ ఇన్‌టేక్ కోసం ప్రత్యేకంగా తయారైన సైడ్ ప్రొఫైల్, ఎల్ఈడీ టెయిల్లైట్లు, బోల్డ్-లుకింగ్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఏఐ చాట్‌బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే? మోటార్ షోలో ఎంతోమందిని అలరించిన సిముర్గ్ దాని ఇతర మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న కారు కేవలం ప్రోటోటైప్ దశలో ఉంది. దీనిని ఉత్పత్తి చేయడానికి తయారీదారుకు బలమైన ఆర్థిక మద్దతు అవసరం ఉంది, కావున ఈ సూపర్ తయారీ ఎప్పుడనేది తయారీదారు వెల్లడించలేదు. -
IAA MOBILITY 2023: ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ షో - ఔరా అనిపిస్తున్న బ్రాండెడ్ కార్లు (ఫోటోలు)
-
ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులకు ముఖ్య గమనిక!
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, ఓలా, హీరో మోటో కార్ప్ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్1, ఎస్1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. చదవండి👉 ‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా -
ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!
హీరో కరిజ్మా బైక్ మళ్లీ వస్తోంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పాత బైక్‌లన్నీ ఇప్పుడు సరికొత్త హంగులు, ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా ఒకప్పుడు బాగా ఆదరణ పొందిన కరిజ్మా బైక్‌ను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు! హీరో కరిజ్మా బైక్ దాని స్పోర్టీ లుక్స్, పెర్ఫార్మెన్స్తో లాంచ్ అయిన వెంటనే భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలో హీరో కరిజ్మా అత్యంత ఆకర్షణీయమైన మోటార్‌సైకిళ్లలో ఒకటి. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా ZMR విక్రయాలు అప్పట్లో భారీగా జరిగాయి. ఆ తర్వాత ఆ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది. చాలా బైక్ తయారీ సంస్థలు ఇటీవల పాత మోడళ్లను పునరుద్ధరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరిజ్మా బైక్‌ను కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చేందుకు హీరో సంస్థ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో కరిజ్మా 2023 కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ప్రస్తుతం తయారీలో ఉన్నట్లు రష్లేన్ నివేదించింది. కరిజ్మా 2023 టెస్ట్ మ్యూల్ చిత్రాలను కూడా షేర్ చేసింది. అత్యంత ఆదరణ పొందిన ఏ బైక్ అయినా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తుంది. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అంత ఆదరణ పొందిన ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్ రీలాంచ్ చేయనుంది హీరోమోటోకార్ప్. 2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడిదే కొత్త లిక్విడ్ కూల్డ్ 210సీసీ ఇంజన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్‌కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీ ఇవ్వనుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడలన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. కరిజ్మా మోడల్ని నిలిపివేసిన తర్వాత హీరో ఎక్స్ట్రీమ్ (Xtreme 200S) బైక్ ని లాంచ్ చేసింది. అయితే కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటిని కూడా హీరో సంస్థ నిలిపివేసింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ ప్రయాణం.. కారుపైనే కరెంటు ఉత్పత్తి!
ఎలక్ట్రిక్ కార్ల వాడుక ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్న దశలోనే నెదర్లాండ్స్‌కు చెందిన ‘స్క్వాడ్ మొబిలిటీ’ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి సోలార్ కారును రూపొందించింది. నగరాల్లో రవాణాకు అనువుగా చిన్నగా ఉండేలా రూపొందించిన ఈ కారు పైకప్పు మీద అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఈ విద్యుత్తు ద్వారా ఇంజిన్‌ను నడిపే బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇందులోని బ్యాటరీ ఒకసారి పూర్తిగా చార్జ్ అయితే, నిరాటంకంగా వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో దీనిని ప్రదర్శించారు. వచ్చే ఏడాది ఈ సోలార్ కారు మార్కెట్లోకి విడుదల కానుంది.ప్రీఆర్డర్‌పై ఈ కార్లు తయారు చేస్తున్నట్లు ‘స్క్వాడ్ మొబిలిటీ’ తెలిపింది. దీని ధరలు మోడల్స్, సౌకర్యాలను బట్టి 6250 డాలర్ల (రూ.5.16 లక్షలు) నుంచి మొదలవుతాయి. -
2023 ఫిబ్రవరి అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: ఏకంగా..
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గత నెలలో కంపెనీ 79,705 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి మునుపటి కంటే 2.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరి నెలలో 77,733 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత నెల దేశీయ విక్రయాల మొత్తం 78,006 యూనిట్లు కాగా ఇదే నెల గత సమత్సరంలో 73,875 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 6 శాతం పెరిగింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు, ప్యాసింజర్ వాహన విక్రయాలలో కూడా మంచి పురోగతిని సాధించింది. భారతదేశంలో గత నెల మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు (ఎలక్ట్రిక్ వాహాలతో కలిపి) 42,862 యూనిట్లు. 2022 ఇదే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మొత్తం 39,981 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా గతేడాదికంటే 7 శాతం పెరిగాయి. మొత్తం మీద 2023 ప్రారంభం నుంచి టాటా మోటార్స్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
షాకింగ్ న్యూస్.. ఓలా బ్యాటరీ కొనాలంటే అంత చెల్లించాలా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ బాగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రారంభం నుంచి కొన్ని సమస్యల ఉన్నప్పటికీ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. తరుణ్ పాల్ అనే వ్యక్తి ట్విటర్లో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి. కావున వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 వరకు (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే, తరుణ్ పాల్ చెప్పినట్టు ఓలా బ్యాటరీ ధరలు ఎంతమేరకు ఉంటాయనేది క్లారిటీ లేదు. అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. -
వచ్చేస్తోంది, మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 9న థార్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కారును మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే తొలిసారి మహీంద్రా సంస్థ థార్ వేరియంట్ కారును 2010లో వాహనదారులకు పరిచయం చేసింది. 13 ఏళ్ల నుంచి మార్కెట్లోకి ఆ సంస్థ నుంచి లేదంటే ఇతర సంస్థల నుంచి లగ్జరీ కార్లు విడుదలైన థార్ వేరియంట్ కార్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మహీంద్రా వరుసగా థార్ వేరియంట్ కార్లపై డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అదే వెహికల్‌ను మార్పులు, చేర్పులు చేసి విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన థార్ కార్స్ కొనుగోలు దారుల్ని విపరీంగా ఆకట్టుకోగా.. రేపు (జవనరి 9న) విడుదల కానున్న ఈ లేటెస్ట్ థార్ వేరియంట్ ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కారు ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే? పలు ఆటోమొబైల్ బ్లాగ్స్ కథనాల మేరకు.. థార్ ఆర్డబ్ల్యూడీలో 4వీల్ డ్రైవ్ వెర్షన్‌కి సమానంగా 2 వీల్ డ్రైవ్ వెర్షన్ ఉండనుంది. ప్రత్యేకంగా 4*4 బ్యాడ్జ్ మీద కార్ రేర్ ఫెండర్స్ (వెహికల్ టైర్లపై ఉండే షేప్) తో బ్లేజింగ్ బ్రోంజే కలర్స్‌తో పరిచయం కానుంది. ఇప్పటికే ఈ తరహా వేరియంట్ కలర్స్ ఎక్స్‌యూవీ 300 టర్బోస్పోర్ట్లో కార్లలో సైతం లభ్యం అవుతున్నాయి. 4*2 వెర్షన్లో మాత్రం కార్ బాడీ కంప్లీట్‌గా ఎవరెస్ట్ వైట్ కలర్స్‌తో కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు కారు లోపల రేర్ వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వెర్షన్ సెంటర్ కన్సోల్‌లో 4x4 సెలెక్టర్ లివర్(గేర్)కు బదులుగా క్యూబీ హోల్‌తో డిజైన్ చేశారు. తద్వారా ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో పాటు డ్రైవర్ సీటు కుడి మోకాలి దగ్గర ఉన్న కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేసే సౌకర్యం ఉంది. మహీంద్రా థార్ ఆర్డబ్ల్యూడీ ఇంకా, థార్ ఆర్డబ్ల్యూడీ కొత్త పవర్‌ట్రెయిన్‌తో 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో 118.5హెచ్‌పీ నుంచి 300ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. మరోవైపు 4డబ్ల్యూడీ థార్ 132హెచ్‌పీ, 300ఎన్ఎం 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. అలాగే, 2డబ్ల్యూడీ వెర్షన్ 152హెచ్, 300ఎన్ఎం (ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 320ఎన్ఎం) ఉత్పత్తి చేసే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేస్తుంది. మహీంద్రా థార్ ఏఎక్స్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు, థార్ 1.5 డీజిల్, 2.0 పెట్రోల్ పవర్ట్రెయిన్ల కోసం తక్కువ-స్పెక్ ఏఎక్స్ ఆప్షనల్ ట్రిమ్‌ను అందిస్తుంది. ఈ ట్రిమ్ ఇంతకుముందు థార్‌తో అందుబాటులో లేదని, కానీ ఇప్పుడు థార్ విడుదల చేస్తున్న వేరియంట్ కార్లలో డిజైన్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఎక్స్ (O) 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు బదులుగా 16-అంగుళాల స్టీల్ వీల్స్, ట్యూబ్యులర్ స్టీల్ సైడ్ స్టెప్, వినైల్ అప్హోల్స్టరీ, మాన్యువల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, మోనోక్రోమ్ ఎంఐడీ డిస్ప్లేను డిజైన్ చేశారు. ఏఎక్స్ (O)7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఇన్-బిల్ట్ స్పీకర్లు, టీపీఎంసం, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌తో వస్తుంది. ఇంకా, రోల్-ఓవర్ మిటిగేషన్‌తో పాటు హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్‌తో ఈఎస్పీ 1.5 డీజిల్ ఏక్స్ వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ధర.. విడుదలకు సిద్ధంగా ఉన్న మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ప్రారంభ ధర రూ. 11లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. -
7.43 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుపై ప్రోత్సాహకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద 2022లో 7.43 లక్షల ఈ–వెహికల్స్‌కు ప్రోత్సాహకాలు లభించాయి. వీటిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 6.63 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్లు 70,159 యూనిట్లు, ఈ–ఫోర్ వీలర్లు 5,375, ఈ–బస్‌లు 3,738 యూనిట్లు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం రూ.3,305 కోట్లు ఖర్చు చేసింది. -
కొనుగోలుదారులకు భారీ షాక్, మహీంద్రా కార్లలో లోపాలు..రీకాల్‌కు పిలుపు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన కార్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కార్లలో వేడిని నిరోధించేందుకు సింథటిక్ ఎలాస్టోమర్ నుంచి తయారు చేసిన రబ్బర్ బెలో’లో లోపాలు తలెత్తుతున్నట్లు తేలింది. దీంతో మహీంద్రా యాజమాన్యం ఈ ఏడాది జులై 1 నుంచి నవంబర్ 11 వరకు మ్యానిఫ్యాక్చరింగ్ చేసిన 6618 స్కార్పియో - ఎన్ కార్లను, ఎక్సయూవీ - 700 వేరియంట్‌కు చెందిన 12,566 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. కార్లలోని తలెత్తుతున్న లోపాలపై మహీంద్రా యాజమాన్యం స్పందించింది. కార్లలో ఉండే బెల్ హౌసింగ్ లోపల రబ్బరు బెలో’ ఏం సంస్థ తయారు చేసింది. ఏయే తేదీలలో వాటిని తయారు చేశారో గుర్తించి, క్రమబద్దీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వాహనాదారులకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత డీలర్ షిప్ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని కోరింది. నాణ్యతలో రాజీపడం అంతేకాదు సంస్థ తయారు చేసే కార్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడమని, అలాగే ప్రస్తుతం కార్లలోని లోపాల్ని గుర్తించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల మేరకు..మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో - ఎన్లు కార్లు వాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఒక్క ఆగస్ట్ నెలలో ఈ రెండు కార్లు సుమారు 2.40 లక్షలు ఓపెన్ బుకింగ్స్ అయ్యాయని..ఆ బుకింగ్స్ చేసుకున్న కార్లు కొనుగులో దారులకు చేరాలంటే 20 నుంచి 24 నెలల సమయం పడుతుందన్నారు. అందుకు మార్కెట్లో ఈ కార్లు ఉన్న డిమాండేనని చెప్పారు. ఇక ఇదే ఏడాది జులై నెలలో స్కార్పియో ఎన్ వేరియంట్ లక్ష కార్లను వాహనదారులు బుక్ చేసుకోగా.. ట్రాప్ - ఎండ్ ట్రిమ్ కార్ల కోసం 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంది. మిగిలిన వేరియంట్ కార్లను కొనుగులో చేసిన కస్టమర్ల దగ్గరికి చేరుకునేందుకు 20-24 నెలల సమయం పట్టనున్నట్లు స్పష్టం చేశారు. చదవండి👉 ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్‌లెట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్‌యూవీలను పరిచయం చేస్తాం. ఎస్‌యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చార్జింగ్ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు. మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ వెల్లడించారు. భారత్‌లో ఇంత విస్తృత నెట్‌వర్క్‌ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు -
అగ్నికి ఆహుతవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, కేంద్రం కీలక నిర్ణయం!
ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు భద్రతా అవసరాల కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల పరీక్ష ప్రమాణాలను సవరించింది. నిబంధనల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి - జూన్ మధ్య కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వినియోగదారుల ఈవీ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈవీ వెహికల్స్ పరీక్ష ప్రమాణాలను సమీక్షించడానికి, వాటిని బలోపేతం చేసే చర్యలను సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఈవీ టెస్టింగ్ ప్రమాణాల్ని మార్చాలని సిఫార్స్ చేస్తూ ఓ రిపోర్ట్‌ను అందించారు. ఆ రిపోర్ట్‌లో మంటలకు దారితీసే అంతర్గత సెల్ షార్ట్-సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్), ఆన్‌బోర్డ్ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్ అదనపు భద్రతా అంశాలను ఇందులో పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలపై ప్రభుత్వం వాటాదారుల నుండి సలహాలను కూడా కోరింది. -
అమ్మకాల్లో దుమ్ములేపుతున్న'టాటా పంచ్', సరికొత్త రికార్డులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ కొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన 10 నెలల్లోనే ఒక లక్ష యూనిట్లు రోడ్డెక్కాయి. దేశంలో తక్కువ సమయంలో ఈ స్థాయి అమ్మకాలు సాధించిన ఎస్యూవీ ఇదేనని కంపెనీ ప్రకటించింది. సంస్థ నుంచి అధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది. 2021 అక్టోబర్‌లో పంచ్ భారత మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.5.93 లక్షల నుంచి రూ.9.49 లక్షల మధ్య ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు ఉంది. చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
మహీంద్రా నుంచి కమర్షియల్ వెహికల్ విడుదల..ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం కొత్త బొలెరో మ్యాక్స్ పికప్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.68 లక్షల నుంచి ప్రారంభం. 1,300 కిలోల సరుకును మోయగలదు. వారంటీ మూడేళ్లు లేదా ఒక లక్ష కిలోమీటర్లు. మెరుగైన రవాణా కోసం ఆర్15 టైర్లను వినియోగించారు. 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. 2–3.5 టన్నుల తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో కంపెనీకి దక్షిణాదిన 43 శాతం వాటా ఉందని మహీంద్రా ఎస్వీపీ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ భారత్‌లో 2–3.5 టన్నుల విభాగం మార్కెట్ ఏటా 8,000 యూనిట్లు ఉంది. -
ఐదేళ్లలో 36 మోడళ్లు.. 6.52 లక్షల సేల్స్.. అయినా ఆ కార్లకు క్రేజ్ తగ్గలే!
భారత ఆటోమొబైల్ రంగంలో కార్ల హవా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు వ్యక్తిగత ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో భారతీయులు ఎస్యూవీ కార్లు వైపు అడుగులేస్తున్నారు. అందుకు నిదర్శనమే గత ఐదేళ్లలో 36 ఎస్యూవీ మోడళ్లు మార్కెట్లో విడుదల కావడంతో పాటు విజయవంతంగా అమ్మకాలలోనూ జోరు ప్రదర్శిస్తోంది. ఎస్యూవీ క్రేజ్ తగ్గేదేలే సేఫ్టీ, కంఫర్ట్‌తో పాటు సన్‌రూఫ్, టెక్నాలజీ కనెక్టెడ్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరహా పాపులర్ మోడల్ కార్ల కోసం కొన్ని సార్లు రెండు సంవత్సరాలు వరకూ వేచి చూస్తున్నారు కూడా. ప్రస్తుతం ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. గతంలో హ్యాచ్‌బ్యాక్‌లు సేల్స్ చార్ట్‌లలో ఆధిపత్యం చెలాయించేవి, కానీ ఎంట్రీ-లెవల్, మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) ఇటీవల కాలంలో జనాదరణ ఎక్కువ పొందుతున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో ఎస్యూవీ (SUV) సెగ్మెంట్ అమ్మకాలలో వృద్ధిని సాధిస్తోంది. పరిశ్రమలో దాదాపు 19 శాతం ఉన్న ఎస్యూవీ విభాగం 2021-22లో 40 శాతానికి పెరిగింది. దీని బట్టి ఆ వాహనాల అమ్మకాలు వాటికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని తెలిపారు. గతేడాది 30.68 లక్షల కార్లు అమ్ముడైతే వాటిలో ఎస్‌యూవీల వాటా 6.52 లక్షల యూనిట్లు. గత ఐదేండ్లలో మార్కెట్లో కంపాక్ట్, మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లే ఎంటర్ కావడం ఆశ్చర్యమేమీ కాదు. నూతన శ్రేణి ఎస్యూవీ కార్ల పట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నాక కార్ల తయారీ సంస్థలు అటువైపు దృష్టి మళ్లించారంటున్నారు. 2016-17లో సేఫ్టీ ఫీచర్లు గల కార్లు 17 శాతం అమ్ముడైతే.. 2021-22లో 24 శాతానికి పెరిగింది. ఇటీవల మార్కెట్లో మారుతి బ్రెజా మోడల్ కారు లాంచ్ చేస్తే.. మొత్తం వివిధ కార్ల బుకింగ్స్‌లో 70 శాతం దానివే ఉన్నాయి. ఎస్‌యూవీలతోపాటు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లను తేవడంతో మార్కెట్లో మూడో స్థానానికి టాటా మోటార్స్ దూసుకొచ్చింది. చదవండి: Elon Musk: కోర్టులో విచారణ వాయిదా కోరిన ఎలాన్ మస్క్.. ఏం ప్లాన్ వేశావయ్యా! -
సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్!
ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఈవిట్రిక్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా 100 డీలర్ షిప్‌లను పూర్తి చేసుకుందని ఆ సంస్థ ఫౌండర్ మనోజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిట్రిక్ మోటార్స్ 6 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 100కు పైగా డీలర్ షిప్‌ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈవీట్రిక్ స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయని తెలిపారు. మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్‌పూర్, బికనీర్, సూరత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సత్తా చాటుందని అన్నారు. ఇక దేశంలో పెరిగిపోతున్న పెట్రో ధరల కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతుందని, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కొనుగోలు దారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈవిట్రిక్ ఫౌండర్ మనోజ్ పాటిల్ చెప్పారు. -
వాహనాల అమ్మకాల జోరు, ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వెహికల్స్ ఇవే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు 2022 ఏప్రిల్‌లో 16,27,975 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ 25 శాతం పెరిగి 2,64,342 యూనిట్లు రోడ్డెక్కాయి. ద్విచక్ర వాహనాలు 38 శాతం ఎగసి 11,94,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహనాలు 52 శాతం దూసుకెళ్లి 78,398 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 96 శాతం, ట్రాక్టర్లు 26 శాతం విక్రయాలు పెరిగాయి. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని రకాల వాహనాల మొత్తం విక్రయాలు గత నెలలో 6 శాతం తగ్గుదల నమోదైంది. ‘రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, చైనా లాక్డౌన్లో ఉన్నందున ఆటో పరిశ్రమ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటోంది. మెటల్ అధిక ధరలు, కంటైనర్ కొరత ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సరఫరా సంక్షోభం కొనసాగుతోంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ తెలిపారు. -
టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా!
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని ఎగబడుతున్నారు. కానీ వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్‌లు దగ్ధమవ్వగా..ఇవ్వాళ వరంగల్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. వరంగల్‌లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. ఉదయం 6గంటలకు వరంగల్ చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసింది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే..లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎలక్ట్రోలేడ్ ద్రావణం రోజుల వ్యవధిలో వరుసగా ఎలక్ట్రిక్ బైక్‌లు తగలబడిపోవడం..ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై భయాల్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను వాడాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సరైన పద్దతిలో వినియోగించుకోకపోతే లిథియం అయాన్ బ్యాటరీలో పేలే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరో ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు. ఏథర్ ఏం చెబుతుందంటే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఏథర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లిథియం అయాన్ బ్యాటరీకి వర్తిస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ డిస్చార్జింగ్ రేటు. సామర్థ్యం, లైఫ్ సైకిల్, ఛార్జింగ్ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. చదవండి: ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ? -
ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. నిన్నమొన్నటి దాకా అవేం బండ్లు అని కొట్టేసిన వాహనదారులు..ఇప్పుడు అవే కావాలని ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూం వైపు కన్నెత్తి చూడని వాళ్లు సైతం ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. గతేడాది ముంబైకి చెందిన ఆటోమొబైల్ సంస్థ స్ట్రోమ్ మోటార్స్ 'స్టోమ్ ఆర్3' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆ కారును కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు. ఆటో తరహాలో ఈ కారుకు ముందు రెండు టైర్లు.. వెనుక ఒక టైరు ఉండగా.. సీట్లు రెండే ఉన్నాయి. ఇక ఈ కారు 2,915ఎంఎం పొడవు 1,519 ఎంఎం, వెడల్ప్ 1,545 ఎత్తు ఉంటుంది. అచ్చం స్టోమ్ ఆర్3 కారు ముందు భాగం 'మహీంద్రా ఈ2ఓ'ను పోలి ఉంది. అయితే ఈ కారుకు టెక్నాలజీని జోడిస్తూ గ్రిల్ ఎలిమెంట్‌ను కారు ఎడమవైపు, కుడివైపు ఇలా బ్యానెట్ వరకు డిజైన్ చేశారు. ఇరువైపులా షట్కోణంలో డోర్స్ ఉన్నాయి. లగ్జరీ కార్లు ఫీచర్లు 1990లలో మెర్సిడెజ్ బెంజ్ కార్లలో ఉండే ఈ లగ్జరీ స్క్రీన్ ఫీచర్లు..ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ కార్లలో వస్తున్నాయి. ఇక ఈ కార్లో సైతం 3స్క్రీన్లు ఉండగా ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్లుగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక స్క్రీన్ 7అంగుళాలు, మిగిలిన రెండు స్క్రీన్లలో ఒకటి 4.3 అంగుళాలు, మరో స్క్రీన్ 2.4 అంగుళాలుగా ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో రెండు ఎయిర్కాన్ వెంట్(కారులో ఏసీ.లోపలి గాలి బయటకు..బయట గాలి లోపలికి వచ్చే) ఉంది. టూ టోన్ ఇంటీరియర్(కార్ టాప్, అండ్ బాడీ కలర్) తో బ్లాక్, లైట్ గ్రే కలర్స్ అందించబడుతుంది. 4జీ కనెక్టివిటీతో నావిగేషన్, వాయిస్ కంట్రోల్, సిగ్నల్ కంట్రోలింగ్ సపోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ కారు బరువెంతో తెలుసా? స్టీల్ స్పేస్ ఫ్రేమ్ ఆధారంగా కారు 550కిలోల బరువును తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. 15కేడబ్ల్యూ, 90ఎన్ఎం టార్క్ తో ఎలక్ట్రిక్ మోటారు, సింగిల్ రిడక్షన్ గేర్‌బాక్స్, స్ట్రోమ్ టాప్ స్పీడ్ 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయోచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మూడు వేర్వేరు లి-అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్లు 120,160,200 కిలోమీటర్ల రేంజ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ కారు ధర రూ.4.5లక్షలుగా ఉండగా..కారును మార్కెట్లో విడుదలైన 4రోజుల్లో సుమారు 160కార్లు బుక్కైనట్లు స్ట్రోమ్ మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి: భారత్‌లో తొలి కియా ఎలక్ట్రిక్ కార్, స్టైలిష్ లుక్‌తో రెడీ ఫర్ రైడ్! -
ఈ తరహా కార్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కార్ల మార్కెట్ 2025–26 నాటికి దేశంలో 82 లక్షల యూనిట్లకు చేరుతుందని గ్రాంట్ థాంటన్ భారత్ తన నివేదికలో తెలిపింది. ‘2020–21లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లుగా ఉంది. చిన్న పట్టణాల నుంచి డిమాండ్, నూతన వాహనాల ధరలు పెరుగుతుండడం, వినియోగదార్లలో వస్తున్న ధోరణి వెరశి పాత కార్ల జోరుకు కారణం. 14.8 శాతం వార్షిక వృద్ధితో 2030 నాటికి పరిశ్రమ విలువ రూ.5.3 లక్షల కోట్లకు చేరుతుంది. కొత్త కారుతో పోలిస్తే పాత వాహనం కొనుగోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 2020–21లో కొత్త వాహన వ్యవస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక మార్పులను చూసింది. అదే సమయంలో వినియోగదార్ల ప్రాధాన్యతలలో మార్పు పాత కార్ల మార్కెట్‌ను వృద్ధి మార్గంలో వేగంగా నడిపించింది. ప్రస్తుతం పాత కారు కొనేందుకు కస్టమర్లు ఎప్పుడూ లేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. చిన్న పట్టణాలు పరిశ్రమను ముందుకు నడిపిస్తాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా ప్రస్తుతమున్న 55–70 శాతానికి చేరుతుంది. కొత్త కార్లతో పోలిస్తే 2024–25 నాటికి పాత కార్ల మార్కెట్ రెండింతలు ఉండనుంది’ అని నివేదిక వివరించింది. చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..! -
ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్, ధర ఎంతంటే..?
త్వరలోనే 'నానో' కారు ఇన్స్పిరేషన్తో ప్రపచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. దీని ధర ఆల్టో కారు కంటే తక్కువగా ఉంటుందని ఆటోమొబైల్ ప్రతినిధులు చెబుతున్నారు. చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వుల్లింగ్ హాంగ్ గ్వాంగ్ (Wuling Hongguang) గతేడాది మిని ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. విడుదలైన ఈ కారు వినియోగదారుల్ని ఆకట్టుకోవడంతో రికార్డ్ స్థాయిలో 119,255 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే జోరుతో మనదేశానికి చెందిన నానో కారు ఇన్స్పిరేషన్తో వుల్లింగ్ సంస్థ 'వుల్లింగ్ నానో' పేరుతో 'ఈవీ' కారును తయారు చేసింది. ఆల్టో కారు ధర 3 లక్షలు ఉండగా.. అర్బన్ ప్రాంతాల్లో వినియోగించేలా కేవలం 2 సీట్ల సామర్ధ్యంతో డిజైన్ చేసిన కారు ధర రూ.2లక్షల 30వేలని ఆటోమొబైల్ సంస్థ వుల్లింగ్ తెలిపింది. ఫీచర్లు చైనా నానో ఈవీ కారు 2,497 ఎంఎం లెంగ్త్,1526 ఎంఎం విడ్త్, 1616 ఎంఎం ఎత్తు, వీల్ బేస్ 1600 ఎంఎంగా ఉంది. నానో ఈవీ 28 kWh సామర్థ్యంతో IP67- సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని అందిస్తుంది. అంత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 305 కిమీ ప్రయాణించవచ్చని తయారి దారులు చెబుతున్నారు. సాధారణ 220 వోల్ట్ దేశీయ సాకెట్‌తో బ్యాటరీని రీఛార్జ్ చేసేందుకు 13.5 గంటలు పడుతుండగా..6.6 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ను వినియోగించి 4.5 గంటల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. నానో కారు స్పూర్తితో 2008 జనవరి 10న ఇండియాలో విడుదలైన టాటా నానో కారు ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. కేవలం రూ.లక్షరూపాయల విలువైన కారును టాటా మోటార్స్ ఆటోమొబైల్ సంస్థ విడుదల చేసింది. అన్నీ వర్గాల ప్రజలు కారును వినియోగించేలా టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా కారును అందుబాటులోకి తెచ్చారు. ఈ కారును ఇన్స్పిరేషన్తో చైనా ఆటోమొబైల్ సంస్థ నానో కంటే అతి చిన్న కారును తయారు చేసింది. చదవండి: అదిరే 'ఆడి'..ఇండియన్ మార్కెట్లో మరో సూపర్ ఎలక్ట్రిక్ కార్ -
ఈవీ స్కూటర్... ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా ?
పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఐదు వందల రూపాయల నోటు ఇచ్చినా ఐదు లీటర్ల పెట్రోలు కూడా రావట్లేదు. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈవీ స్కూటర్ల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ సందేహాలకు ‘ఆటోకార్’ ఇలా సమాధానం ఇచ్చింది. టీవీఎష్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మైలేజీ, మెయింటనెన్స్ తెలుసుకునేందుకు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ని పరిశీలనలోకి తీసుకున్నారు. టీవీఎస్ ఐక్యూబ్‌లో 2.2 కిలోవాట్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు ఐదు గంటల సమయం తీసుకుంటుంది. పవర్ మోడ్‌లో 48 కిలోమీటర్ల మైలేజీ ఏకోమోడ్లో 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఏకోమోడ్లో ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది. 30 పైసలు బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసి కంపెనీ సూచనల మేరకు టైర్లలో ఎయిర్ నింపి సిటీ రోడ్లపై ఏకో, పవర్ మోడ్లలో పరుగులు తీయించగా... సగటున ఒక కిలోమీటరు ప్రయాణానికి 30 పైసలు ఖర్చు వచ్చింది. ఇదే సమయంలో లీటరు పెట్రోలు ధర రూ.107ని తీసుకుంటే పెట్రోలు ఇంజను స్కూటరు ప్రయాణానికి ఒక కిలోమీటరకు రూ. 1.80 వంతున ఖర్చు వస్తున్నట్టు ఆటోకారు పేర్కొంది. 10 వేలకు 15 వేలు ఆదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లీటరు పెట్రోలు ధర, యూనిట్ కరెంటు ఛార్జీలను పరిగణలోకి తీసుకుని పెట్రోలు స్కూటరు, ఈవీ స్కూటర్లను పరిశీలిస్తే... పది వేల కిలోమీటర్లు తిరిగే సరికి ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం పెట్రోలు రూపంలోనే రూ. 15,000 పెట్రోలు ఆదా చేసేందుకు తోడ్పడుతోంది. ఇక 50,000 కి.మీ ప్రయాణం పూర్తి చేసే సరికి రూ. 75,000ల వరకు మిగులు ఉంటున్నట్టు ఆటోకార్ తెలిపింది. పైగా ఈవీ వెహికల్స్‌కి ఆయిల్ ఛేంజ్, ఫిల్టర్లు ఇలా మెయింటనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఈవీకి డిమాండ్ పెట్రోలు రేట్లు పెరిగిపోతుండటంతో ఈవీ స్కూటర్లకు దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే పలు బ్రాండ్లు ఈవీలను మార్కెట్లోకి తీసుకురాగా.. ఓలా స్కూటర్‌కి అయితే ప్రీ బుకింగ్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. -
Lockdown effect: కార్ల అమ్మకాల్లో తగ్గుదల
హైదరాబాద్: కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో కార్ల అమ్మకాలు పడిపోయాయి. వైరస్ విజృంభనకు తోడు వరుసగా ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ విధిస్తూ పోవడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే గతేడాది లాక్‌డౌన్‌తో పోల్చితే ఈసారి అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పైగా కరోనా వచ్చిన తర్వాత వ్యక్తిగత కారుకు డిమాండ్ పెరిగిందని, అందువల్ల అమ్మకాల్లో తగ్గుదల తాత్కాలికమే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ తగ్గుదల ఇండియా మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజుకిపై లాక్డౌన్ల ప్రభావం భారీగా పడింది. దేశంలో లాక్డౌన్లు అమల్లోకి రాకముందు అంటే 2021 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 1.35 లక్షల ప్యాసింజర్ వెహికల్ కార్లు అమ్మింది సుజూకి. ఆ తర్వాత లాక్డౌన్ కాలమైన మేలో కార్ల అమ్మకాలు కేవలం 32,903గా నమోదు అయ్యాయి. లాక్డౌన్ ఫస్ట్ విడతకు సంబంధించి 2020 మేలో అయితే మరీ దారుణంగా కేవలం 13,702 కార్లే అమ్ముడయ్యాయి. సగానికి సగం కార్ల అమ్మకాల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 49,002 ప్యాసింజర్ కార్లను అమ్మింది. కానీ కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న మేలో అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. మేలో హ్యందాయ్ కార్ల అమ్మకాలు 25,001 యూనిట్లకే పరిమితం అయ్యాయి. టాటాకు తప్పని తిప్పలు మరో ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు సైతం కరోనా కష్టాలు తప్పలేదు. ఏప్రిలో 25,095 కార్ల అమ్మకాలు జరగగా మేలో ఈ సంఖ్య 15,181కి పరిమితమయ్యింది. టాటా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌కి సంబంధించి ఏప్రిల్‌లో 14,435 వాహనాలు అమ్మగా మేలో 9,871 వాహనాలే అమ్ముడయ్యాయి. మహీంద్రాది అదే దారి ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్ అమ్మకాల్లో జోరు కనబరిచే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లోనూ క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలకు సంబంధించి ఏప్రిల్‌లో 18,825 యూనిట్లు అమ్ముడవగా మేలో ఈ సంఖ్య 8,004కే పరిమితమైంది. కమర్షియల్ సెగ్మెంట్లో 16,147 నుంచి 7,508 యూనిట్లకు అమ్మకాలు పడిపోయాయి. టోయోట కిర్లోస్కర్ మోటార్స్‌లోనూ ఇదే ట్రెండ్ నమోదైంది. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో 9,622 కార్లు అమ్మగా మేలో కేవలం 707 యూనిట్లే అమ్మగలిగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభనతో ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ని తాత్కాలికంగా షట్‌డౌన్ కూడా చేసింది. హోండా కార్ల అమ్మకాలు సైతం పడిపోయాయి. క్యా కియా అతితక్కువ కాలంలోనే ఇండియాలో 10.70 శాతం కార్లమార్కెట్ను కొల్లగొట్టిన కియా మేలో 11,050 కార్లను అమ్మగలిగింది. కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ల ప్రభావం అన్ని రంగాలపై ఉందని, ఆటోమొబైల్స్ రంగం అందుకు మినహాయింపు కాదని కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. గతం కంటే మెరుగు గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో పోల్చితే ఈ ఏడాది లాక్డౌన్ ప్రభావం ఆటోమొబైల్ పరిశ్రమపై తక్కువగానే ఉందంటున్నారు ఈ పరిశ్రమ ఎక్స్పర్ట్స్. గతేడాది సేల్స్ చాలా దారుణంగా పడిపోయాని చెప్పారు. కేవలం మే నెలలోనే అమ్మకాల్లో క్షీణత ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ పరిశ్రమ పుంజకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. పైగా కరోనా కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, షేరింగ్ ట్రాన్స్‌పోర్టు కంటే వ్యక్తిగత వాహనాలు కలిగి ఉండటానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని.... ఆ సెంటిమెంట్ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆటోమోబైల్ రంగ నిపుణులు అంటున్నారు. -
కొత్త కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచింది. గత నెలలో ప్రకటించిన విదంగానే ఇప్పుడు తమ వివిధ మోడళ్ల ధరలను పెంచేసింది. మారుతి సుజుకి కార్ల ధరలను దేశవ్యాప్తంగా రూ.34,000 వరకు పెంచింది. కొత్తగా పెరిగిన ధరలు వెంటనే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. ధరల ప్రధాన కారణం పెరిగిన ఉత్పాదక వ్యయాలు అని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత డిసెంబర్ నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాలి. కార్ల తయారీదారి మారుతి సుజుకి పెరిగిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోకపోయిన, కొన్ని పెరిగిన కారు ధరల వివరాలు బయటకి వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, మారుతి సుజుకి పెరిగిన కార్ల జాబితా ఈ క్రింది విదంగా ఉంది. మారుతి సుజుకి టూర్ ఎస్: రూ.5,061 వరకు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ.7,000 వరకు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా: రూ.10,000 వరకు మారుతి సుజుకి డిజైర్: రూ.12,500 వరకు మారుతి సుజుకి ఆల్టో 800: రూ.14,000 వరకు మారుతి సుజుకి సెలెరియో: రూ.19,400 వరకు మారుతి సుజుకి వాగన్-ఆర్: రూ.23,200 వరకు మారుతి సుజుకి ఈకో: రూ.24,200 వరకు మారుతి సుజుకి స్విఫ్ట్: రూ.30,000 వరకు మారుతి సుజుకి ఎర్టిగా: రూ.34,000 వరకు -
బడ్జెట్లో ఈ రంగాల ఊసే లేదు
సాక్షి, న్యూడిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తనే అధిగమించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ 2020 లో కొన్ని ప్రధాన కీలక రంగాలకు తీరని నిరాశే మిగిల్చారు. ముఖ్యంగా జీఎస్టీ భారం, అమ్మకాలు లేక విల విల్లాడుతున్న ఆటోమొబైల్ కంపెనీ పునరుజ్జీవనానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆయా కంపెనీలకు ఎలాంటి ఊరట కల్పించకపోవడం తీరని నిరాశ మిగిల్చిందని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే టెలికం కంపెనీల గురించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవంటూ సంబంధిత వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు ఆర్థిక రంగానికి ఎంతో కీలకమైన రియల్ ఎస్టేట్‌రంగ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ఎనలిస్టులు నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్లో పన్ను ఉపశమనం, ఆర్థిక ఏకీకరణ, గ్రామీణ డిమాండ్ పుంజుకునే చర్యలు, సరసమైన గృహాలపై దృష్టి పెట్టడం, ఆటో రంగానికి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ విషయంలో తీవ్ర నిరాశ ఎదురు కావడంతో స్టాక్మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. -
బంపర్ ఆఫర్లతో స్వాగతం.. బండి కొనండి
సాక్షి, సిటీబ్యూరో : వాహన అమ్మకాలు మరింతగా పెంచుకునేందుకు ఆటోమొబైల్ డీలర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో సిద్ధమయ్యారు. ఇయర్‌ఎండర్‌ను తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగానే జరిగినా, అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. ఈ ఏడాది ముగింపునకు మరో 14 రోజులే మిగిలిఉంది. వీలైనన్ని ఎక్కువ వాహనాలను విక్రయించేందుకు డీలర్లు ఇస్తున్న ఆఫర్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై రూ. 5 వేలు, లగ్జరీ కార్లు, మధ్యతరగతి వేతన జీవులు కొనుగోలు చేసే వివిధ రకాల వాహనాలపైన రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించి విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలు రెండేళ్ల బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అయినా కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కొత్త ఏడాదిలో కొత్త బండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో రెండుమూడు నెలలుగా వాహన కొనుగోళ్లు భారీగా తగ్గాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం భారత్ స్టేజ్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను ప్రవేశపెడుతోంది. వాహనం ఇంజిన్ సామర్థాన్ని పెంచడంతో పాటు ఇంధనాన్ని పూర్తిస్థాయిలో మండించి కాలుష్య కారకాలను బాగా తగ్గించే బీఎస్–6 వాహనాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగలవని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. కానీ ఆటోమొబైల్ సంస్థలు జనవరి నుంచే వీటిని విక్రయానికి సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది 2.29 లక్షల వాహనాల విక్రయాలు అదనం సాధారణంగా రవాణారంగానికి చెందిన వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే పెద్దఎత్తున అమ్ముడవుతాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లు, రూ.లక్షల ఖరీదైన లగ్జరీ బైక్‌లు మొదలుకొని మధ్యతరగతి బడ్జెట్లో లభించే వివిధ రకాల కార్లు, దిచక్ర వాహనాల అమ్మకాలే టాప్‌గేర్‌లో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు వివిధ రకాల వాహనాలు నమోదైతే, వాటిలో 85 శాతం వరకు వ్యక్తిగత వాహనాలే ఉంటాయి. ఈ క్రమంలో నగరంలోని ఆటోమొబైల్ రంగం కూడా రవాణావాహనాల కంటే వ్యక్తిగత వాహన విక్రయాలపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం వాహనరంగంపై పెను ప్రభావాన్ని చూపింది. తయారీ సంస్థలు సైతం వాహనాల తయారీని నిలిపివేశాయి. నగరంలోని మధ్యతరగతినికూడా మాంద్యం ప్రభావితం చేసింది. ‘కేంద్రం ప్రకటించిన కొన్ని సడలింపుల నేపథ్యంలో అమ్మకాలు ఊపందుకుంటాయని భావించినప్పటికీ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉంది’ అని ఆటోమొబైల్ డీలర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 53,22,694 వాహన అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇప్పటి వరకు 55,52,416 వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 2,29,722 వాహనాలు ఎక్కువే అయినా, ఆర్థిక రంగం బాగుంటే మూడు లక్షల సంఖ్యను దాటేది. -
వాహనాలు, బిస్కట్లపై జీఎస్టీ తగ్గింపు లేనట్టే
సాక్షి, న్యూఢిల్లీ: బిస్కట్లు, కార్లపై పన్ను రేటు తగ్గింపు డిమాండ్లను జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ తిరస్కరించింది. జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ శుక్రవారం జరగనున్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ భేటీ అయి పలు డిమాండ్లను పరిశీలించింది. ఆదాయ పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఈ తరుణంలో వీటిపై రేట్లను తగ్గిస్తే కేంద్రం, రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, పండ్లు, కూరగాయలు, మినరల్ వాటర్, రెడీ టూ ఈట్ ప్యాకేజ్డ్ ఉత్పత్తులు సహా పలు ఇతర ఆహారోత్పత్తులపై జీఎస్టీ పన్ను నిర్మాణాన్ని మార్చరాదని అభిప్రాయపడింది. అన్ని రకాల వాహనాలు, వాహన విడిభాగాలపై జీఎస్టీ రేటు 28 శాతంగా అమలవుతుండగా, అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో 18 శాతానికి వెంటనే తగ్గించాలని పరిశ్రమ బలంగా డిమాండ్ చేస్తోంది. కానీ, పరిశ్రమ కోరినట్టు రేట్లను తగ్గిస్తే, ఆటోమొబైల్‌పై పన్ను ద్వారా జీఎస్టీ ఖజానాకు వచ్చే రూ.50,000–60,000 కోట్లపై ప్రభావం పడుతుందని ఫిట్మెంట్ కమిటీ అభిప్రాయపడింది. 12,000 వరకూ చార్జీపై 18 శాతం హోటల్ రంగానికి సంబంధించిన డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించింది. 18% జీఎస్టీ పరిధిలోకి రూ.12,000 వరకు టారిఫ్‌ను తీసుకురావడానికి కమిటీ సిఫారసు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపితే ఒక రాత్రి విడిది కోసం వసూలు చేసే రూ.12,000 వరకు చార్జీపై 18 శాతమే పన్ను అమల్లోకి వస్తుంది. ప్రస్తుతానికి రూ.7,500 వరకు టారిఫ్‌పైనే 18% జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇక టెలికం సేవలపై 18% రేటును 12%కి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌కు సైతం ఫిట్మెంట్ కమిటీ నో చెప్పింది. క్రూయిజ్ టికెట్లపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌ను సైతం తిరస్కరించింది. ఫిట్మెంట్ కమిటీ చేసిన సిఫారసులపై ఈ నెల 20న గోవాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ ఇందులో పాల్గొననున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ల తగ్గింపు సాధ్యం కాదన్నది రాష్ట్రాల అభిప్రాయంగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే రేట్లను తగ్గిస్తే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార నిధిపై ప్రభావం పడుతుందని అవి భయపడుతున్నాయి. 2017 నుంచి ఈ ఏడాది ఆగస్ట్ వరకు పరిహార నిధి రూ.1.9 లక్షల కోట్లు వసూలు కాగా, ఇందులో జూలై నాటికే రూ.1.7 లక్షల కోట్లను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇక కిట్టీలో రూ.23,391 కోట్లే మిగిలి ఉన్నాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లు కూడా రూ.లక్ష కోట్ల స్థాయి నుంచి పెరగని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ భేటీ తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. చదవండి : శాంసంగ్ ఎం30ఎస్ : భలే ఫీచర్లు -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగానే ఉన్నందున డిమాండ్ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25–30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55–60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్, నాన్–రిటైల్ రంగాల్లో డిమాండ్ మందగించడం కొన్ని ఎన్బీఎఫ్సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతమే ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి. ‘అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్టీ రంగాల్లో మందగమనం ఎన్బీఎఫ్సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండొచ్చు‘ అని మోతీలాల్ ఓస్వాల్ సంస్థలో ఎన్బీఎఫ్సీ విశ్లేషకుడు అల్పేష్ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో మారుతీ సుజుకీ ఉత్పత్తిని సుమారు 18% తగ్గించుకుంది. డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది 4వ నెల. కొన్నే మెరుగ్గా.. అయితే హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. మిగతా ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎంఏఎస్ ఫైనాన్షియల్, పీఎన్బీ హౌసింగ్ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్అండ్టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. తొలి త్రైమాసికం అంతంత మాత్రమే.. సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ ఫైనాన్స్ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్‌ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆటో, హౌసింగ్ లోన్స్ సంస్థలకు తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల ప్రభావం తోడైంది. రిటైల్ రుణాల్లో మందగమనం, డెవలపర్లు సమస్యల్లో ఉండటం వంటి అంశాలు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు‘ అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గతేడాది సెప్టెంబర్‌లో డిఫాల్ట్ అయినప్పట్నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్ఎఫ్ఎల్ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్‌లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
మహీంద్రా వాహన రేట్ల పెంపు
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వివిధ రకాల వాహనాల రేట్లను రూ. 36,000 దాకా పెంచనుంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ వాహనాల్లో ఏఐఎస్ 145 భద్రతా ప్రమాణాల నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో రేట్ల పెంపు అనివార్యమవుతోందని కంపెనీ వెల్లడించింది. స్కార్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్ఎక్స్టీ మోడల్స్‌పై అత్యధికంగాను, ఎక్స్‌యూవీ300 ..మరాజోపై స్వల్పంగా రేట్ల పెంపు ఉంటుందని మహీంద్రా వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సర్ మొదలైన ఫీచర్స్‌ను తప్పనిసరి చేసే ఏఐఎస్ 145 భద్రత ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భద్రతాపరమైన ఫీచర్స్ కారణంగా వ్యయాలు పెరిగిపోవడం వల్ల కొన్ని ఉత్పత్తులపై తామూ రేట్లు పెంచక తప్పడం లేదని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వధేరా తెలిపారు. బీఎస్ఈలో బుధవారం ఎంఅండ్ఎం షేర్లు 1.7 శాతం క్షీణించి రూ. 615.25 వద్ద ముగిశాయి. -
ఆటోమొబైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, చిత్తూరు: తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెప్పారు. చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో శుక్రవారం హీరో మోటార్‌కార్ప్ చిత్తూరు ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుౖవైన ప్రాంతమన్నారు. దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ హీరో ప్లాంటు లేదని తెలిపారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్ సీఎండీ పవన్‌ముంజాల్ చెప్పారు. -
షాకిచ్చి లేపుతుంది!
భలే బుర్ర అలారం కేకేస్తుంది గానీ, షాకిస్తుందేంటి అనుకుంటున్నారా? సాధారణంగా అలారం సెట్ చేసుకున్న టైముకి ఓ కేక వేసి మనల్ని నిద్ర లేపుతుంది. కుంభకర్ణుడి కజిన్ బ్రదర్స అయితే ఆ కేకకి లేవరు. దాంతో అది కేక మీద కేక వేసి విసిగిస్తూనే ఉంటుంది. అయినా లేవాలనిపించలేదో... స్నూజ్ బటన్ మీద ఒక నొక్కు నొక్కితే అది చప్పున నోరు మూసేస్తుంది. మనం మళ్లీ నిద్రను కంటిన్యూ చేసేయొచ్చు. కానీ పంతొమ్మిదేళ్ల సంకల్ప్సిన్హా తయారు చేసిన అలారం దగ్గర ఈ పప్పులేమీ ఉడకవు. యూపీలోని శారదా వర్సిటీలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తోన్న సంకల్ప్... ఓ అలారం తయారు చేశాడు. అది మహా మొండిఘటం. నిద్రపోయే ముందు మనం సెట్ చేసుకున్న టైముకి అది ఠంచనుగా కేక వేస్తుంది. కేక అంటే మరీ కర్ణకఠోరమైన కేకేం కాదులెండి. కొంచెం ఆహ్లాదభరితమైన కేకే! శ్రావ్యంగా ‘గుడ్ మార్నింగ్’ అనే పాటతో మనల్ని లేపాలని ప్రయత్నం చేస్తుంది. లేచామో సరే సరి. లేవకుండా దాని నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అది మనకు ఓ పెద్ద జర్‌క ఇస్తుంది. ఎలా అనేగా? దాన్ని ఆపడానికి మనం స్నూజ్ బటన్ మీద చేయి వేయగానే... చిన్న షాక్ ఇస్తుంది. ఆ దెబ్బకు ఎంత మొద్దునిద్ర ముంచు కొస్తున్నా, ఉలిక్కిపడి లేవాల్సిందే. ఇందులో ఇంకో వెరైటీ సౌకర్యం కూడా ఉంది. మనకు ఎంత మోతాదులో షాక్ కావాలనుకుంటున్నామో ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న షాక్‌కి లేచే వాళ్లమైతే తక్కువ, మరీ మొద్దు నిద్రపోయే వాళ్లమైతే ఎక్కువ మోతాదును ఎంచు కోవాలి. గరిష్టస్థాయి షాక్ సెట్ చేసుకున్నా కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే, మనిషి శరీరానికి ఎటువంటి హానీ కలగని మేరకే ఇది షాక్ కొడుతుంది. ఆ విధంగానే దీన్ని రూపొందించానని చెబుతున్నాడు రూపకర్త సంకల్ప్. -
సాక్షి మెగా ఆటో షో ప్రారంభం నేడు
రెండు రోజులు నిర్వహణ ప్రఖ్యాత కంపెనీల ఉత్పాదనలన్నీ ఒకే చోట.. కొలువు తీరనున్న మేటి సంస్థలు టూవీలర్స్, కార్ల కొనుగోలుకు సదవకాశం సందేహాల నివృత్తి చిటికెలో సాధ్యం వెంకోజీపాలెం : ఇది ఆటోమొబైల్ యుగం.. వాహనం లేకపోతే అడుగైనా ముందుకు సాగని కాలం. గడప దాటాలంటే రెండో, నాలుగో చక్రాల బండి తప్పనిసరన్నమాటే. రోడ్డు మీద చీమల బారుల్లా తిరుగుతున్న వాహనాలను చూస్తేనే అర్ధమవుతుంది.. బండి లేక మనం అడుగైనా కదలలేమని. ఈ సంగతి అటుంచితే.. మన కళ్లెదురుగా ఎన్నో రకాల వాహనాలు.. టూ వీలర్లయినా, కార్లయినా.. వందల కొద్దీ విధాలు. జిహ్వకో రుచి అన్నట్టు ఎవరి ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, స్తోమతను బట్టి.. బోలెడు బళ్లు. కొందరికి షోగ్గా ఉండాలి.. మరి కొందరికి మైలేజీ కావాలి.. ఇంకొందరికి డ్రైవింగ్ ఈజీగా సాగాలి.. ఎంత బరువైనా ఓపిగ్గా మోసే మొండి బళ్లు కొందరికి కావాలి. ధర కాస్త తక్కువైతే మేలని కొందరంటే, స్టేటస్ సింబల్‌లా ఉండాలని ఇంకొందరంటారు. ఇన్ని టేస్టులకు తగ్గట్టే లేటెస్టుగా ఎన్నో వాహనాలు బజార్లోకి వస్తున్నాయి. అయితే అన్నిటినీ చూడడమెలా? మన అవసరానికి నప్పేది ఎంచుకోవడమెలా? ఎన్ని షోరూంలు తిరగ్గలం? ఎన్ని మోడళ్లు చూడగలం? టైం చాలదే.. ఆగండాగండి.. ఇలా అనుకుని దిగులు పడకండి.. మీ ఆలోచనల్ని, అవసరాల్ని మీ ఆత్మ ‘సాక్షి’ అర్ధం చేసుకుంది.. ఒకే చోట అన్ని కంపెనీల వాహనాలూ కొలువు తీరితే మీ శ్రమ తీరి కోరిక నెరవేరుతుందన్న సత్యాన్ని తెలుసుకుంది. అందుకే.. నగరంలో తొలిసారిగా భారీ ఎత్తున ప్రత్యేక రీతిలో మెగా ఆటో షోకు శ్రీకారం చుడుతోంది. ఆలస్యం ఇంకెందుకు.. పదండి వాహనాల కనువిందుకు.. ఏర్పాట్లు పూర్తి : రెండురోజుల పాటు అట్టహాసంగా జరగనున్న సాక్షి మెగా ఆటోషోకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. నగర వాసులను అలరించే ఈ మెగా షో శని,ఆదివారాలలో ఎంవీపీ కాలనీ డబల్రోడ్డులోని వుడా మైదానంలో జరగనుంది. రోజూ ఉదయం 10 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. అటు అన్ని అభిరుచులున్న కొనుగోలుదారులకు, ఇటు అనేక ఉత్పాదనలు అందుబాటులోకి తెచ్చే అమ్మకందారులకు మధ్య ఓ వారధిలా, అందరి అవసరాలు తీర్చే వేదికలా ఈ మెగా షో ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే వాహనాలన్నీ అందుబాటులో ఉండడం వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది. సందేహాలకు సమాధానాలు : సాధారణంగా వాహనాలు కొనాలనుకునే వారికి ఎన్నో సందేహాలుంటాయి. అనుమానాలు తలెత్తుతాయి. వీటన్నిటికీ జవాబులు ‘సాక్షి’ మెగా షోలో లభిస్తాయి. నేరుగా అందరు విక్రేతలను ఇక్కడ కలుసుకోవచ్చు కాబట్టి, తక్కువ సమయంలోనే అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. అన్ని సంస్థల ప్రతినిధులు ఆయా వాహనాల ప్రత్యేకతలను ప్రత్యేకంగా మీకోసం వివరిస్తారు. అలాగే మరో సదవకాశం కూడా మీకోసం ఇక్కడ నిరీక్షిస్తోంది. ఇక్కడ ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి పొందే అవకాశం ఉంది. వాహనాలకు ఉచిత పొల్యూషన్ తనిఖీ, సర్వీసింగ్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలాకృష్ణ టయోటా,శ్రీ శ్రీనివాస యమహా, వరుణ్మారుతి, జయభేరి మారుతి, వరుణ్ బజాజ్, సుందరం హోండా, మహేంద్ర నిసాన్, విష్ణుహోండా, రెనాల్ట్ వైజాగ్, మ్యాంగో హ్యూండాయ్, శివశంకర్ మోటార్స్, ఆరంజ్ షెవర్లే,లక్ష్మీ హ్యూండాయ్,వైజాగ్ సుజుకి, శివశంకర్ టాటామోటార్స్, ఎస్వి పియాజియో మోటార్స్ సంస్థలు షోలో కొలువు తీరనున్నాయి. ఈ మెగా షోలో కార్లు, ఆటోలు, బైకులు ఈజీగా కొనుగోలు చేయొచ్చు. లక్కీడ్రా ద్వారా సుజుకి లెట్స్ ద్విచక్ర వాహనాన్ని బంపర్బహుమతిగా పొందవచ్చు. ఈ కార్యక్రమానికి రేడియో మిర్చి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. -
చిద్దూ షి 'కారు '
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చిదంబరం వాహన మంత్రం అన్ని వాహనాలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఆడి రూ. 3.82 లక్షల దాకా; మెర్సిడెస్ బెంజ్ రూ. 2 లక్షల వరకూ రేట్ల కట్ తగ్గించనున్నట్లు ప్రకటించిన మహీంద్రా, టాటా మోటార్స్, జీఎం, నిస్సాన్ ఇదే బాటలో మరిన్ని ఇతర కంపెనీలు... సియామ్ గణాంకాల ప్రకారం 2013లో దేశీ కార్ల అమ్మకాలు 9.59% క్షీణించి 18,07,011కు పరిమితమయ్యాయి. 2012లో అమ్మకాల సంఖ్య 19,98,703. 11 ఏళ్లలో తొలిసారిగా వార్షిక కార్ల విక్రయాలు తిరోగమనంలోకి జారడం పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లకు నిదర్శనం. ఈ ఏడాది జనవరిలోనూ(వరుసగా నాలుగో నెల) కార్ల అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే కొనసాగాయి. గతేడాది జనవరితో పోలిస్తే 7.59% క్షీణించి 1,60,289కి తగ్గాయి. అమ్మకాలు ఘోరంగా పడిపోయి... కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ రంగానికి ఆర్థిక మంత్రి చిదంబరం కాస్త ఊరట కల్పించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వాహన కంపెనీలకు చేయూతచ్చే చర్యలను ప్రకటించారు. దీంతో కార్లు, బైక్‌లు, స్కూటర్లతో పాటు వాణిజ్య వాహనాల ధరలు కూడా కొంత దిగిరానున్నాయి. ఆడి, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు రేట్ల తగ్గింపులో బోణీ చేశాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సైతం తమ వాహనాల రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించాయి. నిస్సాన్... తమ కార్లపై 4-6 శాతం మేర ధరలు తగ్గించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. టయోటా, సూపర్‌బైక్ తయారీ సంస్థ డీఎస్కే హ్యోసంగ్లు ధరల తగ్గింపు సంకేతాలిచ్చాయి. న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో చిదంబరం వాహన పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆటోమొబైల్ రంగంలోని అన్నిరకాల విభాగాలకు సంబంధించి ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం పట్ల వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని కచ్చితంగా తమ కస్టమర్లకు బదలాయిస్తామని టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు. రేపటి నుంచి జరిగే కొత్త డిస్పాచెస్(పంపిణీ)కు దీన్ని వర్తింపజేస్తామన్నారు. అయితే, ఎంతమేరకు రేట్లు తగ్గించాలనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ మాట్లాడుతూ... సుంకాల తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తామని, ఏ వాహనాలపై ఎంతెంత మేరకు రేట్లను తగ్గించాలనేది పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, చిదంబరం సుంకాల తగ్గిం పు చర్యలు ఈ ఏడాది జూన్ 20 వరకూ వర్తిస్తాయి. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్లో మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది. సెంటిమెంట్ మెరుగవుతుంది... ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రకటన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైన చర్యగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కె.అయుకవా వ్యాఖ్యానించారు. పరిశ్రమలో సెంటిమెంట్‌ను పెంపొందించడమే కాకుండా.. వాహనాల కొనుగోళ్లకు వినియోగదారులను ప్రోత్సహించేలా ఈ చర్యలు దోహదం చేస్తాయని చెప్పారు. భారతీయ వాహన తయారీదార్ల సంఘం(సియామ్) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ మాట్లాడుతూ.. సుంకం తగ్గింపు వల్ల వాహనాల రేట్లు దిగొస్తాయని, డిమాండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మొత్తంమీద తయారీ రంగం పునరుత్తేజానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. మధ్యంతర బడ్జెట్ వాహన రంగానికి సానుకూలంగా ఉందని... సుంకాల తగ్గింపుతో డిమాండ్ పెరిగి, అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ పేర్కొన్నారు. ఆడి... భారీ తగ్గింపు జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి భారత్‌లో అమ్ముతున్న ఐదు ప్రధాన మోడళ్లపై రూ.3.82 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌యూవీలో టాప్ఎండ్ వెర్షన్ క్యూ7 ధరను 3.82 లక్షలు తగ్గి రూ.78.28 లక్షలకు లభిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఇందులోనే బేస్ వెర్షన్ ధర రూ.61.19 లక్షల నుంచి రూ.58.34 లక్షలకు(రూ.2.84 లక్షలు కట్) తగ్గనుంది. ఎస్యూవీ క్యూ5 రేటు రూ.47.95 లక్షల నుంచి రూ.45.72 లక్షలకు(రూ.2.22 లక్షల తగ్గింపు) దిగిరానుంది. లగ్జరీ సెడాన్ ఏ4 ధర రూ.72,000 తగ్గి... రూ.30.58 లక్షల నుంచి రూ.29.85 లక్షలకు చేరనుంది. ఇందులోనే టాప్ఎండ్ వేరియంట్ రేటు రూ.90 వేలు తగ్గనుంది. రూ.37.94 లక్షల నుంచి రూ.37.04 లక్షలకు దిగొస్తుందని కంపెనీ వివరించింది. మెర్సిడెస్ బెంజ్ కూడా... మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీ జీఎల్-క్లాస్‌పై రూ.2 లక్షలు ధర తగ్గించి రూ.72 లక్షలకు చేర్చినట్లు ప్రకటించింది. సీ-క్లాస్(సీ220 అవా గ్రాండ్ ఎడిషన్) రేటును రూ.39.9 లక్షల నుంచి రూ.39.35 లక్షలకు తగ్గించినట్లు తెలిపింది. ఇక ఈ-క్లాస్ రేటు రూ.47.66 లక్షల నుంచి రూ.46.90 లక్షలకు దిగిరానుంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధరలు. సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు సాధ్యమైనంత మేరకు బదలాయిస్తున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ వ్యాఖ్యానించారు.